
విజయవాడ: నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి,తిరుపతి (07257) ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి, చర్లపల్లి (07258) ఈ నెల 9 నుంచి 30 వరకు, కాజీపేట, తిరుపతి (07253) ఈ నెల 6 నుంచి 25 వరకు, తిరుపతి, కాజీపేట (07254) ఈ నెల 7 నుంచి 25 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
తెనాలి మార్గంలో ..
తెనాలి స్టేషన్ యార్డ్‌లో జరుగుతున్న ట్రాఫిక్ బ్లాక్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 4న రద్దు చేశారు. అందులో గుంటూరు, రేపల్లె (67249/67250), గుంటూరు, రేపల్లె (67223/67224), తెనాలి,రేపల్లె (67231/67232), తెనాలి,రేపల్లె (67233/67234), విజయవాడ, తెనాలి (67221) రైళ్లు ఉన్నాయి.