సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై అఖిల భారత సర్వీస్ రూల్–8 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల కోసం 2017–18లో జరిపిన ఆయుధాల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.10 లక్షల నష్టం వాటిల్లడంపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శాఖాపరమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో విఫలమయ్యారనే ఆరోపణలూ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. 15 రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలంది. లేనిపక్షంలో సంబంధిత అధికారి ఎదుట హాజరై తన వాదన వినిపించాలని సూచించింది. అలా చేయని పక్షంలో ఈ అభియోగాలను అంగీకరించినట్లుగా భావించి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: 29న మూడో విడత ‘వైఎస్సార్ రైతు భరోసా’
Comments
Please login to add a commentAdd a comment