Sullurupeta
-
సీఎం జగన్ సూళ్లూరుపేట పర్యటన వాయిదా
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. ఈ రోజు జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. మంగళవారం.. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్ఈజెడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సింది ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు. త్వరలోనే రీ షెడ్యూల్ ప్రకటించనున్నారు. బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. నెల్లూరు నగరంలో పాటు రాపూరు, కలువాయి, చేజర్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని, నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. చదవండి: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని నవదంపతులు శ్రావణ్, సౌజన్యలను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివాహ వేడుకకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. అంతకుముందు కనుపర్తిపాడులో హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) -
ISRO@60: ఆకాశంతో పోటీ.. నాకెవ్వరు సాటి!
సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్షపరిశోధనా సంస్థ స్థాపించి 59 ఏళ్లు పూర్తయింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. 1961లో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అంతరిక్ష ప్రయోగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)ని ప్రారంభించారు. డీఏఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చిగా ఆవిర్భవించింది. ఆ తరువాత కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్)ని ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న ‘నైక్ అపాచి’ అనే రెండు దశల సౌండింగ్ రాకెట్‌ను మొదటిగా ప్రయోగించారు. ఆ తరువాత 1967 నవంబర్ 20న రోహిణి–75 అనే సౌండింగ్ రాకెట్‌ను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి విజయం సాధించారు. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చి సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరు మార్చారు. 1963లో తుంబా నుంచి వాతావరణ పరిశీలన కోసం సౌండింగ్ రాకెట్ ప్రయోగాలతో అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. తూర్పు తీర ప్రాంతాన.. దేశానికి మంచి రాకెట్ కేంద్రాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ విక్రమ్ సారాబాయ్, స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ 1969లో తూర్పువైపు తీరప్రాంతంలో స్థలాన్వేషణ చేశారు. ఆ సమయంలో పులికాట్ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్యలో 44 చ.కి.మీ. దూరం విస్తరించిన శ్రీహరికోట దీవి కనిపించింది. ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని ఎంపిక చేశారు. భవిష్యత్తు రాకెట్ ప్రయోగాలను దృష్టిలో ఉంచుకుని వాతావరణ పరిశోధనకు సుమారు 1,161 సౌండింగ్ రాకెట్లు ప్రయోగించారు. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లతో 86 ప్రయోగాలు చేసి 116 ఉపగ్రహాలు, 13 స్టూడెంట్ ఉపగ్రహాలు, రెండు రీఎంట్రీ మిషన్లు, 381 విదేశీ ఉపగ్రహాలు, మూడు గ్రహాంతర ప్రయోగాలు, రెండు ప్రయివేట్ ప్రయోగాలు చేశారు. ఆర్యభట్ట ఉపగ్రహంతోనే మొదటి అడుగు 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసుకుని రష్యా నుంచి ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల వేటను ఆరంభించారు. ►శ్రీహరికోట రాకెట్ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి 1979 ఆగస్టు 10 ఎస్ఎల్వీ–3 ఇన్1 పేరుతో రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ►1980 జూలై 18న ఎస్ఎల్వీ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. ►ఆ తరువాత జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఐదు టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాలను, మానవసహిత ప్రయోగాలకు ఉపయోగపడేలా జీఎస్ఎల్వీ మార్క్ –3 రాకెట్‌ను రూపొందించారు. ►ఆరు రకాల రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ (సమాచార ఉపగ్రహాలు) రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు), ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు అస్ట్రోశాట్స్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్థం (భారత క్షేత్రీయ దిక్చూచి ఉపగ్రహాలు) గ్రహాంతర ప్రయోగాలు (చంద్రయాన్–1, మంగళ్యాన్–1, చంద్రయాన్–2) లాంటి ప్రయోగాలను కూడా విజయవంతంగా ప్రయోగించారు. వాణిజ్యపరమైన అభివృద్ధి వైపు పయనం ►1992 మే 5న వాణిజ్యపరంగా పీఎస్ఎల్వీ సీ–02 రాకెట్ ద్వారా జర్మనీ దేశానికి చెందిన టబ్‌శాట్ అనే శాటిలైట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ►35 దేశాలకు చెందిన 381 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచదేశాల్లో భారత అంతరిక్ష పరిశోదన సంస్థకు గుర్తింపు తెచ్చారు. ►న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్ అనే సంస్థలను ఏర్పాటు చేసి ప్రయివేట్‌గా ఉపగ్రహాలు, రాకెట్లను కూడా ప్రయోగించే స్థాయికి భారతీయ శాస్త్రవేత్తలు ఎదిగారు. ►న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ వారి సహాయంతో ఇటీవలే ఎల్వీఎం3–ఎం2 రాకెట్ ద్వారా వన్‌వెబ్ అనే కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ప్రయోగించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ప్రయివేట్‌గా రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలతో పాటుగా గగన్‌యాన్–1, చంద్రయాన్–3, ఆదిత్య–ఎల్1 అనే చాలెంజింగ్ ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
జీఎస్ఎల్వీ మార్క్3 ఎం–2 రాకెట్‌కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 23న ఆదివారం అర్ధరాత్రి 12 గంటల 7 సెకండ్లకు జీఎస్ఎల్వీ మార్క్3 ఎం–2 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ నేపథ్యంలో 22న శనివారం అర్ధరాత్రి 12 గంటల7 సెకండ్లకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం షార్‌లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మూడు దశల రాకెట్‌ను అనుసంధానం చేసి.. ప్రయోగవేదిక అమర్చాక.. అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. తర్వాత ప్రయోగ పనులను ల్యాబ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ రాజరాజన్ ఆధ్వర్యంలో ల్యాబ్ మీటింగ్ నిర్వహించారు. రాకెట్‌కు మరోమారు తుది విడత తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఈ ప్రయోగం ద్వారా యునైటెడ్ కింగ్డమ్కు చెందిన 5,200 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఇప్పటిదాకా పీఎస్ఎల్వీ రాకెట్లను మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించేవారు. ఇప్పుడు తొలిసారిగా జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వినియోగిస్తుండటం గమనార్హం. -
సూర్యుడిపై ఇస్రో గురి: ‘ఆదిత్య ఎల్1’ ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు 2023 జనవరి నెలాఖరులోపు ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. 2018లోనే దీనిపై ఇస్రో, నాసా చర్చలు జరిపాయి. 2020లోనే ఈ ప్రయోగం చేయాల్సి ఉంది. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రయోగం తెర పైకి వచ్చింది. దీనికి భారత ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. దీంతో 2023 జనవరిలో శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ–సీ56 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ మీడియాకు వెల్లడించారు. మరో ఘనత దిశగా.. బెంగళూరులోని యు.ఆర్.రావు స్పేస్ సెంటర్లో ఈ ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1, చంద్రయాన్–2, అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1 అనే మూడు ప్రయోగాలను అతి తక్కువ వ్యయంతో మొదటి ప్రయత్నంలోనే ప్రయోగించి ఇస్రో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇదే క్రమంలో ఇప్పుడు సూర్యుడి పైకి ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. ఈ ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో పేలోడ్స్ బరువు 244 కిలోలు కాగా, ద్రవ ఇంధనం బరువు 1,231 కిలోలుంటుంది. సూర్యుడి వైపు తీసుకెళ్లడం కోసం ఎక్కువ ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. తొలుత ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన తర్వాత.. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1(ఎల్–1)లోకి చేరవేయడానికి 177 రోజుల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా సూర్యుడిపై మార్పులను నిరంతరం పరిశోధించేందుకు వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఉపగ్రహంలో ఆరు పేలోడ్స్ అమర్చి పంపిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసేందుకు.. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సౌర గోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ వరకు ఉంటుంది. సూర్యుడి అంతర్భాగ ఉష్ణోగ్రత ఆరు వేల కెల్విన్ డిగ్రీల వరకు ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతు చిక్కడం లేదు. దీనిపైన ఆదిత్య–ఎల్1 ద్వారా పరిశోధనలు చేయనున్నారు. అలాగే సౌర తుపాన్ సమయంలో భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని అంచనా వేశారు. ఈ ప్రయోగం ద్వారా ఫొటో స్పియర్, క్రోమో స్పియర్లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగంలో సందిగ్ధత
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. మూడో దశ తర్వాత ఈవోఎస్-2, ఆజాదీ ఉపగ్రహాలను రాకెట్ వదిలింది. సాంకేతిక లోపం కారణంగా ఉపగ్రహాల నుంచి కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ అందడం లేదని శాస్త్తవేత్తలు తెలిపారు. మూడు దశల ప్రయోగాలు పూర్తయ్యాయని.. నాలుగో దశలో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. తుది దశ సమాచార సేకరణలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది. చదవండి: ఆరోగ్య బీమాలో రెండో స్థానంలో ఏపీ చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగించారు. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది. బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్ కౌంటర్లు, సోలార్ ప్యానల్ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ–ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్ షరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. -
ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1)ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లోనే పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు.. అంటే ఆదివారం రాత్రి 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ప్రయోగంలోని మూడు దశలను ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు. చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్! సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేలా.. చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్ఎస్ఎల్వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగిస్తున్నారు. 8 కిలోల ఆజాదీశాట్ ఉపగ్రహం ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది. విద్యార్థినులు తీర్చిదిద్దిన బుల్లి ఉపగ్రహం.. బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్ కౌంటర్లు, సోలార్ ప్యానల్ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ ట్రాన్స్పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ–ఇంజనీరింగ్ మ్యాథమేటిక్స్’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్ షరూక్ అనే మహిళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు. -
స్పేస్ పిలుస్తోంది.. మీరు సిద్ధమేనా?
సూళ్లూరుపేట: ఈనాటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా రావాలని, భారతదేశాన్ని శాస్త్రీయ భారత్‌గా బలోపేతం చేయాలని స్పేస్ సైన్స్ పిలుస్తోందని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ చెప్పారు. ఆ పిలుపునకు మీరు సిద్ధంగా ఉన్నారా.. అని ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి యువిక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం–2022కు ఎంపికైన 153 మంది విద్యార్థులు శుక్రవారం షార్‌లోని లాంచింగ్ ఫెసిలిటీస్, రాకెట్ లాంచింగ్ పాడ్స్, మిషన్ కంట్రోల్ రూమ్‌లను సందర్శించారు. నేటితరం విద్యార్థులను స్పేస్ సైన్స్ వైపు ఆకర్షించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న యువిక–2022 కార్యక్రమాన్ని ఈనెల 16న ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వర్చువల్‌గా ప్రారంభించారు. నేటి (శనివారం) వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం సాయంత్రం షార్ కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులు స్పేస్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన సమావేశంలో రాజరాజన్ మాట్లాడారు. విద్యార్థులకు ఎంతసేపైనా శ్రమించగలిగే అత్యంత శక్తిసామర్థ్యాలుంటాయని చెప్పారు. మన విద్యార్థులు ఈ రోజున తేలికపాటి ఉపగ్రహాలు తయారుచేసే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. ఇస్రో సెంటర్లపై అవగాహన కల్పిస్తే ఈ 153 మందిలో కనీసం ఓ పదిమందైనా ఇస్రో శాస్త్రవేత్తలు అవుతారనే ఆశతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక నుంచి రోహిణి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. -
రూ.35 లక్షల విలువైన శ్రీగంధం దుంగల పట్టివేత
సూళ్లూరుపేట: భారీ మొత్తంలో శ్రీగంధం దుంగలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ వెల్లడించారు. ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకుని, 8 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీగంధం దుంగలను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, తడ, శ్రీహరికోట ఎస్ఐలు శ్రీనివాసులురెడ్డి, రోజాలత సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కలిగిన లారీని తనిఖీ చేయగా 484 శ్రీగంధం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లారీకి పైలెట్లుగా వచ్చిన రెండు కార్లను కూడా పట్టుకున్నారు. గూడూరు మండలం చెన్నూరుకు చెందిన లారీ డ్రైవర్ తుపాకుల మునీంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా అనంతసాగరం మండలం రేవూరుకు చెందిన మోడిబోయిన మురళీకృష్ణ, దగదర్తి చింతోడు సెంటర్‌కు చెందిన ఉప్పు రామచంద్రయ్య, నెల్లూరు నగరం భక్తవత్సలనగర్‌కు చెందిన కర్నాటి మాలకొండయ్య, గూడూరు మండలం మిట్మాత్మకూరుకు చెందిన కర్రా పెంచలయ్య, వెంకటగిరి మండలం సిద్ధాగుంటకు చెందిన కనియపల్లి వెంకటరమణయ్య, పొదలకూరు మండలం వనంతోపునకు చెందిన నల్లు మణి, రాపూరు మండలం గోనుపల్లికి చెందిన వెలుగు అంకయ్య ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నారని వెల్లడించారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ ఏడుగురిని జిల్లాలో పలుచోట్ల గురువారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన శ్రీగంధం దుంగల విలువ సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. -
చేతబడి భయం.. యువతిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగికదాడి.. కడుపునొప్పి రావడంతో
సాక్షి, నెల్లూరు(సూళ్లూరుపేట): చేతబడి చేస్తానని బెదిరించి ఓ యువతిపై 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి లైంగికదాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి శ్రీహరికోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ ఐ.వెంకటేశ్వర్లురెడ్డి కథనం మేరకు.. శ్రీహరికోట శబరి గిరిజన కాలనీకి చెందిన యువతిని కాదలేటి గోపాల్ అనే వ్యక్తి చేతబడి పేరుతో భయపెట్టి ఐదునెలలుగా లైంగికదాడి చేస్తున్నాడు. చదవండి: (భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..) ఈ విషయం బయట చెబితే ఆమె తల్లిదండ్రులపై చేతబడి చేస్తానని బెదిరించాడు. ఈక్రమంలో యువతి గర్భం దాల్చింది. దీంతో అతడు గర్భం పోవడానికి ఆమెకు మాత్రలిచ్చాడు. యువతికి కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు గత శనివారం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు చికిత్స చేశారు. ఈక్రమంలో గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని ఆమె తల్లిదండ్రులు తడ మండలంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. మొత్తం విషయాన్ని తల్లిదండ్రులకు యువతి చెప్పింది. పోలీసులు గోపాల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (స్నేహితుడి సోదరితో పరిచయం.. లైంగిక దాడి, ఆపై ట్యాబ్లెట్స్ ఇచ్చి..) -
కౌన్సిలర్ హంతకుల కోసం గాలింపు
సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిల్ సభ్యుడు తాళ్లూరు వెంకట సురేష్ (40)ను దారుణంగా హత్య చేసిన దుండగులను పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామని గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మృతుడు సురేష్ ఉన్న ఇంటి కింద మరో ఇంటిలో తడ మండలం వాటంబేడుకుప్పానికి చెందిన బాలు అనే వ్యక్తి గడచిన మూడేళ్లుగా ఉండేవాడని, అతను సురేష్ కుటుంబసభ్యులతో సన్నిహితంగా మెలిగేవాడని తెలిసిందన్నారు. హత్య జరిగిన తరువాత అతను గదిలో లేకపోవడం, సెల్ స్విచ్చాఫ్ చేయడంతో అతన్ని అనుమానితుడిగా గుర్తించామని తెలిపారు. హత్య జరిగిన వెంటనే మృతుడు నివాసం ఉన్న బ్రాహ్మణవీధి సెంటర్లో అరుణ్ ఐస్‌క్రీం వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, బాలు అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై అక్కడ అనుమానాస్పదంగా వేచి ఉండడం గుర్తించామని తెలిపారు. బాలు ఫోన్‌ను ట్యాపింగ్ చేయగా.. సుమారు ఐదారుగురు టీడీపీ నాయకులకు ఫోన్‌కాల్స్ వెళ్లినట్లు గుర్తించామని తెలియజేశారు. వారిని పిలిపించి విచారిస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా మంగళవారం సాయంత్రం తాళ్లూరు వెంకట సురేష్ అంత్యక్రియలు నిర్వహించారు. -
సూళ్లూరుపేటలో కిడ్నాప్ కలకలం
సాక్షి, నెల్లూరు: సూళ్లూరుపేటలో బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలో వెంకటేశ్వర స్వామి వీధికి చెందిన 13 ఏళ్ల యశ్వంత్ రెడ్డి అనే విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంకాలం జిరాక్స్ పేపర్ల కోసం అంటూ బజారుకు వెళ్లిన యశ్వంత్ రెడ్డి.. అదృశ్యమయ్యాడు. కిడ్నాప్ అనుమానంతో పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. బాలుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పేలిన గ్యాస్ సిలిండర్, ఫ్రిజ్
సాక్షి, సూళ్లూరుపేట: అందరూ గాఢనిద్రలో ఉండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పట్టణంలోని కాపువీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కాపువీధిలో నివాసం ఉంటున్న వంకా శ్రీనివాసులు (49), భార్య వంకా మునిసుబ్బమ్మ (40) కుమార్తె జాహ్నవి (10) కుమారుడు చరణ్‌సాయి (4) ఆదివారం రాత్రి భోజనాల అనంతరం అందరూ నిద్రిస్తున్నారు. సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో గ్యాస్ వాసన వస్తుండడంతో అప్రమత్తమైన శ్రీనివాసులు లేచి లైట్ వేయగానే ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. లీకైన గ్యాస్ ఫ్రిజ్ కిందకు కూడా వ్యాపించడంతో మంటలు అధికమై ఫ్రిజ్ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. లీకైన గ్యాస్ బెడ్రూంలోకి కూడా వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న శ్రీనివాసులు కుమార్తె, కుమారుడు మంచాల కింద నుంచి మంటలు రేగి అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే 108కి ఫోన్ చేస్తే ఓజిలిలో ఉన్నట్లు సమాధానం చెప్పారు. ఆగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ పనిచేయడం లేదు. రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు స్పందించి స్థానికులతో కలిసి క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీనివాసులు, కుమార్తె జాహ్నవి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మునిసుబ్బమ్మ, చరణ్‌సాయి పరిస్థితి మెరుగ్గా ఉందని బాధిత బంధువుల ద్వారా తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు. -
7న పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగం
సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నవంబర్ 7న సాయంత్రం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను రూపొందించి ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా నవంబర్ 7న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చదవండి: అస్సాంలో జేఈఈ టాపర్ అరెస్టు -
అప్పన్న బంగారం కేసులో కీలక మలుపు
సాక్షి, నెల్లూరు: అప్పన్న బంగారం పేరిట మహిళను మోసగించిన ఘటనలో ప్రధాన నిందితురాలు కె.హైమావతి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా కేసు పూర్వాపరాలను వెల్లడించారు. విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన కె.హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. సూళ్లూరుపేటకు చెందిన ఎం.శ్రావణితో పరిచయం ఏర్పడింది. ఆలయంలో బంగారం వేలం వేస్తున్నారంటూ మాయమాటలు చెప్పి హైమావతి ఆమెను నమ్మించి రూ. 38 లక్షలు ఖాతాలో జమ చేయించుకుంది. శ్రావణి బిల్లులు కోరగా నిందితురాలు సింహాచలం ఆలయ ఈవో ఫోర్జరీ సంతకాలతో బిల్లులను పంపింది. నగదు తీసుకున్న నిందితురాలు బంగారం ఇవ్వకుండా ఆమెను మోసగించడంతో బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు, సింహాచలం ఆలయ అధికారులకు ఈ–మెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేసింది. మెయిల్లో పంపిన బిల్లులు నకిలీవని ఆలయ అధికారులు గుర్తించి గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితురాలు విశాఖపట్నం జైలులో ఉంది. నగదు స్వాధీనం : పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. హైమావతిని పిటీ వారెంట్‌పై నెల్లూరుకు తీసుకువచ్చారు. సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆమె వద్ద నుంచి రూ.11.35 లక్షల నగదు, 280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్స్పెక్టర్ బాజీజాన్‌సైదా తెలిపారు. -
ఆర్థిక నేరగాళ్లకు అడ్డా బీజేపీ
సూళ్లూరుపేట: ఆర్థిక నేరగాళ్లకు బీజేపీ అడ్డాగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. ప్రజలసొమ్మును రుణాలుగా తీసుకుని ఆ నగదును తిరిగి బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిని ఆ పార్టీలోకి చేర్చుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సూళ్లూరుపేటలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, పరిపాలనను అస్తవ్యస్తం చేసి ప్రజలను తికమక పెడుతోందన్నారు. ఇప్పటికే అందరికీ ఆధార్ పేరుతో గుర్తింపు కార్డులున్నప్పటికీ ఇందులో మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తుగ్లక్ పాలనను చేస్తున్నారని విమర్శించారు. 1971కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు పౌరసత్వం లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారన్నారు. కార్గిల్ వార్‌లో యుద్ధం చేసిన ఓ మాజీ ముస్లిం సైనికుడికి కూడా పౌరసత్వం లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మనది సెక్యులరిజం దేశం అయినప్పటికీ హిందూమతం మాత్రమే ఉండాలన్నట్టుగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. జనవరి 8న దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకే చోట ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు రాజధాని విషయంలో ప్రజలను చీటింగ్ చేశారని విమర్శించారు. -
సీఎం చొరవతో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు
సాక్షి, నాయుడుపేట టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పతకాలతో సుమారు రూ.700 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుటుడుతున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేట ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. సీఎం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నవరత్నాలతో అన్ని వర్గాల సంక్షేమానికి బాటలు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ కార్పొరేట్‌కు దీటుగా మనబడి–నాడు నేడు పతకం కింద ప్రభుత్వ పాఠశాలలు అభివృధ్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొదట విడతగా ఒక్క సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే సుమారు రూ..20 కోట్ల నిధులు మంజూరు చేస్తూ 150 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో నాయుడుపేటలోని రెండు జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, కోటపోలూరు, తడ, ఏకొల్లు ఉన్నత పాఠశాలు కూడా ఉన్నాయన్నారు. ఆగష్టు నుంచి పనులు సైతం ప్రారంభమవుతాయన్నారు. దొరవారిసత్రంలో కొత్తగా బాలుర రెసిడెన్షియల్ ఐటీఐ, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సూళ్లూరుపేటలో అద్దె భవనంలో ఉన్న ఈఎస్ఐ వైద్యశాలకు ప్రభుత్వ భవనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నాయుడుపేట మండలం బిరదవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న బాలికల గురుకులంలో ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అప్‌గ్రెడ్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంకా నాయుడుపేటలో సీఎం ప్రత్యేక చొరవ చూపుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూ.50 కోట్లతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సారధ్యంలో సీ–పెట్ సెంటర్ సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో రూ.100 కోట్లతో ఇరిగేషన్ కెనాల్ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు వివరించారు. ఇందులో విన్నమాల పంట కాలువ, నెర్రికాలువ, పాలచ్చూరు సిస్టమ్, పాములు కాలువ, కళంగి డ్రైయిన్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి అందించేందుకు విధంగా సుమారు రూ.400 కోట్లకు పైగా నిధులతో ప్రతి మండలంలో తాగునీటి పథకాలు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చందుకు ముఖ్యమంత్రి నిబద్ధతతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, షేక్ రఫీ, కామిరెడ్డి మోహన్‌రెడ్డి, దేవారెడ్డి విజయులురెడ్డి. పాదర్తి హరినాథ్‌రెడ్డి, ఒట్టూరు కిషోర్ యాదవ్, దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, చెవూరు చెంగయ్య ఉన్నారు. -
నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్ చరణ్
సాక్షి, సూళ్లూరుపేట(నెల్లూరు): సాహో, సైరా ట్రైలర్లు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి సినిమాలను భారీ స్క్రీన్లపై చూస్తే మరపురాని అనుభూతి కలుగుతుందని మెగా హీరో రామ్‌చరణ్ పేర్కొన్నారు. యూవీ ఆర్ట్ క్రియేషన్స్ అధినేతలు నిర్మించిన వీ సెల్యులాయిడ్ గ్రూప్ మల్టీఫ్లెక్స్ థియేటర్లను గురువారం ప్రారంభించారు. దక్షిణాసియా, ఇండియాలో తొలిసారిగా భారీ స్క్రీన్‌ను ఈ థియేటర్లలో ఏర్పాటు చేశారు. ప్రారంభం సందర్భంగా సాహో, సైరా ట్రైలర్లను ప్రదర్శించారు. వెంకటగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు.అనంతరం రామ్‌చరణ్ రెండు సినిమాల ట్రైలర్లను వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్‌లో విడుదల కానున్న సైరా సరసింహారెడ్డి సినిమాకు మెగాస్టార్ చిరంజీవిని ఇక్కడికి తీసుకొస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు. వీ సెల్యులాయిడ్ గ్రూప్ థియేటర్లను సాంకేతిక విలువలతో నిర్మించడం విశేషమన్నారు. ఇలాంటి సాంకేతిక విలువలు కలిగిన స్క్రీన్ అన్నా, ఇలాంటి వాటిని ప్రోత్సహించే విషయంలో ఎప్పుడూ ముందుండే గుణం చిరంజీవిలో ఎక్కువగా ఉందని, ఈ క్రమంలో తాను, ఎన్వీ ప్రసాద్ ఆయన్ను ఇక్కడికి తీసుకొస్తామని తెలిపారు. సాహో సినిమాను డైరెక్టర్ సుజిత్ ఎంతో సాంకేతిక విలువలతో తీశారని, ఈ సినిమాలో హీరో ప్రభాస్‌ను ఎంతో స్టయిలిష్‌గా చూపించారని తెలిపారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సాహో సినిమాను అత్యంత భారీ సాంకేతిక విలువలతో తీసి ఉంటారని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోందని పేర్కొన్నారు. అతి పెద్ద భారీస్క్రీన్ కలిగిన వీ సెల్యులాయిడ్ గ్రూప్ థియేటర్లను నిర్మించిన యూవీ ఆర్ట్ క్రియేషన్స్ అధినేతలు వేమారెడ్డి వంశీకృష్ణారెడ్డి, వేమారెడ్డి విక్రమ్ శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు. -
చంద్రయాన్-2 చూసేందుకు వి'ల'క్షణ వేదిక
సాక్షి, సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకుల కోసం విలక్షణమైన గ్యాలరీని షార్ అధికారులు నిర్మించారు. తొలుత ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున చంద్రయాన్–2 ప్రయోగానికి సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ఇస్రోకే ప్రతిష్టాత్మకం కావడంతో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశా వ్యాప్తంగా పౌరులను ఆహ్వానించింది. వీరి కోసం షార్‌లోని శబరి గిరిజన కాలనీ ప్రాంతంలో సుమారు 60 ఎకరాల అటవీ భూమిలో సుమారు 5 వేల మంది సందర్శకులు కూర్చుని రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వీలు కల్పిస్తూ గ్యాలరీ నిర్మాణం చేపట్టారు. ఈ తరహా గ్యాలరీ నిర్మాణాన్ని సైతం షార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ప్రయోగానికి గంట వ్యవధిలో సాంకేతిక కారణాలతో కౌంట్ డౌన్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆహ్వానితులకు మళ్లీ అవకాశం ఈ నెల 15న ప్రయోగం నిర్వహించతలపెట్టినప్పుడు సందర్శకులు దేశంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇస్రో వెబ్సైట్లో ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఆ పాస్‌లతో రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని ఎన్నో ఆశలతో వచ్చారు. అర్ధరాత్రి వేళ అని చూడకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ప్రయోగం వాయిదా పడడంతో నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అందుకే వారిని సంతృప్తి పరిచేందుకు గతంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న వాళ్లకు ఇచ్చిన సీరియల్ నంబర్లో వెబ్సైట్లో కొడితే అనుమతి వస్తోంది. కొత్తగా రావాలనుకునే వారికి మాత్రం సైట్ ఓపెన్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్త వారికి కూడా చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించే భాగ్యాన్ని కల్పించాలని పలువురు సందర్శకులు కోరుతున్నారు. -
టీడీపీ పాలన అవినీతిమయం
సాక్షి, సూళ్లూరుపేట: గడిచిన ఐదేళ్లలో సూళ్లూరుపేట మున్సిపాలిటీ పాలన అవినీతిమయంగా మారింది. టీడీపీ పాలకవర్గం దెబ్బకు ఎనిమిది మంది కమిషనర్లు మారారు. అవినీతి కారణంగా వచ్చిన కమిషనర్లు వచ్చినట్టే వెళ్లిపోయారు. మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 11 వార్డులు, టీడీపీ 8 వార్డులు, కాంగ్రెస్ 3 వార్డులు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డును గెలుచుకున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి చక్రం తిప్పి స్వతంత్ర అభ్యర్థిని తీసుకోవడంతో టీడీపీ కౌన్సిలర్ నూలేటి విజయలక్ష్మి చైర్‌పర్సన్‌గా, గరిక ఈశ్వరమ్మ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఒకటో వార్డు, 17వ వార్డులకు చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను చేర్చుకుని మరింత బలపడ్డారు. దీంతో కౌన్సిల్ సమావేశాలు దాదాపుగా రచ్చ..రచ్చగానే సాగాయి. మున్సిపాలిటీ అభివృద్ధిని పక్కనబెట్టి మంజూరైన నిధులను వచ్చినవి వచ్చినట్టుగా స్వాహా చేయడం ఎక్కువైపోయింది. పాలకవర్గానికి ఎదురు చెప్పే కమిషనర్లను ఇంటికి సాగనంపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఓ కమిషనర్‌పై ఏకంగా అతని ఛాంబర్‌లోనే దాడికి పాల్పడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సూళ్లూరుపేట మేజర్ పంచాయతీ నుంచి గ్రేడ్–3 మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఏడాదికి సుమారు రూ.5 నుంచి రూ.7కోట్ల వార్షికాదాయం కలిగిఉంది. టీడీపీ పాలకవర్గం పన్నులు విపరీతంగా పెంచేసి ప్రజలపై భారం మోపింది. పన్నుల వసూళ్లలోనూ చేతివాటం చూపారు. పాలకవర్గానికి అనుకూలంగా ఉన్న వారికి, అధికార టీడీపీ వారికి భారీగా తగ్గించి కమిషన్లు దండుకున్న సంఘటనలు ఉన్నాయి. కనిపించని అభివృద్ధి గడిచిన ఐదేళ్ల కాలంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ కోట్లకు కోట్లు మంజూరు చేసినా అభివృద్ధి మాత్రం కనిపించలేదు. షార్ నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను పాలకపక్షం తన ఖాతాలో వేసుకుంది. ఆర్థిక సంఘం, సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించిన సిమెంట్‌రోడ్లు, మురుగునీటి కాలువల పనుల్లోనూ నాణ్యత లోపించింది. ఈ నిధుల్లోనూ కొంత భాగం పనులు చేయక వెనక్కి వెళ్లిపోయాయి. సాధారణ నిధులు భారీగా స్వాహా మున్సిపాలిటీకి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సాధారణ నిధులతో పాలకపక్షం నామమాత్రంగా పనులు చేపట్టి కోట్లాది రూపాయల స్వాహా చేసింది. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత సుమారు 10 మంది కమిషనర్లు మారగా మూడుసార్లు ఇన్చార్జి కమిషనర్లు పనిచేశారు. యాదగిరి శ్రీనివాసరావు కమిషనర్‌గా ఉన్న సమయంలో రూ.11 లక్షలు స్వాహా చేసిన మేనేజర్ సలోమిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు. ఆ నిధులు ఎవరు స్వాహా చేశారనే విషయం తేల్చకుండానే ఫైల్ మూసేశారు. సాధారణ నిధులను అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంగా నరేంద్రనాథ్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సాధారణ నిధులను ఇష్టానుసారంగా వాడేసుకుని స్వాహా చేశారని టీడీపీ పక్ష సభ్యులే అరోపిస్తుండడం విశేషం. ఏడాదికి మున్సిపాలిటీకి సుమారు రూ.7 కోట్ల ఆదాయం లభిస్తుంది. ఇందులో జీతాలు, ఇతర అవసరాలకు కలిపితే సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయి. మిగిలిన నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ ఏడాది సుమారు రూ.3కోట్ల సా«ధారణ నిధులను కమిషనర్ నరేంద్రకుమార్ హయాంలో పై అధికారుల అనుమతులు లేకుండా, కౌన్సిల్ తీర్మానం లేకుండా ఇష్టానుసారంగా వ్యయం చేసి లెక్కలు చూపిస్తున్నారు. వాస్తవంగా సాధారణ నిధులను అత్యసర సమయాల్లో కౌన్సిల్ తీర్మానం మేరకు ఖర్చు చేయాలి. కానీ నామినేటెడ్ వర్కుల కింద గ్రావెల్‌రోడ్లు, సిమెంట్‌రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లుగా సుమారు రూ.1.50 కోట్లు డ్రా చేసేశారు. కార్యాలయ ఖర్చుల కింద మరో రూ.25 లక్షలు డ్రా చేశారు. వట్రపాళెంలో వీపీఆర్ ఇన్ప్రా పేరుతో రూ.25 లక్షలతో కంకరడస్ట్తో రోడ్లు వేసి రూ.85లక్షలుగా చూపించి కౌన్సిల్ సమావేశంలో ఆమోదించుకోవాలని ప్రయత్నాలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏటి పండగ నిర్వహణకు రూ.లక్ష ఖర్చు చేసి రూ.5లక్షలుగా చూపించారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఇచ్చిన నిధులు చాలవని, మరో రూ.లక్షలు ఆమోదించుకునే ప్రయత్నాలు చేయడం విశేషం. అలాగే అవుట్ సోర్సింగ్ సిబ్బంది పేరుతో లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. ఇలా ఇష్టానుసారంగా కౌన్సిల్ ఆమోదం సైతం లేకుండానే నిధులను బొక్కేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు కలిసి స్వాహా చేసిన సాధారణ నిధులపై విచారణ జరిపించాలని డీసెంట్ రాసి కమిషనర్‌కు ఇచ్చారు. కమిషనర్ పూర్తిస్తాయి విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగు చూస్తాయి. -
సంజీవయ్య సూపర్ విక్టరీ
సాక్షి, నాయుడుపేట/సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సూపర్ విక్టరీని నమోదుచేసుకుంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య భారీ ఆధిక్యత సాధించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన ఓట్లు లెక్కింపులో ప్రారంభం నఉచి అత్యధిక మెజార్టీ కొనసాగింది. తొలి రౌండ్ నుండి మూడో రౌండ్ వరకు 3వేలు చొప్పున ఆధిక్యత సాధించారు. నాల్గొ రౌండ్లో కొంత మెజార్టీ తగ్గినా, ఐదవ రౌండ్ నుంచి 3వేలకు తగ్గకుండా మోజార్టీ జోరును పెంచింది. చివరి 21వ రౌండ్ వరకు మెజార్టీ ఆధిక్యతకు అడ్డేలేకుండా పోయింది. ఏదశలోనూ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పోటీ ఇవ్వలేకపోయారు. పోస్టల్ బ్యాలెట్ లోనూ కిలివేటి హవా కొనసాగింది. టీడీపీ నియోజకవర్గంగా పేరున్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో 1985లో టీడీపీ తరఫున పోటీచేసిన ఎం. మనెయ్య 28368 ఓట్లు మెజార్టీ సాధించారు., 1994లో 21001 ఓట్లు ఆధిక్యతలో పరసా వెంకటరత్నం విజయం సాధించారు. సూళ్లూరుపేటలో కిలివేటి విజయదుందుభీ మోగించడంతో పార్టీ క్యాడర్ ఆనందానికి హద్దేలేకుండా పోయింది. 1985 ఎం. మణెయ్య మెజార్టీ 28,368 ఓట్లు 1994 పరసా వెంకటరత్నం మెజార్టీ 21.001 ఓట్లు ఈ విజయం చారిత్రాత్మకం : కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేట నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి ఇంతటి ఘన విజయం ఇప్పటివరకు చరిత్రలో లేదు. ఇది చారిత్రాత్మక విజయం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి, కష్టం ఫలితమే ఈ అపూర్వ విజయం. నియోజకవర్గంలో నాయకులు, యువత, కార్యకర్తలు పార్టీ కోసం చాలా కష్టపడి చేశారు. ఓటర్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. -
పులి‘సాల్ట్’ సరస్సు
సాక్షి, సూళ్లూరుపేట: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరు ప్రఖ్యాతులున్న పులికాట్ సరస్సు కరువు కాటకాలు, ముఖద్వారాల పూడికతో నీళ్లు రాకపోవడంతో ఉప్పుతో నిండిపోయి శ్వేతవర్ణ సరస్సులా గోచరిస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట–శ్రీహరికోటకు వెళ్లే రోడ్డులో సరస్సు ఎటువైపు చూసినా తెల్లటి ఉప్పుతో నిండిపోయి మంచు దుప్పటి పరుచుకున్నట్టుగా కనిపించడంతో పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. గడచిన రెండేళ్లుగా సరస్సుకు తగినంత వరద నీరు చేరకపోవడంతో పాటు సముద్ర ముఖద్వారాలనుంచి కూడా నీళ్లు రాకపోవడంతో ఇలా మారింది. ఇందులో శ్రీహరికోట రోడ్డుకు దక్షిణం వైపు సరస్సు లోతుగా ఉండడం, తమిళనాడులోని పల్వేరికాడ్ ముఖద్వారం నుంచి నీళ్లు రావడంతో అక్కడ ఓ మోస్తరు నీళ్లున్నాయి. ఉత్తరం వైపు రాయదొరువు ముఖద్వారం నుంచి నీళ్లు రాకుండా ఆగిపోవడంతో సరస్సు ఉప్పు మయంగా మారింది. దీంతో సరస్సు అంతా ఎటువైపు చూసినా శ్వేతవర్ణంగా మారింది. వేసవిలో ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన ఉప్పును తీరప్రాంత గ్రామాలకు చెందిన వారు తీసుకెళ్లి వాడుకుంటుంటారు. -
టీడీపీకి ఓటడిగే హక్కు లేదు
సాక్షి, పెళ్లకూరు: అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులకు ఓటడిగే హక్కు లేదని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అన్నారు. సోమవారం మండలంలోని పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, యాలకారికండ్రిగ, ముప్పాళ్లవారికండ్రిగ తదితర గ్రామాల్లో ఎంపీపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2015లో వచ్చిన వరదలకు ఈ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా కూడా అన్నదాతలకు ఇవ్వలేదన్నారు. నీరు – చెట్టు కింద మంజూరైన పనులను, రైతు రథాలపై అందించిన ట్రాక్టర్లను పర్సంటేజీలు తీసుకుని అప్పగించిన నాయకుడికి ఓట్లు వేయడం ఎంతవరకు న్యాయమో టీడీపీ శ్రేణులే ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ పాలూరు మహేంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మారాబత్తిన సుధాకర్ నాయకులు చైతన్యకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, శంకరయ్య, బాలాజీ, శేఖర్‌రెడ్డి, గోపాల్, రాజారెడ్డి, బాబు, మురళి, కేశవ్‌రెడ్డి, చంద్రయ్య, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. చమరగీతం పాడాలి నాయుడుపేటటౌన్: టీడీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఓట్టురు కిషోర్‌యాదవ్, మల్లెలా మనోహర్‌రెడ్డిల సారథ్యంలో మండల పరిధిలోని కలిపేడు గ్రామానికి చెందిన 50 కుటుంబాల పెద్దలు సంజీవయ్య సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యేతోపాటు ఆ పార్టీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, జిల్లా కార్యదర్శి పాదర్తి హరినాథ్‌రెడ్డి, బీసీ నాయకులు గంధవళ్లి సిద్ధయ్య, భరత్ తదితర నాయకులు పార్టీ కండువాలను కప్పి ఘనంగా స్వాగతించారు. -
అలా వచ్చి ఇలా వెళ్లారు
సాక్షి, నెల్లూరు/వెంకటగిరి/సూళ్లూరుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలు పేలవంగా జరిగాయి. వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరుల్లో ఎన్నికల రోడ్‌షోను సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఆయా సభలకు జన సమీకరణ కోసం టీడీపీ అభ్యర్థులు నానాతంటాలు పడ్డారు. పురుషులకు రూ.400, మహిళలకు రూ.200 వంతున నగదు ఇచ్చి జనసమీకరణ చేశారు. షెడ్యూల్ ఆలస్యం కావడంతో విసిగిపోయిన జనం సీఎం రాకముందే తిరుగుముఖం పట్టారు. వెంకటగిరిలో ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కావాల్సి ఉండాల్సి ఉండగా మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైంది. అలాగే సూళ్లూరుపేట, గూడూరుల్లో షెడ్యూల్ ప్రకారం ప్రచారం ప్రారంభం కాకపోవడంతో హాజరైన వారు అభ్యర్థులపై తిట్లదండకం అందుకున్నారు. 20 నిమిషాలు సభలో ఉంటే కూలీ డబ్బులిస్తామని తీసుకొచ్చి గంటల సేపు నిరీక్షణ చేయించారంటూ అనేకమంది మండిపడ్డారు. మండుటెండలో ఆకలితో నకనకలాడుతుండడంతో డబ్బులు కూడా వద్దంటూ వెళ్లిపోవడం కనిపించింది. చంద్రబాబు ప్రసంగం కూడా ఆకట్టుకోలేదు. నరేంద్రమోదీ, కేసీఆర్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేసిన ప్రసంగంపై సభికులు పెదవి విరిచారు. అన్నదాన సుఖీభవ కింద నగదు ఇచ్చానని చెప్పడంపై రైతు రుణమాఫీకి సంబంధించిన రెండు విడతలు ఇంకా పెండింగ్‌లో పెట్టావు కదా పలువురు అనడం కనిపించింది. పసుపు – కుంకుమ కింద మహిళలకు నగదు ఇచ్చానని చెప్పడంపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆకట్టుకోని సీఎం ప్రసంగం వెంకటగిరిలో సీఎం ప్రసంగం 20 నిమిషాలపాటు సాగింది. ఆయన ఎక్కువగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనే విమర్శలు గుప్పించారు. సీఎం ప్రసంగంలో పసలేదని తెలుగు తమ్ముళ్లే పెదవి విరిచారు. ఇక వివేకానందరెడ్డి హత్య, ఓట్ల తొలగింపు వ్యవహరాల్లో ప్రతిపక్షనేత వైఎస్జగన్మోహన్రెడ్డి పాత్రపై ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో టీడీపీ అభిమానుల సైతం సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది. మొదట హెలిప్యాడ్ నుంచి రోడ్‌షోగా చంద్రబాబు సభాస్థలమైన త్రిభువని సెంటర్‌కు చేరుకుంటారని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. అయితే పర్యటన ఆలస్యం కావడంతో చాలాసేపు ఎదురుచూసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సొంత మండలాలకు వెళ్లిపోయారు. దీంతో నాయకులు రోడ్‌షోను రద్దు చేశారు. చంద్రబాబు నేరుగా హెలిప్యాడ్ నుంచి సభాస్థలికి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో పోలీస్ కాన్వాయ్ మధ్య చేరుకున్నారు. సూళ్లూరుపేటలో.. సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పులికాట్ సరస్సు అభివృద్ధికి రూ.48 కోట్లు మంజూరు చేస్తున్నాని మరోమారు ప్రకటించడం విశేషం. తనపై కుట్ర చేస్తున్నారని, ఆ కుట్రను భగ్నం చేయాలంటే మీరంతా మరోమారు టీడీపీకి ఓట్లు వేస్తారా తమ్ముళ్లూ.. అని బాబు అడగ్గా ఏమాత్రం స్పందన రాలేదు. సభ 20 నిమిషాల్లో ముగించి వెళ్లిపోవడంతో టీడీపీ నాయకుల్లో జోష్ కనిపించలేదు. -
గెలిపించండి.. అండగా ఉంటా
సాక్షి, సూళ్లూరుపేట: ‘ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. అండగా ఉంటా’ అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నియోజకవర్గ ప్రజలను కోరారు. వడ్డెర సంఘం జిలా ఉపా«ధ్యక్షులు మల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుమారు 200 మంది పార్టీలో ఆదివారం పట్టణంలో వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే సన్నారెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, (స్వామిరెడ్డి) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాసంరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, సూళ్లూరుకు చెందిన యూత్ సుమారు వందమంది పార్టీలో చేరారు. వారికి సంజీవయ్య కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామిరెడ్డి ఇంటివద్ద పార్టీ పట్టణ అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో కిలివేటి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపిస్తే కాళంగి గ్రాయిన్, నెర్రికాలువ లిఫ్ట్ ఇరిగేషన్, తెలుగుగంగ బ్రాంచ్ కాలువలను పూర్తి చేయించడం, సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చి భూగర్భ డ్రెయినేజీ నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, ఓజలి సుబ్బారావు, భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దబ్బల శ్రీమంత్‌రెడ్డి, మండల అధ్యక్షులు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శిలు ఎం.పాండురంగయాదవ్, చాంపియన్ చంద్రారెడ్డి, వేనాటి సుమంత్‌రెడ్డి, ముత్తుకూరు లక్ష్మమ్మ, అలవల సురేష్, వంకా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బిందె నీరు దొరికితే ఒట్టు!
సాక్షి, దొరవారిసత్రం: వేపవి వచ్చేసింది. అయితే తీర గ్రామాల్లో తాగునీటి సమస్య అలాగే ఉంది. ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు సుమారు 20 ఏళ్ల క్రితం సూళ్లూరుపేట మండలం ఆబాక గ్రామ పరిధిలో నుంచి 18 కి.మీ మేర పైప్లైన్లు వేశారు. రెండు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించి తాగునీటి సదుపాయం కల్పించారు. అయితే పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురికావడం, ఆబాక ప్రాంతంలో వేసిన బోర్ల వద్ద విద్యుత్ సమస్యలు ఏర్పడుతుండడంతో ఏడాది పొడవునా ప్రజలు తాగునీరందక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వేసవి కాలంలో మాత్రం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అరకొరగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేసి చేతులు దులుపుకుంటూ వస్తున్నారు. నిధులు మంజూరైనా.. గతేడాది తీర గ్రామాల్లో తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా రూ.1.16 కోట్లు నిధులు మంజూరయ్యాయి. తీర ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి వనరులు లేనందున సుమారు ఆరు కి.మీ దూరంలోని సింగనాలత్తూరు గ్రామ పరిధిలోని చెరువులో బావి తవ్వారు. కారికాడు గ్రామంలో ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించారు. అక్కడే నీటి సంపు నిర్మాణం పనులు చేపట్టారు. ఈ పనులు ఏడాది నుంచి నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాకపోవడంతోనే ఈ పరిస్థితి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇంకా పైపులైన్లు వేసి, వీధుల్లో కుళాయిలు అమర్చాల్సి ఉంది. వేసవి కాలం సమీపించడంతో ప్రస్తుతం ఎక్కడా తాగునీటి వనరులు లేకుండాపోయాయని స్థానికులు వాపోతున్నారు. కారికాడులో మాత్రం పథకం నీరు నూతనంగా నిర్మించిన సంపులోకి వస్తే అక్కడినుంచి పట్టుకుంటున్నారు. వేలికాడు, నాగినేరి గ్రామాల ప్రజలైతే ఊట చెరువుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకునే దుస్థితి ఏర్పడింది. హడావుడితో సరి తాగునీటి సమస్య పరిష్కారం విషయంలో అధికారులు, అధికార పార్టీ నాయకుల హడావుడి తప్ప ఇంకేం లేదు. ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఎప్పటికి శాశ్వత పరిష్కారం చూపిస్తారో?. -వై.సుబ్రహ్మణ్యం ఊటగుంటలోని నీరే దిక్కు: వేసవి కాలం వస్తే గ్రామ సమీపంలో ఉన్న ఊటగుంట నుంచి నీరు తెచ్చుకుని తాగాల్సిందే. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న పట్టించుకునే వారులేరు. మంచినీటి పథకం నీరు కలగానే మిగిలింది. – పి.ఏకాంబరం పదిరోజుల్లో పూర్తవుతాయి నీటి పథకం పనులు పదిరోజుల్లో పూర్తి చేయిస్తాం. నూతనంగా నిర్మాణంలో ఉన్న నీటి పథకం పనులు పూర్తైతే కారికాడు, వేలికాడు, నాగినేరి గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – కె.చంద్రశేఖర్, ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, దొరవారిసత్రం -
హడలెత్తిస్తున్న గ్రామసింహాలు
సాక్షి, ఓజిలి(సుళ్లూరు పేట): మండలంలో గ్రామసింహాల బెడద ఎక్కువుగా ఉంది. వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ పాదచారులతో పాటు ద్విచక్రవాహనదారులపై దాడులు చేస్తున్నాయి. మండలంలో 3500కుపైగా వీధి కుక్కలు ఉన్నట్లు అధికారుల అంచనా. గత ఐదేళ్లుగా పంచాయతీ అధికారులు వీధి కుక్కలను నిర్మూలించే కార్యక్రమానికి మంగళంపాడడంతో వీటి సంఖ్య గణణీయంగా పెరిగిపోయింది. వీధికుక్కల బెడదతో ఒంటరిగా పిల్లలను బయట పంపాలంటే భయమేస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా కుక్కలు ద్విచక్రవాహన చోదకులను వెంబడిస్తుండడంతో అదుపుతప్పి పడిపోయి గాయాలపాలవుతున్నారు. -
చంద్రబాబుకు అధికారమే పరమావధి
సూళ్లూరుపేట: రకరకాల సమస్యలతో ఆంధ్రా ప్రజలు అల్లాడుతుంటే పరిష్కార మార్గం చూపాల్సిన సీఎం చంద్రబాబు అధికారమే పరమావధిగా రాష్ట్రాన్ని వదిలి తెలంగాణాలో ఆంధ్రాద్రోహి కాంగ్రెస్‌ను అధికారంలో నిలబెట్టేందుకు శక్తి వంచన లేకుండా తిరుగుతున్నాడని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. సూళ్లూరుపేట మహదేవయ్యనగర్‌లో శనివారం రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే కిలివేటికి తమ సమస్యలు వివరించారు. తాగునీరు, రోడ్లు తదితర సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు. సమస్యలను స్వయంగా పరిశీంచిన ఎమ్మెల్యే కిలివేటి పర్యటన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యథా రాజ, తథా ప్రజ అన్నరీతిలో ఆంధ్రాలో పాలన సాగుతోందన్నారు. ప్రజల సమస్యలను గాలికి వదిలి తన కేసులు, తన పలుకుబడి, తన అధికారం అంటూ ఆంధ్రా ద్రోహి కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తెలంగాణా సీఎం కేసీఆర్‌కి భయపడి అమరావతి నిర్మాణం అంటూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిలో ఉన్న హక్కులను వదిలేసి పారిపోయి వచ్చేశారన్నారు. అప్పట్లో కేంద్రంలోని బీజేపీ తన జట్టులో సభ్యుడిగా ఉన్న చంద్రబాబుని రక్షించేందుకు ఇద్దరు సీఎంల మధ్య మధ్యవర్తిత్త్వం నెరిపి సమస్య లేకుండా చేసిందని కిలివేటి తెలిపారు. ఈ కేసు ఎప్పుడైనా మెడకు చుట్టుకుంటుందని తెలిసిన చంద్రబాబు భవవిష్యత్లో తమకు అండగా నిలిచే కొందరిని పక్కన చేర్చుకోవాలన్న ఉద్దేశంతో తన శిష్యుడు రేవంత్‌రెడ్డిని తెలివిగా ముందే కాంగ్రెస్‌లోకి పంపి ఇప్పడు తాను కూడా అందులో కలిసి పోయారన్నారు. తెలంగాణాలో ఓట్లకోసం మొసలి కన్నీరు కార్చడం, ఆంధ్రాకి ద్రోహం చేసి అడ్డగోలుగా విభజన చేసిన కాంగ్రెస్‌తో చెట్టపట్టాలు మాని రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి, అల్లూరు అనిల్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గండవరం సురేష్‌రెడ్డి, నాయకులు తిరుమూరు రవిరెడ్డి, ఎస్కే ఫయాజ్, బి.నవీన్‌రెడ్డి, రాఘవ, లక్ష్మయ్య, నిమ్మల గురవయ్య, మునిరత్నం, శరత్‌గౌడ్, పాలా మురళి, గోగుల తిరుపాల్, దినేష్, అలీ, బిగువు శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సెల్ఫీ పిచ్చి.. పాము కాటుకు మృతి
సాక్షి, నెల్లూరు : సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు ప్రాణలు కోల్పోయాడు. నాగుపాముతో సెల్ఫీ తీసుకునేందుకు జగదీష్ అనే యువకుడు ప్రయత్నం చేయగా.. పాము కాటేసింది. ఈ ఘటన మంగళవారం సుళ్లురుపేట మండలం మంగళపాడులో చోటుచేసుకుంది. ఇది గమనించిన సమీప వ్యక్తులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలిచండంతో చికిత్స పొందుతు మృతి చెందాడు. పాములో విష తీవ్రత ఎక్కువగా ఉండడంతో శరీరమంతా పాకి పరిస్థితి విషమించడంతో యువకుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
నెల్లూరు జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
చెంగాళమ్మ సేవలో వాణిశ్రీ
సూళ్లూరుపేట: ప్రముఖ సినీనటీ, నాటితరం కథానాయిక వాణిశ్రీ సోమవారం సూళ్లూరుపేటలో చెంగాళమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయం వద్ద పాలక మండలి చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వరరెడ్డి ఆహ్వానం పలికి, అమ్మవారి వద్ద పూజలు చేయించారు. అనంతరం ఆమెను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మే 31 నుంచి జూన్ 6 వరకూ జరుగనున్న చెంగాళమ్మ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా చైర్మన్ ముప్పాళ్ల వాణిశ్రీని ఆహ్వానించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆకుతోట రమేష్ పాల్గొన్నారు. -
ఆగని దందా
ఇసుక దందా ఆగడం లేదు. పోలీసుల మామూళ్లు ఆగడం లేదు. స్వర్ణముఖి, కాళంగి నదుల నుంచి ఇసుకను తరలిస్తూ స్మగ్లర్లు పేట్రేగిపోతున్నారు. ఇది ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు పోలీస్స్టేషన్లకు కూడా వరంగా మారింది. తడ, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా పరిధిలోని వరదయ్యపాళెం మండలాల్లో పలు ప్రాంతాలను డంపింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసుకున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లలో తమిళనాడుకు ఇసుకను తరలిçస్తూ రూ.లక్షలు దోచుకుంటున్నారు. సూళ్లూరుపేట : పగలంతా ట్రాక్టర్లు ద్వారా డంపింగ్ కేంద్రాలకు ఇసుక తరలించుకుంటున్నారు. రాత్రి 8 గంటలైతే చాలు జేసీబీలతో తమిళనాడుకు చెందిన లారీలకు లోడ్ చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలతోనే చిత్తూరుజిల్లా ఏర్పేడులో 16 మంది బలైన విషయం తెలిసిందే. తడ మండలం సరి«హద్దుల్లోని ఆరంబాకం, కారూరు, పూడి, మాంబట్టు అపాచీ వెనుక భాగాన టీడీపీ చోటా నాయకులే డంపింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఎవరిదైనా ట్రాక్టరు పట్టుకుంటే చాలు టీడీపీ నేతలు అధికారులకు ఫోన్ చేసి మనోడే వదిలేయండి హుకుంజారీ చేస్తున్నారు. దీంతో అధికారులు కూడా తమకెందున్నట్గు వ్యవహరిస్తున్నారు. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చుననే ప్రభుత్వ ప్రకటన అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో పట్టపగలు పబ్లిగ్గానే ఇసుకను తరలిస్తున్నారు. తమిళనాడులో నిబంధనలు కఠినతరం తమిళనాడులో ఎక్కడా ఇసుక తవ్వకూడదనే నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో ఆంధ్రా నుంచి వెళ్లే ఇసుక మీదే ఆధారపడి భవన నిర్మాణాలు చేస్తున్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల నుంచి శ్రీసిటీ, రామాపురం పేరుతో పగలూ రాత్రి తేడా లేకుండా సుమారు రోజుకు 400 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో డంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి లారీల్లో ఇసుకను చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు తదితర పట్టణాలకు రవాణా చేస్తున్నారు. ఆంధ్రా ఇసుకకు డిమాండ్ జిల్లాలోని స్వర్ణముఖి, కాళంగి నది ఇసుకకు తమిళనాడులో డిమాండ్ ఉండటంతో అక్రమ రవాణా పెరిగిపోయింది. ఆంద్రా–తమిళనాడు సరిహద్దులోని ఆరంబాకంలో పెన్నా, స్వర్ణముఖి ఇసుక టన్ను రూ.450 నుంచి రూ.500 కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు 6 నుంచి 8 టన్నుల దాకా లోడ్ చేసుకుని వెళుతున్నారు. చెరకు రవాణా చేస్తే ట్రాలీలో అయితే 20 టన్నుల ఇసుకను లోడ్ చేసుకుని వెళుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి నగరాల్లో ఒక్క లారీ ఇసుక రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు పలుకుతోంది. దీంతో తమిళనాడుకు చెందిన వ్యక్తులు కొంతమంది సూళ్లూరుపేట, వరదయ్యపాళెం మండలాల సరి«హద్దులోని సంతవేలూరు రోడ్డు సమీపంలోని మంగళంపాడు చెరువుకు సమీపంలో రెండు డంపింగ్ కేంద్రాల నుంచి లారీలతో ఇసుకను తరలిస్తున్నారు. మామూళ్లు మత్తులో జోగుతున్న పోలీసులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టులను ఎత్తేశారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించినపుడు తొలుత తడ పోలీస్‌స్టేషన్ ముందు తనిఖీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత తడ మండలం పన్నంగాడు వద్ద ఏఆర్ పోలీసులు, స్థానిక పోలీసులను మమేకం చేసి నిఘా ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టు పెట్టిన కొద్ది రోజులు అందరూ భయంగానే వ్యవహరించారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు తడ, సూళ్లూరుపేట పోలీసులతో మాట్లాడుకుని నెల మామూళ్లు ఏర్పాటు చేసుకుని లారీలతో రవాణా చేయడం ప్రారంభించారు. రవాణాలో పోలీసులే కొంత వెసులుబాటు కల్పిస్తూ రావడంతో నాయుడుపేట, వాకాడు, కోట, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ నుంచి ట్రాక్టర్లు ద్వారా శ్రీసిటీ పేరుతో ఆరంబాకం దాకా ఇసుక తరలించడం ప్రారంభించారు. ఆ తరువాత నెమ్మదిగా తెలుగు తమ్ముళ్ల జోక్యం పెరిగింది. ఇదే అదునుగా చేసుకున్న పోలీసులు సరిహద్దు చెక్‌పోస్టును నెమ్మదిగా ఎత్తేశారు. ఒక ట్రాక్టర్‌కు నెలకు దొరవారిసత్రం పోలీస్‌స్టేషన్, సూళ్లూరుపేట పోలీస్‌స్టేసన్‌లో రూ.3,200 లెక్కన మామూళ్లు ఏర్పాటు చేసుకున్నారు. తడ పోలీస్‌స్టేషన్‌లో నెలకు రూ.5,200 లెక్కన నెలకు సుమారుగా 300 నుంచి 350 ట్రాక్టర్ల వరకు నెల మామూళ్లు చెల్లిస్తున్నారు. తడ చెక్‌పోస్టులో ఒక ట్రాక్టర్‌కు నెలకు రూ.5వేలు లెక్కన వసూలు చేస్తున్నారు. ఈ మొత్తంలో ఎవరి వాటా ఎంత అనేది సూళ్లూరుపేట సీఐ, తడ ఎస్సైలకే తెలియాలి. ఇదే తరహాలో ఇసుక అక్రమ రవాణా జరిగితే స్వర్ణముఖి, కాళంగి నదుల్లో ఇసుక కనుమరుగైపోయి భవిష్యత్తులో భూగర్భజలమట్టం భారీగా పడిపోయే అవకాశం ఉంది. -
స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలి
సూళ్లూరుపేట: చిరువ్యాపారులు కూడా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శనివారం వర్తక, వ్యాపార వర్గాల వారికి స్వైపింగ్ యంత్రాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. మరో ఏడెనిమిది నెలల వరకు ఇబ్బందుల ఉంటాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం స్వైపింగ్ మిషన్లను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ మిషన్లను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందని దీనికి ఎవరూ ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. డీసీటీఓలు గోపీచంద్, వరప్రసాదరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వాకిచర్ల శాంతారామ్, క్లాత్ మర్చంట్ అసోసియేన్ అధ్యక్షుడు అలవల సూరిబాబు, పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌జైన్, కిరాణా మర్చం అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ కృష్ణారావు పాల్గొన్నారు. -
అంతర్జిల్లా దొంగల అరెస్ట్
రూ.8 లక్షలు బంగారు ఆభరణాలు, లారీ స్వాధీనం సూళ్లూరుపేట : సూళ్లూరుపేట, తడ మండలాల్లో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్జిల్లా దొంగలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ విజయకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిక వేణుగోపాలపురానికి చెందిన వరగంటి రమేష్ (28), తుపాకుల రమేష్ (23) సూళ్లూరుపేటలోని బస్టాండ్ సెంటర్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. గత నెల 24న నెల్లూరు వెంకటేశ్వరపురానికి చెందిన ముగ్గురు మహిళలను నాయుడుపేటలో ఆటోలో ఎక్కించుకుని పెరిమిటిపాడు వద్ద అటవీ ప్రాంతంలో ఆపి దారి దోపిడీ చేసి యాస్మిన్ అనే మహిళ నుంచి బంగారు గొలుసు, కమ్మలు, సెల్‌ఫోన్ చోరీ చేశారు. వారి నుంచి ఆ వస్తువులను రికవరీ చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 18న తడ మండలం భీములవారిపాళెం వద్ద రోడ్డు పక్కన ఆపి ఉన్న అశోక్‌లైలాండ్ లారీని కూడా చోరీ చేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆ లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. మంగానెల్లూరు, పిచ్చాటూరు మండలంలోని అప్పంబట్టు, కేవీబీపురం పొలాల్లో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులోని కాపర్ వైర్లును చోరీ చేశారు. ఇందులో వరంగటి రమేష్‌పై చిత్తూరు జిల్లా సత్యవేడు, వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, పిచ్చాటూరు, నెల్లూరు 5వ టౌన్ పోలీస్స్టేషన్లలో లారీల దొంగతనాలు కేసులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్ దొంగతనాల కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ గంగాధర్‌రావు, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
సూళ్లూరుపేట : బైక్ అదుపు తప్పి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని శేషసాయి కల్యాణ మండపం సమీపంలో చెన్నై–కోల్కత్తా ఏషియన్ హైవేపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నాయుడుపేట మండలం అత్తలపాళెంకు చెందిన చిన్నస్వామి (45) వరదయ్యపాళెం మండలం సాధనవారిపాళెంలోని తన అక్క ఇంటికి మోటార్‌బైక్‌పై వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి ఇంటికెళ్తూ శేషసాయి కల్యాణ మండపం వద్ద ఆటోను క్రాస్ చేస్తూ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయాడు. తలకు బలమైన గాయంకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ జీ గంగాధర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెంగాళమ్మ ఆలయ హుండీ లెక్కింపు
సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ హుండీని చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి సమక్షంలో గురువారం లెక్కించారు. 3 నెలల కాలానికి గానూ హుండీ ద్వారా రూ.39లక్షల ఆదాయం సమకూరినట్లు ఆయన తెలిపారు. హుండీ, దర్శనం టికెట్లు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన మొత్తం రూ.60లక్షలను శుక్రవారం బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు వివరించారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ.30,734 ఆదాయం లభించిందని, ఈ మొత్తాన్ని అన్నదానానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సీహెచ్ సుధాకర్‌బాబు, ఆలయ ఈఓ ఆళ్ల శ్రీనివాసులురెడ్డి, పాలకమండలి సభ్యులు చిలకా యుగంధర్‌యాదవ్, అలవల సూరిబాబు, ఆకుతోట రమేష్, పిట్ల సుహాసిని, చిట్టేటి పెరుమాళ్లు, వేనాటి గోపాల్‌రెడ్డి, పులుగు శ్రీనివాసులురెడ్డి, కీసరపల్లి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హోటల్లో అగ్నిప్రమాదం
సూళ్లూరుపేట : పట్టణంలోని బైపాస్‌రోడ్డులో ఓ హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.4 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. మురళి అనే యువకుడు బైపాస్‌రోడ్డు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని హోటల్, బంకు, కూల్‌డ్రింగ్ షాపు నడుపుకుంటున్నారు. ఆదివారం వ్యాపారం ఎక్కువగా ఉంటుందని 11 గంటల సమయంలో వంటలు చేస్తుండగా విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. హోటల్‌కు వెనుక భాగంలో మంటలు భారీగా విస్తరించడంతో స్థానికులు కేకలు వేశారు. అప్పటికే మంటలు వ్యాపించాయి. స్థానిక అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు వచ్చేలోపు అంతా కాలిపోయి బూడిద మిగిలింది. హోటల్‌కు సంబంధించిన అన్ని వస్తువులతో పాటు ఫ్రిజ్, ఇన్వర్టర్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లు ఆగ్నికి ఆహుతైపోయాయి. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ జీ గంగాధర్‌రావు పరిశీలించారు. తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నామని బాధితులు తెలిపారు. -
సూళ్లురుపేటలో భారీగా ఎర్రచందనం పట్టివేత
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తీసుకు వెళ్తున్న మినీ వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. అయితే వ్యాన్ డ్రైవర్‌తోపాటు నిందితులు పరారైయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
అట్టల కంపెనీలో అగ్నిప్రమాదం
సూళ్లూరుపేట: పట్టణంలోని హోలీక్రాస్ సెంటర్లో నిప్పో కంపెనీకి ఇన్సిలేటర్స్ సరఫరా చేసే అట్టల కంపెనీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పని చేస్తున్న సమయంలో యంత్రం వద్ద చిన్నపాటి మంటలు చెలరేగాయి. ఆ మంటలను అదుపు చేశామని అనుకోవడంతో అది లోలోపల రగులుతూ పెద్ద మంటలై కిటికిలో నుంచి పొగ రావడంతో హోలీక్రాస్ సెంటర్ ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న హోమ్‌గార్డు, లారీ అసోసియేషన్ వాళ్లు చూసి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి సమాచారం అందించారు.అగ్నిమాపక యంత్రం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తుండగా మరో వైపు మంటలు వ్యాపించాయి. ఎస్సై జీ గంగాధర్‌రావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అపాచి కంపెనీకి చెందిన అగ్నిమాపక యంత్రాన్ని కూడా రప్పించారు. రెండు అగ్నిమాపక యంత్రాలు సుమారు రెండు గంటలసేపు కష్టపడి పనిచేస్తే మంటలు అదుపులోకి వచ్చాయి. సాయంత్రం 7 నుంచి అంటుకున్న మంటలు రాత్రి 9 గంటలకు అదుపులోకి వచ్చాయి. ఈ మేరకు కంపెనీ యజమాని జీ ప్రభాకర్‌రెడ్డినుంచి సమాచారం తీసుకున్నారు. సుమారు లక్ష రూపాయలు విలువచేసే అట్టలు కాలిపోయాయి. అదే విధంగా మరో లక్ష రూపాయలు విలువ చేసే యంత్రాలు, భవనానికి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. -
డివైడర్‌ను ఢీకొన్న బైక్
–అపాచి కార్మికుడి దుర్మరణం మరొకరికి తీవ్రగాయాలు సూళ్లూరుపేట : ప్రమాదవశాత్తు డివైడర్‌ను బైక్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చెన్నై–గుంటూరు ఏషియన్ హైవేపై సూళ్లూరుపేట సమీపంలోని మన్నారుపోలూరు మలుపురోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిట్టమూరు మండలం జంగాలపల్లికి చెందిన పాలిచెర్ల లక్ష్మీనారాయణ (20), అతని సమీప బంధువు చిల్లకూరు మండలం నల్లయ్యగారి పాళెంకు చెందిన పీ శ్రీనివాసులు (24) ఆపాచి కంపెనీలో చేరి పట్టణంలోని కోళ్లమిట్టలో రూము తీసుకుని ఉంటున్నారు. టౌన్లో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడైనా పల్లెటూరులో రూము తీసుకుంటే అద్దెలు తగ్గుతాయనే భావనతో ఇద్దరు కలిసి మోటార్‌బైక్‌పై చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం వెళ్లి రూము చూసుకుని తిరిగి వస్తుండగా డివైడర్‌ను కొట్టుకుని పక్కనే ఇనుప రైలింగ్‌కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాసులు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతుడి బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎస్సై జీ గంగాధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్రేన్ ఢీకొని వృద్ధురాలి మృతి
కోళ్లమిట్ట (సూళ్లూరుపేట) :రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని క్రేన్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందింది. ఈ సంఘటన పట్టణంలోని కోళ్లమిట్ట వద్ద బుధవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కోళ్లమిట్టకు చెందిన పుత్తూరు నాగమ్మ (60) షార్రోడ్డును దాటుతుండగా అదే మార్గంలో క్రేన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్రేస్ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికెళ్లారు.. ఇల్లు గుల్ల చేశారు
29 సవర్ల బంగారు అభరణాలు, రూ. 75 వేలు నగదు చోరీ సూళ్లూరుపేట : కుటుంబ సభ్యులందరూ బంధువుల పెళ్లికెళ్లగా గుర్తుతెలియని దుండగులు ఇల్లు గుల్ల చేశారు. ఈ సంఘటన పట్టణంలోని ఝాన్సీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగింది. సేకరించిన సమాచారం మేరకు.. చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకంకు చెందిన కారికాటి జయకృష్ణ శ్రీరామ్‌చిట్స్ కంపెనీలో కావలిలో పనిచేస్తూ సూళ్లూరుపేటలోని ఝాన్సీనగర్‌లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఆయన విధులు నిమిత్తం మంగళవారం కావలికి వెళ్లాడు. బుధవారం రాత్రి తన అక్క కుమార్తె వివాహం కావడంతో భార్య స్వప్నకుమారి ఇద్దరి పిల్లలను తీసుకుని తలుపులకు తాళం వేసి పక్కింట్లో ఇచ్చి కారిపాకం వెళ్లింది. బుధవారం ఉదయాన్ని తలుపు తీసేసి ఉండడాన్ని పక్కింటి వారు చూసి జయకృష్ణ, స్వప్నకుమారికి సమాచారం అందించారు. వారు వెంటనే స్థానిక సీఐ విజయకృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించి వేలిముద్రలను నిపుణులను రప్పించి బీరువా, తలుపులు మీద వేలిముద్రలను తీసుకున్నారు. సంఘటనా స్థలంలో తలుపునకు వేసిన తాళం పిట్టగోడ మీద ఉంది. చిన్నపాటి గడ్డపార కూడా అక్కడే కనిపించింది. అయితే గడ్డపారతో తలుపులు పగులగొట్టిన దాఖలాలు కనిపించలేదు. బీరువాను పగులగొట్టిన ఆనవాళ్లు కనిపించలేదు. తలుపునకు వేసిన తాళం తీసి బెడ్ కింద ఉన్న బీరువా తాళం తీసి అందులో ఉన్న 29 సవర్ల బంగారు ఆభరణాలు, కట్నం కోసం తెచ్చిపెట్టిన రూ.75 వేల నగదు మాత్రమే చోరీకి గురైంది. బంగారు ఆభరణాలు, నగదు తప్ప అందులో ఉన్న వెండి వస్తువులను తాకలేదు. చోరీ జరిగిన ఇంటిని, పరిసర ప్రాంతాలను ఐడీ పార్టీ సిబ్బంది శ్రీనివాసులురెడ్డి, మునీర్‌బాషా పరిశీలించారు. అయితే గుర్తు ðlలియని దొంగలు వేసుకుని వచ్చిన చెప్పులు మిద్దెపైన వదిలి వెళ్లడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. గడ్డపారను కూడా స్వాధీనం చేసుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని సీఐ విజయకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. -
‘సొంత ఆస్తుల్లా అమ్మేస్తున్నారు’
సూళ్లూరుపేట : పట్టణం నడిబొడ్డున ఉన్న పరిశుద్ధ మిఖాయేల్ లూథరన్ చర్చికి చెందిన ఆస్తులను చర్చికి పాస్టర్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ తన సొంత ఆస్తుల్లా అమ్మేస్తున్నారని క్రిస్టియన్ మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం గౌరవాధ్యక్షుడు ఆవుల ప్రసాదరావు అన్నారు. ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా ఫోరం ఆధ్వర్యంలో చర్చి ఎదురుగా పట్టణంలోని క్రైస్తవులు ఆందోళన చేశారు. పాస్టర్ చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 150 సంవత్సరాల క్రితం జర్మనీ దేశస్తులు చర్చి నిర్మించి దానికి స్థానిక వినాయకుడిగుడి సెంటర్ నుంచి ఆర్‌ఆండ్‌బీ బంగ్లా వరకు ఆస్తులు కూడా సమకూర్చారన్నారు. చర్చి కాంపౌండ్‌లో ఓ ప్రాథమిక పాఠశాల ఉంటే దాన్ని అమ్మేశారని, దాని పక్కనే ఉన్న స్థలాలను ఒక్కొక్కటిగా అమ్మి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ఇప్పుడు చర్చికి పక్కనే ఉన్న సమాధులను కూడా అమ్మేసేందుకు సిద్ధమైపోయారన్నారు. దీనిపై సీబీఐతో విచారణ చేయించి ఇందులో ప్రమేయమున్న వారు ఎంతటివారైనా సరే శిక్షించి క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. లీగల్ అడ్వజర్, హైకోర్టు న్యాయవాది కృష్ణ, క్రిస్టియన్ ఫోరం నాయకులు డేవిడ్ వాగ్దేవ్, మెనార్డ్, ఫిలిప్, ప్రకాష్, చంద్రయ్య, సత్యానందం, రాజానందం, ఎంపీ సుందరం, మదన్, అంబేడ్కర్ సేవా సమితి అధ్యక్షుడు పిట్ల చిన్న పాల్గొన్నారు. -
సూళ్లూరుపేట భారీ అగ్నిప్రమాదం
8 షాపులు దగ్ధం సూళ్లూరుపేట: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు ఎదురుగా అయ్యప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో 8 షాపులు కలిగిన కాంప్లెక్స్ అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి 9.30 గంటలకు షాపు మూసేసి ఇంటికి వచ్చేశారు. విద్యుత్ షార్ట్ సర్యూ్యట్తో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. షాపుల్లో ఉన్న కర్పూరం, సెంట్ బాటిళ్లు, ఇతర కాస్మోటిక్ బాటిళ్లకు మంటలు అంటుకోవడం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న షాపు యజమానులు, స్థానికులు ట్రాన్స్‌కో అధికారులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే పవర్ కట్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది నీళ్లు పట్టినా మంటలు ఆదుపులోకి రాలేదు. స్థానికులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సమాచారం ఇవ్వడంతో ఆయన షార్ కేంద్రానికి ఫోన్ చేసి ఒక ఫైరింజన్‌ను, నాయుడుపేట ఫైర్ స్టేషన్ నుంచి మరో ఫైరింజన్‌ను పంపించారు. అప్పటికి కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఆపాచికంపెనీకి చెందిన ఫైరింజన్‌ను పంపించే. రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాకా నాలుగు ఫైరింజన్లు నీళ్లు పోసి మంటలు కొంతమేర అదుపులోకి తెచ్చారు. 8 షాపులకు మంటలు వ్యాపించడంతో అందులో వున్న వస్తు సామగ్రి అంతా మాడిపోయింది. ప్రమాదంలో సుమారు రూ.కోటికిపైగా నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు. మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరు పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి చెత్త తొలగించారు. నెర్రిలిచ్చిన కాంఫ్లెక్స్ భవనం... కింద వున్న 8 షాపుల్లో వచ్చిన భారీ అగ్నిప్రమాదంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడడంతో పైన వున్న భవనం అంతా నెర్రిలిచ్చింది. సూళ్లూరుపేట పట్టణ చరిత్రలో ఇంత పెద్ద అగ్నిప్రమాదం సంభవించలేదని పెద్దలు చెబుతున్నారు. శనివారం రాత్రంతా మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు, స్థానికులు జాగారం చేశారు. షాపులు పెట్టుకున్న యజమానులకు అందరికీ కలిపి సుమారు కోటి రూపాయలు, భవనానికి మరో కోటి రూపాయలు కలిపి రెండు కోట్ల దాకా నష్టం వాటిల్లినట్టు అందరూ అంచనాలు వేస్తున్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో దుకాణాల దగ్ధం
సూళ్లూరుపేట: పట్టణంలోని కూరగాయల మార్కెట్‌కు ఎదురుగా ఉన్న శేషాద్రి జనరల్ స్టోర్స్‌లో శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది షాపులు కలిగిన కాంప్లెక్స్ దగ్ధమైంది. శేషాద్రి జనరల్ స్టోర్స్ యజమాని రాత్రి 10 గంటలకు షాపు మూసేసి ఇంటికి వచ్చేశాడు. ఆ షాపులోపల మంటలు అంటుకుని వాసన రావడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూశారు. షాపులోని దట్టమైన పొగ వస్తున్నట్లు గుర్తించారు. వెంటనే షాపు యజమానికి తెలియజేశారు. షాపు డోర్ తెరవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్‌శాఖ వారు విద్యుత్ సరఫరాను అపేశారు. అగ్నిమాపక యంత్రంతో నీళ్లు పట్టినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో షార్ కేంద్రానికి ఫోన్ చేసి మరో యంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే నాయుడుపేటకు కూడా సమాచారం అందించి మరో ఫైరింజన్కూడా తీసుకొచ్చినా మంటలు అదుపులోకి రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఎనిమిది షాపుల్లో సరుకులన్నీ కాలి బూడిదయ్యాయి. భారీగా నష్టం వాటిల్లినట్టు తెలిసింది. -
ఆటో బోల్తా: వృద్ధురాలు దుర్మరణం
ఓజిలి : అతివేగంగా ప్రయాణిస్తున్న ఆటోబోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మానమాల సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని కొండవల్లిపాడుకు చెందిన ఏల్చూరు ఆదెమ్మ (70) నేరేడు పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంది. రోజులానే గ్రామం నుంచి పండ్లు తీసుకుని కురుగొండలోని పాఠశాల వద్దకు Ðð ళ్లేందుకు మానమాలకు వచ్చింది. ఓజిలి నుంచి కురుగొండ వైపు ప్రయాణిస్తున్న ఆటోలో ఎక్కింది. గ్రామం సమీపంలోకి వచ్చే సరికి ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆదెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే స్థానికులు ఆదెమ్మను కురుగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఆటోడ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బతుకుతెరువు కోసం వెళ్లిన ఆదెమ్మ అంతలోనే మృతి చెందిందని తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొండవల్లిపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. -
హత్యా? ఆత్మహత్యా?
-మహిళ అనుమానాస్పద మృతి సూళ్లూరుపేట: పట్టణంలోని చెంగాళమ్మ ఆలయ దక్షిణ ముఖద్వారం సమీపంలోని మంచినీళ్లగుంట పక్కనే పొలాల్లో తడమండలం వేనాడుకు చెందిన వెట్టి గోవిందమ్మ (55) అలియాస్ కిల్లిమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. మంచినీళ్లగుంట పక్కనే పొలం ఉన్న రాయపు హరిహరకుమార్ అనే అతను సోమవారం మధ్యాహ్నం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లడంతో శవాన్ని చూసి సమాచారం అందజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ముఖంపై బలమైన గాయాలుండటంతో హత్యగా భావించారు. ముందు గుర్తు తెలియని శవంగా భావించారు. నాగరాజపురంలో మృతురాలు కుమారుడు రవి కూడా అందరిలాగే శవాన్ని చూడడానికి వచ్చి గుర్తించారు. వేనాడులో కాపురం వుంటూ అప్పుడప్పుడు కుమారుడి వద్దకొచ్చి ఉంటుండేది. శనివారం రాత్రి నుంచి కనిపించకపోయే సరికి వేనాడుకు వెళ్లిఉంటుందని భావించారు. అయితే ఈమెకు మద్యం అలవాటు ఉండటంతో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను తీసుకెళ్లి కొట్టి చంపేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ముఖంపై బలమైన గాయాలు వుండడంతో హత్యగానే భావించి కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై గంగాధర్‌రావు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్రేయ అత్తవారింటికి వందేళ్లు
సూళ్లూరుపేట : తెలుగు సినీ చరిత్రలో ఎన్నో వైవిధ్య భరితమైన పాటలు రాసి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న మనసు కవి ఆచార్య ఆత్రేయ అత్తవారిల్లు నిర్మించి వంద సంవత్సరాలైంది. ఆయన పాటలులాగే ప్రజల హృదయాల్లో నేటికీ ఎలా పదిలంగా ఉన్నాయో.. ఆ ఇల్లు అంతే చెక్కు చెదరలేదు. సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో 1915లో ఈ ఇల్లు నిర్మించారు. దొరవారి సత్రం మండలం ఉచ్చూరు గ్రామానికి చెందిన ఆత్రేయ పక్కనే ఉన్న మంగళంపాడులో వివాహం చేసుకున్నారు. ఉచ్చూరులో ఆత్రేయకు చెందిన ఇళ్లు, ఆస్తులు పోయినా మంగళంపాడులో అత్తవారిల్లు మాత్రం అలాగే ఉంది. జీవిత చరమాంకంలో మంగళంపాడులోనే స్థిరపడాలని అనుకునే వారని ఆయన సమీప బంధువులు చెబుతారు. ఆ కోరిక తీరకుండానే ఆయన మృతి చెందారు. అయితే ఆ ఇంటిని మాత్రం ఆయన జ్ఞాపకాల కోసం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంచారు. -
కోలాహలంగా ఫ్లెమింగో ఫెస్టివల్
రెండోరోజున ఆటల పోటీల సందడి సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్-2015లో భాగంగా రెండోరోజు శనివారం సూళ్లూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఆటలపోటీలను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్రీడలను నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్రీడాపోటీలను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి విద్యార్థులు, తిరుపతి, శ్రీకాళహస్తి, చెన్నై నుంచి వచ్చిన పలువురు పర్యాటకులు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు. అ తర్వాత ఉచిత బస్సుల్లో అటకానితిప్పకు వెళ్లి పులికాట్లో ఆహారవేటలో ఉన్న విదేశీ వలస విహంగాలను వీక్షించారు. ఆ తర్వాత నేలపట్టు పక్షులు కేంద్రానికి వెళ్లి చెరువులోని చెట్లపై గూళ్లుకట్టుకుని విన్యాసాలు చేస్తున్న విహంగాలను తిలకించారు. శనివారం మాత్రం సూళ్లూరుపేట మైదానం, బీవీపాళెంలో బోట్ షికార్, నేలపట్టుల్లో పక్షులను వీక్షించేందుకు పర్యాటకులు కిటకిటలాడుతూ కనిపించారు. దీనికి తోడు పులికాట్లో అత్యధికంగా విదేశీ వలస విహంగాలు దర్శనమివ్వడంతో సందర్శకులు పులకించిపోయారు. శ్రీహరికోట-సూళ్లూరుపేట మార్గానికి ఇరువైపులా పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్ ప్రకృతి ప్రియులకు కనువిందు చేశాయి. బోటు షికారు... భలే హుషారు... తడ మండలం భీములవారిపాళెం వద్ద బోటు షికారు ఏర్పాటు చేశారు. పులికాట్ సరస్సులో బోటు షికారు బాగుందని పర్యాటకుల అభిప్రాయం. నేలపట్టులో పక్షులను తిలకించడానికి జిల్లా నుంచి, తమిళనాడు నుంచి వేలాదిమంది పర్యాటకులు వచ్చారు. -
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం!
నెల్లూరు: సూళ్లూరుపేటలో జరిగిన జన్మభూమి సభలో గందరగోళం ఏర్పడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. తొలుత సభను నిర్వహించడానికి టిడిపి మాజీ ఎమ్మెల్యే వెంకటరత్నం వేదికపైకి వచ్చారు. అందుకు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సంజీవయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రొటోకాల్ పాటించాలని సంజీవయ్య అధికారులను ఆదేశించారు. దాంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. *** -
డిపో మూసివేయాలని చూస్తే ఊరుకోం
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేట: సూళ్లూరుపేట డిపోను మూసివేయాలని చూస్తే ఊరుకునేది లేదని, పోరాటం చేసైనా మూసివేతను అడ్డుకుంటామని స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. డిపోలో దశలవారీగా బస్సుల సంఖ్యను తగిస్తూ ఉండడంతో డిపో పరిధిలోని మూడు యూనియన్లు కలిసి బుధవారం ఆందోళన చేశారు. అదే విధంగా డిపో మూసివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని యూనియన్ నాయకులు ఎమ్మెల్యే కిలివేటికి ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఆయన డిపోకు చేరుకు ని మేనేజర్, కార్మికులతో చర్చించారు. బస్సులు తగ్గించడానికి కారణాలు, మంగళ, శుక్రవారాల్లో బస్సులను ఆపేయడంపై ఆయన ఆరా తీశారు. కార్మికులు మాట్లాడుతూ మంచి కలెక్షన్లు వస్తున్న బస్సులను రద్దు చేశారని, ఇప్పటికి ఎనిమిది సర్వీసులు తీసుకెళ్లారని, డొక్కు బస్సులు తప్ప మంచి బస్సులు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఆత్మకూరు, వాకాడు గూడూరు భారీ నష్టాల్లో ఉన్నాయని, వాటిని పట్టించుకోకుండా అతి తక్కువ నష్టాలతో నడస్తున్న ఈ డిపోపై ఉన్నతాధికారులు కక్ష కట్టారని కార్మికులు వివరించారు. కార్మికులు పనితీరు బాగలేనందువల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయని, ఈ డిపో మనది, మనమే కాపాడుకోవాలనే దృక్పథంతో కార్మికు లు పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులుండవని డిపో మేనేజర్ ప్రసాద్ వివరించారు. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న డిపో కాబట్టి దీన్ని మూసివేయడం తనకు ఇష్టం లేదని అభివృద్ధికి తాను కూడా సహకరిస్తానని, కార్మికులంతా కలిసికట్టుగా పనిచేసి మంచి కలెక్షన్లు తీసుకొస్తే డిపో నిలబ డుతుందన్నారు. ఎమ్మెల్యే కిలివేటి మాట్లాడుతూ జిల్లాలో నాలుగు డిపోలు నష్టాలో నడుస్తున్నాయని అం దులో సూళ్లూరుపేట డిపో నష్టాల్లో నాల్గోస్థానంలో ఉందన్నారు. మొదటి, రెండో స్థానంలో ఉన్న డిపోల జోలికి పోకుండా ఈ డిపోను మాత్రం ఎందుకు మూసివేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కార్మికులంతా యూనియన్లు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేసి ఆదాయాలను తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్ఎం , ఈడీతో చర్చించి డిపో మూతపడకుండా తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఉన్నతాధికారులనైనా ఎదిరించి డిపోను నిలబెట్టుకునేందుకు కలిసికట్టుగా పోరాడదామని కిలివేటి చెప్పారు. దీంతో కార్మికులు కూడా సానుకూలంగా స్పందించి డిపోలో అన్ని బస్సుల్లో మంచి కలెక్షన్లు తీసుకురావడానికి కృషి చేస్తామని ముక్తకంఠంతో చెప్పారు. వైఎస్సార్సీపీ నేత దబ్బల రాజారెడ్డి, ఎంపీపీ షేక్ షమీమ్, తడ మండల కన్వీనర్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఇలుపూరు సుధాకర్, గండవరం సురేష్‌రెడ్డి, యూనియన్ నాయకులు శేఖర్, జయరాజ్, నరేంద్ర పాల్గొన్నారు. -
సమస్యల స్వాగతం
ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా తీర్చిదిద్దుతామని పాలకులు తరచూ చెప్పే మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి. బంగారు భవితపై కోటి ఆశలతో బడిబాట పడుతున్న చిన్నారులకు ఏటా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కరువవడంతో విద్యార్థులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రభుత్వ స్కూళ్లలో ఈ సంవత్సరం కూడా చిన్నారులకు తిప్పలు తప్పేలా లేవు. వేసవి సెలవులు ముగిసి మరో నాలుగు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో సమస్యలపై ‘న్యూస్‌లైన్ ఫోకస్’. సూళ్లూరుపేట: పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగలడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. మరోవైపు వందలాది పాఠశాలలు వివిధ సమస్యలకు నెలవుగా మారాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో 309 ప్రాథమిక, 61 ప్రాథమికోన్నత, 39 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 248 పాఠశాలలకు ప్రహరీలు లేవు. 200 పైచిలుకు పాఠశాలల్లో వంట గదులు నిల్. 212 పాఠశాలలకు మరుగుదొడ్లు కరువయ్యాయి. మొత్తంగా 50 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటి వసతి కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. 223 పాఠశాలలకు వంటగదులు నిర్మించినా ఉపయోగించక శిథిలావస్థకు చేరాయి. ఇక అదనపు గదుల నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతుండడం ప్రధాన సమస్యగా మారింది. 2004లో సూళ్లూరుపేట మండలంలోని ఆరు పాఠశాలలకు అదనపు గదులు మంజూరయ్యాయి. కుదిరి, ఎడబాళెం, మతకామూడి, మన్నేముత్తేరి, జంగాలగుంట, ఆబాక ప్రాథమిక పాఠశాలల ఆవరణలో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. అయితే నిధులు చాలకపోవడంతో కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే వదిలేశారు. అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తక్కువ మొత్తంతో అంచనాలు రూపొందించడమే దీనికి ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు చెట్ల కింద, వరండాల్లో చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అసంపూర్తి భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతున్నాయి. -
కుమ్ములాటల్లో సైకిల్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పుడు సైకిల్ స్పీడ్‌కు బ్రేక్‌లు పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం తీరుపై అసంతృప్తి, వర్గవిభేదాలు తదితర అంశాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. మరోవైపు వైఎస్సార్సీపీ దూసుకుపోతుండడంతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థే గెలుపొందారు. రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. పరసా వెంకటరత్నయ్య నాలుగు సార్లు టికెట్ సాధించుకుని మూడు మార్లు గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకే టీడీపీ టికెట్ మళ్లీ లభించింది. దంతో ఆ పార్టీలోని వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో పారిశ్రామిక వేత్త కొండేపాటి గంగాప్రసాద్, పార్టీ రాష్ట్ర నేత వేనాటి రామచంద్రారెడ్డి వర్గాల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ అదే పరిస్థితి కొనసాగింది. పార్టీ టికెట్ ఇస్తే పరసాకు ఇవ్వాలని, లేని పక్షంలో డాక్టర్ సందీప్ పేరు పరిశీలించాలని వేనాటి వర్గీయులు పట్టుబట్టారు. కొండేపాటి మాత్రం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లేదా పిట్ల సుహాసినికి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ పంచాయితీలో చంద్రబాబునాయుడు చివరకు పరసా వైపే మొగ్గారు. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. పరసా అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేని కొండేపాటి వర్గం పార్టీకి దూరంగా ఉంటోంది. అలిగిన నేతలను బుజ్జగించేందుకు వేనాటి రామచంద్రారెడ్డి, పరసా వెంకటరత్నం ఆపసోపాలు పడుతున్నా ఫలితం కరువవుతోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పులికాట్ కుప్పాల్లోని మత్స్యకారులు కూడా పరసా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ అదే పరిస్థితి ఎంపీ చింతా ఆశీస్సులతో కాంగ్రెస్ టికెట్‌ను సాధించుకున్న దూర్తాటి మధుసూదన్‌రావుకు ఆ పార్టీ నేతల అండ కరువైంది. ఆయనకు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, చెంగాళమ్మ ఆలయపాలకమండలి చైర్మన్ ఇసనాక హర్షవర్థన్‌రెడ్డి వర్గీయులు దూరంగా ఉంటున్నారు. నామినేషన్‌కు ఎవరూ రాలేదు. చింతా మాత్రమే దగ్గరుండి నామినేషన్ వేయించారు. పెపైచ్చు చింతా పేరు ఎత్తితేనే పులికాట్ జాలర్లు మండిపడుతున్నారు. దుగరాజపట్నం ఓడరేవు పేరుతో పులికాట్ సరస్సునే లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తుండడంతో జాలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చింతా వర్గీయుడైన దూర్తాటిపైనా వారి ఆగ్రహం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ మాత్రం రాజకీయాలకు కొత్తవ్యక్తి, ఉన్నత విద్యావంతుడైన కిలివేటి సంజీవయ్యకు అవకాశం ఇచ్చింది. పార్టీ మేనిఫెస్టోను ఆయన నియోజకవర్గంలోని గడపగడపకూ తీసుకెళుతూ ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు. -
ఆర్టీసీ చార్జీలు వైఎస్సాఆర్ హయాంలో పెరుగలేదు: షర్మిళ
-
స్త్రీ ‘అ’శక్తి భవనాలు
ఉదయగిరి/దుత్తలూరు, న్యూస్‌లైన్: స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల కోసం మండల స్థాయిలో నిర్మించతలపెట్టిన స్త్రీశక్తి భవనాలకు గ్రహణం పట్టింది. భవనాలు మంజూరై రెండేళ్లయినా ఇంకా నిర్మాణాలు పూర్తికాకపోగా, మరికొన్ని చోట్ల ప్రారంభానికి నోచుకోలేదు. పలు మండలాల్లో పనులే ప్రారంభించలేదు. జిల్లాలో 46 స్త్రీశక్తి భవనాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట పట్టణాలు మున్సిపాల్టీలుగా మారడంతో 33 భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైంది. కొన్ని మండలాల్లో పనులు జరుగుతుండగా, మరికొన్ని చోట్ల పనులు ప్రారంభం కాలేదు. స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) కార్యకలాపాలకు సంబంధించిన సమావేశాలకు వేదికగా ఈ భవనాలు నిర్మిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలుచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో దుత్తలూరు, వింజమూరు మండలాల్లో మాత్రమే భవనాలు పూర్తయ్యాయి. కొండాపురం, కలిగిరి మండలాల్లో అసలు పనులే ప్రారంభించలేదు. జలదంకి మండలంలో నత్తనడకన పనులు సాగుతున్నాయి. వరికుంటపాడు, సీతారామపురం, ఉదయగిరి మండలాల్లో నిర్మాణంలో ఉన్నాయి. జిల్లాలో అనేక చోట్ల ఇదే పరిస్థితి. కొన్ని మండలాల్లో స్థలం దొరకలేదని అధికారులు నిర్మాణాలను మరిచారు. రెండేళ్ల నుంచి స్థలం చూసే పనిలోనే అధికారులు కాలయాపన చేస్తుండటంతో ఈ భవనాల నిర్మాణంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. వింజమూరులో స్త్రీశక్తి భవనం నిర్మాణం పూర్తయినా ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగించడం విచిత్రంగా ఉంది. జిల్లాలో పూర్తయిన అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. నిధులున్నా నిర్లక్ష్యం: ఈ భవనాల మంజూరుకు నిధులు విడుదలయ్యాయి. గత ఏడాది మేలో కలెక్టర్ స్త్రీశక్తి భవనాల నిర్మాణంపై స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఇంతవరకు దాని గురించి అధికారులు శ్రద్ధ వహించలేదు. ప్రస్తుత కలెక్టర్ స్త్రీ శక్తి భవనాల నిర్మాణంపై దృష్టిపెట్టకపోవడంతో అధికారులు కిమ్మనకుండా ఉన్నారు. కాంట్రాక్టర్లు భవనాల నిర్మాణ పనుల్లో తీవ్రంగా జాప్యం చేస్తున్నారు. అనేకచోట్ల ఇప్పటికే అధికారులు ఎక్కువ మొత్తంలో కాంట్రాక్టర్లకు అడ్వాన్సు చెల్లించినట్టు సమాచారం. ఈ నిధులు దిగమింగిన కాంట్రాక్టర్లు చేద్దాంలే, చూద్దాంలే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. పైగా కొంతమంది కాంట్రాక్టర్లు రూ.25 లక్షలతో భవనాన్ని పూర్తిచేయలేమని, అదనంగా మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమయానికి పూర్తి చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. కేవలం అధికారుల నిర్లక్ష్యం మూలానే ఇప్పుడు మళ్లీ అంచనా విలువ పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం -రాములు, ఎస్ఈ, పంచాయతీరాజ్ శాఖ జిల్లాలో ఇప్పటి వరకు ఐదు భవనాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. దీనికి కారణం రూ.25 లక్షలతో భవనాన్ని నిర్మించలేమని కాంట్రాక్టర్లు నిస్సహాయత వ్యక్తం చేయడమే. అదనంగా రూ.7 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఆ నిధులు త్వరలో విడుదల అవుతాయని ఆశిస్తున్నాం. -
జీశాట్-14 తొలివిడత కక్ష్య పొడిగింపు విజయవంతం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: జీశాట్-14 కమ్యూనికేషన్ల ఉపగ్రహం తొలివిడత కక్ష్య పొడిగింపును భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం విజయవంతంగా నిర్వహించింది. దేశంలోనే తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ- డీ5 రాకెట్ ద్వారా ప్రయోగించిన జీశాట్-14 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే దిశగా బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ (ఉపగ్రహా నియంత్రణ కేంద్రం) శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను చేపట్టారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ నిర్ణీత దిశలో ప్రయాణించింది. తొలి దశలో సెకనుకు 4.5 కి.మీ వేగంతో, రెండో దశలో సెకనుకు 4.9 కి.మీ వేగంతో ప్రయాణించిన రాకెట్, క్రయోజెనిక్ దశలో సెకనుకు 9.78 కి.మీ వేగాన్ని పుంజుకుని జీశాట్-14 ఉపగ్రహాన్ని 179 కి.మీ పెరూజీ (భూమికి సమీపంగా), 35,960 కి.మీ. అపోజీ (భూమికి దూరంగా) భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. తర్వాత దీనిని బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. వారు సోమవారం ఉదయం 7.58 గంటలకు ఉపగ్రహంలోని అపోజీ మోటార్‌ను 3,134 సెకన్ల పాటు మండించి, ఉపగ్రహాన్ని 8,966 కిలోమీటర్ల పెరూజీ, 35,744 కిలోమీటర్ల అపోజీలో ప్రవేశపెట్టారు. -
అతిగా మద్యం తాగి సీఐఎస్ఎఫ్ ఎస్సై మృతి
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : అతిగా మద్యం సేవించి షార్‌లోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెక్టార్-ఏలో ఎస్సైగా పనిచేస్తున్న యుకే తిమ్మయ్య (60) మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని కచ్చేరివీధిలోని కృష్ణాలాడ్జిలో శనివారం జరిగింది. తిమ్మయ్య మృతి చెందిన విషయాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ట్రైనీ డీఎస్పీ జే కులశేఖర్ మృతదేహాన్ని పరిశీలించారు. గదిలోని అతని బ్యాగ్‌ను పరిశీలించగా సీఐఎస్ఎఫ్ ఎస్సైగా గుర్తించి షార్ సీఐఎస్ఎఫ్ కమాండెంట్ శ్రీధర్‌కు సమాచారం అందించారు. కమాండెంట్, ఇతర సీఐఎస్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కూర్గ్ జిల్లా హమ్మత్ గ్రామానికి చెందిన యూకే తిమ్మయ్య షార్ కేంద్రం భద్రతా దళంలో ఎస్సైగా పని చేస్తున్నారు. మరో అయిదారు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. కుటుంబ విభేదాలతో భార్యకు దూరంగా షార్‌లోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. గతనెల 28 నుంచి 31 వరకు ఆరోగ్యం సరిగా లేదని విధులకు సెలవు పెట్టారు. ఈ నెల ఒకటిన కాలు వాచిందని షార్ అసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. వాస్తవంగా ఈనెల 1న విధుల్లో చేరాల్సి ఉండగా రెండు రోజుల నుంచి లాడ్జిలో రూం తీసుకుని మద్యం సేవిస్తూనే ఉన్నాడు. లాడ్జి సిబ్బంది వద్దని వారించినా మాట వినకుండా అతిగా మద్యం సేవించాడని తెలిపారు. మైకంలో కాలు జారిపడిపోయాడా! గొంతు ఎండుకు పోయి చనిపోయాడా! అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. షార్ భద్రతా సిబ్బంది కమాండెంట్ మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగివున్న లారీతో పాటు ఇన్నోవా వాహనాన్ని మరో లారీ వచ్చి వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందినవారిలో గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ కమిషనర్ రామారావు ఉన్నారు. వీరంతా చెన్నె నుంచి బాపట్ల వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.