
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చింతలపూడి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. రేపు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరగనున్న గురుపుజోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన పార్టీ నేతలు ఎలిజా, జానకి రెడ్డి, వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు గ్రామదర్శిని పర్యటన నేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్ పట్ల పైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment