అమరావతి: ఏపీకి ఇంటెలిజేన్స్ విభాగంలో చీఫ్‌గా పనిచేసిన మాజీ ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఆయన అఖిల భారత సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా ఇతర అధికారులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. అదే విధంగా గోప్యంగా ఉంచాల్సిన అధికారిక సమాచారాన్ని కూడా బహిర్గతం చేశారంటు ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి.
కాగా, దీనిపై 30 రోజుల్లోపు వ్యక్తిగతంగా హజరవ్వడంతో పాటు,లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుని ఆదేశించింది. ఒకవేళ సరైన వివరణ ఇవ్వనట్లైతే, సాక్ష్యాధారాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment