AB Venkateswara Rao
-
నా ఏజ్ ... గేజ్ చూడాలి కదా
నా ఏజ్ ఏంది.. .. నా గేజ్ ఏంది.. అన్నిటికి మించి నా రేంజ్ ఏంది.. అన్నీ తెలిసే నాకు ఈ పోస్ట్ ఇచ్చారా.. నా జూనియర్ల వద్ద నేను పని చేయాలా... వద్దు అంటూ మాజీ డిజి ఏబీ వెంకటేశ్వర రావు అలిగి కూర్చున్నారు. తనకు ఇచ్చిన పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరకుండా ఊరుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఇంటలిజెన్స్ డిజి హోదాలో పార్టీ కార్యకర్తకన్నా ఎక్కువగా పనిచేసారు.. ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ దగ్గర్నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించిమరీ తెలుగుదేశంలో చేర్చడం వెనుక అయన కీలకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆయన్ను సస్పెండ్ చేసింది.. దాదాపుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అయన పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్‌లో ఉంటూ కోర్టుల చుట్టూ తిరిగారు.. అయితే రిటైర్మెంట్ రోజే ఆయన్ను విధుల్లోకి చేర్చుకున్న ప్రభుత్వం అదేరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేశారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక తనకు చాలా కీలకమైన బాధ్యత ఇస్తారని ఆశించారు. అలాంటిదేం లేకపోయినా రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా గుర్తిస్తూ దానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించేలా మాత్రం కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఇక ఆయనకు మంచి ప్రాధాన్యం ఉండే పోస్టింగ్ పోస్టింగ్ ఇస్తారు అని ఆశించినా పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ పోస్ట్ ఇచ్చి ఊరుకున్నా ప్రభుత్వం ఆయన్ను అక్కడికి పరిమితం చేసింది. అయితే అది తన స్థాయికి తగిన పదవి కాదని, తన జూనియర్లు.. తన కింద పని చేసినవాళ్లు కూడా ఇప్పుడు తనకన్నా పెద్ద పోస్టుల్లో ఉన్నారని.. ఇప్పుడు తాను వారివద్ద ఎలా పని చేస్తానని అంటూ ఫిబ్రవరి ఒకటిన ఉత్తర్వులు వచ్చినా నెలరోజులు గడిచినా ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారు అనుకుంటే కేవలం ఒక శాఖకు సంబంచించిన ఓ పోస్టులో పడేశారని.. అందులో పెద్దగా చేయడానికి కూడా ఏమీ ఉండదని అయన అంటున్నారు. ఎస్పీలు.. ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉండవని.. వారిపై ఆధిపత్యం .. పవర్ చూపడానికి ఏమాత్రం అవకాశం లేని హోసింగ్ కార్పొరేషన్ పదవిలో ఎందుకు చేరాలని అయన మధనపడుతున్నారు. ఇటీవలనే రిటైర్ అయిన డీజీపీ ద్వారకాతిరుమల రావును ఆర్టీసీ ఎండీగా నియమించారని.. ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ ను కూడా సర్వీసు పొడిగించి మరీ కొనసాగిస్తున్నారని.. అలాంటిది తాను తెలుగుదేశానికి ఇంత సేవలు చేస్తే తనకు ఇచ్చేది ఓ నామమాత్రపు పోస్టింగా అంటూ పెదవి విరిచి ఆ పోస్టులో చేరకుండా అలకవహిస్తున్నట్లు తెలిసింది. మరి ప్రభుత్వ పెద్దలు ఆయన్ను బుజ్జగిస్తారో.. ఇచ్చిందే ఎక్కువ తీసుకుంటే తీసుకో.. అలిగితే అట్టూ లేదు.. ముక్కా లేదని మిన్నకుంటారో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
‘కులనాగు’తో.. విషం చిమ్మించటం సబబేనా?
పల్లెపట్టు శ్రమైక జీవన సౌందర్యాన్ని, సంస్కృతిని రక్తనిష్ఠ మొనర్చుకున్న జానపద కవి బ్రహ్మ కొసరాజు రాఘవయ్య. యక్షగానాలు, వీధి భాగవతాలు, హరికథలు, (Harikatha) జముకుల కథలు, బుర్రకథలు, భజన గీతాలు, పగటి వేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, గంగిరెద్దుల గీతాలు... ఇలా అట్టడుగు వర్గాల జీవితాలు ప్రతిబింబించే ఎన్నో పాటలు (Songs) రాశారు. ‘ప్రతిభ ఉన్నా దానికి పదును పెట్టేవారు, ప్రోత్సహించేవారు లేకపోతే ఏం ఉపయోగం?’ అనేవారు ఆయన తనను ఆ స్థాయికి ప్రోత్సహించిన వారిని తలుచుకుంటూ.కొసరాజు రాఘవయ్య (Kosaraju Raghavaiah) నాలుగో తరగతి వరకు చదివారు. పైచదువులకు వెళ్లలేకపోయారు. అదృష్టవశాత్తు ఆయన కొండముది నరసింహ పంతులు దృష్టిలో పడ్డారు. ఆయన శిష్యరికంలో రాటుతేలారు. ఆ తర్వాత కవిత్వం రాస్తూ, రైతులు, వివిధ జాన పదుల జీవితాలను అధ్యయనం చేశారు. తన పేరు చివర ఉన్న ‘చౌదరి’ తొలగించుకున్నారు. మొదటగా ‘రైతుబిడ్డ’ చిత్రానికి పాటలు రాసి ఆ తర్వాత ప్రోత్సాహం లేక మద్రాసు (Madras) నుంచి స్వగ్రామం వెళ్లిపోయి వ్యవసాయం చేసుకున్నారు. అయితే ఆయన కలం పదును గురించి కేవీ రెడ్డికి డీవీ నరసరాజు చెప్ప డంతో ఆయన్ని మద్రాసుకు పిలిపించి 1954లో విడుదలైన పెద్దమనుషుల చిత్రానికి పాటలు రాయించారు. ఆ విధంగా 13 ఏళ్ల తర్వాత రెడ్డిగారి ప్రోత్సాహంతో సినిమాలలో బిజీ కవి అయిపోయారు కొసరాజు. మొత్తం 350 చిత్రాలకు గాను 3 వేల పాటలు రాశారు. అటువంటి గొప్ప కవిని ఆ ఇంటి పేరు గలవారు ‘కొసరాజు వారి వంశవృక్ష సేవా సమితి’ పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నిజానికి గొప్ప వ్యక్తులను స్మరించుకోవడానికి ఏ పేరుతో ఎవరు సమావేశాలు నిర్వహించినా హర్షణీయమే. అయితే ఆ సభల్లో ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలాంటి సభల్ని ‘సభాకల్పతరుర్భాతి’ అంటారు. ధర్మసభల్లో మాట్లాడవలసిన రీతిని, భారతంలో పూరునికి యయాతి బోధించే విధానం నన్నయ ఇలా చెప్తాడు:‘మనమునకు ప్రియంబును, హితమును పద్యము దద్యమును నమోఘ మధురంబును, పరిమితమును నగు పలుకొనరగా పలుకునది ధర్మయుతముగా సభలన్. ధర్మయుతమైన సభల్లో మనం మాట్లాడే మాటలు తోటి వారికి ప్రియం కలిగించాలి. హితంగా, మితంగా, ఇంపుగా, ఎదుటివారు నొచ్చుకోని విధంగా, మెచ్చుకునే విధంగా ఉండాలి అంటాడు.‘అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితంచయాత్ / స్వాధ్యాయభ్యాసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే! ‘మాటలు ఉద్వేగం కలిగించనవి, ఆగ్రహం పుట్టించనవి, ప్రయోజనకరంగా ఉండేవి, వాక్ సంబంధమైన తపస్సు లాంటివి’ అని భగవద్గీత ప్రబోధిస్తోంది. కానీ జనవరి 19న విజయవాడలో నిర్వహించిన కొసరాజు స్మృతి సభలో జరిగిందేమిటి? ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడిందేమిటి?విషతుల్యమైన మస్తిష్కంతో, ఛద్మ వేషధారణతో కనీసం సాహితీ పరిజ్ఞానం లేని కుల నాగులను పిలిపించి మాట్లాడితే ఏం జరుగుతుందో అదే ఆ సభలో జరిగింది. ఆ సభ ఔచిత్యం ఏమైపోయింది? చివరికి బాకా పత్రికల్లో సైతం విషవాక్యాలే వార్తగా వచ్చాయి తప్ప కొసరాజు గురించి కొసరు వార్త కూడా లేదు. కొసరాజు వంశస్థులు ఒక్కసారి ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక గొప్ప కవికి కుల పంకిలం అంటించడం నిజమైన నివాళి అవుతుందా? ఆ సభను తమ ఆక్రోశం, కుళ్ళు వెళ్ళబుచ్చుకోవడానికి, కుసంస్కార భాషను ఉపయోగించటం అంటే సభ రభస అయినట్టు కాదా? ఇది కొసరాజుకి నివాళి అవుతుందా? రాజకీయ ప్రత్యర్థుల్ని తమ పోలీసు భాషతోనో, తమ కుల దురహంకార భాషతోనో తిట్టాలనుకుంటే డైరెక్ట్‌గా కులసభలే పెట్టుకోవచ్చు. కొసరాజు పేరు ఎందుకు?చదవండి: కాంతి లేని కూటమి పాలననార్ల వెంకటేశ్వరరావు, దేవరకొండ బాలగంగాధర తిలక్, వాసిరెడ్డి సీతాదేవి, కొసరాజు రాఘవయ్య వంటి సాహితీ మూర్తులను కుల దృక్కోణం నుంచి చూడటం వారి సభలకు కులనాగులను పిలిపించి ఆ సభకు సంబంధం లేని వ్యక్తుల మీద విషం చిమ్మించటం సబబేనా? ఒక పరి ఆలోచించండి!- పి. విజయబాబు సీనియర్ సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు -
నారా లోకేష్ రెడ్‌బుక్ అమలులో ముఖ్య పాత్ర ఆయనదే?
ఏబీ వెంకటేశ్వరరావు.. ఐపీఎస్! పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లోకి ఎక్కిన వివాదాస్పద అధికారి. రిటైర్ అయిన తరువాత కూడా తన వ్యాఖ్యలు, వైఖరితో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్న వ్యక్తి కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ల అండతో ఆయన ఈ మధ్య కాలంలో మరింత చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఆయన తన ‘కమ్మ’ కులం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేమన్నట్టుగా ఆయన మాట్లాడటం.. తన మాటల వల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో ఆలోచించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కులం వారు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోగలరా?. కులమతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎన్నికవుతుంది కదా?. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా కమ్మ కులం వాళ్లు అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు! ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని, అహర్నిశలు కష్టపడాలని కూడా ఆయన తన కులం వారిని కోరుకున్నారు. కమ్మ వారికి ఏదో పెద్ద సందేశం ఇచ్చానని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల కమ్మ వారిపై మిగిలిన వారికి మరింత వ్యతిరేకత వస్తుంది. అసహ్యం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన లాంటి వ్యక్తులు కమ్మ కులం వారిని భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఉంది.ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్‌పై పరుష పదాలతో విమర్శించారు కూడా. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని విమర్శలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రెడ్డి, ఇతర కులాల వారిని ఏకం చేస్తున్నారని, వైఎస్ జగన్‌ను అభిమానించే బలహీన వర్గాల వారందరూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరుకు ఏబీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఆయన ఐపీఎస్ అధికారేనా? అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు వెనుక కీలక పాత్రధారి ఈయనే అన్న అనుమానమూ వస్తోంది.వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒకప్పుడు ఇంత వివాదాస్పదుడు కానేకాదు. ఇంత చెడ్డ పేరూ లేదు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాతే ఇలా తయారయ్యారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నలలో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మ వర్గం వారు ఇతర సామాజికవర్గాల దృష్టిలో విలన్ల మాదిరి కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా ఉంది.వీరి రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్డి లేదా షెడ్యూల్ కులాల వారే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంగా ఈ వర్గాల అధికారులు కొందరికి ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగల అవకాశం ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను బయటకు తీశారన్న కోపంతో ఏదో ఒక నెపం పెట్టి కొంతమంది ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, కేసు పెట్టి అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని ఏబీ వెంకటేశ్వరరావు ఫీల్ అవుతుండవచ్చు.కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషీ, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే, వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధపడాలన్న ఏబీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. హింసకు కూడా వెనుకాడవద్దని పరోక్షంగా పిలుపునిస్తున్నారా? అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్ధతి అవలంబించాలన్నది ఆయన చేస్తున్న సూచనా?. సమాజంలో కులాల కొట్లాటలు ఉంటే ఉండవచ్చు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో పనిచేసే వాళ్లు కూడా ఇంత తక్కువ స్థాయి ఆలోచనలు చేయడం, చెత్త ప్రకటనలు చేయడం ఎంత వరకూ సబబు?. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ శాంతి భద్రతల విషయాన్ని పక్కనబెట్టి రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎలా దెబ్బ తీయడమన్న విషయంపైనే దృష్టిపెట్టేవారని చాలా మంది టీడీపీ నేతలు చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవిని పొందడానికి ఏబీ వెంకటేశ్వర రావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది.వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రలోభాలు పెట్టడంలో ఏబీతో పాటు ఒక మీడియా అధినేత విశేష పాత్ర పోషించారని చెబుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయిల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ, ఆ కేసులో తాను సచ్ఛీలుడినని రుజువు చేసుకోవచ్చు. ఎటూ ప్రభుత్వం వారిదే కనుక తమకు కావల్సిన జీవోలను తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ తన వ్యాఖ్యల్లో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించారు.అయితే, వైఎస్సార్ హాయంలో ఈయనకు వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టులేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన వివరాలను బట్టి అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు కర్నూలు రేంజి డీఐజీ పోస్టు ఇచ్చింది. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడప కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా? కాదా? హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను కూడా అప్పట్లో అప్పగించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఈయనను అంతగా ప్రాధాన్యం లేని ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అయినా వైఎస్సార్‌పై ఈయన విమర్శలు చేయడం ధర్మమా? అన్నది కొందరి ప్రశ్న.ఇక్కడ మరో మాట చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి అవమానించినప్పుడు కమ్మవారికి అవమానం జరిగినట్లు కాదా?. చంద్రబాబుకో, ఏబీ వంటివారికో ఏదైనా ఇబ్బంది వస్తే, వారిపై ఆరోపణలు వస్తే కమ్మ వారందరికీ వచ్చినట్లా? ఏ కులంలో అయినా లాభం కొందరికే లభిస్తూంటుంది. సంపాదన, పెత్తనం కూడా కొందరికే దక్కుతుంది. అలాంటివారు ఆ కులంలోని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. ఏబీ కూడా సరిగ్గా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటివారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన పలు కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎంగా ఉంటే, ఆయనకు పోటీగా లోకేష్‌ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు కాపులలో కాక రేపుతోంది.జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి సమాజంలో మరింత అశాంతికి దోహదపడడం ఐపీఎస్ హోదాకే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చిన ఈయన రిటైరయ్యాక వ్యవహరిస్తున్న తీరు చూశాక, పదవి బాధ్యతలలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నారని ఎవరైనా అనుకోగలరా?. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఏబీ వెంకటేశ్వర రావు వ్యాఖ్యలు కుట జాఢ్యానికి నిదర్శనం: తలశిల
-
తప్పు చేసి కులానికి ఆపాదించడమేంటి?
విజయవాడ, సాక్షి: తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. కుల అహంకారంతో ప్రవర్తిస్తే గనుక మిగతా కులాలు తిరగబడతాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం హితవు పలికారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనమని అన్నారాయన. ఏబీవీ ‘కమ్మ’ వ్యాఖ్యలపై తాజాగా తలశిల రఘురాం మీడియాతో మాట్లాడారు. ఆయన అహంకారం తో తలతిక్కగా ప్రవర్తిస్తున్నారు. కానీ, కుల అహంకారం తో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయి అని తెలుసుకోవాలి. ఏబీ వెంకటేశ్వరరావు తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నాడు. దానికి కమ్మ కులం మొత్తానికి అపాదించడం ఏంటి..?ఏబీ వెంకటేశ్వరరావు భాష అభ్యంతకరంగా ఉంది. కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగులు చేపట్టారు. వైఎస్సార్, వైఎస్ జగన్‌లు ఏనాడూ కులం కోసం పని చెయ్యలేదు. ఇద్దరూ కులాలకు అతీతంగా పాలన చేశారు. చంద్రబాబు, లోకేష్ లు ఎందుకు ఏబీ వెంకటేశ్వరరావు పై చర్యలు తీసుకోలేదు. కమ్మ కులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా?. ఏబీవీ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించరేం?. లేకుంటే.. పవన్ కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తారు అని తలశిల అన్నారు.సంబంధిత వార్త: జగన్‌ను కమ్మవాళ్లు అడ్డుకోవాలి -
జగన్‌ను కమ్మవాళ్లు అడ్డుకోవాలి
సాక్షి, అమరావతి : ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సారి సీఎం కాకుండా కమ్మవాళ్లు అడ్డుకోవాలి. అందుకోసం అహర్నిశలు కష్టపడాలి. అందుకు ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్త చర్యగా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’.. అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ‘వాడూ.. వీడూ’ అంటూ తూలనాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఏం చేసేందుకైనా కమ్మవాళ్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నా’.. అని ఆయన బాహాటంగా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈనెల మొదటి వారంలో నిర్వహించిన కమ్మ సామాజికవర్గ సమావేశంలో ఏబీవీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ రిటైర్డ్ పోలీసు అధికారి ఇలా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించడంపట్ల పోలీసు వర్గాలతోపాటు సామాజికవేత్తలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడీయన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్యంత వివాదాస్పదంగా సాగిన ఈ ప్రసంగంలో ఏబీవీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండండి..‘నెవ్వర్ ఎగైన్.. నెవ్వర్ ఎగైన్.. ఇటువంటి వాడు అటువంటి అధికారాన్ని మళ్లా పొందకుండా అహర్నిశలు కష్టపడాల్సిన బాధ్యత మనందరం (కమ్మవాళ్లు) తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఆ బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించాలి. దీనికోసం ఏం చేయాల్సి వచ్చినా సరే ముందు జాగ్రత్తచర్యలు చేపట్టాలని మీ అందరికీ (కమ్మవాళ్లకు) పిలుపునిస్తున్నా’.ఏబీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి..ఇదిలా ఉంటే.. దాడులా.. దౌర్జన్యాలా.. హత్యలు చేయాలా.. అసలాయన ఉద్దేశం ఏమిటని పౌర సమాజం ప్రశ్నిస్తోంది. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంతలా బరితెగించి సమాజంలో విద్వేషాలు, అల్లర్లను ప్రోత్సహించడం విభ్రాంతి కలిగిస్తోందని సామాజికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ప్రసంగం వీడియో చూసి ఎవరైనా ప్రభావితమై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఏబీ వెంకటేశ్వరరావు సమ్మతించకపోతే పోలీసులు ఆయనపై కేసు నమోదుచేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే ఏబీ వెంకటేశ్వరరావు విద్వేషపూరిత వ్యాఖ్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని భావించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. -
కూటమి కానుక.. ఏబీ వెంకటేశ్వరరావుపై అన్ని విచారణలు నిలిపివేత
-
ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వ కానుక
సాక్షి,విజయవాడ: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూటమి ప్రభుత్వం అన్ని విచారణలు నిలిపివేసింది. విచారణలు నిలిపివేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం(డిసెంబర్21) ఉత్తర్వులు జారీ చేశారు. 2014 నుంచి 2019 దాకా టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఏబీ వెంకటేశ్వర్రావుపై ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర్రావుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలన్నింటిని ఎత్తివేస్తున్నట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ఏబీ వెంకటేశ్వర్రావు ఐపీఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. -
ఆనందం ఆవిరి..ఉదయం పోస్టింగ్..సాయంత్రం రిటైర్మెంట్..
-
పొద్దున్న పోస్టింగ్.. సాయంత్రం ఊష్టింగ్
తనకుమాలిన ధర్మం ఎంత ప్రమాదం చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. చంద్రబాబు ప్రాపకం కోసం.. ఆయన ఆశీస్సుల కోసం తన ఉన్నత ఉద్యోగాన్ని.. పదవిని.. ముప్పయ్యేళ్లపాటు చేస్తున్న ఉన్నత పదవిని ఫణంగా పెట్టి చివరకు పదవీభ్రష్టుడై.. తన తోటి సహచరులవద్ద చులకన అయిపోయి చివరకు ఎవరికీ తెలియని స్థితిలో రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఒక డీజీపీకి పట్టింది. ఆయన మరెవరో కాదు.. ఏబీ వెంకటేశ్వర రావు. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ నిఘా విభాగం (ఇంటలిజెన్స్) చీఫ్‌గా పని చేసి చీప్ పనులకు దిగజారిపోయి నానా అనైతిక పనులకు పాల్పడ్డారు. ఆయన ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్నపుడు ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారని అభియోగాలు ఉన్నాయి. దాంతోబాటు చంద్రబాబు హయాంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు అప్పట్లో సంచలనం లేపింది. వాస్తవానికి అప్పట్లో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలన్న చంద్రబాబు దురాలోచనకు ఈ వెంకటేశ్వరరావు వెన్నుదన్నుగా నిలిచి ఆయా ఎమ్మెల్యేలను భయపెట్టి 23 మందిని టీడీపీలో చేర్చే విషయంలో ఎంతగానో సహాయపడ్డారు.అప్పట్లో తానొక పోలీస్ ఉన్నతాధికారిని అని విస్మరించి అధికారపార్టీకి తొత్తుగా పనిచేసి, చంద్రబాబు మద్దతు ఉందని చెబుతూ డీజీపీలను, మంత్రులను, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను సైతం చిటికెనవేళ్లమీద నడిపించారు. లొంగని వాళ్ళను భయపెట్టారు. మొత్తానికి ఐదేళ్లు ఏబీ వెంకటేశ్వరరావు ఒక రౌడీ పోలీస్ మాదిరిగా అధికారం చెలాయించారు. విధినిర్వహణ పేరిట పూర్తిగా సరిహద్దులను క్రాస్ చేసి ఇష్టానుసారం చెలరేగిపోయారు. మళ్ళీ 2019లో టీడీపీ గెలిస్తే తానూ డీజీపీని అవుతానని కలలుగన్నారు. కానీ అప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలవడంతో ఏబీవి పరిస్థితి తల్లకిందులైంది. ఆయన చేసిన అరాచకాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఆధారాలతో సహా వెలికితీసి సస్పెన్షన్ వేటు వేసింది. కోర్టుల చుట్టూ తిప్పించి ఐదేళ్లు పోస్టింగ్ లేకుండా ఆయన్ను మూడు చెరువుల నీళ్లు తాగించింది. గంగ మెల్లగా చంద్రముఖిగా మారిన విధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారిపోయి వెంకటేశ్వర రావు చేసిన అనైతిక చర్యలకు మద్దతు పలకడమే కాకుండా ఆ అప్రజాస్వామిక చర్యలను దగ్గరుండి చేయించిన ఆయనకు ఈ ప్రభుత్వంలో అసలు కష్టం తెలిసొచ్చింది. కోర్టులు.. కేసులు.. సస్పెన్షన్లు అంటూ ఆయన ఈ ఐదేళ్లు యూనిఫామ్ వేసుకోకుండానే గడిపారు. డీజీపీ స్థాయి అధికారి తన స్థాయిని మరిచి అధికారపార్టీకి తాబేదారుగా పనిచేయడం అంటే తన ఆత్మగౌరవాన్ని, ఐపీఎస్ వృత్తి నిబంధనలను సైతం పరిహాసం చేయడమే అని తేలింది.డీజీపీగా రిటైర్ కావాల్సిన ఉన్నతాధికారి.. ఐదేళ్లు ఉద్యోగం లేకుండా కోర్టులచుట్టూ తిరుగుతూ.. క్యాట్‌లో పిటిషన్లు వేస్తూ పోస్టింగ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆయన చేసిన తప్పిదాలు, ఘోరాలను కోర్టుల ముందు ఆవిష్కరించిన ఇప్పటి ప్రభుత్వం మళ్ళీ ఆయన యూనిఫామ్ వేసుకోకుండా చేసింది. మొత్తానికి ఎట్టకేలకు ఏబీవికి మొన్న కేంద్ర పాలనా ట్రిబ్యునల్ (క్యాట్) పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈరోజు ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఎట్టకేలకు ఆయనకు పోస్టింగ్ వచ్చిందని సంతోషించాలో.. ఇదే రోజు సాయంత్రం రిటైర్ అవుతున్నందుకు విచారించాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉద్యోగ జీవితం ముగిసిపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబుకు కళ్ళు, ముక్కు, చెవులు అనేలా ప్రవర్తించిన ఏబీవి నేడు సాయంత్రం రిటైర్ అవుతున్నారు. పొద్దున్న పోస్టింగ్ వచ్చిన ఆయన సాయంత్రం ఉద్యోగ విరమణ చేయడం గమనార్హం. :::: సిమ్మాదిరప్పన్న -
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత..
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేయబడింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇవనున్నారు. అయితే, అవినీతి ఆరోపణలపై గతంలో సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి విధుల్లో చేరునున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరి డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నేడు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సబబే
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ తీర్పు అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు అసమంజసంగా ఉన్నాయన్నారు.అక్రమాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు, కోర్టులో విచారణ ముగిసేంత వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఇందుకు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు అనుమతిని స్తున్నాయన్నారు. వెంకటేశ్వరరావుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయన్నారు. అంతేగాక ఆయనపై నమోదైన కేసులో సాకు‡్ష్యలను ప్రభావితం చేసేలా కూడా వ్యవహరించారన్నారు. రెండో సారి సస్పెండ్ చేయడానికి ఇది కూడా ఓ కారణమని, అయితే ఈ విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోలేదన్నారు.అవినీతి నిరోధక చట్టం కింద ఏబీ వెంకటేశ్వరరావును ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చిందన్నారు. వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, క్యాట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే తీర్పు ఇచ్చిందన్నారు. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పు పట్టిందన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకుని జీతభత్యాల బకాయిలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సస్పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
అవినీతి కేసులో ఏబీ వెంకటేశ్వర్ రావుకు షాక్
-
అవినీతి కేసులో ఏబీ వెంకటేశ్వర్ రావుకు షాక్
-
ఏబీ వెంకటేశ్వర్రావుకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీ పదవిలో ఉన్నపుడు పాల్పడిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతిచ్చింది.దీంతో త్వరలో అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ ప్రారంభం కానుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీప్‌గా పనిచేస్తున్నప్పుడు సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ ఏబీపై అవినీతి కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరైంది. ఇప్పుడు అనుమతి రావడంతో విచారణకు లైన్ క్లియరైంది. -
ఎవరినీ వదిలిపెట్టను..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తన కేసుపై వచ్చిన ఓ పోస్టుకు.. ‘ఎవరినీ వదిలిపెట్టను’.. అంటూ సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోస్టు పెట్టారని.. ఓ ఉన్నతస్థాయి అధికారి ఇలా మెసేజ్ పెడితే ఆయనపై కేసుల్లో దర్యాప్తు అధికారులు పారదర్శక విచారణ ఎలా చేయగలరని క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)లో ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఆలిండియా సర్వీసెస్‌లోని నిబంధనల మేరకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించిందన్నారు.కేంద్రం అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చినట్లు, అందులోనూ అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఏబీవీను సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ‘సుప్రీం’ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. విధుల్లో చేరిన తర్వాత తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రెస్మీట్ల ద్వారా ట్యాపింగ్ కేసులో సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు ఏప్రిల్, 2023లో క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జ్యుడీషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, నాన్–జ్యుడిషీయల్ సభ్యురాలు శాలినీ మిస్త్రా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. సాక్షులను బెదిరించే ప్రయత్నం.. ‘రెండుసార్లు విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు వాడిన భాష సమర్థనీయం కాదు.. ఫోన్ ట్యాపింగ్, ఆవినీతి కేసుపై ‘ఆవుకథ, నాలుగు కాళ్ల జంతువు’ లాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలపై, కొందరు అధికారులపై అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇదంతా అన్ని పత్రికలు, చానల్లో ప్రసారమైంది. కేసుకు ఎప్పుడు ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానన్నారు. అంశాలను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా.. ఎవరినీ వదిలిపెట్టను అని వెంకటేశ్వరరావు థంబ్‌నెయిల్ పెట్టారు.ఓ సీనియర్ ఐపీఎస్ ఇలా పెడితే సాక్షులు, విచారణాధికారులు ప్రభావితమవుతారు. ఆయనను విధుల్లో కొనసాగిస్తే విచారణ పారదర్శకంగా సాగే అవకాశంలేదు. అలాంటప్పుడు వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఫోన్ ట్యాపింగ్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది’.. అని ఏజీ వాదించారు.రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టులు..‘నిజానికి.. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం.. క్రిమినల్ అభియోగాలన్నీ తొలగిపోయే వరకు లేదా కొట్టేసేవరకు వారిపై సస్పెన్షన్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. గతంలో సుప్రీంకోర్టు, ఏపీ, బాంబే, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ హైకోర్టులు తీర్పులిచ్చాయి (వాటిని చదివి వినిపించారు). క్రమశిక్షణా చర్యల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది’.. ఏజీ వాదనలు వినిపించారు. అనంతరం వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు విన్న బెంచ్.. వెంకటేశ్వరరావు ప్రెస్‌మీట్ ఆడియో కాపీని అందజేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, తీర్పు రిజర్వు చేసింది. -
ఎల్లో మీడియా పైత్యం.. అధికారుల బదిలీలపై చెత్త రాతలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఫలితం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆయన తాను కోరుకున్నట్లుగానే ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేయగలుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో తొమ్మిది మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం వెనుక ఏమి జరిగిందా అన్నదానిపై విశ్లేషణలు వస్తున్నాయి. కచ్చితంగా టీడీపీ కూటమి కేంద్రంలోని బీజేపీ ద్వారా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఇంతమందిని బదిలీ చేయించారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఎందుకంటే వీరిలో కొందరు అధికారులు కొద్ది కాలం క్రితమే బదిలీ అయినా, వారిని అక్కడ ఉండకుండా ఎన్నికల విధులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీములు బాగా అమలు చేసిన అధికారులపైన, ఆయా చోట్ల టీడీపీ చేసిన అరాచకాలను అడ్డుకున్న పోలీసు అధికారులపైన టీడీపీ, ఈనాడు తదితర ఎల్లో మీడియా కక్ష కట్టి వారు బదిలీ అయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం అన్న భావనకు వచ్చిన చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పలురకాలుగా ప్రేమ లేఖలు రాయడం, ఆ తర్వాత ప్రలోభాలకు గురి చేయడం ద్వారా ఆయనను తనదారిలోకి తెచ్చుకున్నారు. అయినా అది జగన్‌ను ఓడించడానికి సరిపోవడం లేదని అనుకుని బీజేపీవైపు చూశారు. బీజేపీ పొత్తులోకి వస్తే వారివల్ల కలిసి వచ్చే ఓట్ల గురించి కాకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ద్వారా కేసుల బెడద లేకుండా చూసుకోవడం, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరగకుండా జాగ్రత్తపడడం, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రయోజనాలను ఆశించి పొత్తులోకి వెళ్లాలని ఆయన కోరుకున్నారు. దాని కోసం ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్ల పడి, ఆత్మగౌరవాన్ని వదలుకుని ఎలాగైతేనేం బీజేపీ పెద్దల మనసును ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా ఏపీలో కూటమి సభలో పాల్గొనేలా చేయగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో తమ మనుషులు, ఇతర పార్టీలలో ఉన్న కోవర్టులతో ఆపరేషన్ ఆరంభించారు. తొలుత ఎన్నికలను నెల రోజుల పాటు ఆలస్యం చేయడంలో సఫలం అయ్యారన్న అభిప్రాయం కలిగింది. 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకుండో తేదీకి ఎన్నికలు పూర్తి అయిపోతే, ఈసారి ఎన్నికలు నాలుగోదశకు వెళ్లడం, మే పదమూడు వరకు అంటే నెల రోజులు ఆలస్యం కావడం చూస్తే ఇది కూటమి పనే అన్న సందేహం వస్తోంది. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసే విధంగా వారితో ఈ రెండు నెలలు ప్రజలకు సేవలందించకుండా టీడీపీ కూటమి అడ్డుకోగలిగింది. వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర టీడీపీ నేతలకు ఉన్న వ్యతిరేకత అందరికి తెలిసిందే. వారు గతంలో వలంటీర్ల పట్ల ఎంత నీచంగా మాట్లాడింది అందరికి గుర్తు ఉంది. కాకపోతే ఇప్పుడు రివర్స్ అయి తమ మెడకే చుట్టుకోవడంతో మాట మార్చి వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చెబుతున్నప్పటికీ జనం ఎవరూ నమ్మడం లేదు. దానికి తోడు వలంటీర్ల వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ ఆఫీస్ నుంచి ఒకటికి పదిసార్లు ప్రజలకు మెస్సేజీలు వెళుతున్నాయి. దానిని బట్టే వారు ఎంత కంగారు పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ కూడా వలంటీర్ల వ్యవస్థపై వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం కూడా తప్పే అని చెప్పాలి. చంద్రబాబుకు వివిధ పార్టీలలో కోవర్టులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. 2019 ఓటమి పాలయ్యాక చంద్రబాబు వెంటనే ప్లేట్ ఫిరాయించి బీజేపీకి జై కొట్టే పని పెట్టుకున్నారు. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపిచారు. అయినా ఆ పార్టీ పెద్దలకు చంద్రబాబుపై నమ్మకం కుదరలేదు. ఆ తరుణంలో ఈడీ, ఐటీ దాడులు చేయడం, చంద్రబాబు పీఎస్ వద్ద రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని సిబిటిడి ప్రకటించడం జరిగింది. దాంతో మరింతగా బీజేపీకి లొంగిపోయి ప్రధాని మోదీని పొగడడం ఆరంభించారు. తత్ఫలితంగా తనపై కేసులు ముందుకు వెళ్లకుండా చేసుకోగలిగారు. 2019 ఎన్నికలకు ముందు మోదీని, సీబీఐ, ఐటి, ఈడి వంటి వాటిని చంద్రబాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. ఎన్నికల తర్వాత గప్ చుప్ అవడమే కాకుండా బీజేపీ వారి ప్రాపకం కోసం నానా పాట్లు పడ్డారు. అందుకోసం పవన్‌ను ప్రయోగించారు. ఆయనను బీజేపీ చివాట్లు పెట్టింది. అయినా వదలకుండా ఎలాగైతే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ యధా ప్రకారం తన కుట్రలకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని మూడు పార్టీల కూటమి ఓడించలేదన్న అభిప్రాయానికి వచ్చి, ఎన్నికల కమిషన్ ను కూడా తన ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించి ఉండవచ్చని అంటున్నారు. ఇందుకోసం బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారిని ప్రయోగించారు. వారితో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పావుగా మార్చుకుని కధ ఆరంభించారు. ఆయనతో హైకోర్టులో కేసులు వేయించడం, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు పంపించడం, మరోవైపు బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా ఎక్కడ ఎవరికి చెప్పించాలో చెప్పించి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నట్లు జనం నమ్ముతున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ పైన చంద్రబాబు 2019లో ఎలాంటి విమర్శలు చేసింది అందరూ చూశారు. అప్పటి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఆయన రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై పలు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎస్పిలను బదిలీ చేసింది. ఆ చర్యను తీవ్రంగా తప్పు పడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని దుయ్యబట్టారు. అంతేకాక ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. అయినా ఫలితం దక్కకపోవడంతో వెంకటేశ్వరరావును బదిలీ చేయక తప్పలేదు. అసలు తొలుత కమిషన్ చెప్పినవారిని బదిలీ చేయడానికే ఆయన ఇష్టపడలేదు. దాంతో కమిషన్ సీరియస్ అయింది. ఇన్ని చేసినప్పుడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఎన్నికల కమిషన్‌లో నియంత కనిపించారు. మోదీనే కమిషన్‌ను నడిపిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తే దానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్ బదిలీలు చేస్తే అది గొప్ప విషయంగా ప్రొజెక్టు చేస్తున్నారు. దీనిని బట్టే తెలుగుదేశంతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత నీచంగా మారాయన్నది తెలిసిపోతుంది. ఈనాడులో అయితే పేజీల కొద్ది కధనాలు ఇచ్చి తన శాడిజాన్ని ప్రదర్శించింది. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను వార్తగా ఇవ్వడం తప్పు కాదు. కానీ, బదిలీ అయినవారిపై విషం కక్కుతూ ఎన్నికలతో సంబంధం లేని అనేక విషయాలను వక్రీకరిస్తూ తన పైత్యాన్ని అంతటిని ఈనాడు మీడియా ప్రదర్శించి వికృతానందం పొందింది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ సభలో మైక్ పనిచేయకపోతే దానికి కొందరు పోలీసు అధికారులను బాధ్యుల్ని చేస్తూ, కేంద్రం వారిపై చర్య తీసుకోబోతోందని ఈనాడు ప్రచారం చేసింది. అది జరగలేదు. ఇప్పుడు తొమ్మిది మందిని బదిలీ చేస్తే శరభ శరభ అంటూ పూనకం వచ్చినట్లు రాస్తూ అధికారులను అవమానించింది. వారంతా ఇంగితం మర్చారని, అధికార వైఎస్సార్సీపీకి బంట్లుగా మారారని, తెలుగుదేశం బాకా పత్రికగా మారిన ఈనాడు ఆరోపించింది. విపక్షాలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే కమిషన్ తన అధికారాలను వినియోగించి ఈ చర్య తీసుకుందని ఆ పత్రిక పేర్కొంది. అంటే దీని అర్ధం ఏమిటి? ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసుకోకుండా, విపక్షాల ఆరోపణలను ఆధారంగా చేసుకుని చర్య తీసుకున్నట్లే కదా!. ఇలా చర్య తీసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎవరైనా అంటే కాదనే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. తిరుపతి కలెక్టర్ గా నియమితులైన లక్ష్మీ షా జనవరి 31 న జాయిన్ అయ్యారు. ఈనాడు దృష్టిలో ఆయన చేసిన తప్పు ఏమిటంటే టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకరరెడ్డిని కలవడమే. అంతకు మించి ఆయన చేసిన తప్పు ఏమీ లేదనే కదా!. విపక్షాలతో పాటు ఈనాడు వారు కోరుకున్నట్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై కేసు పెట్టలేదట. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే, రెండు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేశారంటే ఏదో ఒత్తిడి లేదని ఎలా అనుకోగలుగుతాం?. లక్ష్మీ షా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సఫలం చేయడంలో కీలక పాత్ర పోషించినవారిలో ఒకరు. ఆ ద్వేషంతో కూడా టీడీపీ కూటమి ఆరోపణలు చేసి ఉండవచ్చు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈనాడు ఎన్ని అసత్యాలు రాసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని మోదీ సభ విఫలం అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అయితే, దానినంతటిని ఎస్పీపై నెట్టివేసింది. వైఎస్సార్‌సీపీవారు అరాచకాలు సృష్టించారట. తెలుగుదేశం వారు అసలు ఏమీ చేయలేదట. ఎంత దారుణంగా రాసిందో చూడండి. ప్రధాని మోదీ సభలో మైక్ లు పనిచేయకపోవడం వల్లే ఎస్పీని బదిలీ చేశామని అదే కారణమని ఎన్నికల కమిషన్ చెప్పనే లేదు కదా!. పోనీ ఫలానా కారణమని కమిషన్ తెలిపిందా?. కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం తమ పైత్యం అంతటిని కలిపి విషం చిమ్మాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లు వింటున్నారట. ఇలా ఈనాడు పత్రిక తనకు తోచినవన్నీ రాసేసి అధికార యంత్రంగాన్ని భయపెట్టడానికి యత్నించింది. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవద్దని ఎవరూ చెప్పరు. కానీ, విపక్షాలు పాలించే రాష్ట్రాలలోనే ఇలా చేస్తుంటే కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే విమర్శలు వస్తాయి. పశ్చిమబెంగాల్లో డీజీపీని మార్చిన వైనం విమర్శలకు దారి తీసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొందరు హోం శాఖ కార్యదర్శులను మార్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించినా, వారంతా ముఖ్యమంత్రుల కార్యాలయంతో పాటు మరోచోట పనిచేస్తున్నారని వెల్లడించింది. అంటే వారిపై ఎలాంటి అభియోగాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలపలేదు. ఏపీలో కొందరు అధికారులను బదిలీ చేయగానే వారిపై తెలుగుదేశం మీడియా నానా చెత్త అంతా రాశాయంటే ఇదంతా బ్లాక్ మెయిలింగ్ టాక్టీస్ అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అధికారులు ఎవరైనా నిష్ఫక్షపాతంగా ఉంటే వారిని చెడగొట్టే లక్ష్యంతోనే టీడీపీ మీడియా ఇలా రాస్తోంది. అదే తాము కోరుకున్న అధికారి లేదా తమకు భయపడే అధికారి విశాఖలో ఉండి ఉంటే,తమకు సంబంధించిన మార్గదర్శి చిట్స్ సంస్థ అక్రమంగా రవాణా చేస్తున్న 51 లక్షల నగదును పట్టుకునే వారు కాదు కదా అన్నది ఈనాడు వారి ఉద్దేశం కావచ్చు. రామోజీరావు, రాధాకృష్ణల పిచ్చి కాకపోతే అధికారులే ఓట్లు వేయించే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎప్పటికి ఓడిపోయేవారు కాదు కదా! ముఖ్యమంత్రి జగన్ నమ్ముకుంది జనాన్ని కానీ.. అధికార యంత్రాంగాన్ని కాదన్న సంగతి ఆయన చేస్తున్న బస్ యాత్రలను బట్టే తెలుస్తుంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏబీవీపై చర్యలు తీసుకోండి.. ఏపీ సర్కార్‌కు కేంద్రం ఆదేశం
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఆయనకు రెండు స్టేజ్‌ల టైమ్‌స్కేల్ తగ్గించాలని తెలిపింది. 2024, మే 31వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొంది. ఏబీవీపై రెండు అభియోగాలు నిరూపితమయ్యాయని వెల్లడించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించిన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఆయనపై తదుపరి చర్యల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ఆయనపై మూడు అభియోగాల్లో ఒకటి పూర్తిగానూ మరొకటి పాక్షికంగానూ నిర్ధారణ అయ్యాయని యూపీఎస్సీ కేంద్ర హోంశాఖకు నివేదించింది. ఇజ్రాయెల్ కంపెనీ నుంచి నిఘా పరికరాల కొనుగోలు ద్వారా తన కుమారుడు చేతన్ సాయికృష్ణ భాగస్వామిగా ఉన్న కంపెనీకి ప్రయోజనం కలిగించేందుకు ఏబీవీ యత్నించారని.. అఖిల భారత సర్వీసు నిబంధనలకు సైతం విరుద్ధంగా వ్యవహరించారని తెలిపింది. దాంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనకు రెండు స్టేజ్‌ల టైమ్‌స్కేల్‌ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వకంగా తెలిపింది. అంతేకాక.. అఖిల భారత సర్వీసు నిబంధనలు–1969 ప్రకారం ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టంచేసింది. కుమారుడి కంపెనీకి అడ్డగోలు కాంట్రాక్టు కోసమే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాల కొనుగోలుకు సిద్ధపడ్డారని యూపీఎస్సీ నిర్ధారించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఇన్‌ఫ్లేమబుల్ లిమిటెడ్, ఆర్టీఎల్టీఏ కంపెనీల నుంచి ఏరోస్టాట్, యూఏవీ నిఘా పరికరాల కొనుగోలుకు ఏకపక్షంగా నిర్ణయించారు. తద్వారా భారత్‌లో ఆ కంపెనీ ప్రతినిధిగా ఉన్న ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్‌కు అయాచిత లబ్ధికి ప్రయత్నించారు. మరోవైపు.. ఏబీవీ కుమారుడు చేతన్‌సాయి ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్‌కు సీఈఓ కావడం గమనార్హం. తన ఉన్నతాధికారుల అనుమతిలేకుండా ఏబీవీ ఏకపక్షంగా వ్యవహరించారు. కనీసం కొనుగోలు కమిటీని కూడా నియమించకుండానే 2018, జూన్ 26న నిర్వహించిన సమావేశంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. పరికరాల నాణ్యత, గ్యారంటీ, నిర్వహణ కాలం మొదలైన సాంకేతిక ప్రమాణాలను తగ్గించి మరీ ఆమోదించేశారు. విధి నిర్వహణలో ఉత్సుకతతోనే ఇలా చేశానన్న ఏబీ వెంకటేశ్వరరావు వాదనను యూపీఎస్సీ తిరస్కరించింది. విధి నిర్వహణలో ఉత్సుకత వేరు, అవినీతి వేరని స్పష్టంచేసింది. కాబట్టి కుమారుడి కంపెనీకి అడ్డగోలుగా ప్రయోజనం కలిగించేందుకు ఏబీ వెంకటేశ్వరరావు యత్నించారన్న అభియోగాలను పాక్షికంగా నిర్ధారణయ్యాయని యూపీఎస్సీ నిగ్గుతేల్చింది. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అంతేకాక.. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కూడా యూపీఎస్సీ నిర్ధారించింది. ఇజ్రాయెల్‌కు చెందిన కంపెనీల నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా తెలుపనేలేదని స్పష్టంచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ? అఖిల భారత సర్వీసు నిబంధనలు 4(2)ఏ, 4(2)బి, 4(3)ఏ, 4(3)బిలను ఆయన ఉల్లంఘించారని వెల్లడించింది. ప్రభుత్వం తరఫున ఓ అధికారి ఏదైనా ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకునేటప్పుడు ఆ సంస్థలో తన కుటుంబ సభ్యులెవరూ ఉండకూడదనే నిబంధనను ఆయన ఉల్లంఘించారు. అంతేకాదు.. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడం కూడా క్రమశిక్షణారాహిత్యం కిందకే వస్తుంది. ఈ అంశంలో ఆయనపై అభియోగాలు నిరూపితమయ్యాయి. ఇక నిఘా పరికరాల కొనుగోలుకు ఇజ్రాయెల్ కంపెనీకి చెల్లించిన రూ.10లక్షలను ఆ కంపెనీ వెనక్కి ఇచ్చేసినందున ఏబీ వెంకటేశ్వరరావు చర్యలతో ప్రభుత్వానికి కలిగిన ఆరి్థకనష్టం భర్తీ అయ్యిందని యూపీఎస్సీ చెప్పింది. -
ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాకిచ్చింది. సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం చెల్లించడంలేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మపై వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మంగళవారం కొట్టేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తుది దశకు చేరుకోనందువల్ల సీఎస్ చర్యలను ఉద్దేశపూర్వక ఉల్లంఘనగా పరిగణించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. తరువాతి కాలంలో సీఎస్ చర్యలు ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకు వస్తాయని వెంకటేశ్వరరావు భావిస్తే తగిన పిటిషన్ దాఖలు చేసేందుకు ఈ తీర్పు అడ్డంకి కాదని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. చదవండి: (సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారు.. రెండు రోజుల పాటు..) ఏబీ తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టేసి, జీత భత్యాలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. సుప్రీం కోర్టు కూడా సస్పెన్షన్‌ను ఎత్తివేసిందన్నారు. అయినా సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించడంలేదని, ఇది కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని చెప్పారు. ఈ వాదనలను సమీర్ శర్మ తరపు న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి తోసిపుచ్చారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారంలో వెంకటేశ్వరరావుపై నమోదైన కేసు విచారణ తుది దశలో ఉందన్నారు. సుప్రీం కోర్టు కేసు పూర్వాపరాల ఆధారంగా ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేయలేదని, సస్పెన్షన్ రెండేళ్లకు మించి ఉండరాదన్న నిబంధనను మాత్రమే అనుసరించిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ని సర్వీసులోకి తీసుకుందని, అంతమాత్రాన జీత భత్యాలన్నీ చెల్లించాలని ఓ హక్కుగా కోరడానికి వీల్లేదన్నారు. విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించాలా లేదా అన్నది ప్రభుత్వ విచక్షణ అని చెప్పారు. వెంకటేశ్వరరావుపై విచారణ ముగిసి, నిర్ణయం వెలువడిన తరువాత, సస్పెన్షన్ సమర్థనీయం కాదని ప్రభుత్వం భావిస్తేనే తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. కాబట్టి సీఎస్ చర్యలు ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకు రావన్నారు. మహేశ్వరరెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. సస్పెన్షన్ ‘ఎంత మాత్రం సమర్థనీయం కాదు’ అన్న మాటలకు ఎంతో విలువ ఉందని ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు, ప్రభుత్వం వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ‘ఎంత మాత్రం సమర్థనీయం కాదు’ అని తేల్చలేదని, ఆరోపణల నుంచి విముక్తి ప్రసాదించలేదని తేల్చి చెప్పింది. వెంకటేశ్వరరావుపై విచారణ తుది దశలో ఉందని, దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు నివేదించారని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని గుర్తు చేసింది. వెంకటేశ్వరరావు పూర్తి జీతభత్యాలకు అర్హులా కాదా అన్న విషయాన్ని ఈ దశలో.., ముఖ్యంగా కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తేల్చడం సాధ్యం కాదని చెప్పింది. -
రాజకీయ విమర్శలు-ఎబి వెంకటేశ్వరరావు చేసిన తప్పేమిటి!
ఆంద్ర ప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి, గత టిడిపి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం డిజిగా ఉన్న ఎబి వెంకటేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకటన మాదిరిగానే ఉన్నాయి. ఆయనను ఇప్పటికే రెండోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ అన్యాయమైనదని ఆయన వాదించవచ్చు. అంతవరకు తప్పు లేదు. కాని మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, ఇతర సీనియర్ అధికారులపైన ఆయన అనుచితంగా మాట్లాడినట్లు అనిపిస్తోంది. మీడియాతో మాట్లాడడానికి ముందు ఆయన ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? తన సస్పెన్షన్ సరికాదని ఛీఫ్ సెక్రటరికి వాదన తెలియచేయకుండా ఇలా మాట్లాడవచ్చా? బహుశా ఆయన కూడా ప్రస్టేషన్ కు లోనవుతుండవచ్చు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన అనుభవపూర్వకంగా చెబుతుండవచ్చు. ఇజ్రాయిల్ నుంచి ఫోన్ టాపింగ్ పరికరాలు తెప్పించడానికి , ఆయన కుమారుడి కంపెనీకి సంబంధిత కాంట్రాక్టు అప్పగించడానికి ప్రయత్నించారన్నది అభియోగం. ఆయన వాటిలో అవినీతి జరగలేదని అంటున్నారు. కాని అసలు ఆ పరికరాలు కొనవలసిన అవసరం ఏమి వచ్చింది. నిజంగానే తీవ్రవాదులపై నిఘా కోసమే అయితే వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా పలువురు నేతల ఫోన్ లు టాప్ చేయించారన్న అభియోగాలు ఎందుకు వచ్చాయి? ఆయనపై విచారణ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? వీటన్నిటికి ఆయన వివరణ పరిమితం అయి ఉంటే బాగుండేది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ లోకి వచ్చేంతవరకు ఎబి వెంకటేశ్వరరావు పెద్దగా వివాదాస్పదుడు అయినట్లు వార్తలు రాలేదు. కాని చంద్రబాబు జత పట్టగానే ఎందుకు ఇలా అయ్యారో తెలియదు. ఆయనపై పలు రాజకీయ ఆరోపణలు కూడా వచ్చేవి. గతంలో అనేక మంది ఇంటెలెజెన్స్ డిజిలు పనిచేసినా ఒకరిద్దరు తప్ప ఎవరూ వివాదాలలో లేరు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అధికారి అరవిందరావు నిఘా విభాగం అధిపతిగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ రాజకీయ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు రాలేదు. ఆ తర్వాత కూడా పలువురు ఇంటెలిజెన్స్ లో పనిచేసినా అసలు ప్రజలకు తెలిసేవారే కారు. అంతదాకా ఎందుకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నిఘా విభాగం అధినేతలు ఎవరైనా పబ్లిక్ లో కనిపించారా? వారెవరో ప్రజలకు తెలుసా? వారు తమ పనిని సైలెంట్ గా చేసుకుపోతుంటారు. అలా అని పోలీసు ఉన్నతాధికారులంతా రాజకీయాలకు అతీతంగా ఉంటారన్న గ్యారంటీ లేదు. గతంలో ఎమ్.వి.భాస్కరరావు డిజిపి గా ఉన్నప్పుడు ఆయన తమ్ముడికి కాంగ్రెస్ టిక్కెట్ కోసం గాంధీ భవన్ కు వెళ్లారన్న విమర్శలు వచ్చాయి. ఐఎఎస్, ఐపిఎస్ వంటి అఖిలభారత సర్వీసులో ఉన్నవారు సాధ్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలి. వారిది కూడా కత్తిమీద సామె. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా తమకు సానుకూలంగా ఉండే అధికారులనే ఆయా బాధ్యతలలో నియమిస్తారు.అదేమీ కొత్త విషయం కాదు. మరో ఉదాహరణ కూడా చెప్పాలి. సీనియర్ ఐఎఎస్ అధికారిగా పనిచేసిన ఎవిఎస్ రెడ్డికి టిడిపి హయాంలో ప్రభుత్వంతో విబేధాలు వచ్చాయి. దాంతో ఆయన అసంతృప్తికి గురై భరతసేన అనే పేరుతో కొంతకాలం ఒక సంస్థను నడిపారు. చదవండి👉రాష్ట్రపతి ఎన్నికలు.. బాబును పట్టించుకోని ప్రధాని మోదీ తదుపరి కొంతకాలానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన తిరిగి ప్రభుత్వంలో చేరిపోయారు. హర్యానాలో నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తారన్న పేరు ఉన్న అశోక్ ఖేమ్కే అనే అధికారి డెబ్బై సార్లకు పైగా బదిలీ అయ్యారని గతంలో వార్తలు వచ్చాయి. దాదాపు అన్ని రాష్ట్రాలలో అఖిలభారత సర్వీసుల వారు కొందరు వివాదాస్పదులవడం, మరికొందరు ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ఆగ్రహానికి గురి కావడం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొందరు ఐఎఎస్ , ఐపిఎస్ అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కోసం కాండిడేట్లను కూడా సిఫారస్ చేస్తుంటారని చెబుతారు. ఇంకో విషయం గుర్తు చేసుకోవాలి. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే యత్నంలో ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. ఆ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన నిఘా విషయం పసికట్టలేకపోయారని అప్పటి ఎపి నిఘా విభాగం అదికారిని బదిలీ చేశారన్నది వాస్తవం కాదా? ఆ తర్వాత ఎబి వెంకటేశ్వరరావును ఆ పదవిలోకి తీసుకు వచ్చారు. దురదృష్టవశాత్తు ఎబి వెంకటేశ్వరరావు టిడిపి ప్రభుత్వ హయాంలో ఏదో రూపంలో నిత్యం వార్తలలో ఉండేవారు. దాని ఫలితమే ఇప్పుడు ఆయన ఈ చిక్కులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఎవరు సలహా ఇచ్చారో అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనకూ వర్తిస్తాయి. ఎవరి సలహా మేర ఎబి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన రాజకీయ విమర్శలు చేశారో తెలియదు. ఇవి పూర్తిగా అనుచితం అవుతాయి. సీనియర్ అధికారిగా ఉన్న ఆయనకు ఈ విషయం తెలియదా? తెలిసినా, ఇంతకన్నా పోయేది ఏముందని మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలనే ఆయన చేసినట్లుగా ఉందన్న భావానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండాల్సింది. అన్నిటికి మించి కోడికత్తి కేసు అంటూ , గతంలో వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనలో రాష్ట్రాన్ని తగులబెట్టాలని చూశారని, తాను అడ్డుకున్నానని ఆయన అంటున్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఆ ఘటన జరిగినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాని, టిడిపి నేతలు కాని ఇలాంటి ఆరోపణ చేయలేదు. కాని ఇప్పుడు ఎబి చేస్తున్నారంటే దాని మతలబు ఏమిటి? అది నిజమే అయితే ఆయన తన బాధ్యతను సరిగా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టి ఉండాల్సింది కదా? ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్నదానికి జవాబు చెప్పవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సిబిఐ , ఈడి చార్జీషీట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఇది ఎబి కొత్తగా కనిపెట్టిన విషయం కాదు. ఆ కేసులు ఎలా వచ్చాయో అందరికి తెలిసిందే. కేసుల పేరుతో ఆయనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఆ తరువాత ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి, ప్రజానీకాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి అయ్యారు. ఎబి కూడా అలాగే ప్రజల వద్దకు వస్తారేమో తెలియదు. ప్రభుత్వాన్ని పగడొడతానంటూ తానేమీ కామెంట్ చేయలేదని చెబుతున్న ఆయన టిడిపి హయాంలో 23 మంది వైసిపి ఎమ్మెల్యేల కొనుగోలు లావాదేవీలలో ప్రమేయం కలిగి ఉన్నారని వైసిపి పలుమార్లు ఆరోపించింది. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. తనకు సంబందం లేదని ఆయన చెబుతుండవచ్చు. చదవండి👉‘కుప్పంలో సత్తా చూపిస్తాం.. రాజీనామా చెయ్యి’.. చంద్రబాబుకు మంత్రి నాగార్జున సవాల్ వాస్తవం ఏమిటో ప్రజలకు తెలుసు. ఆయన అంతరాత్మకు తెలియకుండా ఉంటుందా? దుర్మార్గుడైన రాజు పాలనలో పనిచేయడం కన్నా అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదన్న కవి మాటలను ఆయన అసందర్భంగా చెప్పినట్లు అనిపిస్తుంది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయనకు కోపం ఉండవచ్చు. కాని ద్వేషపూరితంగా మాట్లాడకూడదు. నిజంగానే అలా వ్యవసాయం చేయదలిస్తే షంషేర్ గా చేసుకోవచ్చు. అలాకాకుండా తన ఉద్యోగం కోసమే ఆయన ఎందుకు పాకులాడుతున్నట్లు? ఎన్నో వెధవ పనులు అడ్డుకోవడం వల్లే తాను టార్గెట్ అయ్యానని ఆయన చెప్పారు. మంచిదే. మరి తుని రైలు దగ్దం ఘటనను, టిడిపి లో చేరిన అప్పటి వైసిపి ఎమ్మెల్యే , అలాగే మాజీ ఎమ్మెల్యే లు నక్సల్స్ చేతిలో హత్యకు గురికాకుండా అడ్డుకోగలిగి ఉంటే మంచి పేరు వచ్చేదికదా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి వద్ద పుష్కర ఘాట్ లో స్నానం చేస్తున్న సందర్భంలో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన ఘటనను ఎబి ముందుగా నివారించగలిగి ఉంటే చాలా మంది ప్రాణాలు నిలబడేవి కదా? తిరుపతిలో ఇరవై మంది ఎన్ కౌంటర్ కాకుండా వారిని చట్టపరంగా శిక్షించేలా ఎబి ప్రయత్నించి ఉంటే అప్పుడు ఏ వెధవ పనులనైనా అడ్డుకున్నారన్న మంచి పేరు వచ్చేది కదా? తెలుగుదేశం యువత అధ్యక్ష పదవికి సంబంధించి ఎబి తో సంప్రదించినట్లు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పినట్లు వచ్చిన వీడియో సంగతి ఏమిటి? తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా తప్పని నిరూపిస్తానని ఆయన అనవచ్చు. అలా చేయగలిగితే ఆయనకు గుర్తింపు కూడా వస్తుంది. కాని ఆ పని మీద ఉండకుండా రాజకీయంగా మాట్లాడడంలోని ఆంతర్యం ఏమిటన్నదానిపై ఎవరికి వారు ఊహించుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ఏబీవీ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై గతంలో కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020, మార్చి 7న సస్పెండ్ చేసింది. దీనిపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్ ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసినట్లు చెప్పింది. కానీ, గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల విషయంలో దర్యాప్తును కొనసాగించవచ్చని, అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. తదనంతర పరిణామాలతో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా నియమించింది. కానీ, ఆయన తనపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాల కొనుగోలు, అందుకోసం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్ అడ్వాన్స్డ్ సిస్టం అనే కంపెనీకి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెండింగులో ఉంది. ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనలు, సాంకేతిక అర్హతలను కూడా మార్చారు. అంతేకాక.. ఆకాశ్ అడ్వాన్స్డ్ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018, అక్టోబరు 31న రూ.35లక్షలు చెల్లించారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్టీ ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ లిమిటెడ్/ ఆర్టీ ఎల్‌టీఏ సిస్టమ్స్ ఉత్పత్తులను భారత్‌లో మార్కెట్ సృష్టించేందుకు యత్నించారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ టెక్నికల్, కొనుగోలు కమిటీలను ప్రభావితం చేశారు. ఆ విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా కుట్రపూరితంగా వ్యవహరించిన ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. మరోసారి సర్వీసు నిబంధనలు ఉల్లంఘన ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం సస్పెన్షన్ అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించడం ద్వారా అఖిల భారత సర్వీసు నిబంధనలను మరోసారి ఉల్లంఘించారు. క్రిమినల్ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ విధించవచ్చని సర్వీసు నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. ఆ నిబంధనను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును మంగళవారం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతిలేకుండా విజయవాడను విడిచి వెళ్లకూడదని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. -
ఏబీ వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
-
ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: తమ అనుమతి లేకుండా పెగాసస్ స్పైవేర్ అంశంపై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. గత నెల 21వ తేదీన ఏబీ వెంకటేశ్వర రావు పెట్టిన ప్రెస్‌మీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వం నోటీస్ పంపింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ నోటీస్‌లో పేర్కొంది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టడంపై ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు ఇచ్చింది. మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత నెలలో అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు పెదవి విప్పకపోయినా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు మాత్రం ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిలో భాగంగానే తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసింది రాష్ట్ర ఫ్రభుత్వం. -
చంద్రబాబు చర్యల్ని ఏబీ సమర్థంచడం దుర్మార్గం :అంబటి
-
చంద్రబాబు పెదవి విప్పడం లేదు.. మీరు ప్రెస్‌మీట్ పెట్డడం ఏమిటి?
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొన్నిరోజులు క్రితం అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చ జరగ్గా, ఈ వ్యవహారంపై విచారణకు హౌస్ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే ఆ వెంటనే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం చర్చనీయాంశమైంది. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు. శాసనసభలో హౌస్ కమిటీ వేస్తామని స్పీకర్ ప్రకటించిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు స్పందించాలి కానీ ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు రావడం ఏమిటని నిలదీశారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘పెగాసెస్‌పై శాసనసభ హౌస్ కమిటీని వేసింది. చంద్రబాబు పెగాసెస్ కొన్నారని మమతాబెనర్జీ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. దీనిపై మేము కూడా గత ఎన్నికలకు ముందే చెప్పాం. మమతాబెనర్జీ చెప్పాక టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు. చంద్రబాబు మాత్రం ఇంతవరకు బయటకు వచ్చి దీనిపై ఎందుకు మాట్లాడలేదు?. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి చంద్రబాబును సమర్ధిస్తూ మాట్లాడటం ఆశ్చర్యం వేసింది. ఒక అధికారి ఇలా మాజీ ముఖ్యమంత్రిని వెనుకేసుకు రావటం ఏంటి?, చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఎలా పెరిగాయో విచారణ జరపమంటే ఎందుకు మాట్లాడటం లేదు?, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ అయిన అధికారి మాత్రమే. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?. అక్రమాలు జరగలేదని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదు?, ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు?.. నేరుగా వెళ్లి టీడీపీ ఆఫీసులో పెట్టుకోవచ్చుగా? 23 మంది మా ఎమ్మెల్యేలను మా పార్టీ నుండి టీడీపీలోకి మార్చలేదా?, చంద్రబాబుకు ఊడిగం చేశారు. ఐపీఎస్ అనే పదవికి సిగ్గుచేటు తెచ్చారు. మా చంద్రబాబుకు అన్యాయం జరుగుతోందంటూ ఆయన్ని కాపాడటానికి ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు బయటకు వచ్చారు. దేశం కోసం కాదు, తెలుగుదేశం కోసం పని చేశారు. ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా టీడీపీ బానిసలాగా వ్యవహరిస్తున్నారు’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు. -
బాబు.. ఏబీ.. ఓ పెగసస్ ఇప్పుడేమంటారు..?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది నూటికి నూరు శాతం నిజమని నిర్ధారణ అయ్యింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో చంద్రబాబు రాజకీయ పన్నాగాలు జాతీయ స్థాయిలో బహిర్గతమయ్యాయి. ఇదే విషయంపై 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసినప్పుడు ఒకింత సందేహాస్పదంగా చూసిన వారంతా, చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా అడ్డదారులేనని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మమతా బెనర్జీ ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ప్రకటన చేశారని అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా స్పైవేర్ పరికరాలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ సహకారాన్ని ఆశించారు. అందుకే తాను కొనుగోలు చేసిన స్పైవేర్ సాఫ్ట్వేర్ సమాచారం గురించి ఆమెకు తెలిపారు. కొనుగోలు చేయాలంటూ సంప్రదింపులు జరిపారు. అప్పటి ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో కంపెనీ ప్రతినిధులు పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం ఏపీలో సమర్థంగా ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నామని రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారులకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ అప్రజాస్వామ్యంగా భావించడంతోపాటు నేరమని మమత అప్పట్లో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయదని తేల్చి చెప్పారు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం మమతా బెనర్జీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి మరోమారు చర్చించగా, ఆమె సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. చంద్రబాబు డైరెక్షన్.. ఏబీ యాక్షన్ టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు కుతంత్రాలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ ఓ వైపు, ఓటర్ల డాటా చోరీకి మరోవైపు పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను అప్పటి ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించారు. ఎందుకంటే అప్పటికే 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి, టీడీపీలో చేర్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఫోన్ల ట్యాపింగ్, డాటా చోరీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. 3.50 కోట్ల మంది డేటా చోరీ రాష్ట్ర ఓటర్ల వ్యక్తిగత వివరాల చోరీకి చంద్రబాబు అండ్ కో హైదరాబాద్‌లోని ‘ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ కేంద్రంగా తెరలేపింది. టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం ‘సేవా మిత్ర’ అనే యాప్‌ను ఈ కంపెనీ రూపొందించింది. ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా కొనుగోలు చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్ర ఓటర్ల వ్యక్తిగత డాటాను తస్కరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ ఆధీనంలో ఉండే అత్యంత విశ్వసనీయమైన ఆధార్ డాటాను తస్కరించడం విస్మయ పరుస్తోంది. మరోవైపు బ్యాంకు ఖాతాల డాటాలోకి చొరబడి ఆ వివరాలను కూడా సేకరించారు. ఏకంగా రాష్ట్రంలో 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత వివరాలు చోరీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను భద్రపరిచే బాధ్యతను విశాఖపట్నానికి చెందిన ‘బ్లూ ఫ్రాగ్’ అనే కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ వద్ద ఉన్న లబ్ధిదారుల వివరాలను కూడా ఐటీ గ్రిడ్స్ కంపెనీకి అందుబాటులోకి తెచ్చింది. దాంతో టీడీపీ ప్రచారం కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌ను రాష్ట్రంలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు, బాం్యకు ఖాతాలు, ఇతర వ్యక్తిగత సమాచారంతో అనుసంధానించారు. కుట్రపై అప్పట్లోనే ఫిర్యాదు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతోపాటు టీడీపీ అనుకూల ఓటర్ల పేర్లను ఒకటికి మించి నియోజకవర్గాల్లో చేర్చేందుకు ఎత్తుగడ వేశారు. 2019 ఎన్నికల్లో భారీ అక్రమాలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేశారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీకి పాల్పడుతుండటంపై హైదరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తనిఖీలు చేయడంతో మొత్తం బండారం బట్టబయలైంది. దాంతో ఆ కంపెనీకి చెందిన రెండు కార్యాలయాల్లో ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. డేటా చోరీకి పాల్పడుతున్న కేసులో ఐటీ గ్రిడ్స్ కంపెనీ ప్రతినిధులతోపాటు ఏపీ నిఘా విభాగానికి చెందిన కొందరు సిబ్బందిని కూడా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం టీడీపీ కుట్రను బహిర్గతం చేసింది. ట్యాపింగ్ నిజమేనన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అప్పట్లో చంద్రబాబు, ఆయన బృందం వైఎస్సార్సీపీ కీలక నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. అందుకోసం అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అధునాతన సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘ఏరోస్టర్ ’ అనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలను తెప్పించినట్టు సమాచారం. గాలిలో ఎగురవేసే ఈ ఏరోస్టర్ బెలూన్లలో ఉండే ప్రత్యేకమైన పరికరాలు ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు అవసరమైన ఫొటోలు తీస్తూ నిఘా వ్యవస్థగా పని చేస్తాయి. చంద్రబాబు కుతంత్రాలపై సందేహించిన వైఎస్సార్సీపీ నేతలు ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కూడా బాధ్యులను చేశారు. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలని తమకు అప్పటి నిఘా విభాగం అధికారులు లేఖ ద్వారా ఆదేశించారని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వెల్లడించడం గమనార్హం. కేంద్ర భద్రతా చట్టాల ఉల్లంఘన రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర భద్రతా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. ‘ఏరోస్టర్’ స్పైవేర్ పరికరాల కోసం అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారిక హోదాతో ఇజ్రాయెల్ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. దేశ భద్రతతో ముడిపడిన స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయాలంటే కచ్చితంగా కేంద్ర రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల శాఖల ముందస్తు అనుమతి ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు పొందిన తన కుమారుడు చేతన్ సాయి కృష్ణ సీఈవోగా ఉన్న ఆకాశ్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీకి ఆ స్పైవేర్ పరికరాలను సరఫరా చేయాలని కోరా>రు. ఆ కంపెనీనే ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలుకు ప్రధాన బిడ్డర్‌గా వ్యవహరించింది. దీనిపై పూర్తి ఆధారాలు లభించినందునే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసింది. ఐపీఎస్ అధికారిగా ఉంటూ కూడా దేశ భద్రతా చట్టాలను ఉల్లంఘించిన ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)కు నివేదించింది. ట్యాపింగ్ కోసమే వాటి వినియోగం ఇజ్రాయెల్‌కు చెందిన వెర్టిన్ అనే కంపెనీ ద్వారానే చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ కంపెనీతో వ్యవహారం నెరిపింది. వెబ్ ఇంటలిజెన్స్ సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో ‘ఐఎంఎస్ఐ క్యాచర్స్’ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను తెప్పించింది. ఫోన్ల ట్యాపింగ్ కోసమే ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ఈ విషయంపై 2019 ఎన్నికల పోలింగ్ ముగిశాక.. ఫలితాలు వెల్లడయ్యేలోపు ఆ సాఫ్ట్వేర్ కోసం రూ.12.50 కోట్లు ఆ కంపెనీకి చెల్లించేందుకు ఫైల్ నడిపింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లి చెల్లింపులు చేయొద్దని కోరారు. వెర్టిన్ కంపెనీకి ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ సాఫ్ట్వేర్ పరికరాల ఉత్పత్తిదారు ఎన్ఎస్వో కంపెనీతో సాన్నిహిత్యం ఉంది. ఒకే రకమైన స్పైవేర్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ఆ రెండు కంపెనీలు విలీనం కావాలని ఒకానొక దశలో భావించాయి కూడా. -
సీబీఐ ‘చిలక’ మళ్లీ పలికింది
సాక్షి, అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పేరిట సీబీఐ మరోసారి తమ పంజరంలోని చిలక దస్తగిరిని బయటకు వదిలింది. తాము నెలల తరబడి నేర్పించిన చిలక పలుకులను అతనితో చెప్పించింది. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉచ్చులో చిక్కుకున్న సీబీఐ.. తాము సృష్టించిన అబద్ధాన్ని నిజం అని నిరూపించేందుకు మరిన్ని కట్టుకథలు అల్లిస్తోంది. న్యాయస్థానంలో విచారణ కంటే మీడియాకు లీకులు, టీవీ చానళ్ల మైకుల ముందు దస్తగిరి మాటలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఎత్తుగడను మంగళవారం మరోసారి ప్రదర్శించింది. గతంలో దస్తగిరితో 161 స్టేట్మెంట్ను మీడియాకు లీకులిచ్చిన సీబీఐ... తాజాగా అతని 164 వాంగ్మూలాన్ని మీడియాకు అందించి హడావుడి చేసింది. తాజాగా.. సెప్టెంబరులో దస్తగిరి న్యాయస్థానానికి చెప్పినదాన్ని మంగళవారం మీడియాకు లీకులివ్వడం గమనార్హం. అప్రూవర్‌గా మారిన తర్వాత ప్రలోభాలా!? తాను అప్రూవర్‌గా మారిన తర్వాత తనను ప్రలోభ పెట్టేందుకు సెప్టెంబరులో యత్నించారని దస్తగిరితో సీబీఐ తాజాగా చెప్పించడం విస్మయపరుస్తోంది. అప్పటికే చాలా నెలలుగా దస్తగిరి, అతని కుటుంబాన్ని సీబీఐ అధికారులు ఢిల్లీలో తమ ప్రత్యేక అతిథులుగా చేసుకున్నారు. తాము తయారుచేసిన కట్టుకథ స్క్రిప్ట్‌ను ఎలా చెప్పాలో తర్ఫీదు ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. అంతా అనుకున్నట్లుగా ఉందని నిర్ధారించుకున్నాక దస్తగిరితో మొదట 161 కింద తమ వద్ద వాంగ్మూలం.. అనంతరం ఆగస్టులో 164 స్టేట్మెంట్ను న్యాయస్థానంలో వాంగ్మూలం ఇప్పించారు. వైఎస్ వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని చెప్పిన అతన్ని అప్రూవర్‌గా మారేందుకు అవకాశమిచ్చారు. అంటే దస్తగిరి పూర్తిగా సీబీఐ అధికారుల గుప్పెట్లో ఉన్నాడన్నది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో.. ఎవరైనా దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తారా? పైగా.. భరత్ యాదవ్ అనే వ్యక్తిని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తన వద్దకు పంపించారని దస్తగిరి చెప్పడం విడ్డూరంగా ఉంది. అప్రూవర్‌గా మారిన వ్యక్తికి పదెకరాలు, రూ.10 లక్షలు ఇస్తామని ఎవరైనా ఎందుకు ప్రలోభ పెడతారు? అప్రూవర్‌గా మారి 164 కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన తరువాత అతన్ని ప్రలోభపెడితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఏమీ ఉండదు. కానీ, దస్తగిరి మాత్రం తాను అప్రూవర్‌గా మారిన తరువాత వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తనను ప్రలోభ పెట్టేందుకు భరత్‌యాదవ్‌ను పలుమార్లు పంపించినట్లు చెప్పాడు. అంటే.. అంతకుముందు సీబీఐ అధికారులు 164 వాంగ్మూలం ద్వారా చెప్పించిన కట్టుకథకు బలం చేకూర్చేందుకే ఈ సరికొత్త డ్రామా ఆడించారన్నది స్పష్టమవుతోంది. పరస్పర విరుద్ధంగా దస్తగిరి స్టేట్మెంట్లు పూర్తిగా తమ నియంత్రణలో ఉన్న దస్తగిరితో సీబీఐ అధికారులు తాము కోరుకున్నట్లుగా చిలక పలుకులు పలికిస్తున్నారన్నది స్పష్టమైంది. అతనితో 161 కింద సీబీఐ అధికారులు నమోదు చేసిన స్టేట్మెంట్కు.. అనంతరం 164 కింద న్యాయస్థానంలో నమోదుచేసిన వాంగ్మూలానికి చాలా అంశాల్లో పొంతనలేదు. బెంగళూరులో భూవివాదం కారణంగానే ఎర్ర గంగిరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డిపై ఆగ్రహించి తనతోపాటు ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ద్వారా హత్య చేయించారని దస్తగిరి సీబీఐ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఎలాంటి రాజకీయ అంశాలను ఆయన చెప్పనేలేదు. కానీ, 164 కింద న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో కడప ఎంపీ టికెట్‌ను తనకుగానీ, వైఎస్ షర్మిలకుగానీ, వైఎస్ విజయమ్మకుగానీ ఇవ్వాలని వైఎస్ వివేకానందరెడ్డి పట్టుబట్టినట్టు.. దాంతో వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకున్నట్లుగా చెప్పారు. కానీ, అది పూర్తిగా వాస్తవ విరుద్ధం. అప్పటికే కడప ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఖరారైంది. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వైఎస్ వివేకానందరెడ్డే ఇన్చార్జ్గా ఉంటూ పార్టీ విజయం కోసం అహరహం శ్రమిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరువాత కూడా ఆయన కుమార్తె సునీత వైఎస్ అవినాష్‌రెడ్డి విజయం కోసం తన తండ్రి ప్రయత్నించారని చెప్పడం గమనార్హం. దాంతో సీబీఐ ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలో.. సీబీఐ దస్తగిరితో మరిన్ని అసత్య ఆరోపణలను తాజాగా తెరపైకి తెచ్చింది. ఇక అప్రూవర్‌గా మారిన తరువాత కూడా తనను వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రలోభ పెట్టేందుకు యత్నించారని.. తనకు ప్రాణభయం ఉందని అతనితో చెప్పించడం ద్వంద్వ ప్రమాణాలు, ఏకపక్ష వైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏం జరిగిందంటే.. ► 21వ తేదీన ఉదయం 8 గంటలకు సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందుల గెస్ట్ హౌస్‌కు వచ్చారు. ► 9 గంటలకు డ్రైవర్ దస్తగిరి గెస్ట్ హౌస్‌కు వచ్చాడు. ► మధ్యాహ్నం 3 గంటల వరకు దస్తగిరిని సీబీఐ అధికారులు తమ అదుపులో ఉంచుకున్నారు. అనంతరం గెస్ట్ హౌస్ నుంచి తమ వాహనంలోనే కోర్టుకు తీసుకెళ్లారు. ► 3 నుంచి 7 గంటల వరకు మేజిస్ట్రేట్ ముందు దస్తగిరి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ► 7 గంటలకు దస్తగిరిని కోర్ట్ నుంచి సీబీఐ వాహనంలో ఇంటి వద్ద వదిలారు. ప్రాణభయం పేరుతో మరో డ్రామా! తనకు ప్రాణభయం ఉందని.. రక్షణ లేదని దస్తగిరి ద్వారా చెప్పించడం సీబీఐ ఆడించిన మరో డ్రామా. నిజానికి.. దస్తగిరి, అతని కుటుంబాన్ని ఢిల్లీలో నెలల తరబడి ఉంచి సీబీఐ వారిని తమ గుప్పెట్లోకి తీసుకుంది. తాను స్వయంగా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశానని చెప్పినప్పటికీ అతన్ని వెంటనే అరెస్టు చూపించలేదు. అతను అప్రూవర్‌గా మారేందుకు అవకాశం కల్పించింది. అలాగే, ఆ తర్వాత దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ అధికారులు న్యాయస్థానంలో గట్టిగా వ్యతిరేకించలేదు. దాంతో దస్తగిరి బెయిల్‌పై విడుదలై హాయిగా తిరుగుతున్నాడు. అంతవరకులేని భయం.. ఒక్కసారిగా ఇప్పుడెందుకు వచ్చిందన్నది అంతుచిక్కడంలేదు. దస్తగిరికి ప్రాణభయం అనేది సీబీఐ ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. నిజానికి.. ఇప్పటికే సీబీఐ సూచనలతో పోలీసులు దస్తగిరికి రక్షణ కల్పించారు. అయినప్పటికీ తనకు భయంగా ఉందని అతను చెప్పడం విడ్డూరమే. -
‘ఏబీ’పై మరో విచారణ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలను తోసిరాజని పేట్రేగిపోయిన ఇంటెలిజెన్స్ విభాగం మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావుపై మరో విచారణకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశభద్రత, సమగ్రతకు భంగం కలిగించేలా.. రక్షణ పరికరాల కొనుగోలులో నిబంధనలకు పాతరేసి అక్రమాలకు పాల్పడినందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయనను గతంలో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణ సమయంలో ఏబీ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం, పలువురు సీనియర్ అధికారులపై ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం తాజా విచారణకు ఆదేశాలిచ్చింది. ఆలిండియా సర్వీసు (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనలు–1969లోని నిబంధన–8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాకు విచారణ బాధ్యతలు అప్పగించారు. న్యాయవాది సర్వ శ్రీనివాసరావును ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. విచారణ పూర్తి చేశాక ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కాగా, ప్రభుత్వం తనపై మోపిన అభియోగాలకు సంబంధించి ఫోర్జరీ (నకిలీ) పత్రాలు పెట్టిందంటూ ఏబీ చేసిన ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే సమయంలో ఏబీ సమర్పించిన పలు పత్రాలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మీడియాకు ఏబీ ఇచ్చిన లీకులు, పత్రాలు కూడా తప్పుడివేనని నిర్ధారించింది. తొలి విచారణ జరుగుతున్న సమయంలో హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలనే ఆదేశాలను కూడా ఏబీ ఉల్లంఘించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు కేసు: విచారణాధికారిగా సిసోడియా
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణాధికారిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణాధికారిగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను నియమించింది. ప్రభుత్వం తరఫున ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా అడ్వొకేట్ సర్వ శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. -
ఏబీపై క్రమశిక్షణ కొరడా!
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి సస్పెండై సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నతాధికారులపై బహిరంగ ఆరోపణలకు దిగిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు (ఐపీఎస్ బ్యాచ్ 1989)పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండైన ఏబీ వెంకటేశ్వరరావు కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ ముందు విచారణకు హాజరైన అనంతరం సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా విచారణకు సంబంధించిన అనేక అంశాలను బహిర్గతం చేశారు. ఈ నెల 4న వెలగపూడిలోని సెక్రటేరియెట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ పలువురు అధికారులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేశారు. అఖిల భారత సర్వీసులో ఉన్న అధికారులు రాజకీయంగా, బయటి వ్యక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తించకూడదన్న నిబంధనలను అతిక్రమించారు. అఖిల భారత సర్వీసు (క్రమశిక్షణ–అప్పీల్) నియమాలు–1969, అఖిల భారత సర్వీస్(ప్రవర్తన) నియమాలు–1968 ప్రకారం నిబంధనలను అతిక్రమించిన ఏబీ వెంకటేశ్వరరావును వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సంబంధిత అధికారి వద్ద ఆయన స్వయంగా హాజరై రాతపూర్వకంగా 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. సర్వీసు రూల్స్ అతిక్రమించి దుష్ప్రవర్తన(మిస్ కాండక్ట్)కు పాల్పడిన ఏబీ వెంకటేశ్వరరావు గడువులోగా సహేతుకమైన వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఎస్పీపై ఎందుకు ఒత్తిడి తెచ్చావ్?
సాక్షి, అమరావతి: రక్షణ, అంతర్గత భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారంలో సస్పెండైన ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఆరోపణలతో సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయడం, దాన్ని బహిర్గతం చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి జి.పాలరాజు స్పష్టం చేశారు. గతంలో కడప జిల్లా ఎస్పీగా పనిచేసిన రాహుల్‌దేవ్‌శర్మ, పోలీసు అధికారుల అసోసియేషన్ ప్రతినిధిగా ఉన్న గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డితో కలిసి పాలరాజు ఆదివారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ఆ రోజు ఇంటెలిజెన్స్ బాస్‌గా ఉన్న నువ్వు.. ఇప్పుడు నా పక్కనే కూర్చున్న నాటి కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మపై ఎందుకు ఒత్తిడి తెచ్చావు? వివేకా హత్య కేసులో విచారణను ప్రభావితం చేసేలా ఎందుకు వ్యవహరించావ్? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశావ్? దర్యాప్తును న్యాయబద్ధంగా, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మీకు నచ్చిన కోణంలో చేయాలని ఎందుకు ఒత్తిడి తెచ్చావ్? సాక్ష్యాధారాలుంటే అప్పుడే ఎందుకివ్వలేదు? రెండేళ్లుగా నోరు మెదపకుండా తిరుపతి ఉప ఎన్నికలకు ఒకరోజు ముందు రాజకీయ దురుద్దేశాలతో అసంబద్ధమైన ఆరోపణలకు దిగావ్’ అని పేర్కొన్నారు. ఏబీ ఆరోపణలు నిరాధారమని, ఆయన లేఖపై వాస్తవాలను వెల్లడించేందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలివీ.. ఆ క్షణం నుంచి ఏబీ పర్యవేక్షణలోనే దర్యాప్తు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మార్చి 14 అర్ధరాత్రి (15వతేదీ తెల్లవారు జామున) హత్యకు గురైనట్లు ఇంటెలిజెన్స్ బాస్ హోదాలో సమాచారం అందుకున్న క్షణం నుంచి ఏబీ వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తును స్వయంగా నడిపించారు. స్థానిక పోలీసులు, సీఐడీ, సిట్, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం అధికారులకు అప్పటి డీజీపీతో కలిసి అనుక్షణం ఆదేశాలిస్తూ దర్యాప్తు మొత్తం తన కనుసన్నల్లోనే పర్యవేక్షించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఆయన మార్చి 31 వరకు కొనసాగారు. అప్పటి వరకు అంటే 17 రోజులపాటు ప్రతి రోజు అప్పటి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అప్పటి సీఎం, డీజీపీలతో వివేకా కేసు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు చర్చించారు. ఆ కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు దర్యాప్తు ఎలా ముందుకు వెళ్లాలో అధికారులకు పూస గుచ్చినట్లు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి సీఎం సైతం ఏబీవీ అందించిన అంశాలనే రోజువారీ మీడియా సమావేశాల్లో కూలంకషంగా వివరించారు. మార్చి 31న ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీవీ బదిలీ అయినా అప్పటి ప్రభుత్వ పర్యవేక్షణలోనే మూడు నెలలపాటు సిట్ దర్యాప్తు కొనసాగింది. అంతటి కీలక పాత్ర పోషించిన ఏబీవీ ఇప్పుడు తాను ఇచ్చిన సమాచారాన్ని సిట్, సీఐడీ ఏ మేరకు ఉపయోగించుకుందో తెలియదని చెప్పడం హాస్యాస్పదం. ఇంకేదైనా కీలక సమాచారం ఉంటే అçప్పుడే సిట్‌కు ఎందుకు ఇవ్వలేదు? గత ప్రభుత్వ హయాంలో మూడు నెలలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దాదాపు 9 నెలలు దర్యాప్తు చేసిన సిట్‌కు కీలక సమాచారం ఇవ్వకుండా ఏబీవీ ఏం చేసినట్లు? సీఎం కుటుంబాన్ని టార్గెట్ చేశారు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను వెలికితీసే ప్రయత్నాలను పక్కనపెట్టిన ఏబీ వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఈ కేసులో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్టు చేయాలని అప్పటి ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, ఇతర అధికారులపై ఒత్తిడి చేసిన విషయం నిజమా? కాదా? ఏబీవీ చెప్పాలి. నిబద్ధత కలిగిన అధికారి కాబట్టే ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తీవ్ర ఒత్తిళ్లకు తలొగ్గలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు సీఐడీ, సిట్ అధికారులపై ఆరోపణలు చేస్తూ సీబీఐ డైరెక్టర్‌కి ఏబీవీ లేఖ రాయడం హాస్యాస్పదం, అసమంజసం. ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం శిక్షార్హమే సాధారణ పౌరులు సైతం ఏదైనా నేరానికి సంబంధించిన కీలక సమాచారం తమ వద్ద ఉంటే సంబంధిత దర్యాప్తు అధికారులకు అందించకపోవడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాంటిది ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ కీలక కేసులో తన వద్ద ఉన్న సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఇంతవరకు అందించకపోవడం ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం శిక్షార్హమే. ఏబీవీ వద్ద నిజంగానే కీలక సమాచారం ఉంటే రాతపూర్వకంగా సీబీఐకి సీల్డ్ కవర్లో అందించకుండా ఎన్నికల సమయంలో బహిరంగంగా వెల్లడించడం ఏమిటి? తనపై వచ్చిన అభియోగాలపై కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ వద్ద విచారణ ఎదుర్కొన్న ఏబీవీ మీడియాలో, బాహాటంగా అధికారులపై ఆరోపణలు, విమర్శలు చేయడం ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. -
‘ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు’
అమరావతి: ఏపీకి ఇంటెలిజేన్స్ విభాగంలో చీఫ్‌గా పనిచేసిన మాజీ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఆయన అఖిల భారత సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా ఇతర అధికారులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. అదే విధంగా గోప్యంగా ఉంచాల్సిన అధికారిక సమాచారాన్ని కూడా బహిర్గతం చేశారంటు ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాగా, దీనిపై 30 రోజుల్లోపు వ్యక్తిగతంగా హజరవ్వడంతో పాటు,లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుని ఆదేశించింది. ఒకవేళ సరైన వివరణ ఇవ్వనట్లైతే, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయని తెలిపింది. -
ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకం: పాల్‌రాజ్
సాక్షి, విజయవాడ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి కీలక విషయాలను డీఐజీ పాల్‌రాజ్ వెల్లడించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బదిలీ అయ్యే వరకు వివేకానందరెడ్డి కేసు దర్యాప్తును ఏబీ వెంకటేశ్వరావునే పర్యవేక్షించారని తెలిపారు. దర్యాప్తు వివరాలు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో ఏబీవీనే చెప్పాలని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు వెలికితీయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై బురద జల్లే యత్నం చేశారని తెలిపారు. సిట్ దర్యాప్తుపై ఏబీవీ సందేహాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని తెలిపారు. ఏబీవీ దగ్గర ఆధారాలు ఉంటే సీబీఐకి సీల్డ్కవర్లో లేఖ పంపొచ్చని చెప్పారు. ఇన్నాళ్లు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్‌రాజ్ ప్రశ్నించారు. బహిరంగ విమర్శలు చేయడం తీవ్రమైన విషయమని అన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకమని గుర్తుచేశారు. ఏబీవీకి అనుమానాలుంటే పద్ధతి ప్రకారం సమాచారం ఇవ్వాలని డీఐజీ పాల్‌రాజ్ అన్నారు. చదవండి: కరోనా బారిన పడి డీఎస్పీ మృతి -
ఏబీవీ అక్రమాలపై విచారణ తుది దశకు
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నిబంధనలకు పాతరేసి అక్రమాలకు పాల్పడం ద్వారా దేశ ద్రోహానికి ఒడిగట్టారనే అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)పై విచారణ తుది దశకు చేరింది. సెలవు రోజైన ఆదివారం కూడా వెలగపూడి సచివాలయంలో ఈ విచారణ కొనసాగింది. ఏబీవీ అక్రమాలపై శాఖాపరమైన విచారణను గత నెల 18న కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సిసోసియా చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతరం 22 నుంచి రోజూ కొనసాగింది. 14 రోజులపాటు సాగిన ఈ విచారణలో 21 మందికి పైగా సాక్షులను విచారించి వారిచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేశారు. తనపై వచ్చిన అభియోగాలకు వివరణ ఇచ్చేందుకు ఏబీవీ రోజువారీగా హాజరు కాగా, మాజీ డీజీపీలు, పలువురు ఐపీఎస్‌లు హాజరై సాక్ష్యం ఇచ్చారు. సాక్షులుగా మాజీ డీజీపీలు జేవీ రాముడు, నండూరి సాంబశివరావు, ఎం.మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్ హాజరై వివరణ ఇచ్చినట్లు సమాచారం. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎన్వీ సురేంద్రబాబు, సీహెచ్ ద్వారకా తిరుమలరావు, రవిశంకర్ అయ్యన్నార్ తదితరులూ హాజరయ్యారు. కాగా, ఏబీవీపై శాఖాపరమైన విచారణను ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజువారీ విచారణను చేపట్టి మే 3లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టే విచారణను ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీవీ కోరారు. కానీ, జ్యూడీషియల్ సంస్థగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ గోప్యంగానే జరుగుతుందని స్పష్టంచేసింది. మరోవైపు.. ఈ నెలాఖరు నాటికి నివేదిక సిద్ధంకానుంది. మే 3లోగా దానిని సమర్పించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సాక్షులను నేను క్రాస్ ఎగ్జామిన్ చేశా : ఏబీవీ కాగా, సచివాలయంలో ఆదివారం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణకు హాజరైన ఏబీవీ.. తర్వాత మీడియాతో మాట్లాడారు. తనపై జరిగినా విచారణలో 21 మంది సాక్షులను తానే క్రాస్ ఎగ్జామిన్ చేశానన్నారు. అల్పులు, అథములు, కుక్కమూతి పిందెలు, చట్టాలు తెలియని వాళ్లు తనపై ఆరోపణలు చేశారని.. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించి తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఏబీవీ ఆరోపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ధర్మాసనం ముందుకు బుధవారం ఈ పిటిషన్ వచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కౌంటర్ రిజాయిండర్ దాఖలు చేయడానికి సమయం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది లేఖ రూపంలో కోరడంతో విచారణను వారం రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం విదితమే. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
సాక్షి, తాడేపల్లి: నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో వేటుకు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు సస్పెన్షన్‌ను పొడగిస్తున్నట్లు తెలిపింది. ఆగష్టు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా డ్రోన్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. (చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం) ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై గతంలో స్టే ఇచ్చింది. అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేయడం సహా, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ క్రమంలో ఏబీ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. -
ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం
సాక్షి, అమరావతి : డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తనకు మద్దతు తెలపాలని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందంటూ లేఖలో పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు లేఖపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించింది. ఆయనపై ప్రభుత్వం సస్పెన్సన్ విధించడం సరైనదే అని అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, విచారణను ఎదుర్కొక తప్పదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కొన్ని ఛానళ్లలో తాము ఏబీకి మద్దతు తెలిపామని వస్తున్న వార్తలు అవాస్తవమని ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తోసిపుచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుకు ఎలాంటి మద్దతు తెలపలేదని పేర్కొంది. అలాగే ఐపీఎస్ అధికారులపై ఎలాంటి ఆరోపణలు చేయకూడదని.. ఏబీ వెంకటేశ్వరరావుకు హెచ్చరిచ్చింది. (ఏబీకి ఎదురు దెబ్బ) చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేయడం సహా.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు
సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై అఖిల భారత సర్వీస్ రూల్–8 కింద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాల కోసం 2017–18లో జరిపిన ఆయుధాల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.10 లక్షల నష్టం వాటిల్లడంపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. శాఖాపరమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచడంలో విఫలమయ్యారనే ఆరోపణలూ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. 15 రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలంది. లేనిపక్షంలో సంబంధిత అధికారి ఎదుట హాజరై తన వాదన వినిపించాలని సూచించింది. అలా చేయని పక్షంలో ఈ అభియోగాలను అంగీకరించినట్లుగా భావించి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: 29న మూడో విడత ‘వైఎస్సార్ రైతు భరోసా’ -
ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌పై హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. (చదవండి: ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే) అయితే డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేయడం సహా.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. నేడు విచారణ సందర్భంగా... ఏబీవీ ఉన్నత స్థానంలో ఉన్న కారణంగా నిఘా పరికరాల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆయన సస్పెన్షన్‌పై హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాల్సిందిగా న్యాయస్థానానికి విన్నవించింది. ఈ క్రమంలో గురువారం అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇక తన కుమారుడి కంపెనీ పేరుతో ఏబీవీ ఇజ్రాయిల్ నుంచి నేరుగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఉన్న ఆయన చర్యల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును కేంద్ర ప్రభుత్వం, క్యాట్ కూడా సమర్థించాయి. కానీ ఏపీ హైకోర్టు మాత్రం సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ స్టే విధించింది. -
ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం
సాక్షి, అమరావతి : నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో సస్పెండ్‌కు గురైన ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. విచారణ ధర్మాసనం నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. విచారణ సందర్భంగా "నాట్ బిఫోర్ మీ" అని అన్నారు. వ్యక్తిగతమైన కారణాలతో ఆయన ఈ కేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామంతో శీతాకాలం సెలవుల తర్వాత మరో ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రానుంది. కాగా డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. ఈ మేరకు క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌రావుతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. అనంతరం సస్పెన్సన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టును తీర్పును ఇవ్వగా.. దానిని ప్రభుత్వం సుప్రీంకోర్టలో సవాలు చేసింది. -
ఏబీకి ఎదురు దెబ్బ
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్ల అక్రమాల వ్యవహారంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. ఒకవేళ ఏబీ విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సివస్తే ఆర్నేష్‌కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించారు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో తనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆయన ఆగస్టు 7న హైకోర్టులో పిటిషన్ వేశారు. కుమారుడికి కాంట్రాక్టు కట్టబెట్టారు: అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ ► నిఘా పరికరాల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వరరావు స్వీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ కాంట్రాక్టును ఏబీ తన కుమారుడికి కట్టబెట్టి లబ్ధి చేకూర్చారు. ఈ విషయాన్ని ఆయన ఎక్కడా బహిర్గతం చేయలేదు. సీనియర్ అధికారులు వారిస్తున్నా వినకుండా నిఘా పరికరాల కొనుగోళ్ల విషయంలో ముందుకెళ్లారు. ► ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక కూడా నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. కేవలం ఆందోళన ఆధారంగానే ఏబీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇలాంటి వ్యాజ్యాలకు విచారణార్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది. ► ఐపీఎస్ అధికారులపై ఏబీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఐపీఎస్ అధికారులు తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏబీ ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఆయనే గతంలో ఇలా వ్యవహరించి ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా కేసు నమోదు చేస్తే మిగిలిన పౌరుల పట్ల ఏవిధంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామో, ఏబీ విషయంలోనూ అలాగే వ్యవహరిస్తాం. ► కేసు పెడితే దర్యాప్తును ప్రభావితం చేయబోమని ఏబీ చెబుతున్నారు. ఆయన కుమారుడు సాక్ష్యాలను ప్రభావితం చేశారనేందుకు ఆధారాలున్నాయి. సాక్ష్యాల తారుమారులో ఏబీ సమర్థత ఎలాంటిదో చూపే రికార్డులున్నాయి. కావాలంటే కోర్టు పరిశీలించవచ్చు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు
-
ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. (చదవంండి: ‘ఈ తీర్పుతో సనాతన ధర్మం రక్షించబడింది’) -
పచ్చచొక్కా పోలీస్
-
ఏబీవీ సస్పెన్షన్‌కు ఆధారాలున్నాయ్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని క్యాట్ తేల్చిచెప్పింది. ఏబీవీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం క్యాట్ కొట్టివేసింది. ఈ మేరకు క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌రావుతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. అఖిల భారత సర్వీసు నిబంధన 16 ప్రకారం.. సస్పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా క్యాట్‌లో కేసు దాఖలు చేయడం చెల్లదని తీర్పులో స్పష్టం చేసింది. నిబంధన 3 ప్రకారం.. క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది. నిబంధన 3 (1) ప్రకారం.. సస్పెన్షన్ చేసిన నెల రోజుల్లోగా క్రమశిక్షణా చర్యలు చేపట్టకపోయినా.. సస్పెన్షన్‌ను కేంద్రం ఖరారు చేయకపోయినా రాష్ట్రం తీసుకున్న సస్పెన్షన్ ఉత్తర్వులు చెల్లవని చెప్పింది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తాము న్యాయసమీక్ష చేశామని వివరించింది. సస్పెన్షన్‌కు కారణమైన అక్రమాలు, పక్షపాతం, వంటి ఆరోపణల్లో పిటిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందో లేదో తేలాలంటే పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిందేనని పేర్కొంది. ఏబీవీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అవినీతి, అక్రమాలపై లోతైన విచారణ జరిగితే చివరకు అవన్నీ చంద్రబాబు మెడకే చుట్టుకుంటాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ! క్యాట్ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఏబీవీ అవినీతి, అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు అత్యంత రహస్యంగా లోతైన విచారణ సాగించారు. స్వామికార్యం, స్వకార్యం అన్నట్లుగా చంద్రబాబు కోసం పనిచేసిన ఏబీవీ పలు అవకతవకలకు పాల్పడినట్లు ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందం గుర్తించింది. దేశ భద్రతకు తూట్లు్ల పొడిచేలా తన కుమారుడి కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయన నిబంధనలు అతిక్రమించారని తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. అక్రమాస్తులను కూడబెట్టినట్టు ఏబీవీపై ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. ఏబీవీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీతోపాటు దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు సీబీఐ, ఎన్ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలతోనూ విచారణ జరిపించే అవకాశం ఉంది. -
ఏబీ వెంకటేశ్వరరావుకు చుక్కెదురు
-
ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురైంది. తన సస్పెన్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) మంగళవారం కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఇక ఇదే వ్యవహారంలో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించిన విషయం తెలిసిందే. (చదవండి: ఏబీవీని విచారించండి) కాగా, ప్రవర్తనా నియమాల్ని ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది. పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను సైతం ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. (చదవండి: ‘ఏబీవీ’ బినామీ భూ బాగోతం) -
ఏబీవీని విచారించండి
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ మాజీ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ తదుపరి విచారణను చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏబీపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తును చేపట్టేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. ఈ మేరకు శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ నిగమ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. పోలీసు విభాగం ఆధునికీకరణ నిధులు దుర్వినియోగం, ఏరోసాట్, యూఏవీల కోనుగోళ్ల కోసం వెంకటేశ్వరావు వెచ్చించిన రూ.25.5 కోట్ల వ్యవహారంలో భారీ అక్రమాలు, అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంశాఖ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావుపై వచ్చే నెల 7వ తేదీలోగా చార్జిషీటు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఏసీబీ విచారణ జరిపించండి.. – ఏబీ వెంకటేశ్వరరావు ప్రతిపక్ష నేతలపై నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాలు, డ్రోన్లు కొనుగోలు చేయడంలో చేతివాటం చూపినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. – ఆ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయించింది. – వెంకటేశ్వరరావు దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. – పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయి. దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. – ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ను సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. – ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. – ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 19వ తేదీన వెంకటేశ్వరరావు అక్రమాలపై సమగ్ర నివేదికను కేంద్ర హోం శాఖకు పంపించింది. – ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర హోం శాఖ.. అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినందున వెంకటేశ్వరరావుపై ఏసీబీ ద్వారా సవివరమైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకు సంబంధించిన నివేదిక సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సమర్థించిన కేంద్రం
-
ఏబీ వెంకటేశ్వరరావుకు షాకిచ్చిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి సస్పెన్షన్‌కు గురైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ స్పందించింది. వెంకటేశ్వరరావు అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కేంద్రం.. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడాన్ని సమర్థించింది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతిపై ఏప్రిల్ 7లోగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మొత్తం రూ. 25 కోట్ల 50 లక్షల పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనీ.. వీటి వెనుక వెంకటేశ్వరరావు హస్తం ఉందని హోంశాఖ పేర్కొంది. పోలీస్‌శాఖ అధునీకరణ పేరుతో ఆయన అవినీతికి పాల్పడ్డారని నిర్థారించింది. కాగా ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతనెల 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (దేశ భద్రతా రహస్యాలు బహిర్గతం!) ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొంది. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో స్పష్టం చేసింది. ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. (వామ్మో.. ఏబీవీ!: సర్వత్రా విస్మయం). ఏపీ ప్రభుత్వం చెప్పిన చెప్పిన కారణాలు నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉండి ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ విదేశీ సంస్ధతో కుమ్మకై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘన విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణ కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణ కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని ఆరోపణ విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని ఆరోపణ ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని ఆరోపణ నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణ ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారు కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు ఇజ్రాయెల్ కంపెనీతో కుమ్మకై అయినట్టుగా ప్రభుత్వం ఆరోపణ వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్, విధానాలను బహిర్గతం చేశారనే ఆరోపణ దీనితో పాటు వెంకటేశ్వరరావు రాజద్రోహానికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేధించింది. -
‘ఏబీవీ’ బినామీ బాగోతం బట్టబయలు
సాక్షి, మహబూబ్‌నగర్: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బినామీ బాగోతం బట్టబయలైంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల, చిట్యాల గ్రామాల్లో 117.14 ఎకరాల భూములను 11 మంది బినామీల పేరిట ఆయన కొనుగోలు చేసిన ఉదంతం వెలుగుచూసింది. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన వెంకటేశ్వరరావు ఏడీజీపీగా పనిచేసిన కాలంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలడం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యల కింద వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. అయితే వెంకటేశ్వరరావు తన హోదాను అడ్డుపెట్టుకొని భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మక్తల్ మండల పరిధిలోని పసుపుల, చిట్యాల గ్రామాల్లో బినామీల పేరిట 117.14 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. భూముల కొనుగోలు సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు తన నమ్మకస్తుల పేరిట పట్టా చేయించారు. రెండు గ్రామాలు... 117.14 ఎకరాలు పదేళ్ల క్రితం నుంచే పసుపుల గ్రామంలో 52.19 ఎకరాలు, చిట్యాలలో 64.35 ఎకరాల చొప్పున మొత్తం 117.14 ఎకరాలను వెంకటేశ్వరరావు బినామీల పేరిట కొనుగోలు చేశారు. ప్రత్యక్షంగా భూ లావాదేవీలు కొనసాగిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ముందే ఊహించిన ఆయన... ముందు జాగ్రత్తగా భూముల కొనుగోళ్ల విషయంలో మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుడిని రంగంలో దింపారు. ఆయన మధ్యవర్తిత్వంతో ఆయా గ్రామాల్లో భూములను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూముల్లో సాగు చేస్తున్న వెంకటేశ్వరరావు... రైతులతో సాగు చేయిస్తే విషయం బయటకు పొక్కుతుందని భావించి ఆధునిక పద్ధతులను ఎంచుకున్నారు. మందుల పిచికారీ, నూర్పిడి, విత్తనాలు విత్తడం వంటి పనులను యంత్రాల ద్వారా నిర్వహిస్తూ కూలీల అవసరాన్ని తగ్గించి జాగ్రత్తపడినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పొలంలోనే ఫాంహౌస్ ఏర్పాటు చేసుకున్న వెంకటేశ్వరరావు... నెలకోసారి కచ్చితంగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి వెళతారని గ్రామస్తులు తెలిపారు. కృష్ణా నది టు వ్యవసాయ క్షేత్రం.. కృష్ణానది వద్ద మోటార్లు బిగించి నీటిని తోడుకుంటున్న దృశ్యం తన వ్యవసాయ క్షేత్రం నుంచి సుమారు 3 కి.మీ. మేర కృష్ణా నది ఒడ్డున ఉన్న దత్తాత్రేయస్వామి ఎత్తిపోతల పథకం పక్కనే దానికి సమాంతరంగా మరో చిన్నపాటి ఎత్తిపోతలను వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు 10 హెచ్‌పీ మోటార్లను ఏర్పాటు చేసి కృష్ణా నది భూగర్భం నుంచి పెద్ద పైప్లైన్ల ద్వారా నీటిని వ్యవసాయ క్షేత్రానికి తరలిస్తున్నారు. ఇదే తరహాలో చిట్యాల వాగులోనూ 10 హెచ్‌పీ మోటారును ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి తరలిస్తున్న నీటిని వ్యవసాయ క్షేత్రంలో భారీగా నిర్మించిన సంప్‌లో నిల్వ చేస్తున్నారు. అక్కడ ప్రత్యేక మోటార్ల ద్వారా పంటలకు సాగునీరు చేరవేస్తున్నారు. వాటికితోడు పొలంలో అక్కడక్కడా మరో 8 బోర్లు కూడా వేశారు. గతంలో పండ్ల తోటలు వేసిన ఆయన తర్వాత వరిని సాగు చేస్తున్నారు. కృష్ణా నది గర్భం నుంచి నేరుగా తన పొలాలకు సాగునీరు చేరవేస్తున్న వెంకటేశ్వరరావు తీరుపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూముల కొనుగోళ్ల విషయంలోనూ తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని పసుపుల గ్రామానికి చెందిన ఆనంద్‌గౌడ్ ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. పడకేసిన లిఫ్టు.. 3,500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పసుపులలో రూ. 76 లక్షలతో 1987లో నిర్మించిన దత్తాత్రేయ ఎత్తిపోతల పథకం ప్రస్తుతం పడకేసింది. దాని నిర్వహణ బాధ్యతను మొదట్లో ప్రభుత్వమే చూసుకున్నా 2002లో రైతులకు అప్పగించడంతో నిర్వహణ భారమై రైతులు ఉపయోగించుకోలేకపోయారు. తాజాగా ఆ లిఫ్టుకు పక్కనే ఆ పథకానికి సమాంతరంగా వెంకటేశ్వరరావు భారీ మోటార్లతో నీటిని తరలించడం గ్రామస్తులను విస్మయానికి గురి చేస్తోంది. భారీగా విద్యుత్ వినియోగం.. వ్యవసాయ క్షేత్రానికి నీటి తరలింపు కోసం ఏర్పాటు చేసిన మోటార్లతో విద్యుత్ వినియోగం భారీగా ఉంటోంది. కృష్ణా తీరం వద్ద ఉన్న నాలుగు 10 హెచ్‌పీ మోటార్లలో ఒక్కొక్కటి 12 గంటలు పని చేస్తే.. ఏడు కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని, దీన్ని కమర్షియల్‌గా లెక్కిస్తే రూ. 900 బిల్లు అవుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. అదే 5 హెచ్‌పీ మోటార్లు పనిచేస్తే రూ. 450 వరకు బిల్లు వస్తుందన్నారు. ఈ లెక్కన ఏళ్ల నుంచి నిరంతరంగా పని చేస్తున్న ఈ భారీ మోటార్లతో విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సర్వీసు చార్జీల కింద రైతులు ప్రతి నెలా చెల్లించే రూ. 30 మాదిరిగానే ఈ భారీ మోటార్లకూ వెంకటేశ్వరరావు అదే చెల్లింపులు చేయడం గమనార్హం. 11 మంది మీద పట్టాలు... రెండు గ్రామాల్లో తాను కొనుగోలు చేసిన 117.14 ఎకరాలను వెంకటేశ్వరరావు 11 మంది పేరిట పట్టాలు చేసినట్లు రెవెన్యూ రికార్డులు చూపుతున్నాయి. అయితే వారందరూ స్థానికేతరులు కావడం గమనార్హం. వారు ఎవరో? ఎక్కడి వారో తెలియదని గ్రామస్తులు చెబుతున్నారు. పట్టాలు పొందిన వారిలో కొరుమర్లు వెంకట సత్యనాగమణి తప్ప మిగిలిన వారందరూ తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు బంధు పేరిట ఆర్థిక సహాయాన్ని సైతం పొందడం గమనార్హం. 2018 ఖరీఫ్, రబీ, 2019 ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం కింద మొత్తం రూ. 9,23,900 లబ్ధి పొందారు. మరో రూ. 10,98,400 మంజూరై చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. భూమికి భూమి ఇస్తామని ఇవ్వలేదు... మేం ఆరుగురు అన్నదమ్ములం. గ్రామంలో మాకు 12.24 ఎకరాల భూమి ఉండేది. అందులో రెండెకరాల భూమిని అన్నదమ్ములం అందరి సమ్మతంతో మా గ్రామానికి చెందిన ఆశప్పకు అమ్మినం. 2005లో మా గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి వెంకటేశ్వరరావు సార్ మీ పదెకరాల భూమి అడుగుతుండ్రు. దానికి బదులు మరోచోట పంటలు బాగా పండే భూమి ఇస్తరు అన్నరు. అప్పుడు మేం ఇద్దరినీ నమ్మి భూమి రిజిస్ట్రేషన్ చేసినం. అప్పట్నుంచీ ఇప్పటివరకు మాకు ఎక్కడా భూమి ఇవ్వలేదు. రూ. 20 వేలు మాత్రమే ఇచ్చారు. భూమి ఇప్పించాలని అడుగుతుంటే మా గ్రామ పెద్ద మనిషి తిప్పించుకుంటున్నడు. నాకు న్యాయం చేయండి. – ఆనంద్‌గౌడ్ (పసుపుల గ్రామం) తక్కువ ధరలకు భూములు కొన్నారు.. ఎవరో డీఐజీ సార్ అట. అప్పట్లో తక్కువ ధరలకు ఇక్కడ భూములు కొన్నారు. కృష్ణా నది నుంచి పైప్లైన్ల ద్వారా నేరుగా పొలాలకు నీరు తీసుకెళ్తున్నరు. డబ్బున్న వాళ్లకు ఏదైనా చెల్లుతది. మా లాంటి వాళ్లకు అన్నీ ఆంక్షలే. – లక్ష్మణ్, స్థానికుడు ఏబీ వెంకటేశ్వరరావు బినామీల పేరిట చేపట్టిన భూ కొనుగోళ్లు ఇలా.. (నోట్: ఎకరం=40 గుంటలు) -
ఏబీవీపై దేశద్రోహం కేసుపెట్టాలి
సాక్షి, తిరుపతి: వ్యక్తిగత స్వార్థం, అవినీతి సంపాదన కోసం దేశ భద్రతను పణంగా పెట్టి ప్రమాదకరమైన వస్తువులను కొనుగోలు చేసిన దేశద్రోహి ఏబీ వెంకటేశ్వరావు (ఏబీవీ) అని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీవీ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఏబీవీ అంటే అవినీతికే బాస్ వెంకటేశ్వరరావు అంటూ అర్థం చెప్పారు. తిరుపతిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఏబీవీ అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా చెవిరెడ్డి బయటపెట్టారు. ఐపీఎస్‌ను వ్యక్తిగత రాజకీయ సర్వీసు (ఇండివిడ్యువల్ పొలిటికల్ సర్వీస్)గా మార్చారని దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారం రక్షణ పరికరాలను కొనుగోలు చెయ్యాలంటే.. కేంద్రం అనుమతి తీసుకోవాలని, కానీ ఏబీవీ అలాంటి అనుమతులు లేకుండా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొన్నారని తెలిపారు. దేశానికి ప్రమాదకర వస్తువుల కొనుగోలుపై కేంద్రం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 124ఏ కింద దేశద్రోహం కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీ దేశాన్ని విడిచి వెళ్లే ప్రమాదం ఉందని, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆయనపై ‘లుకౌట్’ నోటీసులు జారీ చేయాలని కోరారు. తెలంగాణ, కర్ణాటకలో రూ. కోట్ల ఆస్తులు ఏబీవీకి తెలంగాణలో, కర్ణాటకలో వంద ఎకరాల భూములు ఉన్నాయని చెవిరెడ్డి తెలిపారు. వీటి విలువ రూ. వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని వివరించారు. ఈడీ, ఐటీ, అవినీతి నిరోధక శాఖ సమగ్ర విచారణ జరిపితే ఏబీవీ భూ దందాలు, అవినీతి బాగోతం వెలుగులోకి వస్తుందన్నారు. చంద్రబాబు, లోకేష్ తరువాత అత్యంత ధనవంతుడు ఏబీవీ అన్నారు. ఆయన కుటుంబ సభ్యుల పేరున ఇసుకరీచ్‌లు తీసుకున్నారన్నారు. ఏబీవీ ఫోన్ కాల్ డేటా వెలికి తీస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. బెజవాడ పోలీస్ కమిషనర్‌గా ఏబీవీ ఉన్నపుడు జరిగిన జంట హత్యల కేసులో విలువైన బంగారు ఆభరణాలను ఆయన మాయం చేశారని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఐపీఎస్ ఘట్టమనేని శ్రీనివాస్, డీఎస్పీ రాంకుమార్ వద్దే వందల కోట్లు ఉంటే వారి గురువు ఏబీవీ వద్ద ఇంకెన్ని కోట్లు ఉంటాయో? అని అనుమానం వ్యక్తం చేశారు. ఏబీవీ అవినీతిని దగ్గరగా చూసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వం ముందు నోరు విప్పాలని పిలుపునిచ్చారు. -
‘ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది’
-
‘ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది’
సాక్షి, తిరుపతి : ప్రజలను, దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్ అధికారి దారుణంగా వ్యవహరించారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఉండి ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. త్వరలోనే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి అక్రమాలు మరికొన్ని బయట పెడతానని అన్నారు. సోమవారం చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడని.. ఆ సొమ్ముతో తెలంగాణలో విచ్చల విడిగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. తెలంగాణలో కొన్న భూములకు రైతుబంధు పథకం ద్వారా రూ. 67 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి తిమింగలం అని.. ఆయన విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనపై సంఘ విద్రోహం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఘట్టమనేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు బినామీ అని చెప్పారు. ఆయన అవినీతి అక్రమాలు మిగతా ఐపీఎస్ అధికారులకు కూడా తెలుసని అన్నారు. విజయవాడ జంట హత్యల కేసులో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశాడని విమర్శించారు. ఆయన దేశం విడిచిపెట్టి పోయే ప్రమాదం ఉందని.. కేంద్రం వెంటనే లుకౌట్ నోటీసులు విడుదల చేయాలని కోరారు. ఆయనపై తనకు వ్యక్తిగత కక్ష లేదని.. దేశ భద్రత కోసమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎవరు మద్దతుగా నిలవకూడదని.. ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు సమర్ధించాలని పిలుపునిచ్చారు. చదవండి : వామ్మో.. ఏబీవీ! -
దేశ భద్రతకు ముప్పు కలిగిస్తూ..
-
ఏబీవీ అసలు రంగు బయట పెట్టిన కేశినేని
సాక్షి, అమరావతి : ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అసలు రంగును విజయవాడ ఎంపీ కేశినేని నాని బయటపెట్టారు. టీడీపీ హయాంలో ఆయన చేసిన అక్రమాలు నిజమేనని పరోక్షంగా అంగీకరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై వెంకటేశ్వరరావు వెంటనే స్పందించి రీట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వారి గుట్టును వారే బయట పెట్టుకున్నట్లయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ భద్రతా రహస్యాలను బయట పెట్టారనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేశినేని నాని.. ‘మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్రెడ్డి గారూ’ అని ఆదివారం ట్వీట్ చేశారు. దీనిపై వెంకటేశ్వరరావు వెంటనే స్పందిస్తూ.. ‘మీరూ, మీరూ పార్లమెంట్లో కలిసి మెలిసే ఉంటారుగా.. అందరూ కలిసి ఒక అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో.. నాక్కూడా ఒక క్లారిటీ వస్తుంది’ అని కామెంట్ చేశారు. ‘ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’ అని మరో ట్వీట్ చేశారు. మొత్తానికి వీరిద్దరి ట్వీట్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఘన కార్యాలను బయట పెట్టాయి. -
వామ్మో.. ఏబీవీ!: సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: ఇంటెలిజెన్స్ విభాగం మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన అవినీతి దందా దేశ రక్షణకే ముప్పు తెచ్చిపెట్టడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలే అవాక్కవుతున్నాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడటం.. మరోవైపు స్వకార్యం.. అంటే కుమారుడి కంపెనీకి అడ్డగోలుగా కీలక కాంట్రాక్టును కట్టబెట్టడం ద్వారా భారీ అవినీతికి పాల్పడటం నివ్వెర పరుస్తోంది. ఇలా ఏబీ వెంకటేశ్వరరావు ఏకంగా దేశ రక్షణ చట్టాలకే తూట్లు పొడవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం గా మారింది. ఇంటెలిజెన్స్ తరఫున అప్పట్లో ఆయన ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్ పరికరాలను కొనుగోలు చేశారు. రక్షణ, హోం, విమాన యాన శాఖల నుంచి లైసెన్స్ లేని కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం, దేశ రక్షణ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌కు విరుద్ధంగా విదేశీ ప్రైవేట్ కంపెనీకి చేరవేయడం కేంద్ర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పు కలిగిస్తూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు పని చేశారన్నది బహిరంగ రహస్యం. 2019 ఎన్నికల్లో అక్రమాల కు పాల్పడేందుకు అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ముఖ్య నేతల ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు 2017 లోనే ఓ పన్నాగం పన్నారు. ఇలా ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. క్రిటికల్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ పరికరాలకు భారీ నిధులను వెచ్చిస్తూ ఇజ్రాయెల్‌లోని రక్షణ ఉత్పత్తుల ప్రైవేటు కంపెనీ ‘ఆర్టీ ఇన్‌ఫ్లేటబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’నుంచి కొనుగోలుకు ప్రతిపాదించారు. రక్షణ ఉత్ప త్తులను విదేశీ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తీసుకోవాలి.అవేవీ పాటిం చలేదు. చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను పట్టించుకోకుండా ఇజ్రాయెల్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలను లీక్ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొడుకు కంపెనీకి ఫ్రాంచైజీతో అడ్డగోలు దోపిడీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టేలా ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం సాగించారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ కంపెనీకి భారతదేశంలో ఫ్రాంచైజీగా ‘ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయి కృష్ణకు చెందినది. సాయి కృష్ణే ఈ కంపెనీ సీఈవో. విజయవాడ క్రీస్తురాజపురం ఫిల్మ్‌కాలనీలో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ అడ్రస్‌తో ఈ కంపెనీని నెలకొల్పారు. ఇది ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సృష్టించిన షెల్ కంపెనీ అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కంపెనీ పేరిట కాంట్రాక్టు కట్టబెట్టడంలోనూ కేంద్ర నిబంధనలను ఉల్లంఘించారు. ఈ కాంట్రాక్టుకు ఉద్దేశించిన ‘పర్చేజ్ ఆర్డర్’ను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఉద్దేశ పూర్వకంగా మాయం చేయడం విస్మయపరుస్తోంది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం సమంజసమేనని కేంద్ర హోం శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. బినామీల పేరిట 171.39 ఎకరాల కొనుగోలు యథేచ్చగా అవినీతికి పాల్పడిన ఏబీ వెంకటేశ్వరరావు బినామీల పేరిట భారీగా అక్రమ ఆస్తులు కొనుగోలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో 171.39 ఎకరాలు కొనుగోలు చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్ మండలం పస్పూల్ గ్రామంలో 57.19 ఎకరాలు, చిట్యాలలో 64.20 ఎకరాలు బినామీల పేరిట కొనుగోలు చేశారు. వీటిరి రైతు బంధు కింద ప్రయోజనం కూడా పొందారు. గత ఖరీఫ్‌లో దాదాపు రూ.55 లక్షల ఆదాయం ఆర్జించినట్టు సమాచారం. జడ్చెర్ల వద్ద 50 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేసి అందులో ఓ అధునాత గెస్ట్ హౌస్‌ను నిర్మించారని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. -
బాబు ప్రయోజనాల కోసమే ఆయన పనిచేశారు..
-
బాబు ప్రయోజనాల కోసమే ఆయన పనిచేశారు..
సాక్షి, అమరావతి: ప్రజల రక్షణ కోసం కాకుండా చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పనిచేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏబీవీ రావు సెస్పెండ్పై ట్విట్టర్ వేదికగా సజ్జల స్పందించారు. వైఎస్సార్సీపీని దెబ్బతీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని.. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలులో దళారీగా పనిచేశారన్నారు. పరికరాలు కొని తనతో సహా మా నాయకుల ఫోన్లన్నింటినీ అక్రమంగా ట్యాప్ చేశారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒక మాఫియానే నడిపారని తెలిపారు. ఏబీవీ అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారని సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజల రక్షణకోసం కాకుండా చంద్రబాబు ప్రయోజనాలకోసం ఏబీవీ పనిచేశారు. వైయస్సార్సీపీని దెబ్బతీయడానికి నిఘావ్యవస్థను ఉపయోగించారు. 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో దళారీగా పనిచేశారు. పరికరాలు కొని నాతో సహా మా నాయకుల ఫోన్లన్నింటినీ అక్రమంగా ట్యాప్ చేశారు. ఒక మాఫియా నడిపారు. — Sajjala RamaKrishna Reddy (@SRKRSajjala) February 9, 2020 ఏబీవీ అక్రమాలను ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారు. @kesineni_nani — Sajjala RamaKrishna Reddy (@SRKRSajjala) February 9, 2020 -
దేశ భద్రతా రహస్యాలు బహిర్గతం!...
సాక్షి, అమరావతి: ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో పేర్కొన్నారు. ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయి. దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీల్లేదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్
సాక్షి, అమరావతి : ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కారణంగా అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ నిబంధనల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
చంద్రం సారు మళ్లీ చిటికెలేశారు: సాయిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో తాను ఓటర్లను చైతన్యవంతం చేయబట్టే పోలింగ్ శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ చిలికెలేశారని ఆయన ఎద్దేవా చేశారు. ‘మిగతా రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు పర్యటించి ఓటర్లను రఫ్పాడిస్తారట. రెండువారాల్లోనే ఇంత ముందిరిపోయిందేమిటి బాబుగారూ?. ఏ వైజాగో, ఎర్రగడ్డకో తీసుకెళ్లండయ్యా. ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ?. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష జరపినా మాకేం సంబంధం. పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా?’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపైనా విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అనిపించింది. చంద్రబాబు కోసం ఫోన్ ట్యాపింగులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు అడ్డమైన అన్ని పనులూ చేసిన ఈయన... తన అవినీతి మీద విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? లేక ఇతరుల అవినీతిమీద విచారణ చేసే స్థితిలో ఉన్నారా?’ అని సూటిగా ప్రశ్నించారు. -
తుఫాను దిశను తెలుసుకోవాలంటే బాబును సంప్రదించండి
సాక్షి, హైదరాబాద్ : వాతావరణ శాస్త్రవేత్తలు ఫణి తుఫాను దిశను తెలుసుకోవాలంటే శాటిలైట్లతో నేరుగా సంభాషించే చంద్రబాబు నాయుడు సలహా తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. శనివారం ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబు, ఏసీబీ కొత్త డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘వాతావరణ సైంటిస్టులు ఫణి తుఫాను దిశను తెలుసుకోవాలంటే శాటిలైట్లతో నేరుగా సంభాషించే చంద్రబాబు సలహా తీసుకోవాలి. ఈయన యాంటెన్నాలు రాడార్ల కంటే బలమైన సిగ్నల్స్ తో పనిచేస్తాయి. తిత్లీ తుపాను సమయంలో ఐఎండి వాళ్లకు తనే తీరం దాటే ప్రదేశాన్ని యాక్యురేట్ గా చెప్పినట్టు డప్పు కొట్టుకున్నాడు’ అని ఎద్దేవా చేశారు. విచారణ ఎదుర్కొంటారా? లేక చేస్తారా? ‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అనిపించింది. చంద్రబాబు కోసం ఫోన్ ట్యాపింగులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు అడ్డమైన అన్ని పనులూ చేసిన ఈయన... తన అవినీతి మీద విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? లేక ఇతరుల అవినీతిమీద విచారణ చేసే స్థితిలో ఉన్నారా?’ అని ప్రశ్నించారు. -
ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు
సాక్షి, అమరావతి : మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఏసీబీ డీజీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇంటెలిజెన్స్ డీజీ పదవి నుంచి ఆయన వైదొలగాల్సి వచ్చింది. ఎన్నికలు ముగియడంతో ఏసీబీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు జీవో నెంబర్ 882ను విడుదల చేశారు. గత నెల 26న కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేయాలని ఆదేశించడంతో తొలుత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 716 జారీ చేసింది. ఆ తర్వాత వరుసగా జీవో లు విడుదల చేయటం వివాదాస్పదమైంది .అంతటితో ఆగక ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరిండచడంతో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ తర్వాత, డీజీపి ఠాకూర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. శాంతిభద్రతలతో పాటు, అవినీతి నిరోధకశాఖ డీజీగా ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తించేవారు. అదనపు బాధ్యతల నుంచి ఠాగూర్‌ను ఈసీ తప్పించింది. ఏసీబీ బాధ్యతలను శంఖ బ్రత బాగ్చికి అప్పగించారు. ఇంటెలిజెన్స్ బాధ్యతలను కుమార్ విశ్వజిత్‌కు అప్పగించారు. గత నెల 29నుంచి విధులకు దూరంగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు ఏసీబీ డీజీగా నియమిస్తూ ఇప్పుడు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టింగ్ అప్పగించాలని నిబంధన ఉండటంతో అవినీతి నిరోధక శాఖ బాధ్యతలు అప్పగించారు. కాగా ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘ఓటుకు కోట్లు’ వివాదంలో చంద్రబాబు అడ్డంగా బుక్కైపోవడంతో అప్పటి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనురాధను తప్పించి.. ఆ స్థానంలో ఏబీవీని కూర్చోబెట్టారు. అప్పట్నుంచీ ఏబీవీ హవా జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నిఘా విధులు వదిలి పూర్తిగా చంద్రబాబు, టీడీపీ సేవలో ఏబీవీ తలమునకలయ్యారనేది బహిరంగ రహస్యం. ఒక దశలో ఆయన వీఆర్ఎస్ తీసుకుని తన స్వస్థలమైన నూజివీడు లేదా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే బలమైన ప్రచారం జరిగిందంటే అధికారపార్టీతో ఏబీవీకున్న అనుబంధం ఏపాటితో అర్థమవుతుంది. -
ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, అమరావతి : ఏపీ ఇంటలెజిన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసినప్పటికీ అనధికారికంగా విధుల్లో కొనసాగుతున్నారని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన ఏపీ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. కిందిస్థాయి ఉద్యోగులు ఏబీ వెంకటేశ్వరరావుకు నివేదికలు ఇస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు ఇంటలెజిన్స్ విధుల్లో కలుగజేసుకోకుండా.. అదే విధంగా ఆయన ఇచ్చిన గత నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావును ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు గత మంగళవారం జీవో (నంబర్ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు జీవో నంబరు 720 జారీ చేసింది. అదే విధంగా సీఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా . దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఏపీలో అధికారుల బదిలీలకు సంబంధించి ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ గత శుక్రవారం తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి గురువారం పిటిషన్ దాఖలు చేశారు. -
ఏపీ డీజీపీకి ఎన్నికల సంఘం పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఈసీని కలవనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల అమలుని ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం వివరణ కోరిన విషయం విదితమే. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివరణ తీసుకుంది. మరోవైపు ఏపీ ఇంటెలిఎన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదం వ్యవహారంపై డీజీపీని వివరణ కోరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసీతో పాటు కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లింది. మరోవైపు డీజీపీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి...(డీజీపీ ఆర్పీ ఠాకూర్‌పై ఈసీకి ఫిర్యాదు) ఇంటెలిజెన్స్ డీజీపై వేటు -
ఎన్జీవో ఎన్నికల్లోనూ ‘ఏబీవీ’ జోక్యం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు తాబేదారులా మారిన ఇంటెలిజెన్స్ మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) ఆ పోస్టులో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటెలిజెన్స్ బాస్‌గా తాను చేయాల్సిన ఉద్యోగం మానేసి అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు నుంచి డేటా లీకేజీ వరకూ బరితెగించి చేయడం.. చివరకు ఎన్నికల సంఘం ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బాస్‌గా ఆయన అరాచకాలు, ఒత్తిళ్లు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సీఎం అండ చూసుకుని ప్రతి పనిలో ఆయన వేలు పెట్టినట్టు విదితమవుతోంది. ఈ క్రమంలో 2 నెలలక్రితం రాష్ట్రంలో జరిగిన నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్(ఎన్జీవో) ఎన్నికలను సైతం ఆయన వదల్లేదని తాజాగా బయటపడింది. ఈ ఎన్నికల్లో ఉద్యోగులను బెదిరించి, సీఎం చెప్పినట్టు చేయాలని ఏబీవీ ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడైంది. ఉద్యోగుల నిర్ణయం మేరకు ఎన్నిక జరగకూడదని, సీఎం చెప్పినవారు.. సీఎంకు అనుకూలంగా ఉండేవారే నాయకుడుగా ఉండాలని ఫోన్లో ఒత్తిడి తెచ్చారని తెలిసింది. సీఎం సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలంటూ ఒత్తిడి.. దాదాపు 2 నెలలక్రితం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న అశోక్‌బాబు పదవి నుంచి తప్పుకోవడంతో ఎన్జీవో ఎన్నికలకు తేదీ ఖరారు చేశారు. ఎన్నికలు జరగడానికి ఒకరోజు ముందు ఇంటెలిజెన్స్ బాసు కొంతమంది ఎన్జీవో నేతలకు ఫోన్ చేసి.. కావాలంటే అధ్యక్షుడు, మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకోండి గానీ, సెక్రటరీ జనరల్ పోస్టుకు మాత్రం సీఎం సామాజికవర్గానికి చెందిన పశ్చిమ, కృష్ణా బాధ్యతలు చూస్తున్న నాయకుడిని ఎంపిక చేయాలని, లేదంటే ఖాళీగా ఉంచాలని కోరారు. కీలకమైన ఆ పోస్టును ఎలా ఖాళీగా ఉంచుతామని, అలా చేయడానికి వీల్లేదని ఎన్జీవో నేతలు ఇంటెలిజెన్స్ చీఫ్‌తో చెప్పారు. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ చీఫ్ తెల్లవారుజాము 3 గంటల వరకూ ఫోన్లు చేస్తూనే ఉన్నారని, అలా కుదరదని ఎంతగా చెప్పినా బెదిరింపు ధోరణిలో మాట్లాడారని కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు తాజాగా వెల్లడించారు. సీఎం నియమించాలనుకున్న వ్యక్తి, ఇంటెలిజెన్స్ చీఫ్ ముందురోజు సీఎం చంద్రబాబు వద్ద సుమారు 3 గంటలపాటు సమావేశమయ్యారని, ఆ తర్వాత ఎన్జీవో ఎన్నికలపై దృష్టి సారించి బెదిరింపులకు దిగారని పలువురు ఉద్యోగులు తెలిపారు. కానీ సీఎంగానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ గానీ చెప్పినట్టుగా చెయ్యలేమని, మెజారిటీ ఉద్యోగుల నిర్ణయాన్ని బట్టే ఉంటుందని స్పష్టం చేసిన ఉద్యోగులు.. చివరకు తాము నిర్ణయించిన వారినే సెక్రటరీ జనరల్‌గా నియమించారు. సచివాలయ ఎన్నికల్లోనూ జోక్యం సీఎం స్థాయి వ్యక్తితోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్... చివరకు 2 వేల మంది కూడా లేని సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లోనూ జోక్యం చేసుకున్నారంటే ఎంతగా దిగజారారో అర్థం చేసుకోవచ్చు. సచివాలయ ఉద్యోగుల సంఘానికి మురళీకృష్ణ, కె.వెంకటరామిరెడ్డి అధ్యక్ష స్థానానికి పోటీపడ్డారు. ప్రభుత్వానికి మురళీకృష్ణ అనుకూలంగా ఉన్నారని, వెంకటరామిరెడ్డి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంకు నివేదించారు. దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు పోటీచేసిన ఇద్దరు నాయకులను తన చాంబర్‌కు పిలిపించుకున్నారు. ఈ చర్చల్లో స్వయానా ముఖ్యమంత్రే.. వెంకటరామిరెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీనికి వెంకటరామిరెడ్డి ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానని, తన నిర్ణయంలో మార్పు ఉండబోదని కుండబద్దలు కొట్టేశారు. తన మాట వినలేదన్న ఉక్రోషంతో కొంతమంది మంత్రుల్ని సీఎం రంగంలోకి దించి ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసి వెంకటరామిరెడ్డిని ఓడించేలా చక్రం తిప్పారు. ఈ వ్యవహారం తెలుసుకున్న ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. ఒక ముఖ్యమంత్రి పాలనా వ్యవహారాలు వదిలేసి, సచివాలయ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదని, ఇంటెలిజెన్స్ చీఫ్‌కు ఈ ఎన్నికలతో ఏం పని ఉందని వారు మండిపడ్డారు. ఆ తర్వాత వెంకరామిరెడ్డిని అకారణంగా సస్పెండ్ చేసిన విషయమూ తెలిసిందే. ఇంకా ఏబీవీకే రిపోర్ట్ చేస్తున్నారు హైకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా.. ఇంటెలిజెన్స్ అధికారులు, ఇతర పోలీసులు ఆయనకే రిపోర్ట్ చేస్తున్నారని, అలా చేయకుండా ఆ అధికారుల్ని నిరోధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవట్లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు ఏబీకే రిపోర్ట్ చేస్తుండటం వల్ల ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగే అవకాశం ఉండబోదని, అందువల్ల అతనికి రిపోర్ట్ చేయకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో ఏరకంగానూ జోక్యం చేసుకోకుండా ఏబీని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. క్షేత్రస్థాయిలోనూ ఎలాంటి సమాచారాన్ని, నివేదికను ఏబీకి సమర్పించకుండా, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు వచ్చిన నివేదికలను ఉపయోగించకుండా అతన్ని నిరోధించాలని కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, ఎన్నికల సంఘం కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే ఏబీ వెంకటేశ్వరరావును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. అధికార దుర్వినియోగమే: ఏబీతోపాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలు అధికార టీడీపీ కోసం పనిచేస్తున్న నేపథ్యంలో వారిపై వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని, దాని ఆధారంగా ఆ ముగ్గురిని తప్పిస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చిందని నాగిరెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఎన్నికలు, రాజకీయపార్టీలకు సంబంధించి సేకరించిన సమాచారమంతటినీ ఏబీవీకి తెలియచేయాలని పోలీసు అధికారులందరికీ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, దీంతో వారంతా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని ఏబీవీకి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని వివరించారు. వాస్తవానికి ఇంటెలిజెన్స్ బాస్‌గా మరో అధికారి నియమితులయ్యారని, అయినప్పటికీ ఏబీ కే రిపోర్ట్ చేయాలనడం అధికార దుర్వినియోగమేనన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని నాగిరెడ్డి కోర్టును అభ్యర్థించారు. -
ఈసీ ఆదేశాలనే ధిక్కరిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని, ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదని తాము జారీచేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి ఆయనను తిరిగి అదే పదవిలో నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేత జీవో జారీ చేయడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 716ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? తిరిగి ఆయననే డీజీ ఇంటెలిజెన్స్‌గా నియమిస్తూ జీవో 720 ఎందుకు జారీ చేశారు? ఎన్నికల కమిషన్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘించడాన్ని ఎలా పరిగణించాలి? అని ఈసీ ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేతను ఈసీ వివరణ కోరింది. దీంతో అనిల్‌చంద్ర పునేత సోమవారం ఢిల్లీలో ఈసీని కలిసి వివరణ ఇచ్చారు. ‘కమిషన్ ఆదేశాలు వచ్చిన తక్షణమే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్ కడప జిల్లాల ఎస్పీలు వెంకటరత్నం, రాహూల్ దేవ్ శర్మను బదిలీ చేస్తూ జీవో నంబరు 716 జారీ చేశాం. తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) పంపిన నోట్ ఫైల్ మేరకే జీవో 721 జారీ చేశాం. దీని ప్రకారమే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేసి మిగిలిన ఇద్దరు ఎస్పీల బదిలీలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు జీవో నంబరు 720 జారీ చేశాం ’ అని సీఎస్ అనిల్‌చంద్ర పునేత వివరణ ఇచ్చినట్లు తెలిసింది. డీజీపీ నోట్ ఫైల్ పంపితే ఆ విషయం మా (ఈసీ) దృష్టికి తీసుకొచ్చి అనుమతి తీసుకోకుండా బదిలీ ఉత్తర్వులను ఎలా రద్దు చేస్తారు? డీజీపీగానీ, మరొకరుగానీ ఏది చెబితే అది చేసేస్తారా? ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఎలా సవాల్ చేస్తుంది? అని ఈసీ నిలదీసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా జీవో ఇవ్వడం తొందరపాటు చర్యేనని, ఇకమీదట ఇలా జరగనీయబోమంటూ సీఎస్ సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెంకటేశ్వరరావును బదిలీచేసిన ప్రభుత్వం 24 గంటలు గడవకముందే ఆయనను తిరిగి అదే స్థానంలో నియమించడం, కమిషన్ నిర్ణయాన్ని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టులో సవాల్ చేయడం ఈసీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించడమే కాకుండా ఈసీ ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబడుతూ వివరణ అడగడంతోపాటు ఇందుకు దారితీసిన పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కమిషన్ అధికారులు వాకబు చేసినట్లు సమాచారం. -
ఆ జీవోలు ఎందుకు జారీ చేశారు : సీఈసీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ పునేథ సోమవారం సమావేశమయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ జీవో వ్యవహారంపై సీఈసీ వివరణ కోరింది. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘం అధికారులతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇంటలెజిన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ 716 జీవో జారీ చేసిన తర్వాత, ఆ జీవోను రద్దు చేసి 720, 721 జీవోలను ఎందుకు జారీ చేశారంటూ సీఈసీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సమావేశం ముగిసిన తర్వాత అనిల్ పునేథ ముభావంగా వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు ఒత్తిడి మూలంగానే సీఈసీ ఆదేశాలకు విరుద్ధంగా జీవో జారీ చేయాల్సి వచ్చిందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.(చదవండి : ఎంత చెప్పినా సీఎం వినలేదు.. కోర్టుకెళ్లి తప్పు చేశాం..!) కాగా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు గత మంగళవారం జీవో (నంబర్ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నం బరు 720 జారీ చేసింది. అదే విధంగా సీఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా . దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఏపీలో అధికారుల బదిలీలకు సంబంధించి ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ శుక్రవారం తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
రంగంలోకి దిగిన కేకే శర్మ
-
వీడని నీడ.. ఏబీ వెంకటేశ్వరరావు!
సాక్షి, అమరావతి: అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్ర పడిన ఏబీ వెంకటేశ్వరరావును హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బాస్ బాధ్యతల నుంచి తప్పనిసరై రిలీవ్ చేయాల్సి వచ్చినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం.. ఆయన్ను వదులుకునేది లేదని తేల్చిచెప్పేశారు. ఈసీ ఆదేశించినా.. హైకోర్టు చెప్పినా.. పట్టించుకోకుండా ఇంటెలిజెన్స్ మాజీ బాస్‌ను ప్రస్తుత ఎన్నికల తరుణంలో తన రాజకీయ అవసరాలకోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అంతేగాక ఆయన్ను వదులుకునేది లేదంటూ కీలక అధికారులకు సంకేతాలిచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు, ఎన్నికల అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏబీవీకి ఇవ్వాలని, ఈ విషయంలో ఆయనకు పూర్తి స్థాయిలో సహకరించాలని పోలీసు బాస్‌లకు, అలాగే జిల్లాల్లోని పోలీసు యంత్రాంగం, పార్టీ యంత్రాంగానికి మౌఖికంగా ఆదేశాలిచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏబీవీ అనధికార శక్తిగా వ్యవహరిస్తున్నారని, పోలీసు శాఖ, ప్రభుత్వ అధికారులు, టీడీపీ అభ్యర్థులను సమన్వయం చేస్తూ ఏ సమస్య ఉన్నా ఇన్వాల్వ్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనధికార శక్తిగా ఏబీవీ.. రాష్ట్రంలో టీడీపీ కోసం ఏబీవీ ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేయడం, ఈ నేపథ్యంలో వివాదాస్పదమైన ఏబీవీని విధుల నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్ చేయాలని, ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదంటూ ఈసీ ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. అయితే ఏబీవీతో తన రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున చంద్రబాబు ఆయన్ను రిలీవ్ చేయడానికి ససేమిరా అన్నారు. అయితే హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఏబీవీని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రిలీవ్ చేయక తప్పలేదు. దీంతో ఏబీవీ పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు పరిమితం కావాల్సి ఉంది. ఈ కారణంగా అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఏబీవీని వదులుకోవడం సీఎంకు సుతరామూ ఇష్టం లేకపోయింది. ఏదేమైనా ఏబీవీని పార్టీ కోసం ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆ మేరకు పోలీసు బాస్‌లకు సంకేతాలిచ్చినట్టు, అందరూ ఏబీవీకి రిపోర్టు చేయాలంటూ, ఎన్నికల అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏబీవీకి అందజేయాలంటూ మౌఖికంగా సూచించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏబీవీ తెరవెనుక నుంచి అధికారపార్టీ కోసం వ్యవహారాలు నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందినవాడవడంతోపాటు సొంత మనిషిగా ఉన్న ఏబీవీని పార్టీ కోసం వాడుకోవాలనే ప్రయత్నాలు ఇంకా కొనసాగడంపై సీనియర్ పోలీసు అధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రధానంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఏబీవీ సొంత సామాజిక వర్గం, సొంత మనుషులతో పట్టిష్టమైన నెట్‌వర్క్‌ను పెట్టుకోవడంతో ఆయన మాటే చెల్లుబాటయ్యే అవకాశముందని, అదే జరిగితే ఏబీవీ అనధికార శక్తిగా వ్యవహరించే వీలుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమార్ విశ్వజిత్‌ను ఇంటెలిజెన్స్ ఏడీజీగా నియమించినప్పటికీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఇంటెలిజెన్స్ డీఎస్పీలు, దిగువస్థాయి సిబ్బంది సహాయ నిరాకరణ చేసే ప్రమాదం ఉందని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో కొనసాగింపు... ఇంటెలిజెన్స్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఏబీవీ ఇంకా వాట్సాప్ గ్రూపుల్లో కొనసాగుతుండడం గమనార్హం. దీని వెనుక చంద్రబాబు ఇచ్చిన మౌఖిక ఆదేశాలే కారణమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లాలవారీగా అధికారులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఇలా అనేక రకాల గ్రూపుల్లో ఏబీవీ కూడా ఉన్నారని ఒక పోలీసు అ«ధికారి చెప్పారు. కీలక సందర్భాల్లో ఆయన పలు సూచనలు కూడా వాట్సాప్ గ్రూపుల్లో చేసేవారని అంటున్నారు. ఇటీవల జరిగిన టెలీకాన్ఫరెన్సులోనూ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థులకు నేరుగా ఏబీవీ ఫోన్‌నంబర్ ఇచ్చిన చంద్రబాబు ఏ సమస్య వచ్చినా ఆయనకు నేరుగా టచ్‌లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ఏ సమస్య వచ్చినా ఏబీవీ సహకారం తీసుకుంటున్నారని తెలిసింది. అదే సమయంలో పోలీసు శాఖ, ప్రభుత్వ అధికారులు, టీడీపీ అభ్యర్థులను సమన్వయం చేసే పనిలో ఏబీవీ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. -
కోర్టుకెళ్లి తప్పు చేశాం..!
-
ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో నెగ్గని చంద్రబాబు వాదన
-
ఎంత చెప్పినా సీఎం వినలేదు.. కోర్టుకెళ్లి తప్పు చేశాం..!
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఆదేశాలను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం తలబొప్పికట్టేలా చేసింది. దీంతో యూటర్న్ తీసుకుని రాష్ట్ర నిఘా విభాగం అధిపతి (ఇంటెలిజెన్స్ డీజీ) ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా విధులను పక్కనపెట్టి టీడీపీ సేవలో తరిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సింది పోయి కోర్టులో సవాల్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయిందనే అంశం ఉన్నతస్థాయి అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం తమను బదనాం చేశారని ఉన్నతాధికారులు మథనపడుతున్నారు. ముగ్గురు పోలీసు అధికారులను బదిలీచేస్తూ సీఈసీ ఇచ్చిన ఆదేశాలు, తదనంతర పరిణామాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలని అధికారులు ఎత్తి చూపుతున్నారు. ‘ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల ఎస్పీలు ఎ.వెంకటరత్నం, రాహుల్‌దేవ్ శర్మను బదిలీచేస్తూ ఎన్నికల కమిషన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని ఎన్నికలకు సంబంధించిన విధులకు వీరిని దూరంగా పెట్టాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ వీరి ముగ్గురినీ బదిలీచేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 జారీ చేశారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని జీర్ణించుకోలేకపోయిన సీఎం ఎలాగైనా దీనిని ఆపించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే జీవోను రద్దుచేసి శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల ఎస్పీలను మాత్రమే బదిలీ చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి రెండు జీవోలు ఇప్పించారు. అలాగే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ పేరుతో ప్రభుత్వం తరఫున ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేయాలంటూ కోర్టులో కేసు వేయించారు. అసలు ఒక అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ బదిలీ చేస్తే దానికి విరుద్ధంగా ఆయన కోర్టుకెళ్లవచ్చు. ఇందుకు భిన్నంగా ఎన్నికల కమిషన్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలా కోర్టుకు వెళుతుంది? దీని వెనుక ఆంతర్యం ఏమిటి? అనే సందేహాలు సాధారణంగానే అందరికీ కలిగేలా సీఎం చేశారు. జీవో ఎందుకు ఇచ్చారు? ఎందుకు రద్దు చేశారన్న జడ్జి ప్రశ్నలకు ఏజీ సమాధానమే ఇవ్వలేని పరిస్థితి. దీంతో అటు కోర్టులోనూ, ఇటు ఎన్నికల కమిషన్ వద్దా ప్రభుత్వ పరువును మంటలో కలిపినట్లయింది’ అని ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులు ‘సాక్షి’తో అన్నారు. ఇంతా చేసి సాధించిందేమిటి? దేశ చరిత్రలో ఎన్నడూ ఈసీ బదిలీలను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ కోర్టులో సవాల్ చేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి బాబు సర్కారు ఇలా సవాల్‌చేసి కోర్టులో సైతం అక్షింతలు వేయించుకోవాల్సి వచ్చింది. ఇంతా చేసి సాధించింది ఏమిటయ్యా అంటే రెండు చోట్లా పరువు పోగొట్టుకోవడమే. ఇది చాలదన్నట్లు తమను ఎందుకు బదిలీ చేశారో, తాము చేసిన తప్పు ఏమిటో చెప్పాలంటూ శ్రీకాకుళం, వైఎస్సార్ కడప ఎస్పీలు ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాయడంపై మరో దుమారం రేగుతోంది. ఈ లేఖలను వారు ఇష్టపూర్వకంగా రాయలేదు. సీఎం ఒత్తిడి తెచ్చి రాయించారనేది ప్రస్తుతం ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఈసీ వివరణ అడిగిన దాఖలాలు ఎన్నడూ లేవు ఎన్నికల కమిషన్ ఎవరినైనా అధికారులను విధుల నుంచి తప్పించేప్పుడు వారి వివరణ కోరిన దాఖలాలు ఎన్నడూ లేవు. సర్కారు కూడా బదిలీ చేసేప్పుడు వివరణ తీసుకోదు. కేవలం క్రమశిక్షణ చర్యలు తీసుకునేటప్పుడు మాత్రమే సంజాయిషీ తీసుకునే ఆనవాయితీ ఉంది. ఇంటెలిజెన్స్ అనేది ఎలా చూసినా పోలీసింగ్‌లో భాగమే. చంద్రబాబుకు అనుకూలంగా ఈసీ నిర్ణయాలు లేకపోతే ఏకపక్షమని, ఆయనకు అనుకూలంగా ఉంటే అద్భుతమని అనుకోవడం సరికాదు. – ఐవైఆర్ కృష్ణారావు, మాజీ సీఎస్ -
సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార టీడీపీకోసం పనిచేస్తున్నారనే ఆరోపణలపై ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కారణాలు ఏవీ కనిపించడం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలంటూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వుల కాపీ అందుబాటులోకి రాకపోవడంతో ఏ కారణాలతో ప్రభుత్వ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసిందో తెలియరాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును, కడప, శ్రీకాకుళం ఎస్పీలను తప్పిస్తూ ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అలాగే ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనుబంధ పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. ఈ అనుబంధ పిటిషన్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల పరిధిలోకి రారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన వ్యక్తులే ఎన్నికల పరిధిలోకి వస్తారని, ఇదే విషయాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 28(ఏ) చెబుతోందన్నారు. అందువల్ల ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసే అధికారం ఈసీకి లేదని వివరించారు. ఈ వాదనను ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి తోసిపుచ్చారు. ఎన్నికల ప్రక్రియలో ఇంటెలిజెన్స్ విభాగానిది కీలక పాత్ర అని, ఈ విభాగం లేకుండా ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. డీజీపీ కూడా ఎన్నికల విధుల్లో భాగమని, ఆయన కింద పనిచేసే ఇంటెలిజెన్స్ డీజీ కూడా విధుల్లో భాగంగానే ఉంటారని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఓ అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పించేందుకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉందని, ఇందుకు కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈసీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈసీ ఉత్తర్వుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలన్న ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి తగిన కారణాలు కనిపించట్లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధాన పిటిషన్లో విచారణను వాయిదా వేసింది. -
ఏబీ వెంకటేశ్వరావు బదిలీ
-
ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు బదిలీ
సాక్షి, అమరావతి : హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్ 750 జారీ చేసింది. ప్రస్తుత ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ఎటువంటి ఎన్నికల విధులను ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించవద్దంటూ జీవోలో పేర్కొంటూ.. హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా అంతకు ముందు ఏబీ వెంకటేశ్వరరావు...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వీరు భేటీ జరిగింది. చంద్రబాబు సర్కార్ ... వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉండేందుకు చివరకు ప్రయత్నాలు సాగించిన విషయం విదితమే. ఓ వైపు ఈసీ స్పష్టమైన ఆదేశాలు... మరోవైపు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాల్సిందేనని ఆదేశాలు ఇవ్వడంతో .... బాబు సర్కార్ దిగిరాక తప్పలేదు. చదవండి...(ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం విదితమే. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కార్...హైకోర్టును ఆశ్రయించినా చుక్కెదురు అయింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం తీర్పును వెల్లడిస్తూ... ఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. బదిలీలపై ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. చదవండి... (ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు) చదవండి...(ఏబీవీ.. బాబు రాజకీయానికి బినామీ) -
హైకోర్టు తీర్పు; బాబుతో ఏబీ భేటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో వీరు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. (చదవండి: ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావును బదిలీ చేయకుండా ఉండేందుకు చంద్రబాబు సర్కారు చివరకు ప్రయత్నాలు సాగించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఘాటు లేఖ కూడా రాశారు. హైకోర్టు తలుపు తట్టినప్పటికీ రాష్ట్ర సర్కారు నగుబాటు తప్పలేదు. మరోవైపు వెంకటేశ్వరరావు కోసం మొత్తం అధికార వ్యవస్థను అవమానాల పాల్జేశారని ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించకుండా చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు) -
అప్పుడలా..ఇప్పుడిలా..ఎలా బాబూ..
సాక్షి, అమరావతి: ఎన్నికల విధుల్లో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే చర్యలపై నాలుకను మడతపెట్టి ఎలా బడితే అలా మాట్లాడడం సీఎం చంద్రబాబునాయుడికే చెల్లింది. ప్రతి విషయంలోనూ రెండు నాల్కల ధోరణి అవలంభించే ఆయన ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలపై గతంలోనూ, ఇప్పుడూ పరస్పర భిన్నంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికలు సజావుగానూ, స్వేచ్ఛగానూ జరగడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే 2009లో ఫిర్యాదుల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న ఎస్ఎస్పీ యాదవ్‌ను ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించింది. మహంతికి బాధ్యతలు అప్పగించేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అలాగే గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిని రాత్రి సమయంలో అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ వికారాబాద్ ఎస్పీ టి.అన్నపూర్ణను ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం.. అవినాష్ మహంతికి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. ఇలా బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఆయా అధికారులపై వేటు వేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఏపీలోనూ కొంతమంది పోలీసు బాస్‌లు అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడంపై చంద్రబాబు వైఖరి తెలుసుకోవాలంటే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ ఘటన, ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు.. ఇలా రెండు అంశాల పూర్వపరాలను పరిశీలించాల్సిందే. నిఘా వ్యవస్థను నీరుగార్చింది బాబే.. పోలీసు వ్యవస్థలో పైకి కన్పించని నిఘా వ్యవస్థగా ఉండే ఇంటెలిజెన్స్ విభాగం కీలక పాత్ర పోషించాల్సి ఉంది. శాంతిభధ్రతలకు భంగం కలిగించే సంఘ విద్రోహ శక్తులను, మావోయిస్టు, తీవ్ర వాద కార్యాకలాపాలను కనిపెడుతూ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన గురుతర బాధ్యత ఇంటెలిజెన్స్‌పై ఉంది. అయితే 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన చంద్రబాబు ఇంటెలిజెన్స్ వంటి కీలక నిఘా వ్యవస్థలోనూ రాజకీయ ప్రయోజనాన్ని చొప్పించడం మొదలుపెట్టారు. ఫలితంగా రాష్ట్ర పౌరుల భద్రతను గాలికి వదిలేసిన ఇంటెలిజెన్స్.. చివరకు ఎల్లో నెట్‌వర్క్‌గా మారిపోయిందనే విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు జిల్లాల్లో ఇంటెలిజెన్స్ డీఎస్పీల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని ఓఎస్డీ వరకు చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన వారితో నింపేశారంటూ లోకం కోడై కూస్తోంది. ఈ వ్యవస్థ పూర్తిగా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడు ఏం జరిగిందంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2009లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల్లోని పర్యటన సందర్భంగా అప్పటి డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ తనను కలిసిన పోలీసులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పనితీరు బాగుందంటూ ప్రశంసించారు. దీంతో డీజీపీ యాదవ్ ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించారంటూ టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమి ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ నేపథ్యంలో డీజీపీని విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. ఆయన స్థానంలో మహంతిని డీజీపీగా నియమించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ డీజీపీపై వేటు వేయడం ప్రజాస్వామ్య విజయమంటూ అప్పట్లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హర్షం వెలిబుచ్చారు. అప్పట్లో సీపీఐతోపాటు పలు పార్టీలు ఎన్నికల కమిషన్ ఆదేశాలను స్వాగతించాయి. విశేషం ఏమిటంటే అప్పట్లో రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ డీజీపీగా ఎస్ఎస్పీ యాదవ్‌నే కొనసాగించేలా ఎటువంటి వత్తిడి తేకపోవడం. ఇప్పుడు జరుగుతున్నదేమిటంటే.. రాష్ట్రంలో డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల సమన్వయ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ యోగానంద్ రాష్ట్రంలో టీడీపీ కోసం పనిచేస్తున్నారని, ఇలా అయితే ఎన్నికలు నిష్పక్షపాతంగానూ, స్వేచ్ఛగానూ జరిగే అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను ఆరా తీసిన ఈసీ పలు కారణాలపై ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలు వెంకటరత్నం, రాహుల్దేవ్శర్మను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ అదేశాలు ఇచ్చింది. దీంతో ఇదంతా ప్రధాని మోదీ, ప్రతిపక్షాల కుట్ర అంటూ చంద్రబాబు మంగళవారం ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో గగ్గోలు పెట్టారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం సవాలు చేసేలా ఆయన పార్టీ కేడర్‌ను రెచ్చగొట్టడం వివాదాస్పమైంది. నిబంధనలకు విరుద్ధంగా సీఎం సమీక్షలు తన రాజకీయ ప్రయోజనాలు ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల నిబంధలను బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏబీవీపై ఎన్నికల సంఘం వేటు వేయడంతో కంగారు పడిన సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం పలుమార్లు డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర కీలక అధికారులతో దఫదఫాలుగా చర్చలు జరిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కీలక అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఒక తప్పిదం అయితే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై సీఎం సమీక్ష జరపడం మరో తప్పు అని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరెమనుకున్నా.. నిబంధనలు ఎలా ఉన్నా.. అడ్డగోలుగా తనకు తోచిందే చేస్తున్న చంద్రబాబు తీరు వల్ల తాము ఇరకాటంలో పడుతున్నామంటూ ఓ సీనియర్ అధికారి వాపోయారు. -
జాబితాలో పేరు ఇచ్చి.. మాట మారుస్తారా..!
సాక్షి, అమరావతి : ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 721లో చెప్పింది. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో గురువారం వాదనలు మొదలయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల విధుల్లో లేరంటూ వాదనలు వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ప్రమాణపత్రం సమర్పించింది. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే సదరు అధికారుల బదిలీకి నోటీసులు ఇచ్చామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంటలిజెన్స్ చీఫ్ లేకుండా పోలీస్ శాఖ ఎలా ఉంటుందని, వారి నివేదికల ద్వారానే పోలీస్‌శాఖ నడుస్తుంది కదా అని స్పష్టం చేశారు. ఎన్నికల భద్రతా, పోలింగ్ పర్యవేక్షణ ఇంటలిజెన్స్ నిఘా లేకుండా ఎలా ఉంటుందని వాదించారు. సెక్షన్ 28-ఏ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాలో ఏపీ ప్రభుత్వం ఇంటలిజెన్స్ డీజీ పేరును కూడా ఇచ్చిందని కోర్టుకు విన్నవించారు. కాగా, దీనిపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇస్తూ.. పొరపాటుగా ఇంటలిజెన్స్ పేరు ఇచ్చామని సమర్ధించుకుంది. 716 జీవో ప్రకారం ఇద్దరు ఎస్పీలను, ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసిన ప్రభుత్వం.. జీవో నెం. 720 జారీ చేసి ఇంటలిజెన్స్ డీజీ బదిలీని పక్కన పెట్టడంలో ఉద్దేశమేమిటని అన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. (చదండి : ఇంటెలిజెన్స్..పోలీస్ వ్యవస్థలో భాగమే) (చదండి : సీఈసీ ఆదేశాలు బేఖాతరు) -
ఏబీవీ.. బాబు రాజకీయానికి బినామీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఆయన దర్జాగా కూర్చుంటారు .టీడీపీ ఆంతరంగిక సమావేశాల్లో దర్శనమిస్తారు. పోలీసు శాఖలో జరిగే బదిలీల్లో ఆయన చెప్పిందే జరుగుతుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే జరుగుతుంది. టీడీపీ పదవులు, ఎమ్మెల్యే టిక్కెట్లు ఏదైనా ఆయన సిఫారసు తప్పనిసరి. పేరుకు నిఘా విభాగం అ«ధిపతి అయినా అటు ప్రభుత్వం, ఇటు టీడీపీ సంస్థాగత నిర్ణయాల్లోనూ ఆయనదే పెత్తనం. ఆయనెవరో ఇప్పటికే అర్థమైంది కదూ.. ఆయనే అత్యంత వివాదాస్పదమైన పోలీసు అధికారిగా ముద్ర వేసుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ). అటు ప్రభుత్వ వ్యవహారాలు, ఇటు పార్టీ పనుల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఏబీవీ ఏకంగా చంద్రబాబు రాజకీయ బినామీగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. సాక్షి, అమరావతి/గుంటూరు: ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తుల కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచడంతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపైన దృష్టి పెట్డడం, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాల్సిన పని ఇంటెలిజెన్స్ విభాగానిది. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వంలో లోపాలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అరాచకాలపై ప్రభుత్వాని కి నివేదికలు అందిస్తూ పారదర్శకంగా వ్యవహరించేది. అయితే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎ.బి.వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. అధికారపార్టీ సేవలో ఆయన తరించిపోతున్నారు. టీడీపీ, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసమే పనిచేసేలా ఇంటెలిజెన్స్ వ్యవస్థను మార్చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆది నుంచీ టీడీపీ సేవలోనే.. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సొంత సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ‘ఓటుకు కోట్లు’ వివాదంలో చంద్రబాబు అడ్డంగా బుక్కైపోవడంతో అప్పటి ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనురాధను తప్పించి.. ఆ స్థానంలో ఏబీవీని కూర్చోబెట్టారు. అప్పట్నుంచీ ఏబీవీ హవా జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నిఘా విధులు వదిలి పూర్తిగా చంద్రబాబు, టీడీపీ సేవలో ఏబీవీ తలమునకలయ్యారనేది బహిరంగ రహస్యం. ఒక దశలో ఆయన వీఆర్ఎస్ తీసుకుని తన స్వస్థలమైన నూజివీడు లేదా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతారనే బలమైన ప్రచారం జరిగిందంటే అధికారపార్టీతో ఏబీవీకున్న అనుబంధం ఏపాటితో అర్థమవుతుంది. ఆయన, ఓఎస్డీ యోగానంద్ లాంటి అధికారులు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఖాకీ యూనిఫారం వేసుకుని ఐక్యతను చాటే పోలీసు వ్యవస్థలో కులం కుంపటి రాజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలోని కీలక పోస్టుల్లో సీఎం సొంత సామాజికవర్గం వారితో నింపేశారని, మిగతా వారిని లూప్‌లైన్ (అప్రధాన) పోస్టుల్లో నియమించారని పోలీసులే వాపోతుండడం ఇందుకు నిదర్శనం. పోలీసు శాఖలో ఇలా కుల ప్రస్తావన గతంలో ఎప్పుడు లేదని సీనియర్ పోలీసు అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. ఎల్లో నెట్‌వర్క్‌గా మార్చేశారు.. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక నుంచి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వరకు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం నిఘా వ్యవస్థను పణంగా పెడుతున్నారంటూ పోలీసు శాఖలో విమర్శలు రేగుతున్నాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా టీడీపీ రాజకీయ అవసరాలకోసం వినియోగించుకోవడంలో నంద్యాల ఉప ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. నంద్యాలలో ఏబీవీ మకాం వేసి పెద్దసంఖ్యలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లను నియమించి టీడీపీకోసం సేవలందించినట్టు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంతో కూకట్‌పల్లిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్, టీడీపీ అభ్యర్థులకోసం సమీకరణలు చేయడం వంటి పనుల్లో ఇంటెలిజెన్స్ విభాగం పనిచేయడం వివాదాస్పదమైంది. తెలంగాణలో టీడీపీ అభ్యర్థుల తరఫున డబ్బులు పంచుతున్నారంటూ ఇంటెలిజెన్స్ సిబ్బందిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ డీజీపీ రంగంలోకి దిగి తమ వాళ్లు సమాచార సేకరణకు మాత్రమే వెళ్లారని, డబ్బులు పంచలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా ఇంటెలిజెన్స్ వాడకం.. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రత్యర్థులను దెబ్బతీసే చర్యల వరకు ఏబీవీ కీలకపాత్ర పోషిస్తూ ఇంటెలిజెన్స్‌ను ఎడాపెడా వాడేçస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అభ్యర్థులకోసం సర్వేలు, సమీకరణలు, ఏర్పాట్లలో ఇంటెలిజెన్స్‌ను వాడుకుంటున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను నీడలా వెంటాడుతున్న ఇంటెలిజెన్స్ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని వారిని అదును చూసి దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోందని గుర్తించిన చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తున్న తీరు మరింత వివాదాస్సదమైంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి మూడు నెలల ముందు నుంచే ఇచ్చిన దాదాపు 26 జీవో(బదిలీ ఉత్తర్వులు)లతో కావాల్సిన వారిని కావాల్సిన ప్రాంతాల్లో నింపేశారు. సొంత నియోజకవర్గం, సొంత మనుషులతో ప్రతీ జిల్లాలోనూ ఇంటెలిజెన్స్ డీఎస్పీ, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ, కీలక ప్రాంతాల్లోని శాంతిభద్రతల డీఎస్పీలను నియమించుకోవడంలో చక్రం తిప్పి ఇప్పుడు టీడీపీ సేవలో తరించేయడంలో డైరెక్షన్ ఇస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 256 మంది ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందిని క్షేత్రస్థాయిలో పనిచేయిస్తున్నారు. వారినుంచి వస్తున్న సమాచారాన్ని రాష్ట్ర రాజధాని ప్రాంతంతోపాటు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో 150 మంది క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించి రాజకీయ కోణంలోనే పనిచేయిస్తున్నారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. నిఘా వైఫల్యానికి మూల్యం.. మొత్తం నిఘా వ్యవస్థను పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు మళ్లించడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోర వైఫల్యం చెందాయి. రాష్ట్రంలో అలికిడి లేదనుకున్న మావోయిస్టులు మళ్లీ పంజా విసిరేవరకు నిఘా వ్యవస్థ గుర్తించలేకపోయింది. గతేడాది విశాఖ మన్యం అరకులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హత్య చేయడం, అనంతరం ఆగ్రహించిన గిరిజనులు అక్కడి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనల్లో నిఘా వైఫల్యం ప్రస్ఫుటమైంది. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల అనేక దుర్ఘటనలు చోటు చేసుకుని వందలాదిమంది అమాయకులు బలయ్యారు. రాజధాని కేంద్రంలో సంచలనం రేపిన కాల్‌మనీ సెక్స్ రాకెట్లో సొంత మనుషులను కాపాడుకునేందుకు మంత్రి, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఇంటెలిజెన్స్ సాయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించారని విమర్శలున్నాయి. ఇక ఇసుక దందా, నీరు–మట్టి, బెట్టింగ్ మాఫియా, ఫెర్రీ వద్ద బోటు బోల్తా వంటి అనేక ప్రధాన ఘటనల్లో ముందస్తుగా అప్రమత్తమై ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారమిచ్చి ఉంటే.. నష్ట నివారణ జరిగేదని పోలీసుశాఖలోనే పలువురు చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల బేరసారాల్లో కీలకపాత్ర రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్ని టీడీపీలోకి ఫిరాయించేలా బేరసారాలు నెరపడంలో ఏబీవీ కీలకపాత్ర వహించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ఫోన్లలో, నేరుగా ఇంటెలిజెన్స్ అధికారులతో మాట్లాడించి డీల్ కుదిర్చేవారన్న విమర్శలున్నాయి. టీడీపీ ప్రభుత్వానికి ఢోకా లేకుండా చేయడంలో, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో, ఇతర పైరవీలకోసం కోట్లాది రూపాయలతో రంగంలోకి దిగిన చంద్రబాబు మనుషులు నెరపిన రాజకీయ సమీకరణల్లో ఏబీవీ కీలకపాత్ర పోషించినట్టు విమర్శలు వచ్చాయి. ఆయన చెప్పిందే వేదం: పోలీసు శాఖలో సీఐ, డీఎస్పీ నుంచి డీజీపీ పోస్టింగ్ వరకు ఆయన చెప్పిందే చంద్రబాబు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనమే కారణమని చెబుతున్నారు. గత డీజీపీ నండూరి సాంబశివరావుకు రెండేళ్లు ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవడంలోనూ, ఆ తరువాత అనేక పోస్టింగ్‌ల్లోనూ ఏబీవీ జోక్యం అప్పట్లో వివాదాస్పదమైంది. కొద్ది నెలలక్రితం గౌతమ్ సవాంగ్‌కు డీజీపీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వగా.. చివరి నిమిషంలో సీఎం తనయుడు, మంత్రి లోకేశ్‌తో ఒత్తిడి చేయించి ఠాకూర్‌కు దక్కేలా చేయడంలో ఏబీవీ పోషించిన పాత్ర పోలీసు శాఖలోనే చర్చనీయాంశమైంది. నిబంధనను కచ్చితంగా అమలు చేసే ఐపీఎస్ అధికారిగా పేరున్న సవాంగ్‌ను డీజీపీగా చేస్తే ఎన్నికలప్పుడు తమ మాట వినరంటూ ఏబీవీ నేరుగా సీఎంపై ఒత్తిడి తెచ్చినట్టు సీనియర్ ఐపీఎస్‌లు చర్చించుకోవడం గమనార్హం. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఏబీవీ జోక్యం ఏ స్థాయిలో ఉందో ఇటీవల విజయవాడలో జరిగిన సభలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు అద్దంపట్టాయి. దేవినేని అవినాష్‌కు తెలుగు యువత అధ్యక్షుడి పదవికోసం తాను, గద్దె రామ్మోహన్.. ఏబీవీని కలసి సీఎంకు చెప్పాలని కోరామన్న బుద్దా వ్యాఖ్యలు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ కార్యాలయంగా ఇంటెలిజెన్స్ కార్యాలయం.. ఏబీవీ నేతృత్వంలో ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం టీడీపీ కార్యాలయంగా మారిపోయిందన్న విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిఘా విధులు నిర్వర్తించాల్సిన ఆ కార్యాలయం నిత్యం టీడీపీ నేతలు, కార్యకర్తలతో కిటకిటలాడుతుండడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చడంకోసం ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఎల్లో నెట్‌వర్క్‌గా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీఎం ఆఫీసు, ఇంటెలిజెన్స్ మధ్య రిటైర్డ్ పోలీసు అధికారి, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ యోగానంద్ సమన్వయం చేసుకుంటున్నట్టు సమాచారం. అటు సీఎం ఆఫీసు, ఇటు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే సమాచారంతో డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల డీఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ పోలీసు యంత్రాంగా న్ని నడిపిస్తున్నట్టు పోలీసుశాఖలో చర్చ సాగుతోంది. ఈ కీలక అధికారులు జిల్లాలవారీగా తమ వారితో అనధికార వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు టీడీపీకోసం ఏమి చేయాలో డైరెక్షన్ ఇస్తున్నట్టు ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఓఎస్డీలుగా రిటైరైన అధికారుల నియామకం ఇంటెలిజెన్స్‌ను ఐఎస్‌డబ్ల్యూ, ఎస్ఐవీ, సీఐ, పీఐ వంటి నాలుగు విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి డీఐజీ లేదా ఐజీ స్థాయి అధికారితోపాటు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు పర్యవేక్షిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో బి.శ్రీనివాసులనే ఒక్క ఐజీ తప్ప మిగతా విభాగాలకు డీఐజీగానీ, ఐజీ స్థాయి అధికారిగానీ లేరు. రాష్ట్ర భద్రతపై నిరంతర నిఘా ఉంచాల్సిన ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీ, డీఐజీ స్థాయి పోస్టులను ఖాళీగా ఉంచి పదవీ విరమణ చేసిన ఐజీ యోగానంద్, డీఐజీ రామకృష్ణ, అడిషనల్ ఎస్పీ మాధవరావులను ఓఎస్డీలుగా నియమించుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
సీఈసీ ఆదేశాలు బేఖాతరు
సాక్షి, అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు మంగళవారం జీవో (నంబర్ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నం బరు 720 జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉన్నతా ధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించి మరీ.. ఇంత బాహాటంగా ఒక అధికారిని వెనకేసుకు రావాల్సిన అవసరం ఏముం దనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారుల మాదిరి కాకుండా, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ టీడీపీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల ఎస్పీలు ఎ.వెంకటరత్నం, రాహుల్ దేవ్ శర్మను తక్షణమే బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయాలని, వారిని ఎలాంటి ఎన్నికల విధులకు వినియోగించరాదని సీఈసీ ఆదేశించింది. దీంతో తక్షణమే తదుపరి సీనియర్లకు బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తప్పుకుని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆ ముగ్గుర్నీ ఆదేశించారు ఈ మేరకు బదిలీ ఉత్తర్వులు (జీవో నెంబరు 716) జారీ చేశారు. అయితే ఈసీ ఆదేశాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడుపడలేదు. ఎన్నికల ప్రక్రియలో టీడీపీ తరఫున అన్నీ తానై వ్యవహరిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావును తప్పిస్తే ఎన్నికల్లో తనకు చాలా ఇబ్బంది కలుగుతుందని చంద్రబాబు భావించారు. ఏం చేయాలనే దానిపై చర్చోపచర్చలు జరిపారు. అప్పటికే బదిలీ ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ పరువు పోయినా సరే.. వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను మాత్రం రద్దు చేయాలని, ఆయనను అదే పదవిలో కొనసాగించాలని ముఖ్యమంత్రి హోదాలో అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గిన సీఎస్.. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని రద్దు చేసి, మిగిలిన ఇద్దరు ఎస్పీల బదిలీలను కొనసాగిస్తున్నట్లుగా పేర్కొంటూ బుధవారం జీవో (నంబరు 720) జారీ చేశారు. కొత్త వ్యూహం .. కొత్త జీవో ఇంటెలిజెన్స్ డీజీకి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని, ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారనే కొత్త వాదనను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. డీజీపీతో, టీడీపీకి చెందిన కొందరు న్యాయవాదులతో మంగళవారం రాత్రి సుదీర్ఘ చర్చలు జరిపిన ముఖ్యమంత్రి సీఈసీ ఆదేశాలను కోర్టులో సవాల్ చేయించారు. తమ వాదనను బలపర్చుకోవడం కోసం..అప్పటికప్పుడు వ్యూహరచన చేసి పలానా పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో భాగస్వాములవుతారని, సీఈసీ అజమాయిషీలోకి వస్తారంటూ బుధవారం జీవో నంబరు 721 జారీ చేయించారు. ఈ జీవోలో ఇంటెలిజెన్స్ విభాగం ప్రస్తావన లేకుండా చూశారు. అంటే ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ద్వారా కొత్త భాష్యం చెప్పిందన్నమాట. ‘ఎవరెవరు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారు? ఎవరు ఎన్నికల విధుల నిర్వహణ కింద ఉంటారనే జీవో ఇంతకాలం ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల నిబంధనావళి ఈనెల పదో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్నోసార్లు సాధారణ ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికల నిబంధనలు వచ్చిన వెంటనే గానీ, ముందుగానీ జీవో ఇవ్వని సర్కారు.. ఇప్పుడు ఐబీ చీఫ్ వెంకటేశ్వరరావును ఆ బాధ్యతల నుంచి తప్పించాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసిన తర్వాతే ఎందుకు ఇచ్చినట్లు? ఇది ఉద్దేశపూర్వక చర్యే..’ అని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ విషయం సీఈసీకి తెలియదా? ‘‘ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టరుకు అటాచ్ చేయాలని, ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించిన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు.. ఆయన ఎన్నికల పరిధిలోకి వస్తారా? రారా? అనే విషయం తెలియదా? ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్, సీఎస్ పునేఠకు తెలిసిన మేరకు ఎన్నికల నిబంధనావళి సీఈసీకి తెలియదా? అసలు వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే మంగళవారం ఆయన్ను రిలీవ్ చేస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేసింది? జీవో ఇచ్చిందంటే సీఈసీ ఆదేశాలు పాటించాల్సిందేనని అనుకున్నట్టే కదా? తెల్లారేసరికల్లా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారో, సీఈసీ ఆదేశాలను ఎందుకు ధిక్కరించారో ప్రజలందరికీ తెలిసిపోతూనే ఉంది..’ అని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అప్పుడలా .. ఇప్పుడిలా..! ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పోలీస్ బాస్ (డీజీపీ) ఎస్ఎస్పీ యాదవ్‌ను తప్పించాలని ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీందో కమిషన్ ఆయనను తప్పించి ఏకే మహంతికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. తక్షణమే అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ మేరకు జీవో జారీ చేసింది. అలాంటిది.. ఇప్పుడు చంద్రబాబు తమ పరిధిలోకి రానివారిని ఎన్నికల కమిషన్ ఎలా బదిలీ చేస్తుందనే వాదన తేవడం విచిత్రం. ఎన్నికల విధుల్లో ఉన్న వారినే కాదు. ఎన్నికలను ప్రభావితం చేసే, ఏకపక్షంగా వ్యవహరించే ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు అటెండర్ వరకూ) తొలగించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది..’ అని మరో సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు. డీజీపీ, సీఎస్ ఇద్దరూ ఇరుక్కుంటారు ‘సీఎస్ పునేఠ ఎన్నికల కమిషన్ ఆదేశాలను తు.చ. పాటిస్తూ మంగళవారం ముగ్గురు పోలీసు అధికారులను విధుల నుంచి తప్పించి బదిలీ చేస్తూ జీవో 716 ఇచ్చారు. కానీ చంద్రబాబు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ‘ఎన్నికల విధుల్లో ఎవరెవరు ఉంటారో డీజీపీ నోట్ పంపుతారు. దాని ప్రకారం జీవో జారీచేసి ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ ఉత్తర్వులను రద్దు చేయాలి’ అని కరాఖండిగా చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో సీఎస్ జీవో ఇచ్చారు. దీనివల్ల డీజీపీ, సీఎస్ ఇద్దరూ ఇరుక్కోక తప్పుదు. ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వారి సర్వీసులో ఇది రిమార్కుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది’ అని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానించారు. గతంలో విశాఖపట్నం కలెక్టరుగా ఉన్న సమయంలో తమకు చెప్పకుండా ఉద్యోగులను బదిలీ చేశారనే ఆగ్రహంతో ప్రవీణ్ ప్రకాష్‌ను ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల నుంచి తప్పించిన విషయం గమనార్హం. ఆయనపై ఇప్పటికీ ఆ మచ్చపోలేదని మరో అధికారి గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అటెండరు వరకూ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారని ఆయన స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించాకే సీఈసీ చర్య ఏబీ వెంకటేశ్వరరావుకు పచ్చ చొక్కాపై పోలీసు యూనిఫామ్ వేసుకున్న అధికారి అనే పేరుంది. ‘టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నానంటూ నాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు అక్కసు వెళ్లగక్కుతున్నారు. మీరు ప్రభుత్వానికి అనుకూలంగా నేను చెప్పే ఆదేశాలను పాటించాలి...’ అని జిల్లా ఎస్పీలు, కలెక్టర్ల సదస్సులోనే ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఆయన టీడీపీ నాయకుడిలా పనిచేస్తున్నారని రాష్ట్రంలో ప్రతి అధికారికీ తెలుసు. ఎన్నికల హడావుడి మొదలయ్యాక అది మరింత తీవ్రమయ్యింది. చాలామందితో చర్చలు సాగించి టీడీపీలో చేర్పించారని, కొందరు నాయకులను టీడీపీకి మద్దతు ఇవ్వాలంటూ బెదిరించారని తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు ఉన్నాయి. తన కార్యాలయాన్ని టీడీపీ ఆఫీసుగా మార్చేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పార్టీ సమర్పించిన సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి, ఆయన తప్పు చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తప్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీనిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. జీవో రద్దు చేయడం తప్పు ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా రద్దు చేయడం సమంజసం కాదు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు దాని అనుమతి తీసుకోకుండా బదిలీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం తొందరపాటు చర్య అవుతుంది. ఎన్నికల విధుల్లో ఎవరెవరు ఉంటారు? ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఏయే పోలీసు అధికారులు వస్తారనే అంశంపై ముందుగా జీవో ఇస్తే ఇవ్వవచ్చు. అయితే ముగ్గురు అధికారులను బాధ్యతల నుంచి తప్పించి డీజీపీకి అటాచ్ చేయాలని ఆదేశాలు జారీ అయిన తర్వాత ఇలా ఎన్నికల విధులపై జీవో ఇవ్వడం సరికాదనేది నా అభిప్రాయం. జీవో ఇచ్చిన సమయం కూడా అనుమానాలకు తావిస్తోంది. – ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
‘ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరుబోతు’
సాక్షి, చీరాల: తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్ చేసి, వారిని రాజకీయంగా వాడుకోవడం సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని చీరాల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్నారని ఆరోపించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఒక పొగరుబోతు అని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎదురుగా ఉన్నా సిగరెట్ తాగుతూ పోజులు కొట్టేవాడని విమర్శించారు. చంద్రబాబు అండతో ఏబీ వెంకటేశ్వరరావు చేయని అరాచకాలు లేవని అన్నారు. వెంకటేశ్వరావును ఈసీ బదిలీ చేస్తే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. వెంకటేశ్వరరావుపై లోతుగా విచారణ జరిపితే లక్ష కేసులు పెట్ట వచ్చన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పైకి బుద్ధి మంతుడిలా చంద్రబాబు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నిజాయితీగా ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలుద్దామనుకోవడం ఓటమితో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చీరాలలో ఎవరు భయపడేది లేదన్నారు. -
ఈసీకి ఇంగిత జ్ఞానం లేదు: జూపూడి
న్యూఢిల్లీ : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో టీడీపీ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్‌కు కనీస ఇంగిత జ్ఞానం, పరిజ్ఞానం, నియమ నిబంధనలు తెలియవంటూ ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులపై బదిలీ వేటును ప్రశ్నిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి ఢిల్లీకి తీసుకెళ్లిన జూపూడి మీడియాతో మాట్లాడుతూ ఈసీపై ఫైర్ అయ్యారు. ఒక పార్టీ ఫిర్యాదు చేస్తే కనీసం పరిశీలించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు రక్షణ బాధ్యతలు చూసుకునే ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లును ఎలా బదిలీ చేస్తారన్నారు. అసలు ఆయనపై చర్యలు తీసుకునే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని, ఇంటలిజెన్స్ చీఫ్ ఎన్నికల పరిధిలోకే రాడన్నారు. చంద్రబాబుకు ముప్పు ఉందని, ఆయన జెడ్ కేటగిరి సంరక్షణలో ఉన్నారని తెలిపారు. అలాంటి సీఎం భద్రతను చూసే అధికారిపై వేటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక ‘ఏబీ’ని కాపాడేందుకు ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం హడావుడిగా వివాదాస్పద జీవో జారీచేసింది. -
ఈసీకి ఎదురుతిరిగిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సహా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు సర్కారు బుధవారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రభుత్వం వివాదాస్పద జీవో జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని సీఈసీ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకూ సీఈసీ పరిధిలోకి తెచ్చింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేవరకూ పోలీసు యంత్రాంగం సీఈసీ పరిధిలో పనిచేయనుంది. అయితే ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈసీ పరిధిలోకి ఎవరు వస్తారనే దానిపై జీవో 721 జారీ చేసింది. సీఈసీ ఆదేశాలతో వెంకటేశ్వరరావుతో పాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంలను రిలీవ్ చేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 విడుదల చేసింది. తెల్లారేసరికి ప్లేటు మార్చిన టీడీపీ ప్రభుత్వం.. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారని మెలిక పెట్టింది. నిన్నటి జీవోను రద్దు చేస్తూ నేడు వివాదాస్పద జీవో 720 జారీ చేసింది. ఇవాళ్టి జీవోలో వెంకటేశ్వరరావు పేరును తప్పించింది. ఆయనను రిలీవ్ చేయడం లేదని.. వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను మాత్రమే రిలీవ్ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. ఈసీ పరిధిలో లేకుండా వెంకటేశ్వరరావును తప్పించేందుకు ఏపీ ప్రభుత్వం చివరివరకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతోంది. 24 గంటల వ్యవధిలో మూడు జీవోలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మార్చే హక్కు ఈసీకి లేదని పిటిషన్లో పేర్కొంది. ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ కూడా రాశారు. (చదవండి: ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) -
డీజీపీని కూడా మార్చాలి: వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ ఎందుకు గగ్గోలు పెడుతుందో అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకుందని, సొంత ప్రయోజనాల కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కూడా పక్కన పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే విషయంపై మరోసారి ఈసీని కలవబోతున్నట్లు ఆయన తెలిపారు. చదవండి...(ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) ఇంటెలిజెన్స్ శాఖ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నవారి సమాచారాన్ని సేకరిస్తోందని, మరోవైపు వైఎస్సార్ సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు తప్పుడు పనులకు డీజీపీ, ఏబీ వెంకటేశ్వరరావు కొమ్ము కాస్తున్నారన్నారు. అదృష్టవశాత్తూ ఎన్నికల కమిషన్ తమ గోడు విందని, ఏబీ వెంకటేశ్వరరావుపై వేటును స్వాగతిస్తున్నామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వెనుక ఇంటెలిజెన్స్ చీఫ్ పాత్ర ఉందని, చీకటి చక్రవర్తి తయారు చేసినట్లు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ తయారైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని, ఇందుకోసం 20మంది హ్యాకర్లను నియమించుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లి మరీ ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారన్నారు. వ్యక్తుల ప్రయివేట్ జీవితాల్లోకి చొరబడుతున్నారని ఆయన మండిప్డడారు. ఈసీ తీసుకున్న చిన్న చర్యకు కూడా టీడీపీ గగ్గోలు పెడుతోందని, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు, ఎన్నికలకు ఏం సంబంధం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశామని, టీడీపీ వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదన్నారు. కోర్టులో టీడీపీ వాదనలు నిలబడవని, ఇంటెలిజెన్స్ ఐజీ తన పరిధి దాటి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నారు. ఇక తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని, దీనిపై హైకోర్టులో కేసు వేసినట్లు ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్ కాగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీకి చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, 13మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, కౌంటర్ ఇంజెలిజెన్స్ ఎస్పీ భాస్కర్ భూషన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు సమర్పించారు. మరోవైపు ఎన్నికల కమిషన్ వేటు వేసిన ముగ్గురు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇక ఈసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..కేంద్ర ఎన్నికల సంఘానికి ఏడు పేజీల లేఖ రాశారు. -
ఆ విషయం చంద్రబాబుకు బాగా తెలుసు: ఎస్వీ
సాక్షి, కర్నూలు : అధికారులతో పాటు, వ్యవస్థలను వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉన్నతస్థాయిలో ప్రమోట్ చేసి వారిని రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. ఎస్వీ మోహన్ రెడ్డి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారన్నారు. ఆయన దృష్టి అంతా మొత్తం రాజకీయంపై ఉండేదని, అందుకు సంబంధించిన విషయాలను వెంకటేశ్వరరావు ప్రతిరోజు చంద్రబాబుకు వివరించేవారన్నారు. ప్రభుత్వ పనితీరు, శాంతిభద్రతలపై కన్నా రాజకీయంగానే ఎక్కువ ఆసక్తి చూపించేవారని ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలి, పార్టీలో ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలని నిర్ణయించేది వెంకటేశ్వరరావేనని అన్నారు. అధికారులను టీడీపీ ఏవిధంగా మభ్యపెడుతుందో అందరికీ తెలుసునని అన్నారు. పోలీస్ శాఖను వాడుకుని ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలనుకుంటున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కాగా ఇంటెలిజెన్స్ ఐజీ విధుల నుంచి ఏబీ వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే. చదవండి....(ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) మరోవైపు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో అధికారుల బదిలీ అన్నది సాధారణ అంశమే. ఇప్పుడే కాదు.. ఏ ఎన్నికల సమయంలోనైనా ఈసీ తన అధికారాలను ఉపయోగించుకుంటుంది. 2009 ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఎస్ఎస్పీ యాదవ్‌ను ఈసీ బదిలీ చేసింది. నాడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఎస్ఎస్పీ యాదవ్‌పై ఫిర్యాదు చేయడంతో ఆ వెంటనే ఈసీ బదిలీ చేసింది. ఇక ఇటీవల తెలంగాణ ఎన్నికల్లోనూ వికారాబాద్ ఎస్పీగా ఉన్న అన్నపూర్ణను బదిలీ చేసింది ఈసీ. రేవంత్ అరెస్ట్ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో వికారాబాద్ ఎస్పీని బదిలీ చేసింది ఈసీ. -
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బత్తిన?
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బత్తిన శ్రీనివాసులు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి వేటు వేయడంతో ఆయన స్థానంలో తక్షణం మరొకరికి బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది. దీంతో డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఆత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ డీజీతో సహా వైఎస్సార్ కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్ దేవ్ శర్మ, వెంకటరత్నం స్థానాల్లో తక్షణం ఎవరిని నియమించాలనే విషయమై అత్యవసర భేటీలో చర్చ జరిగిందని సమాచారం. చదవండి....(ఇంటెలిజెన్స్ డీజీపై వేటు) ప్రస్తుతం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారుల సీనియారిటీ తదితరాలను పరిశీలించిన నేపథ్యంలో ఎస్ఐబీ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బత్తిన శ్రీనివాసులును...ఏబీ వెంకటేశ్వరరావు స్థానంలో నియమించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. వాస్తవంగా ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నవారిలో సీనియార్టీ ప్రకారం జయలక్ష్మి ఉన్నప్పటికీ అన్ని విభాగాలను కలిపితే శ్రీనివాసులు సీనియర్ అవుతారు. గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన అనుభం కూడా ఉన్నందున ఆయన ఎంపికయ్యే అవకాశం ఉంది. ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఆయనను పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. -
ఇంటెలిజెన్స్ డీజీపై వేటు
సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో అధికార టీడీపీ సేవలో తరిస్తూ, విధి నిర్వహణలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. ఆయనతోపాటు వైఎస్సార్, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌దేవ్ శర్మ, వెంకటరత్నంలను కూడా బదిలీ చేసింది. సీఎం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులు పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. తాజాగా సోమవారం వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్‌బెంచ్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా పరికరాలను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వేటు పడిన ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు రిపోర్టు చేయాలని ముగ్గురు అధికారులకు స్పష్టం చేసింది. సర్వం టీడీపీ సేవలోనే... ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడంతో అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న ఏఆర్ అనూరాధను అకస్మాత్తుగా విధుల నుంచి తప్పించారు. ఆమెను హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బదిలీ చేసి, విజయవాడ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆయన తన విధులను పక్కనపెట్టి, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. నక్సలైట్లు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తుల కదలికలను కనిపెట్టడానికి ఉపయోగించాల్సిన సాంకేతిక పరికరాలను ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి వాడుకుంటున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొచ్చేలా పార్టీ ఫిరాయింపులకు ఆయన బేరసారాలు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని, టీడీపీ కోసం సేవలు అందించేలా చేశారనే విమర్శలు ఉన్నాయి. పదవీ విరమణ చేసిన యోగానంద్, మాధవరావు వంటి అధికారులను ఇంటెలిజెన్స్ ఓఎస్డీలుగా నియమించుకుని, కుల సమీకరణలకు తెరలేపారంటూ విమర్శలు వచ్చాయి. పలు కీలక అంశాల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం వేటు వేయడం గమనార్హం. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో వైఫల్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో విఫలమైన వైఎస్సార్ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మపై కూడా ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న వివేకానందరెడ్డి ఎన్నికల ముందు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం జోలికి పోకుండా పోలీసులు దర్యాప్తును తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ చీఫ్ జోక్యం కారణంగా వైఎస్సార్సీపీపై, వైఎస్ కుటుంబ సభ్యులపై నెపం నెట్టే ప్రయత్నాలు జరిగాయి. పోలీసులు ఇదే దిశగా దర్యాప్తు చేపట్టి, అసలు కుట్ర కోణాన్ని వదిలేయడం పట్ల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ రాహుల్‌దేవ్ వర్మపై వేటు వేసిన ఎన్నికల కమిషన్ ఆయనను పోలీస్ ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రూ.5 కోట్లు వదిలేసినందుకే.. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం అధికార టీడీపీకి కొమ్ము కాస్తున్నారనే ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ ఆయనపై వేటేసింది. కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి వాహనంలో తీసుకెళ్తున్న రూ.5 కోట్లను తనిఖీల సందర్భంగా అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశాలతో ఆ డబ్బును వదిలేశారనే ఫిర్యాదుతో ఎస్పీ వెంకటరత్నంపై ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు సమాచారం. నాన్‌కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందిన వెంకటరత్నంను ఇటీవలే శ్రీకాకుళం ఎస్పీగా నియమించారు. డీజీపీ అత్యవసర సమావేశం రాష్ట్రంలో ముగ్గురు పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన నేపథ్యంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఆ ముగ్గురు అధికారుల స్థానాల్లో ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జన సాగినట్టు సమాచారం. -
బిగ్ బ్రేకింగ్: ఈసీ సంచలన నిర్ణయం
ఢిల్లీ: ఏపీ ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించింది. పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించింది. వారి స్థానాల్లో తదుపరి సీనియర్ అధికారులకు బాధ్యతలను అప్పగించాలని తెలిపింది. పోలీస్ వ్యవస్థలో కీలక అధికారులుగా ఉన్న వీరు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా తెలుగుదేశం కార్యకర్తల్లా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా పనిచేస్తుండటంతో ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వర రావు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, పలు దఫాలుగా వైఎస్సార్సీపీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. -
పచ్చ జెండా ఎత్తిన పోలీసు బాసులు!
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కదలికలను నిశితంగా గమనించండి.. ఓటర్లకు టీడీపీ డబ్బులు తప్ప వైఎస్సార్సీపీ సొమ్ము చేరకుండా అడ్డుకోండి.. ఏదేమైనా ఈసారికి టీడీపీ అధికారంలోకి వచ్చేలా చూడాలి..’ ఇదేదో టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో చెప్పిన మాటలు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు తమ సిబ్బందికిస్తున్న ఫోన్ ఆదేశాలివీ.. టీడీపీ జెండాను భుజానికెత్తుకున్న కొందరు పోలీసు అధికారులు గడిచిన రెండు రోజులుగా జిల్లాలవారీగా ఫోన్లలో చెబుతున్న మాటలు విని పోలీసులే విస్తుపోతున్నారు. చంద్రబాబు సేవలో కొందరు పోలీసు బాసులు ఈ రీతిలో తరించిపోతుండడం పట్ల సాధారణ పోలీసుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. పచ్చ చొక్కాలు వేసుకుని కొందరు పనిచేస్తుండంతో పోలీసు శాఖకే మాయని మచ్చగా మారిందని, మునుపెన్నడూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదని ఒక రిటైర్డ్ పోలీస్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సేవలో.. రాష్ట్రంలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోందని గుర్తించిన చంద్రబాబు తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తూ.. ఇందుకోసం పోలీసు శాఖను పెద్ద ఎత్తున తన సొంత ప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పలు విభాగాల్లో కీలకంగా పనిచేస్తున్న పోలీసు బాసులు ఇందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆ మేరకు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి మూడు నెలల ముందునుంచే ఇచ్చిన దాదాపు 26 డీవో(బదిలీ ఉత్తర్వులు)లతో కావాల్సిన వారిని కావాల్సిన ప్రాంతాల్లో నింపేశారు. ప్రతీ జిల్లాలోనూ ఇంటెలిజెన్స్ డీఎస్పీ, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ, కీలక ప్రాంతాల్లోని శాంతిభద్రతల డీఎస్పీలను నియమించుకోవడంలో చక్రం తిప్పిన నలుగురు రాష్ట్రస్థాయి కీలక అధికారులు ఇప్పుడు టీడీపీ సేవలో తరించడంలో డైరెక్షన్ ఇస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ నియోజక వర్గాల్లోని వైఎస్సార్సీపీ అభ్యర్థుల వెంట ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ను నీడలా వెంటాడే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కదలికలను పసిగట్టడం, అక్కడి సమీకరణలు, ప్రచారం తదితర విషయాలను వారు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే ఈ సమాచారాన్ని ఆసరాగా తీసుకుని వైఎస్సార్సీపీ అభ్యర్థులను దెబ్బతీసేలా కుయుక్తులు పన్నుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కట్టుదిట్టమైన నెట్వర్క్.. ఇప్పటికే వివాదాస్పదమైన డీజీపీ ఆర్పీ ఠాకూర్ నేరుగా ఎన్నికల విధుల్లో కనిపించకుండా ప్రభుత్వ పెద్దలు, ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్న ఆదేశాల మేరకు పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలవారీగా సీఎం సొంత సామాజికవర్గం, సొంత మనుషులతో ఏర్పాటు చేసుకున్న పోలీస్ నెట్‌వర్క్‌ను ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సమన్వయం చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం ఆఫీసు, ఇంటెలిజెన్స్ మధ్య రిటైర్డ్ పోలీసు అధికారి, ఇంటెలిజెన్స్ ఓఎస్డీ యోగానంద్ సమన్వయం చేసుకుంటున్నట్టు సమాచారం. అటు సీఎం ఆఫీసు, ఇటు ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే సమాచారంతో డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల డీఐజీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నట్టు పోలీసు శాఖలో చర్చ సాగుతోంది. ఈ కీలక అధికారులు జిల్లాలవారీగా తమ వారితో అనధికార వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు టీడీపీకోసం ఏమి చేయాలో డైరెక్షన్ ఇస్తున్నట్టు ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. జరుగుతున్నదిదీ.. గత ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా రంగంలోకి దిగిన బడా పారిశ్రామికవేత్తలు జిల్లాలవారీగా బాధ్యతలు తీసుకుని డబ్బు మూటలను అంబులెన్సుల ద్వారా అసెంబ్లీ నియోజక వర్గాలకు తరలించినట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కొందరు పోలీసుల అండతో వారి వాహనాల్లోనే దర్జాగా తరలిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. టీడీప తరపున ఏపీ పోలీసులు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలతో అక్కడి పోలీసులు ఏపీకి చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. మా వాళ్లు డబ్బులు పంపిణీకి వెళ్లలేదని, విధి నిర్వహణలో భాగంగానే వెళ్లారంటూ అప్పట్లో ఏపీ డీజీపీ ఠాకుర్ ఖండించారు. ఏది ఏమైనా అప్పట్లో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసుల తీరు వివాదాస్పదమైంది. ప్రస్తుతం లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొందరు పోలీసులు పూర్తిగా టీడీపీ సేవలో తరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు డబ్బు చేరవేతతోపాటు టీడీపీ డబ్బు పంపిణీ సజావుగా జరిగేలా సహకరించాలనే సంకేతాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వైఎస్సార్సీపీకి చెందిన అభ్యర్థుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలని మౌఖిక ఆదేశాలిచ్చినట్టు సమాచారం. వైఎస్సార్సీపీ శ్రేణులను బైండోవర్, కేసులు, బెదిరింపులతో కట్టడి చేయాలని కూడా ఆదేశాలందినట్టు తెలిసింది. ఇలా డబ్బు పంపిణీతోపాటు అన్ని విషయాల్లోనూ పోలీసు మార్కు ఎత్తుగడ టీడీపీకి అనుకూలిస్తే గెలవచ్చన్నది అధికార పార్టీ ఎత్తుగడగా చెబుతున్నారు. టీడీపీ సేవలో ఇలా.. - శ్రీకాకుళం జిల్లా రాజాం టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీకి చెందిన వాహనంలో నోట్ల కట్లలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా పోలీస్ కీలక అధికారి ఆదేశాలతో వదిలేసినట్టు సమాచారం. - చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీ అభ్యర్థికోసం ఏకంగా ఒక సీఐ కారులో కోట్లాది రూపాయలు తరలించిన విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా సర్దేసినట్టు తెలిసింది. - గుంటూరు జిల్లాలోని ఒక డీఎస్పీ టీడీపీ ప్రచార ఏర్పాట్ల నుంచి అన్నీ తానై చూసుకుంటున్నారు. - రాయలసీమలోని ఒక డీఎస్పీ టీడీపీ యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. ఆయనకు పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఒక అధికారి డైరెక్షన్ ఇస్తున్నట్టు సమాచారం. - మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడైన విశాఖపట్నం డీఎస్పీ టీడీపీ కోసం చురుకుగా సేవలందిస్తున్నారు. - విజయవాడలోని ఒక ఏసీపీ అధికారపార్టీకి చెందిన డబ్బు చేరవేత నుంచి అన్నీ తానై సహకారమందిస్తున్నట్టు విమర్శలున్నాయి. - ప్రకాశం జిల్లాలోని ఒక డీఎస్పీ టీడీపీ అభ్యర్థులకు అవసరమైన సేవలందిస్తున్నట్టు చెబుతున్నారు ఎన్నికల కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులపై క్లీన్చిట్.. రాష్ట్రంలో జిల్లాలవారీగా పోలీసులపై పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు తెలిసింది. చిత్రమేమిటంటే పోలీసులపై రోజుకు 20 నుంచి 25కుపైగా ఫిర్యాదులు ఈసీకి వస్తుంటే ఆయా పోలీసులకు రాష్ట్ర పోలీసు అధికారులు మాత్రం క్లీన్చిట్ ఇస్తుండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు సక్రమంగా, స్వేచ్ఛగా జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను మార్చాల్సిన అవసరముందని ఈసీని ప్రజలు, ప్రతిపక్షాలు కోరుతున్నాయి. -
ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్
అమరావతి: ఏపీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ కల్పించింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తోన్న ఏబీ వెంకటేశ్వరరావు, రైల్వేస్(ఏపీ) చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్న కేఆర్ఎం కిషోర్ కుమార్, విజయవాడ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిరుమల రావులకు డీజీపీ స్థాయి హోదాను కల్పించింది. ప్రమోషన్ వచ్చిన ఈ ముగ్గురు ఐపీఎస్‌లు కూడా 1989 బ్యాచ్‌కు చెందినవారే. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ హోదాలో వీరికి రూ.205400 నుంచి 224400 మధ్య వేతనం లభిస్తుంది. -
ముఖ్యమంత్రి ప్రమేయం లేదు : డీజీపీ
సాక్షి, అమరావతి : డీఎస్పీల బదిలీ వ్యవహారం నిలిచిపోవడంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బదిలీల వ్యవహారంతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. తన కంటే ఇంటిలిజెన్స్ చీఫ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారడం అవాస్తవమని పేర్కొన్నారు. డీఎస్పీల బదిలీలపై పీఈబీ చర్చిస్తోందని వెల్లడించారు. అందులో ఇంటిలిజెన్స్ చీఫ్ కూడా సభ్యులుగా ఉంటారని చెప్పారు. బదిలీ విషయంలో తాను చంద్రబాబు వద్ద అసంతృప్తి వ్యక్తం చేశాననటం అవాస్తవమని చెప్పారు. కాగా, ఏపీలో 24 మంది డీఎస్పీల బదిలీల విషయంలో ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు జోక్యం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. -
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు చీఫ్‌ల వార్..!!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో బిగ్‌బాస్‌ల మధ్య బిగ్‌వార్ నడుస్తోంది. దీంతో రాష్ట్రంలో 24 మంది డీఎస్పీల బదిలీలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతుతో ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని సమాచారం. దీంతో డీజీపీ మాలకొండయ్య, వెంకటేశ్వర రావు మధ్య వివాదం నెలకొంది. రాజకీయ కోణంలో బదిలీలకు సీఎం చంద్రబాబు ఒత్తిడి చేయడంతో డీజీపీ మాలకొండయ్య గత నెల 29న 24 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. తమకు కావాలసిన అధికారులను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల మేరకే ఏబీ వెంకటేశ్వర రావు బదిలీల లిస్ట్‌ను తయారుగా చేయగా, మాలకొండయ్య ప్రతిభ ఆధారంగా బదిలీలకు మరో లిస్ట్‌ను తయారు చేశారు. కానీ, సీఎం ఒత్తిళ్లతో ఇంటిలిజెన్స్ చీఫ్ తయారు చేసిన లిస్ట్ ఆధారంగా బదిలీలు చేశారు. ఆ తర్వాత డీజీపీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇతర కీలక నిర్ణయాల్లోనూ డీజీపీ పాత్ర అలంకార ప్రాయంగానే ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతానికి బదిలీలను నిలిపివేశారు. -
సీపీ బదిలీ
కొత్త కమిషనర్‌గా గౌతమ్ సవాంగ్ బెజవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కమిషనర్‌గా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సీపీ బదిలీ విషయాన్ని గతనెల 12నే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంటెలిజెన్స్‌కు సీపీ బదిలీ విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. కొత్త పోలీసు కమిషనర్‌గా ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ దామోదర్ గౌతమ్ సవాంగ్ రానున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు కోట్లు కేసులో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఎ.బి.వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించినట్లు చెపుతున్నారు. గత నెల రోజులుగా ఆయన బదిలీపై ప్రచారం జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఈ నెల మూడో తేదీతో కోడ్ ముగియడంతో సోమవారం సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీల్లో భాగంగానే ఎ.బి.వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. గత ఏడాది ఆగస్టు ఎనిమిదిన పోలీసు కమిషనర్‌గా అదనపు డీజీ హోదాలో ఆయన విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. 11 నెలల వ్యవధిలో ఆయన తీసుకున్న పలు నిర్ణయాలను ప్రజలు ప్రశంసించగా, మరికొన్ని నిర్ణయాలు ప్రజలు, పొలిటికల్ వర్గాల్లో అసంతృప్తికి దారితీశాయి. ఆటంకాలను అధిగమిస్తూ ప్రభుత్వం వద్దనున్న పలుకుబడి ఉపయోగించి కమిషనరేట్‌లో పలు కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నిధుల లేమిని దృష్టిలో ఉంచుకొని నగర ప్రముఖులను భాగస్వాములను చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సోమవారం పటమట టీచర్స్ కాలనీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. దేశంలోనే అతిపెద్ద అమరావతి పోలీసు కమిషనరేట్‌కు ఎ.బి.వెంకటేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. సంపూర్ణ సహకారం : సీపీ నగర పోలీసు వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ సహకారం లభించిందని సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు తెలిపారు. అందరి సహకారంతో చేయాలనుకున్న అన్నింటిని అమలు చేసినట్లు చెప్పారు. మరికొన్ని మధ్యలో ఉంటే, కొన్ని పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
'మత్తయ్య నిందితుడని తెలియదు'
-
'మత్తయ్య నిందితుడని తెలియదు'
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోట్ల కేసులో మత్తయ్య అనే వ్యక్తి కూడా నిందితుడు అన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అందుకే మత్తయ్య నేరుగా విజయవాడలోని సత్యన్నారాయణపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేసినా అతడిని తాము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మత్తయ్య తమ ఆధీనంలో లేడని కూడా ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. మత్తయ్య నిందితుడైనా అతడు మీడియాతో మాట్లాడుతున్నా తన నివాసాన్ని ఎప్పటికప్పుడు మార్చడంతో అతడి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నామని ఓ దశలో పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ మత్తయ్య విజయవాడ వెళ్లి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఇంత జరిగినా.. మత్తయ్య నిందితుడన్న విషయం తమకు అధికారికంగా తెలియదని విజయవాడ సీపీ చెప్పడం గమనార్హం. -
రవితేజ ర్యాలీకి అనుమతి తీసుకోలేదు: పోలీస్ కమిషనర్
విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రెండో కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించేందుకు తమ అనుమతి తీసుకోలేదని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వర రావు చెప్పారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వాహనాలను సీసీ పుటేజ్ ల ద్వారా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆ వాహనదారులకు ఈ-చలానాలు పంపుతామని కమిషనర్ చెప్పారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విజయవాడ నగరంలో భీతావహ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రవితేజ అనుచరులు ట్రాఫిక్ నిబంధనలకు నీళ్లు వదిలి రోడ్డు మీద రేసుల తరహాలో 30 బైకులు నడిపారు. బైకుల సెలైన్సర్లు తొలగించిన రణగొణ ధ్వనులు సృష్టించారు. ఆపకుండా హారన్లు మోగిస్తూ రాంగ్ రూట్లో కార్లు నడిపారు. దీంతో వాహనదారులకు, రోడ్డుపై వెళ్లే అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విషయాన్ని వెంకటేశ్వరరావు అనే కానిస్టేబుల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఈ రోజు పోలీస్ కమిషనర్ స్పందించారు. -
'నగలు, డబ్బు ..పాత బట్టల్లో దాచుకోండి'
విజయవాడ : విజయవాడ పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ...ప్రజల నిర్లక్ష్యం వల్లే నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బందితో నేరాలు నియంత్రించలేమని పోలీస్ కమిషనర్ అన్నారు. అదనపు సిబ్బంది కావాలంటే రూ.100 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఆ భారం కూడా ప్రజలపైనే పడుతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా... నగలు, నగదు చోరీ కాకుండా పాత పుస్తకాలు, పాత బట్టల్లో దాచుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వటం విశేషం. -
బెజవాడలో పిల్లల కిడ్నాప్ గ్యాంగులు: సీపీ
పిల్లలను అపహరించే గ్యాంగులు విజయవాడలో తిరుగుతున్నట్లు అనుమానంగా ఉందని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. నెల రోజుల్లోగా రద్దీగా ఉండే దుకాణాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని, లేకపోతే జరిమానాలు తప్పవని అన్నారు. దుకాణాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ మేరకు దుకాణాల యజమానులకు ఆయన సూచన చేశారు. పేద పిల్లలనే కిడ్నాపర్లు లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉందని, పిల్లలను ఒంటరిగా పంపించొద్దని సూచించారు. -
నెలరోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో మీరే చూస్తారు.. ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతామో. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం అంటే అక్కడక్కడా కానిస్టేబుళ్లను పెడితే సరిపోదు. ఆధునిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను వినియోగించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది’ అని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నగర కమిషనరేట్ స్థాయి పెంపు, నేరాలకు అడ్డుకట్ట తదితర అంశాలపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : కమిషనరేట్ పరిధి 80 కిలోమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందంటున్నారు? సీపీ : ఇప్పటికిప్పుడే దీనిపై వ్యాఖ్యానించడం మంచిది కాదు. ఈ నెలాఖరులోగా రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కమిషనరేట్ పరిధి ఎలా ఉండాలి, సిబ్బంది, విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో ఇస్తుంది. అప్పటి వరకు ఇంతే. ఇప్పటికిప్పుడు విషయాన్ని స్పెక్యులేట్ చేస్తే కొందరికి మంచి జరిగితే, కొందరికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. సాక్షి : నగరంలో ఆర్థిక నేరాలు పెరిగాయి. పలు చిట్ఫండ్సంస్థల మూసివేతతో రూ.500 కోట్ల మేర ప్రజలు నష్టపోయారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగక్కుండా ఏం చేయబోతున్నారు? సీపీ : ఈ విషయంలో మోసపోతున్న వారి బాధ్యత కూడా కొంత ఉంది. ప్రారంభంలో తెలియక రిజిస్టర్ కాని సంస్థల్లో సభ్యులుగా చేరారంటే అర్థం ఉంది. మోసాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత కూడా దురాశకుపోయి స్కీములు, చిట్స్‌లో చేరి మోసపోయేవాళ్లకు సాయం చేయమంటే ఎలా? తప్పుడు కంపెనీల్లో పెట్టుబడి పెడితే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుంది. పోలీసు యంత్రాంగం వీటి పైనే దృష్టిసారిస్తే దౌర్జన్యాలు, దొంగతనాలు, అల్లర్లను అరికట్టేది ఎవరు? సాక్షి : నగర విస్తరణతో పాటు వ్యాపారాలు విస్తరించాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా పరంగా తీసుకునే చర్యలు ఏంటి? సీపీ : వ్యాపార సముదాయాలకు వచ్చే వారికి భద్రత కలిపించాల్సిన బాధ్యత ఆయా సంస్థల యాజమాన్యాలదే. ఇది ఎస్టాబ్లిష్ చట్టంలోనే ఉంది. ఖచ్చితంగా వారు రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తాము. ఇక బహిరంగ ప్రదేశాల్లో పౌరుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సాక్షి : గొలుసు దొంగతనాలు (చైన్ స్నాచింగ్స్) నిలువరించేందుకు ఏ చర్యలు తీసుకుంటారు? సీపీ : ఇది మాకో ముఖ్యమైన సవాల్, గొలుసు దొంగతనాల్లో విద్యార్థులు, కొందరు యువ కానిస్టేబుళ్ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. ఇంటికి కన్నం వేసి రూ.లక్షలు కాజేసిన దానికంటే ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి చోరీలు మహిళలను భయానక స్థితిలోకి నెడతాయి. చైన్ స్నాచింగ్స్‌ను నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం.