ఎయిరిండియా పైలట్ అనుమానాస్పద కలకలం రేపింది. దీనికి ఆమె బాయ్ ఫ్రెండే కారణమని బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు..
ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న 25ఏళ్ల సృష్టి తులి ఈనెల 25న ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆదిత్య పండిట్ తరచూ ఆమెను వేధించేవాడని, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని సృష్టి కుటుంబం ఆరోపించింది. నాన్ వెజ్ తినవద్దు అంటూ కట్టడి చేసేవాడని తెలిపింది. అతనే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 26న కేసు నమోదు చేసిన పోలీసులు పండిట్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతడిని నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపింది.
పోలీసుల సమాచారం ప్రకారం ఆమె మృతదేహానికి సమీపంలో లేదా ఆమె ఫ్లాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సృష్టి కమర్షియల్ పైలట్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె గత ఏడాది జూన్ నుంచి ఉద్యోగ నిమిత్తం ముంబైలో నివసిస్తోంది. రెండేళ్ల క్రితం కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో సృష్టి, పండిట్‌లు ఢిల్లీలో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ట్రైనింగ్‌లో ఆదిత్య పండిట్ పైలట్‌గా ఎంపిక కాలేదు.
ఘటనకు ముందు దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల పాటు పండిట్ సృష్టితో కలిసి అంధేరి ఫ్లాట్‌లో ఉన్నాడు. సోమవారం (నవంబర్ 25) అర్ధరాత్రి దాటిన తర్వాత అతను కారులో ఢిల్లీకి బయలుదేరాడు. ఈ సమయంలో సృష్టి అతనికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అతడు ముంబైకి తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు ఉర్వి పంచల్‌ను సంప్రదించి, కీమేకర్ సాయంతో తలుపు తెరిచారు. కానీ అప్పటికే కేబుల్ వైర్‌తో ఉరి వేసుకుంది. అంధేరీ ఈస్ట్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
సృష్టి మామ ఆరోపణలు
'పండిట్‌ను సృష్టి చాలా గాఢంగా ప్రేమించింది. కానీ అతడు ఆమెను బాగా వేధించేవాడు. బహిరంగంగా దుర్భాషలాడేవాడు. మాంసాహారం తినడం మానేయాలని కూడా ఒత్తిడి చేశాడు. ఆమె పట్ల పండిట్ అసభ్యంగా ప్రవర్తించడం ఇతర బంధువులు కూడా చూశారు. అలాగే ఒక పార్టీలో మాంసాహారం తిన్నందుకు అందరిముందూ అరిచాడు. ఆమె కారును పాడు చేసి, రోడ్డుపై ఒంటరిగా వదిలేసివెళ్లిపోయాడు. ఇటీవల పండిట్ సోదరి నిశ్చితార్థం ఫంక్షన్‌కు సృష్టి వెళ్లలేకపోవడంతో దాదాపు 10 రోజుల పాటు మాట్లాడలేదు. దీంతో సృష్టి మానసికంగా కృంగి పోయింద'ని సృష్టి మామ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment