కందుకూరు,న్యూస్‌లైన్: అదృశ్యమైన ఓ ఉప సర్పంచ్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తన పొలంలోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు లు, స్థానికుల కథనం ప్రకా రం.. మండల పరిధిలోని మురళీనగర్ ఉప సర్పంచ్ రాత్లావత్ పరుశురామ్(30), విజయ దంపతులు.
వీరికి కుమారుడు ప్రభాస్(7), కుమారై పప్పి(5) ఉంది. పరుశురామ్ తమ్ముడు శ్రీనివాస్ కూడా వీరితోనే కలిసి ఉంటున్నాడు. ఈనెల 15న సాయంత్రం బయటికి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బైకుపై వెళ్లిన పరుశురామ్ తిరిగిరాలేదు. దీంతో కుటుంబీకులు ఆయన కోసం గాలించగా పొలం వద్ద బైకు మాత్రమే లభించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని..
ఆదివారం మధ్యాహ్నం సమయంలో గ్రామం నుంచి చిప్పలపల్లి వెళ్లే రహదారి సమీపంలోని పొలాలకు వెళ్తున్న రైతులకు తీవ్ర దుర్గందం రావడంతో అటుగా వెళ్లి చూశారు. పరుశురామ్ తన పొలంలోని ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపిం చాడు. సమాచారం అందుకున్న సీఐ జానకీరెడ్డి, ఎస్‌ఐలు వెంకటేష్, నర్సి ం గ్‌రాథోడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించా రు.
మృతిపై పలు అనుమానాలు..
పరుశురామ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉరివేసుకున్న సీతాఫలం చెట్టు చిన్నగా, కొమ్మ సన్నగా ఉంది. పరుశురామ్ అదృశ్యమైన రెండు రోజులకు సెల్‌ఫోన్ ఆన్.. తర్వాత స్విఛాఫ్ అయింది. సదరు సెల్‌ఫోన్ కూడా మృ తుడి జేబులోనే లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా పరుశురామ్ ఎందుకో తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, తాను చనిపోతానని త రచూ తమతో చెప్పేవాడని స్థానికులు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఉప సర్పంచ్ అనుమానాస్పద మృతి
Published Mon, Jan 20 2014 12:03 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement