ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, సీఎం చంద్రబాబు, డీజీపీ మాలకొండయ్య (పాత ఫొటోలు)
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో బిగ్‌బాస్‌ల మధ్య బిగ్‌వార్ నడుస్తోంది. దీంతో రాష్ట్రంలో 24 మంది డీఎస్పీల బదిలీలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతుతో ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని సమాచారం. దీంతో డీజీపీ మాలకొండయ్య, వెంకటేశ్వర రావు మధ్య వివాదం నెలకొంది.
రాజకీయ కోణంలో బదిలీలకు సీఎం చంద్రబాబు ఒత్తిడి చేయడంతో డీజీపీ మాలకొండయ్య గత నెల 29న 24 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. తమకు కావాలసిన అధికారులను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల మేరకే ఏబీ వెంకటేశ్వర రావు బదిలీల లిస్ట్‌ను తయారుగా చేయగా, మాలకొండయ్య ప్రతిభ ఆధారంగా బదిలీలకు మరో లిస్ట్‌ను తయారు చేశారు.
కానీ, సీఎం ఒత్తిళ్లతో ఇంటిలిజెన్స్ చీఫ్ తయారు చేసిన లిస్ట్ ఆధారంగా బదిలీలు చేశారు. ఆ తర్వాత డీజీపీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇతర కీలక నిర్ణయాల్లోనూ డీజీపీ పాత్ర అలంకార ప్రాయంగానే ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతానికి బదిలీలను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment