
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. పాకిస్తాన్‌పై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 242 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
రోహిత్ శర్మ ఔటయ్యక క్రీజులోకి విరాట్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలుత శుబ్‌మన్ గిల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లి.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో 94 బంతుల్లో తన 51వ వన్డే సెంచరీ మార్క్‌ను కింగ్ కోహ్లి అందుకున్నాడు.
ఓవరాల్‌గా కోహ్లికి ఇది 81వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా కోహ్లి అద్భుత సెంచరీ ఫలితంగా 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో చేధించింది. దీంతో చిరకాల ప్రత్యర్ధిపై 6 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయాన్ని అందించాడు.
"సెమీస్‌కు ఆర్హత సాధించడానికి అవసరమైన మ్యాచ్‌లో ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. ఆరంభంలోనే రోహిత్ వికెట్ కోల్పోయిన తర్వాత ఆఖరి వరకు ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేయాలనుకున్నాను. ఆఖరి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు ఈ రోజు చేయకూడదని నిర్ణయించుకున్నాను.
మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లడమే నా పని. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం ఆఖరిలో స్పిన్నర్లను ఎటాక్ చేసి బౌండరీలు రాబాట్టాడు. నాకు కూడా కొన్ని బౌండరీలు వచ్చాయి. గతంలో ఛేజింగ్‌లో ఏ విధంగా ఆడానో, ఈ మ్యాచ్‌లో కూడా అదే చేశాను.
నా ఆట తీరుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా ఫామ్‌పై వస్తున్న వార్తలను పెద్దగా పట్టించుకోను. బయట విషయాలకు దూరంగా ఉంటాను. అలా అని పొగడ్తలకు పొంగిపోను. జట్టు కోసం వంద శాతం ఎఫక్ట్ పెట్టడమే నా పని. ఇక రోహిత్ ఔటైనప్పటికి శుబ్‌మన్ మాత్రం అద్బుతంగా ఆడాడు.
షహీన్ అఫ్రిది లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను ఎటాక్ చేసి ఒత్తిడిలో పెట్టాడు. అందుకే అతడు ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాటర్ బ్యాటర్ అయ్యాడు. శ్రేయస్ కూడా నాలుగో స్ధానంలో బాగా ఆడాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో అయ్యర్‌తో కలిసి కొన్ని భాగస్వామ్యాలు నెలకొల్పాను. ఈ రోజు కూడా ఇద్దరం కలిసి మ్యాచ్‌ను విజయానికి దగ్గరగా తీసుకువెళ్లామని" మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ కోహ్లి పేర్కొన్నాడు.
చదవండి: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు.. సచిన్‌కు సాధ్యం కాని ఘనత
Comments
Please login to add a commentAdd a comment