లక్నో: ఓ ఫేక్ కిడ్నాప్ కేసును ఉత్తరప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఒక ఇంగ్లీష్ పదానికి రాంగ్ స్పెల్లింగ్ రాసిన క్లూతో కేసు అసలు గుట్టును రట్టు చేశారు. ఈ నకిలీ కిడ్నాప్ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన సందీప్ (27) తాను కిడ్నాప్ అయినట్లు నాటకమాడి,రూ.50వేలు ఇవ్వాలని తన సోదరుడిని డిమాండ్ చేస్తూ వేరే ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాడు.
సోదరుడికి పంపిన బెదిరింపు మెసేజ్‌లో డబ్బులు ఇవ్వకుంటే సందీప్‌ను చంపేస్తామని రాసిన చోట డెత్ అనే పదాన్ని తప్పుగా(deathబదులుdeth)అని రాశాడు. ఈ మెసేజ్ నిశితంగా పరిశీలించిన పోలీసులు దానిని పంపిన వ్యక్తి అంతగా చదువుకోని వ్యక్తి అని నిర్ణయానికి వచ్చారు. పైగా సందీప్‌కు శత్రువులు ఎవరూ లేకపోవడంతో అనుమానం బలపడింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా సందీప్ ఆచూకీ గుర్తించారు.
కిడ్నాప్ విషయమై సందీప్‌ను విచారించారు. విచారణ సందర్భంగా ఆ బెదిరింపు మెసేజ్‌ను రాయమని సందీప్‌ను కోరారు. దీంతో సందీప్ మరోసారి ‘డెత్’ అనే పదాన్ని తప్పుగా రాయడంతో కిడ్నాప్ నాటకమాడింది అతడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డబ్బుల కోసం తానే ఈ నాటకం ఆడానని, ఓ పాపులర్ క్రైమ్ సీరియల్ చూసి ఈ పని చేశానని పోలీసులకు చెప్పాడు.
ఇదీ చదవండి: పెళ్లికి సాయం చేస్తానని పిలిచి
Comments
Please login to add a commentAdd a comment