
స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు నోటీసును అందజేస్తున్న హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి. చిత్రంలో కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివేకానంద, మర్రి రాజశేఖర్‌రెడ్డి
స్పీకర్‌కు అందజేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఆయన చాంబర్‌లో కలసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నోటీసు అందజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి సభకు అవాస్తవాలతో కూడిన సమాధానం చెప్పారని నోటీసులో పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సీఆర్‌ఎఫ్ నిధులు రాలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఎస్క్రో ఖాతా తెరవలేదని అబద్ధాలు చెప్పారన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి కూ డా ఖర్చు చేయలేదని అసత్యాలతో సభను తప్పుదోవ పట్టించారన్నారు. ఈ 3 అంశాలకు సంబంధించిన వివరాలను బీఆర్‌ఎస్ స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చి, సభా గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సభా గౌరవం కాపాడాలని బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment