kazipet
-
కాజీపేటలోనే ఎంఎంటీఎస్ కోచ్‌లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లు ఇకపై మన రాష్ట్రంలోనే తయారుకాబోతున్నాయి. ఇక్కడే కాకుండా, ముంబై లోకల్ రైల్ సర్వీసులకు అవసరమైన కోచ్‌లను కూడా ఇక్కడే తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే కాజీపేటకు మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని ఇటీవలే కోచ్ తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి ఫ్యాక్టరీ ఏర్పాటు పూర్తిచేసి, ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లతో పాటు ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ)లను కూడా తయారు చేయనున్నారు. ఫ్యాక్టరీ సిద్ధమైన వెంటనే ఈఎంయూల ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.తొలుత నెలకు 24 కోచ్‌ల ఉత్పత్తి..ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకల్ రైళ్లుగా ఈఎంయూ కోచ్‌లతో కూడిన రేక్స్‌ను వినియోగి స్తున్నారు. ప్రధాన నగరాలకు చేరువగా ఉన్న అన్ని రూట్లను దాదాపు విద్యుదీకరించడంతో వీటి వినియోగం పెరిగింది. హైదరాబాద్‌లోని మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టం (ఎంఎంటీఎస్)లో వాడుతున్న కోచ్‌లు కూడా ఈఎంయూలే. ఈ కోచ్‌లలోనే లోకోమోటివ్ అంతర్భాగంగా ఉంటుంది. ఇవి పుష్–పుల్ తరహాలో పనిచేస్తాయి. వీటిని ఎక్కువగా ముంబైలో లోకల్ రైళ్లుగా, చెన్నై శివారులో సబర్బన్ రైళ్లుగా వినియోగిస్తున్నారు. మరికొన్ని నగరాల్లోనూ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఈఎంయూ కోచ్‌లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు.వందే భారత్‌కు డిమాండ్ పెరగటంతో..దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతున్నందున ఐసీఎఫ్‌లో వందే భారత్ కోచ్‌ల ఉత్పత్తిని పెంచారు. దీనితో అక్కడ ఈఎంయూల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ మేరకు ఇతర కోచ్ ఫ్యాక్టరీలలో వాటిని ఉత్పత్తి చేయనున్నారు. కాజీపేటలో సిద్ధమవుతున్న కోచ్ తయారీ కేంద్రానికి కూడా ఈ బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 16 ఎంఎంటీఎస్ రేక్స్ నడుస్తున్నాయి. 12 కోచ్‌లతో కూడిన రైలును ఒక రేక్ అంటారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ విస్తరణ నేపథ్యంలో మరిన్ని రేక్స్ అవసరం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రెండో దశ పూర్తయితే ఇంకా వినియోగం పెరుగుతుంది.అప్పటికల్లా కాజీపేట ఫ్యాక్టరీ సిద్ధంకానుండటంతో.. ఆ కోచ్‌లను ఇక్కడే తయారు చేయనున్నారు. దేశంలో ఎక్కువ ఈఎంయూలను వాడుతున్నది ముంబై లోకల్ రైల్వే వ్యవస్థ. అక్కడ ప్రస్తుతం నిత్యం 191 రేక్స్ 2,500కు పైగా ట్రిప్పులు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ముంబైకి కూడా కాజీపేట నుంచే ఈఎంయూ కోచ్‌లు సరఫరా కానున్నాయి. నెలకు 24 కోచ్‌ల (రెండు రేక్స్) సామర్థ్యంతో యూనిట్ ప్రారంభం కానుంది. తర్వాత క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. -
'వందే భారత్' మేడిన్ తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో త్వరలోనే రైల్ కోచ్.. మేడ్ ఇన్ తెలంగాణ అన్న అక్షరాలు కనిపించబోతున్నాయి. దశాబ్దాలుగా కలగానే మిగిలిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ మరికొన్ని నెలల్లో కార్యరూపం దాల్చబోతోంది. దేశవ్యాప్తంగా దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లకు ఇక్కడి నుంచి హైస్పీడ్ బోగీలు సరఫరా కాబోతున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరగటం, కేంద్రం కూడా భవిష్యత్తులో సాధారణ రైళ్ల స్థానంలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుండటంతో కాజీపేటలో ఎక్కువగా వందేభారత్ రైల్ కోచ్‌లు తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు బడ్జెట్ ను కూడా పెంచింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నది. రొబోటిక్ టెక్నాలజీ వినియోగం..: కాజీపేటలో ఏర్పాటుచేస్తున్న కోచ్ ఫ్యాక్టరీలో అత్యాధునిక రొబోటిక్ యంత్రాలు వాడాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో మంజూరు చేసిన వ్యాగన్ తయారీ కేంద్రాన్ని కోచ్ ఫ్యాక్టరీగా మార్చిన నేపథ్యంలో ఆ మేరకు నిర్మాణాల డిజైన్లను మార్చింది. వందేభారత్ రైళ్ల బోగీల తయారీకి వీలుగా జపాన్‌కు చెందిన టైకిషా ఇంజినీరింగ్ సంస్థ నుంచి ఆధునిక రొబోటిక్ యంత్రాలను దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే ఆ సంస్థకు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీని రూ.521 కోట్లతో ఏర్పాటుచేస్తామని గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆధునిక యంత్రాలు కొనుగోలు చేస్తుండటంతో బడ్జెట్‌ను మరో రూ.150 కోట్ల మేర పెంచుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా.. ఆలస్యానికి బ్రాండ్‌గా మారిన భారతీయ రైల్వేలను పరుగులు పెట్టించే పని మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా క్రమంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. వందేభారత్ రైళ్లు కూడా అందులో భాగమే. రైల్వేశాఖ సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల వినియోగాన్ని కూడా ఆపేసి పూర్తిగా ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లనే వినియోగించటం ప్రారంభించింది. క్రమంగా ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్ రైళ్లను కూడా తప్పించి వందేభారత్ రైళ్లనే తిప్పాలని నిర్ణయించింది. అన్ని కేటగిరీల్లో వాటినే వాడాలన్నది కేంద్రం యోచన. వందేభారత్ రైళ్లకు డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. రైల్వేకు చెందిన ప్రధాన కోచ్ ఫ్యాక్టరీలైన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఐసీఎఫ్), కపుర్తలాలోని రైల్ కోచ్‌ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్)లలో ప్రస్తుతం సింహభాగం కోచ్‌ల ఉత్పత్తి జరుగుతోంది. త్వరలో లాతూరులోని మరాటా్వడా రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంఆర్సీఎఫ్)లో ఉత్పత్తి మొదలు కాబోతోంది. వీటితోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కోచ్‌ల కోసం రైల్వేశాఖ ఆర్డర్ ఇస్తోంది. భవిష్యత్తు డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి జరగాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కాజీపేటలో కూడా అత్యాధునిక కోచ్‌ల తయారీని ప్రారంభిస్తున్నది. క్రమంగా ఉత్పత్తి పెంపు – పూర్తిస్థాయిలో నిర్మాణ వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు కాజీపేటలో తక్కువ పరిమాణంలో అయినా ఉత్పత్తిని ప్రారంభించాలన్నది కేంద్రం యోచన. ఇందులో భాగంగా తొలుత నెలకు 10 ఎల్‌హెచ్‌బీ, వందేభారత్ కోచ్‌లు తయారు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. – తదుపరి ఐదారు నెలల్లో నెలకు 20 చొప్పున కోచ్‌లు తయారు చేసేలా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత డిమాండ్ ఆధారంగా సామరŠాధ్యన్ని మరింత పెంచుతారు. అందుకు తగ్గట్టు బడ్జెట్‌ను కేటాయిస్తారు. – యాద్గిర్లో తయారయ్యే చక్రాలను ఇక్కడికి పంపుతారు. మరో ప్రాంతంలో తయారైన విడి భాగాలను (కోచ్ దిగువ భాగం) ఇక్కడికి తీసుకొచ్చి పూర్తిస్థాయి బోగీగా రూపొందించి దానిపై షెల్ (కోచ్ బాడీ)ను బిగిస్తారు. – కోచ్‌లలో కావాల్సిన అమరికలను సిద్ధం చేసేందుకు కాంపోనెంట్ ఎరిక్షన్, ఫ్యాబ్రికేషన్ షెడ్లను నిర్మిస్తున్నారు. –తయారైన కోచ్‌లకు రంగులు వేయటం, వాటి పనితీరును తనిఖీ చేసేందుకు పెయింటింగ్ బూత్, టెస్ట్ షాప్‌లను ఏర్పాటుచేస్తున్నారు. – ఒక వందేభారత్ రైలు రేక్ తయారీకి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల రైలుకు రూ.80 కోట్లవుతుంది. ఐదు దశాబ్దాల కల కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు డిమాండ్ ఐదు దశాబ్దాలుగా ఉన్నది. 1982లో ఈ కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అయింది. నాటి ప్రధాని ఇందిర హత్య, ఆ తర్వాత సిక్కులపై ఊచకోత.. కాంగ్రెస్‌పై సిక్కుల్లో ఆగ్రహం.. వారిని శాంతపరిచే చర్యల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటువాల్సి కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించారు. అప్పటి నుంచి ఫ్యాక్టరీ కోసం తెలంగాణలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కాజీపేటకు రైలు చక్రాల తయారీ యూనిట్ మంజూరైంది. అది కూడా ఆ తర్వాత రద్దయ్యి, మోదీ ప్రభుత్వం వచ్చాక పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌గా మారింది. భూ సమస్య కారణంగా దాని ఏర్పాటు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. చివరకు గత ఏడాది ఫిబ్రవరిలో దాన్ని గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కేంద్రంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పుడు దాన్ని కోచ్‌ల తయారీ కేంద్రంగా మళ్లీ అప్‌గ్రేడ్ చేశారు. మరో 35 ఎకరాల భూ సేకరణకాజీపేట ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం 160 ఎకరాల భూమిని మంజూరు చేసింది. అందులో 150 ఎకరాలు ఇప్పటికే రైల్వేకు అప్పగించింది. మిగతా భూమి త్వరలో అందజేయనుంది. మారిన డిజైన్ నేపథ్యంలో తాజాగా మరో 35 ఎకరాలు కూడా రైల్వే తీసుకోనున్నట్టు తెలిసింది. కాజీపేట స్టేషన్‌తో అనుసంధానిస్తూ కోచ్ తయారీ కేంద్రంలోకి ట్రాక్ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. 390 మీటర్ల పొడవైన షెడ్లుకాజీపేట ఫ్యాక్టరీలో తొలుత వ్యాగన్లు తయారుచేయాలని నిర్ణయించినందున అందుకు తగ్గట్టుగానే డిజైన్లు రూపొందించారు. తాజాగా ఆ డిజైన్లలో 50 శాతం వరకు మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం 30 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. 2026 మార్చి నాటికి పూర్తిగా యూనిట్ సిద్ధమై ఉత్పత్తి పనులు మొదలుపెట్టాలన్నది లక్ష్యం. ఇక్కడ భారీ షెల్ అసెంబ్లింగ్ షెడ్ నిర్మిస్తున్నారు. ఇందులో కోచ్‌ల బాడీలు సిద్ధమవుతాయి. వందే భారత్ రైలు దాదాపు 390 మీటర్ల పొడవుంటుంది. దానికి సరిపడే రీతిలో దీన్ని నిర్మిస్తున్నారు. 600 మంది ఉద్యోగులుకాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ప్రత్యక్ష్యంగా 600 మంది ఉద్యోగులు పనిచేస్తారు. పరోక్షంగా 8 వేల నుంచి పది వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. వేగంగా కోచ్‌లను సిద్ధం చేయాల్సిన నేపథ్యంలో ఇది అసెంబ్లింగ్ యూనిట్‌గా ఏర్పాటవుతోంది. కోచ్‌ల తయారీకి కావాల్సిన ముడి సరుకు పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా స్థానికంగా ప్రైవేటు సంస్థలు లాభపడతాయి. వాటిల్లో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాబోతున్నారు. -
అసలే చాలీచాలని రైళ్లు.. ఆపై అదనపు కష్టాలు
హైదరాబాద్ నుంచి కాజిపేట మీదుగా సాగే గ్రాండ్ ట్రంక్ రూట్, బీబీనగర్–గుంటూరు, మహ బూబ్‌నగర్ మీదుగా ఉన్న బెంగళూరు, నిజామాబాద్ రూట్ కూడా సామర్థ్యానికి మించి రైలు ట్రాఫి క్తో ఇరుగ్గా మారాయి. ప్రస్తుతం వాటి మీదుగా 160 శాతం మేర రైళ్లు నడుస్తున్నాయి. దీంతో పండగ ప్రత్యేక రైళ్లు వాటి మీదుగా నడపటం కష్టంగా మారింది. దీంతో రద్దీ రోజుల్లో గూడ్సు రైళ్లను రీ షెడ్యూల్ చేసి మరీ ప్రత్యేక పండగ రైళ్లను అతికష్టమ్మీద తిప్పుతున్నారు. ఈ రెండు కారణాలతో సరిపోను ప్రత్యేక రైళ్లు నడపలేకపోతున్నారు. వెరసి వచ్చే దసరా, దీపావళి, సంక్రాంతి సమయాల్లో ఎప్పటిలాగానే ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. సరిగ్గా పండగ వేళ కొత్త కష్టాలు అసలే చాలినన్ని రేక్స్ లేక, సరిపడా ట్రాక్ లేక అదనపు రైళ్లు నడపటం కష్టంగా మారిన తరుణంలో, ఈసారి దసరా వేళ గ్రాండ్ ట్రంక్ రూట్లో కొత్తకష్టం వచ్చి పడింది. వరంగల్, కాజీపేట, హసన్‌పర్తి మధ్య ఇటీవల రెండు బైపాస్ లైన్లు నిర్మించారు. ఉన్న రెండు అప్ అండ్ డౌన్ రూట్లు సరిపోక వాటికి అదనంగా రెండు బైపాస్ లైన్లు నిర్మించారు. ఇప్పుడు వీటిని మెయిన్ లైన్లతో అనుసంధానించే నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి పనులు జరిగే సమయంలో ఆ ట్రాక్ మీద రైళ్లు నడపటం సాధ్యం కాదు. దీంతో రోజువారిగా ప్రత్యేక టైమింగ్స్ కేటాయించారు. ప్రధాన రైళ్లు కాకుండా మిగతా వాటిని రద్దు చేసి పనులు చేయిస్తున్నారు. ఇవి వచ్చేనెల ఎనిమిదో తేదీ వరకు జరిగేలా స్లాట్ కేటాయించారు. ఈ నెలాఖరు నుంచి ప్రత్యేక రైళ్లు తిప్పాల్సి ఉంది. ఇందుకోసం ముందుగానే ప్రత్యేక రైళ్ల టైంటేబుల్ ఖరారు చేశారు. నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్న ట్రాక్ మీదుగా కూడా ఈ ప్రత్యేక రైళ్లు తిరగాల్సి ఉంది. ఆ పనుల కోసం ఇప్పటికే 99 రైళ్లను రద్దు చేసి మరో 38 రైళ్లను దారి మళ్లించారు. రద్దయిన వాటిల్లో పండుగ ప్రత్యేక రైళ్లు 47 ఉన్నాయి. అసలే ప్రత్యేక రైళ్లు సరిపోని తరుణంలో 47 రైళ్లు రద్దు కావడం వల్ల ఈసారి పండుగ ప్రయాణికులకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఒక్క రైలు తయారీకి రూ.80 కోట్లకు పైగా వ్యయం రద్దీ కోసం మరిన్ని రైళ్లు అందుబాటులోకి తేవాల్సి ఉన్నా.. అది రైల్వేపై పెనుభారం మోపుతోంది. ప్రస్తుతం ఒక రైలు రేక్ తయారీకి దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుంది. అందే వందేభారత్ లాంటి రైళ్లకు రూ.120 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంత భారీ వ్యయంతో రైళ్లను తయారు చేసి ప్రత్యేక రైళ్లుగా నడిపితే, అన్‌సీజన్‌లో అవన్నీ ఖాళీగా ఉండాల్సి ఉంటుంది. దీంతో స్పేర్ రైళ్ల సంఖ్య పెంచటానికి రైల్వే ఆసక్తి చూపటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రద్దీ ఎక్కువగా ఉండే, దసరా, సంక్రాంతి లాంటి సందర్భాల్లో ఉత్తరాది నుంచి స్పేర్ రైళ్లు తెప్పిస్తున్నారు. -
కీలక రైల్వే ప్రాజెక్టులు కొలిక్కి..
సాక్షి, హైదరాబాద్: వరసగా రెండేళ్లలో కేంద్రప్రభుత్వం కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయిస్తుండటంతో వాటి పనులు ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాయి. ఇదే ఊపు కొనసాగిస్తూ కొత్త బడ్జెట్ కాలపరిధిలో వాటిని పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. గత సంవత్సరం బడ్జెట్ కాలపరిధిలో రాష్ట్రంలో మెదక్–అక్కన్నపేట, మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను రైల్వే శాఖ పూర్తి చేసి అందుబాటులోకి తెచి్చంది. కొన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన గుంటూరు–బీబీనగర్ డబ్లింగ్ ప్రాజెక్టును ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో పట్టాలెక్కించింది. ఈనెల 23న ప్రవేశపెట్టబోయే ఈ ఆర్థిక సంవత్సరపు పూర్తి కాల బడ్జెట్లో ఆ నిధులను కొంత సవరించే అవకాశం ఉంది. ఆ నిధులతో అవి ఈ ఆర్థిక సంవత్సరంలో తుదిదశకు చేరే అవకాశం ఉంది. కాజీపేట–బల్లార్షా మూడో లైన్ పనుల్లో వేగం ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే పరంగా జోడించే ప్రధాన లైన్లో ఇది కీలకం. నిత్యం 275 వరకు ప్రయాణికుల రైళ్లు, 180 వరకు సరుకు రవాణా రైళ్లు పరుగుపెట్టే ఈ మార్గంలో మూడో లైన్ అత్యవసరం. అది అందుబాటులోకి వస్తే కనీసం మరో 150 రైళ్లను కొత్తగా నడిపే వీలు చిక్కుతుంది. ఈ మార్గంలో తెలంగాణకు సంబంధించి దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు.ఇందులో మహారాష్ట్ర– తెలంగాణల్లో కొనసాగే ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. దీని నిడివి 202 కి.మీ.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. గత రెండేళ్లుగా పనుల్లో వేగం కారణంగా చాలా సెక్షన్లలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 151కి.మీ. పనులు పూర్తయ్యాయి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.300 కోట్లు ప్రతిపాదించారు. ఈసారి ఆ మొత్తాన్ని కొంత సవరించే అవకాశం ఉంది.కాజీపేట– విజయవాడ మూడో లైన్ పనులకూ మోక్షం దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన ఆ ప్రాజెక్టు ఎట్టకేలకు 2012–13లో మంజూరైంది. కానీ, పనుల నిర్వహణ మాత్రం మందకొడిగా సాగుతూ అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ, గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టుకు ఏకంగారూ.647 కోట్లçను కేటాయించటంతో ఎట్టకేలకు ప్రాజెక్టు ఓ రూపునకు వచి్చంది. పూర్తి నిడివి 219 కి.మీ. ఇప్పటివరకు 100కి.మీ. పనులు పూర్తయ్యాయి. దీని అంచనా వ్యయం రూ.1,952 కోట్లు.’మనోహరాబాద్–కొత్తపల్లి’.. వచ్చే ఏడాదికి కొలిక్కిసిద్దిపేట మీదుగా హైదరాబాద్–కరీంనగర్‌ను రైల్వే ద్వారా అనుసంధానించే కీలక ప్రాజెక్టు ఇది. 2006–07లో మంజూరైనా ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. దీని నిడివి 151 కి.మీ. కాగా ఇప్పటి వరకు 76 కి.మీ. పనులు పూర్త య్యాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1375 కోట్లు. గతేడాది బడ్జెట్లో దీనికి రూ.185 కోట్లు కేటాయించగా, గత మధ్యంతర బడ్జెట్లో రూ.350 కోట్లు ప్రతిపాదించారు. నిధులకు కొరత లేనందున వచ్చే ఏడాది కాలంలో పనులు దాదాపు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ’బీబీనగర్– గుంటూరు’ పనులు ఇక స్పీడే సికింద్రాబాద్–విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ లైన్ గా నడికుడి మీదుగా బీబీనగర్– గుంటూరు మార్గాన్ని అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. రూ.2,853 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు గత మధ్యంతర బడ్జెట్లో రూ.200 కోట్లు ప్రతిపాదించారు. కుక్కడం–నడికుడి సెక్షన్ల మధ్య భూసేకరణ పను లు మొదలయ్యాయి. -
హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం
-
కాజీపేట్ రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం
సాక్షి, హనుమకొండ: కాజీపేట్ రైల్వేస్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కోసం నిలిపిన రైల్ బోగీ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నమని పోలీసులు తెలిపారు. -
రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: కాజీపేట్–డోర్నకల్, విజయవాడ– డోర్నకల్ మధ్య రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. కాజీపేట్–డోర్నకల్ మధ్య ఈ నెల 14 నుంచి, విజయవాడ–డోర్నకల్ మధ్య ఈ నెల 20 నుంచి రైళ్లు యాథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి. రైల్వేలైన్ల నిర్వహణ దృష్ట్యా ఈ రెండు రైళ్లను ఈ నెల ఒకటో తేదీ నుంచి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. -
సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. సెకన్లలో నిండు ప్రాణం బలి
సాక్షి, హన్మకొండ: అతి వేగంగా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. హైస్పీడ్‌తో వాహనాలను నడుపుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా, ఓ సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా నడిరోడ్డుపై ఓ మహిళ మృతిచెందింది. అయితే, ఉన్నతాధికారి కొడుకు నిందితుడు కావడంతో పోలీసులు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ వద్ద కవిత బైక్ ఎక్కబోతుండగా ఓ కారు హైస్పీడ్‌లో వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఎక్సైజ్ సీఐ శరత్ కొడుకు వంశీ TS03 FA9881 నెంబర్ కారును అధిక వేగంతో డ్రైవ్ చేసి రాంగ్ సైడ్‌లో బైక్‌ను ఓవర్టేక్ చేయబోయాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే మాట్లాడున్న కవితను కారు బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. #JustIn Kazipet road accident!@HiWarangal @TriCityWarangal pic.twitter.com/hY54Ts8LNj — Fasi Adeeb🇮🇳 (@fasi_adeeb) December 1, 2023 అయితే, ఈ ప్రమాదంలో నిందితుడి వంశీపై చర్యలు తీసుకోవాలని కవిత కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా వంశీని ఈ కేసు నుంచి కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నాడు. దీంతో, నిన్నటి నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువుల ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఫాతిమా నగర్ జంక్షన్లో ధర్నా చేశారు. దీంతో, రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక, కవితకు వివాహం కాగా, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు సమాచారం. -
రైలుబోగీల్లోనే 10 గంటలు..
మహబూబాబాద్: ఎడతెరిపిలేని వర్షాలతో కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలోని వడ్డేపల్లి చెరువు రిజర్వాయర్‌పై నిర్మించిన రైల్వే వంతెన ట్రాక్‌పైకి వరద నీరు ఉధృతంగా చేరడంతో గురువారం రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో సుమారు 10గంటలపాటు ప్రయాణికులు రైలు బోగీల్లోనే నిరీక్షించారు. వడ్డెపల్లి చెరువు కట్టపై 364/27–25 కి.మీ నంబర్ వద్ద రైల్వే ట్రాక్ డేంజర్‌గా మారడంతో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో తిరుపతి–కరీంనగర్, ఎర్నాకులం–బిలాస్పూర్, యశ్వంత్‌పూర్–లక్నో, బెంగళూర్–నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉదయం 10:30 గంటల నుంచి నిలిపివేశారు. కాజీపేట–ఢిల్లీ, వరంగల్–ఢిల్లీ అప్ అండ్ డౌన్ రూట్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్ బ్రిడ్జి, ట్రాక్ ఇంజనీర్స్, కాజీపేట జంక్షన్‌కు చెందిన అధికారులు వడ్డెపల్లి రైల్వే ట్రాక్ వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ట్రాక్ సామర్థ్యం టెస్టింగ్ కోసం ట్రాక్‌పై గూడ్స్ రైలును నిలిపి ఉంచారు. రాత్రి 8 గంటల వరకు ఇదే పరిస్థితిలో రైల్వే అధికారులు సెక్యూరింగ్ చేశారు. కాగా కాజీపేట రైల్వే చరిత్రలో వడ్డెపల్లి చెరువు రైల్వే ట్రాక్‌పైకి వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. అయితే రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ సమీప దుకాణాల వద్దకు వెళ్లి తిను బండారాలు కొనుగోలు ఆకలితీర్చుకున్నారు. వరంగల్ సమీప గ్రామాల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోయారు. సుమారు 10గంటల తర్వాత గురువారం రాత్రి రైళ్ల రాకపోకలకు రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రాక్ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ట్రాక్ కెపాసిటిని పరిశీలించి మొదటి, రెండో లైన్లకు రాత్రి 8:30 గంటలకు క్లీయర్ ఇచ్చారు. ముందుగా లైట్ ఇంజన్ నడిపించి ఆతర్వాత 10 నుంచి 30 కెంఎంపీహెచ్ స్పీడ్‌తో ఢిల్లీ వైపు యశ్వంత్‌పూర్– బిలాస్పూర్, తర్వాత రాజధా, లక్నో, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లను పంపించినట్లు తెలిపారు. కాజీపేట జంక్షన్ జలమయం వర్షపునీరు కాజీపేట జంక్షన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్దకు, ఎంట్రెన్స్ ఎదుట, ప్లాట్‌ఫాం పైకి చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ► న్యూ ఢిల్లీ వెళ్లే ఏపీ, తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు గురువారం ఉదయం 11.30 గంట ల సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్ రెండు, మూడు ప్లాట్ ఫాంలలో నిలిపివేశారు. రైళ్లలో శు క్రవారం ఐఐటీ ఢిల్లీ కళాశాలలో చేరేందుకు వెళ్తు న్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్లే గ్రాండ్ ట్రంక్(జీటీ) ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్ రైల్వే స్టేషన్లో ప్లా ట్ ఫాం రేకు తగలడంతో రైలు ఆగిపోయింది. ► రఫ్తీసాగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (గోర్కపూర్– కొచువేలి) రైలు నెక్కొండ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం 11గంటలకు నిలిచిపోయింది. స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు లేక పోవడం.. తినుబండారులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. -
Kazipet Railway Station Floods Video: ఖాజీపేట రైల్వే ట్రాక్‌పై వరద నీరు
-
విషాదానికి ముందు.. ఎంజీఎంలో చిన్నారి రాజు సరదా క్షణాలు
-
‘నా కొడుకా.. నీకప్పుడే నూరేళ్లు నిండాయారా’
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన ఆ చిన్నారిని మృత్యువు వీధి కుక్కల రూపంలో వెంటాడింది. ఆపై గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక.. అక్కడా అయినవాళ్ల నడుమ ఆడుకుంటూ కనిపించాడు. కానీ, విధి మరొకటి తలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూశాడు. ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదించారు. హన్మకొండ జిల్లా పరిధిలో జరిగిన విషాదం.. స్థానికుల చేత కంటతడి పెట్టిస్తోంది. వీధి కుక్కలు మరో చిన్నారిని బలిగొన్నాయి. కిందటి నెలలో కుక్కల దాడిలో గాయపడి.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రాజు(18 నెలలు) కన్నుమూశాడు. దీంతో కాజీపేట రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజు కుటుంబం ఉంటోంది. గత నెల(జూన్) 17వ తేదీన ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 18 నెలల రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. మొహంపై గాయాలతో పాటు చెంప కొంత వరకు తెగిపోయింది. పిల్లల అరుపులు విన్న స్థానికులు.. ఇళ్లలోంచి వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. ఆపై పిల్లలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చిన్నారి రాజు ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఆడుకుంటున్న దృశ్యాలను మొబైల్లో బంధించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. క్రమక్రమంగా రాజు పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. 25 రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. -
కాజీపేట వ్యాగన్ల పరిశ్రమ రెండో అతిపెద్దది
కాజీపేట రూరల్: భారతీయ రైల్వేలోనే రెండో అతిపెద్ద రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ కాజీపేటలో నిర్మాణం కాబోతోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యాపురం గ్రామశివారులో ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్న రైల్వే వ్యాగ న్ల తయారీ పరిశ్రమస్థలాన్ని, అక్కడ జరుగుతున్న పను లను గురువారం అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేతోపాటు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఈ పరిశ్రమను నిర్మిస్తుందన్నారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) సంస్థ సహకారంతో రొబొటిక్ సిస్టం ద్వారా నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్, రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఈ నెల 8న ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వ్యాగన్ల తయారీ పరిశ్రమకు ఆదారంగా వివిధ రకాల రోలింగ్ స్టాక్లను ఉత్పత్తి చేస్తుంద న్నారు. జిల్లాలో కొత్త పారి శ్రా మిక అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థను ప్రోత్స హి స్తుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతికి తోడ్పడుతుందన్నారు. రూ.521 కోట్ల వ్య యంతో 160.4 ఎకరాల విస్థీర్ణంలో నిర్మాణం కానున్న వ్యా గన్ల తయారీ పరిశ్రమలో నెలకు 200 వ్యాగన్ల పీరి యాడికల్ ఓవరాయిలింగ్ (పీవోహెచ్) చేసేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్‌షాప్ మంజూరైందని, సంవత్సరానికి 1,200 వ్యాగన్లు, రెండో సంవత్సరానికి 2,400 వ్యాగన్లను ఉత్పత్తి చేస్తుందని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మా ణం కానున్న వ్యాగన్ల తయారీ పరిశ్రమను 24 నెలల్లోపూర్తి చేసి 2025 సంవత్సరం నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాగన్ల తయారీ పరిశ్రమ వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం ఏకే గుప్తా, ఆర్వీఎన్ఎల్ సీపీఎం మున్నకుమార్ పాల్గొన్నారు. -
కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు.. వర్క్‌షాప్ కాదు.. వ్యాగన్ ఫ్యాక్టరీనే!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాజీపేటకు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టు రాబోతోంది. కాజీపేటలో వ్యాగన్ పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌కు బదులుగా నేరుగా వ్యాగన్ల తయారీ ప్రాజెక్టునే రైల్వే ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి రైల్వే పరోక్షంగా స్పష్టతనిచ్చింది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీలో తొలి ఏడాది 1200 వ్యాగన్లను తయారు చేస్తామని.. తర్వాత ఈ సామర్థ్యాన్ని 2400కు పెంచుతామని శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తంగా మూడు దశాబ్దాల కింద కాజీపేటకు మంజూరై.. ఇతర రాష్ట్రాలకు తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తుండటం గమనార్హం. ఇప్పటివరకు దేశంలో రైలు వ్యాగన్లు తయారు చేసేందుకు రైల్వేకు పశ్చిమ బెంగాల్లో ఒక్క సొంత యూనిట్ మాత్రమే ఉండగా.. కాజీపేటలో రెండోది ఏర్పాటుకానుంది. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి ‘సాక్షి’ఫిబ్రవరి నెలలోనే కథనం ప్రచురించింది కూడా. ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభం కాజీపేట సమీపంలోని మడికొండలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన 160 ఎకరాల స్థలంలో వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. తొలుత ఇక్కడ రూ.269 కోట్లతో ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను నిర్మించాలని నిర్ణయించి.. రైల్వే అనుబంధ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గతేడాది టెండర్లు పిలిచారు. మాదాపూర్‌కు చెందిన పవర్ మెక్–టైకిషా జెవీ అనే సంస్థ రూ.361.79 కోట్లకు టెండర్ దక్కించుకుంది. ఇప్పుడా ప్రాజెక్టు వ్యాగన్ ఫ్యాక్టరీగా మారిన నేపథ్యంలో.. అదే సంస్థ పనులు చేపట్టనుందని సమాచారం. ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ వ్యాగన్ ఫ్యాక్టరీని అధికారికంగా ప్రకటించి, శంకుస్థాపన చేయనున్నరని అధికారులు చెప్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వ్యాగన్ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందని అంటున్నారు. విమర్శలకు కౌంటర్‌గా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాజీపేటలో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటుకోసం రూ.160 కోట్లు కేటాయించారు. కానీ తర్వాత రాజకీయంగా వస్తున్న విమర్శలను కౌంటర్ చేసేలా కాజీపేట యూనిట్‌ను వాగన్ ఫ్యాక్టరీగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ యూనిట్ వల్ల 2వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. యూనిట్‌ను ఫ్యాక్టరీగా మార్చినందున కొత్తగా గ్యాంగ్ డ్రిల్లింగ్ యంత్రం, షీరింగ్ యంత్రం, బెంచ్ ప్రెస్, యూనివర్సల్ అండర్ ఫ్రేమ్ వెల్డింగ్ మ్యానిప్యులేటర్స్, స్ట్రైటెనింగ్ యంత్రం, హుక్ బోల్టింగ్ యంత్రం వంటి పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
కాజీపేటలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
సాక్షి, హన్మకొండ: వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధికుక్కలు మరో బాలుడి ప్రాణాలు తీశాయి. వీధికుక్కలు దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆడుకుంటుండగా మల్కాన్ సింగ్, సునీత దంపతుల కుమారుడు చోటు అనే చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కాగా పని కోసం మల్కాన్ సింగ్ కుటుంబం గురువారమే యూపీ నుంచి ఖాజీపేటకు వలస వచ్చారు. వీరు నగరంలో ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పొట్ట కూటికోసం వస్తే.. మరుసటి రోజే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే పరామర్శ కాజీపేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతదేహాన్ని స్వంత ఖర్చులతో యూపీకి తరలించారు. నగరంలో ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నాయని, కుక్కలను చంపడం నేరం కావడంతో వాటి సంతతిని కంట్రోల్ చేసే చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. కుక్కలకు కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తామన్నారు ఇదిలా ఉంటే గడిచిన 20 రోజుల్లో వరంగల్ జిల్లాలో ఇద్దరు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడ్డడం కలకలం సృష్టిస్తుంది. చదవండి: పైళ్లెన వారం రోజులకే విషాదం నింపిన క్షణికావేశం -
ఖాజీపేట్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు
-
చెప్పు పోయిందని ట్విట్టర్లో ఫిర్యాదు.. రైల్వే పోలీసులు ఏం చేశారంటే!
సాక్షి,కాజీపేట: రైలు ఎక్కుతున్న సమయంలో తన చెప్పు పడిపోయిందని ఒక ప్రయాణికుడు రైల్వే ట్విట్టర్లో ఫిర్యాదు చేయగా.. రైల్వే పోలీసులు దాన్ని వెతికి అతనికి తిరిగి భద్రంగా అప్పగించారు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగు చూసింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఒక ప్రయాణికుడు స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు కాకతీయ ప్యాసింజర్ ఎక్కుతుండగా.. తన చెప్పు ఒకటి జారిపడి పోయిందని ట్విట్టర్లో రైల్వేబోర్డుకు ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం ఘన్పూర్ వద్ద ప్రయాణికుడి చెప్పును కనుగొని తీసుకొచ్చారు. ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిని పిలిపించి.. అతనికి చెప్పును అప్పగించారు. పోలీసులు తెలిపారు. -
కాజీపేటలో రైల్ వ్యాగన్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: కాజీపేటకు మంజూరు కావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఎగ్గొట్టిందని రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కాజీపేటకు మంజూరై పనులు ప్రారంభించుకున్న పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ (పీఓహెచ్) స్థాయి పెంచి వ్యాగన్ల తయారీ యూనిట్‌గా మార్చాలని నిర్ణయించింది. వర్క్‌షాప్ అంచనా వ్యయం రూ.269 కోట్లు కాగా, తాజా నిర్ణయంతో దానిని రూ.521 కోట్లకు పెంచారు. ఐదు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన వార్షిక బడ్జెట్లో దీని ఊసు లేకపోవటం గమనార్హం. దీంతో బడ్జెట్ తయారీ తర్వాత కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు గూడ్స్ రైళ్లకు సంబంధించిన వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు రైల్వే బోర్డు చర్యలు ప్రారంభించిందని ఓ సీనియర్ రైల్వే అధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఆ వివాదంతోనేనా.. కాజీపేటకు 1980లలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. దాని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న సమయంలో నాటి ప్రధాని ఇందిర హత్య జరిగింది. అప్పుడే సిక్కులపై ప్రతీకార దాడులు తీవ్రం కావటంతో పంజాబ్‌లో పరిస్థితి చేయిదాటింది. సిక్కులను చల్లార్చే క్రమంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించే నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి ఈ డిమాండ్ పెండింగులో ఉండిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో దాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేస్తామన్న కేంద్రం ఆ మేరకు కమిటీ వేసింది. కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదన్న ఆ కమిటీ అభిప్రాయం మేరకు కాజీపేటకు పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ మంజూరు చేశారు. ఇది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రైల్వేకు ఇది రెండో యూనిట్.. దేశవ్యాప్తంగా రైల్వేకు కోచ్ ఫ్యాక్టరీలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ గూడ్సు వ్యాగన్ల తయారీకి ప్రభుత్వరంగ కేంద్రం ఒక్కటే ఉంది. కాగా కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటైతే ప్రభుత్వ పరంగా రెండో యూనిట్ అవుతుంది. రైల్వే సొంత యూనిట్‌గా మారుతుంది. పవర్ మెక్–టైకిషా జేవీ అన్న సంస్థ కాజీపేట పీఓహెచ్ టెండర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దానికి కావాల్సిన 160 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం 150 ఎకరాలను రైల్వేకు అందజేసింది. దీంతో అక్కడ వర్క్‌షాప్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర బడ్జెట్లో దానికి రూ.160 కోట్లు కేటాయించారు. -
ఇద్దరు భార్యలు.. మరొకరితో వివాహేతర సంబంధం.. మొదటి భార్య షాకింగ్ ట్విస్ట్
కాజీపేట(హన్మకొండ జిల్లా): మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిచడాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య రూ.4లక్షల సుఫారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. ఈ ఘటనకు సంబంధించిన భార్యతో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సౌత్ జోన్ డీసీపీ అశోక్‌కుమార్ తెలిపారు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం వివరాలు వెల్లడించారు. కాజీపేట డీజిల్ కాలనీలో నివాసం ఉండే జిన్నారపు వేణుకుమార్ (34) గిరిగిరి చిట్టిల వ్యాపారం చేసేవాడు. అతడికి ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య సుశ్మిత రైల్వేలో ఉద్యోగం చేస్తుంది. భార్యలిద్దరినీ ఒకే ఇంటిలో ఉంచి కాపురం చేస్తున్న వేణుకుమార్ మహబూబాబాద్‌కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇద్దరు భార్యలకు చూపిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేశాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మొదటి భార్య సుశ్మిత తనకు దగ్గరి బంధువైన భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సీపేట గ్రామానికి చెందిన గడ్డం రత్నాకర్ అనే రౌడీషీటర్‌కు రూ.4లక్షల సుఫారీ ఇచ్చి తన భర్తను హత్య చేయాలని చెప్పింది. ఈ క్రమంలో రత్నాకర్ వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ కొంగర అనిల్, ఇస్సీపేటకు చెందిన కటిక అనిల్‌కు సుపారీ విషయం చెప్పి వేణుకుమార్‌ను హత్య చేసేందుకు ఒప్పించాడు. పథకం ప్రకారం సెప్టెంబర్ 30న సుశ్మిత తన భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కలిపి తాగించింది. వేణుకుమార్ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే వేచి ఉన్న నిందితుల సహకారంతో కారులో పెద్దపల్లి జిల్లా మంథని వద్ద ఉన్న మానేరు వాగు సమీపంలో వేణుకుమార్‌ను గొంతు నులిమి హత్య చేసి పడేసి హనుమకొండకు వచ్చారు. అనంతరం ఏమి తెలియనట్లు అక్టోబర్ 2న భర్త వేణుకుమార్ కనిపించడం లేదంటూ సుశ్మిత కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మంథని పోలీసులు వాగులో కనిపించిన మృతదేహాన్ని గుర్తు తెలియని శవంగా ప్రకటించారు. అయితే, సుశ్మిత ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎక్కడాలేని ప్రేమ ఒలకబోస్తూ ఏడుస్తుండడంతో అనుమానం వచ్చిన ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్‌రెడ్డి విషయాన్ని ఏసీపీ శ్రీనివాస్, డీసీపీలకు వివరించి కాల్ లిస్ట్ బయటకు తీశారు. ఆమె నిత్యం నిందితులతో మాట్లాడుతున్నట్లు వెల్లడైంది. దీంతో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి సుశ్మితను అదుపులోకి తీసుకుని విచారించగా వేణుకుమార్‌ను సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా ఒప్పుకుంది. మంథని పోలీసుల సమకారంతో మృతదేహాన్ని వెలికితీసి రీ పోస్టుమార్టం చేయించిన పోలీసులు శనివారం రాత్రి విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులతో పాటు కారు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, ప్రమోద్‌కుమార్, రవికుమార్, సిబ్బందిని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ అభినందించారు. చదవండి: మహిళ గలీజ్ పని.. యువకులతో పరిచయం పెంచుకుని.. నగ్న చిత్రాలు పంపి.. -
కాజీపేట రైల్వే యూనిట్‌కు మోక్షం
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాజీపేటలో వాగన్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రెండు దఫాలు టెండర్లు విఫలమైన తర్వాత మూడో ప్రయత్నంగా బుధవారం టెండర్లను తెరవబోతున్నారు. నిర్మాణసంస్థను గుర్తిస్తే.. సరిగ్గా రెండున్నరేళ్లలో యూనిట్ పని ప్రారంభించనుంది. రూ.383 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ నిర్మిస్తున్న ఈ యూనిట్లో నెలకు 250 వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేలా ఓవర్‌హాలింగ్ చేయనున్నారు. 2016లో రైల్వే శాఖ రూ.269 కోట్ల అంచనాతో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు, ఎప్పుడో పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. దానికి కావాల్సిన 150 ఎకరాల భూమి కోర్టు వివాదంలో చిక్కుకోవటం, ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం దాన్ని రైల్వేకు అప్పగించటంలో జాప్యం చేయటంతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. గతేడాదే ఆ భూమి రైల్వేకు అందటంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి యూనిట్ ఏర్పాటు పనులు ముమ్మరమయ్యాయి. -
కూలింగ్‌తో ఈ–బైక్స్ ఫైరింగ్‌కు చెక్
కాజీపేట అర్బన్: విద్యుత్ చార్జింగ్‌తో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నా తరచూ జరుగుతున్న బ్యాటరీల పేలుళ్ల ఉదంతాలు కలవరపెడుతున్నాయి. అయితే ప్రత్యేక పరికరాల ఏ ర్పాటుతో ఈ ప్రమాదాలను నివారించొ చ్చని వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఎలక్ట్రికల్ బ్రాంచ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్‌బాబు పేర్ల తెలిపారు. విద్యుత్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లపై రెండేళ్లుగా చేపడుతున్న తమ పరిశోధనల వివరాలను ఆయన గురువారం ‘సాక్షి’తో పంచుకున్నారు. కూలింగ్‌తో ఫైరింగ్‌కు చెక్.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ–బైక్స్‌లోని బ్యాటరీలను చల్లబరిచేందుకు ఎలాంటి కూలింగ్ డిజైన్ లేదని సురేష్‌బాబు తెలిపారు. దీనివల్ల విద్యుత్ చార్జింగ్ సమయంలో లేదా వాహనాన్ని నడిపేటప్పుడు బ్యాటరీలో ఏర్పడిన వేడి బయటకు వెళ్లే అవకాశం లేక వాటి నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఆయన వివరించారు. అలాగే సాధారణంగా ఈ–బైక్స్‌లో లిథియం అయాన్ బ్యాటరీలను వాడుతున్నారని.. వాటిని చార్జింగ్ పెట్టాక వాడకపోయినా విద్యుత్‌శక్తి అందులోనే ఉండిపోతుందని వివరించారు. దీనికితోడు ఈ–బైక్స్‌లోని బ్యాటరీలు ఎండకు, వానకు దెబ్బ తినకుండా ఉండేందుకు వీలుగా తయారీ కంపెనీలు వాటిని పూర్తిగా ఫైబర్ మెటీరియల్‌తో కప్పేసేలా డిజైన్ చేయడం కూడా ప్రమాద తీవ్రతను పెంచుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ–బైక్స్‌ను చల్లబరిచేలా ప్రత్యేక పరికరాలను డిజైన్ చేయగలిగితే అగ్నిప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. కాగా, వరంగల్‌లో ఈ–బైక్స్‌కు ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై రెండేళ్లుగా పరిశోధనలు చేపట్టామని... ఇందుకు 8 ప్రాంతాలు (ఫాతిమానగర్, అదాలత్ సెంటర్, కేయూసీ, కుమార్‌పల్లి, హన్మకొండ చౌరస్తా, ఎంజీ రోడ్డు, భట్టుపల్లి, వరంగల్ స్టేషన్ రోడ్డు) అనువుగా ఉన్నట్లు గుర్తించామని సురేష్‌బాబు వివరించారు. -
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్‌ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్‌బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్‌కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్‌వర్క్‌లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్‌గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్‌తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్‌ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్‌బాబు తెలిపారు. -
బ్రదరూ! అక్కడుంటాడొకడు.. క్లిక్మనగానే ఇంటికి డైరెక్టుగా ట్రాఫిక్ చలానా!
టాఫిక్ పోలీస్ లేడని దర్జాగా దూసుకెళ్లినా.. నిబంధనలు అతిక్రమించినా ఒకడున్నాడు చూడ్డానికి. ఇకపై కూడళ్ల వద్ద మిమ్మల్ని నిరంతరం పర్యవేక్షిస్తాడు. ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా క్లిక్‌మని జరిమానా వేసేస్తాడు. – కాజీపేట ఇకపై ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఎందుకంటే కాజీపేట చౌరస్తాలో ఇటీవల కొత్తగా ఆటోమెటిక్ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. చక్కగా తన పనితాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక ముందు బీట్ కానిస్టేబుల్ చౌరస్తాలో నిలబడి నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఫొటోలు తీసి జరిమానా విధించే పని ఉండదు. ఆటోమెటిక్ కెమెరాలు తీసిన ఫొటోల ఆధారంగా నేరుగా ఈ–చలానా ఇంటికే వచ్చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఈవిధానం అమలవుతుండగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికోసం వరంగల్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి నిర్వహణ కొనసాగించనున్నారు. (చదవండి: బిహార్‌లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు) ఈ నిబంధనలు పాటించాల్సిందే.. ► హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు ► రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు ► వాహనాలపై పరిమిత సంఖ్యలో ప్రయాణించాలి ► ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించొద్దు ► నంబర్ ప్లేట్ వంచొద్దు. స్టిక్కర్లు అంటించొద్దు. ఈవిధానంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రాంతం నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారి ఫొటోలు ఈకెమెరాల్లో నిక్షిప్తమై కంట్రోల్ కేంద్రం నుంచి ఆటోమెటిక్‌గా ఈ–చలానా వాహనదారులకు చేరేలా ఏర్పాటు చేశారు. త్వరలో ఏఎంపీఆర్ విధానం ఆటోమెటిక్‌గా ఇంటిగ్రెటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమలు అనంతరం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏఎంపీఆర్ (ఆటో మెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) అమలు చేయనున్నట్లు సమాచారం. ఎవరైనా తమ వాహనం నంబర్లో ఒక సంఖ్య తొలగించి వాహనం నడిపితే సీసీ కెమెరాల్లో ఆవాహనం ఫొటో నిక్షిప్తమై తొలగించిన నంబర్‌ను గుర్తు పడుతోంది. అనంతరం ఆయజమాని సెల్‌ఫోన్‌కు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తుంది. (చదవండి: లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
‘పట్టాలు’ తప్పిన ప్రాజెక్టు నష్టం రూ. 2000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అది ఓ కీలక ప్రాజెక్టు.. పూర్తయితే అదనంగా రోజుకు వంద రైళ్లను నడిపేందుకు అవకాశమున్న కారిడార్. ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే జాప్యం చేసింది. ఆ ఆలస్యం ఖరీదు దాదాపు రూ.2 వేల కోట్లు కావడం గమనార్హం. రూ.2,063 కోట్ల వ్యయంతో సిద్ధం కావాల్సిన ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కానుంది. అంటే మరో ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు సరిపడా ప్రజాధనాన్ని రైల్వే వృథా చేసినట్టవుతోందన్నమాట. కాజీపేట– బల్లార్షా మూడో లైన్ (ట్రిప్లింగ్) ప్రాజెక్టులో ఈ జాప్యం చోటు చేసుకుంది. కీలకమైన అతిరద్దీతో కూడిన లైన్ దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో జోడించే అతి కీలక రైల్వే లైన్ ఇది. దక్షిణ భారత్ ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రైల్వే లైన్. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్‌గా పరిగణిస్తారు. నిత్యం వందల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుంటాయి. లైన్ ప్రాధాన్యం దృష్ట్యా ఇటీవల ఆ కారిడార్‌లో రైలు వేగాన్ని గంటకు 130 కి.మీ.కు పెంచారు. ఈ మార్గంలోని మాణిక్‌ఘర్, రేచిని, ఉప్పల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మందమర్రి, రామగుండం, పెద్దంపేట, సిర్పూర్–కాగజ్‌నగర్.. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు, సిమెంటు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. ఎరువుల కర్మాగారం ఉంది. వెరసి వందలాది సరుకు రవాణా రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇది రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా, గోల్డెన్ కారిడార్‌గా వెలుగొందుతోంది. ఒక్క రైలునూ కూడా అదనంగా నడపలేని పరిస్థితి ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజూ 250 రైళ్లు తిరుగుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక రైళ్లతో కలిసి 300 రైళ్ల వరకు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆ రూట్లో 130 శాతం రైలు ట్రాఫిక్ రికార్డవుతోంది. దీంతో మరో రైలును కూడా అదనంగా తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబయి వైపు మరిన్ని రైళ్లు నడపాల్సి ఉన్నా, ఈ మార్గం ఇరుగ్గా మారటంతో నడపలేని దుస్థితి నెలకొంది. అత్యవసరంగా ఓ బొగ్గు రవాణా రైలు ముందుకు సాగాలంటే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిలిపివేయాల్సి వస్తోంది. మూడో లైన్ ఆవశ్యకతను గుర్తించిన కేంద్రం మూడో లైన్ పూర్తయితే ఆ సమస్య తీరడంతో పాటు అదనంగా మరో 100 రైళ్లను నిత్యం నడిపే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మూడో లైన్ నిర్మాణం అత్యంత ఆవశ్యకమని గుర్తించిన కేంద్రం 2015–16లో ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిడివి 202 కి.మీ కాగా అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. ప్రాజెక్టు ప్రారంభం, పనులు రెండూ జాప్యమే.. ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాలేదు. ప్రారంభించాక వేగంగా పనులు చేశారా అంటే.. ఇప్పటికి పూర్తయింది కేవలం 71 కి.మీ (35 శాతం) మాత్రమే. మరో 68 కి.మీ పనులు (33 శాతం) కొనసాగుతున్నాయి. ఇవి 2023 మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరో 60 కి.మీ పైగా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే రూ.1,700 కోట్లు ఖర్చయ్యాయి. తాజా పరిస్థితుల్లో మిగతా పనులు పూర్తి కావాలంటే ప్రాజెక్టు వ్యయం రూ.4 వేల కోట్లు దాటుతుందని అంచనా. అంటే ప్రాజెక్టు పనులు ఆలస్యం కావటంతో అంచనా వ్యయం దాదాపు రెట్టింపు అవుతోందన్నమాట. అప్పట్లోనే గుర్తించి ఉంటే.. సరుకు రవాణాలో కీలక మార్గం కావటంతో దాదాపు 12 ఏళ్ల క్రితమే రాఘవాపురం–పెద్దంపేట, మంచిర్యాల–మందమర్రి మధ్య 24 కి.మీ, మంచిర్యాల–పెద్దంపేట మధ్య గోదావరి నదిపై భారీ వంతెన సహా 9 కి.మీ లైన్ మంజూరు చేశారు. ఆ పనులు చేపట్టి దశలవారీగా పూర్తి చేశారు. కానీ కారిడార్ యావత్తు మూడో లైన్ అవసరమన్న విషయాన్ని అప్పుడే గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వ్యయం రెట్టింపు అయ్యే పరిస్థితే తలెత్తేది కాదని రైల్వేవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఈ రోడ్డుపై నీళ్లు నిలవవు!
కాజీపేట అర్బన్: ఏ చిన్నపాటి వాన కురిసినా రోడ్లపై నీళ్లు నిలుస్తాయి. వచ్చిపోయే వాహనాలతోపాటు పాదచారులకూ నరకమే. అదే భారీ వర్షాలు కురిస్తే రోడ్లపై నీళ్లతోపాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు తోడ్పడే ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్లు, పేవ్మెంట్ల నిర్మాణంపై వరంగల్ నిట్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోయే ఈ తరహా రోడ్లను.. విదేశాల్లో పలుచోట్ల పార్కింగ్ స్థలాలు, ఉద్యానవనాలు వంటి చోట్ల ఇప్పటికే వినియోగిస్తున్నారు. దీనిని మన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై నిట్ సివిల్ విభాగం ట్రాన్స్పోర్ట్ డివిజన్ ప్రొఫెసర్ ఎస్.శంకర్, పీహెచ్డీ స్కాలర్ గుమ్మడి చిరంజీవి పరిశోధన చేస్తున్నారు. ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్లు/పేవ్మెంట్లతో నీరు నిల్వ ఉండకపోవడం వల్ల దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందవని.. రోగాలు ప్రబలకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు నీటిని పీల్చేసుకుని.. ♦సురక్షితమైన ప్రయాణానికి వీలు కల్పించే తారు, సీసీ రోడ్డు మాదిరిగానే ‘పోరస్ ఆస్ఫాల్ట్’ రోడ్డు ఉంటుంది. సాధారణంగా తారు, సీసీ రోడ్లను నాలుగు దశల్లో మట్టి, కంకర, తారు లేదా సిమెంట్ వినియోగించి నిర్మిస్తారు. ఇవి పూర్తిగా గట్టి పొరలా ఉండిపోయి.. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తాయి. ♦‘పోరస్ ఆస్ఫాల్ట్’ పేవ్మెంట్/రోడ్డును 16 దశల్లో వేర్వేరుగా నిర్మిస్తారు. వివిధ పరిమాణాల్లో ఉన్న కంకరను వినియోగిస్తారు. రోడ్డు దృఢంగా ఉంటూనే.. పెద్ద సంఖ్యలో చిన్నచిన్న రంధ్రాలు ఏర్పడేలా చూస్తారు. నీటి ప్రవాహానికి తగినట్టుగా రంధ్రాలు ఉండేలా చూస్తారు. ♦వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు నీటిని పీల్చుకుని భూగర్భంలోకి పంపేస్తాయి. వెంట వెంటనే నీళ్లు ఇంకిపోవడం వల్ల నిల్వ ఉండటం, ముంపునకు కారణం కావడం వంటివి ఉండవు. ♦పట్టణాల్లో ఇలాంటి రోడ్లు/పేవ్మెంట్లను నిర్మించినప్పుడు వాటి దిగువ నుంచి నీళ్లు డ్రైనేజీల్లోకి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తారు. దానితో ఎంతగా వానపడ్డా నీళ్లు నిలవవు. ముంపు నివారణ కోసం.. నిట్ వరంగల్ క్యాంపస్‌లో తొలుత పోరస్ ఆస్ఫాల్ రోడ్డును 50 మీటర్ల మేర ఏర్పాటు చేయనున్నాం. దానిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తాం. గ్రేటర్ వరంగల్‌లో వాన ముంపును నివారించేందుకు ఈ విధానాన్ని అందజేస్తాం. సైడ్ డ్రెయిన్స్ లేని ప్రాంతాల్లో, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. – శంకర్, ప్రొఫెసర్, సివిల్ విభాగం -
12 కిలోల ‘బంగారు’ తీగ
కాజీపేట: వరంగల్ నగరం కాజీపేట 62వ డివిజన్ సోమిడి శివారులోని మాటు చెరువులో 12 కిలోలకు పైగా బరువు ఉన్న బంగారు తీగ చేప దొరికింది. సోమవారం ఉదయం మత్స్యకారులు చేపలు పడుతుండగా అధిక బరువు, కడుపు నిండా చెనతో ఉన్న ఈ బంగారు తీగ వలకు చిక్కింది. ఈ చేపను సంఘం అధ్యక్షుడు రఘురాంతోపాటు సభ్యులు పంచుకున్నారు. ఇంతపెద్ద చేప వలలో పడడం ఇది మొదటిసారి అని మత్స్యకారులు తెలిపారు. -
‘కోచ్’ వచ్చే వరకు కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పెట్టలేమని చెప్పడం ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు మండిపడ్డారు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం రాష్ట్ర పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ వచ్చే వరకూ కొట్లాడుతామని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదాతోపాటు పునర్విభజన చట్టంలోని హామీల అమలులో మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మోదీ ప్రభుత్వ తీరుతో ఊసరవెల్లులు కూడా ఉరేసుకుంటున్నాయి. తెలంగాణను మోసగించడంలో గత పాలకులను మోదీ సర్కార్ మించుతోంది. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 150 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చినా సానుకూలంగా స్పందించడంలేదు’అని విమర్శించారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసమే మహారాష్ట్రలోని లాతూర్కు 2018లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రకటించి రూ.625 కోట్లు విడుదల చేశారని, కేంద్రం చేసిన దగాతో కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూసిన ఈ ప్రాంత యువత ఆశలపై నీళ్లు చల్లారని కేటీఆర్ విమర్శించారు. కేంద్రప్రభుత్వ కుట్రపూరిత విధానాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల సోయి ఉంటే బీజేపీ మంత్రి, ఎంపీలు, నేతలు కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిలదీయాలని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోకుంటే తెలంగాణ ప్రజలే తరిమితరిమి కొడతారు’అని కేటీఆర్ హెచ్చరించారు. -
తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ఇళ్లు సీజ్
సాక్షి, హన్మకొండ(కాజీపేట): ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సూర్యప్రకాష్‌రావు ఇళ్లు, ఆస్పత్రులపై బుధవారం తెల్లవారుజామున సీబీఐ, ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. తెలంగాణలోని హన్మకొండ జిల్లా కాజీపేట రహమత్‌నగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉండే డైరెక్టర్ ఇళ్లపై విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలకు చెందిన సీబీఐ సీఐ ఎ.సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. చదవండి: (కొత్త జిల్లాల్లో మౌలిక వసతులపై కసరత్తు) -
తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అమానుషం.. ఫొటోలు, వీడియోలు తీసి
కాజీపేట: తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని పక్కా ప్లాన్‌తో ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తండ్రి, యువతి బంధువులు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు చేయడంతో ఇరువర్గాలపై కేసు నమోదైంది. బాధితుడి తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ డీజిల్ కాలనీలో కుటుంబంతో అద్దెకు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రసాద్ ఇంటి యజమాని కూతురుతో ప్రేమగా ఉంటున్నాడనే అనుమానంతో గొడవలు జరిగాయి. దీంతో ప్రభుదాస్ కుటుంబం దూరంగా వేరే ఇంటికి మారింది. ఈ క్రమంలో బుధవారం అమ్మాయితో బంధువులు ప్రసాద్‌కు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు. ఇంట్లోకి తీసుకెళ్లి తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసి ప్రసాద్ మిత్రులకు పంపించడంతో విషయం వెలుగు చూసింది. (చదవండి: టోనీ వ్యవహారంలో మనీల్యాండరింగ్) బాధితుడి తండ్రి బంధువులు, మిత్రులతో వెళ్లి ప్రసాద్‌ను విడిచిపెట్టాలని వేడుకోగా మరోమారు అమ్మాయి జోలికి రావొద్దని రాయించుకుని వదిలేశారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా యువకుడితో పాటు అతడి కుటుంబసభ్యులపై అమ్మాయిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్‌రెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరితోపాటు యువకుడిని చితకబాదిన మాచర్ల శేఖర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని.. పలుమార్లు లైంగికదాడి చేసి మోసం..) -
వ్యాగన్ వర్క్‌షాప్ కథ కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వే ప్రాజెక్టు కోసం దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు త్వరలో పట్టాలెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య నెలకొన్న వివాదం సద్దుమణగడం, బడ్జెట్లో నిధులు కేటాయించడంతో.. రైల్వేశాఖ బుధవారం టెండర్లు పిలిచింది. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు. మార్చి మూడో వారంలో టెండర్లు తెరిచి.. నిర్మాణ సంస్థను గుర్తించి, వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు. అప్పటినుంచి ఏడాదిన్నర వ్యవధిలో వర్క్ షాపును పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. రెండు సార్లు మారిపోయి నాలుగు దశాబ్దాల కింద ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ నరసింహారావు విజ్ఞప్తి మేరకు కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేశారు. కానీ తర్వాతి పరిణామాలతో ప్రాజెక్టు పంజాబ్‌కు తరలిపోయింది. దానికి బదులు 2009లో రైలు చక్రాల కర్మాగారాన్ని మంజూరు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిపై కోర్టు కేసులు దాఖలై జాప్యం జరగడంతో.. ఈ ప్రాజెక్టు కూడా వేరే రాష్ట్రానికి తరలిపోయింది. చివరికి 2016లో వ్యాగన్ ఓవర్ హాలింగ్ పీరియాడికల్ వర్క్‌షాప్‌ను కేటాయించారు. ఇటీవలే భూముల కేటాయింపు అంశం ఓ కొలిక్కి రావడంతో పనులు చేపట్టేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ వర్క్‌షాపులో.. సరుకు రవాణా వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేందుకు నిర్ధారిత గడువులో ఓవర్‌హాలింగ్ చేస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. -
మూడు చక్రాలు తిరిగితేనే మూడుపూటలా తినేది.. అంతలోనే మాయదారి రోగం
సాక్షి,కాజీపేట అర్బన్: మూడు చక్రాలు తిరిగితేనే ఆ కుటుంబం మూడుపూటలా కడుపునిండా తినేది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ.. ఆనందంగా గడుపుతున్న చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఆటో నడుపుతూ జీవనం సాగించే వ్యక్తికి రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచిన స్థితిలో పడింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దర్గా కాజీపేటలోని రామాలయం వీధికి చెందిన మునిగాల జాకోబ్ యాదయ్య, నాగమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా, తండ్రి యాదయ్య 2010లో కాలం చేయగా.. చిన్న కుమారుడు మునిగాల సందీప్ తన తండ్రి నుంచి వారసత్వంగా ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. 2014లో ఖమ్మం జిల్లాకు చెందిన సునీతను సందీప్ వివాహం చేసుకున్నాడు. (చదవండి: అడిగే దిక్కెవరు.. ఎక్కడ పడితే అక్కడే కోతలు.. మటన్.. మంచిదేనా? ) 2016లో కుటుంబంలో కిడ్నీ భారం.. ఆనందంగా సాగుతున్న సందీప్ జీవితానికి కిడ్నీ సమస్య శాపంగా మారింది. 2016 మార్చి నెలలో శరీరంలో పలు మార్పులు వస్తుండడంతో సందీప్ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లగా, కిడ్నీలు 70 శాతం మేర శక్తిని కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో నాటి నుంచి రెండు కిడ్నీలకు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఒక రోజు ఆటో.. మరో రోజు డయాలసిస్.. సందీప్ ఆటో నడిపితేనే గాని కుటుంబం గడవని స్థితి. దీనికితోటు డయాలసిస్ తప్పనిసరి. దీంతో ఒక రోజు ఆటోనడపగా వచ్చిన డబ్బులకు తోడు అప్పలు చేసి కుటుంబాన్ని పోషించడంతోపాటు డయాలసిస్ చేయించుకునేవాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రతీసారి డయాలసిస్, మందులకు కలిపి సుమారు రూ.10 నుంచి రూ.15వేల ఖర్చు అవుతుంది. తల్లి నాగమణెమ్మ తెలిసివారి దగ్గర అప్పులు చేస్తూ కొడుకు ఆరోగ్యం బాగుపడాలని ఖర్చు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఒంట్లో సత్తువను కోల్పోయిన సందీప్ ఏడాది నుంచి మంచానికే పరిమితమైపోయాడు. దీంతో భార్య సునీత, తల్లి నాగమణమ్మ సందీప్‌కు మంచంపైనే సపర్యలు చేస్తున్నారు. (చదవండి: Vikarabad: ఇక్కడ డీజిల్ లీటర్ రూ.95, కర్ణాటకలో రూ. 85 ) డిసెంబర్లో కిడ్నీ మార్పిడి సందీప్‌కు రెండు కిడ్నీలు పాడైపోవడంతో తల్లి నాగమణెమ్మ కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు రూ.7 నుంచి రూ.10లక్షల ఖర్చు అవుతుందని, డిసెంబర్లో చేయించుకుంటేనే ఫలితం ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆటో నడిపే పరిస్థితి లేదు.. మరో వైపు అప్పుల భారం.. దిక్కుతోచని స్థితిలో దాతల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. దాతలారా.. స్పందించండి అకౌంట్ నంబర్ 261313898 కొటక్ మహీంద్రబ్యాంక్ కేకేబీకే0000572 వరంగల్ ఫోన్ పే నంబర్ : 70322 22148 చదవండి: Comments On Virat Kohli Daughter: కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు: వైరల్ కావడంతో ఆత్మహత్యకు ప్లాన్! -
మరిన్ని రైళ్లు.. మరింత వేగం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే లైన్ పరంగా అనుసంధానించే అతికీలక గ్రాండ్ ట్రంక్ రూట్లో భాగంగా ఉన్న కాజీపేట–బల్లార్షా మధ్య మూడో రైల్వే లైన్ వేగంగా అందుబాటులోకి వస్తోంది. మార్చి నాటికి ప్రా జెక్టులో సగభాగం అందుబాటులోకి రాబోతోంది. అందులో ఈ నెలాఖరుకు 20 కి.మీ. లైన్ మీదుగా రైళ్లను నడిపేందుకు వీలుగా కొత్త లైన్‌ను పాత ట్రాక్‌తో అనుసంధానించే నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు ప్రారంభించారు. 234 కి.మీ. ప్రాజెక్టులో సగం ప్రాంతం అందుబా టులోకి రావడం పెద్ద ఊరటగా భావించొచ్చు. ఇప్పటికే సామర్థ్యానికి మించి రైళ్లను నడు పుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రమా దాలు జరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి ఇక దూరం కానుంది. దీంతోపాటు మరిన్ని రైళ్లను నడిపేందుకూ వీలు కలుగుతుంది. అన్నింటికి మించి రైళ్ల వేగం కూడా పెరగనుంది. రూ.2,063 కోట్లతో పనులు గ్రాండ్ ట్రంక్ రూట్లో కాజీపేట తర్వాత వచ్చే మహారాష్ట్రలోని బల్లార్షా మీదుగా నిత్యం 300 వరకు రైళ్లు (కోవిడ్‌కు ముందున్న పరిస్థితి) పరుగుపెడుతున్నాయి. ట్రాక్ సామర్థ్యానికి మించి 130 శాతం మేర రైళ్లను నడుపుతున్నారు. పైగా కాజీపేట–బల్లార్షా మధ్య సిమెంటు కర్మాగారాలు, బొగ్గు గనులు భారీగా ఉన్నాయి. రైల్వేకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సిమెంటు, బొగ్గు తరలింపు ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. సాధారణంగా ప్రయాణికుల రైళ్లకు రూట్ క్లియర్ చేసేందుకు సరుకు రవాణా రైళ్లను లూప్‌లైన్లలో ఆపేస్తారు. కానీ ఈ మార్గంలో సరుకు రవాణా రైళ్లకే ప్రయాణికుల రైళ్లకు రెడ్‌సిగ్నల్ ఇచ్చి రూట్ క్లియర్ చేస్తుంటారు. దీంతో 2015–16లో మూడో లైన్ ప్రాజెక్టును రూ.2,063 కోట్లతో ప్రారంభించారు. 235 కి.మీ. నిడివిలో రాఘవాపురం–మందమర్రి మధ్య 34 కి.మీ. మధ్య మూడో లైన్‌ను పూర్తి చేసి గతంలోనే ప్రారంభించారు. రాఘవాపురం–మంచిర్యాల మధ్య ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. రాఘవాపురం–కొలనూరు–పోత్కపల్లి సెక్షన్ల మధ్య 31 కి.మీ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు పనులు పూర్తయిన ప్రాంతాల్లో మూడోలైన్‌ను పాతలైన్లతో అనుసంధానించే నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ప్రారం భించారు. ఇందులో వీరూర్–మాణిక్‌ఘర్ మధ్య నిర్మించిన మూడోలైన్ ఈ నెలాఖరు నుంచి వినియోగంలోకి రానుంది. మూడో లైన్ అందుబాటులోకి వస్తే వెంటనే అదనపు రైళ్లను నడిపేందుకు రైల్వే బోర్డు సిద్ధంగా ఉంది. ఇక ఆదాయాన్ని మరింత పెంచుకునే క్రమంలో సరుకు రవాణాపై అధికంగా దృష్టి సారించిన రైల్వే బోర్డు, మూడో లైన్‌ను గరిష్టస్థాయిలో గూడ్సు రైళ్లకు వినియోగించాలని భావిస్తోంది. అప్పుడు మిగతా రెండు లైన్లపై ప్రయాణికుల రైళ్లు అవాంతరాలు లేకుండా సాఫీగా పరిగెత్తేందుకు మార్గం సుగమమవుతుంది. -
మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్
కాజీపేట అర్బన్(వరంగల్): వరంగల్ ఎల్బీనగర్లో అన్న చాంద్‌పాషా కుటుంబంపై తమ్ముడు షఫీ దాడిచేసి ముగ్గురిని చంపిన విషయం తెలిసిందే. చాంద్‌పాషా కుమార్తెతోపాటు ఖలీల్ పిల్లలు శుక్రవారం సీపీ తరుణ్జోషిని కలిశారు. ( వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి ) మా పిన్ని పాత్ర కూడా ఉంది : చాంద్‌పాషా కుమార్తె రుబీనా మా నాన్న చాంద్‌పాషా, తల్లి సాబీరా, మామయ్య ఖలీల్‌లను మా చిన్నాన్న షఫీ కిరాతకంగా చంపడంలో మా పిన్ని పాత్ర కూడా ఉంటుంది. మా పిన్ని ఓ లేడీ టైగర్‌గా వ్యవహరిస్తుంది. మా ఇద్దరు సోదరులు ఇప్పటికీ ప్రాణాపాయ స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేసి చంపుతారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం, మాకు రక్షణ కల్పించాలని సీపీని వేడుకున్నా. మాకు దిక్కెవరు: ఖలీల్ పిల్లలు మా నాన్నను అతి కిరాతకంగా కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడిచేసి నరికిన షఫీని అదే విధంగా చంపాలి. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు అంటూ వేడుకున్నారు ఖలీల్ పిల్లలు. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్! -
Coronavirus: ఈ మాస్క్ ధర రూ. 12 వేలు
కాజీపేట: కాసులుండాలే గానీ కప్పుకోవడానికి ఎంత ఖరీదైనా మాస్క్ అయినా చెల్లుబాటవుతుంది మరి. ఈ చిత్రంలోని కనిపిస్తున్న మాస్క్ ఖరీదు రూ.12 వేలు. ఈ మాస్క్ కరోనాతో పాటు ఇతర వైరస్‌లను నిర్మూలించడం, బయటి గాలిని శుద్ధి చేసి అందిస్తుందట. మాస్క్లందు ఈ మాస్క్ వేరని గురించి తెలుసుకున్న కాజీపేటకు చెందిన వ్యాపారి ఆకుల నర్సింహారావు ఇటీవలే ఆన్లైన్ ద్వారా దీనిని తెప్పించుకున్నారు. మొదటి వేవ్‌లోనే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన ఇప్పుడు ఈ మాస్క్ లేకుండా బయటకు రావడం లేదు. చదవండి: 26 నుంచి జూడాల సమ్మె! -
ముస్లిం మహిళల మానవత్వం
కాజీపేట: సాధారణంగా ఎవరి అంత్యక్రియలకైనా ముస్లిం మహిళలు బయటకురాకుండా పురుషులే పూర్తిచేస్తారు. కానీ పవిత్ర రంజాన్ మాసంలో ఓ మహిళ అంత్యక్రియలను సహచర మహిళలే ముందుండి పూర్తిచేసి మానవత్వమే గొప్ప అని నిరూపించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో ఉంటున్న ముస్లిం వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన జులేకా (70) ఇటీవల కాజీపేటలో అచేతనంగా పడి ఉండగా సీఐ నరేందర్ ఇచ్చిన సమాచారంతో ఆమెను ఆశ్రమంలో చేర్పించారు. ఇక్కడ వైద్యసాయంతో కోలుకోని వృద్ధురాలు బుధవారం కన్నుమూసింది. ఆమెకు సంబంధించిన వారెవరూ లేకపోవడంతో సహచర ముస్లిం మహిళల సహకారంతో ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబీ సంప్రదాయ పద్ధతిలో ఆమెకు అంతిమ సంస్కారం పూర్తిచేశారు. దీంతో పలువురు యాకూబీని అభినందించారు. -
ఆ జంక్షన్‌కి కొత్త మహిళా అసిస్టెంట్ లోకోపైలెట్లు..
సాక్షి, కాజీపేట: కాజీపేట రూరల్ జంక్షన్‌లోని రైల్వే డ్రైవర్ల కార్యలయం కేంద్రంగా శిక్షణ పొందిన మహిళా అసిస్టెంట్ లోకోపైలేట్లు విధుల్లో చేరారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఈ ఆరుగురు మహిళా లోకో పైలేట్లకు కాజీపేట- డోర్నకల్ సెక్షన్లో అప్ అండ్ డౌన్ రూట్లలో గూడ్స్ రైళ్ల విధులు కేటాయించారు. కాగా, ఆర్ఆర్బీ ద్వారా నియామకమైన మరో నలుగురు మహిళ అసిస్టేంట్ లోకోపైలేట్లను కాజీపేటకు కేటాయించారు. వీరు కూడా ఇక్కడ శిక్షణ పొందాక విధుల్లో చేరనున్నారు. -
అనాథకు తలకొరివి పెట్టిన ముస్లిం మహిళ
కాజీపేట: బంధుమిత్రుల నిరాదరణకు గురై అనాథ ఆశ్రమంలో ఉంటూ బతుకు వెళ్లదీస్తున్న ఓ వృద్ధుడు శుక్రవారం గుండెపోటుతో తనువు చాలించాడు. దీంతో సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్‌బీ కట్టుబాట్లను పక్కనబెట్టి తలకొరివి పెట్టింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన కోమాండ్ల వీరస్వామి, శోభ దంపతులు. వీరికి పిల్లలతో పాటు ఆస్తిపాస్తులు లేవు. ఈ క్రమంలో జీవిత చరమాంకంలోకి అడుగిడిన ఈ దంపతుల దీనగాథను 2017లో ‘సాక్షి’వెలుగులోకి తీసుకురాగా, కాజీపేటలోని సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబ్‌బీ, చోటు దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఇందులో వీరస్వామి శుక్రవారం మృతి చెందగా.. యాకూబ్‌బీ హిందూ సాంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహించింది. చదవండి: ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి.. బాలికకు కరోనా తెచ్చిన కష్టం! -
పని చేయాలని చెప్పడమే పాపమైంది..
సాక్షి,కాజీపేట: ఏ పని చేయకుండా తల్లిపై ఆధారపడడం సరికాదని, కుటుంబ పోషణకు ఏదో పనిలో కుదురుకోవాలని నచ్చచెప్పేందుకు యత్నించిన మహిళ తీరు ఆమె భర్తకు నచ్చలేదు. దీంతో కోపం పెంచుకున్న ఆయన భార్య గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు దూరం కావాలి్సన పరిస్థితి నెలకొంది. కాజీపేటలోని రైల్వే క్వార్టర్స్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాజీపేటలోని రైల్వే క్వార్టర్స్‌లో తల్లితో కలిసి ఉండే మేకల శ్రీనివాస్‌కు ఎనిమిదేళ్ల క్రితం ధర్మసాగర్ మండలం మల్లక్పెల్లి గ్రామానికి చెందిన రమాదేవి(28)తో వివాహం జరిగింది. తల్లి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె సంపాదనపైనే ఆధారపడిన శ్రీనివాస్ ఏ పని చేయడం లేదు. ఇద్దరు పిల్లలు పెరుగుతున్నందున పని చేయకపోతే ఎలా అని భార్య, తల్లి అడిగినప్పుడు రెండు రోజులు ఆటో నడపడం మళ్లీ యథావిధిగా మద్యం మత్తులో తూలుతుండడం పరిపాటిగా మారింది. నిత్యం తల్లిని బెదిరిస్తూ డబ్బు తీసుకుని తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్ తల్లి విధులకు వెళ్లాక ఇంటికి వచ్చిన శ్రీనివాస్ పిల్లలను ట్యూషన్‌కు పంపించాడు. ఆ తర్వాత మళ్లీ భార్యతో గొడవ జరగగా ఆవేశానికి లోనైన శ్రీనివాస్ తన వద్ద ఉన్న కత్తితో రమాదేవి గొంతు కోశాడు. తప్పించుకునే క్రమంలో ఆమె కేకలు వేస్తూ ఇంటి బయటకు పరుగెత్తుతూ వచ్చి పడిపోయింది. స్థానికులు చేరుకునే లోగా బాగా రక్తస్రావం కావడంతో రమాదేవి మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు శ్రీనివాస్ పారిపోగా, డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ సీఐ రావుల నరేందర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కాగా, తల్లి రక్తపు మడుగులో పడి ఉండడం, తండ్రి కానరాకుండా పోవడంతో ఏడు, ఐదేళ్ల వారి కుమారులు సాత్విక్, రిత్విక్ రోదిస్తున్నతీరు స్థానికులను కంట తడి పెట్టించింది. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాంరాం!
సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో పరోక్షంగా స్పష్టతనిచ్చారు. విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చిన వారు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారా.. ఏ రకంగా ఈ అంశాన్ని చేర్చారనేది వారినే అడగాలని సూచించారు. బుధవారం రాజ్యసభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అంతకుముందు చర్చలో భాగంగా మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి అనేకసార్లు వినతి పత్రాలు అందించామని రైల్వే శాఖ మంత్రికి గుర్తుచేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన డబ్బును అవసరమున్న చోట వెచ్చించాలే తప్ప అనవసరంగా వృథా చేయొద్దని రైల్వే మంత్రి పేర్కొన్నారు. కోచ్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఇప్పుడు దేశంలో పూర్తిస్థాయిలో ఉన్నాయని తెలిపారు. భారీగా పెరిగిన ఎల్‌హెచ్‌పీ కోచ్‌లు 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రైల్వే శాఖలో నాణ్యమైన ఎల్‌హెచ్‌పీ కోచ్‌ల సంఖ్య 2,500 కంటే తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 25 వేలకు చేర్చామని చెప్పారు. 2018లో తమ ప్రభుత్వం ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని పూర్తిగా నిలిపేసిందని పేర్కొన్నారు. 2014 వరకు రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క కోచ్‌ను కూడా తయారు చేయలేదని, 2018లో ప్రధాని నరేంద్రమోదీ కోచ్ ఫ్యాక్టరీ పర్యటన తర్వాత కోచ్‌లు రెట్టింపు స్థాయిలో సిద్ధమవుతున్నాయని తెలిపారు. -
క్రికెట్లో ఘర్షణ.. కర్రలతో దాడి
సాక్షి, వరంగల్ : క్రికెట్ మ్యాచ్ కోసం ఒకచోటకు చేరిన యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. కాజీపేట పట్ణణంలో క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కర్రలు, వికెట్లతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ముగ్గరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. ఇంతమంది ఒకచోట చేరి క్రికెట్ ఆడుతున్నా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. (చదవండి : రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల) -
కాజీపేట జంక్షన్లో క్వారంటైన్ రైలు
కాజీపేట రూరల్ : కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందజేసేందుకు రైల్వే శాఖ అధికారులు రైళ్లనే క్వారంటైన్ కేంద్రాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే 10 బోగీలతో సిద్ధమైన ప్రత్యేక రైలును సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు శనివారం తీసుకొచ్చారు. ఈ రైలులో ఒక్కో బోగీలో ఎనిమిది క్యాబిన్లు, క్యాబిన్‌కు మూడు పడకలు సిద్ధం చేశారు. రైలు మొత్తంగా 240 బెడ్లు ఉండగా.. ప్రతీ బెడ్ వద్ద వెంటిలేటర్ ఇత్యాది సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఇక బోగీ కిటికీల ద్వారా దోమలు రాకుండా జాలీ బిగించారు. అవసరమైతే కాజీపేట జంక్షన్ నుంచి డోర్నకల్ జంక్షన్‌కు కూడా వెళ్లి అక్కడ అవసరమైన వారికి క్వారంటైన్లో చికిత్స అందజేస్తామని తెలిపారు. -
కరోనా వైరస్‌పై నిట్ ప్రొఫెసర్ల పరిశోధన
కాజీపేట అర్బన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్19) తీరుతెన్నులను కనుగొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలకు వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్ బయో టెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ సౌమ్యలిప్సా రాత్, డాక్టర్ కిషాంత్‌కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సౌమ్య, కిషాంత్ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘అమెరికాకు చెందిన కంప్యూటింగ్ కన్సార్టియం సంస్థ అంతర్జాతీయ స్థాయిలో కరోనాపై పరిశోధనలు చేపట్టేందుకు వారం క్రితం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థకు మా ఆలోచనలపై పరిశోధనా పత్రం సమర్పించాం. ఆ సంస్థ మా పత్రాలను ఎంపిక చేసింది’అని తెలిపారు. అమెరికాకు చెందిన కంప్యూటింగ్ కన్సార్టియం సంస్థ కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసేందుకు అనువుగా ల్యాబ్‌లు ఉన్న నాసా, ఐబీఎం, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, ఎంఐటీ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఈ మేరకు ఆన్లైన్లోనే పరిశోధనలు చేయాల్సి ఉండగా నిట్ ప్రొఫెసర్లు శనివారం తమ ప్రాజెక్టును ప్రారంభించారు. వివిధ ఉష్ణోగ్రతల్లో వైరస్ ప్రభావం, దానిని అంతం చేసే అవకాశాలపై పరిశోధనలు చేశాక వ్యాక్సిన్ రూపొందించేందుకు అవకాశాలు సులువవుతాయి. ఏడాది పాటు ఈ పరిశోధనలు కొనసాగుతాయి. -
కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అనుసరించి కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన పార్లమెంటు ఆవరణ లో మీడియాతో మాట్లాడారు. రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించినట్టు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఏదైనా ఇబ్బందులుంటే స్పష్టత ఇవ్వా లని, కనీసం పీపీపీ పద్ధతిలోనైనా కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని వివరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహ దారి వెంట రైల్వే లైన్ వేస్తే ప్రయాణ సమయం చాలా తగ్గుతుందని పేర్కొన్నారు. రెండు రాజ ధానుల మధ్య హై స్పీడ్ ట్రైన్ వేస్తే 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చని పేర్కొన్నారు. -
పిల్లలు కలగలేదా.. మేం ఆయుర్వేద వైద్యులం..
కడప, ఖాజీపేట : మీకు పెళ్లయి చాలా కాలం అయిందా.. మీకు పిల్లలు కలగలేదా.. సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారా.. అయితే మేం కేరళ ఆయుర్వేద వైద్యులం.. మా దగ్గర ఉన్న ఆయుర్వేద మందులు వాడండి 3 నెలల్లో మీకు సంతానం కలుగుతుంది.. అంటూ మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకెళ్లే మోసగాళ్లు జిల్లాలో సంచరిస్తున్నారు. తాజాగా ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన సురేష్, శాంతిలత దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరన్న విషయం గ్రామస్తుల ద్వారా నకిలీ వైద్యులు తెలుసుకున్నారు. వెంటనే వారి ఇంటి వద్దకు వెళ్లారు. సురేష్ దంపతులతో హర్ష అనే పేరు గల వ్యక్తి తాము కేరళకు చెందిన ఆయుర్వేద వైద్యులమని, తమ వద్ద మంచి ఆయుర్వేద మందులు ఉన్నాయని, తమకు కడప, తిరుపతి ఇలా చాలా చోట్ల బ్రాంచ్‌లు ఉన్నాయని చెప్పారు. కొత్తగా కడపలో బ్రాంచ్ ప్రారంభించినందున ప్రచారం కోసం ఇలా గ్రామాలకు వచ్చామన్నారు. తాము చాలా మందికి మందులు ఇచ్చామని, అందరికి సంతానం కలిగిందని చెప్పారు. తమకు ఇప్పుడే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, సంతానం కలిగిన తరువాత పూర్తి డబ్బు ఇవ్వొచ్చు అంటూ వారితో మాట్లాడి నమ్మకం కలిగేలా చేశాడు. అలా వారికి నమ్మకం కలిగించిన తరువాత ఇంటిలోకి తీసుకు వెళ్లి గర్భ పరీక్షలు అంటూ కడుపు వద్ద ఏదో మిషన్ ఉంచి పరీక్షలు చేశాడు. తరువాత మీరు ఇద్దరు ఈ రెండు మాత్రలు వేసుకోండి అంటూ ఇచ్చాడు. ఈలోగా వారికి కొద్దిగా మత్తుగా ఉన్నట్లు అనిపించింది. ఇంతలో మందులు కావాలంటే సుమారు రూ.40వేలు అవుతుంది ఇప్పుడు రూ.20 వేలు ఇవ్వండి మిగిలింది సంతానం కలిగిన తరువాత ఇవ్వండి అని చెప్పాడు. వెంటనే బాధితులు సంతానం పై ఉన్న మమకారంతో వారి వద్ద ఉన్న రూ.20వేలు ఇచ్చారు. మీ వద్ద పట్టుచీరలు ఉంటే ఇవ్వండి వాటికి ఆయుర్వేద మందులు పట్టించి చర్చిలో ప్రార్థనలు చేసి ఇస్తాం అంటూ అడిగాడు. దీంతో వారు రెండు విలువైన పట్టుచీరలు ఇచ్చారు. ఈ క్రమంలోనే దంపతులు ఇద్దరు మత్తులోకి వెళ్లారు. వెంటనే అక్కడ నుంచి హర్ష అనే నకిలీ ఆయుర్వేద వైద్యుడు బయటకు వచ్చి బయట ద్విచక్ర వాహనంలో తనకోసం వేచి ఉన్న వ్యక్తి సహాయంతో అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మత్తు నుంచి తేరుకుని నకిలీ వైద్యుని చేతిలో మోసపోయామని గ్రహించిన బాధితులు ఖాజీపేట పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అక్కడ సరైన రీతిలో వారికి సమాధానం రాక పోవడం, కేసు విషయంలో పోలీసులు స్పందించకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. తాము ఇచ్చిన పట్టు చీరల ఆధారంగా ఏదైనా చేతబడి చేస్తారేమో భయంతో వారు మంగళవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తమలాగా ఎవరూ మోసపోకూడదని, ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే తాము ఫిర్యాదు చేశామని వారు పేర్కొన్నారు. -
మందుబాబుల వీరంగం... పోలీసుల పై దాడి
సాక్షి, కాజీపేట అర్బన్: మద్యం మత్తులో పోలీసులపై మందు బాబులు తిరగబడి, దాడికి పాల్పడిన సంఘటన శనివారం ఉర్సు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ ఎస్సై భీమేష్ కథనం ప్రకారం.. కరీమాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉర్సుగుట్ట ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తుండగా విధులు నిర్వహిస్తున్న బ్లూకోడ్స్ సిబ్బంది మద్యం సేవిస్తున్న యువకులను బహిరంగ మద్యం సేవించకూడదని వారించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు. కాగా, ఘటన స్థలానికి ఇంటర్‌సెప్టర్ వాహనంలో పోలీసులు చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువకులపై బహిరంగ మద్యం సేవిస్తున్న కేసు, విధుల్లో ఉన్న పోలీసుల అధికారుల విధులకు బంగం కలిగించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
వివాహేతర సంబంధంపై అనుమానంతో..
కాజీపేట: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కుటుంబానికి చెందిన సభ్యులు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఆదివారం తెల్లవారుజామున వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పట్టణం బాపూజీనగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన పరుమాండ్ల రామనాథం బతుకుదెరువు కోసం 12 ఏళ్ల క్రితం కాజీపేట పట్టణానికి కుటుంబంతో వచ్చి పరుపులు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. చిన్నకోడెపాకకే చెందిన పరుమాండ్ల భిక్షపతి (45) భార్య కొద్దికాలం క్రితం మరణించడంతో హన్మకొండకు వచ్చి ఓ హోటల్లో పనిచేస్తూ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో భిక్షపతి తరచూ రామనాథం ఇంటికి వస్తుండేవాడు. అయితే వివాహేతర సంబంధం అనుమానాల కారణంగా రెండు కుటుంబాల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. తమ ఇంటికి రావడం మానుకోవాలని రామనాథం కుటుంబం పలుమార్లు హెచ్చరించినా భిక్షపతి పట్టించుకోలేదు. రామ నాథం కుటుంబంలో కలహాలు పెరగడంతో అతను ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి రామనాథం ఇంటికి వచ్చిన భిక్షపతిని అతని కుటుంబ సభ్యులు బంధించి కర్రలు, కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి çస్పృహ తప్పి పడిపోయాడు. వారు 100 నంబర్‌కు డయల్ చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీయగా.. భవనం పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా çస్పృహలోకి వచ్చిన భిక్షపతి తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించినట్లు పోలీసులకు చెప్పాడు. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. -
రిజర్వాయర్‌లో యువతి మృతదేహం
సాక్షి, కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి రిజర్వాయర్‌లో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం నీటిపై యువతి మృతదేహం తేలియాడుతోందని స్థానికులు అందించిన సమాచారం మేరకు ఏసీపీ రవీంద్రకుమార్, సిబ్బంది చేరుకుని బయటకు తీయిం చారు. బూడిద రంగు టాప్, తెలుపు రంగు ప్యాంటు ధరించిన ఆమె కుడి చేతికి ఎరుపు దారం, చెవికి కమ్మల బుట్టలు, ముత్యంతో కూడిన ముక్కు పుల్ల ధరించి ఉందని తెలిపారు. చెప్పులు రిజర్వాయర్ కట్టపై ఉండటంతో ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేసి వేశారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యువతి వివరాలు తెలిసిన వారు 94910 89128, 94407 95212, 94407 00506 నంబర్లకు ఫోన్ చేయాలని ఏసీపీ కోరారు. -
ప్లాస్టిక్ బాటిల్ వేస్తే ముక్కలే
సాక్షి, కాజీపేట : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ మేరకు కేంద్రప్రభుత్వం రైల్వే స్టేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రైల్, స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ను క్రమక్రమంగా నిర్మూలించేందుకు కృషి జరుగుతోంది. ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్పరిణామాలు, నష్టాల గురించి విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో ఇటీవల ‘బాటిల్ క్రషింగ్ మిషన్’లను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ఈ మిషన్లు పని చేస్తాయి. అలవాటు చేసేందుకు.. రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన యంత్రాల వాడకాన్ని ప్రయాణికులకు అలవాటు చేసేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. పూణే రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన ఈ యంత్రంలో బాటిల్ వేసినట్లయితే పేటీఎం ద్వారా రూ.5 జమ అవుతున్నాయి. ఇదే విధాన్ని అన్ని స్టేషన్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ వల్ల అనర్థాలపై ప్రజలకు అవగాహన కలుగుతున్నందున చాలా మంది రైల్వే స్టేషన్లలోని యంత్రాల్లో ఈ బాటిళ్లు వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడే.. నిత్యం రైళ్ల ద్వారా వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో తాము నీళ్లు తాగిన ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారు. దీంతో చెత్త గుట్టలుగా పేరుకుపోతుంది. దీనిని నివారించేందుకు రైల్వే స్టేషన్లలో బాటిల్ క్రషింగ్ యంత్రాలు ఏర్పాటుచేశారు. ఎవరైనా తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్‌ను ఇందులో వేస్తే బాటిల్ చూరచూర అవుతుంది. తద్వారా చెత్త పేరుకుపోదని భావిస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు, గ్లాస్లు, ప్లేట్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఈ యంత్రంలో వేస్తే కింది భాగానికి చేరి చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలుగా మారుతోంది. ఆ ముక్కలను ప్లాస్టిక్ వ్యర్థాలు కరగదీసే ఫ్యాక్టరీకి పంపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బాటిల్ క్రషింగ్ యంత్రాలకు ఏర్పాటుచేసిన స్క్రీన్ ద్వారా ప్లాస్టిక్ వల్ల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ స్క్రీన్‌పై ఆడియో, వీడియో చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. ప్లాస్టిక్ వస్తువులను ఏ విధంగా వేయాలి, వేసిన ప్లాస్టిక్ వస్తువులు ఏమైవుతున్నాయి, ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల వచ్చే అనర్థాలు, ప్లాస్టిక్‌తో దేశ భవిష్యత్‌కు ఉన్న ముప్పు వివరాలను ఇంగ్లిష్ భాషలో వివరిస్తుంటారు. -
చనిపోతే అరిష్టమని..
కాజీపేట: తన ఇంట్లో అద్దెకు ఉన్న ఓ వృద్ధురాలు చనిపోతే అరిష్టమని భావించి ఓ యజమానురాలు బయటకు గెంటేసింది. తీవ్ర ఒత్తిడికి గురైన వృద్దురాలు రోడ్డుపైనే తనువు చాలించింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రసూల్‌బీ (67) కొన్నేళ్లుగా పెద్దపెండ్యాలలోని అద్దె ఇంట్లో ఉంటోంది. వారం క్రితం అస్వస్థతకు గురైన ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయితే ఇంట్లో చనిపోతే అరిష్టంగా భావించిన ఇంటి యజమానురాలు.. రసూల్‌బీని మంచంతో సహా బయట పడేసింది. ఈ విషయం తెలుసుకున్న సహృదయ ఆశ్రమ నిర్వాహకులు యాఖూబీ, ఛోటులు వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడానికి అంబులెన్స్‌ను సిద్ధం చేస్తున్న క్రమంలో రసూల్‌బీ తుది శ్వాస విడిచింది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాహకురాలు తెలిపారు. -
ఆ మృతదేహం ఎవరిది..?
సాక్షి, వరంగల్ : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో గత నెల 15న చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో ఆదివారం మరో తల లేని మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఆ మృతదేహానికి రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి బంధువులకు అప్పగించనున్నట్లు తెలిసింది. అయితే కాజీపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన 14 మంది గత నెల 14న పాపికొండల టూర్ నిమిత్తం బయలుదేరి 15న జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న విషయం విధితమే. ఘటనలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఐదుగురు సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఆదివారం లభించిన తల లేని మొండెం ఎవరిదనే ఉత్కంఠ కడిపికొండకు చెందిన ఆచూకి లభించని మూడు కుటుంబాల్లో నెలకొంది. -
కత్తులతో ఒకరిపై ఒకరు దాడి
సాక్షి, కాజీపేట : పాత గొడవలను మనసులో పెట్టుకుని ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒక్కరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాజీపేట పట్టణం బాపూజీనగర్ ప్రాంతంలో అడ్డాను ఏర్పాటు చేసుకుని ఆటో యూనియన్ నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీజిల్‌కాలనీకి చెందిన బబ్లూ, ఎర్ర రాజేష్ రెండు వర్గాలుగా విడిపోయి పోటీపడ్డారు. ఎన్నికలు సజావుగా ముగిసినప్పటికీ వీరి మధ్య ఏర్పడిన మనస్పర్ధలు పెరుగుతూ వస్తున్నాయి. వారం రోజుల్లో బబ్లూ, రాజేష్‌లు రెండుసార్లు ఘర్షణలు పడ్డారు. మంగళవారం సాయంత్రం అడ్డాపై ఉన్న రాజేష్‌పై బబ్లూ దాడి చేయడంతో ఘర్షణ పడ్డారు. దీంతో ఇద్దరికీ గాయాలు కాగా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరినీ ఆస్పత్రికి పంపించి పోలీసులు ఘటన విషయమై విచారిస్తున్నారు. -
అందరూ ఉన్న అనాథ
కాజీపేట: బతికి ఉండగా కన్నతల్లికి పిడికెడు అన్నం పెట్టకుండా రోడ్డున పడేసి అనాథ ఆశ్రమం పాల్జేశాడు ఓ కొడుకు. తల్లి మరణించిందని తెలిసినా కడసారి చూడటానికి సైతం రాకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులే దహన సంస్కారాలు నిర్వహించిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన శ్యామలయ్య (72)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత భర్త చనిపోవడంతో శ్యామలమ్మ ఒంటరిగా మిగిలింది. కొడుకు తల్లికి పిడికెడు అన్నం పెట్టకపోవడంతో పస్తులు ఉండాల్సి వచ్చేది. వృద్ధురాలు పడుతున్న బాధను చూడలేక స్థానికులు గత ఏడాది జూన్‌లో ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ ఆశ్రమ నిర్వాహకులు ఛోటు, యాకుబీ శ్యామలమ్మను ఆశ్రమానికి తరలించారు. అప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉన్న ఆమె.. బుధవారం అస్వస్థతకు గురై మరణించింది. ఆరీ్టసీలో ఉద్యోగం చేస్తున్న కుమారుడు వెంకటేశ్వర్లుకు తల్లి మరణించిన విషయం చెప్పినా రాలేదు. దీంతో నిర్వాహకుల కూతురు ఆఫ్రీన్ పర్వేజ్ దహన సంస్కారాలు నిర్వహించారు. -
ఆ ఐదు రోజులు మరచిపోలేను..
కాజీపేట అర్బన్ : జిల్లాలోని కాజీపేట మండలంలోని కడిపికొండ, న్యూశాయంపేటకు చెందిన 14 మందితోపాటు జనగామ జిల్లా చిన్న పెండ్యాలకు చెందిన ఓ యువకుడు మొత్తం పదిహేను మంది పాపికొండల విహార యాత్ర కు వెళ్లి అక్కడ బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు సురక్షితంగా బయటపడగా.. మిగతా వారు గల్లంతయ్యారు. ఆ తర్వాత గాలింపుల్లో ఏడుగురి మృతదేహాలు లభించినా ఇంకా ముగ్గురి ఆచూకీ తేలలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్లిన బృందంలో కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఉన్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉన్న అధికారుల బృందం మృతదేహాల ఆచూకీ కోసం జరిగిన గాలింపు చర్యల్లో పాల్గొనడంతో పాటు బాధిత కుటుంబాలకు సమచారం ఇస్తూ, ఓదార్చారు. ఇటీవలే రాజమండ్రి నుంచి వచ్చిన ఆయన అక్కడి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు తహసీల్దార్ మాటల్లోనే... హుటాహుటిన సంఘటనా స్థలానికి.. పాపికొండలు టూర్‌కు వెళ్లిన జిల్లా వాసులు తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపాన గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో చిక్కుకున్నారు. ఈ ఘ టన గత ఆదివారం(ఈనెల 15వ తేదీన) మ ధ్యాహ్నం 1.15 గంటలకు జరిగింది. ఈ మేరకు సమాచారం మాకు సాయంత్రం 4 గంటలకు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక వాహనంలో కాజీపేట ఇన్స్పెక్టర్ సీహెచ్.అజయ్, ఆర్ఐ సురేందర్, వీఆర్వో జోసెఫ్‌తో కలిసి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట నుండి బయలుదేరాం. సుమారు 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు రాజమండ్రికి చేరుకున్నాం. త్వరగా వెళ్లాలనే తపనతో కేవలం ఒంటి మీద బట్టలతోనే వెళ్లాం. అక్కడకు వెళ్లాకే మా అవసరాలు గుర్తుకొచ్చాయి. దుస్తులు, సబ్బులు, టూత్‌పేస్ట్ తదితర వస్తువులన్నీ అక్కడే కొనుగోలు చేశాం. మంత్రులు, ఎమ్మెల్యేల ఏరియల్ సర్వే కచ్చులూరు సమీపంలో బోటు బోల్తా పడగా తె లంగాణ వాసులు చిక్కుకున్నారని తెలియగానే రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పు వ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూరి ద యాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా వచ్చారు. అక్కడ ఘటనా స్థలం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులకు భరోసానందిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. బాధిత కుటుంబీకులకు సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి వెనక్కి.. ప్రమాదంలో గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ గురు, శుక్రవారం వరకు కూడా లభించలేదు. దీంతో ఇక్కడి మండల ప్రజలకు సేవలందించడంలో అవాంతరాలు ఎదురుకాకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి బయలుదేరాం. శనివారం ఇక్కడకు చేరుకున్నాం. మరిచిపోలేని ఘటన కలెక్టర్ ఆదేశాలతో రాజమండ్రికి వెళ్లిన మేం గత సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు సంఘటన స్ధలానికి దగ్గరలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో సేవలందించాం. ఓ పక్క సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బాధితులకు సమాచారం ఇచ్చాం. మృతదేహాలను ఘటనా స్థలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం బ్యారేజి, 120 కిలోమీటర్ల దూరంలోని యానాంలో రెస్క్యూటీం బృందాలు గుర్తించాయి. ఆ వెంటనే మృతులు బంధువులతో మాట్లాడడంతో పాటు ఆధార్‌కార్డు, బోటులో ప్రయాణం ప్రారంభించే సమయంలో దిగిన సెల్ఫీలతో గుర్తుపట్టేందుకు బయలుదేరాం. ఆ సమయంలో బంధువుల ఆర్తనాదాలు, మావారి ఆచూకీ చెప్పండయ్యా అంటూ కాళ్ల మీద పడి రోదిస్తుండడం కలిచివేసింది. మృతదేహాలను గుర్తుపట్టాక బంధువులు రోదించిన తీరు మాకు కూడా కన్నీళ్లు తెప్పించింది. ఆ ఐదు రోజులు తిండి సైతం మరిచిపోయి బాధితుల కోసం పడిన కష్టం మరిచిపోలేను. ఇదంతా జరిగిన పది రోజులు కావొస్తున్నా బాధితుల ఆర్తనాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నా బ్యాచ్‌మేట్ సహకారంతో.... నేను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లగా రాజమండ్రి అర్బన్ తహసీల్దార్‌గా నా స్నేహితుడు సుస్వాగత్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయనే మాకు బస ఏర్పాటుచేశాడు. అలాగే, అక్కడికి వచ్చిన బాధితుల బంధువులకు రాజమండ్రిలోని రత్న హోటల్లో వసతి ఏర్పాటు చేసి అన్ని విధాలా సహకరించాడు. కాగా, నేను తహసీల్దార్‌గా ఆరేళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తున్నాను. నా పరిధిలోని ఒకే గ్రామానికి చెందిన 14 మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఎప్పుడూ జరగలేదు. 14 మంది వివరాలు పంపించాం.. ప్రమాదం జరిగిన రోజు బోటులో ప్రయాణించిన కడిపికొండ, న్యూశాయంపేట, చిన్నపెండ్యాలకు చెందిన 14 మంది బాధితులు, మృతులు, ఆచూకీ లభించని వారి పూర్తి వివరాలను రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మంగళవారం పంపించాం. అలాగే, వారి బంధువుల వివరాలు, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్ల వివరాలను సమర్పించాం. ఆ వివరాల ఆధారంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం అందనుంది. -
కొండంత విషాదం
సాక్షి, కాజీపేట : వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ.. ఈ గ్రామానికి చెందిన పలువురు ఆరోగ్యం కోసం వాకింగ్ చేయడం వారికి అలవాటుగా మార్చుకున్నారు. ఈ బృందంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు చిరుద్యోగులు, చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు, టీఆర్ఎస్ నాయకులతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. వాకింగ్ చేసే క్రమంలో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారింది. వయస్సు బేధాలు మరిచిపోయి మంచీచెడ్డా మాట్లాడుతూ గ్రామ సమస్యలపై చర్చించే వారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కూడా ఆనవాయితీ. ఇదేక్రమంలో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆ యాత్రే వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుందని వారికి తెలియదు. గోదావరి జలాల్లో బోటుపై పయనిస్తూ ఆనందంగా గడపాలని భావించి పాపికొండలు చూడాలని బయలుదేరారు. కానీ వారి ప్రయాణం గమ్యాన్ని చేరలేదు. కడిపికొండ నుంచి 14 మంది విహారయాత్రకు వెళ్లగా.. అక్కడ తూర్పుగోదావరి జిల్లా తూర్పు దేవిపట్నం మండలం కచ్చలూరు సమీపంలో గోదావరి నదిలో బోట్ బోల్తా పడగా ఐదుగురే సురక్షితంగా బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది గల్లంతు కాగా, ఇద్దరు మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కడిపికొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురక్షితంగా బయటపడిన ఐదుగురు... 9 మంది గల్లంతు గోదావరిలో బోటు మునిగిపోవడంతో కడిపికొండ నుంచి 14 మందిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా తొమ్మిది మాత్రం గల్లంతైనట్లు ఇక్కడకు సమాచారం అందింది. సురక్షితంగా బయటపడిన వారిలో బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, ఆరెపల్లి యాదగిరి, దర్శనాల సురేష్, గొర్రె ప్రభాకర్ ఉన్నారు. ఆరు గంటల బోటు ప్రయాణం సుమారు ఆరుగంటల పాటు కొనసాగే బోటు ప్రయాణంలో నాలుగు గంటల పాటు ఆహ్లాదంగా గడిచింది. ఇంతలోనే గోదావరి ఒక్క సారిగా ఉగ్రరూపం దాల్చింది, దీంతో కచ్చలూరు వద్ద బోటు నీట మునిగింది. ఆ సమయాన లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాసింత ఏమరుపాటు.. ఇంకొద్ది జాప్యంతో లైఫ్ జాకెట్లు ధరించని 9 మంది గల్లంతయ్యారు. ఆరు గంటల విహార యాత్రలో నాలుగు గంటలు ముగియగా.. మరో రెండు గంటల మిగిలిన ఉండగానే ఆనందంగా గడుపుతున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. కుటుంబాల్లో అంతులేని ఆవేదన సంతోషంగా పాపికొండలు విహారయాత్రకు వెళ్లగా బోటు మునిగిపోయిన ఘటనలో గల్లంతైన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అందరూ పేద కుటుంబాల వారే కావడం.. వారి కుటుంబీకులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. గల్లంతైన వారిలో ఎక్కువ మంది రెక్కల కష్టం మీద బతుకుబండిని లాగుతున్న వారే ఉన్నారు. వీరంతా కుటుంబాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుండడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పెయింటర్లుగా, కూలీలుగా, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పని చేస్తున్న వారు కూడా ఉంవడడం గమనార్హం. భగవంతుడికి కోటి దండాలు గోదావరి నదిలో బోటు బోల్తా పడి తమ వారు గల్లంతైనట్లు గెలియగానే బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ‘భగవంతుడా మావోళ్లు సురక్షితంగా బయటపడేలా చూడు’ అంటూ కోటి దండాలు పెడుతున్నారు. పరామర్శించేందుకు వచ్చిన వారిని సైతం వివరాలు అడుగుతున్నారు. ఇద్దరు మృతి... గోదావరిలో గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందింది. పెయింటర్‌గా జీవనం కొనసాగిస్తున్న బస్కే రాజేందర్(42), డిగ్రీ చదువుతున్న విద్యార్ధి బస్కే అవినాష్(21) మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయని చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే.. అంతసేపు తమ వారు సురక్షితంగా బయటపడుతారనే భావనతో ఉన్న కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. పది రోజుల క్రితమే ప్రణాళిక పాపికొండలు టూర్‌కు వెళ్లాలని కడిపికొండ వాసులు పది రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని పత్రికలు, ఛానళ్ల ద్వారా తెలియడంతో వెనుకడుగు వేశారు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయనే సమాచారం అందడంతో బయలుదేరిన వారు ప్రమాదంలో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి మంత్రి, ఎమ్మెల్యే గోదావరిలో బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘటనా స్థలానికి బయలుదేరారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కూడా వెళ్లారు. విహారయాత్రకు 14 మంది... కడిపికొండ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు కలిపి వాకింగ్ చేస్తుంటారు. వీరిలో ఎస్సీలైన పలువురు మాదిగ మహరాజ కుల సంక్షేమ సంఘంగా ఏర్పడ్డారు. ఇందులో నుంచి 14 మంది పాపికొండలు చూడాలని గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట నుంచి బయలుదేరారు. శుక్రవారం రాత్రి బయలుదేరిన వారు శనివారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ స్థానికంగా గోదావరి బ్రిడ్జి, కాటన్ మ్యూజియం ఇతరత్రా సందర్శనీయ ప్రదేశాలు చూడాక బస చేశారు. ఆదివారం ఉదయం బోటులో పాపికొండలు సందర్శనకు బయలుదేరారు. పాపికొండలు చూస్తూ భద్రాచలం వెళ్లి రామయ్యను దర్శించుకోవాలనేది ప్రణాళిక. అయితే, మధ్యలోనే బోటు మునిగిపోవడం గమనార్హం. కాపాడిన లైఫ్ జాకెట్లు కడిపికొండ వాసుల్లో ఐదుగురు సురక్షితంగా బయటపడడానికి లైఫ్ జాకెట్లే కారణమయ్యాయి. బోట్ ఎక్కగానే లాంచీ నిర్వాహకులు ఇచ్చిన లైఫ్ జాకెట్లను వెంటనే బస్కే దశరధం, బస్కే వెంకటస్వామి, దర్శనాల సురేష్, గొర్రె ప్రభాకర్, అరెపల్లి యాదగిరి ధరించారు. మిగతా తొమ్మిది మంది కొంత ఆలస్యం.. కొంత ఏమరుపాటు కారణంగా లైఫ్ జాకెట్లు ధరించలేదు. ఇంతలోనే గోదావరిలో బోట్ కుదుపునకు గురై బోల్తా పడడం గమనార్హం. నిర్వాహకులు ఇచ్చిన వెంటనే లైఫ్ జాకెట్లు ధరించి ఉంటే ఈ తొమ్మిది మంది కూడా సురక్షితంగా బయలపడేవారని చెబుతున్నారు. కాగా, లైఫ్ జాకెట్లు ధరించిన వారు బోట్ బోల్తా పడగానే నీటిపై తేలియాడుతూ గంటసేపటి వరకు నదిలో ఈత కొడుతూ ముందుకు సాగాక మరో లాంచీలో వచ్చినవారు కాపాడినట్లు తెలుస్తోంది. టీవీలకు అతుక్కుపోయిన కుటుంబ సభ్యులు బోటు బోల్తా పడిందని తెలియగానే కడిపికొండలోని 14 మంది కుటుంబాల వారు టీవీలకు అతుక్కుపోయారు. ఎవరెవరు గల్లంతయ్యారు, ఎవరెవరు సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకున్నారు. గల్లంతైన వారి పేర్లు ప్రకటించటగానే వారి కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక గ్రామంలోని యువత ఎప్పటికప్పుడు సెల్ఫోన్ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. -
వైద్యం వికటించి బాలింత మృతి
సాక్షి, కాజీపేట (వరంగల్): వైద్యుల నిర్లక్ష్యం కారణం బాలింత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించిన ఘటన కాజీపేట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధర్మసాగర్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మిట్టపల్లి సునిత(31) మూడో కాన్పు నిమిత్తం డీజిల్ కాలనీలోని ప్రసాద్ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు అన్నిరకాల పరీక్షలు చేసి రెండ్రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేయగా సునిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు కాస్త బలహీనంగా ఉండడంతో ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులోని సేఫ్టీ బాక్స్‌లో పెట్టడానికి సునిత భర్త సాంబరాజు తీసుకెళ్లాడు. బుధవారం రాత్రి ఒక్కసారిగా సునిత ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బంధువులు వైద్యం అందించాలని కోరినప్పటికీ సకాలంలో చికిత్స అందించేందుకు వైద్యులు ముందుకు రాకపోవడంతో మరణించిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం ప్రసాద్ ఆస్పత్రి ఎదుట బైటాయించారు. ముగ్గురు పిల్లలను అనాథను చేసిన ఆస్పత్రి నిర్వాహకులు ఆ కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్మసాగర్ జెడ్పీటీసి సభ్యురాలు శ్రీలత, జెడ్పీ కో–ఆప్షన్ సభ్యురాలు ఎండీ జుబేదాబేగంతో పాటు పలువురు టీఆర్ఎస్ సర్పంచ్‌లు, మండల ప్రాదేశిక సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసు బందోబస్తు.. మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేయాలనే డిమాండ్‌తో కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైటాయించడంతో కాజీపేట– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. కాజీపేట ఏసీపీ నర్సింగరావుతో పాటు సీఐలు అజయ్, జానినర్సింహులు సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులకు నచ్చ చెప్పి, ట్రాఫిక్‌ను పునరుద్దారించారు. పరిహారంపై చర్చ.. వైద్యులే సునిత మృతికి బాధ్యత వహించి తగు న్యాయం చేయాలని, బాధితకుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు ప్రజాప్రతినిధులు ఆస్పత్రి వర్గాలతో చర్చలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు చర్చింనప్పటికీ కొలిక్కిరాలేదు. అయితే వైద్యులు మాత్రం తమ నిర్లక్ష్యం ఏమిలేదంటూ పరిహారం ఇవ్వడానికి ఇష్టపడకపోవడంతో రాతిర్ర అయినప్పటికీ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచి ఆందోళన కొనసాగించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతిరాలి బంధువులు సునీత(ఫైల్) -
‘నిట్’ విద్యార్థి ఆత్మహత్య
కాజీపేట అర్బన్ : వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోల్‌కతాకు చెందిన బిలబ్ పాండే రెండో కుమారుడు కౌశిక్ పాండే ఫస్టియర్‌లో 9.5 జీపీఏతో టాపర్‌గా నిలిచాడు. సెకండియర్‌లో సీఎస్ఈ విభాగంలో చేరాడు. సోమవారం తరగతులు పునఃప్రారంభం కావడంతో తండ్రి బిలబ్ పాండే కౌశిక్‌ను వెంట తీసుకొచ్చాడు. తండ్రి బుధవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లిపోతున్నట్లు మంగళవారంరాత్రి కౌశిక్‌తో చెప్పాడు. కాజీపేట రైల్వేస్టేషన్లో రైలు టికెట్ తీసుకోవడానికి వచ్చిన బిలబ్ పాండే కౌశిక్‌తో మాట్లాడటానికి ఫోన్ చేయగా సమాధానం రాలేదు. అనుమానంతో హాస్టల్ గదికి వచ్చి కిటికీలో నుంచి చూడగా కౌశిక్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. చదువులో వెనుకబడి తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు బిలబ్ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ అజయ్ తెలిపారు. . -
తాళం వేసిన ఇళ్లే వీరి టార్గెట్
సాక్షి, కాజీపేట : వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళల ముఠా, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ డాక్టర్ రవీందర్ వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన గాజుల యోగేందర్ అలియాస్ యుగెందర్ అలియాస్ యోగి, కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని బుడిగజంగాల కాలనీకి చెందిన నూనె కిష్టమ్మ, శ్రీపాతి లింగమ్మలను అదుపులోకి తీసుకుని, రూ.18లక్షల విలువైన 361 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, నాలుగు ల్యాప్‌ట్యాప్‌లు, నాలుగు వీడియో కెమెరాలు, ఒక ఐప్యాడ్, రెండు ఐఫోన్లు, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలపారు. జల్సాలకు అలవాటు పడి చోరీలు.... రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యోగెందర్ కలర్ పేయింట్ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. చెడు వ్యసనాలకు బానిసై, సంపాదిస్తున్న డబ్బు జల్సాలకు సరిపోకపోవడంతో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడని కమిషనర్ తెలిపారు. 2012 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా తిరుమలగిరి, అళ్వాల్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. బయటికి వచ్చాక తన పద్ధతి మార్చుకోకుండా నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. అనంతరం వరంగల్‌కు మార్చిన యోగేందర్ చోరీలు చేస్తుండేవాడు. కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, సుబేదారి, మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కోక్క చోరీలకు పాల్పడ్డాడు. ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ డీ.శ్రీధర్ ఆదేశాల మేరకు గురువారం ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వరంగల్ రై ల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానస్పదంగా తారసపడిన యోగేందర్‌ను విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.13.79లక్షల విలువైన 241 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, 4 ల్యా ప్‌ట్యాప్‌లు, 4 వీడియో కెమెరాలు, ఒక ఐప్యాడ్, రెండు ఐఫోన్లు, మూడు వాచ్‌లను స్వాధీనం చేసుకుని, నిందితుడి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రెండు సంఘటనల్లో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ జోన్ డీసీపీ కేఆర్.నాగరాజు, వరంగల్, కాజీపేట, ఏసీపీలు నర్సయ్య, నర్సింగరావు,పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. -
రెవెన్యూలో అవినీతి జలగలు.!
సాక్షి, ఖాజీపేట(కడప) : ఖాజీపేట మండలంలో గత 20 ఏళ్లుగా కొందరు వీఆర్ఓలు రెవెన్యూ గ్రామాలు మారుతూ ఇక్కడే తిష్ట వేశారు. దీంతో వచ్చిన తహసీల్దార్లను మచ్చిక చేసుకుని అంతా తామై నడిపిస్తున్నారు. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించారు. దాని ప్రకారం రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు ముట్టజెప్పిన రైతులు నెలల తరబడి వారి చుట్టూ తిరిగినా పనులు జరగడం లేదు. పనులు చేయిస్తామని భారీగా వసూళ్లు ఖాజీపేట మండలంలో గతంలో పనిచేసిన తహసీల్దార్ పార్వతితో పాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి మరికొందరు వీఆర్ఓలు భూ సమస్యలు పరిష్కరిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా తుడుమలదిన్నె, తిమ్మారెడ్డిపల్లె, సన్నపల్లె, పుల్లూరు తదితర గ్రామాల్లో అధికంగా వీఆర్ఓల బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన ప్రతి రైతు నుంచి వారి అవసరాన్ని బట్టి రూ.10 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేశారని రైతుల ఆరోపణ. అలాగే ఆన్లైన్ నమోదు, పాసుపుస్తకాల కోసం, డీకేటీ పట్టా పొందిన రైతుల భూముల ఆన్లైన్ పేరుమార్పు, ఇతరుల పేరుతో ఉన్న ఆన్‌లైన్‌ను తొలగించి తిరిగి భూమి కలిగిన రైతు పేరున మార్చేందుకు ఇలా అనేక రైతుల సమస్యలకు రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. తహసీల్దార్ పార్వతితో పాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి తదితరులు డబ్బులు గుంజారు. బదిలీపై అధికారులు ఖాజీపేట మండలంలో తహసీల్దార్ గా పనిచేసిన పార్వతి తోపాటు వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి బదిలీ అయ్యారు. వీరు రైతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసి పనులు చేయకుండా తిరిగి రైతులకు డబ్బు ఇవ్వకుండా వెళ్లిపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పనులు చేయలేదు, కనీసం తమ డబ్బయినా తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయినా వీఆర్ఓలు పట్టించుకోక పోవడంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తీరు మారదంతే.. ఖాజీపేట రెవెన్యూ కార్యాలయంలోని అధికారుల తీరు ఎంత చేసినా మారడంలేదు. గతంలో పనిచేసిన తహసీల్దార్ శివరామయ్య దొంగ పట్టాలు ఇచ్చారు. ఆన్లైన్లో ఒకరికి తెలియకుండా ఒకరి భూముల పేర్లు మార్చారు. ఇలా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. అలాగే గతంలో పనిచేసిన అధికారుల్లో తహసీల్దార్ కృష్ణయ్య తోపాటు ఆర్ఐ రాధాకృష్ణ, వీర్‌ఓలు, సర్వేయర్ ఏసీబీకి దొరికారు. మరో వీఆర్ఓ చెన్నూరు మండలానికి వెళ్లి అక్కడ ఇసుక ట్రాక్టర్ల దగ్గర డబ్బు వసూలు చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. సా...గుతున్న విచారణ వీఆర్ఓల అక్రమాలపై అప్పటి కలెక్టర్ బాబూరావు నాయుడుకు 2018లోనే రైతులు ఫిర్యాదు చేశారు. ఆమేరకు విచారణ అధికారిగా ప్రత్యేక కలెక్టర్ రోహిణిని నియమించారు. విచారణ అధికారికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున రాతపూర్యకంగా ఫిర్యాదులు ఇచ్చారు. అయితే విచారణకు కావాల్సిన రికార్డులు ఇచ్చేందుకు తహసీల్దార్ పార్వతి సహకరించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రికార్డులు ఇవ్వని కారణంగా నివేదిక ఆలస్యం విచారణకు వచ్చిన నాకు ఖాజీపేట తహసీల్దార్ రికార్డులు ఇవ్వలేదు. 95 రికార్డులు అడిగితే 60 రికార్డులు మాత్రమే ఇచ్చారు. మిగిలినవి ఉన్నాయో లేదో తెలియదు. లేక పోతే మా వద్ద లేవు అని రాతపూర్వకంగా ఇవ్వాలని తహసీల్దార్‌ను అడిగాను. ఇదే విషయమై అనేక నోటీసులు ఇచ్చినా తహసీల్దార్ స్పందించ లేదు. అసంపూర్తిగా నివేదిక ఇవ్వలేం. తహసీల్దార్ రాతపూర్వకంగా ఇస్తే కలెక్టర్‌కు నివేదిస్తాను. – రోహిణి, ప్రత్యేక కలెక్టర్ -
నా కొడుకును బతికించరూ..
ఆ బాలుడి వయస్సు తొమ్మిదేళ్లు.. తొడబుట్టిన చెల్లెలితో సరదాగా ఆడుకుంటూ, పాఠశాలకు ఉత్సాహంగా వెళ్లి వస్తుంటాడు. రాగానే తల్లిఒడిలో సేదదీరుతూ ఆనందంగా గడుపుతాడు. కుటుంబ భారాన్ని మోసే తండ్రి పనికిపోయివచ్చిన వెంటనే తన ముద్దుముద్దు మాటలతో పలకరించి అలరిస్తాడు. ఇలా సంతోషంగా సాగుతున్న ఆకుటుంబాన్ని ఓ పిడుగులాంటి వార్త కంటిమీద కునుకులేకుండా చేసింది. హుషారుగా ఉండే తన కుమారుడికి లివర్ సమస్య ఉందని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండెలు బరువెక్కాయి. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబానికి చెందిన పసిబాలుడు ఆయాన్ దీనగాథపై సాక్షి కథనం. – కాజీపేట అర్బన్ సాక్షి, వరంగల్ : కుమారుడిని బతికుంచుకోవాలని, కన్న కొడుకు లివర్ మార్పిడికి తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం హృదయాన్ని కలిచివేస్తుంది. కాజీపేట బాపూజీనగర్‌కు చెందిన నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షేక్ జావేద్, జీనద్లకు 9 సంవత్సరాల కుమారుడు షేక్ అయాన్, 7 సంవత్సరాల అలీనా ఫిర్దోస్ కూతురు ఉన్నారు. ఓ ప్రైవేట్ షోరూంలో సేల్స్‌మేన్‌గా జీవనం కొనసాగిస్తున్న షేక్ జావేద్‌కు మూడు నెలల క్రితం కుమారుడికి లివర్ పాడై ఊహించని దెబ్బ ఎదురయింది. రెండో తరగతి చదువుతున్న తన కుమారుడు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకునేవాడు. కాగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపు ఉబ్బిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపోగా కామెర్లు వచ్చాయని నిర్ధారించారు. దీంతో కామెర్లు తగ్గేందుకు చికిత్స చేయించారు. కాగా కడుపు ఉబ్బు మాత్రం తగ్గలేదు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నీలోఫర్‌కు తీసుకుని వెళ్లగా అక్కడ వైద్యులు లివర్ సిరాసిస్గా గుర్తించి లివర్ మార్పిడి ఒక్కటే మార్గమని తెలిపారు. దాతల సాయం కోసం ఎదురుచూపులు నీలోఫర్ ఆస్పత్రిలో ఆయాన్‌కు లివర్ మార్పిడి చేయాలని, ఇందుకుగాను రూ.25 లక్షల ఖర్చవుతుందని తెలిపారు. ఒక్కసారిగా తల్లిదండ్రులకు ఎం చేయాలో తెలియని అచేతన స్థితికి చేరుకున్నారు. కాగా ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లో తన కుమారుడి ధీనగాథను తండ్రి పోస్ట్ చేయగా చెనైలోని రెలా హస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ రూ.20లక్షలు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన తాను రోజు పనికి వెళ్తేకాని ఇల్లు గడవని పరిస్థితిలో రూ.5 లక్షలు సమకూర్చలేని స్థితి. మరో వైపు కన్నకుమారుడికి తన లివర్‌ను అందించి బతికించుకోవాలనే తండ్రి తపన. దీంతో దాతల సాయం కోసం, అప్పన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.దాతలు స్పందించిన తన కుమారుడు ఆయాన్‌ను బ్రతికించాలని వేడుకుంటున్నారు. దాతలు ఆర్థిక సాయాన్ని అందించాల్సిన అకౌంట్ నెంబర్....006901565086, ifsc code & icic0002303 సెల్ నెంబర్..91777 61108 -
రైలు సంపర్క్ క్రాంతిలో నిలువు దోపిడీ
సాక్షి, కాజీపేట : కర్ణాటకలోని యశ్వంతాపూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఆరుగురు ప్రయాణికులకు మత్తు మందు కలిపిన తినుబండారాలు ఇచ్చి వారి సొత్తును దోచుకున్నారు. బెంగళూరులో పలు పనులు చేసుకుంటున్న యూపీ, ఢిల్లీ తదితర ప్రాంతాల వాసులు దినేశ్ బండారీ, సురేశ్, చాపస్, బాలశర్మ, సంజీవ్‌సింగ్, తివారీ స్వస్థలాలకు వెళ్లేం దుకు శనివారం రాత్రి బెంగళూరులో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఎక్కారు. మార్గమధ్యలో కొందరు దుండగులు అందులోకి ప్రవేశించి, ఈ ఆరుగురు ప్రయాణికులకు మత్తు మందు కలిపిన బిస్కెట్లు, సమోసాలు, కూల్‌డ్రింక్స్ ఇచ్చారు. దాంతో వారు నిద్రలోకి జారుకున్న తర్వాత వారివద్ద ఉన్న నగదు, ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. రైలు ఆదివారం ఉదయం 9 గంటలకు కాచిగుడ రైల్వేస్టేషన్‌కు చేరుకోగా, ఈ ఆరుగురు నిద్రలో నుంచి లేవకపోవడంతో ప్రయాణికులు స్టేషన్లో ఉన్న రైల్వే పోలీసులకు తెలిపారు. వారు కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేశారు. కంట్రోల్ రూం సిబ్బంది కాజీపేట రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. రైలు కాజీపేటకు చేరుకోవడంతో పోలీసులు జనరల్ బోగీలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని కిందికి దింపారు. చికిత్స కోసం వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని బాధితుల పరిస్థితిని పరిశీలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. -
మాటు వేసి.. మట్టుబెట్టి
కాజీపేట: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు అమానవీయంగా ప్రవర్తించారు. పైసల కోసం పేగు బంధాన్ని మరిచారు. చనిపోతే తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి రక్షిస్తారనున్నకున్న కుమారులే కన్నతండ్రితో పాటు పినతల్లిని హత్య చేశారు. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కాజీపేట పరిధిలోని సోమిడి శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల బంధువుల కథనం ప్రకారం.. సోమిడి శివారులో నివాసముంటున్న సుంచు ఎల్లయ్య(72), ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గతంలో ఎల్లయ్య రైల్వేలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందాడు. 12 ఏళ్ల క్రితం భార్య ఎల్లమ్మ మృతి చెందడంతో హసన్పర్తికి చెందిన పూలమ్మ(60)ను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారులు ముగ్గురు తరచూ ఎల్లయ్యతో ఆస్తి, పింఛన్ డబ్బుల కోసం గొడవపడుతుడేవారు. దీంతో అతడు సోమిడి శివారులో వేరొక ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సోమిడిలో ఎకరం భూమిని ఎల్లయ్య ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి డెవలప్మెంట్ కోసం ఇచ్చాడు. భూమి అమ్మగా వచ్చిన డబ్బుల్లో ముగ్గురు కుమారులకు వాటా ఇవ్వడంతోపాటు తండ్రి వాటా తీసుకున్నాడు. పింఛన్ డబ్బులు తమకు ఇవ్వకపోవడమేగాక భూమి డబ్బుల్లో కూడా వాటా తీసుకోవడంతో కోపం పెంచుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వృద్ధ దంపతుల ఇంటి ఆవరణలో మాటు వేసి, పూలమ్మ బయటికి రాగానే గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యను హత్య చేశారు. ఉదయం పాలు పోయడం కోసం వచ్చిన మహిళ ఆరుబయట రక్తపు మడుగులో పడి ఉన్న పూలమ్మను చూడడంతో ఘటన వెలుగు చూసింది. పథకం ప్రకారమే హత్య ? మంగళవారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో ఉన్న బాత్రూమ్కు వెళ్లడానికి బయటకు వచ్చిన పూలమ్మపై నిందితులు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే బెడ్రూంలో నిద్రిస్తున్న ఎల్లయ్యపై ఒక్కసారిగా దాడి చేసి కత్తులు, గొడ్డలితో నరికి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎల్లయ్య మృతదేహంపై దాదాపు 30కిపైగా కత్తిపోట్లు జల్లెడ పట్టినట్లుగా ఉన్నాయని బంధువులు తెలిపారు. హత్య అనంతరం శివాలయంలో పూజలు ? వృద్ధ దంపతులను హత్య చేసిన తర్వాత ఓ నిందితుడు కాజీపేటలోని శివాలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చినట్లు తెలిసింది. ఏమి తెలియనట్లుగానే మృతదేహాల ముందుకు వచ్చి బోరున విలపించారు. తీరా వారే నిందితులని పోలీసులు గుర్తించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితుల ఇళ్లలో దుస్తులు పిండి ఉండడంతోపాటు దారి పొడవునా రక్తపు మరకలను అధికారులు గుర్తించారు. ఆస్తి కోసమే కుటుంబ సభ్యులు ఇద్దరిని హత్య చేశారని మృతురాలు పూలమ్మ తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉందని, త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. నిందితుల జాడ చూపిన డాగ్‌స్క్వాడ్ సమాచారం అందుకున్న డీసీపీ వెంకట్రామ్రెడ్డి, ఏసీపీ సత్యనారాయణ, సీఐ అజయ్ క్లూస్ టీంతోపాటు జాగిలాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాగిలాలు మృతదేహాలను వాసన చూశాక నేరుగా హతుడి కుమారుల ఇళ్లతోపాటు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఆగిపోయాయి. పోలీసులు వెంటనే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. -
దంపతుల దారుణ హత్య
సాక్షి, కాజీపేట: వరంగల్ జిల్లా కాజీపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కాజీపేట మండలం సోమిడి గ్రామంలో సుంచు ఎల్లయ్య, పుల్లమ్మ అనే దంపతులు నివశిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి జొరబడి నిద్రిస్తున్న ఎల్లయ్య, పుల్లమ్మలను ఇటుక రాళ్ళతో మోదీ చంపేశారు. మంగళవారం ఉదయం వారు ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు తలుపులు నెట్టిచూడగా దంపతులు విగతజీవులై పడిఉండటం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
67 కిలోల వెండి నగలు స్వాధీనం
కాజీపేట: అక్రమంగా తరలిస్తున్న రూ.35 లక్షల విలువ చేసే 67 కిలోల వెండి ఆభరణాలను వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన ఈశ్వర్ సతీశ్, సుబ్రహ్మణ్యం సత్తివేలు వెండినగల వ్యాపారులు. వీరు మంగళవారం కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో కోర్బా ఎక్స్‌ప్రెస్ నుంచి దిగారు. వీరిని పోలీసులు తనిఖీ చేయగా, ఎటువంటి బిల్లులు లేకుండా వెండి ఆభరణాలు ఉన్నాయి. ఈ నగలను జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగలను ఐటీ శాఖకు అప్పగించనున్నట్లు ఏసీపీ బి. జనార్దన్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ఖాజీపేట: నందిపాడులో విద్యుత్ ప్రమాదం వల్ల నాగేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన మరువక ముందే దుంపలగట్టు గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మరో మహిళ మృతి చెందింది. దుంపలగట్టు గ్రామానికి చెందిన లక్ష్మిదేవి అనే మహిళకు దువ్వూరు మండలం నాగాయపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే భర్త కువైట్‌కు వెళ్లడంతో గత కొంతకాలంగా ఆమె దుంపలగట్టులోని పుట్టింట్లో ఉంటోంది. ఆదివారం సాయంత్రం ఉతికిన దుస్తులను ఇనుప దంతెపై వేసేందుకు ప్రయత్నించగా దానికి విద్యుత్ సరఫరా అయి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి లలిత (8) అనే కుమార్తె ఉంది. -
రాష్ట్రంలో తొలి రైల్వే వర్క్‌షాప్
కాజీపేటలో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ యూనిట్ రూ. 300 కోట్లతో త్వరలో నిర్మాణం - ఏడేళ్ల నిరీక్షణకు తెర - 53 ఎకరాలను బదిలీ చేస్తున్నట్టు రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ - మరో 2, 3 రోజుల్లో బదిలీ ప్రక్రియ పూర్తి సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వరంగల్ జిల్లా కాజీపేటలో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో వ్యాగన్ పిరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు నిర్మాణం త్వరలో జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం–రైల్వేల మధ్య నెలకొన్న భూ బదలాయింపు సమస్య కొలిక్కి వచ్చింది. ఈ వర్క్‌షాపు ఏర్పాటుకు అవసరమైన 53 ఎకరాల భూమిని రైల్వేకు బదలాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం రైల్వేశాఖకు లేఖ రాసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే కొత్త జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ ఇద్దరు అధికారులు స్నేహితులు కావటంతో వెంటనే ఎస్పీ సింగ్ దీనిపై దృష్టి సారించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో దాన్ని కొలిక్కి తెచ్చి ఆ భూమిని స్వాధీనం చేస్తున్నట్టుగా జీఎంకు స్వయంగా లేఖ పంపారు. మరో రెండుమూడు రోజుల్లో ఈ బదలాయింపు ప్రక్రియ అధికారికంగా జరగనుంది. ఆ వెంటనే అక్కడ పనులు మొదలుపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఏడేళ్ల తర్వాత మోక్షం... కాజీపేట వర్క్షాపుది వింత కథ. వాస్తవానికి ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉంది. 1982లో కోచ్‌ఫ్యాక్టరీ మంజూరు కాగా, ఇందిరాగాంధీ హత్యోదంతం తర్వాత సిక్కులపై ఊచకోత నేపథ్యంలో పంజాబ్ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1985లో ఆ కోచ్‌ఫ్యాక్టరీని పంజాబ్‌కు బదిలీ చేసింది. అప్పటి నుంచి కోచ్‌ఫ్యాక్టరీ డిమాండ్ కాజీపేటలో కొనసాగుతూనే ఉంది. చివరకు 2010లో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండగా కాజీపేటకు వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంజూరు చేసింది. తొలుత దీన్ని సికింద్రాబాద్‌కు ఇవ్వగా నేతల ఒత్తిడితో కాజీపేటకు మార్చారు. మడికొండలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందిన 53 ఎకరాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయించింది. అయితే దేవాలయ మాన్యాన్ని సేకరించటంలో ఉన్న నిబంధనలతో ఆ అంశం కోర్టుకెక్కింది. దాన్ని సకాలంలో పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలం కావటంతో జాప్యం జరుగుతూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు సమస్య పరిష్కారమై ఆ భూమిని వరంగల్ కలెక్టర్‌కు స్వాధీనం చేశారు. ఈలోపు కేంద్రం మనసు మార్చుకుని వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను రద్దు చేసి దాని స్థానంలో వ్యాగన్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపును గత సంవత్సరం మంజూరు చేసి రూ.20 కోట్లు కేటాయించింది. కానీ సకాలంలో భూమిని రైల్వేకు అప్పగించకపోవటంతో ప్రయోజనం లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన జీఎం వినోద్‌కుమార్ యాదవ్ గత వారం ఎస్పీసింగ్‌ను కలసి దీనిపై విజ్ఞప్తి చేయటంతో వారం రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఆయన రెండు రోజుల క్రితం జీఎంకు ఆమేరకు లేఖ రాశారు. రెండు వేల మందికి ఉపాధి సరుకు రవాణా వ్యాగన్లను ఎప్పటికప్పుడు ఓవర్‌హాలింగ్ చేయటం ఈ వర్క్‌షాపు పని. దీనిద్వారా ప్రత్యక్షంగా దాదాపు 500 మందికి, పరోక్షంగా 1500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వ్యాగన్ ఓవర్హాలింగ్కు మంచి డిమాండ్ ఉన్నందున ఇక్కడ నిరంతరం పనులు కొనసాగనున్నాయి. నెలలో దాదాపు 150 వ్యాగన్లను ఓవర్‌హాలింగ్ చేసే సామర్థ్యంతో తొలుత వర్క్‌షాపును ప్రారంభిస్తారని తెలుస్తోంది. -
అటవీప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్
మైదుకూరు: మైదుకూరు సమీపంలో నల్లమల, లంకమల అభయారణ్యంలో తమిళ కూలీలు చొరబడటంతో మైదుకూరు అర్బన్, రూరల్ పోలీసు సిబ్బంది ఫారెస్ట్‌లో కూంబింగ్ ముమ్మరం చేశారు. బుధవారం, గురువారం మైదుకూరు సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి నల్లమల భైరవకోన, సానీబావి, బోరకొండ, దూదెమ్మ కోన ప్రాంతంలో కూబింగ్ నిర్వహించారు. ఇప్పటికే అటవీ ప్రాంతంలో దాదాపు 100 మందికి పైన ఎర్రస్మగ్లింగ్ చేస్తున్న కూలీలను పట్టుకున్నారు. ఇంకా కొందరు అటవీ ప్రాంతంలో తమిళ కూలీల ఉనికి ఉన్నట్లు సమాచారం ఉండటంతో ఈ కూంబింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు అటవీప్రాంతం సమీపంలోని గ్రామాల్లోకి వస్తే వారికి సహకరించినా, వారితో సంబంధాలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖాజీపేట నుంచి వరకు దువ్వూరు వరకు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్ పాల్పడే వ్యక్తులు ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలకు గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. -
వికసించిన బ్రహ్మకమలం
కాజీపేట : ప్రశాంత్‌నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి లెక్కల ప్రకాష్‌రెడ్డి గృహంలో ఆదివారం రాత్రి బ్రహ్మకమలం పుష్పాలు వికసించాయి. దీంతో కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇంటినే హరిత వనంగా మార్చుకున్న ప్రకాష్‌రెడ్డి ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం మొక్కను పెంచుతున్నాడు. మూడేళ్లుగా వికసిస్తున్న ఈపుష్పాలు ఏడాదికి ఒకసారి మాత్రమే అదికూడా రాత్రి 10 నుంచి 12 గంటల సమయంలో విచ్చుకోవడం ప్రారంభిస్తాయి. ఆదివారం రాత్రి ఈ విషయం గుర్తించిన ప్రకాష్‌రెడ్డి బంధు మిత్రులకు చెప్పడంతో కాలనీవాసులతో సహా అందరూ వచ్చి తిలకించారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత బ్రహ్మకమలం పుష్పాలు యాధావిధిగా ముడుచుకుని పోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఓ నమో
కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బుధవారం ఓనం పండుగను ఘనంగా నిర్వహించారు. నిట్ లో చదువుతున్న కేరళ విద్యార్థులు ఓనం ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ మేరకు ఆడిటోరియం ఎదుట ముగ్గు వేసి వివిధ రకాల పూలతో అలంకరించి తమ సంస్కృతిని ప్రతిబింబింపజేశారు. అలాగే వివిధ వేషధారణల్లో అలరిం చారు. ఆటపాటలతో కేరింతలు కొట్టారు. –కాజీపేట రూరల్ -
యువతిని రక్షించిన కాజీపేట పోలీసులు
కాజీపేట : గొంతుకోసుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువతిని కాజీపేట పోలీసులు గుర్తించి సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడా రు. స్థానిక సీఐ రమేష్‌కుమార్ కథనం ప్రకారం... మంగళవారం రాత్రి వినాయక చవితి ఉత్సవ నిర్వాహక మండళ్లను తని ఖీ చేస్తున్న పోలీసు బృందం కడిపికొండ క్రాస్ రోడ్డులోని కాలనీల్లో పర్యటించి వ స్తుండగా ఓ యువతి చెట్లపొదల మధ్య పడిపోయి కన్పించింది. మృతదేహమై ఉండొచ్చనే అనుమానంతో దగ్గరకు వెళ్లిన బ్లూకోట్ పోలీ సులు ఆ యువతి ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్సై భీమేష్కు సమాచారమిచ్చారు. ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని తన వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రెండున్నర గంట లపాటు ఆపరేషన్ చేసిన వైద్యులు యువతికి ప్రాణాపాయంలేదని ప్రకటించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలంలో వెదకగా ఆ యువతి రాసిన సూ సైడ్ నోట్ లభించిందని, దానిని పరిశీ లించగా నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం బిక్కుమళ్ల గ్రామానికి చెంది న మంజుల(17)గా వెల్లడైంది. మరిపెడలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న మంజుల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలో చికిత్స పోందుతోంది. తర చూ తలనొప్పి, గొంతు, విని కిడి సమస్యలు వేధిస్తుండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించిన ట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీ సులు వెల్లడించారు. ప్రాణాపాయస్థితిలోఉన్న యువతిని ఆస్పత్రిలో చేర్పించి కాపాడిన ఎస్సై భీమేష్, కాని స్టేబుల్ రామారావును సీఐ అభినందించారు. వారికి రివార్డు ఇప్పించ డానికి సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. -
రేపు ఉపాధ్యాయులకు ఓరియంటేషన్
విద్యారణ్యపురి : వరంగల్ డివిజన్లో ఇన్‌సె్పౖర్ అవార్డుకు ఎంపికైన అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, గైడ్ టీచర్లకు శుక్రవారం కాజీపేటలోని బిషప్ బెరట్టా స్కూల్ లో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ పి.రాజీవ్ తెలిపారు. ఉదయం 9–30 గంటల నుంచి జరిగే కార్యక్రమానికి ఆయా విద్యార్థులు, గైడ్ టీచర్లను పంపాలని హెచ్ఎంల ను ఆయన ఆదేశించారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
కాజీపేట : ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఓ హమాలీ కార్మికుడు శని వారం ఆత్మహత్యకు పాల్పడినట్లు కాజీపేట సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం.. బాపూజీనగర్‌కు చెందిన మాటేటి ఉపేందర్(30) మడికొండ లిక్కర్ గోడౌన్లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఆయన తాగుడుకు బా నిసగా మారాడు. మరోవైపు అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పులను తీర్చే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలయ్యాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో ఒంటరిగా ఉంటున్న ఉపేందర్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
శ్వేతార్కుడు.. పుష్ప శోభితుడు
పట్టణంలో కొలువుదీరిన స్వయంభూ శ్వేతార్క మూలగణపతి స్వామి వారిని శనివారం అర్చకులు పూలు, గరికలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంత మల్లయ్యశర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నామార్చన జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సంకష్టహర చవితిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) శ్వేతార్కుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. – కాజీపేట -
సేవకు గుర్తింపు
హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో కాజీపేట ఏసీపీ జనార్దన్‌కు ఇండియన్ పోలీస్ మెడల్, మహబూబాబాద్ లీడింగ్ ఫైర్‌మెన్ ఐలుమల్లుకు ఉత్తమ సేవా పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. -
కాజీపేట–ముంబై మధ్య ఐదు రైళ్లు
కాజీపేట రూరల్ : జిల్లా ప్రజలు ముంబైకి వెళ్లేందుకు కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్ల నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాజీపేట–ఎల్టీటీ తడోభా ఎక్స్‌ప్రెస్.. కాజీపేట–ఎల్టీటీ వెళ్లే తడోభా ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రైల్వే మంత్రి సురేష్ కుమార్ ప్రభు ప్రారంభించారు. ఈ రైలు మంగళవారం ముంబై చేరుకుంటుంది. అయితే ఇకపై ఈ రైలు రెగ్యులర్ వీక్లి ట్రైన్‌గా ప్రతి శనివారం కాజీపేట జంక్షన్ నుంచి బయలుదేరి ఆదివారం ముంబై వెళుతుంది. 11083 నంబర్ గల ఎల్టీటీ–కాజీపేట వెళ్లే తడోభా ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 8 గంటలకు ఎల్టీటీలో ప్రారంభమై మంగళవారం ఉదయం 11.25 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. తిరిగి మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు 11084 నంబర్‌తో కాజీపేట నుంచి ఎల్టీటీకి బయలుదేరుతుంది. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఎల్టీటీలో ఉదయం 8 గంటలకు బయలు దేరి శనివారం ఉదయం 11.25 గంటలకు కాజీపేటకు చేరుకుంటుది. తిరిగి అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి ఆదివారం 12.45 గంటలకు ఎల్టీటీకి చేరుకుంటుంది. ఆనంద్‌వన్ ఎక్స్‌ప్రెస్.. 22127 నంబర్ గల ఆనంద్‌వన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం ఎల్టీటీలో 13.45 గంటలకు బయలు దేరి మంగళవారం ఉదయం 7 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. తిరిగి కాజీపేటలో సాయంత్రం 18.30 గంటలకు బయలు దేరి బుధవారం 13.45 గంటలకు ఎల్టీటీకి వెళ్తుంది. రెగ్యులర్ రైళ్లుగా.. 18519 నంబర్ గల విశాఖ–ఎల్టీటీ లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు కాజీపేటకు ఉదయం 10.10 గంటలకు చేరుకుంటుంది. 18520 నంబర్ గల ఎల్టీటీ–విశాఖ వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు రాత్రి 23.30 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్.. 11020 నంబర్ గల భువనేశ్వర్–ముంబాయి వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఉదయం 8.40 గంటలకు కాజీపేటకు వస్తుంది. తిరిగి 11019 నంబర్ గల ముంబాయి–భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఉదయం 10.20 గంటలకు కాజీపేటకు వస్తుంది. -
పిల్లలను మభ్యపెట్టి.. నగలు దోచేశాడు
కాజీపేట : ఒంటరిగా ఉన్న పిల్లలను మాయమాటలతో మభ్యపెట్టి దాదాపు 10 తులాల బంగారు ఆభరణాలను ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం కాజీపేట పరిధిలోని ప్రశాంత్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది. దీనిపై బాధితుడు గుండారపు జైపాల్‌రెడ్డి కాజీపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్‌నగర్ కాలనీలో నివసించే జైపాల్‌రెడ్డి కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో టీచర్‌గా, ఆయన భార్య ఉషారాణి సైదాపూర్ మండలంలో వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు ఆకాశ్‌రెడ్డి, జాన్‌రెడ్డి ప్రశాంత్‌నగర్ పరిధిలోని ఓ పాఠశాలలో చదువుతున్నారు. రోజులాగే జైపాల్‌రెడ్డి దంపతులు మంగళవారం కూడా ఉద్యోగ విధులకు వెళ్లారు. అయితే మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో వీరి ఇద్దరు పిల్లలు ఇంటి వద్దే ఉన్నారు. ఈక్రమంలో ఇంటిపక్కనే ఉండే మరో మిత్రుడు రుషికుమార్ను పిలుచుకొని కంప్యూటర్లో గేమ్స్ ఆడసాగారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఓ అపరిచిత వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. ‘మీ నాన్నగారు పంపించారు. బీరువాలో ఉన్న బంగారు నగల్ని మరమ్మతు చేయమన్నారు’ అంటూ ఆ గుర్తు తెలియని వ్యక్తి పిల్లలకు చెప్పాడు. ఆ మాయమాటలను నమ్మిన చిన్నారులు బీరువాలో వెతికినా బంగారం కనిపించలేదు. దీంతో కంగుతిన్న గుర్తు తెలియని వ్యక్తి.. నేనిప్పుడే మీ నాన్నగారితో మాట్లాడుతానంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. ‘బీరువాలో తెగిపోయిన బంగారు గొలుసు ఉందని మీ నాన్నగారు చెప్పారు’ అంటూ మళ్లీ నమ్మబలికాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జైపాల్‌రెడ్డి చిన్న కుమారుడు జాన్‌రెడ్డి బీరువా పైభాగంలో నగలు ఉంటాయని చెప్పేశాడు. పిల్లలంతా కలిసి కుర్చీ ఎక్కి మరీ బీరువాలోని బంగారు గాజులు, నల్ల పూసల తాడు, రెండు జతల చెవి కమ్మలు, పిల్లల గొలుసులు, బ్రాస్లెట్ తీసి ఆ అపరిచితుడి చేతికి ఇచ్చేశారు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కాజీపేట పోలీసుస్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
ట్రాక్టర్ బీభత్సం: ఇద్దరి మృతి
-
ట్రాక్టర్ బీభత్సం: ఇద్దరి మృతి
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లాలోని కాజీపేట మండలం దుంపలగట్టు సమీపంలో సోమవారం ఉదయం ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హుళక్కేనా?
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలన్న ప్రతిపాదనకు చెల్లుచీటీ పలికారా? వరంగల్ జిల్లా కేంద్రంలోని కాజీపేట ప్రాంత అయోధ్యపురంలోని దేవాదాయ శాఖ భూమిలో రైల్వే కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ నిర్మించడానికి 2011-12లో నాటి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎలాంటి పనులూ మొదలు కాలేదేమిటని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి డిసెంబర్ 9న పార్లమెంట్లో ప్రశ్నిం చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో తయారవుతున్న వ్యాగన్లు రైల్వే అవసరాలకు సరిపోతున్నందున కొత్త కోచ్ ఫ్యాక్టరీలను ఇప్పట్లో నెలకొల్పడం సాధ్యం కాదని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో ఉండే రెండు పెద్ద ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గతంలో వరంగల్ నగరంలోని అజాం జాహి మిల్లు మూయించి 4 వేలమంది కార్మికులను రోడ్డున పడేశారు. ఆ ఫ్యాక్టరీ మూతపడి 20 ఏళ్లు దాటింది. దీంతో మరో తరంలోని రెండింతలమంది కార్మికులు రోడ్డున పడి ఉద్యోగ జీవితాలను కోల్పోయారు. ఆంధ్రోళ్ల కుట్రల వల్లే అజాం జాహి వంటి ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేంద్రంతో కొట్లాడి అయినా సాధించుకోవచ్చని ఆశచూపిన తెరాస అప్పట్లో జనాల్ని నమ్మించింది. మరి గత ప్రభుత్వం అంగీకరించిన కోచ్ ఫ్యాక్టరీని ఇప్పుడు ఏర్పాటు చేయలేమని కేంద్ర మంత్రి జవాబిచ్చినా తెరాస ప్రభుత్వంలో స్పందన లేదు. కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పితే ఫ్యాక్టరీ ఏర్పడనున్న ప్రాంతానికి చెందిన కడిపికొండ, రాంపేట, తరా లపల్లి, వనమాల కనిపర్తి, మల్లకపల్లి, భట్టుపల్లి, మడికొండ గ్రామాలతోపాటు... ధర్మసాగర్, జాఫ ర్గఢ్, వర్ధన్నపేట, సంగెం గీసుగొండ, హసన్‌పర్తి, ఆత్మకూరు మండల ప్రజలకు కూడా ఉద్యోగాలు లభిస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ కోచ్ ఫ్యాక్టరీ రాదని తేలడంతో ప్రజల్లో నిరాశా నిస్పృ హలు పెరుగు తున్నాయి. ఉన్న ఫ్యాక్టరీల ద్వారానే సరిపడా వ్యాగన్లు తయారు చేసే అవకాశాలు ఉన్నప్పుడు తెలంగాణలో కొత్త ఫ్యాక్టరీకి అనుమ తులు ఎందుకిచ్చినట్లు? రాష్ట్రం తగిన స్థలాన్ని అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్రం చెప్పగానే రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు హడావుడిగా స్థల నిర్ధారణ చేసి అడ్డుగా ఉన్న నివాస ఇండ్లను కూల్చివేసి 54 ఎకరాల స్థలాన్ని కేంద్రానికి అప్పజెప్పారు. ఫ్యాక్టరీ రాకపోగా, కూల్చివేతలో నష్టపోయిన వారికి ఏం సహాయం చేస్తారు? ఆ ప్రాంత ప్రజలకు ఏం సమా ధానం చెబుతారు? వెనుకబడిన లేక వెనుకబడేసిన తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రజలకు దక్కకుండా, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని నిర్మించకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకు పోయే ప్రయత్నాలను తెలంగాణ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. నామమాత్ర ప్రస్తావనల తో ఈ సమస్య పరిష్కారం కాదు. మననీళ్లు, మన ఉద్యోగాలు, మన వనరులు అంటూ ఆశ చూపి అధికారంలోకి వచ్చిన పార్టీ అసలు విషయానికి వచ్చేసరికి చేతులెత్తేయడం బాధ్యతా రాహిత్యం. రాంపేట రంజిత్ పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షులు, వరంగల్ మొబైల్ : 9989545123 -
కాజీపేట్-మంచిర్యాల మార్గంలో రైళ్లకు అంతరాయం
కాజీపేట్-మంచిర్యాల మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. కనీసం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. రామగుండం రైల్వే ప్లై ఓవర్ వద్ద గడ్డర్ల పనులు చేపట్టడంతో ఈ ఆలస్యం జరగనుంది. ఈ పనుల కారణంగా రాఘవపూర్-పెద్దం పేట రైల్వే లైన్‌కు పవర్ సప్లై నిలిపివేశారు. దీంతో ఈ పనులు పూర్తయ్యే వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. -
ప్రతిపాదనలు
రైల్వేశాఖకు పంపిన ఎంపీలు సాక్షి, హన్మకొండ : 2014-15 రైల్వే బడ్జెట్‌పై రైల్వేశాఖ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన పనులపై ఎంపీల నుంచి నివేదికలు స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందిగా మన ఎంపీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వేబోర్డుకు పంపించారు. కాజీపేట కేంద్రంగా కాకతీయ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయూలని.. సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌ను విభజించాలి.. వ్యాగన్ వర్క్‌షాప్ పనులు ప్రారంభించాలని.. స్టేషన్లలో మౌలిక సదుపాయలు మెరుగుపర్చాలని.. కొత్త మార్గాలకు నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపింనట్లు ఎంపీలు తెలిపారు. వీటిలో ఎన్ని ఆమోదం పొందుతాయో రైల్వే బడ్జెట్ వరకు వేచి చూడాలి. కాకతీయ పేరిట డివిజన్ ఏర్పాటు చేయూలి - రాపోలు ఆనందభాస్కర్, ఎంపీ రైల్వే డివిజన్ హోదాకు అన్ని హంగులు ఉన్న కాజీపేట కేంద్రంగా కాకతీయ పేరిట కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. ఈ డివిజన్ ఏర్పాటుపై రైల్వేబోర్డు సానుకూలంగా ఉన్నా.. నిర్ణయం వెలువడటంలో జాప్యం జరుగుతోంది. ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో ప్రకటన చేయాల్సిందిగా రైల్వేమంత్రిని కోరాను. రద్దీ అధికంగా ఉన్న బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గంలో మూడో లైను నిర్మాణ పను లు చేపట్టాలి. అదేవిధంగా స్టేషన్‌ఘన్‌పూర్- పాలకుర్తి-సూర్యాపేట-నల్గొండ వరకు కొత్తరైల్వే లైన్ నిర్మించాలి. వీటి కోసం రెండేళ్లుగా ప్రతిపాదనలు చేస్తున్నాను. కాజీపేట జంక్షన్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయూలి. కాజీపేట, వరంగల్ స్టేషన్లలో మూడో నంబరు ఫ్లాట్‌ఫాంపై అప్రాన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. పెండింగ్‌లో ఉన్న వ్యాగన్ వర్క్‌షాపు పనులు ప్రారంభించాలి. విజయవాడలో ఉన్నటువంటి ఉద్యోగుల శిక్షణ కేంద్రం మాదిరిగా కాజీపేటలో కూడా మరొ శిక్షణ కేంద్రం అవసరం ఉంది. సికింద్రాబాద్, విజయవాడ స్థాయిలో డీజిల్, ఎలక్ట్రికల్ లోకోల మెయింటెనెన్స్‌ను కాజీపేటలో ఏర్పా టు చేయాలి. డోర్నకల్ ప్రాధాన్యత గుర్తించాలి - సీతారాంనాయక్, మానుకోట ఎంపీ భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం)-కొవ్వూరు రైల్వేలైను నిర్మాణం పూర్తయితే డోర్నకల్ జంక్షన్‌కు పూర్వవైభవం వస్తుంది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించేలా రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకొస్తా. బొగ్గు నిక్షేపాల ప్రాంతాలు కలుపుతూ మణుగూరు-రామగుండం మధ్య కొత్త రైల్వే మార్గానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాం. ఈ రైలు మార్గంతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. భద్రాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలి. డోర్నకల్-సింగరేణికాలరీస్ (ఇల్లందు) మధ్య రద్దరుున ప్యాసింజర్ రైలును పునఃప్రారంభించాలి. గతంలో సర్వే పూర్తరుున డోర్నకల్-మిర్యాలగూడ మార్గానికి నిధులు కేటాయించాలి. భద్రాచలం రోడ్డు-తిరుపతి మధ్య కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలి. మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి.. - ఎంపీ సుధారాణి, ఎంపీ కాజీపేట కేంద్రంగా దేశంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా రైళ్లను ప్రారంభించాలి. అందుకు అనుగుణంగా ఇక్కడ పిట్లైన్లు, ఫ్లాట్‌ఫాంల సంఖ్య పెం చాలి. వీటితోపాటు వ్యాగన్ వర్క్‌షాప్‌ల భూ కేటాయింపులకు నిధులు మంజూరు అయ్యాయి. కాబట్టి వ్యాగన్ వర్క్‌షాపు పనులు వేగవంతం చేయాలి. కాజీపేటలో ఉన్న రైల్వే ఆస్పత్రి అప్‌గ్రేడ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. కాజీపేటలో రెం డో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టు సౌకర్యాలు కల్పించాలి. ఎక్స్‌ప్రెస్‌లకు జనగామలో హాల్టింగ్ ఇవ్వాలి - బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎంపీ జిల్లాలో రెండో పెద్ద పట్టణమైన జనగామ నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు హైదరాబాద్, వరంగల్‌లకు ప్రయాణం చేస్తుంటారు. కానీ ఇక్కడ చాలా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేదు. పరిమిత సంఖ్యలో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. జనగామ స్టేషన్లో కొత్తగా పది ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాల్సిందిగా రైల్వేబోర్డుకు లేఖ రాశాను. వీటిలో శాతవాహన, కోణార్క్, గోదావరి, నాందేడ్, సింహపురి, పాట్నా వంటి రైళ్లు ఉన్నాయి.