Malakondaiah
-
ఆర్బీకేలతో రైతుకు ఎంతో మేలు: నీతి ఆయోగ్
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఆదర్శనీయమని, వాటిని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ రమేష్ చంద్ చెప్పారు. ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ స్థాయిలో వ్యవసాయ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ ఆహ్వానం మేరకు ఈ సమావేశానికి హాజరైన ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, దాని ఆవశ్యకత, అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారని, వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో రైతుల కోసం ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని పూనం మాలకొండయ్య వివరించారు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి ఇన్‌పుట్స్‌ను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని నాలెడ్జ్ హబ్‌లుగా, వన్‌స్టాప్ సెంటర్లుగా కూడా తీర్చిదిద్దామని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులతోపాటు ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేలు సేవలందిస్తున్నాయని తెలిపారు. పొలం బడులు, తోట, పట్టు, పశువిజ్ఞాన, మత్స్య సాగుబడుల ద్వారా రైతులకు శిక్షణ ఇస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నట్లు చెప్పారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ ద్వారా వాస్తవ సాగుదారులకే ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా అందిస్తున్నామన్నారు. స్పెషల్ సీఎస్ చెప్పిన ప్రతి విషయాన్ని ఆసక్తిగా విన్న వివిధ రాష్ట్రాల అధికారులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఆర్బీకే విధానం తమ రాష్ట్రాల్లో అమలుకు కృషి చేస్తామని ప్రకటించారు. త్వరలోనే ఏపీలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. అనంతరం రమేష్ చంద్ మాట్లాడుతూ.. తాను స్వయంగా ఆర్బీకేలను పరిశీలించానని, వాటి సేవలు బాగున్నాయని తెలిపారు. వీటిని తప్పనిసరిగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ సేవలు అద్భుతమని కొనియాడారు. కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రమోద్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. ఇదీ చదవండి: బాబు ‘అప్పు’డే లెక్క తప్పారు -
రబీ కోతలు సజావుగా సాగేందుకు చర్యలు
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నేపథ్యంలో రబీ పంటల కోతలు సజావుగా సాగేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదివారం పలు మార్గదర్శకాలు జారీచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ► వ్యవసాయ, ఉద్యాన పనులను మధ్యాహ్నం ఒంటిగంట వరకే చేయాలి.. ఈ మేరకు కూలీలను అనుమతించాలి. ► కూలీలు భౌతిక దూరం పాటించేలా చూడాలి. ► వ్యవసాయ, ఉద్యాన పనులకు, కోతలకు ఉపయోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తదితర వ్యవసాయ పరికరాలకు, యంత్రాల రాకపోకలకు ఎటువంటి ఆంక్షల్లేవు. ► వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల రవాణాతో పాటు.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల రవాణా, ఆక్వా ఫీడ్, ఆక్వా సీడ్స్, పశుగ్రాసం, మేతల రవాణాపైనా ఎటువంటి ఆంక్షల్లేవు. ► ఎరువులు, పురుగు మందుల దుకాణాలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకోవచ్చు. భౌతిక దూరం పాటిస్తూ ఈ షాపుల వద్ద కొనుగోళ్లు చేయొచ్చు. ► వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ఎక్కడికక్కడ సేకరించుకునేందుకు గ్రామాల్లోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు సహకరించాలి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులకు అవగాహన కల్పించాలి. ► ఎక్కడైనా తక్కువ ధరలకు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుంటుంటే 1907కు ఫోన్‌చేసి చెప్పాలి. ► ఈ వ్యవహారంలో మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు కూడా బాధ్యత వహించి ప్రభుత్వ ఉత్తర్వులు అమలవుతున్నాయో లేదో పర్యవేక్షించాలి. -
రాష్ట్రం చాలా మారింది : మాలకొండయ్య
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎం.మాలకొండయ్య పదవీ విరమణ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం మంగళగిరి బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వబెటాలియన్ పోలీసుల నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. శాంతి భద్రతల విషయంలో అందరూ బాగా పనిచేశారని కితాబిచ్చారు. ఏపీకి నూతనంగా 6వేల మంది పోలీసు సిబ్బంది వచ్చారని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా నెరవేర్చామని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్, క్రైం ఎక్కువగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని, క్రైం రేటు కూడా తగ్గిందని పేర్కొన్నారు. అనంతరం విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. డీజీపీగా మాలకొండయ్య మంచి సేవలు అందించారని చెప్పారు. ఆయన నాయకత్వంలో అందరూ బాగా పనిచేశారని అన్నారు. నూతన రాష్ట్రంలో శాంతి భద్రతలను మాలకొండయ్య ఆధ్వర్యంలో చక్కగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ఆయన పదవీ విరమణ చేసినా వారి మనస్సులో ఉంటారని అన్నారు. మాలకొండయ్య 1985బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీ నేడు ఆదేశాలు
-
ఏపీ డీజీపీ రేసులో ఆ ఐదుగురు..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎంపికపై సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ కమిటీ ఐదుమంది అధికారుల పేర్లను డీజీపీ పోస్టు కోసం ఎంపిక చేసింది. ఈ జాబితాలో గౌతమ్ సవాంగ్, ఠాకూర్, కౌముది, అనురాధ, సురేంద్రబాబుల పేర్లు ఉన్నాయి. అంతేకాక అధికారుల ట్రాక్ రికార్డు, సర్వీస్ వివరాలను కూడా నివేదికలో పొందుపరిచింది. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై నేడు నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్, అవినీతి నిరోధక శాఖ డీజీ ఠాకూర్ల మధ్య డీజీపీ పదవి కోసం పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రికి జీవో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సవాంగ్, ఠాకూర్లలో ఒకరికి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ అధికారుల మధ్య విపరీత పోటీ నెలకున్న విషయం తెలిసిందే. ఇన్చార్జ్ చీఫ్ సెక్రటరీ ఏసీ పునేఠా నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, సాంబశివరావులతో పాటు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌లు సెర్చ్ కమిటీలో ఉన్నారు. ఈ నెల(జూన్) 30న ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. -
ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ఎవరు..?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ పోస్టు కోసం ఐపీఎస్ అధికారుల మధ్య విపరీత పోటీ నెలకొంది. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్నారు. విజయవాడలో పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న గౌతమ్ సవాంగ్, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీజీ ఆర్పీ ఠాకూర్ల మధ్య డీజీపీ పదవి కోసం విపరీతమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర నూతన డీజీపీ ఎంపికపై ప్రభుత్వం సెలక్షన్ కమిటీని వేసింది. ఇన్చార్జ్ చీఫ్ సెక్రటరీ ఏసీ పునేఠా నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్ సింగ్, సాంబశివరావులతో పాటు జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌లు సెర్చ్ కమిటీలో ఉన్నారు. శుక్రవారంలోగా టాప్-3 జాబితాను సిద్ధం చేయాలని కమిటీని ప్రభుత్వం కోరింది. అయితే, కమిటీ ఇప్పటికే ముగ్గురు అధికారుల పేర్లను సూచించినట్లు సమాచారం. -
ఏపీ డీజీపీకి హైకోర్టు నోటీసులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడ్డుతున్నారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలిమేలును అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను డీఎస్పీ మాధవరెడ్డి మీడియా ముందు హాజరుపర్చారు. అయితే తన తల్లిని మీడియా ముందుకు తీసుకురావడం సరికాదంటూ అలిమేలు కుమారుడు కావటి సాగర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుల్ని, అనుమానితుల్ని మీడియా ముందు చూపించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. ఒక వేళ నిబంధనలుంటే ఏ నిబంధన అనుగుణంగా ఉందో చెప్పాలని తెలిపింది. ఈ అంశంలో కౌంటర్ దాఖలు చేయాలని పోలీస్‌శాఖను ఆదేశిస్తూ.. కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. -
శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: డీజీపీ
సాక్షి, కడప : కడప జిల్లాలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర డీజీపీ మాలకొండయ్య తెలిపారు. జిల్లాలో మంగళవారం డీజీపీ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతలు కంట్రోల్ ఉన్నాయని.. నేరాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. రెండు మూడు ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు త్వరలో షీటీమ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాబోయేది ఎన్నికల సమయం కనుక ఎప్పటికప్పుడు జిల్లా పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్ ఓటీపీల కారణంగా సైబర్ నేరాలు అధికం అవుతున్నాయని. బ్యాంక్‌ల ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచితులకు తెలపొద్దని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా పార్థిగ్యాంగ్ ఆనవాలు లేవని స్పష్టం చేశారు. గత ఏడాది మధ్యప్రదేశ్ నుంచి కొంతమంది వచ్చారని, కానీ వారిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అమాయకులపై పార్థిగ్యాంగ్ అంటూ ప్రజలు దాడులు చేయడం సరికాదన్నారు. ఎర్రచందనం డాన్ సాహుల్ భాయ్‌ను త్వరలోనే రాష్ట్రానికి తీసుకుని వస్తామన్నారు. -
ముఖ్యమంత్రి ప్రమేయం లేదు : డీజీపీ
సాక్షి, అమరావతి : డీఎస్పీల బదిలీ వ్యవహారం నిలిచిపోవడంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య సోమవారం స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బదిలీల వ్యవహారంతో ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. తన కంటే ఇంటిలిజెన్స్ చీఫ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారడం అవాస్తవమని పేర్కొన్నారు. డీఎస్పీల బదిలీలపై పీఈబీ చర్చిస్తోందని వెల్లడించారు. అందులో ఇంటిలిజెన్స్ చీఫ్ కూడా సభ్యులుగా ఉంటారని చెప్పారు. బదిలీ విషయంలో తాను చంద్రబాబు వద్ద అసంతృప్తి వ్యక్తం చేశాననటం అవాస్తవమని చెప్పారు. కాగా, ఏపీలో 24 మంది డీఎస్పీల బదిలీల విషయంలో ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు జోక్యం చేసుకున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. -
ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు చీఫ్‌ల వార్..!!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో బిగ్‌బాస్‌ల మధ్య బిగ్‌వార్ నడుస్తోంది. దీంతో రాష్ట్రంలో 24 మంది డీఎస్పీల బదిలీలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతుతో ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని సమాచారం. దీంతో డీజీపీ మాలకొండయ్య, వెంకటేశ్వర రావు మధ్య వివాదం నెలకొంది. రాజకీయ కోణంలో బదిలీలకు సీఎం చంద్రబాబు ఒత్తిడి చేయడంతో డీజీపీ మాలకొండయ్య గత నెల 29న 24 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. తమకు కావాలసిన అధికారులను రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల మేరకే ఏబీ వెంకటేశ్వర రావు బదిలీల లిస్ట్‌ను తయారుగా చేయగా, మాలకొండయ్య ప్రతిభ ఆధారంగా బదిలీలకు మరో లిస్ట్‌ను తయారు చేశారు. కానీ, సీఎం ఒత్తిళ్లతో ఇంటిలిజెన్స్ చీఫ్ తయారు చేసిన లిస్ట్ ఆధారంగా బదిలీలు చేశారు. ఆ తర్వాత డీజీపీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇతర కీలక నిర్ణయాల్లోనూ డీజీపీ పాత్ర అలంకార ప్రాయంగానే ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతానికి బదిలీలను నిలిపివేశారు. -
దాచేపల్లి ఘటన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం
-
సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లాడు
సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య(55)ను పట్టుకునేందుకు 17 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన దారుణమన్నారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. రిక్షావాలా అయిన సుబ్బయ్యకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని, ఇద్దరు భార్యలు అతడిని వదిలేశారని వెల్లడించారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అతడు మానసిక వైఫల్యంతోనే ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందన్నారు. చనిపోవడానికి వెళ్తున్నట్టు దారిలో కనిపించిన వ్యక్తికి చెప్పినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో 7 అత్యాచార ఘటనలు జరగడం దురదృష్టకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. ఈ ఏడు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దాచేపల్లి కేసులో ఈ కేసులో పోలీసులు సమన్వయంతో వ్యహరిస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ఆందోళనకారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. -
నాకు గన్మెన్లు వద్దు: పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన గన్మెన్లను వెనక్కి పంపారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ గతనెలలో డీజీపీ మాలకొండయ్యకు పవన్ లేఖ రాశారు. ఈ క్రమంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం పవన్‌కు నలుగురు గన్మెన్లను కేటాయించింది. రెండు షిఫ్టుల్లో ఇద్దరు గన్మెన్లు పనిచేసేలా విధులు కేటాయించారు. అయితే మంగళవారం రాత్రి పవన్ తన గన్మెన్లను వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. అదే విధంగా తనకు కేటాయించిన గన్మెన్లు వద్దని ఆయన డీజీపీకి లేఖ ద్వారా తెలిపారు. గన్మెన్లను వెనక్కి పంపడంపై పవన్ కల్యాణ్ కారణాలను వెల్లడించలేదు. కానీ జనసేనకు సంబంధించిన వ్యవహారాలను గన్మెన్ల ద్వారా ప్రభుత్వం తెలసుకుంటోందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నట్టుగా సమాచారం. అందుకోసమే వారిని వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. -
సురేంద్రబాబుకా? అనురాధకా?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ ఎంపికకు రేస్ ముందే మొదలైంది. డీజీపీ మాలకొండయ్య జూన్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో తదుపరి డీజీపీ ఎవరనేదానిపై పోలీస్‌శాఖలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నండూరి సాంబశివరావుకు రెండేళ్లపాటు పొడిగింపు ఇస్తున్నట్లు గతేడాది చివరివరకూ హడావుడి చేసిన చంద్రబాబు సీనియారిటీ ప్రాతిపదికన మాలకొండయ్యకు డీజీపీ పగ్గాలు అప్పగించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డీజీపీగా విధులు చేపట్టిన మాలకొండయ్య జూన్‌లో పదవి విరమణ చేయాల్సి ఉంది. ఆయనకు మరో రెండేళ్లు పొడిగింపు ఇవ్వాలని ఇప్పటి నుంచే చంద్రబాబుకు కొందరు సిఫార్సు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, ముక్కుసూటిగా వ్యవహరించే మాలకొండయ్యను ఎన్నికల సమయంలో కొనసాగిస్తే ఇబ్బంది పడతామని చంద్రబాబుకు మరో వర్గం నూరిపోస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్వీ సురేంద్రబాబును తెరమీదకు తెచ్చినట్టు చెబుతున్నారు. ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిజం ఫోర్స్)లో ఏడీజీగా ఉన్న సురేంద్రబాబుకు ఈ ఏడాది మార్చి 14న డీజీపీగా పదోన్నతి కల్పించారు. అంతేకాక, మార్చి 22న ఆర్టీసీ ఎండీ పగ్గాలు అప్పగించారు. ఇది.. మూడు నెలల తరువాత ఆయనను పోలీస్ బాస్ చేసేందుకేనన్న ప్రచారం ఆ శాఖలో విస్తృతంగా జరుగుతోంది. డీజీపీ ఎంపిక ఇక రాష్ట్రం ఇష్టం గతేడాది చివరలో డీజీపీ ఎంపిక కసరత్తు దశలోనే రాష్ట్ర ప్రభుత్వానికి తలబొప్పి కట్టిన సంగతి తెల్సిందే. చివరి నిమిషంలో పంపిన జాబితా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ పలుమార్లు తిప్పి పంపింది. దీంతో పంతానికిపోయిన చంద్రబాబు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని నియమించుకునేలా పోలీస్ చట్ట సవరణ చేశారు. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించిన వారే పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. దినేష్‌రెడ్డి, ప్రసాదరావు, సాంబశివరావు, మాలకొండయ్య ఆర్టీసీ ఎండీ నుంచి పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన వారే. అదే ఆనవాయితీకి కొనసాగింపుగా ఎన్నికల సమయానికి సురేంద్రబాబుకు డీజీపీ పగ్గాలు అప్పగిస్తారా? అనేది ఐపీఎస్‌లలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవేళ సురేంద్రబాబుకు అవకాశం ఇవ్వకుంటే ఆయన భార్య, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధకు అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఏదీ ఏమైనా సురేంద్రబాబు, అనురాధ పేర్లు ఇప్పుడు డీజీపీ రేసులో ముందువరుసలో ఉన్నాయి. కానీ, మాలకొండయ్య తరువాత సీనియర్లుగా ఉన్న వీఎస్కే కౌముది, వినయ్‌రంజన్ రే, ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్‌లు ఉన్నారు. కౌముది, వినయ్‌రంజన్ రేలు కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్‌పై ఉండగా.. ఏసీబీ డీజీగా ఠాకూర్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా సవాంగ్ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. కాగా, సీనియారిటీ కింద డీజీపీ పోస్టుకు ఠాకూర్, సవాంగ్‌లలో ఒకరిని సీఎం ఎంపిక చేస్తారా? లేక ఆనవాయితీ కొనసాగిస్తారా? అనేది వేచి చూడాలి. -
భావోద్వేగానికి గురైన సాంబశివరావు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ డీజీపీ పదవికి ఉద్యోగ విరమణ చేసిన నండూరి సాంబశివరావు ఆదివారం భావోద్వేగానికి లోనయ్యారు. కొత్త డీజీపీగా డా.ఎం.మాలకొండయ్య ఛార్జ్ తీసుకున్నారు. ఆరు నెలల పాటు మాలకొండయ్య డీజీపీగా కొనసాగనున్నారు. పదవి విరమణ చేసిన సాంబశివరావుకు ఐపీఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎక్స్ డీజీపీ సాంబశివరావును ఐపీఎస్ అధికారులు పోలీసు రథంలో కూర్చోబెట్టి సాధరంగా దాన్ని లాక్కెల్లి వీడ్కోలు పలికారు. కాగా, కొత్త డీజీపీ మాలకొండయ్య రథం తాడును లాగడంతో సాంబశివరావు భావోద్వేగానికి గురయ్యారు. నూతన డీజీపీ మాలకొండయ్యకు రాష్ట్రంలోని ఐపీఎస్ లు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. -
నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మాలకొండయ్య
-
ఏపీ నూతన డీజీపీగా మాలకొండయ్య
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా మాలకొండయ్య నియమితులయ్యారు. ప్రస్తుతం మాలకొండయ్య ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న (ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మాలకొండయ్యను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు డీజీపీ సాంబశివరావుతో కలిసి మాలకొండయ్య ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. కాగా మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. -
ఏపీ కొత్త డీజీపీగా మాలకొండయ్య!
అమారావతి: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎం.మాలకొండయ్య నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈయన నియామకంపై గురువారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీని ఎంపిక చేసుకునే అధికారం కల్పిస్తూ ఏపీ పోలీస్ యాక్టును సవరిస్తూ మంగళవారం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మాలకొండయ్య 1985 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా, డీఐజీగా కీలక పదవులు నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సాంబశివరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. -
ఆర్టీసీలో సంస్కరణలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్ర ప్రజల రవాణా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ఆర్టీసీలో సంస్కరణ తీసుకురావడానికి కార్యాచరణ రూపొం దిస్తున్నామని ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్య తెలిపారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాలోని ఏలూరు ఆర్టీసీ డిపో, గ్యారేజ్, ఏలూరు కొత్త బస్టాండుల్లో ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. ఆర్టీసీ ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టాల్లో నడుస్తోందని, అప్పులకు వడ్డీల కింద రూ.240 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని చెప్పారు. టికెట్ల ద్వారా 85 శాతం ఆదాయం సంస్థకు టికెట్ల ద్వారానే అత్యధికంగా 85 శాతం ఆదాయం వస్తోందని, ఇతర మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని ఎండీ మాలకొండయ్య చెప్పారు. రవాణా ఆదాయాన్ని మరో 2 శాతమన్నా పెంచగలిగితే సంస్థకు రూ.200 కోట్ల ఆదాయం అదనంగా లభిస్తుందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించడానికి ఆర్టీసీలో కూడా త్వరలో ప్రయోగాత్మకంగా స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ రవాణాను నియంత్రించాలని పోలీస్, రవాణా శాఖాధికారులను కోరామన్నారు. బీవోటీ పద్ధతిపై స్థలాల లీజు జిల్లాలో ఆర్టీసీకి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల ద్వారా నష్టం వస్తోందని, వాటిని నియంత్రించే అవకాశంపై ఆయనను ప్రశ్నించగా ఏ రీజియన్‌కు ఆదాయం వచ్చినా మొత్తం సంస్థకే వస్తుంది కాబట్టి వాటిని నియంత్రించడానికి అవకాశం లేదన్నారు. బిల్డ్, ఆపరేట్, ట్రాన్సఫర్ (బీవోటీ ) పద్ధతిపై ఆర్టీసీ స్థలాలను అద్దెలకు ఇచ్చి ఆదాయం పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఏలూరు కొత్త బస్టాండ్ ప్రాంగణంలోని అతిపెద్ద స్థలాన్ని సీఎంఆర్ సంస్థకు బీవోటీ పద్ధతిన లీజుకు ఇచ్చామని తెలిపారు. బైపాస్ బస్సులపై అధ్యయనం బైపాస్ బస్సులు నగరంలోకి రాకపోవడం వల్ల ఏలూరు ప్రజలు చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రాత్రి 11 గంటల తర్వాత బైపాస్ బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఆశ్రం కళాశాల వద్ద దిగి నగరంలోకి రావడానికి ఆటోలు దొరక్క పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసురాగా బైపాస్ బస్సులను రాత్రి 11 గంటల నుంచి వేకువజామున 4 గంటల వరకూ నగరంలోకి వచ్చేట్లు చేయడానికి గల అవకాశాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకుడు ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావు మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రైవేట్ అక్రమ వాహనాల కారణంగా ఏటా రూ.200 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని, అలాగే ఆర్టీసీ బస్సులకు వినియోగించే డీజిల్ ఆయిల్‌పై 14 శాతం పన్ను వసూలు చేస్తుండటంతో మరో రూ.200 కోట్లు సంస్థకు భారంగా పరిణమించిందని చెప్పారు. ఆర్టీసీ ఈడీ అడ్మినిస్ట్రేషన్ కె.వెంకటేశ్వరరావు, ఈడీ ఆపరేషన్స జి.జయరావు, విజయవాడ జోన్ ఈడీ ఎన్.వెంకటేశ్వరరావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బ్రహ్మానందరెడ్డి, రీజినల్ మేనేజర్ ఎస్.ధనుంజయరావు, డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకృష్ణ, డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా నగదురహితం ఏలూరు (మెట్రో): జిల్లాలో నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా నగదు రహిత చెల్లింపులకు వీలుగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ఎం.మాలకొండయ్య చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రతి బస్సులోనూ క్యూ ఆర్ కోడ్‌ను ఏర్పాటు చేస్తామని, కేవలం సాధారణ ఫోన్ ద్వారా కండక్టర్ ప్రజల నుంచి నగదురహిత విధానం ద్వారా ప్రయాణికులకు టికెట్లు అందించే ప్రక్రియను సులువుగా అమలు చేయవచ్చన్నారు. ఆర్టీసీ ఈడీఏ వెంకటటేశ్వరరావు, ఆపరేషన్స ఈడీ జయరావు, సీడీఎం బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం ధనుంజయరావు పాల్గొన్నారు. -
ఆర్టీసీను గట్టెక్కెంచే బాధ్యత అందరిదీ
– ఆర్టీసీ ఎండీ ఎం మాలకొండయ్య అనంతపురం న్యూసిటీ : ఆర్టీసీని గట్టెక్కించే బాధ్యత అందరిపై ఉందని ఆర్టీసీ ఎండీ ఎం మాలకొండయ్య అన్నారు. ఆదివారం ఆయన స్థానిక డిపోను తనిఖీ చేశారు. రీజియన్‌లో సంస్థ పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెంచడంతో పాటు వన్‌మాన్ సర్వీసులను తిప్పాలని ఈడీ ఆపరేషన్స్ జయరావు డీఎం బాలచంద్రప్పకు సూచించారు. పలు ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎండీ పరిశీలించారు. మూలనపడ్డ సీజ్ అయిన వాహనానలు చూసి ఎన్ని రోజులుగా ఇక్కడున్నాయని అధికారులను ఆయన ప్రశ్నించారు. రోజుకు రూ 27 లక్షల నష్టం.. ఈడీ అనంతపురం డిపో రోజుకు రూ 27 లక్షల నష్టం వస్తోందని ఈడీ ఆపరేషన్స్ జయరావు అన్నారు. కార్మికులు ప్రతి స్టేజులో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుంటే నష్టాల నుంచి గట్టెక్కించవచ్చన్నారు. అక్రమ రవాణాకు ఎస్పీ, ఆర్టీఏ అధికారుల సహకారం తీసుకుందామన్నారు. మన సంస్థ కోసం ఓ ఉద్యమంలో కార్మికులందరూ పని చేస్తే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఆర్ఎం చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులున్నా రీజియన్‌లో మరో డిపోను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. తాడిపత్రి డీఎం ఆవుల నరేంద్రరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ గౌడ్, కంట్రోలర్లు శివలింగప్ప, ఆర్టీసీ వైద్యులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ వీసీఎండీగా ఎం.మాలకొండయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉదయ లక్ష్మిని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న, శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే బయటకొచ్చిన పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మరోవైపు ఏసీబీ డీజీగా పని చేస్తున్న ఎం.మాలకొండయ్యను ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (వీసీఎండీ) ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ వీసీఎండీ అదనపు బాధ్యతల నుంచి ఎన్.సాంబశివరావుకు విముక్తి కల్పించారు. శాంతి భద్రతల డీజీపీగా పనిచేస్తున్న ఆర్.పి.ఠాకూర్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. టీఏ త్రిపాఠిని బదిలీ చేసినప్పటికీ ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీకి రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఐదుగురు అదనపు డీజీలకు పదోన్నతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు అదనపు డీజీలకు... డీజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందినవారిలో మాలకొండయ్య, వీఎస్ కౌముది, వినయ్ రంజన్ రే, ఆర్పీ ఠాకూర్, గౌతం సవాంగ్‌లకు డీజీలుగా ప్రమోషన్ లభించింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా గౌతమ్ సవాంగ్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఆర్పీ ఠాకూర్, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా మాలకొండయ్య, జైళ్ల శాఖ అదనపు డీజీగా వినయ్ రంజన్ రే ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం విదితమే. -
అంకితభావం అలవర్చుకోవాలి: నరసింహన్
సాక్షి, హైదరాబాద్: బాధితులలో ధైర్యాన్ని నింపి వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కొత్త డీఎస్పీలకు గవర్నర్ నరసింహన్ సూచించారు. అంకి త భావం, పారదర్శకత అలవరచుకోవాలని కోరా రు. 9వ బ్యాచ్‌కు చెందిన 59 మంది డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ బుధవారం ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా)లో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి సవాల్‌గా మారిన ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్యాంకులకు సంబంధించిన నేరాలను శిక్షణలో తొలిసారిగా భాగస్వామ్యం చేయడాన్ని గవర్నర్ ప్రశంసించారు. పోలీసుల పనితీరును ప్రజలు నిత్యం గమనిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు అన్నారు. గడచిన ఏడాది కాలంలో వెయ్యి మంది ఎస్ఐలకు శిక్షణ ఇచ్చామని అప్పా డెరైక్టర్ మాలకొండయ్య తెలిపారు. అప్పాలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ తొలి పోలీసు కమిషనర్ రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి విగ్రహాన్ని గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కాగా, శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు డీఎస్పీలకు గవర్నర్ ట్రోఫీలు అందించారు. క్రిమినాలజీలో డాక్టర్ జి.ప్రేమ్ కాజల్, ఫైరింగ్‌లో జి.చక్రవర్తి, అవుట్ డోర్ విభాగంలో జి.వెంకటరాముడు ట్రోఫీలు అందుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన శ్రావణి పలు ట్రోఫీలతో పాటు సీఎం రివాల్వర్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు పాల్గొన్నారు.