సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉదయ లక్ష్మిని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న, శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే బయటకొచ్చిన పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మరోవైపు ఏసీబీ డీజీగా పని చేస్తున్న ఎం.మాలకొండయ్యను ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా (వీసీఎండీ) ప్రభుత్వం నియమించింది.
ఆర్టీసీ వీసీఎండీ అదనపు బాధ్యతల నుంచి ఎన్.సాంబశివరావుకు విముక్తి కల్పించారు. శాంతి భద్రతల డీజీపీగా పనిచేస్తున్న ఆర్.పి.ఠాకూర్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. టీఏ త్రిపాఠిని బదిలీ చేసినప్పటికీ ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీకి రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీసీ వీసీఎండీగా ఎం.మాలకొండయ్య
Published Mon, Nov 14 2016 1:40 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement