
విద్యార్థి ఆయుష్ ( ఫైల్ ఫోటో)
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో దారుణం చోటు చేసుకుంది. ఢిల్లీ యూనివర్సీటీకి చెందిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన దుండగులు వారం రోజుల తర్వాత హత్య చేశారు. విద్యార్థి కుటుంబాన్ని 50లక్షలు డిమాండ్ చేసిన దుండగులు.. డబ్బులు ఇవ్వకపోవడంతో అతడిని హత్య చేసి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని పడేశారు. పోలీసుల వివరాల ప్రకారం..21 ఏళ్ల ఆయుష్ నౌటియల్ ఢిల్లీలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. గత గురువారం ఇంటి నుంచి కాలేజీ వెళ్లిన అతడిని దుండగులు కిడ్నాప్ చేశారు.
సాయంత్రం అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలోనే ఆయుష్ తండ్రికి వాట్సాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దాంట్లో ఆయుష్ కిడ్నాప్ చేశామని, 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని డిమాండ్ చేయడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం దుండగులకు 10 లక్షలు ఇస్తామని చెప్పి వారు ఉండేచోటు కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆయుష్ ఆచూకీని కనుక్కోలేకపోయారు. చివరికి బుధవారం రాత్రి ద్వారకాలోని ఓ కాలువ వద్ద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు దుండగుల ఆచూకీ కనిపెట్టలేకపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment