![Suspicious Death Of Student At Sri Chaitanya College Tadigadapa](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/8/suicide1.jpg.webp?itok=loilrVhh)
సాక్షి, కృష్ణా జిల్లా: తాడిగడప శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని మృతి చెందింది. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ గ్రామానికి చెందిన రామిశెట్టి గంగా భువనేశ్వరి.. నీట్‌లో కోచింగ్ తీసుకుంటోంది. కామినేని ఆసుపత్రికి విద్యార్థిని మృతదేహన్ని తరలించారు. కాగా, తమ కుమార్తె మృతిపై విద్యార్థిని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు, కుమార్తె మృతి విషయం తెలుసుకున్న తండ్రికి గుండెపోటుకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
విద్యార్ధి తల్లి గోవింద లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు లేవని.. నిన్న రాత్రి కూడా తనతో ఫోన్‌లో మాట్లాడిందన్నారు. గత రాత్రి తన కుమార్తెకు తలనొప్పి వస్తే అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పుడు చనిపోయింది అంటున్నారు.
తలనొప్పి వస్తే ప్రాణం పోతుందా?. ఇప్పుడు నిర్లక్ష్యంగా శవాన్ని తీసుకువెళ్లమంటున్నారు’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన విషయం ఎందుకు దాచారు?. చనిపోయిందని ఆలస్యంగా ఎందుకు తెలిపారు?’’ అంటూ ఆమె ప్రశ్నించారు.
![విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి](https://www.sakshi.com/s3fs-public/inline-images/su_4.jpg)
ఇదీ చదవండి: తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు
Comments
Please login to add a commentAdd a comment