woman died Suspicious
-
ఫాంహౌస్‌లో శవమై తేలిన వ్యాపారవేత్త భార్య
కర్ణాటక: వ్యాపారవేత్త భార్య ఫాంహౌస్‌లో శవమై కనిపించింది. ఈ ఘటన రామనగర జిల్లా కగ్గలీపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శాంతి స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ యజమాని ఉగ్రప్ప తన భార్య శాంతమ్మ(50)పేరుతో పలు వ్యాపారాలు చేస్తుండేవారు. ఉగ్రప్ప కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందారు. ఉన్న ఒక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో శాంతమ్మ గిరిగౌడనదొడ్డిలోని ఫాంహౌస్‌లో నివసిస్తుండేది. శాంతమ్మ అక్క కుమారుడు డాక్టర్ నంజేశ్ ఆమెకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఏం జరిగిందో ఏమో శాంతమ్మ ఫాంహౌస్‌లో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కగ్గలీపుర పోలీసులు వచ్చి పరిశీలించారు. తలపై బలంగా రాతితో బాదిన ఆనవాళ్లు కనిపించాయి. హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
Anakapalle: విడాకులు కోరిందని కసితో హత్య చేసిన భర్త
అచ్యుతాపురం (అనకాపల్లి): అతనిది గాజువాక..ఆమెది అగనంపూడి. ఇద్దరివీ వేర్వేరు కులాలు...ఇద్దరూ ఇష్టపడ్డారు...పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు. అయితే మూడు నెలల్లోనే ప్రేమ కాస్తా ఆవిరైపోయింది. ఆమెకు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దానికి భర్త వేధింపులు తోడయ్యాయి. దీంతో మూణ్ణెళ్లకే వారి ప్రేమ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటైంది. విసిగి వేసారిన భార్య విడాకులు కోరడంతో ప్రేమించిన భర్త పగబట్టాడు. భార్య ఉసురు తీశాడు. అచ్యుతాపురంలోని లాడ్జిలో గత నెల 29వ తేదీన మహాలక్ష్మి అనే వివాహిత హత్య కేసులో వెలుగు చూసిన విషయాలివి. ఈ కేసులో మృతురాలు తండ్రి ఎస్.సాంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ సత్యనారాయణ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గాజువాక బీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్, అగనంపూడిలో నివాసముంటున్న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి సాంబ కుమార్తె మహాలక్ష్మి మూడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం లేనప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వారి కాపురం మూడు నెలల వరకూ సజావుగా సాగింది. ఎస్టీ లంబాడీ కులానికి చెందిన మమహాలక్ష్మికి వంటలు రావని, కట్నం తేలేదని శ్రీనివాస్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు చిన్నచూపుతో వేధించడం మొదలుపెట్టారు. దీనిని భరించలేక మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా శ్రీనివాస్ వేధింపులు మానలేదు. రాంబిల్లి మండలంలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న మహాలక్ష్మిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేని మహాలక్ష్మి దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు మృతురాలు తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోరడంతో ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోమని సూచించారు. దీంతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించిన మహాలక్ష్మిపై శ్రీనివాస్ పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం గత నెల 29న అచ్యుతాపురంలోని లాడ్జిలో రూం తీసుకొని మహాలక్ష్మికి ఫోన్ చేశాడు. మంచిగా మాట్లాడి లాడ్జికి రమ్మని కోరాడు. అతని మాటలు నమ్మిన మహాలక్ష్మి భర్తను కలవడానికి వెళ్లింది. అప్పటికే రెండు కత్తులు, మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు సిద్ధం చేసుకున్న శ్రీనివాస్ మహాలక్ష్మిపై సాయంత్రం 4 గంటలకు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి పొడిచాడు. ఆమె అరుపులు విని పక్కరూంలో ఉన్న వారు లాడ్జి మేనేజర్‌కు తెలపగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి లాడ్జి తలుపులు తోసి లోపలకు వెళ్లగా రక్తపు మడుగులో మహాలక్ష్మి, బాత్రూంలో శ్రీనివాస్ పడి ఉన్నారు. వెంటనే ఇద్దరినీ అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్తుండగా మహాలక్ష్మి మృతి చెందింది. శ్రీనివాస్ రెండు రోజుల తర్వాత కోలుకున్నాడు. ఈ నెల 8వ తేదీ ఉదయం శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, జరిగినదంతా వెల్లడించాడని డీఎస్పీ విలేకరులకు తెలిపారు. విడాకులు ఇస్తే తన జీవితం నాశనం అవుతుందని, తన లాగే మహాలక్ష్మి జీవితం నాశనం కావాలనే కక్షతో శ్రీనివాస్ ఆమెను హత్య చేసినట్టు తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ మురళి పాల్గొన్నారు. -
వరకట్న దాహానికి వివాహిత బలి
కోలారు: వరకట్న దాహానికి ఓ వివాహిత బలైన ఘటన మంగళవారం కోలారు నగరంలోని ఖాద్రిపురలో చోటు చేసుకుంది. వివరాలు.... బంగారుపేట తాలూకా దొడ్డూరు గ్రామానికి చెందిన అంబిక (25)కు కోలారులోని ఖాద్రిపురకు చెందిన మధు అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మధు ప్లంబర్, వాటర్ ఫిల్టర్ రిపేరీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. మద్యానికి బానిసై వేధింపులు వివాహమైన కొత్తలో వీరి కాపురం సజావుగానే సాగినా అనంతరం మధు తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్య అంబికను డబ్బు కోసం వేధించేవాడు. తరచుగా కట్నం తేవాలని పుట్టినింటికి తరిమేసేవాడు. దీనిపై పలుమార్లు భార్యాభర్తల మధ్య పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. అయినా మధు తీరులో మాత్రం మార్పు కనిపించలేదు. 9 నెలల క్రితం అంబిక రెండవ బిడ్డ పుట్టింది. పుట్టినింటి నుంచి తిరిగి భర్త ఇంటికి వచ్చిన భార్యను మధు యథావిధిగా డబ్బు కోసం వేధించడం మొదలు పెట్టాడు. సోమవారం రాత్రి పీకలదాకా తాగి వచ్చిన మధు భార్యతో గొడవ పడి తీవ్రంగా కొట్టి ఇంట్లోనే ఉరి వేసి చంపాడని మృతురాలి బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తే ఉరివేసి చంపాడు అయితే మధు తరఫు వారు మాత్రం అంబిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. అంబిక ఆత్మహత్య చేసుకోలేదు, భర్తే అంబికను ఉరి వేసి చంపాడని ఆమె చిన్నాన్న వెంకటరామప్ప, బంధువు రాజేంద్ర ఆరోపించారు. అంబిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కోలారు రూరల్ పోలీసులు మధును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
అనుమానాస్పద రీతిలో యువతి మృతి
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్‌లో ప్రముఖ శైవక్షేత్రం దేవగిరి కొండపై ఉన్న కొలనులో అనుమానాస్పద రీతిలో యువతి మృతదేహాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు కాసీపూర్ సమితి సుంగేరు గ్రామానికి చెందిన దేవకి గౌడొ(18)గా గుర్తించారు. దీనిపై ఐఐసీ ముకుందదేవ్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుంగేరు గ్రామానికి చెందిన దేవకితో పాటు మరో ముగ్గురు యువతులు కల్యాణ సింగుపూర్ లోని దేవగిరి మహావిద్యాలయంలో ప్లస్–త్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురూ స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఏదో పనిమీద ఈనెల 22న దేవకి తన తోటి స్నేహితులకు చెప్పి, బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో వారంతా పరిసరాలను గాలించారు. గురువారం దేవగిరి కొండపైకి వెళ్లి అన్ని దిశలా వెతికారు. ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు. అంతా కలిసి ఆదివారం సాయంత్రం దేవగిరి కొండపైకి వెళ్లి వెతకగా, దేవకీకి చెందిన కాలి చెప్పు కనిపించింది. దీంతో ఆందోళన చెందిన వారంతా.. కొండపై ఉన్న కొలనులో చూడగా యువతి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీనిపై కల్యాణ సింగుపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో యువతి శవాన్ని బయటకు తీశారు. యువతి శరీరానికి పెద్ద బండరాయి కట్టి ఉండటంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది హత్యా? లేక ఆత్మహత్య అనే విషయంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొత్త ఏడాది తొలిరోజే ఓ యువతి దారుణంగా హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తప్పతాగిన ఐదుగురు దుండగులు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. శరీరంపై నూలుపోగు కూడా లేకుండా రోడ్డుపై పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ దారుణ సంఘటన ఢిల్లీ సుల్తాన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున తన స్కూటర్‌పై వెళ్తోంది. ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఆమె డ్రెస్ కారు టైరులో చిక్కుకుంది. స్కూటర్‌ను ఢీకొట్టినప్పటికీ ఆగకుండా కారును ముందుకు నడిపారు. టైరులో డ్రెస్ చిక్కుకోవడంతో సుమారు 4 కిలోమీటర్లు ఆ బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలపై ఆ యువతి మృతి చెందింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా యువతి మృతదేహం కనిపించటం కలకలం సృష్టించింది. రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి ముందుగా హత్యాచారంగా భావించారు. కానీ, రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెను కారు వెనకాల ఈడ్చుకెళ్లడం ద్వారా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు రోడ్డుపై మృతదేహం సమచారం అందినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘ఓ మహిళ మృతదేహాన్ని బలెనో కారుకు కట్టి ఈడ్చుకెళ్తున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. కంఝవాలా పోలీస్ స్టేషన్ బృందం ఈ విషయంపై ఆ కాలర్‌కు తిరిగి పలు మార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత బలెనో కారును ఆ వ్యక్తి గుర్తించాడు.’ అని తెలిపారు. ఫోన్ రాగానే పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. రోహిణి జిల్లా క్రైమ్ టీం సైతం అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్జీఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ తర్వాత కారును పట్టుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగినట్లు వారు తెలిపారు. మహిళా కమిషన్ నోటీసులు యువతిని ఈడ్చుకెళ్లి మృతి చెందేందుకు కారణమైన ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వాతి మాలివాల్. ‘ఢిల్లీ కంఘావాలా ప్రాంతంలో ఓ యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. కొందరు యువకులు తప్పతాగి ఆమె స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను పలు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేస్తున్నా.’అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు -
భర్త నుంచి విడిపోయి పాండిచ్చేరిలో ప్రియుడితో సహజీవనం.. కుళ్లిన స్థితిలో..
సాక్షి, తిరువళ్లూరు (చెన్నై): భర్త నుంచి విడిపోయి ప్రియుడితో ఉంటున్న వివాహిత మహిళ కుళ్లిన స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చోళవరం యూనియన్ ఎరుమైవెట్టిపాళ్యం గ్రామానికి చెందిన బాబు(36) స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అముద(30). వీరికి కుమార్తె జయశ్రీ(10), కుమారుడు కిషోర్(07) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త నుండి విడిపోయిన అముద అదే ప్రాంతానికి చెందిన జగదీశ్వరన్ అనే వ్యక్తితో కలిసి సహాజీవనం చేస్తోంది. పాండిచ్చేరిలో ప్రియుడితో కలిసి ఉన్న అముదను గత 20 రోజుల క్రితం తల్లిదండ్రులు తీసుకొచ్చి బాబుతో కలిపి వెళ్లారు. అయితే వారం రోజుల తరువాత అముద మళ్లీ భర్తను వదిలిపెట్టి ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో అముద కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తిరువళ్లూరు మున్సిపాలిటీలోని పెద్దకుప్పంలో మహిళ మృతదేహాం కుళ్లిన స్థితిలో కనిపించింది. మహిళ మృతదేహాన్ని వైద్యశాలకు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ అముదగా గుర్తించారు. ఈ సంఘటనపై బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసి..) -
రెండేళ్ల క్రితమే మృతి.. ఇప్పటికీ ప్రతినెలా ఇంటి రెంట్ చెల్లిస్తున్న మహిళ!
లండన్: రెండేళ్ల క్రితమే మృతి చెందిన ఓ మహిళ నుంచి ఇప్పటికీ ఇంటి రెంటు తీసుకుంటున్నారు ఆ ఇంటి యజమాని. ఈ సంఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగింది. మృతి చెందిన మహిళ నుంచి ఇంటి రెంటు ఎలా తీసుకోగలుగుతున్నారు? అనే అంశాన్ని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. లండన్, పెఖమ్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్లో 61 ఏళ్ల శీలా సెలియోవన్ అనే మహిళ అస్తికలను గుర్తించారు పోలీసులు. మూడో అంతస్తులో ఉంటున్న ఆమె ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు ఆమె ఎముకలు మాత్రమే కనిపించాయి. డెంటల్ రికార్డ్స్ ప్రకారం బాధితురాలిని గుర్తించారు పోలీసులు. ఆమె మరణానికి ఎలాంటి అనుమానాస్పద కారణాలు కనిపించలేదన్నారు. 2019, ఆగస్టులో ఆమె మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. రెండేళ్లుగా కనిపించకపోయినా.. అవివాహిత అయిన 61 శీలా కుటుంబం దక్షిణాఫ్రికాలో ఉంటోంది. ఆమె మృతి చెందినట్లు 2022, ఫిబ్రవరిలో గుర్తించినట్లు డైలీ మెయిల్ నివేదించింది. 2019, అక్టోబర్‌లో ఆమె ఫ్లాట్ నుంచి కుల్లిపోయిన వాసన విపరీతంగా వచ్చినట్లు ఇరుగు పొరుగువారు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సార్లు ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చినా తెరిచేందుకు సరైన కారణం లేదని తిరిగి వెళ్లిపోయారు పోలీసులు. ఆమెను చివరి సారిగా 2019, ఏప్రిల్‌లో చూసినట్లు స్థానికులు తెలిపారు. అదే ఏడాది ఆగస్టులో చివరిసారిగా ఇంటి రెంటు చెల్లించారు శీలా. ఆ తర్వాత చెల్లించకపోవటం వల్ల ఆమె యూనివర్సల్ క్రెడిట్ పేమెంట్స్ నుంచి ఆటోమెటిక్‌గా రెంట్ పే చేసేందుకు హౌసింగ్ గ్రూప్ అంగీకరించింది. ఆ తర్వాత 2020, మార్చి నుంచి ప్రతి నెలా యజమానికి ఆటోమేటిక్‌గా రెంటు అందుతోంది. అయితే.. ఆమెను పలకరించేందుకు ఏ ఒక్కరు ప్రయత్నించకపోవటం గమనార్హం. 2020, జూన్‌లో గ్యాస్ తనిఖీల్లో భాగంగా అధికారులు ఫ్లాట్‌కు వెళ్లగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో శీలా ఉండే ఇంటికి గ్యాస్ కనెక్షన్ తొలగించారు. ఆమె ఫ్రిడ్జ్‌లో ఉన్న ఆహారపదార్థాలపై తేదీల ఆధారంగా ఆమె 2019, ఆగస్టులో చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేశారు. ఆమె 2019, ఆగస్టు 14న టెలిఫోన్ ద్వారా వైద్యుడితో మాట్లాడారు. తనకు ఇబ్బందిగా ఉందని, ఒక్కోసారి శ్వాస తీసుకోలేకపోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాతి రోజు వైద్యుడిని కలవాల్సి ఉంది. కానీ ఆమె హాజరవ్వలేదు. ఇదీ చూడండి: స్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి.. వీడియో వైరల్! -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
జోగిపేట(అందోల్): తన కూతురు కుర్ర అలవేణి (30) మరణంపై అనుమానాలున్నాయని మృతురాలి తండ్రి సంగయ్య శుక్రవారం జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కన్సాన్పల్లి గ్రామానికి చెందిన సంగయ్య తన కూతురును 5 సంవత్సరాల క్రితం వట్పల్లి మండలం బిజిలీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మయ్యకు ఇచ్చి వివాహం చేశారు. గురువారం రాత్రి అలివేణి (30)కి కడుపునొప్పి రావడంతో భర్తతోపాటు వారి కుటుంబ సభ్యులు కన్సాన్పల్లి గ్రామంలో చికిత్సలు చేయించారు. తిరిగి అదే రాత్రి ఇంటికి తీసుకువెళ్లారు. ఉదయం చాలా సేపటి వరకు కూడా ఆమె బయటకు రాకపోవడంతో పక్కింట్లో ఉండే æమహిళ కూలీ పని ఉందని చెప్పడానికి వచ్చి అలివేణి తీవ్ర అస్వస్థతతో ఉండడాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ విషయమై మృతురాలి తల్లిదండ్రులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయిందన్నారు. నా బిడ్డ చనిపోవడానికి మీరే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. గురువారం రాత్రి అస్వస్థతకు గురైతే ఎందుకు చెప్పలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూతురు మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. జోగిపేట ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి కుమారుడు ఉన్నారు. -
హత్యా? ఆత్మహత్యా?
-మహిళ అనుమానాస్పద మృతి సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ ఆలయ దక్షిణ ముఖద్వారం సమీపంలోని మంచినీళ్లగుంట పక్కనే పొలాల్లో తడమండలం వేనాడుకు చెందిన వెట్టి గోవిందమ్మ (55) అలియాస్ కిల్లిమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. మంచినీళ్లగుంట పక్కనే పొలం ఉన్న రాయపు హరిహరకుమార్ అనే అతను సోమవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లడంతో శవాన్ని చూసి సమాచారం అందజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ముఖంపై బలమైన గాయాలుండటంతో హత్యగా భావించారు. ముందు గుర్తు తెలియని శవంగా భావించారు. నాగరాజపురంలో మృతురాలు కుమారుడు రవి కూడా అందరిలాగే శవాన్ని చూడడానికి వచ్చి గుర్తించారు. వేనాడులో కాపురం వుంటూ అప్పుడప్పుడు కుమారుడి వద్దకొచ్చి ఉంటుండేది. శనివారం రాత్రి నుంచి కనిపించకపోయే సరికి వేనాడుకు వెళ్లిఉంటుందని భావించారు. అయితే ఈమెకు మద్యం అలవాటు ఉండటంతో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తీసుకెళ్లి కొట్టి చంపేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ముఖంపై బలమైన గాయాలు వుండడంతో హత్యగానే భావించి కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై గంగాధర్‌రావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.