బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన మున్సిపల్ అధికారులు
ఫాంహౌస్ నిర్మాణం అక్రమ నిర్మాణమేనని స్పష్టం చేసిన అధికారులు
8 బోన్లలో..14 కుక్కల గుర్తింపు బాతులు, కోళ్లు కూడా
శంషాబాద్: ఇటీవల సంచలనం రేపిన ఎమ్మార్పీఎస్ నేతలు నరేందర్, ప్రవీణ్‌లను కిడ్నాప్ చేసి బంధించిన ఫాంహౌస్‌ను సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య శంషాబాద్ మున్సిపాలిటీ అధికారులు నేలమట్టం చేశారు. పట్టణంలోని 103 సర్వే నంబరులో ధర్మగిరి ఆలయానికి సమీపంలో కిడ్నాపర్లు సుమారు వెయ్యి గజాల స్థలంలో ఈ ఫాంహౌస్‌ను నిరి్మంచినట్లు గుర్తించారు. రెండు మూడేళ్ల క్రితంఎలాంటి అనుమతులు లేకుండా రెండు రేకుల షెడ్‌లతో పాటు ప్రహరీ, కుక్కలను ఉంచేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బోన్లను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో బాతులు, కోళ్లను కూడా పెంచుతున్నారు. కిడ్నాప్ సంఘటనతో పాటు అప్రత్తమైన పోలీసులు ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న గుర్తించిన మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు.
అక్రమ నిర్మాణంగా తేలితే కూల్చివేయాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషన్ బి. సుమన్‌రావు ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇటీవల ఫాంహౌస్‌కు నోటీసులు అంటించారు. సోమవారం మూడు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కుక్కలతో పాటు, కోళ్లు, బాతులను తీసుకెళ్లేందుకు పశుసంవర్థక శాఖతో పాటు బ్లూక్రాస్‌కు సమాచారం అందించారు. అప్పటి వరకు కుక్కలకు సంబంధించిన బోన్ల కూలి్చవేతను నిలిపివేశారు. ఫాంహౌస్ పూర్తిగా అక్రమ నిర్మాణమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కూల్చివేతల సమయంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ అక్కడికి రాలేదు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం..
భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. భూ కబ్జాదారులు ఇబ్బంది పెడితే పోలీసులను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment