సాక్షి, తిరుపతి: తిరుపతి బస్టాండ్‌లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని స్థానిక మహిళ ఒకరు కాపాడినట్లు తెలుస్తోంది. రోడ్డుపై ఉన్న చిన్నారిని ఏర్పేడులో క్షేమంగా పోలీసులకు అప్పగించింది.
అసలేం జరిగిందంటే..
చెన్నైకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని అర్ధరాత్రి ఫ్లాట్ ఫారం 3 వద్ద కోసం సోమవారం రాత్రి బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుని పోయాడు. ఆందోళనతో తల్లిదండ్రులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ అయిన బాలుడిని చెన్నై, వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్‌గా (2) గుర్తించారు. బాలుడితోపాటు కిడ్నాపర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు కిడ్నాపర్ బాలుడ్ని వదిలేసి వెళ్లడం.. చిన్నారి ఆ మహిళ కంట పడడం, ఆమె పోలీసులకు అప్పగించడం జరిగిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment