
సాక్షి, వరంగల్ : క్రికెట్ మ్యాచ్ కోసం ఒకచోటకు చేరిన యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. కాజీపేట పట్ణణంలో క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కర్రలు, వికెట్లతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ముగ్గరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
అయితే దాడికి పాల్పడిన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. ఇంతమంది ఒకచోట చేరి క్రికెట్ ఆడుతున్నా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. (చదవండి : రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల)
Comments
Please login to add a commentAdd a comment