boy kidnaped
-
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ కలకలం
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ ప్రభుత్వాసుపత్రి సమీపంలో పట్టపగలే మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలో బాలుడిని కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ నెల 4న కిడ్నాప్ కాగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.మరో ఘటనలో వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్‌కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి “నేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నాను’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది.ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్‌ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్‌లో ఉందని నిర్ధారించుకొని హయత్‌నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్‌నగర్‌లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మూడేళ్ళ పాపను ఎత్తుకెళ్లిన యువకుడు
-
నిజామాబాద్ లో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
తిరుపతి బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్
-
తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సురక్షితం
సాక్షి, తిరుపతి: తిరుపతి బస్టాండ్‌లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని స్థానిక మహిళ ఒకరు కాపాడినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఉన్న చిన్నారిని ఏర్పేడులో క్షేమంగా పోలీసులకు అప్పగించింది. అసలేం జరిగిందంటే.. చెన్నైకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని అర్ధరాత్రి ఫ్లాట్ ఫారం 3 వద్ద కోసం సోమవారం రాత్రి బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుని పోయాడు. ఆందోళనతో తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన బాలుడిని చెన్నై, వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్‌గా (2) గుర్తించారు. బాలుడితోపాటు కిడ్నాపర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు కిడ్నాపర్ బాలుడ్ని వదిలేసి వెళ్లడం.. చిన్నారి ఆ మహిళ కంట పడడం, ఆమె పోలీసులకు అప్పగించడం జరిగిపోయాయి. -
హైదరాబాద్‌లో మళ్లీ.. బాలుడిపై వీధి కుక్క దాడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. టప్పాచబుత్రలో కుక్క దాడి చేయడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తన తల్లితో కలిసి బాలుడు విధిలో నడుస్తూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయిదేళ్ల బాలుడిని కుక్క కరిచిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే బాలుడి తల్లి వెంటనే గుర్తించి అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే కుక్క బాలుడి చెవిని కొరికేసిందని తెలుస్తోంది. వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసినట్లు తెలుస్తోంది. చిన్నారికి జర్జరీ చేశారని, అందుకోసం తల్లిదండ్రులు రూ. 3 లక్షలు వెచ్చించినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట కుక్కలు దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపించడంతో తెలంగాణ హైకోర్టు ఈకేసును సుమోటోగా తీసుకొని జీహెచ్ఎంసీకి, ప్రభుత్వ అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కుక్కలు వీధుల్లో తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావటం లేదు. ప్రస్తుతం వీధి క్కలపై జీహెచ్ఎంసీ ఫోకస్ తగ్గినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ డ్యూటీతో పాటు వెటర్నరీ అధికారులు బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు సిబ్బంది నిరసన చేస్తుండటంతో కుక్కల కాటు కేసులు నగరంలో మళ్ళీ పెరుగుతున్నాయి. కుక్కల బెడదపై వేసిన హై లెవెల్ కమిటీ ఎక్కడ ఉందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కమిటీ ఏర్పాటు చేసి.. ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం శోచనీయం -
రాత్రంతా ముళ్ల పొదల్లోనే..
ఎమ్మిగనూరురూరల్: ఆలనాపాలనా చూసుకోవాల్సిన తల్లి వదిలేసి వెళ్లింది.. సంరక్షకుడిగా ఉన్న తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.. చిన్నమ్మ వద్ద ఉంటున్న బాలుడికి పెద్ద కష్టమొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి బిస్కెట్లో మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలుడిని ముళ్లపొదల్లో వదిలేశాడు. రాత్రంతా బాలుడు అక్కడే ఉన్నాడు. ఉదయం మెలకువ వచ్చిన తర్వాత తాను ఉన్న ప్రాంతాన్ని చూసి భయంతో వణికిపోయాడు. ఈ ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక శివన్న నగర్లో బాలుడు నరేష్(12) తన చిన్నమ్మ వీరేశమ్మ దగ్గర ఉంటున్నాడు. మనస్పర్ధలు రావటంతో బాలుడి తండ్రి వీరేష్, తల్లి సరోజమ్మలు ఐదు సంవత్సరాల క్రితం విడిపోయారు. తండ్రి వీరేష్ వద్ద బాలుడిని వదిలేసి తల్లి తన పుట్టినిల్లు అయిన గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు వెళ్లిపోయింది. వీరేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో బాలుడు నరేష్ తన చిన్నమ్మ వీరేశమ్మ దగ్గర ఉంటున్నాడు. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం అమావాస్య కావడంతో టెంకాయ తీసుకురావడానికి వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో బాలుడి మేనత్త భాగ్య, చిన్నమ్మ వీరేశమ్మ వెతికినా ఎక్కడా కనిపించకపోవటంతో రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం బాలుడి మేనత్త శివన్ననగర్లోని బంక్ పరిసర ప్రాంతంలో వెతుకుతుండగా ముళ్లపొదల పక్కన బాలుడు పడుకుని ఉండటం గమనించింది. ముఖంపై నీళ్లుచల్లి.. ఏమి జరిగిందని నరేష్‌ను విచారించగా.. టోపీ పెట్టుకున్నవ్యక్తి వచ్చి తనకు బిస్కెట్ ఇచ్చాడని, మత్తురావటంతో ఆ వ్యక్తి తనను తీసుకెళ్లినట్లు చెప్పాడు. బాలుడిని తీసుకెళ్లిన వ్యక్తి మత్తు బిస్కెట్ ఎందుకు ఇచ్చాడు, తీసుకెళ్లి ముళ్లపొదల్లో ఎందుకు పడేశాడు అనేది తెలియరాలేదు. బాలుడు భయంతో వణికిపోతున్నాడు. ముళ్లు శరీరంపై గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నరేష్‌ను మేనత్త భాగ్య సోమప్ప నగర్లో తన ఇంటికి తీసుకొచ్చింది. పట్టణంలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తులు సంచరిస్తున్నారనే వదంతులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
మల్కాజ్గిరి కిడ్నాప్ కేసు: చంపేస్తామని బెదిరించి 2కోట్లు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ. 2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉందని డీసీపీ జానకి స్పష్టం చేశారు. కాగా, డీసీపీ జానకి ఈ కేసు వివరాలను శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఈ నెల 15న బాలుడి అదృశ్యంపై కేసు నమోదైంది. కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. వాట్సాప్ ద్వారా బాలుడి పేరెంట్స్‌కు కాల్ వచ్చింది. పోలీసు కేసు వెనక్కి తీసుకోవాలని కిడ్నాపర్లు బెదిరించారు. ఒకే కాలనీలో ఉండేవాళ్లే బాలుడిని కిడ్నాప్ చేశారు. రవి, శివ నెలరోజులుగా బాలుడి కిడ్నాప్‌నకు ప్లాన్ చేశారు. డబ్బు కోసమే బాలుడిని కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేయాలనుకున్నారు. ఈ కేసులో ఓ మైనర్ బాలుడి హస్తం కూడా ఉంది. 8 బృందాలతో 36 గంటల్లోనే కేసును ఛేదించాం. జనగామ జిల్లా రామన్నగూడెం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నాం. ప్రధాని నిందితుడు రవి సహా ముగ్గురిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఎవిడెన్స్ కీలకం అయింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 366 కిడ్నాప్ కేస్ నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాబు తండ్రి శ్రీనివాస్ కిడ్నాప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కిడ్నాపర్ల నుంచి మా బాబును కాపాడిన పోలీసులకు ధన్యవాదాలు. కిడ్నాపర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులకు చెబితే బాబును చంపేస్తామని బెదిరించారు. భారీగా డబ్బు డిమాండ్ చేశారు. మా పక్కింటి వాళ్లే ఇలా చేస్తారని అనుకోలేదు. 1989 నుంచి హైదరాబాద్‌లో ఉన్నాను. నాకు, నా కుటుంబానికి శత్రవులు ఎవరూ లేరు అని తెలిపారు. ఇది కూడా చదవండి: నిఘా ఉన్నా కూడా.. కక్కుర్తిపడి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు -
నాలుగేళ్లుగా వీడని బాలుడి అదృశ్యం మిస్టరీ?
సాక్షి, మెదక్: రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వేస్టేషన్ వద్ద నాలుగేళ్ల క్రితం కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కుమారుడి కోసం తండ్రి తల్లడిల్లుతున్నాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం క్యాసంపల్లి తండాకు చెందిన లంబాడి కపూర్య, అతడి రెండేళ్ల కుమారుడు అఖిల్ గతంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఏపని చేసుకోలేక విధిలేని పరిస్థితుల్లో కపూర్య భిక్షాటన ఎంచుకున్నాడు. కొడుకు, భర్తను వదిలి అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భిక్షాటనచేస్తూ తన కుమారుడితోపాటు రామాయంపేట వచ్చి కపూర్య కొద్దిరోజులపాటు ఇక్కడే గడిపాడు. అక్కన్నపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లిన కపూర్య అక్కడ రైళ్లలో భిక్షాటనచేస్తూ రాత్రి స్టేషన్ ఆవరణలో నిద్రించాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి కుమారుడు అఖిల్‌ను అపహరించుకపోయారు. తెల్లవారుజామున లేచి చూస్తే కుమారుడు కనిపించకపోవడంతో రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాకబు చేసినా బాలుని ఆచూకీ లభించలేదు. రైలులో ప్రయాణిస్తున్నవారు బాలుడిని అపహరించుకపోయినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కాగా మహారాష్ట్ర, ఇతర దూరప్రాంతాల వారు రైలులో ప్రయాణిస్తున్నవారే బాలుడిని అపహరించుకపోయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
100 మంది పోలీసులు.. రెండు గంటలు.. కిడ్నాపర్లను ఎలా పట్టుకున్నామంటే..??
-
భువనగిరిలో కిడ్నాప్.. సింగరాయకొండలో పట్టివేత
సింగరాయకొండ: తెలంగాణలోని భువనగిరిలో కిడ్నాప్ అయిన బాలుడు ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పొనుగోటివారిపాలేనికి చెందిన గద్దాల మహేష్ తెలంగాణలోని జనగాం మండలం భువనగిరి పట్టణానికి బేల్దారి పని కోసం వెళ్లాడు. 10 రోజుల క్రితం మహేష్ స్వగ్రామానికి వచ్చేప్పుడు మూడేళ్ల బాలుడిని వెంట తీసుకొచ్చాడు. బుధవారం మహేష్ బాలుడిని తన తమ్ముడు రమేష్ వద్ద వదిలి ఊరికి వెళ్లటానికి ప్రయత్నించగా.. అందుకు రమేష్ నిరాకరించడంతో వీరిద్దరి మధ్య వాదులాట జరిగింది. దీంతో అసలు విషయం బయటపడింది. మహేష్ తను పనిచేస్తున్న చోట బాలుడిని కిడ్నాప్ చేసి కొద్ది రోజుల తరువాత స్వగ్రామానికి తీసుకుని వచ్చాడని పోలీసులు తెలిపారు. -
తిరుమలలో బాలుడి అపహరణ
తిరుమల: తిరుమలలో ఓ బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించిన ఘటన సోమవారం వెలుగుచూసింది. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని దామినేడు, కొత్త ఇండ్లకు చెందిన చవ్వా వెంకటరమణ కుటుంసభ్యులతో శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం 5.45 గంటలకు ఆయన కుమారుడు సి.గోవర్ధన్ రాయల్ అలియాస్ చింటూ (5) అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. వెంటనే పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రంలో పరిశీలించగా ఆదివారం రాత్రి 7.11 గంటల సమయంలో ఓ మహిళ బాబును తీసుకుని ఆర్టీసీ బస్సులో తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంది. గుండుతో ఉన్న ఈమెతో పాటు 4 నుంచి 5 సంవత్సరాల బాబును ఎవరైనా గుర్తిస్తే తిరుమల వన్‌టౌన్ పీఎస్ సీఐ ఫోన్ నంబర్ 9440796769కు లేదా తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ సెల్ నంబర్ 9440796772కు సమాచారం అందించాలని కోరారు. -
బాలుడి కిడ్నాప్.. సోషల్‌మీడియా సాయంతో కథ సుఖాంతమైంది!
కొరాపుట్(భువనేశ్వర్): ట్రక్ డైవర్ కిడ్నాప్ చేసిన బాలుడు సోషల్ మీడియా సాయంతో ఇంటికి చేరిన ఘటన అందరినీ ఆనందంలో ముంచెత్తింది. నవరంగపూర్ జిల్లా ఎస్పీ పురుషోత్తం దాస్ దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించారు. 2021 అక్టోబర్ 22న నవంరంగ్‌పూర్ జిల్లా చందాహండి పోలీస్ స్టేషన్ పరిధి ఖపరాది గ్రామంలో ఓ ట్రక్ డ్రైవర్ ప్రదీప్ అనే బాలుడిని అపహరించి, ఎత్తకుపోయాడు. (చదవండి: గతేడాది వివాహం.. అత్తవారింటికి వెళ్లి ఎవరూ లేని సమయం చూసి.. ) దీనిపై అదేరోజు చందాహండి పోలీస్ స్టేషన్లోకేసు నమెదయ్యింది. బాలుడిని ట్రక్ డ్రైవర్ హర్యనాలోని రేవాడి జిల్లా గొడిబాల్ని జంక్షన్ వద్ద జాతీయ రహదారి–6పై డిసెంబర్ 21న రాత్రి వదలి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న హరున్ధావన్ దాబాకు చేరిన ప్రదీప్ ఉదంతాన్ని దాబా యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారి, నవంరంగ్‌పూర్ జిల్లాకు చేరింది. దీనిపై ఎస్పీ జోక్యం చేసుకొని, హర్యానాలోని బాలసదన్‌కు సమాచారం అందించి, సంరక్షించారు. అనంతరం ప్రదీప్ సోదరుడు భుజభల్ని జిల్లా పోలీసుల బృందంతో అక్కడకు పంపించి, నవరంగపూర్ లోని కుంటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా, పోలీసులు చేసిన సాయాన్ని మరువలేమని కన్నీటి పర్యంతమవుతున్నారు. -
సంచలనం సృష్టించిన కేసు.. 14 రోజులుగా గాలింపు.. డానియెల్ దొరికాడు..!
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడు డానియెల్ కేసును వరంగల్ కమిషరేట్ పోలీసులు ఛేదించారు. పక్కా ప్లాన్ ప్రకారం బాబు ను కిడ్నాప్ చేసి అమ్మాలని నిర్ణయించుకున్న లోకల్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు.. పిల్లల అక్రమ రవాణా ఉద్దేశం ఏమైనా ఉందా అనే దిశగా లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్క డానియెలేనా.. లేక గతంలో ఈ తరహాలో ఎంత మందిని కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలి సింది. రెండేళ్ల బాబు సురక్షితంగా దొరకడంతో ఇటు పోలీసు ఉన్నతాధికారులతోపాటు అటు తల్లిదండ్రులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ( చదవండి: పోలీసుల మోహరింపు, తనిఖీలు.. హిడ్మా కోసమేనా..? ) 14 రోజులుగా గాలింపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలోని కోరుకుంటకు చెందిన దత్తా ఐశ్వర్య, ఆర్యలకు రెండేళ్ల బాబు డానిఝెల్ ఉన్నాడు. వీరు వరంగల్ మట్టెవాడ ఠాణాకు కూతవేటు దూరంలో ఉన్న జెమినీ టాకీస్ సమీపంలోనే దోమ తెరలు, దువ్వెన్లు, అద్దాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుంచో ఐశ్వర్య అమ్మ కుటుంబం ఇక్కడే ఉంటూ వ్యాపారం చేస్తుండడంతో బతుకు దెరువు కోసం నెలక్రితం ఇక్కడికొచ్చారు. అయితే వీరి కుమారుడు డానియెల్‌పై అగంతకుల కన్నుపడింది. ఈ నెల 11న ఉదయం 4.37 గంటల ప్రాంతంలో నల్లటి రంగులో ఉన్న ‘హైదరాబాద్ టాప్ ఆటో’లో నుంచి దిగిన ఓ వ్యక్తి ఉదయం 5.03 గంటలకు బాబును కిడ్నాప్ చేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న నంబర్ ప్లేట్ లేని ఆటోలో బట్టలబజార్ బ్రిడ్జి మీదుగా వెళ్లినట్టుగా సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయింది. ఆ తర్వాత ఆ ఆటో ఎటు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ప్రత్యేక మార్గదర్శనంలో సెంట్రల్ జోన్ డీసీపీ పుష్ప, వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించాయి. అయితే నిందితుల అచూకీ కోసం హైదరాబాద్‌లోనూ గాలించిన పోలీసులకు ఆధారం చిక్కడంతో పట్టుకున్నారు. వీరు డానియెల్‌ను అమ్మడానికే కిడ్నాప్ చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. నేడో, రేపో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ? -
బిడ్డ కిడ్నాప్.. పట్టు వదలని తండ్రి, ఏకంగా 24 ఏళ్లు
బీజింగ్: సాధారణంగా ఎక్కడైనా పిల్లలు తప్పిపోయినా, కిడ్నాప్‌కు గురైనా తల్లిదండ్రులు వారి కోసం నెలలు, ఏళ్ల తరబడి వెతికి చివరకు ఆశలు వదులుకుంటారు. కానీ చైనాలో మాత్రం ఓ తండ్రి తప్పిపోయిన తన కుమారుడి కోసం 24 ఏళ్ల పాటు వెతికాడు. ఏకంగా సుమారు 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. ఏ దేవుడు కరుణించాడో చివరకు తన కుమారుడు ఆచూకీ లభించింది. వివరాలు.. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్సుకు చెందిన గువా గాంగ్‌టాంగ్ కుమారుడు రెండేళ్ల వయసులో కిడ్నాప్‌కు గురైయ్యాడు. ఈ సంఘటన 1997లో జరిగింది. అప్పటినుంచి తన బిడ్డకోసం దేశవ్యాప్తంగా వెతకడం ప్రారంభించాడు. కానీ ఆచూకీ లభించలేదు.. అయినా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో గాంగ్‌టాంగ్ చాలా ఇబ్బందులు ఎదర్కొన్నాడు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలు పాలైన సంఘటలు ఉన్నాయి. గువా గాంగ్‌టాంగ్ కథ ఆధారంగా 2015లో ఓ సినిమా కూడా తీశారు. ఆ సినిమాలో హాంగ్‌కాంగ్ సూపర్‌స్టార్ ఆండీ లువా నటించారు. ఆ సినిమా అక్కడ సంచలన విజయం సాధించింది. అలా వెతుకుతుండగా దాదాపు 24 ఏళ్ల నిరీక్షణ తరువాత తన కూమరుడిని కలుసుకున్నాడు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా పిల్లవాడి ఆచూకీ గుర్తించినట్లు తాజాగా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. కాగా, ఈ కిడ్నాప్ ఘటనలో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. చైనాలో పిల్లల అపహరణలు ఎక్కువగా జరగుతుంటాయి. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పిల్లలు కిడ్నాప్‌కు గురవుతూ ఉంటారు. అయితే బిడ్డ కోసం గువా గాంగ్‌టాంగ్ పట్టుదలను అభినందిస్తూ సోషల్ మీడియోలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
రూ. 2.5 లక్షల కోసం బాలుని కిడ్నాప్.. చివరకు..
సాక్షి, గౌరిబిదనూరు(కర్ణాటక): తాలూకా దేవగానహళ్ళిలోని చౌడమ్మ అనే మహిళ కొడుకు విజేంద్ర (16)ను కిడ్నాప్ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బాలుని తండ్రితో ఈ ముఠాకు ఉన్న ఆర్థిక తగాదాల నేపథ్యంలో అపహరించినట్లు, ఈ ముఠా రైస్‌పుల్లింగ్ దందాకు పాల్పడేదని తేలింది. చిక్కబళ్లాపుర ఎస్పీ మిథున్‌కుమార్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. గత నెల 30వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో 5 మంది వ్యక్తులు కారులో చౌడమ్మ ఇంటికి వచ్చి భర్త పాపన్న ఎక్కడని అడగ్గా పొలంలో ఉన్నాడని ఆమె చెప్పింది. పొలానికి దారి చూపాలని ఆగంతకులు అడగ్గా ఆమె కొడుకు విజేంద్రను వారి వెంట పంపింది. దుండగులు బాలున్ని తిరుపతిలోని పాత తిరుచానూరు రోడ్డులోని ఒక ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించారు. రూ.2.5 లక్షలు ఇస్తేనే బాలున్ని వదిలేస్తామని చౌడమ్మకు దుండగులు ఫోన్లు చేయసాగారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ మొదలుపెట్టారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బాలున్ని బంధించిన ఇంటిపై దాడి చేసి 10 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అరెస్టు చేశారు. నిందితులు పాళ్యం దామోదర్ (తిరుపతి), ముత్తంశెట్టి మణికుమార్, వెంకిపాడు గ్రామం కృష్ణా జిల్లా, షేక్ భాషా, నూజివీడు, లోకేశ్‌కుమార్, నూజివీడుగా గుర్తించారు. దుండగులు బాలున్ని తీవ్రంగా కొట్టడంతో గాయాలు అయ్యాయి. -
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
పెదకాకాని(గుంటూరు జిల్లా): కిడ్నాప్‌కు గురైన బాలుడిని పోలీసు బృందాలు క్షేమంగా ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. పెదకాకాని మండలం నంబూరు అడ్డరోడ్డు సమీపంలో ఉన్న శివదుర్గ యానాదికాలనీలో ఈనెల 24న రెండేళ్ల బాలుడు జీవాను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టింది. సెల్‌టవర్ డంప్, సీసీ కెమెరాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సది్వనియోగం చేసుకుని నిందితుల ఆచూకీ గుర్తించారు. విజయవాడ వాంబేకాలనీలో నిందితులను గుర్తించిన పోలీసు బృందాలు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించాయి. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకున్నారు. నిందితులు రూ.1.60 లక్షలకు విక్రయించిన బాబు జీవాను, కొనుగోలు చేసినవారిని, మధ్యవర్తులుగా వ్యవహరించినవారిని వెంటబెట్టుకుని జిల్లాకు చేరారు. కిడ్నాప్‌కు గురైన బాలుడి కోసం మూడు రోజులుగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు బాబును చూపించడంతో వారి కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. సిబ్బందికి ప్రశంసల జల్లు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ దుర్గాప్రసాద్ నేతృత్వంలో పనిచేసిన పోలీసు బృందాలు బాబును క్షేమంగా తీసుకుని తిరిగిరావడంపై అధికారులు, ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
వీడని మిస్టరీ: ఆ బాలుడు ఏమయ్యాడో..?
రాయవరం: మండలంలోని వి.సావరం గ్రామ పరిధిలో ఇటుకుల బట్టీ వద్ద ఈనెల 24న కిడ్నాప్‌కు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు మూడు రోజులుగా ఆ చిన్నారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిన్నపాటి క్లూ కూడా దొరకకపోవడంతో వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన చైతన్యకుమార్ అసలు ఏమయ్యాడనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు కిడ్నాప్ అయ్యాడా? లేకుంటే కిడ్నాప్ జరిగిన ప్రాంతానికి ఎదురుగా ఉన్న డ్రైన్లో పడిపోయాడా? అనేది మిస్టరీగానే ఉంది. చైతన్యకుమార్ తల్లిదండ్రులు పనిచేస్తున్న బట్టీలో పని చేస్తున్న మహిళ బాలుడిని మోటార్ సైకిల్‌పై తీసుకెళుతుండగా చూసానని చెప్పడంతో బాలుడి కిడ్నాప్ అయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో అనపర్తి సీఐ భాస్కర్‌రావు, రాయవరం ఎస్సై సురేష్ దర్యాప్తు వేగవంతం చేశారు. చదవండి: ఫోన్ చేసి విసిగిస్తావా అంటూ.. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి: కిడ్నాప్ కు గురైనట్టుగా భావిస్తున్న రెండున్నరేళ్ల బాలుడు చైతన్య కుమార్ తల్లిదండ్రులు దుర్గాభవానీ, లోవరాజులను వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు బుధవారం పరామర్శించారు రాయవరం ఇటుకల బట్టీలో నివాసం ఉంటున్న దుర్గాభవాని, లోవరాజులను కలిసి బాధ పడవద్దు ధైర్యంగా ఉండండి.. మీకు అండగా ఉంటాం అంటూ వారికి ధైర్యం చెప్పారు. బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొంటారని భరోసా ఇచ్చారు. చైతన్యకుమార్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను త్రిమూర్తులు ఆరా తీశారు. సంఘటనా స్థలం నుంచి రామచంద్రపురం డీఎíస్పీ బాలచంద్రారెడ్డితో త్రిమూర్తులు ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. బాలుడి ఆచూకీ కనుగొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదన్నారు. బాలుడిని కనుగొనేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామన్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు.. -
సూళ్లూరుపేటలో కిడ్నాప్ కలకలం
సాక్షి, నెల్లూరు: సూళ్లూరుపేటలో బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలో వెంకటేశ్వర స్వామి వీధికి చెందిన 13 ఏళ్ల యశ్వంత్ రెడ్డి అనే విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంకాలం జిరాక్స్ పేపర్ల కోసం అంటూ బజారుకు వెళ్లిన యశ్వంత్ రెడ్డి.. అదృశ్యమయ్యాడు. కిడ్నాప్ అనుమానంతో పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. బాలుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సూర్యపేట: బాలుడి అదృశ్యం కలకలం
-
డెత్ గేమ్.. ఆపై కిడ్నాప్ డ్రామా
సాక్షి, హైదరాబాద్/శామీర్‌పేట్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చిన్నారి దీక్షిత్‌రెడ్డి హత్యో దంతం మరువకముందే నగర శివా ర్లలో మరో ఘోరం.. కిక్ జంపింగ్స్ వీడియో చిత్రీకరణలో గాయపడిన బాలుడిని.. భయంతో హత మార్చాడు బిహార్‌కు చెందిన మైనర్. మృతదేహాన్ని మూటగట్టి ఔటర్ రింగ్‌రోడ్ సమీ పంలో పడేశాడు. ఆపై కిడ్నాప్ డ్రామా ఆడుతూ డబ్బు డిమాండ్ చేశాడు. ఈ దారుణానికి ఒడి గట్టిన మైనర్‌ను శామీర్‌పేట పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ ఏవీ ఆర్ నర్సింహారావు, స్థానికుల కథనం ప్రకారం.. శామీర్‌పేట్‌కు చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ యూసుఫ్.. భార్య గౌసియా బేగం, పిల్లలు అదిభీ, రహాన్, ఫర్హాన్, అథియాన్ (5)తో కలిసి చాంద్ పాషాకు చెందిన ఇంటి కింది పోర్షన్లో నివసిస్తున్నాడు. పై పోర్షన్లో బిహార్‌కు చెందిన మైనర్ (17).. రాజు అనే స్నేహితుడితో కలిసి అద్దెకు ఉంటున్నాడు. కింది పోర్షన్లో ఉండే అథియాన్‌తో పరిచయం పెంచు కున్నాడు. షేర్‌చాట్ యాప్‌లో వీడియోలు అప్లోడ్ చేసే అలవాటున్న బిహారీ మైనర్.. అ«థియాన్తో ఒక వీడియో రూపొందించాలని భావించాడు. ఇదీ జరిగిన ఘోరం.. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు తన రూమ్మేట్ బయటకు వెళ్లిపోగా, 10.40 ప్రాంతం లో ఇంటి బయట ఆడుకుంటున్న అథి యాన్‌ను బిహారీ మైనర్ పైకి తీసుకెళ్లాడు. గాల్లోకి ఎగిరి చేసే కిక్ జంపింగ్స్ గురించి అథియాన్‌కు వివరించి.. అలా చేయాలని, తాను వీడియో తీసి షేర్‌చాట్‌లో పెడతానని చెప్పాడు. ఈ ప్రయ త్నంలో గాల్లోకి ఎగిరిన అథియాన్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు. ఇది తెలిస్తే అతడి తల్లిదండ్రులు తనకు కొడతారని భయపడిన బిహారీ మైనర్.. గుట్టు రట్టుకాకుండా ఉండేందుకు అథియాన్ నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. గదిలో ఉన్న సెల్లో టేపుతో అథియాన్ కాళ్లు, చేతులు దగ్గరగా చేసి అతికించేశాడు. మృతదేహాన్ని ముందుకు వంచుతూ మధ్యలోకి మడతపెట్టి తన గదిలోని లగేజ్ బ్యాగ్‌లో కుక్కేశాడు. ఉదయం 11.30 సమయంలో బ్యాగ్‌తో నేరుగా శామీర్‌పేట్ చౌరస్తాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి షేర్ ఆటోలో ఓఆర్ఆర్ వరకు వెళ్లి, దొంగలమైసమ్మ చౌరస్తా సమీపంలోని ఔటర్ సర్వీసు రోడ్డులో ఉన్న చెట్ల పొదల్లో రాళ్ల మధ్య అథియాన్ మృతదేహాన్ని పడేశాడు. తిరిగొస్తూ తన స్నేహితుడి వద్ద రూ.200 అప్పుగా తీసుకుని గజ్వేల్ చేరుకున్నాడు. అక్కడ పని కోసం ప్రయత్నించి విఫలమై తిరిగి తన గదికి వచ్చేశాడు. యజమాని మాటలతో దుర్బుద్ధి పుట్టి... ఆడుకుంటానని వెళ్లిన అథియాన్ కనిపించకపోవడంతో అతడి కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ సమయంలో భారీ వర్షాలకు నాలాలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఏదైనా నాలాలో అథియాన్ పడి ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు గాలింపు చేపట్టారు. మరోపక్క బిహారీ మైనర్ ఏం తెలియనట్టు అథియాన్ కుటుంబీకులతో సన్నిహితంగా మెలిగాడు. ఈనెల 20న అథియాన్ ఇంటి వద్ద గాలింపు చర్యల్లో పాల్గొంటున్న వారంతా కూర్చున్నారు. అథియాన్ ఫొటోతో పోస్టర్లు ముద్రించి సోషల్ మీడియాలో, ఇతరత్రా ప్రచారం చేద్దామని, ఆచూకీ చెప్పిన వారికి రూ.10 వేలు బహుమతి ప్రకటిద్దామని ఒకరు సలహానిచ్చారు. దీనిపై స్పందించిన ఇంటి యజమాని చాంద్ పాషా.. ఆచూకీ చెప్పిన వారికి రూ.10 వేలు కాదని, లక్ష రూపాయలు తానే ఇస్తానని చెప్పాడు. ఈ మాటలు విన్న బిహారీ మైనర్‌కు దుర్బుద్ధి పుట్టింది. రూమ్మేట్ సెల్‌ఫోన్ అపహరించి.. అదే సందర్భంలో మానుకోటలో జరిగిన దీక్షిత్‌రెడ్డి హత్యోదంతమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఘటనలో మాదిరే డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసినట్లు కొత్త నాటకానికి తెరలేపి, అందినకాడికి దండుకోవాలని, ఆ డబ్బుతో స్వరాష్ట్రానికి పారిపోవాలని బిహారీ మైనర్ పథకం వేశాడు. తన ఫోన్ వాడితే చిక్కుతాననే ఉద్దేశంతో ఈ నెల 21న తన రూమ్మేట్ సిమ్‌కార్డు, సెల్‌ఫోన్ వేర్వేరుగా చోరీ చేశాడు. దాంతో ఈనెల 24న చాంద్‌పాషాకు ఫోన్‌చేసిన బిహారీ మైనర్.. బాలుడిని తామే కిడ్నాప్ చేశామని, రూ.15 లక్షలిస్తే వదిలిపెడతామని బెదిరించాడు. అప్రమత్తమైన చాంద్‌పాషా, అథియాన్ కుటుంబీకులు శామీర్‌పేట పోలీసులకు చెప్పారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆరాతీసిన అధికారులు సోమవారం ఓఆర్ఆర్ సమీపంలోని దాబాలో పనిచేస్తున్న రాజును పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో బిహారీ మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యతో రాజుకు సంబంధం లేదంటూ జరిగినదంతా బయటపెట్టిన అతగాడు నేరాన్ని అంగీకరించాడు. బాలుడి మృతదేహం పడేసిన ప్రాంతానికి బిహారీ మైనర్‌ను తీసుకెళ్లిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయి, అస్తిపంజరంగా మారుతున్న స్థితిలో ఉన్న శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ ౖవైద్యులతో అక్కడే పోస్టుమార్టం పూర్తిచేయించి కుటుంబీకులకు అప్పగించారు. గట్టి బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. బిహారీ మైనర్‌ను అరెస్టుచేసి జువైనల్ కోర్టుకు తరలించారు. -
దీక్షిత్ హత్య : ఆ దురాశతోనే కిడ్నాప్ చేసి..
సాక్షి, మహబూబాబాద్ : అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే మంద సాగర్ అనే వ్యక్తి దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత గుర్తుపడుతాడనే భయంతో బాలుడిని గొంతునులిమి చంపాడని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే దీక్షిత్‌ని హత్యచేచేశాడని చెప్పారు. గురువారం ఆయన దీక్షిత్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘మహబూబాబాద్ పట్టణానికి చెందిన రంజిత్ రెడ్డి ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు ఆయన పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి(9)ని ఎవరో గుర్తితెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఇట్టి కిడ్నాప్ గురించి బాలుని తల్లిదండ్రులు మహబూబాబాద్ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేయగా.. మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించాం. నిందితుడు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతి తొందరలో డబ్బులు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది. సీసీ కెమెరాలు లేని ప్రాంతాల నుంచి బాలుడిని తీసుకెళ్లాడు. తాళ్లపూసలపల్లి పరిసరాల్లోకి తీసుకెళ్లి కొద్దిసేపు గడిపాడు. బాలుడిని కంట్రోల్ చేయడం మంద సాగర్‌కు కష్టంగా మారింది. దొరికిపోతాననే భయంతో దీక్షిత్‌ను గొంతు నులిమి చంపాడు. అనంతరం రూ.45లక్షలు డిమాండ్ చేశాడు. చంపిన తర్వాత రెండు రోజుల పాటు ఫోన్లు చేస్తునే ఉన్నాడు. సాంకేతిక ఆధారాలతో కిడ్నాపర్ కోసం గాలించాం. 30 మంది అనుమానితులను ప్రశ్నించాం. కిడ్నాపర్ వాడిన టెక్నాలజీతోనే నిందితుడిని పట్టుకున్నాం. మంద సాగర్ ఒక్కడే దీక్షిత్‌ను హత్య చేశాడు. నిందితుడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటపడొచ్చు’అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. -
దీక్షిత్ హత్య: నిందితుల ఎన్కౌంటర్?
సాక్షి, మహూబూబాబద్: నగరానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ని అపహరించి హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. కిడ్నాపర్లు మనోజ్‌రెడ్డి, మందసాగర్‌ను పోలీసులు కాల్చిచంపినట్లు ప్రచారం జరిగింది. కానీ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించకపోవడంతో అవి ఒట్టి పుకార్లే అని తెలిపోయింది. కాగా, మహబూబాబాద్ కృష్ణా కాలనీకి చెందిన రంజిత్, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండగా గత ఆదివారం సాయంత్రం రంజిత్ బంధువు కుసుమ మనోజ్‌రెడ్డి కిడ్నాప్ చేశాడు. అనంతరం మందసాగర్ అనే వ్యక్తితో కలిసి కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై బాలుడిని హత్యచేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని కాల్చేశారు. (చదవండి : అయ్యో పాపం.. దీక్షిత్‌ను చంపేశారు ) ఆ తర్వాత బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మంగళవారం రాత్రి కిడ్నాపర్లు మరోసారి ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు సమాచారం. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని,, వచ్చి తీసుకుంటామని చెప్పారు. దీంతో బాలుడి తండ్రి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు డబ్బుతో ఎదురుచూశారు. ఆ సమయంలోనే పోలీసులు మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకొని ఎన్కౌంటర్ చేసినట్లు ప్రచారం జరిగింది. [ చదవండి : ఆర్ఆర్ఆర్ టీజర్: ఇవన్నీ ఇప్పటికే చూసేశాం, ఆ అగ్నిపర్వతం ఆ ఛానల్‌లోదే ] -
అయ్యో పాపం.. దీక్షిత్‌ను చంపేశారు
సాక్షి, మహబూబాబాద్: బావమరిది బతుకు కోరతాడు...దాయాది చావు కోరతాడు అంటారు... అయితే మహబూబాబాద్‌లో కిడ్నాప్ అయిన దీక్షిత్ రెడ్డి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. డబ్బులు కోసం తోబుట్టువుకు కడుపుకోత మిగిల్చాడు. మేల్లుడిని దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. గత ఆదివారం కిడ్నాప్ చేసిన దీక్షిత్ రెడ్డి... కిడ్నాపర్లు రెండు గంటల్లోనే బాలుడిని చంపేశారు. కిడ్నాప్‌కు సూత్రధారుడు మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంద సాగర్ అనే వ్యక్తితో కలిసి బాలుడిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని గుట్టలో బాలుడి మృతదేహం లభించింది. కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశపడ్డ ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. మహబూబాబాద్ కృష్ణా కాలనీకి చెందిన రంజిత్, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండగా గత ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు బైక్‌పై వచ్చి కిడ్నాప్ చేశారు. రాత్రి అయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతుకగా ఓ వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లాడని తోడి స్నేహితులు చెప్పారు. రాత్రి 9:45 నిమిషాలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మంగళవారం రాత్రి కిడ్నాపర్లు మరోసారి ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు సమాచారం. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని,, వచ్చి తీసుకుంటామని చెప్పారు. దీంతో బాలుడి తండ్రి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు డబ్బుతో ఎదురుచూశారు. ఆ సమయంలోనే పోలీసులు మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఆ రోజు ఉదయం 11 గంటలకు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించనున్నారు. [ చదవండి: దీక్షిత్‌ను హత్య చేసిన నిందితుల ఎన్కౌంటర్! ] -
చీటీలు వేసినవారి పనేనా!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన తొమ్మిదేళ్ల బాలుడు కుసుమ దీక్షిత్‌రెడ్డి ఇంకా కిడ్నాపర్ల చెర వీడలేదు. 82 గంటలైనా కేసు కొలిక్కి రాకపోవడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేశారు. బాలుడి తల్లి పట్టణంలో చీటీలు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 250 మంది ఆమె వద్ద నెలవారీ చీటీ వేస్తున్నట్లు గుర్తించి, ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాపర్లు సైతం బాలుడి తల్లికి మాత్రమే ఫోన్ చేస్తుండటంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటి వరకు ఆమె వద్ద చీటీలు కట్టిన వారు ఎవరు, చీటీ ఎత్తుకుని డబ్బు కట్టని వారెవరు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రోజంతా హైడ్రామా మంగళవారం రాత్రి కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు సమాచారం. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని,, వచ్చి తీసుకుంటామని చెప్పారు. దీంతో బాలుడి తండ్రి మధా్నహ్నం నుంచి రాత్రి వరకు డబ్బుతో ఎదురుచూసినా ఎవరూ రాకపోవడం, ఫోన్ కూడా చేయకపోవడంతో బాలుడి కిడ్నాప్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. రంగంలోకి ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ కిడ్నాపర్లు చేస్తున్న ఫోన్ నంబర్లు, ఎక్కడి నుంచి చేస్తున్నారనే విషయాన్ని స్థానిక పోలీసులు ట్రేస్ చేయలేకపోవడంతో స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి విషయాన్ని తెలిపారు. మరోపక్క బాలుడి తల్లిదండ్రులు నెల రోజులుగా ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఎవరిని కలిశారు, ఆర్థిక కార్యకలాపాలు ఎవరితో నిర్వహించారనే వివరాలు సేకరించి వారిని విచారిస్తున్నారు. మహబూబాబాద్ పోలీసులతో పాటు, ఉమ్మడి వరంగల్ టాస్‌్కఫోర్స్ సిబ్బంది పట్టణంలో ఇంటింటి తనిఖీలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్ నుంచి వచి్చన ఐటీ కోర్, సైబర్ క్రైం టీం నిపుణులు సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఇంటెలిజెన్స్ బృందాలు బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. పోలీసుల అదుపులో కిడ్నాపర్లు? దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు బుధవారం రాత్రి వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, బాలుడిని కూడా సురక్షితంగా చేరదీసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్లో తెలియజేస్తామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. -
60 గంటలు దాటినా దొరకని దీక్షిత్ ఆచూకీ
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో బాలుడి కిడ్నాప్ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలింది. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్‌కి గురై 60 గంటలైనా బాలుడి ఆచూకీ లభ్యంకాలేదు. అయితే మంగళవారం రాత్రి కిడ్నాపర్లు ప్రైవేట్ నెంబర్‌తో మరోసారి ఫోన్ చేశారు. దీంతో కిడ్నాపర్లు పక్కాగా రెక్కీ నిర్వహించి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్ బాలుడి తల్లిదండ్రులకు తెలిసిన వ్యక్తే కావొచ్చని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కేసుకు సంబంధించిన విచారణ ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతోంది. (మానుకోటలో బాలుడి కిడ్నాప్) కాగా.. అప్పటివరకు తండ్రితో కలిసి దసరా షాపింగ్ చేసిన బాలుడు అంతలోనే కిడ్నాప్ కావడం సోమవారం జిల్లాలో కలకలం సృష్టించింది. మహబూబాబాద్‌కు చెందిన ఓ చానెల్ వీడియో జర్నలిస్టు కుమారుడు దీక్షిత్ (9) ఆదివారం స్నేహితులతో ఆడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎక్కించుకుని తీసుకెళ్లారు. బుధవారం ఉదయం వరకు బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. -
మానుకోటలో బాలుడి కిడ్నాప్
సాక్షి, మహబూబాబాద్: అప్పటివరకు తండ్రితో కలిసి దసరా షాపింగ్ చేసిన బాలుడు అంతలోనే కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌కు చెందిన ఓ చానెల్ వీడియో జర్నలిస్టు కుమారుడు దీక్షిత్ (9) ఆది వారం స్నేహితులతో ఆడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎక్కించుకుని తీసుకెళ్లారు. సోమవారం రాత్రి వరకు బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దీక్షిత్ తన తండ్రితో కలిసి షాపింగ్ చేసి ఆది వారం సాయంత్రం 5.30కి ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటి పక్కనున్న స్నేహితులు భువన చంద్ర, హర్షతో కలిసి ఆడుకుంటుండగా, బైక్‌పై వచ్చిన వ్యక్తి పిలవడంతో దీక్షిత్ నవ్వుకుంటూ వెళ్లి అతడి బైక్ ఎక్కి స్నేహితులకు బై చెబుతూ వెళ్లాడు. ఆదివారం రాత్రి 9.40 నిమిషాలకు కిడ్నాపర్లు ఫోన్‌చేసి ‘మీ బాబు సేఫ్‌గా ఉండాలంటే రూ.45 లక్షలివ్వాలి.. రేపు ఉదయం ఫోన్‌చేసి ఎక్కడికి రావాలో చెబుతాం’ అన్నారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి బాలుడి నివాస పరిసరాలను పరిశీలించారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 50 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. కిడ్నాపర్లు ఇంటర్నెట్ ఆధారంగా వివిధ నంబర్ల నుంచి ఫోన్ చేస్తుండటంతో ట్రేస్ చేయడం కష్టంగా మారిందని సమాచారం. బాలుడిని బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు కాలనీలోని సీసీ టీవీల్లో నిక్షిప్తం కాగా, వాటి ఆధారంగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 4 గంటలకు ఫోన్ రాలేదు ఇప్పటివరకు బాలుడి తల్లికి కిడ్నాపర్లు ఆరుసార్లు ఫోన్ చేశారు. ఫోన్ సంభాషణల్లో పలు సందర్భాల్లో ‘బాబు మా దగ్గర సేఫ్‌గా ఉన్నాడు. జ్వరం వస్తే టాబ్లెట్లు వేశాం.. డబ్బిస్తే విడిచిపెడతాం.. మీరు టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాకన్నీ తెలుసు’ అని కిడ్నాపర్లు అన్నారు. సోమవారం సాయంత్రం మళ్లీ ఫోన్ చేసేసరికి డబ్బు సిద్ధంగా ఉంచాలని కిడ్నాపర్లు చెప్పారు. అయితే కిడ్నాపర్ల నుంచి ఫోన్ రాకపోవడంతో ఆందోళన వ్యక్తమ వుతోంది. బాలుడి తల్లి వసంత మాట్లాడుతూ డబ్బిస్తాం, తమ కుమారుడికి ఎటువంటి హాని తలపెట్టకుండా విడుదల చేయాలని కోరారు. -
కలకలం రేపుతున్న బాలుడి కిడ్నాప్
సాక్షి, మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల ఓ బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్థానిక కృష్ణ కాలనీలో నివాసం ఉంటూ.. ఓ ప్రముఖ టీవీ చానల్ వీడియో జర్నలిస్టుగా పని చేస్తున్న రంజిత్, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎక్కడి వెళ్లాడో తెలియని బాలుడు.. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని స్థానికులు తెలిపారు. రాత్రి 9:45 నిమిషాలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ.45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మీరు ఏం చేస్తున్నా తమకు తెలుస్తుందని, మీ బాబుకు జ్వరంగా ఉండడంతో మాత్రలు కూడా వేశామని చెప్పి దుండగులు ఫోన్ పెట్టేశారు. దీంతో ఏం చేయాలో తెలియక బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా కిడ్నప్ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ నరేష్ కుమార్, పట్టణ సీఐ రవికుమార్, డీసీఆర్బీ సీఐ సాగర్, ఆరుగురు ఎస్ఐలు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, పలువురు అనుమానితులను ప్రశ్నించారు. పట్టణంలో కిడ్నాపర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాపర్లు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫోన్ చేసినా.. ప్రైవేట్ ఫోన్ నంబర్లతో చేస్తుండడం వల్ల వారి ఆచూకీని కనిపెట్టలేక పోతున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఎమ్మెల్యే శంకర్ నాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులను కోరారు. -
బాలుడి కిడ్నాప్
-
రూ.2 కోట్లిస్తే వదిలేస్తాం..
శివాజీనగర(బెంగుళూరు): 11 ఏళ్ల బాలున్ని కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ పెట్టిన ఐదుమంది కిడ్నాపర్లు కటకటాలు లెక్కిస్తున్నారు. కిడ్నాపర్ల ముఠా నాయకుడు మహ్మద్ ఝన్ పోలీసు కాల్పుల్లో గాయపడ్డాడు. తూర్పు విభాగ పోలీసులు 16 గంటల్లో కేసును ఛేదించారు. వివరాలు.. భారతీనగరకు చెందిన బట్టల వ్యాపారి కుమారుడు ఈ నెల 27న ఇంటి ముందు ఆడుకుంటుండగా కిడ్నాపర్లు అపహరించారు. తల్లిదండ్రులు భారతీననగర పోలీస్‌స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ శరణప్ప ఆధ్వర్యంలో పులకేశీనగర ఏసీపీ తబారక్ ఫాతిమా, సీఐ సిరాజుద్దీన్ తదితరులు గాలింపు చేపట్టారు. కూల్‌డ్రింకులో మత్తు కలిపి దండగులు 27వ తేదీ అర్ధరాత్రి బాలుని తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.2 కోట్లు ఇస్తే వదిలిపెడతామని, పోలీసులకు గానీ, ఇతరులకు గానీ చెబితే బాలున్ని హతమారుస్తామని బెదిరించారు. ఆ వ్యాపారి బట్టల షాపుకి అప్పుడప్పుడు వచ్చే మహ్మద్ ఝున్ ధనాశతో ఈ కిడ్నాప్‌కి ఒడిగట్టాడు. బాలునికి గాలిపటం కొనిస్తానని ఆశపెట్టి కారులో తీసుకెళ్లారు, అతడు అరవకుండా కూల్‌డ్రింకులో మత్తుమాత్రలు వేసి తాగించడంతో మత్తులోకి జారుకున్నాడు. తుమకూరు పరిసర ప్రాంతాల నుంచి ఫోన్లు చేయసాగారు. పోలీసులు రంగంలోకి దిగి నగదు ఇస్తామని తల్లిదండ్రులతో చెప్పించారు. తల్లిదండ్రులు, వారికి కొంచెం దూరంలో పోలీసులు తుమకూరుకు బయల్దేరారు. మార్గమధ్యంలో చిన్నారితో వెళ్తున్న కారును గుర్తించి అడ్డుకోవడానికి యత్నించగా దుండగులు వేగంగా కారును పోనిచ్చారు. సుమారు 15 కి.మీ.దూరం వరకు చేజింగ్ సాగింది. తుమకూరు గౌతమనహళ్లి వద్ద కిడ్నాపర్ల కారు బోల్తా పడింది. వెంటనే పోలీసులు బాలున్ని కాపాడి నిందితులైన ఫాహిం, ముజామిల్, ఫైజాన్, మహమ్మద్ షాహీద్, ఖలీల్‌ను అరెస్టు చేశారు. కాల్పుల్లో సూత్రధారికి గాయాలు ప్రధాన నిందితుడు మహ్మద్ మరోచోట ఉన్నాడని తెలిసి గాలింపు చేపట్టారు. శనివారం తెల్లవారుజామున శాంపుర మెయిన్ రోడ్డులో ఉన్నట్లు తెలిసి పట్టుకోవడానికి యత్నించగా దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో మహ్మద్ ఝన్ కాలికి గాయమైంది. వెంటనే అతన్ని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రూ.కోటి కోసం బాలుడి కిడ్నాప్
పళ్లిపట్టు: రూ.కోటి కోసం కిడ్నాప్‌కు గురైన బాలుడిని పోలీసులు రెండు గంటల్లోనే తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన యువకుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఆర్కేపేట ఇస్లాంనగర్‌కు చెందిన బాబు అలియాస్ ముబారక్(40) షోళింగర్‌లో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతనికి పర్వేష్(9), రిష్వంత్(6), అజరుద్దీన్(3) పిల్లలున్నారు. వీరిలో అజరుద్దీన్ శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందారు.ఈ క్రమంలో ముబారక్ సెల్‌కు ఒక ఫోన్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి రూ.కోటి ఇస్తే బాలుడిని వదిలిపెడగామని బెదిరించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆర్కేపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సురేందర్‌కుమార్, ఎస్ఐ త్యాగరాజన్ వెంటనే వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను అలెర్ట్ చేశారు. అదే సమయంలో ముబారక్‌కు వచ్చిన పోన్ నంబర్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న దుండగుడు బాలుడిని వంగనూరు క్రాస్ రోడ్డు వద్ద వదిలి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఏడుస్తున్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులను తిరుత్తణి డీఎస్పీ గుణశేఖరన్ అభినందించారు. బాలుడిని కిడ్నాప్ చేసింది అదే గ్రామానికి చెందిన ముబారక్ బందువు సులైమాన్(30)గా గుర్తించి అరెస్టు చేశారు. -
కిడ్నాప్ కథ సుఖాంతం
కామారెడ్డి క్రైం: భిక్కనూరులో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, బాలుడ్ని తల్లి ఒడికి చేర్చారు. కేసు వివరాలను ఎస్పీ శ్వేత మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్టు పక్కన గుడారం వేసుకుని మూలికలు అమ్మే వారు కొద్ది రోజులుగా ఉంటున్నారు. గత నెల 30న గుడారంలో అందరూ నిద్రిస్తుండగా, రెండున్నర నెలల వయస్సు గల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మరుసటి రోజు ఉదయం బాలుడి తల్లి పూజాబాయి భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కిడ్నాప్ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. సీఐ యాలాద్రి, ఎస్సై నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. బాలుడి ఆచూకీ గుర్తించడానికి కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ముఖ్యమైన అన్ని ప్రదేశాల్లోనూ సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. భిక్కనూరు టోల్గేట్ వద్ద లభించిన ఫుటేజీ ఆధారంగా ఒక ఆటోను గుర్తించి అనుమానించారు. మంగళవారం జాతీయ రహదారిపై నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సదరు ఆటోను పోలీసులు పట్టుకున్నారు. ఆటోలోని ఇద్దరు వ్యక్తులను విచారించగా, తామే బాలుడ్ని ఎత్తుకెళ్లినట్లు అంగీకరించారు. బాలుడి అప్పగింత.. ఇద్దరు నిందితులను విచారించగా సంగారెడ్డిలోని వడ్డెర పద్మ అనే మరో నేరస్తురాలి ఇంటి వద్ద బాలుడ్ని దాడి ఉంచినట్లు తెలిపారు. దీంతో వారిద్దరిని వెంట తీసుకుని వెళ్లి బాలుడ్ని, ఈ ముఠాలో సభ్యులైన మరో ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి కామారెడ్డికి తీసుకొచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బాలుడిని తల్లికి అప్పగించారు. ముఠాగా ఏర్పడి కిడ్నాప్‌లు సంగారెడ్డిలోని నేతాజీనగర్‌కు చెందిన వడ్డెర పద్మ, పఠాన్‌చెరులో నివాసం ఉంటున్న రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన కూడలి రవళి, సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన ఉందడి నవీన్, సిరిసిల్లలోని విద్యానగర్‌కు చెందిన మామిడాల వెంకటేశ్ ముఠా ఏర్పడి చిన్న పిల్లలను ఎత్తుకెళ్లి వెట్టిచాకిరి, భిక్షాటన చేయించడం లేదా ఎవరికైనా అమ్ముకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రోడ్డు పక్కన ఉంటున్న మూలికలు అమ్ముకునే వారి పిల్లలను ఎత్తుకెళ్తే ఎవరికీ చెప్పరనే ఉద్దేశ్యంతో ఆటోలో వచ్చి బాలుడ్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో రవళి గతంలో మాచారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితురా లు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర వహించాయని, సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ లక్ష్మీనారాయ ణ, భిక్కనూరు సీఐ యాలాద్రి, ఎస్సైలు నవీన్ కుమార్, సతీష్‌కుమార్, మహేందర్, సీసీఎస్ సీఐ అభిలాష్, ఎస్సైలు శేఖర్, కృష్ణ, భూమయ్యను ఎస్పీ అభినందించారు. -
విశాఖలో బాలుడి కిడ్నాప్ కలకలం
అల్లిపురం (విశాఖ దక్షిణ): నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో బాలుడు కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు... ఈ నెల 21న రాత్రి 12.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఆర్టీసీ కాంప్లక్స్ వద్ద భిక్షాటన చేసుకునే దంపతులకు రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రాత్రి భోజనాలు చేసిన తర్వాత వారు బాలుడితో కలిసి టీఎస్ఆర్ కాంప్లెక్స్‌లో గల ఇరానీ టీ దుకాణం వద్ద నిద్రిస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు తల్లిదండ్రుల చెంతన నిద్రిస్తున్న బాలుడిని తీసుకుని వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు ఆటో నంబర్‌ను నమోదు చేసుకున్నారు. దాని ఆధారంగా గోపాలపట్నం రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన సిరిమల్లెచెట్టు శ్రీను టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పరిశీలనలో ఏపీ 31 వై 3371 నంబరు గల ఆటోలో నిందితులు బాబుని తరలించినట్లు గుర్తించారు. దీంతో ఆటో నెంబరు ఆధారంగా నిందితులను విజయనగరం జిల్లా బంగారుమెట్ట ముస్లిం వీధికి చెందిన పటాన్ సల్మాన్‌ఖాన్ (19), షేక్ సుబాణీ (19), బండారు రోషన్ రాజు (20)గా గుర్తించారు. బాలుడు ప్రస్తుతం రోషన్ రాజు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. దత్తత కోసమే అపహరణ..? బాలుడిని కిడ్నాప్ చేసింది దత్తత కోసమేనని తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన బండారు రోషన్ రాజు మేనత్త సింహాచలంలో ఉంటుంది. తనకు ఒక పిల్లాడు దత్తత కావాలని ఆమె రాజుని అడిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న 9 గంటల సమయంలో రాజు, మరో యువకుడు సింహాచలంలో గల తన మేనత్తకు భోజనం తీసుకెళ్దామని ఆటోలో ఆర్టీసీ కాంప్లక్స్‌కు వచ్చారు. అక్కడ బిక్షమెత్తుకుంటున్న దంపతుల చేతిలో బాలుడుని రాజు చూశాడు. ఆ బాలుడుని ఎలాగైనా అపహరించి ఆంటీకి దత్తత ఇవ్వాలని నిర్ణయించుకుని అక్కడే వేచి ఉన్నారు. తల్లిదండ్రులు నిద్రించిన తర్వాత బాలుడిని అపహరించి విజయనగరం తీసుకెళ్లిపోయి రోషన్ రాజు ఇంట్లో ఉంచారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులు ఉపయోగించిన ఆటో నంబర్ సాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని, బాలుడుని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అన్న విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై టూ టౌన్ సీఐ కె.వెంకటరావును వివరణ కోరగా సమాచారం ఇచ్చేందుకు నిరాకరించారు. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
కాకినాడలో కిడ్నాప్ కలకలం
కాకినాడ క్రైం: నగరంలోని మధురానగర్ ప్రాంతంలో ఓబాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడంటూ గురువారం కలకలం రేగింది. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని 100కు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఆ బాలుడు పోలీసులకు దొరకడంతో అతనిని తల్లిదండ్రులకు అప్పగించడంతో సుఖాంతమైంది. డీఎస్పీ కరణం కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ (గోకులం) గణేష్ వీధిలో ఓ అపార్టుమెంట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్న కొండయ్యవలపు బూరయ్య నాలుగేళ్ల కుమారుడు గణేష్ గురువారం మధ్యాహ్నం అపార్టుమెంటు ముందు ఆడుకుంటూ కన్పించలేదు. దాంతో ఆందోళన చెందిన ఆ బాలుడి తల్లిదండ్రులు పరిసరాల్లో వెదికినప్పటికీ ఫలితం లేకపోవడంతో తమ కుమారుడు గణేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన డయల్ 100 సిబ్బంది డీఎస్పీ కరణం కుమార్, టూ టౌన్ సీఐ ఈశ్వరుడిని, ఇతర పోలీస్స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. డీఎస్పీ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. అచ్యుతాపురం రైల్వేగేటు సమీపంలో ఓ నాలుగేళ్ల బాలుడిని చూసినట్టు పోలీసులకు కొందరు సమాచారం అందించారు. దాంతో సీఐ ఈశ్వరుడు బృందం అక్కడకు వెళ్లి బాలుడు గణేష్‌ను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడు దొరకడంతో ఇటు పోలీసులు, అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అపార్టుమెంట్ వద్ద ఆడుకుంటూ బాలుడు తప్పిపోయి ఉంటాడని, ఎవరూ కిడ్నాప్ చేసి ఉండరని డీఎస్పీ కుమార్ వివరించారు. చురుగ్గా వ్యవహరించి బాలుడిని వెదికి పట్టుకున్న పోలీసు సిబ్బంది, డీఎస్పీ కుమార్, సీఐ ఈశ్వరుడు, ఎస్బీ డీఎస్పీలు ఎం.అంబికా ప్రసాద్, ఎస్.మురళీమోహన్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్సైలు టి.భద్రరావు, బి.కృష్ణమాచారి, ఇతర సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినందించారు. -
ముళ్ల పొదల్లో.. కొన ఊపిరితో..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో అదృశ్యమైన విద్యార్థి ధనుష్ కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక ప్రభుత్వ కళాశాల సమీపంలో ఉన్న పొదల్లో కొన ఊపిరితో ఉన్న ధనుష్‌ను పోలీసులు గుర్తించారు. తలకు బలమైన గాయం కావడంతో కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ధనుష్ చిన్నాన్నతో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గురువారం పాఠశాలకు వెళ్ళిన విద్యార్థి తిరిగి ఇంటికి రాలేదు. విద్యార్థిని అపహరించి హత్య చేసేందుకే తలపై కొట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
బాలుడి కిడ్నాప్: సీసీ టీవీలో రికార్డ్
సాక్షి, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో లోకేష్(4) అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ రోడ్డులోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీసీ టీవీ కెమెరాల్లో మహిళలు చిన్నారిని తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. -
విశాఖలో చిన్నారి కిడ్నాప్ కలకలం
విశాఖపట్నం: విశాఖలో మరో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలోని స్టేట్‌బ్యాంక్ అపార్ట్మెంట్లో గురువారం మధ్యాహ్నం 11 నెలల చిన్నారి నవదీప్ అదృశ్యమైయ్యాడు. అపార్టమెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న బొంగ పైడిరాజు మనుమడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. గత రెండు రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. పరామర్శించేందుకు వచ్చిన వారిని నవదీప్ తల్లి ఆరా తీయడం చుట్టుపక్కలవారిని కంటతడిపెట్టిస్తోంది. మరోవైపు మూడవపట్టణ పోలీసులు అనుమానాస్పద ప్రాంతాలలో విస్తృతంగా గాలిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ యోగానంద్ సైతం చిన్నారి కిడ్నాప్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఎనిమిది బృందాలతో ప్రత్యేక గాలింపు నగరం, నగర శివారు ప్రాంతాలలో నవదీప్ ఆచూకీ కోసం ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వలస వచ్చిన కుటుంబాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ అపార్ట్మెంట్ వద్ద గురువారం ఉదయం పూసలమ్మే ఒక మహిళ అనుమానాస్పదంగా తిరిగినట్లు నవదీప్ అమ్మమ్మ పైడమ్మ చెబుతోంది. ఆ పూసలమ్మే మహిళే నవదీప్‌ను కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ దిశగా కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.