హత్యా? ఆత్మహత్యా? | woman died Suspicious | Sakshi
Sakshi News home page

హత్యా? ఆత్మహత్యా?

Published Tue, Mar 29 2016 10:32 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

హత్యా? ఆత్మహత్యా?

హత్యా? ఆత్మహత్యా?

 -మహిళ అనుమానాస్పద మృతి
 సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ ఆలయ దక్షిణ ముఖద్వారం సమీపంలోని మంచినీళ్లగుంట పక్కనే పొలాల్లో తడమండలం వేనాడుకు చెందిన వెట్టి గోవిందమ్మ (55) అలియాస్ కిల్లిమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. మంచినీళ్లగుంట పక్కనే పొలం ఉన్న రాయపు హరిహరకుమార్ అనే అతను సోమవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లడంతో శవాన్ని చూసి సమాచారం అందజేశారు.
 
 వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ముఖంపై బలమైన గాయాలుండటంతో హత్యగా భావించారు. ముందు గుర్తు తెలియని శవంగా భావించారు. నాగరాజపురంలో మృతురాలు కుమారుడు రవి కూడా అందరిలాగే  శవాన్ని చూడడానికి వచ్చి గుర్తించారు. వేనాడులో కాపురం వుంటూ అప్పుడప్పుడు కుమారుడి వద్దకొచ్చి ఉంటుండేది. శనివారం రాత్రి నుంచి కనిపించకపోయే సరికి వేనాడుకు వెళ్లిఉంటుందని భావించారు.
 
 అయితే ఈమెకు మద్యం అలవాటు ఉండటంతో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తీసుకెళ్లి కొట్టి చంపేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ముఖంపై బలమైన గాయాలు వుండడంతో హత్యగానే భావించి కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై గంగాధర్‌రావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement