Sub-sarpanch
-
పోలింగ్ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియలకు కొత్త చట్టంలోని నిబంధనలను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం 4 ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్పర్సన్, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు, మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్ సభ్యుడు, ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహణ విషయంలో కొత్త చట్టం లోని నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఏ ఎన్నిక విషయంలోనూ మార్పులు లేకుండా నిబంధనలు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన రోజే ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి. ఫలితాలు వెల్లడించిన తర్వాత సమావేశం నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. మొత్తం వార్డు సభ్యులో సగం మంది హాజరు కావాలి. సమావేశం మొదలైన గంటలోపు కోరం సరిపడా సభ్యులు పాల్గొనాల్సి ఉంటుంది. -
విద్యుదాఘాతంతో ఉపసర్పంచ్ మృతి
పరిగి: విద్యుదాఘాతంతో ఓ ఉపసర్పంచ్ మృతి చెందారు. ఈ సంఘటన మండల పరిధిలోని పేటమాదారంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం ప్రకారం... గ్రామంలో కొంతకాలంగా విద్యుత్ సమస్య నెలకొంది. గ్రామస్తులు పలుమార్లు విద్యుత్ అధికారులు విషయం తెలియజేసినా సమస్య పూర్తిగా పరిష్కరించలేదు. దీంతో గ్రామస్తులే ట్రాన్స్ఫార్మర్ నుంచి ైడె రెక్ట్ కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు ఉపసర్పంచ్ గూడూరు రాంచంద్రయ్య(38) వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో అతను ట్రాన్స్ఫార్మర్ వద్దకు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వెళ్లాడు. బాగు చేసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అలాగే పట్టుకుంది. గ్రామస్తులు కర్రలతో కొట్టి విడిపించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో గ్రామస్తులు, కుటుంబీకులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రామచంద్రయ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య మల్లమ్మ, కూతురు నితీష(15) కుమారుడు బాలు(10) ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి యాదయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబీకులను పరామర్శించారు. -
ఉప సర్పంచ్ అనుమానాస్పద మృతి
కందుకూరు,న్యూస్‌లైన్: అదృశ్యమైన ఓ ఉప సర్పంచ్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తన పొలంలోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు లు, స్థానికుల కథనం ప్రకా రం.. మండల పరిధిలోని మురళీనగర్ ఉప సర్పంచ్ రాత్లావత్ పరుశురామ్(30), విజయ దంపతులు. వీరికి కుమారుడు ప్రభాస్(7), కుమారై పప్పి(5) ఉంది. పరుశురామ్ తమ్ముడు శ్రీనివాస్ కూడా వీరితోనే కలిసి ఉంటున్నాడు. ఈనెల 15న సాయంత్రం బయటికి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బైకుపై వెళ్లిన పరుశురామ్ తిరిగిరాలేదు. దీంతో కుటుంబీకులు ఆయన కోసం గాలించగా పొలం వద్ద బైకు మాత్రమే లభించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో గ్రామం నుంచి చిప్పలపల్లి వెళ్లే రహదారి సమీపంలోని పొలాలకు వెళ్తున్న రైతులకు తీవ్ర దుర్గందం రావడంతో అటుగా వెళ్లి చూశారు. పరుశురామ్ తన పొలంలోని ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపిం చాడు. సమాచారం అందుకున్న సీఐ జానకీరెడ్డి, ఎస్ఐలు వెంకటేష్, నర్సి ం గ్రాథోడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించా రు. మృతిపై పలు అనుమానాలు.. పరుశురామ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉరివేసుకున్న సీతాఫలం చెట్టు చిన్నగా, కొమ్మ సన్నగా ఉంది. పరుశురామ్ అదృశ్యమైన రెండు రోజులకు సెల్‌ఫోన్ ఆన్.. తర్వాత స్విఛాఫ్ అయింది. సదరు సెల్‌ఫోన్ కూడా మృ తుడి జేబులోనే లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా పరుశురామ్ ఎందుకో తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, తాను చనిపోతానని త రచూ తమతో చెప్పేవాడని స్థానికులు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
సొంతూరి కోసం రాజకీయాల్లోకి..
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ఉన్నత విద్యావంతులైన ఓ ఇద్దరు యువకులు తమ కెరీర్‌ను వదులుకుని రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉద్యోగాలు చేస్తే తాము, తమ కుటుంబమే బాగుపడుతుందని.. అదే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధి అయితే గ్రామాన్నే బాగుపరచవచ్చంటున్నారు మెదక్ మండలానికి చెందిన ఈ యువకులు. ఇలా వారు వచ్చిరాగానే ఉపసర్పంచ్‌లుగా పదవులను అందిపుచ్చుకున్నారు. మెదక్ మండలం మారుమూల గ్రామమైన కొత్తపల్లికి చెందిన చిరంజీవిరెడ్డి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోగల ఎక్నోలైట్ అనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. నెలకు రూ.20 వేల వేతనం. అందులో ఎనిమిది నెలలు పనిచేశారు. అంతలోనే పంచాయతీ ఎన్నికలు రావడంతో పుట్టిపెరిగిన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి ఇంటికి చేరుకున్నారు. సర్పంచ్‌గా పోటీచేసేందుకు రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలుపొందారు. అంతలోనే ఉప సర్పంచ్ పదవి కూడా ఇతణ్ణి వరించింది. వాడి ఉపసర్పంచ్‌గా.. మండలంలోని వాడి గ్రామానికి చెందిన యామిరెడ్డి బీఏ, బీపీఈడీ పూర్తిచేశారు. ఉద్యోగం కోసం వెతుకోవాల్సింది పోయి రాజకీయాల్లోకి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గ్రామానికి చేరుకున్నారు. యామిరెడ్డికి సైతం రిజర్వేషన్ అనుకూలించక పోవడంతో గ్రామంలోని 5వ వార్డుసభ్యుడిగా పోటీ చేసి నెగ్గారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ గ్రామస్థుల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత వరకు పరిష్కరిస్తున్నట్టు వారు చెబుతున్నారు.