kidnappers
-
Farm House: అంతా అక్రమమే..
శంషాబాద్: ఇటీవల సంచలనం రేపిన ఎమ్మార్పీఎస్ నేతలు నరేందర్, ప్రవీణ్‌లను కిడ్నాప్ చేసి బంధించిన ఫాంహౌస్‌ను సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య శంషాబాద్ మున్సిపాలిటీ అధికారులు నేలమట్టం చేశారు. పట్టణంలోని 103 సర్వే నంబరులో ధర్మగిరి ఆలయానికి సమీపంలో కిడ్నాపర్లు సుమారు వెయ్యి గజాల స్థలంలో ఈ ఫాంహౌస్‌ను నిరి్మంచినట్లు గుర్తించారు. రెండు మూడేళ్ల క్రితంఎలాంటి అనుమతులు లేకుండా రెండు రేకుల షెడ్లతో పాటు ప్రహరీ, కుక్కలను ఉంచేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బోన్లను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో బాతులు, కోళ్లను కూడా పెంచుతున్నారు. కిడ్నాప్ సంఘటనతో పాటు అప్రత్తమైన పోలీసులు ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న గుర్తించిన మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ నిర్మాణంగా తేలితే కూల్చివేయాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషన్ బి. సుమన్‌రావు ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇటీవల ఫాంహౌస్‌కు నోటీసులు అంటించారు. సోమవారం మూడు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కుక్కలతో పాటు, కోళ్లు, బాతులను తీసుకెళ్లేందుకు పశుసంవర్థక శాఖతో పాటు బ్లూక్రాస్కు సమాచారం అందించారు. అప్పటి వరకు కుక్కలకు సంబంధించిన బోన్ల కూలి్చవేతను నిలిపివేశారు. ఫాంహౌస్ పూర్తిగా అక్రమ నిర్మాణమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కూల్చివేతల సమయంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ అక్కడికి రాలేదు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. భూ కబ్జాదారులు ఇబ్బంది పెడితే పోలీసులను సంప్రదించాలన్నారు. -
KNR: కిడ్నాపర్ చెర నుంచి తల్లి ఒడికి
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రి నుంచి పసికందు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం రాత్రి ప్రభుత్వ మతా శిశు కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన నిర్మలా దేవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. చికిత్స కోసం నిర్మలా దేవిని ఆస్పత్రి సిబ్బంది వేరే గదిలోకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పసికందు మంచం దగ్గర తన ఏడేళ్ల కొడుకును తండ్రి భర్త మనోజ్ రామ్ కాపాలా ఉంచారు. ఆ తర్వాత తమ పాప కనిపించడం లేదంటూ ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి అంతా వెతికినా పాప దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో పసికందు అపహరణపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ లో కిడ్నాపర్ ను పట్టుకున్న పోలీసులు -
రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నంద్యాల/హైదరాబాద్: రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కిడ్నాపర్లతో చేతులు కలిపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేందర్ సోదరి సహకారంతో కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమస్య పరిష్కారానికి సురేందర్‌ని రాయదుర్గం పిలిపించిన సోదరి.. కిడ్నాపర్లకు అప్పగించింది. సురేందర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకున్న కిడ్నాపర్లు.. నల్లమల వైపు తీసుకెళ్లారు. గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్‌కి పాల్పడి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సురేందర్‌ను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. సాప్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి నల్లమల అడవులకు తరలిస్తున్నారని సమాచారం రావడంతో కారును కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఫారెస్ట్ సిబ్బంది ఆపి తనిఖీ చేయగా, కారు,బాధితుని వదిలేసి కిడ్నాపర్లు పారిపోయారు. ఒక కిడ్నాపర్‌ను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులకు పారెస్ట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో సురేందర్‌ను క్షేమంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాప్ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ స్పాట్‌కు సురేంద్‌ను తరలించిన పోలీసులు.. సోదరి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. సురేందర్ నుంచి ఆరు గంటల పాటు వివరాలు సేకరించారు. నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. భారీగా డబ్బులు వసూలు చేయడానికే కిడ్నాప్ స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది.. -
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
-
రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతం
సాక్షి, జనగామ జిల్లా: రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది. కిడ్నాపర్లు కొట్టి హత్య చేసి మృతదేహాన్ని జనగామ సమీపంలోని చంపక్ హిల్స్ క్వారీ గుంతలో పడేశారు. మృతదేహాన్ని పోలీసులు గుర్తించి, ఐదుగురిని అందులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్య వెనుక అధికారపార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తు ఆందోళనకు దిగారు. కిడ్నాప్‌నకు గురైన బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్లా రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది. రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా.. అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. కిడ్నాప్‌పై స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో.. రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది. పోచన్నపేటకు చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మెట, రఘునాథపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పని చేశారు. ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ.. సమాచార హక్కు చట్టం కింద వివరాల సేకరణలో యాక్టివ్‌గా పని చేస్తున్నాడు. జీపీ, తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కారు నుంచి మంజూరైన నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు. ఆయన ఈనెల 15వ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్రవాహనంపై పోచన్నపేటకు వస్తుండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి క్రైం నంబర్ 105/2023, యూ/ఎస్.363 ఐపీఎస్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశ్వాపురం వైపు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించి.. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీడీఓ సెల్‌ఫోన్ దారిలో పడిపోయింది. ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. చివరికి రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది. -
ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి రూ.15 లక్షలు డిమాండ్!
Kidnapped child in greed of 15 lakhs మధ్యప్రదేశ్: శివపురిలోని భావఖేడి గ్రామానికి చెందిన బాలుడిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ.15 లక్షల కోసం చిన్నారిని ఇద్దరు కిడ్నాప్ చేశారని, మూడో నేరస్థుడు గ్రామంలోనే ఉంటూ ప్రతి వార్తను నేరగాళ్లకు చేరవేస్తున్నాడని పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుడు రామ్జీలాల్ యాదవ్ తన మేనల్లుడు నరేంద్ర యాదవ్ కుమారుడు హరిఓమ్ (6) డిసెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల నుండి కనిపించకుండా పోయాడని భావ్‌ఖేడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎంతవెతికినా జాడకనిపించలేదని, సాయంత్రం 4 గంటల 26 నిముషాలకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నాడు. చిన్నారి తమ వద్దనే ఉన్నాడని, రూ. 15 లక్షలు సిద్ధం చేసుకోమని, ఏదైనా తెలివితేటలు ప్రదర్శిస్తే బిడ్డ దక్కడని చెప్పి కిడ్నాపర్లు కాల్ డిస్కనెక్ట్ చేసినట్లు తెలిపాడు. దీంతో వెంటనే పోలీసు బృందం రంగంలోకి దిగింది. భయాందోళనలకు గురైన నేరస్థులు చిన్నారిని గ్రామంలో రహదారిపై విడిచిపెట్టారు. అనంతరం పోలీసులు చిన్నారిని ప్రశ్నించగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు చెప్పాడు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా 15 లక్షల రూపాయల డబ్బు కోసం రెండు నెలల క్రితమే ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్నారి కిడ్నాప్‌కు ప్లాన్ చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. కాగా పోలీసులు ముగ్గురు నేరగాళ్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మీడియాకు తెలిపారు. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
అమ్మ కంట ఆనందభాష్పాలు.. తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు
సాక్షి, పాడేరు: వారంతా నెలల వయసున్న బిడ్డలకు దూరమైన తల్లిదండ్రులు.. కనిపించకుండా పోయిన తమ చిన్నారులు ఇక దొరుకుతారో లేదోనన్న ఆందోళనతో ఉన్నారు.. మీ పిల్లలు దొరికారని పోలీసుల నుంచి వచ్చిన సమాచారం వారిని చెప్పలేనంత సంతోషానికి గురి చేసింది.. పరుగు పరుగున వెళ్లి తమ పిల్లల్ని చూసుకొని ఆనందబాష్పాలు రాల్చారు. ఈ అపురూప దృశ్యం బుధవారం పాడేరు పోలీస్ స్టేషన్లో కనిపించింది. ఈనెల 2వ తేదీన డుంబ్రిగుడ మండలంలో మాయమైన 6 నెలల పసికందు లోహర్ అర్జున్ అపహరణ కేసులో.. పోలీసులు తీగ లాగితే పెద్ద డొంకే కదిలింది. ఇలాంటి చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తున్న పదిమంది ముఠా పట్టుబడింది. వారి వద్ద మరో ముగ్గురు చిన్నారులు లభించారు. వారందరినీ బుధవారం రూరల్ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.ఈ ముఠా కిడ్నాప్ చేసిన పితాని దర్షిత్‌కుమార్, చింతలపూడి రూపశ్రీ, కోరుపల్లి దీక్షిత, లోహర్ అర్జున్‌లు సురక్షితంగానే ఉన్నారు. వీరిని కొనుగోలు చేసిన వారి నుంచి ఈ పిల్లల్ని స్వాధీనం చేసుకుని వారి సొంత తల్లిదండ్రులకు రూరల్ ఎస్పీ కృష్ణారావు చేతుల మీదుగా బుధవారం సాయంత్రం పాడేరులో అప్పగించారు. తమ పిల్లలు తమకు దక్కడానికి ఎంతో శ్రమించిన పోలీసు అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులకు రివార్డులు ప్రశంసనీయమైన రీతిలో పోలీసులు అపహరణ కేసును ఛేదించడంతో.. మరో ముగ్గురు చిన్నారులు తమ తల్లిదండ్రుల చెంతకు చేరగలిగారు. పోలీసులకు అభినందనలతోపాటు ఉన్నతాధికారుల రివార్డులు దక్కాయి. డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలు ప్రాంతంలో ఈనెల 2వ తేదీన మధ్యప్రదేశ్‌కు చెందిన సంచార కుటుంబంలోని ఆరు నెలల శిశువును అర్ధరాత్రి సమయంలో అపహరించారు. మరుసటి రోజే డుంబ్రిగుడ పోలీసు స్టేషన్లో ఎస్ఐ సంతోష్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఈ శిశువు అపహరణ ఘటనపై అరకు సీఐ జి.దేముడుబాబు వెంటనే స్పందించారు. డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి ఎస్ఐలు సంతోష్‌కుమార్, నజీర్, కరక రాములను అప్రమత్తం చేసి జిల్లావ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అపహరించిన శిశువు సబ్బవరం మండలం గాలి భీమవరం ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో జిల్లాలోని పిల్లల కిడ్నాప్, అక్రమ అమ్మకాల ముఠా వెలుగు చూసింది. ఈ కేసును 24 గంటల్లోనే చేధించడంతో పాటు ముఠా నుంచి నలుగురు శిశువులను స్వాధీనం చేసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో ఎంతో శ్రమించిన అరకు సీఐ జి.దేముడుబాబుతోపాటు అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ ఎస్ఐలు కరక రాము, నజీర్, సంతోష్‌కుమార్‌లను బుధవారం సాయంత్రం పాడేరులో విశాఖ రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. సీఐ, ఎస్ఐలకు వేర్వేరుగా నగదు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఏఎస్పీ పి.జగదీష్, పాడేరు, జి.మాడుగుల సీఐలు సుధాకర్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
నేడు స్వదేశానికి ‘లిబియా బాధితులు’
టెక్కలి: కిడ్నాపర్ల చెరలో బిక్కుబిక్కుమంటూ గడిపిన శ్రీకాకుళం జిల్లా యువకులు స్వదేశానికి రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, మంత్రి సీదిరి అప్పలరాజు, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎప్పటికప్పుడు వారి విడుదలకు చర్యలు చేపట్టడంతో 28 రోజుల్లో కిడ్నాపర్ల చెర నుంచి వారికి విముక్తి లభించింది. సంతబొమ్మాళి మండలం సీతానగరానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య లిబియా నుంచి స్వదేశానికి వస్తూ ట్రిపోలీ ఎయిర్పోర్ట్ మార్గ మధ్యలో కిడ్నాప్‌కు గురైన ఘటన సంచలనం కలిగించింది. మంత్రి సీదిరి అప్పలరాజు, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. లిబియాలో భారత ప్రభుత్వ దౌత్య కార్యాలయం నుంచి కంపెనీ ప్రతినిధులతో చర్చించి కిడ్నాపర్ల నుంచి వారిని విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ప్రయతి్నంచారు. కిడ్నాపర్ల చెర నుంచి బయట పడిన యువకులు నేడు ఢిల్లీకి రానుండగా మరో రెండు రోజుల్లో ఇళ్లకు చేరుకోనున్నారు. ప్రభుత్వ చొరవ మరిచిపోలేం ట్రిపోలీ ఎయిర్పోర్ట్ వద్ద కిడ్నాప్‌కు గురయ్యాం. ప్రభుత్వ చొరవతో లిబియాలో మా కంపెనీ ప్రతినిధులు కిడ్నాపర్లతో చర్చలు జరిపి మమ్మల్ని విడిపించారు. ప్రభుత్వ చొరవ మరిచిపోలేం. – బత్సల వెంకట్రావు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం కిడ్నాప్‌కు గురైన తర్వాత జీవితంపై ఆశలు వదులుకున్నాం. ఎంతో భయపడ్డాం. అయితే మమ్మల్ని విడిపించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చొరవ చూపారు. – బత్సల జోగారావు మరో రెండు రోజుల్లో ఇంటికి.. మమ్మల్ని విడిపించడంలో మంత్రి అప్పలరాజు, ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ కృషి చేశారు. 2 రోజుల్లో ఇంటికి వచ్చేస్తున్నాం. – బొడ్డు దానయ్య -
కోటిస్తేనే కనికరించారు!
హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆటోమొబైల్ ఫైనాన్షియర్ కిడ్నాప్‌కు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఫైనాన్షియర్‌ను కిడ్నాప్ చేసిన అగంతకులు రూ.కోటి తీసుకుని సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో వదిలిపెట్టారు. 3 గంటలపాటు నాటకీయ ఫక్కీలో ఈ ఘటన జరిగి చివరకు బాధితుడు స్వల్పగాయాలతో బయ టపడ్డారు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి వీడియాకు వివరాలు వెల్లడించారు. హిమాయత్‌నగర్ రోడ్ నం.16లో నివ సించే గజేందర్ పారక్ (40) మైనా ఫైనాన్స్ కంపెనీను నిర్వహిస్తున్నాడు. స్నేహితులను కలిసేందుకు తరచూ దోమలగూడ ఏవీ కళాశాల వద్దకు వస్తుంటాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారు (టీఎస్09ఎఫ్ఏ2131)లో అక్కడికి వచ్చాడు. అతని స్నేహితుడు రసగుల్లా అతడితో మాట్లాడి వెళ్లిపోయాడు. 11.15 గంటల ప్రాంతంలో 30 నుంచి 35 యేళ్ల వయస్సున్న ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చి కారు వెనకే ఆపారు. వారు గజేందర్‌ను అడ్డగించేలోపే ముసుగు వేసుకున్న మరో ముగ్గురు కారులో అక్కడికి చేరుకున్నారు. వెంటనే గజేందర్‌ను కారులో కూర్చోబెట్టారు. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా గజేందర్‌కు మాస్క్ తగిలించారు. రూ.3 కోట్లు డిమాండ్... గజేందర్‌ను అబిడ్స్‌కు తరలించి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. రూ.15 నుంచి రూ.20 లక్షల కంటే ఎక్కువ ఇవ్వలేనని చెప్పినా కిడ్నాపర్లు ఒప్పుకోకపోగా, గజేందర్‌ను చితకబాదారు. దీంతో రూ.కోటి ఇవ్వడానికి డీల్ కుదిరింది. గజేందర్ అతని స్నేహితుడు రాజేష్ అగర్వాల్‌కు ఫోన్ చేసి రూ.కోటి తీసుకురావాలని కోరారు. జగదీశ్ మార్కెట్ వద్ద ఉన్న బాంబే జ్యూస్ సెంటర్ వద్దకు డబ్బులు తీసుకువచ్చి అతని కారు డిక్కీపైనే ఉంచి దూరంగా వెళ్లాలని కిడ్నాపర్లు సూచించారు. తర్వాత స్కూటీపై ముసుగువేసుకుని వచ్చిన ఇద్దరు ఆ బ్యాగ్ తీసుకుని చిరాగ్ ఆలీ లేన్ వైపు ఉడాయించారు. అనంతరం గజేందర్‌ను చిరాగ్ ఆలీ లేన్‌లో వదిలిపెట్టారు. బాధితుడు ఇంటికి వెళ్లి ఉదయం 5 గంటలకు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. సెంట్రల్ డీసీపీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమా?.. గజేందర్ కిడ్నాప్ కేసులో ఆర్థిక లావాదేవీలే ప్రధాన పాత్ర పోషించాయా అనే అనుమానంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఫార్చూన్ ఫైనాన్స్‌లో దాదాపు రూ.24 కోట్ల మేర మోసం చేశాడనే కేసులో గజేందర్ అన్నను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గజేందర్తో పాటు మరికొందరు బినామీలుగా ఏర్పడి ముంబైకి చెందిన కంపెనీని మోసగించిన కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, కిడ్నాప్ జరిగిన ప్రాంతంతో పాటు అబిడ్స్‌లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలను కూడా పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా సేకరిస్తున్నారు. -
పిక్‌పాకెటర్‌పై సూడో పోలీసుల వల
సాక్షి, హైదరాబాద్: అతడో పిక్‌పాకెటర్. బస్సుల్లో తిరుగుతూ సెల్ఫోన్లు చోరీ చేస్తుంటాడు. ఈ నెల 2న అమీర్‌పేట మైత్రీవనం ఎదురుగా ఉన్న బస్టాప్ ప్రాంతంలో ఉండగా కొంతమంది వచ్చి అతడిని పట్టుకున్నారు. తాము పోలీసులం అని చెప్పి తీసుకెళ్లారు. ఇంటరాగేషన్ పేరుతో చిత్రహింసలు పెట్టారు. చివరకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అతడి భార్య నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి విడిచిపెట్టారు. అయితే, తనను తీసుకెళ్లింది పోలీసులు కాదని తెలియడంతో ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో బాధి తుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుడి సమీప బంధువుతోపాటు పది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన వెంకటయ్య కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి స్థిరపడ్డాడు. బస్సుల్లో తిరుగుతూ సెల్ఫోన్ల చోరీలకు పాల్పడేవాడు. వెంకటయ్యపై పలు పోలీసుస్టేషన్లలో 40కి పైగా కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. చోరీల ద్వారా సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్న వెంకటయ్యను చూసి, అతడి సమీప బంధువైన నిజామాబాద్‌కు చెందిన పిట్ల శంకర్‌కు దుర్బుద్ధి పుట్టింది. అతడిని కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా పెద్ద మొత్తం రాబట్టవచ్చంటూ తన స్నేహితులకు చెప్పి పథకం రూపొందించాడు. ఈనెల 2న మైత్రీవనం బస్టాప్ వద్ద ఉన్న వెంకటయ్య వద్దకు తన స్నేహితులను పంపించాడు. తాము పోలీసులమని, కేసు విషయమై విచారణకు రావాలని చెప్పి అతడిని కిడ్నాప్ చేసి, యాదగిరిగుట్టలోని యాదాద్రి గౌడ్ ట్రస్ట్ భవన్ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ ఇంటరాగేషన్ పేరుతో చిత్ర హింసలకు గురి చేశారు. తర్వాత రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించి హింసించారు. సిగరెట్లు కాల్చి వాతలు కూడా పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో శంకర్ బయటకు రాకుండా వెనకాల ఉండి కథ నడిపించాడు. అనంతరం వెంకటయ్య భార్యకు ఫోన్ చేసి రూ.50 లక్షలు ఇవ్వకుంటే అతడిని చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె తన వద్దనున్న రూ.18 లక్షలతోపాటు 4.5 తులాల బంగారం ఇచ్చేందుకు అంగీకరించింది. కిడ్నాపర్ల సూచన మేరకు భువనగిరికి తీసుకెళ్లి ఓ వ్యక్తికి వాటిని అప్పగించింది. అనంతరం ఈ నెల 4న కిడ్నాపర్లు వెంకటయ్యను విడిచిపెట్టారు. స్నేహితుడికి అనుమానం రావడంతో... ఇంటికి వచ్చిన వెంకటయ్య.. తనను పోలీసులే తీసుకెళ్లారని అనుకున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండిపోయాడు. అయితే, ఈనెల 6న వెంకటయ్యను పరామర్శించడానికి వచ్చిన ఓ స్నేహితుడు.. అతడి ఒంటిపై ఉన్న గాయాలు చూసి అనుమానించాడు. పోలీసులు ఇలా చేయరని, ఎక్కడో ఏదో తిరకాసు ఉందని చెప్పాడు. దీంతో వెంకటయ్య ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైత్రీవనం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా కిడ్నాపర్ల కారు నంబర్ గుర్తించారు. దీంతో పాటు సాంకేతికంగా ముందుకు వెళ్లిన పోలీసులు వెంకటయ్య సమీప బంధువు పిట్ల శంకర్ సూత్రధారిగా, అతడి స్నేహితులు పాత్రధారులుగా ఈ కిడ్నాప్ వ్యవహారం సాగినట్లు తెలుసుకున్నారు. శంకర్‌తో పాటు ఇంద్రాల చిరంజీవి, కొల్లి సాయికృష్ణ, రాజారామ్, పిట్ల రవి, అబ్దుల్ హమీద్, పంజాల సాయికృష్ణ, షేక్ అన్వర్, గుర్రం కళ్యాణ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు అధికారులు అజయ్‌కుమార్, మురళీకృష్ణ, బందయ్యలను డీసీపీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. -
వెంటాడి...వేటాడారు!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్‌లో నలుగురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా పొరబడి స్థానికులు చేసిన దాడిలో ఒకరు మృతిచెందడం వెనుక వాట్సాప్‌లో వ్యాపించిన వదంతులే కారణమని తేలింది. ఓసారి దాడి నుంచి తృటిలో తప్పించుకున్నా హైదరాబాదీలు ప్రయాణించిన కారుతోపాటు అందులోని వారి ఫొటోలను కిడ్నాపర్లుగా పేర్కొంటూ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో మరో చోట దారికాచిన స్థానికులు వారిని చావబాదినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి 30 మంది గ్రామస్తులతోపాటు వదంతులను వాట్సాప్‌లో పోస్టు చేసిన గ్రూపు అడ్మిన్ మనోజ్ కుమార్, ఫొటోలు షేర్ చేసిన గ్రూపు సభ్యుడు అమర్ పాటిల్‌లనూ అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు బీదర్ ఎస్పీ డి.దేవ్‌రాజ్ వెల్లడించారు. ఈ దాడిలో గాయపడిన ముగ్గురు నగరవాసులను చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జి చేశారు. దాడి జరిగిందిలా... ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ పహాడీ షరీఫ్ పరిధిలోని ఎర్రకుంట, షహీన్ నగర్, బార్కస్ ప్రాంతాలకు చెందిన మహ్మద్ ఆజం, నూర్ మహ్మద్, మహ్మద్ సల్మాన్ బంధువులు. వీరి స్నేహితుడు, ఖతార్‌లో పనిచేసే సల్‌హామ్–ఈది–అల్–కుబసీ ఇటీవల నగరానికి వచ్చాడు. వీరిందరి స్నేహితుడైన బషీర్ బీదర్ సమీపంలోని హండికర గ్రామంలో ఉంటాడు. దీంతో అతన్ని కలిసేందుకు నలుగురూ కలసి కారులో శుక్రవారం అక్కడకు వెళ్లారు. మధ్యాహ్న భోజనాలు అనంతరం నలుగురూ తిరుగు ప్రయాణమయ్యారు. వాహనం థౌల్ గ్రామ శివార్లకు చేరుకున్నప్పుడు కొందరు స్కూలు విద్యార్థులు తారసపడ్డారు. వారిని చూసి ముచ్చటపడిన సల్‌హామ్, ఇతర స్నేహితులు కారు ఆపి ఆ చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చే ప్రయ త్నం చేశారు. కర్ణాటకలో కొన్ని నెలలుగా కిడ్నాపర్ల వదంతులు వ్యాపిస్తుండటం, ఇదే కారణంతో మే 23న బెంగళూరు శివార్లలో ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపడంతో అపరిచితుల నుంచి చాక్లెట్లు సహా ఎలాంటి వస్తువులూ తీసుకోవద్దని ప్రజలు చిన్నారులకు నూరిపోస్తున్నారు. దీంతో సల్‌హామ్, అతని స్నేహితులు ఇచ్చిన విదేశీ చాక్లెట్లను ఆ చిన్నారులు తీసుకోకుండా పారిపోతుండగా ఓ చిన్నారిని బలవంతంగా ఆపిన హైదరాబాదీలు.... ఆమె చేతిలో చాక్లెట్లు పెట్టే ప్రయత్నం చేయగా ఆమె పెద్దపెట్టున ఏడ్చింది. ఇది గమనించిన స్థానికులు వారిని కిడ్నాపర్లుగా భావించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన హైదరాబాదీలు స్థానికులకు చిక్కకుండా తప్పించుకున్నారు. దారి కాచి దాడి.. వాహనంతోపాటు అందులోని వ్యక్తుల్ని థౌల్ గ్రామస్తులు ఫొటోలు తీశారు. వాటిని మనోజ్ కుమార్ అనే స్థానికుడు అడ్మిన్‌గా ఉండి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లోకి షేర్ చేసిన అమర్ పాటిల్ అనే వ్యక్తి... వారు కిడ్నాపర్లని, తమ గ్రామం నుంచి తప్పించుకుని ఫలానా దిశలో వస్తున్నారంటూ పోస్ట్ చేశాడు. ఇదే గ్రూప్‌లో ఉన్న ముర్కీ గ్రామస్తులు వాట్సాప్ సందేశాలతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కిడ్నాపర్లు తమ గ్రామం మీదుగానే పారి పోతారని గమనించి రహదారికి అడ్డంగా రాళ్లు, దిమ్మెలు పెట్టారు. అదే సమయంలో అటుగా వాహనం రావడంతో దాదాపు 300 మంది గ్రామస్తులు వారిపై విరుచుకుపడ్డారు. వాహనాన్ని బోల్తా పడేసి ధ్వంసం చేయడంతోపాటు అందులోని ముగ్గురిపై రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో దాడి చేశారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసుల్నీ గ్రామస్తులు వదిలిపెట్టలేదు. ఓ ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి స్థానికుల్ని చెదరగొట్టారు. క్షతగాత్రులు నలుగురినీ బీదర్ సమీపంలోని అమృద్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆజం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మిగిలిన ముగ్గురినీ హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎర్రగుంట శ్మశానవాటికలో శనివారం ఆజం అంత్యక్రియలు జరిగాయి. -
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దు
-
చినారుల కిడ్నాప్ ముఠా కలకలం
-
కిడ్నాపైన విద్యార్థి దారుణ హత్య
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్సీటీకి చెందిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల తర్వాత హత్య చేశారు. విద్యార్థి కుటుంబాన్ని 50లక్షలు డిమాండ్ చేసిన దుండగులు.. డబ్బులు ఇవ్వకపోవడంతో అతడిని హత్య చేసి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని పడేశారు. పోలీసుల వివరాల ప్రకారం..21 ఏళ్ల ఆయుష్ నౌటియల్ ఢిల్లీలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత గురువారం ఇంటి నుంచి కాలేజీ వెళ్లిన అతడిని దుండగులు కిడ్నాప్ చేశారు. సాయంత్రం అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే ఆయుష్ తండ్రికి వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఆయుష్ కిడ్నాప్ చేశామని, 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేయడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం దుండగులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి వారు ఉండేచోటు కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆయుష్ ఆచూకీని కనుక్కోలేకపోయారు. చివరికి బుధవారం రాత్రి ద్వారకాలోని ఓ కాలువ వద్ద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు దుండగుల ఆచూకీ కనిపెట్టలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
ఆ నలుగురితో పార్టీ పరువు గోవిందా
సాక్షి, తిరుపతి :‘నలుగురు కిడ్నాపర్లు.. స్మగ్లర్లు టీడీపీని అడ్డుపెట్టుకుని అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ నేతలపై కఠిన చర్యలు తీసుకోండి’ అని అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫి ర్యాదు చేశారు. సంక్రాంతి వేడుకలకు వచ్చిన ముఖ్యమంత్రితోపాటు మంత్రి లోకేష్‌ను పాకాల మండలం నేతలు మంగళవారం కలిశారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బెల్ట్‌షాపులు నడిపేవారు, కిడ్నాపర్లు, ఎర్రస్మగ్లర్లు పార్టీలో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గల్లా అరుణకుమారి, బాలకృష్ణారెడ్డి పేర్లతో మండలంలో దందాలు చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నారని తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ పంచాయతీరాజ్, ఎక్సైజ్ ఇలా అన్ని విభాగాల్లో మా మూళ్లు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారపై వేధింపులకు దిగుతున్నారని ముఖ్యమంత్రికి చెప్పారు. పార్టీని అడ్డంగా అమ్మేస్తున్నారని, పరువు బజారున పడిందని వివరించారు. ఆ నలుగురి కారణంగా పార్టీ కేడర్ నిస్సహాయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి పార్టీ నుంచి బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నాగరాజనాయుడే సూత్రధారి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజనాయుడు మద్యం మాఫి యాను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈయ న మండలంలోని మిగిలిన మద్యం షాపులపై పెత్తనం చెలా యిస్తూ మాటవినని వారిపై తప్పుడు కేసులు బనాయించేలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మాట వినని అధికార పార్టీ నేతలపైనా కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఆయన అనుమతిలేనిదే ఎవరికీ ఎలాంటి పనులు మంజూరు చేయవద్దని మండల కార్యాలయాల్లో దౌర్జన్యానికి దిగుతున్నట్లు వివరించారు. పర్సెంటేజీ ఇస్తే తప్ప అభివృద్ధి పనులు మంజూరు కావని బహిరంగానే చెబుతున్నారని, దీంతో పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఫిర్యాదు చేశారు. జెడ్పీటీసీ సురేష్ బంధువు కావడంతో వీరి అరాచకాలు మితిమీరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో కిడ్నాపర్లు, స్మగ్లర్లు పాకాల మండలం టీడీపీలో కిడ్నాపర్లు, స్మగ్లర్లు పెత్తనం చెలాయిస్తున్నారంటూ చలపతినాయుడు, కిశోర్నాయుడిపై ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులుగా చెలామణి అవుతున్న వీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికే పట్టుపడ్డారని చెప్పారు. మూడేళ్లుగా వీరి అరాచకాలకు అడ్డేలేకుండా పోయిందన్నారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. వీరి ఫిర్యాదుపె కంగుతిన్న ఆ నలుగురు నేతలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ గల్లా అరుణకుమారి, గతంలో ఆమెకు పీఏగా పనిచేసిన బాలకృష్ణారెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలిసింది. -
పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా అరెస్ట్
థానె: ఒక రోజు వయసున్న బాలుడిని దొంగతనం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను థానే పోలీసులు సోమవారం అరెస్టు చేసి ఆ బాలుడితోపాటు మరో ఐదుగురు పిల్లలను రక్షించారు. ఇన్స్పెక్టర్ నితిన్ థాక్రే ఆధ్వర్యంలోని పోలీసుల బృందం కళ్యాణ్ తహసిల్‌లోని పీసావలి గ్రామంలోని ఓ ఇంటిపై దాడిచేసి గుడియా సోను రాజభర్(35), ఆమె భర్త సోను రాజ్‌భర్(40), విజయ్ కైలాస్ శ్రీవాత్సవ (55)లను అరెస్టు చేసింది. ఆ ఇంటి నుంచి థానే సివిల్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం దొంగిలించిన శిశువుతోపాటు మరో ఐదుగురు పిల్లలను పోలీసులు కనుగొన్నారు. వీరిలో 2 నెలల ఆడశిశువు, పదకొండు, తొమ్మిది, ఐదు సంవత్సరాల వయసున్న బాలికలు, మరో మూడేళ్ల వయసున్న బాలుడు ఉన్నారు. పసికందును అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఓ మహిళ ఈ పసికందు తల్లి వద్దకు వచ్చి మీ తల్లి బాలుడిని చూడాలనుకుంటోందని చెప్పి తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. తమకందిన ఫిర్యాదు మేరకు థానే పోలీసులు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్ వరకు అన్ని రైల్వే స్టేషన్లలో సోదా చేశారని, అలాగే ఆస్పత్రి, రైల్వే స్టేషన్లలోని సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించి పీసావలి గ్రామానికి పోలీసులు వెళ్లి ఆ ఇంట్లో సోదా చేశారని కమిషనర్ మధుకర్ పాండే వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వీరు పిల్లలను దొంగిలించి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అర్ధరాత్రి బాలికల కిడ్నాప్.. ఆపై అత్యాచారయత్నం
సాక్షి, వినుకొండటౌన్: అర్ధరాత్రి వేళ ఇళ్లలో నిద్రిస్తున్న బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడుతున్న నిందితులను గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం శృంగారపురంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో నివసించే షేక్ బాషా, పోలం పోలయ్య వరుసకు బాబాయ్, అబ్బాయ్ అవుతారు. వారిద్దరూ పట్టణంలోని ముట్లకుంట కాలనీ, శృంగారపురంలోని ఇళ్లలో నిద్రిస్తున్న బాలికలను అపహరించుకుపోయి అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు. పొట్టకూటి కోసం పగలంతా కాయకష్టం చేసిన తల్లిదండ్రులు అలసిపోయి అర్ధరాత్రివేళ గాఢనిద్రలో ఉన్న సమయంలో నిందితులు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పట్టుబడింది ఇలా... ముట్లకుంట కాలనీకి చెందిన మూడో తరగతి చదువుతున్న ఓ బాలిక (8)ను పది రోజుల క్రితం అపహరించిన నిందితులు అత్యాచారానికి యత్నించినట్లు బాధిత బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. బాషా, పోలయ్య శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అదే కాలనీలోని మరో బాలికను అపహరించే ప్రయత్నం చేయగా, గుర్తించిన తల్లిదండ్రులు, బాలిక కేకలు వేశారు. దీంతో నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. అదే క్రమంలో శృంగారపురంలోని 12 ఏళ్ల మరో బాలికను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని, బాలిక నాయనమ్మ గుర్తించి కేకలు వేయటంతో పరారయ్యారని స్థానికులు తెలిపారు. మరికొద్దిసేపటికే మరో వీధిలో నివాసం ఉండే 11 ఏళ్ల బాలికను తీసుకెళ్లే ప్రయత్నంలో నిందితులు పట్టుబడ్డారు. తొలుత బాలిక అనుకుని బాలుడిని తీసుకెళ్లబోయారు. గుర్తించి మళ్లీ బాలికను అపహరించే యత్నం చేయగా కుటుంబీకులు గుర్తించారు. కుటుంబసభ్యులు, స్థానికులంతా అక్కడికి చేరుకొని గాలించగా, పాఠశాల వద్ద నక్కి ఉన్న వీరిని గుర్తించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అప్పటికే ముట్లకుంట కాలనీ వాసులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చారు. బాలికలు నిందితులను గుర్తించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో బాషా పాత నేరస్తుడని, గతంలో దొంగతనం కేసులో ఇతనికి శిక్ష పడిందని పోలీసులు తెలిపారు. వీరితో పాటు వచ్చిన మరో వ్యక్తి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. -
బూచోళ్లను పట్టుకున్నారు!
చిన్న పిల్లలు కనిపించే దేవుళ్లంటాం.. ఏడిస్తే ఓదారుస్తాం.. అల్లరి చేసినా అక్కున చేర్చుకుంటాం.. మారాం చేసినా గారాబంగా చూసుకుంటాం..గోరుముద్దలు తినిపిస్తూ ఆడిస్తాం..లాలిస్తాం.. రాత్రి పూట నిద్రలేచి ఏడుస్తుంటే ‘రేయ్.. ఏడ్చొద్దు.. ఏడిస్తే బూచోడు పట్టుకుపోతాడు’ అని మాయమాటలు చెప్పి నిద్రపుచ్చుతాం.. అవే మాటలే ఆ తల్లిదండ్రులకు నిజమయ్యాయి..అభం శుభం తెలియని పసిపిల్లలు ఆడుతూపాడుతూ కళ్లెదుట తిరగాల్సిన సమయంలో అదృశ్యమయ్యారు.. నెలలు గడుస్తున్నా చిన్నారుల ఆచూకీ లేదు..వారినే తలుచుకుంటూ ‘అదిగో వస్తున్నారు..ఇదిగో పిల్లలొస్తున్నారు’ అని నిద్రాహారం మానేసి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఓపికున్నంత వరకు గాలించారు. తెలిసినవారందరినీ విచారించారు. పూజలూ పునస్కారాలు చేశారు. పోలీసులకు మొర పెట్టుకున్నారు. వారి నిరీక్షణ పోలీసుల రూపంలో ఫలించింది. పిల్లలను ఎత్తుకెళ్లిన బూచాళ్లను పట్టుకున్నారు. వారి నుంచి ముగ్గురు పిల్లలనూ స్వాధీనం చేసుకుని, తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతపురం సెంట్రల్: కదిరి ప్రాంతంలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను ఎస్పీ అశోక్‌కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. 12 మంది సభ్యులు గల ముఠాలో కీలక నిందితుడైన పసుపులేటి సుబ్బరాయుడుతోపాటు రామాంజనేయులు (నల్లచెరువు మండల కేంద్రం), రాజు (కర్నూలు జిల్లాడోన్), రాజేష్ (నిజామాబాద్ జిల్లా కేంద్రం రోటరీనగర్), సొత్తుపాటి హరికృష్ణ (హైదరాబాద్‌లోని శేర్లింగంపల్లి)ను అరెస్ట్ చేసి, ఒక కారును స్వాధీనం చేసుకుంది. వీరి చెరలో ఉన్న వికాస్, జైనుల్లా, శివసాయి అనే ముగ్గురు చిన్నారులకు విముక్తి కల్పించింది. ముఠాలోని మిగతా ఏడుగురు సభ్యులైన బాబు (నిజామాబాద్), రవి, కిరణ్, సాయి (డోన్), నాగమ్మ, నిర్మల, సాయిరాం (నల్లచెరువు)ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అశోక్‌కుమార్ శుక్రవారం అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్ చేశారిలా.. ఈ ఏడాది మార్చి 12న కదిరి పట్టణం రాజేంద్రప్రసాద్ వీధికి చెందిన ఆంజనేయులు కుమారుడు వికాస్(6)ను ప్రభుత్వాస్పత్రి వద్ద చాక్లెట్ చూపించి ముఠా సభ్యులు కిడ్నాప్ చేశారు. ఈ చిన్నారిని ఎత్తుకెళ్లిన ముఠా సభ్యుల్లో ఒకరైన నిజామాబాద్‌కు చెందిన బాబు నానిగా పేరు మార్చి.. రూ.2లక్షలకు అమ్మేశాడు. ఏప్రిల్ 3న నల్లచెరువులో అల్లాబకాష్ కొడుకు జైనుల్లా(6) పాఠశాల వద్ద ఉండగా అదే తరహాలోనే కిడ్నాప్ చేశారు. చందుగా పేరు మార్చి అమ్మేశారు. జూలై 6న కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన నాగరాజు కుమారుడు శివసాయి(6) ఇంటివద్ద ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసి.. అజయ్‌గా పేరు మార్చి.. అమ్మేశారు. ముఠాలోని కొందరు ఈ పిల్లలకు పిక్ ప్యాకెట్లు ఎలా కొట్టాలో శిక్షణ ఇచ్చేందుకు కర్ణాటకలోని గుల్బర్గా, మహారాష్ట్రలోని పూణే ప్రాంతాలకు తీసుకెళ్లారు. రంగంలోకి ప్రత్యేక బృందాలు శివసాయి అదృశ్యానికి ముందు రోజు ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మిస్సింగ్ కేసును ఛేదించడంపై ఎస్పీ దృష్టిపెట్టారు. ఎంత లోతుగా విశ్లేషిస్తున్నా ఆచూకీ లభించలేదు. కదిరి పరిసర ప్రాంతాల్లో ఈ తరహా మిస్సింగ్ అంతకు ముందు జరిగినట్లు అక్కడి పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. దీని వెనుక ముఠా ఉన్నట్లు భావించిన ఎస్పీ.. ఈకేసును సవాల్‌గా తీసుకొని ప్రత్యేకబృందాలను రంగంలోకి దింపారు. కదిరి ఇన్చార్జ్ డీఎస్పీ వెంకటరమణ, సీఐ శ్రీధర్, ఎస్ఐలు ప్రసాద్, హేమంద్కుమార్, ప్రసాద్‌ల ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. పిల్లల ఆచూకీ కోసం మన రాష్ట్రంతో పాటు కేరళలో కూడా పర్యటించి వచ్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 9న తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన అరుణ్ అనే చిన్నారి కిడ్నాప్ చేధింపు ఘటనలో పసుపులేటి సుబ్బరాయుడు, మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యేక బృందం పోలీసులు సుబ్బరాయుడును కస్టడీలోకి తీసుకొని విచారించారు. కదిరి ప్రాంతంలో చిన్నపిల్లల కిడ్నాప్‌కు పాల్పడింది తామేనని వారు అంగీకరించారు. దొరకరనుకున్న పిల్లలు తిరిగి వచ్చేసరికి ఒక రోజు ముందుగానే ఆ కుటుంబాల్లో పండుగ సందడి నెలకొంది. -
మహిళలకు రక్షా కవచం
విశాఖపట్నం : మహిళలు, బాలల అక్రమ రవాణా, వారిపై దాడులు, కిడ్నాప్‌లు వంటి సంఘవిద్రోహ చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా రెవెన్యూ, పోలీసు విభాగాలు సంయుక్త కార్యాచరణ సిద్ధం చేశాయి. విశాఖను మహిళా, బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించాయి. ‘బంగారు తల్లులు–అంగడి సరుకులు’ అనే శీర్షకతో ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కధనంపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఓ పక్క పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మరో వైపు జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఉమెన్ ట్రాఫికింగ్‌పై మంగళవారం జిల్లాస్థాయిలో సమీక్షించారు. మహిళలను ఆదుకునేందుకు, బాలకార్మికులు, బాల యాచకుల గుర్తింపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. వివిధ రూపాల్లో హింసకు గురయ్యే బాధిత మహిళలకు అవసరమైన మద్దతు, సహాయం అందజేయడంతోపాటు వారి పునరావాసానికి ఉద్దేశించిన వన్‌స్టాప్ సెంటర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గత ఏడాది జనవరిలో కేజీహెచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంపై తగిన ప్రచారం లేకపోవడం వల్ల ఫలితాలు రావడంలేదన్న అభిప్రాయాన్ని కలెక్టర్ వ్యక్తం చేశారు. ఈ కేంద్రం పనితీరును మెరుగుపర్చాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఐసీడీఎస్ పీడీ చిన్మయిదేవిని ఆదేశించారు. వన్‌స్టాప్ సెంటర్‌కు శాశ్వత భవనం కోసం విమ్స్‌లో స్థలాన్ని కేటాయించేందుకు పంపిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం లభించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. హెల్ప్లైన్ల ఏర్పాటు హింసకు గురయ్యే మహిళలు 0891–2564575 లేదా ఉమెన్ హెల్ప్‌లైన్–181కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు. మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో బాలకార్మికుల, బాలయాచకుల లేకుండా చూడాలని అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆయన కోరారు. నగరంలోని పలు కూడళ్లలో బాలయాచకుల సమస్య ఎక్కువగా ఉందని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తేగా దీనిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించేలా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలకార్మికులు, బాలయాచకులను గుర్తించి వారికి తగిన పునరావాసం కల్పించాలన్నారు. నగరంలో బాలకార్మికులు, బాలయాచకులు, తప్పిపోయిన బాలలను ఎవరైనా గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్–1098కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని విజ్ఞప్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో డ్రాపవుట్స్‌పై సర్వే నిర్వహించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీపీవో రామశాస్త్రి, పంచాయతీరాజ్ ఎస్ఈ గజేంద్ర తదితరులతో పాటు ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
శవమై తేలిన ఇంజినీరింగ్ విద్యార్థి
కిడ్నాప్ అరుునట్టు భావించిన యువకుడి మృతి హత్యేనంటున్న బంధువులు పోలీసుల అదుపులో ప్రదీప్‌పై దాడిచేసిన నిందితులు కశింకోట: కశింకోటలో కిడ్నాప్ అరుునట్టు భావిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి సోమవారం శవమై కనిపించడం సంచలనం కలకలంరేపింది.. ఇది హత్యా? లేక ఆత్మహత్య? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. మాకవరపాలెంలోని ఒక కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న అగనంపూడి దానబోరుునపాలెంకి చెందిన దానా ప్రదీప్(22) కనిపించకపోవడంతో గత శనివారం అతని తండ్రి రాము పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రదీప్ గత శుక్రవారం తన స్నేహితుడు తులసీకుమార్తో కలిసి కశింకోట వచ్చాడు. తనతో పాటు బీటెక్ 4వ సంత్సరం చదువుతున్న కశింకోటకు చెందిన సహా విద్యార్థినితో పరిచయం ఉన్న మేరకు మాట్లాడ సాగారు. ఈ విషయాన్ని గమనించిన ఆ విద్యార్థిని బంధువులు సారుు, సాకేత్ తదితరులు ప్రదీప్‌ను కొట్టి గాయపరిచారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని అతనితోపాటు వచ్చిన స్నేహితుడు తులసీకుమార్ను బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అరుుతే ప్రదీప్ అప్పటి నుంచి ఇంటికి చేరకపోవడంతో తండ్రి రాము అనుమానంతో పోలీసులను ఆశ్రరుుంచి, కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా, మునగపాక మండల పరిధిలోని ఉమ్మలాడ వద్ద శారదానదిలో శవమై ప్రదీప్ కనిపించాడు. సరిగ్గా గుర్తు పట్టని విధంగా ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసి అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అరుుతే కిడ్నాప్‌కు గురైన ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడా?లేక హత్య చేశారా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. మృతదేహం చేతులు కట్టి ఉండటాన్ని బట్టి హత్య చేసి ఉంటారని తండ్రి రాము, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుమారు 25 మంది ప్రమేయం ఉందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరుుతే నది నుంచి మృతదేహాన్ని వెలికి తీయడానికి చేతులకు చీర కట్టినట్టు ఎస్ఐ బి.మధుసూదనరావు పేర్కొన్నారు. సంఘటన జరిగిన రోజు ప్రదీప్‌ను కొట్టిన నిందితులు సారుు,సాకేత్ తమ అదుపులో ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. శోక సంద్రంలో కుటుంబం : రాము,సత్యవతి దంపతులకు మృతుడు ప్రదీప్ ఒక్కడే కుమారుడు. కుమార్తెకు వివాహం అరుుంది. దర్జీగా పని చేస్తూ రాము తన కుమారుడు పదీప్ను చదివిస్తున్నాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు మృతి చెందడం కుటుంబాన్ని కలచి వేచింది. శోక సముద్రంలో మునిగిపోయారు. శనివారం ఫిర్యాదు చేయగా, ఆదివారానికి కూడా పోలీసులు ప్రదీప్ ఆచూకీ తెలపకపోవడంపై కుటుంబ సభ్యులు కశింకోట పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు న్యాయం చేయాలి : ప్రదీప్ వ్యవహారంలో అతని కుటుంబానికి పోలీసులు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి జిలకర్ర నాగేంద్ర డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందన్నారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారని విశాఖ జీవీఎంసీ 56వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పూర్ణానంద శర్మ విమర్శించారు. బాధితుల ఆందోళన అనకాపల్లిటౌన్: కశింకోట పోలీసులకు వ్యతిరేకంగా గాజువాక మండలం అగనంపూడి దానబోరుునపాలెం గ్రామస్తులు, ప్రదీప్ కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. తమ కుమారుడు ప్రదీప్ (22)ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేసినా కశింకోట పోలీసులు పట్టించుకోలేదని, పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ప్రదీప్ సజీవంగా ఉండేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకొని డీఎస్పీ పురుషోత్తంతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన డీఎస్పీ పోస్టుమార్టం పరీక్షల అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పల్లాకు చెప్పడంతో ఆందోళనకారులను ఎమ్మెల్యే పల్లా శాంతింపచేశారు. -
మంచితనంగా ఇంటికి పిలిచి దారుణం
అమృత్సర్: తమకు ఉన్న పరిచయం మేరకు మంచితనంగా ఓ గృహిణిని ఇంటికి పిలిపించి ఆమె ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చిన స్నేహితురాలిపై దాడి చేసి స్పృహలేనిపరిస్థితుల్లో చనిపోయిందనుకొని ఓ కాలువలో పడేశారు. అదృష్టం కొద్ది ఆమె తిరిగి స్పృహలోకి రావడంతో నేరుగా ఇంటికెళ్లి భర్తకు చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని అమృత్ సర్ లో గుర్మీత్ కౌర్ అనే ఓ మహిళ ఉంది. ఆమెకు బాజ్ సింగ్, ఫతే అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరిని తీసుకొని తమ ఇంటికి రావాల్సిందిగా మంజిత్ కౌర్ మహిళ ఆహ్వానించింది. ఆమె ఇంటికి రాగానే మంజిత్ కుమారుడు మహిందర్ జిత్, వాళ్లింట్లో పనిచేసే హరిజిందర్ అనే ఇద్దరు వారిపై దాడి చేశారు. ఆమెను కొట్టి చనిపోయిందని కాలువలో పడేసి పిల్లలను ఎత్తుకెళ్లారు. అందులో ఫతేకు ఎనిమిది నెలలు కాగా బాజ్‌కు ఎనిమిదేళ్లు. వీరిని నేరుగా తీసుకెళ్లిన వారు క్షుద్రపూజలకోసం అమ్మేశారు. పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో ఈ విషయం తెలిసింది. బాజ్‌ను రూ.50వేలకు దీరా బాబా నానక్ అనే తాంత్రికుడికి అమ్మినట్లు తెలిసింది. అయితే, బాజ్ తిరగబడినంత పనిచేయడంతో విషయం బయటకు పొక్కుతుందని భయంతో అతడిని హత్య చేసి ఓ ఊరి వద్ద పడేశారు. నేరాన్ని వారు స్వయంగా అంగీకరించడంతో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. -
నోటికి ప్లాస్టర్.. సంకెళ్లతో జడ్జి కుమారుడు
కరాచీ: తాలిబన్లు ఎత్తుకెళ్లిన పాకిస్థాన్ న్యాయమూర్తి కుమారుడు దొరికాడు. పాక్ సైనికులు అతడిని గుర్తించారు. నోటికి ప్లాస్టర్, చేతినిండా సంకెళ్లు వేసి పూర్తిగా బురఖా కప్పి ఉన్న అతడిని సైనికులు మంగళవారం తమ ఆదీనంలోకి తీసుకున్నారు. గత నెల(జూన్ 21)న సింధు ప్రావిన్స్ చీఫ్ జస్టిస్ సాజిద్ అలీ షా కుమారుడు అవాయిష్ షాను తాలిబన్ ఉగ్రవాదులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీవ్రంగా గాలింపులు జరిపినా అతడి జాడ తెలియలేదు. తన మిత్రుడిని కలిసి ఓ షాపింగ్ మాల్ వద్దకు వెళ్లి తిరిగొస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆయనను ఎత్తుకెళ్లారు. ఎట్టకేలకు అతడు ప్రాణాలతో దొరకడంతో ఆర్మీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాపర్లను సైన్యం కాల్చి చంపింది. తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కార్లో వెనుక సీట్లో బందీగా ఉన్న అతడిని పాక్ పశ్చిమ భాగంలోని గిరిజన ప్రాంతంలో సైన్యం గుర్తించింది. -
ఫలించిన నిరీక్షణ
విశాఖ ఇంజినీర్‌ను విడిచిపెట్టిన కిడ్నాపర్లు 18 రోజుల తర్వాత విముక్తి స్వీట్లు పంచుకున్న కుటుంబ సభ్యులు భర్త శ్రీనివాస్‌తో స్కైప్‌లో మాట్లాడిన లలిత పెదవాల్తేరు : కన్నీటి స్థానంలో ఆనంద బాష్పాలు.. దీన వదనాల్లో సంతోష రేఖలు.. నైజీరియాలో కిడ్నాప్‌నకు గురైన ఇంజనీరు సాయిశ్రీనివాస్ ఇంట్లో సందడి వాతావరణం.. విడుదలైనట్టు క్షేమ వార్త తెలియడంతో 18 రోజుల తర్వాత శనివారం ఉత్కంఠ వీడింది. దీంతో కుటుంబమంతా ఆనందడోలికలలో మునిగితేలారు. నైజీరియాలోగల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి ఈ సమాచారాన్ని తనే స్వయంగా ఫోన్ ద్వారా సాయిశ్రీనివాస్ భార్య లలితకు తెలిపారు. భారత హైకమిషన్, అక్కడి ఫెడరల్ గవర్నమెంట్‌తో పాటు, బెన్యూ రాష్ర్ట ప్రభుత్వం, డెంకోట్ ఇండస్ట్రీస్ చేసిన కృషి ఎట్టకేలకు ఫలించింది. ప్రస్తుతం సాయిశ్రీనివాస్‌తోపాటు మరో భారతీయుడు అనిష్లు వారు పనిచేస్తున్న కంపెనీలో సురక్షింతంగా ఉన్నారు. వారికి అక్కడి ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఫలించిన మంతనాలు డెంకోట ఇండస్ట్రీస్ యాజమాన్యం కిడ్నాపర్లతో జరిపిన చర్చలు ఫలించడంతో కిడ్నాపర్ల చెరలో ఉన్న ఇద్దరి భారతీయులను సురక్షింతంగా విడిచిపెట్టారు. దీంతోపాటు అక్కడి ఫెడరల్ గవర్నమెంట్, బెన్యూ రాష్ట్ర ప్రభుత్వాలపై నైజరియాలో గల భారత హైకమిషన్ ఒత్తిడి తీసుకురావడంతో కిడ్నాప్ ఉదంతానికి చెక్ పడింది. శనివారం ఉదయం 10.30గంటల సమయంలో నైజీరియాలో గల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి ఫోన్ ద్వారా సమాచారం అందించారని సాయిశ్రీనివాస్ భార్య లలిత ఆనందభాష్పాల నడుమ తెలిపింది. ఈ 18 రోజులు క్షణమొక యుగంలా గడిచిందని, నరకయాతన అనుభవించామని ఉద్వేగంతో పేర్కొన్నారు. తెల్లవారితే ఏ కబురు వినాల్సి వస్తుందోనని నిద్రాహారాలు మాని గడిపామని బోరున విలపించారు. అందరికీ ధన్యవాదాలు నైజిరియాలో తన భర్త కిడ్నాప్‌నకు గురైన క్షణం నుంచి అతను సురక్షితంగా విడుదల కావాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని సాయిశ్రీనివాస్ భార్య లలిత ఉద్విగ్నంగా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ, మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి,ఎంపీ హరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్లు తన భర్త సమస్యను భారత ైహైకమిషన్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఢిల్లీలోని ఆంధ్రభవన్ , నైజీరియాలో గల భారత రాయబారి బి.ఎన్.రెడ్డి కృషి మరవలేనన్నారు. వీరు ఎప్పటికప్పడు తనకు సమాచారం అందించి మనోస్థైర్యాన్ని నింపారన్నారు. క్షణమొక యుగంలా... రోజూ రక్షణ సిబ్బంది తోడుగా కార్యాలయానికి వెళ్లేవాడిని. ఆ రోజు సెక్యూరిటీ లేకుండానే విధులకు బయలుదేరాను. కొద్ది సేపటిలో కంపెనీకి చేరుకుంటామనగా అగంతకులు దాడి చేశారు. రెప్పపాటులో నన్ను, మరో ఇంజినీరు అనిష్‌ను వారి వాహనంలోకి తరలించి నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకుపోయారు. అక్కడ మా ఇద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు. కేవలం రొట్టె మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. 18 రోజులూ అది తినే బతికాం. ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపాం. క్షణమొక యుగంలా గడిచింది. మళ్లీ కుటుంబ సభ్యులను కలుస్తామని అనుకోలేదు. ఆ భగవంతుడి దయ, భారత ప్రభుత్వం కృషి వల్ల సజీవంగా కిడ్నాపర్ల చెర నుంచి వీడాం. కిడ్నాపర్ల డిమాండ్లను నైజీరియా ప్రభుత్వంతోపాటు మా కంపెనీ త్వరగా తీర్చి ఉంటే ఇంకా ముందుగానే విడుదలయ్యేవాళ్లం. మీడియాలో వరుసగా వచ్చిన కథనాల వల్ల ఆలస్యమయింది. నా విడుదలకు ప్రయత్నించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ ఉద్వేగంగా సాయి శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడారు. అంతకుముందు స్కైప్‌లో భార్యతో మాట్లాడిన సాయిశ్రీనివాస్ మాసిన గెడ్డంతో నీరసంగా కనిపించారు. ఆరోగ్యం క్షీణించి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొత్తూరులో కిడ్నాప్ కలకలం
కొత్తూరు : కొత్తూరు మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఆర్ఎంపీ (ఆయుర్వేదిక్) వైద్యుడిని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కిడ్నాప్ చేశారన్న వార్త స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగి 24 గంటలు గడిచినప్పటికీ సదరు వైద్యుడిని ఎవరు తీసుకువెళ్లారన్న విషయంలో స్పష్ట త కొరవడింది. మంగళవారం వైద్యుడి కుటుంబ సభ్యులు కొత్తూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్టు తెలియవచ్చింది. ఈ ఆర్ఎంపీ వైద్యుడు ఎవరు ? ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విషయమై కొత్తూరు పీఎస్సై జనార్దనరావు వద్ద ప్రస్తావించగా.. కిడ్నాప్ ఘటనపై తమ కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు. హల్చల్ చేస్తున్న ఉదంతాలు... ఇటీవల సీతంపేట ఏజెన్సీ దొనుబాయి కేంద్రంగా పురాతన రాగి నాణేలు క్రయ, విక్రయాల జరిగిన విషయం బయట పడటంతో పోలీసులు నిఘా పెంచారని వదంతులు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనుమానితులను పోలీసులు ఆదుపులోకి తీసుకుంటున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యుడితో పాటు సీతంపేట, కొత్తూరు మండలాలకు చెందిన మరికొంత మందిని కూడా పోలీసులు ఆదుపులోకి తీసుకొన్నారని వందలు వినిపిస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులు సైతం పాలకొండ, సీతంపేట, వీరఘట్టాం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. -
భీమవరంలో కిడ్నాపర్లు అరెస్ట్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టర్ను కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారుతోపాటు రూ. 4.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.