
తలపై బలంగా బాదినట్లు ఆనవాళ్లు
కర్ణాటక: వ్యాపారవేత్త భార్య ఫాంహౌస్‌లో శవమై కనిపించింది. ఈ ఘటన రామనగర జిల్లా కగ్గలీపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శాంతి స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని ఉగ్రప్ప తన భార్య శాంతమ్మ(50)పేరుతో పలు వ్యాపారాలు చేస్తుండేవారు. ఉగ్రప్ప కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
దీంతో శాంతమ్మ గిరిగౌడనదొడ్డిలోని ఫాంహౌస్‌లో నివసిస్తుండేది. శాంతమ్మ అక్క కుమారుడు డాక్టర్ నంజేశ్ ఆమెకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఏం జరిగిందో ఏమో శాంతమ్మ ఫాంహౌస్‌లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కగ్గలీపుర పోలీసులు వచ్చి పరిశీలించారు. తలపై బలంగా రాతితో బాదిన ఆనవాళ్లు కనిపించాయి. హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment