
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 214 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ఉప సర్పంచ్ పదవులకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వార్డు సభ్యుల ద్వారా జరిగే ఈ ఉప సర్పంచ్‌ల ఎన్నిక కోసం 27న ఉదయం 11 గంటలకు ఆయా పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment