
సాక్షి, సూర్యాపేట జిల్లా: కేటీఆర్ ఓ పిలగాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పదేళ్లు దక్షిణ తెలంగాణను కేసీఆర్ ముంచాడని.. కేటీఆర్‌కు జిల్లాకు వచ్చే హక్కే లేదంటూ వ్యాఖ్యానించారు. పాలకవీడు మండలం జానపహాడ్ లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు.
ఈ సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ స్టార్టింగ్.. ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉందో జగదీష్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్‌లను గెలుస్తాం. ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని వైఎస్సార్ చొరవతో ప్రారంభించుకున్నాం. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడం బాధాకరం. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంపై రేపు(సోమవారం) సీఎం సమీక్షించనున్నారు. 85 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెల్లంలను కేసీఆర్ పూర్తి చేయలేదు’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 30న ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నామని.. సీఎం చేతుల మీదుగా హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి పథకాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. 80 శాతం ప్రజలు రేషన్ బియ్యాన్ని తినడం లేదు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు అమ్ముకుంటున్నారు. తెలంగాణలో 84 శాతానికి సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాం’’ అని ఉత్తమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment