janaki reddy
-
చింతలపూడిలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చింతలపూడి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. రేపు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరగనున్న గురుపుజోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన పార్టీ నేతలు ఎలిజా, జానకి రెడ్డి, వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు గ్రామదర్శిని పర్యటన నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్ పట్ల పైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్సీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
బాబు పర్యటన: చింతలపూడిలో పోలీసుల ఓవరాక్షన్
-
చిన్నారిపై అత్యాచారయత్నం
కందుకూరు, న్యూస్‌లైన్: అభంశుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన అచ్చన భిక్షపతి(31) స్థానికంగా మేస్త్రీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి ఇంటి సమీపంలో ఉంటున్న ఓ బాలిక(8) తల్లి చనిపోవడంతో నాయనమ్మ దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. బుధవారం మధ్యాహ్నం సమయంలో పాఠశాల నుంచి వచ్చిన బాలికను భిక్షపతి తినుబండారాల కోసం దుకాణానికి పంపించాడు. వాటిని తీసుకుని చిన్నారి ఇంట్లోకి రాగానే అతడు తలుపులు వేసి అత్యాచారానికి యత్నించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలిక కేకలు వేస్తూ బయటికి పరుగెత్తి స్థానికులకు విషయం తెలిపింది. గ్రామస్తులు భిక్షపతిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని కందుకూరు పోలీసులకు అప్పగించారు. సీఐ జానకీరెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిపై ‘నిర్భయ’ చట్టం కింద కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప సర్పంచ్ అనుమానాస్పద మృతి
కందుకూరు,న్యూస్‌లైన్: అదృశ్యమైన ఓ ఉప సర్పంచ్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తన పొలంలోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు లు, స్థానికుల కథనం ప్రకా రం.. మండల పరిధిలోని మురళీనగర్ ఉప సర్పంచ్ రాత్లావత్ పరుశురామ్(30), విజయ దంపతులు. వీరికి కుమారుడు ప్రభాస్(7), కుమారై పప్పి(5) ఉంది. పరుశురామ్ తమ్ముడు శ్రీనివాస్ కూడా వీరితోనే కలిసి ఉంటున్నాడు. ఈనెల 15న సాయంత్రం బయటికి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బైకుపై వెళ్లిన పరుశురామ్ తిరిగిరాలేదు. దీంతో కుటుంబీకులు ఆయన కోసం గాలించగా పొలం వద్ద బైకు మాత్రమే లభించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో గ్రామం నుంచి చిప్పలపల్లి వెళ్లే రహదారి సమీపంలోని పొలాలకు వెళ్తున్న రైతులకు తీవ్ర దుర్గందం రావడంతో అటుగా వెళ్లి చూశారు. పరుశురామ్ తన పొలంలోని ఓ చెట్టుకు చీరతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపిం చాడు. సమాచారం అందుకున్న సీఐ జానకీరెడ్డి, ఎస్ఐలు వెంకటేష్, నర్సి ం గ్రాథోడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించా రు. మృతిపై పలు అనుమానాలు.. పరుశురామ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఉరివేసుకున్న సీతాఫలం చెట్టు చిన్నగా, కొమ్మ సన్నగా ఉంది. పరుశురామ్ అదృశ్యమైన రెండు రోజులకు సెల్‌ఫోన్ ఆన్.. తర్వాత స్విఛాఫ్ అయింది. సదరు సెల్‌ఫోన్ కూడా మృ తుడి జేబులోనే లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా పరుశురామ్ ఎందుకో తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, తాను చనిపోతానని త రచూ తమతో చెప్పేవాడని స్థానికులు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.