
సాక్షి, నెల్లూరు: సూళ్లూరుపేటలో బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలో వెంకటేశ్వర స్వామి వీధికి చెందిన 13 ఏళ్ల యశ్వంత్ రెడ్డి అనే విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంకాలం జిరాక్స్ పేపర్ల కోసం అంటూ బజారుకు వెళ్లిన యశ్వంత్ రెడ్డి.. అదృశ్యమయ్యాడు. కిడ్నాప్ అనుమానంతో పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. బాలుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment