Cricket match
-
ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు కనువిందైన కానుక
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్(The Greatest Rivalry: India vs Pakistan) సిరీస్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.భారతదేశంలో సినిమా తరువాత ఏది ఇష్టం అంటే సగటు భారతీయుడు ఠక్కున చెప్పేది క్రికెట్ అనే. నాటి రేడియో రోజుల నుండి నేటి డిజిటల్ ప్రొజెక్షన్ రోజుల వరకు ఎదుగుతున్న సాంకేతికత కన్నా మెరుపు వేగంలో ఎదుగుతోంది ఈ క్రికెట్ అభిమానం. మరీ ముఖ్యంగా ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ అంటే దేశం మొత్తానికి ఆ రోజు అప్రకటిత సెలవు లాంటిది. దాయాదుల పోరు అని చాలామంది ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుండి ఆకాశమంత ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ఇరు దేశాల క్రికెట్ ఆటపై ‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్’ అనే సిరీస్ రూపొందించింది. నాలుగు భాగాలతో ఉన్న ఈ సిరీస్‌లో భారతదేశం సాధించిన నాటి ప్రపంచ కప్ నుండి నేటి ప్రపంచ కప్ వరకు ప్రతిదీ విశ్లేషించిన ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. సిరీస్‌లో పత్రికా విలేకరుల నుండి పరోక్ష, ప్రత్యక్ష ఆటగాళ్లతో వివరించిన విధానం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ సిరీస్ ద్వారా ప్రపంచ క్రికెట్ క్రీడాభిమానులకు ఎన్నో వివరణలు, విశ్లేషణలు, రహస్యాలు దృశ్య రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో అంతకు వేయి రెట్లు ఉత్కంఠ, ఉత్సాహం ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు కలుగుతుందనడంలో సందేహమే లేదు.క్రికెట్ మ్యాచ్ టీవీలలో ప్రసారమనేది మామూలే కానీ, అదే క్రికెట్ వెనుక జరిగిన తతంగం చూపడమనేది వంద క్రికెట్ మ్యాచులు ఒకేసారి చూడడం లాంటిది. ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్ ఈ విషయంలో మాత్రం ప్రేక్షకుల నాడి సరిగ్గా పట్టుకుంది. ఈ సిరీస్ మొత్తం తెలుగులోనూ లభ్యం. కాబట్టి కాసేపు ఈ క్రికెట్ రైవల్రీ ఏంటో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ -
ఖమ్మం: క్రికెట్ ఆడుతూ కన్నుమూత
ఖమ్మం, సాక్షి: సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గుండె పోటుతో అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే యువకుడు టోర్నమెంట్లో భాగంగా ఆడుతున్నాడు. ఉన్నపళంగా అతను ఒక్కసారిగా గ్రౌండ్లో కింద పడిపోవడంతో.. నిర్వాహకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతని ప్రాణం పోయింది. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగానే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు విజయ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
#INDvsSA : తొలి టి20లో భారత్ ఘన విజయం...సెంచరీతో చెలరేగిన సామ్సన్ (ఫొటోలు)
-
ఓర్నీ.. క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్లతో కొట్టుకున్న ప్లేయర్లు(వీడియో)
క్రికెట్.. జెంటిల్ మ్యాన్ గేమ్ గా పేరొందిన విషయం అందరికి తెలిసిందే. కానీ క్రికెట్ టోర్నమెంట్లో ఆ పేరుకే మాయని మచ్చ తీసుకువచ్చారు. ఓ మ్యాచ్‌లో ఆటగాళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అంపైర్లు ఆపినా కూడా బ్యాట్లతో మరి కొట్టుకున్నారు. ప్రొఫిషనల్‌గా ఉండాల్సిన క్రికెటర్లు వీధి రౌడీల్లా మారారు. అస్సలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ ఆ టోర్నీ ఏదో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.ఏం జరిగిందంటే?ఎంసీసీ స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్.. ఎంసీసీ వీక్డేష్ బాష్ XIX పేరిట ఓ టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీకి యూఏఈలోని ఆజ్మల్ ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఏరోవిసా క్రికెట్, రబ్దాన్ క్రికెట్ క్లబ్‌లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. రబ్దాన్ క్రికెట్ క్లబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నాసిర్ అలీ బౌలింగ్‌లో చివరి బంతికి కాషిఫ్ మహ్మద్ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే కాషిఫ్ను ఔట్ చేసిన తర్వాత బౌలర్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. కాషిఫ్ వద్దకు వెళ్లిన అలీ అతడిని రెచ్చగొట్టేలా సంబరాలు చేసుకున్నాడు.అతడి వైపు చేతి వేలు చూపిస్తూ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. కాషిఫ్ కూడా అతడి వ్యాఖ్యలకు స్పందిస్తూ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇరు జట్ల నుంచి ఆటగాళ్ల సైతం తమ ప్లేయర్లకు మద్దతుగా నిలిచారు. దీంతో గొడవ మరింత తీవ్రమైంది. ఒకరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. బ్యాట్లతో కూడా కొట్టుకున్నారు. ఆఖరికి అంపైర్లు జోక్యం చేసుకుని ఈ గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. KALESH on Cricket Pitch 🥵 pic.twitter.com/mhvNYFIp4I— Sameer Allana (@HitmanCricket) September 25, 2024 -
అందరూ మహిళలే...
నారీ లోకం ప్రపంచకప్ కార్యసిద్ధికి సర్వసైన్యంతో నడుంబిగిస్తోంది. ఆ మెగా ఈవెంట్‌ను అంతా అతివలే చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు. టాస్ వేయడం, బ్రాడ్‌కాస్టర్ మైక్‌తో కెప్టెన్ నిర్ణయమెంటో తెలుసుకోవడం, వ్యాఖ్యతలు, ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, మ్యాచ్ రిఫరీ ఇలా ఆది అంతం అంతా మహిళలే చూసుకుంటారు. యూఏఈలో ఇంకొన్ని రోజుల్లోనే జరిగే మహిళల టి20 ప్రపంచకప్ అంతా అతివల మయం కానుంది. దుబాయ్: ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు 11+11 మంది ప్లేయర్లు సరిపోతారు. కానీ ఆటకు ముందు, ఆట నిర్వహణ, ఆట తర్వాత ‘ప్రత్యక్ష ప్రసారాని’కి కంటబడని పనెంతో ఉంటుంది. దీన్ని పదులు, వందల సంఖ్యలో సిబ్బంది కంటికి రెప్పలా కనిపెట్టుకొని మరీ పనిచేస్తారు. టాస్ ప్రతినిధి, పిచ్ వద్ద బ్రాడ్‌కాస్టర్ తొలి వ్యాఖ్యానం, టీవీ వ్యాఖ్యాతల వాక్చాతుర్యం, అంపైర్లు బంతిని పట్టుకొని మైదానంలోకి దిగడం. తర్వాత ఫీల్డింగ్ జట్టు గుండ్రంగా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని చేసే ప్రతిజ్ఞ... అనంతరం మెల్లిగా ఓపెనర్ల ఆగమనం, సెకన్ల కౌంట్‌డౌన్‌తో మ్యాచ్ షురూ! మధ్యలో విరామం... గ్రౌండ్సిబ్బంది పిచ్‌ను చదును చేయడం, ఆకస్మికంగా వర్షం పడితే కవర్లు పట్టుకొని పదుల సంఖ్యలో మైదానాన్ని కవర్ చేయడం, మ్యాచ్ రిఫరీ పర్యవేక్షణ ఇలా ఓ పెద్ద బృందమే మ్యాచ్‌ను మనముందుకు తెస్తుంది. క్రికెట్ అంటే ఫోర్, సిక్సర్, అవుట్, డకౌట్, ఎల్బీడబ్ల్యూ మాత్రమే కాదు... అంతకుమించిన శ్రమ, ప్రణాళికాబద్ధమైన నిర్వహణ ఉంటాయి. ఇదివరకే గత టి20 ప్రపంచకప్ బాధ్యతల్ని మహిళల బృందమే నిర్వహించడంతో ఇకపై కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. మొత్తం మీద ఐసీసీ అతివలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... గురుతర బాధ్యతలను కూడా పెట్టింది. తద్వారా ప్రపంచానికి ప్రపంచకప్‌తో నారీశక్తిని చాటే అవకాశమిచ్చింది. అంపైర్ల జాబితాలో వృందా రాఠి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యూఏఈలో జరిగే మెగా ఈవెంట్ కోసం 13 మంది సభ్యులు గల అధికారిణిల బృందాన్ని ఎంపిక చేసింది. ఇందులో ముగ్గురు మ్యాచ్ రిఫరీలుండగా, 10 మంది అంపైర్లున్నారు. భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవమున్న ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ రిఫరీ మెగా ఈవెంట్ కోసం ఎంపిక చేసిన ముగ్గురు రిఫరీల్లో చోటు దక్కడం గొప్ప విశేషం. ఈ బృందంలో జెరెలిన్ మైకేల్ పెరీరా (శ్రీలంక), షాండ్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా) ఇతర సభ్యులుగా ఉన్నారు. మరో భారత అధికారిణి వృందా రాఠికి పదిమంది సభ్యులు గల ఐసీసీ ఎమిరేట్స్ అంపైర్ల బృందంలో స్థానం లభించింది. ముక్కోణపు, ద్వైపాక్షిక సిరీస్‌లో మ్యాచ్ అధికారులు చూపిన నైపుణ్యం, కనబరిచిన ప్రదర్శన ఆధారంగా అర్హతగల అధికారులనే ప్రపంచకప్ నిర్వహణ బృందానికి ఎంపిక చేశాం. వాళ్లంతా తమ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నాను’ అని ఐసీసీ సీనియర్ మేనేజర్ (అంపైర్లు–రిఫరీలు) సియాన్ ఈసే తెలిపారు.మొత్తం పది జట్లు పోటీపడే ఈ మెగా టోరీ్నలో 23 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్టోబర్ 3న బంగ్లాదేశ్, స్కాట్లాండ్ల మధ్య షార్జాలో జరిగే పోరుతో టోర్నీ షురూ అవుతుంది.ప్ర«దాన టోర్నీకి ముందు ప్రతీ జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నెల 28 నుంచి సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయి. అంపైర్ల బృందం: లౌరెన్ అగెన్‌బ్యాగ్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), సారా దంబయెవానా (జింబాబ్వే), అనా హారిస్ (ఇంగ్లండ్), నిమాలి పెరీరా (శ్రీలంక), క్లెయిర్ పొలోసాక్ (ఆ్రస్టేలియా), వృందా రాఠి (భారత్), స్యు రెడ్‌ఫెర్న్ (ఇంగ్లండ్), ఎలోయిస్ షెరిడాన్ (ఆ్రస్టేలియా), జాక్వెలిన్ విలియమ్స్ (వెస్టిండీస్). మ్యాచ్ రిఫరీలు: జీఎస్ లక్ష్మి (భారత్), జెరెలిన్ మైకేల్ పెరీరా (శ్రీలంక), షాండ్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా). -
విశాఖ టెస్ట్..భారత్ సిరీస్ సమం చేస్తుందా ?
-
Ind vs Aus, 5th T20: ఆస్ట్రేలియాపై భారత్ విజయం టీ20 సిరీస్ కైవసం (ఫొటోలు)
-
ఆసీస్ ను చిత్తు చేసిన భారత్
-
క్రికెట్ వరల్డ్‌కప్ రోజున ఉచిత వసతి! ఎక్కడంటే..
ప్రపంచకప్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరిగబోయే అహ్మదాబాద్‌లో రద్దీ నెలకొంది. ప్రధానంగా మ్యాచ్ జరిగే నరేంద్రమోదీ స్టేడియం పరిసరాల్లోని హోటళ్లు మ్యాచ్ వీక్షకులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి వసతి కష్టంగా మారింది. ఈ తరుణంలో తాజాగా అహ్మదాబాద్‌లోని వేక్‌ఫిట్ మ్యాట్రెస్ సొల్యూషన్స్ కంపెనీ తమ స్టోర్‌లో ఉచిత బసను పొందేందుకు క్రికెట్ అభిమానులకు అవకాశం కల్పిస్తోంది. క్రికెట్ అభిమానుల కోసం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్-గాంధీనగర్‌లో ఉన్న బోడక్‌దేవ్ అవుట్‌లెట్‌లో ప్రపంచ కప్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఉచిత బస ఏర్పాటు చేసినట్లు వేక్ఫీట్ ప్రకటించింది. అయితే ఇందుకోసం అభిమానులు ముందుగా తమ వెబ్సైట్లో మ్యాచ్ టికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. పేరు, చిరునామా వంటి ప్రాథమిక వివరాలను కంపెనీకి ఈమెయిల్ చేయాలి. నవంబర్ 19, ఉదయం 11లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ తెలిపింది. క్రికెట్ అభిమానులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అయిన వేక్‌ఫిట్ మ్యాట్రెస్‌ను తయారుచేస్తోంది. 2016లో స్థాపించిన ఈ కంపెనీ ఈ రంగంలో 30-40 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకుందని సమాచారం. -
నేటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ టికెట్ల విక్రయం
విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 23న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీసీపీ–1 కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి పేటీఎం(ఇన్సైడర్.ఇన్)లో టికెట్లు పొందవచ్చన్నారు. 17, 18 తేదీల్లో పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్, వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయించనున్నట్లు చెప్పారు. ఆఫ్‌లైన్‌లో ఒకరికి రెండు టికెట్లు మాత్రమే విక్రయిస్తారని స్పష్టం చేశారు. ఆన్లైన్లో 10,500, ఆఫ్‌లైన్‌లో 11,500 టికెట్లు విక్రయిస్తారని, కాంప్లిమెంటరీ టికెట్లు 5 వేల వరకు ఉంటాయన్నారు. పోలీసులకు సహకరించాలి : క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే వారు పోలీసులకు సహకరించాలని డీసీపీ–1 కోరారు. మ్యాచ్ ప్రారంభానికి ముందుగానే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని సూచించారు. పోలీసులు సూచించిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురావద్దన్నారు. సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టికెట్లపై ప్రత్యేకంగా మార్కు ఉంటుందన్నారు. స్కాన్‌లో ఆ మార్కు రాకపోయినా, కలర్ జిరాక్స్ టికెట్లు తీసుకొచ్చినా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. వేరే వారి దగ్గర కొనుగోలు చేశామని కుంటిసాకులు చెప్పవద్దన్నారు. అలా వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Ind Vs Aus 2nd ODI Photos: రెండో వన్డేలో ఆసీస్‌పై భారత్ ఘన విజయం (ఫోటోలు)
-
విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యత
విశాఖ: భారత్ హోం సిరీస్‌లో విశాఖకే బీసీసీఐ తొలి ప్రాధాన్యతనిచ్చిందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి చెప్పారు. దీనిలో భాగంగానే వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు భారత్‌తో తలపడనున్నాయని తెలిపారు. ఆయన బుధవారం విశాఖలో విలేకరులతో మాట్లాడారు. వరల్డ్ కప్ వ్యచ్లు ముగియగానే ఆస్ట్రేలియా ఆడనున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 23న, ఫిబ్రవరి 2 నుంచి భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌ను విశాఖలో నిర్వహించేందుకు బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసిందని వివరించారు. విశాఖలోని వైఎస్సార్ స్టేడియం ఇప్పటికే అన్ని ఫార్మాట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిందని, ఇటీవల సీఎం జగన్ విశాఖలో మరో స్టేడియం నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా క్రికెట్‌తో పాటు అన్ని క్రీడలు ఆడుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను 25 ఎకరాల్లో నిర్మించాలన్నారు. దీనిపై ఏసీఏ ప్రణాళిక సిద్ధం చేస్తుందని, స్థల కేటాయింపునకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గోపీనాథ్ రెడ్డి తెలిపారు. చదవండి విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు.. -
500వ మ్యాచ్..29వ సెంచరీ..కోహ్లీ కొత్త రికార్డు
-
ఆసక్తి రేపుతున్న దాయాదుల సమరం..!
-
ప్రవహించే నదిలో క్రికెట్ మ్యాచ్..
-
'అయ్యో శివుడా ఏమాయే'.. ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడితే!
భారత్‌లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు ఏ గల్లీ చూసినా చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా బ్యాట్ పట్టుడు.. బంతి కొట్టుడు అన్న తరహాలో ఉంటారు. ఇక చిన్న ఖాళీ ప్రదేశం కనబడితే చాలు ఆరోజుకు అది మాదే అనేలా జెండా పాతేస్తారు. ఇక అది ఏ గ్రౌండ్ అయినా కానీయండి క్రికెట్ మా కింకర్తవ్యం అన్నట్లుగా ఆడేస్తుంటారు. మరి ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి. విషయంలోకి వెళితే.. ఎక్కడో తెలియదు కానీ కొంతమంది గ్రూప్ కలిసి ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడారు. బౌలర్ వేసిన బంతిని షాట్ ఆడి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని మాత్రమే గమనించిన బ్యాటర్ ఎదురుగా ఉన్న గోల్‌పోస్ట్‌ను గమనించలేదు. ఇంకేముంది నేరుగా వెళ్లి గోల్‌పోస్ట్‌కు గుద్దుకున్నాడు. పాపం దెబ్బ గట్టిగా తగలడంతో అక్కడే పడిపోయాడు. తోటివాళ్లు వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లారు. అయితే దెబ్బ తాకిన వ్యక్తి నొప్పితో విలవిల్లాలాడుతుంటే మిగతావాళ్లు నవ్వుకోవడం కనిపించింది. ఎంతైనా ఫుట్‌బాల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడడమే తప్పు.. పైగా గోల్‌పోస్ట్ పక్కనుంచి వికెట్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఏదైనా ఈ వీడియో చూస్తే మాత్రం నవ్వు రాకుండా మాత్రం ఉండదు. వీలైతే ఒక లుక్కేయండి. pic.twitter.com/x6nZCTyulh — Out Of Context Cricket (@GemsOfCricket) June 24, 2023 చదవండి: డేంజర్ జోన్లో విండీస్.. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుందా? అధికారుల కన్నెర్ర.. నెయ్మర్కు దెబ్బ మీద దెబ్బ -
WTC ఫైనల్ కు కౌంట్ డౌన్ షురూ
-
ఐపీఎల్ సీజన్..లక్నో శుభారంభం
-
ధూమ్ ధామ్ గా IPL ఆరంభం..తెలుగు పాటల హావా
-
పాపం తగలరాని చోట తగిలి..
క్రికెట్లో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్నిసార్లు అయ్యో పాపం అనుకుంటాం. తాజాగా ఒక బ్యాటర్ పరుగు తీస్తున్న క్రమంలో ఫీల్డర్ వేసిన బంతి తగలరాని చోట తగిలి నానా ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రదర్స్ ఎలెవెన్, ఇండియన్ రాయల్స్ మధ్య 10 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ఇండియన్ రాయల్స్ ఇన్నింగ్స్ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్ మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేశారు.. అయితే ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో రెండో పరుగు కోసం పరిగెత్తారు. ఈ క్రమంలో బంతిని అందుకున్న ఫీల్డర్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు పరిగెత్తిన బ్యాటర్ వైపు విసిరాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో బంతి వచ్చి పొట్ట కింద భాగంలో తగిలింది. దెబ్బ గట్టిగానే తగిలిందనుకుంటా పాపం నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. గార్డ్ వేసుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన బ్రదర్స్ ఎలెవెన్ నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. బల్వీందర్ సింగ్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ రాయల్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం పడే సమయానికి ఇండియన్ రాయల్స్ మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులతో ఆడుతుంది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఇరుజట్ల స్కోర్లు సమానంగా ఉండడంతో గోల్డెన్ బాల్‌కు అవకాశం ఇచ్చారు. గోల్డెన్ బాల్లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు విజయం సాధించింది. Timeline cleanser. Sound on for maximum dopamine injection. pic.twitter.com/Vk0bw7B71U — Georgie Parker (@georgieparker) March 23, 2023 చదవండి: ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ ఇంగ్లండ్ సంచలనం.. 62 ఏళ్ల తర్వాత గెలుపు -
INDvsAUS నాలుగో టెస్ట్ : మైదానంలో భారత్-ఆసీస్ ప్రధానుల సందడి (ఫొటోలు)
-
బాలీవుడ్ vs టాలీవుడ్ టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
క్రికెట్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వసంత్ రాథోడ్ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. పలు నివేదికలు ప్రకారం.. అహ్మదాబాద్ సమీపంలోని భదాజ్‌లోని డెంటల్ కాలేజీ ప్లేగ్రౌండ్‌లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జీఎస్టీ ఉద్యోగి అయిన వసంత్ రాథోడ్ (34) గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తూ హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జీఎస్టీ విభాగంలో సీనియర్ క్లర్క్‌గా వసంత్ పనిచేస్తున్నాడు. "వసంత్ రాథోడ్ జట్టు ఫీల్డింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతడు బౌలింగ్ చేసే సమయంలో బాగానే ఉన్నాడు. అయితే ఫీల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతనిని సహాచరులు ఆసుపత్రికి తీసుకు వెళ్ళేటప్పటికే అతడు మరణించాడు" అని జీఎస్టీ విభాగం సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నాడు. కాగా గుజరాత్లో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. రాజ్‌కోట్ లో ప్రశాంత్ భరోలియా(27), సూరత్‌లో జిగ్నేష్ చౌహాన్(31) క్రికెట్ మైదానంలోనే గుండెపోటుతో మరణించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. చదవండి: Team india: హెడ్ కోచ్‌గా ద్రవిడ్ వద్దు.. వారిద్దరే సరైనోళ్లు! సెహ్వాగ్ అయితే? -
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్స్ భారీ డిమాండ్
-
IND Vs SA 3rd ODI: సఫారీలతో టీమిండియా హోరాహోరీ
న్యూఢిల్లీ: భారత గడ్డపై దక్షిణాఫ్రికా పర్యటన చివరి అంకానికి చేరింది. టి20 సిరీస్ కోల్పోయిన ఆ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను చేజార్చుకోరాదని పట్టుదలగా ఉండగా... స్టార్లు లేకపోయినా సిరీస్ గెలవగల సత్తా తమలో ఉందని భారత బృందం నిరూపించే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాన్ని తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మూడో వన్డేలో సఫారీ టీమ్‌తో టీమిండియా తలపడనుంది. రెండు మ్యాచ్‌లలో ఇరు జట్ల ప్రదర్శనను బట్టి చూస్తే మరో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయంగా అనిపిస్తోంది. అయితే వాన కారణంగా పూర్తి స్థాయి మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి. మార్పుల్లేకుండానే... రెండో వన్డేలో భారత జట్టు ఆటను చూస్తే ఈ సిరీస్ ద్వారా జట్టుకు ఆశించిన ఫలితం దక్కినట్లే అనిపిస్తోంది. భారత్ కోణంలో యువ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించడమే ఈ సిరీస్‌లో కీలకం కాగా అందరూ ఆశించిన స్థాయిలో రాణించారు. బ్యాటింగ్‌లో శ్రేయస్, సామ్సన్, ఇషాన్ కిషన్ సత్తా చాటగా, ఆల్‌రౌండర్‌గా శార్దుల్, బౌలింగ్‌లో కుల్దీప్ ఆకట్టుకున్నాడు. షహబాజ్ కూడా అరంగేట్రంలో చెప్పుకోదగ్గ ప్రదర్శనే కనబర్చాడు. పేసర్లలో సిరాజ్ పదునైన బౌలింగ్ హైలైట్‌గా నిలిచింది. తన తాజా ప్రదర్శనతో అతను టి20 వరల్డ్ కప్ జట్టులో బుమ్రా స్థానంలో చోటు దక్కించుకునే అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు. మరోవైపు రెండు మ్యాచ్‌లలోనూ విఫలమైన శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. వీరిద్దరు జట్టుకు శుభారంభం అందిస్తే తిరుగుండదు. ముఖ్యంగా వచ్చే వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న శిఖర్ సొంతగడ్డపై గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడటం అవసరం. మొత్తంగా రెండో వన్డే విజయం అందించిన ఆత్మవిశ్వాసంతో భారత యువ జట్టు మరో గెలుపుపై దృష్టి పెట్టింది. బవుమా రాణించేనా! భారత్‌లో అడుగు పెట్టిన నాటినుంచి దక్షిణాఫ్రికాకు అతి పెద్ద సమస్య కెప్టెన్ బవుమా బ్యాటింగ్. నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 0, 0, 3, 8 పరుగులు చేసిన బవుమా వరల్డ్‌కప్‌కు ముందు ఆఖరి పోరులోనైనా రాణించాలని జట్టు కోరుకుంటోంది. అనారోగ్యంతో గత మ్యాచ్‌కు దూరమైన అతను ఇక్కడ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. డికాక్ శుభారంభం అందించాల్సి ఉండగా, ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన మార్క్రమ్ కూడా మరో కీలక ఇన్నింగ్స్‌పై గురి పెట్టాడు. బవుమా తిరిగొస్తే మలాన్‌ను తుది జట్టు నుంచి తప్పించడం ఖాయం కాబట్టి హెన్‌డ్రిక్స్‌పై అదనపు భారం ఉంది. టూర్ మొత్తం మంచి ప్రదర్శన ఇచ్చిన మిల్లర్ అదే జోరు కొనసాగిస్తే సఫారీ టీమ్ సిరీస్ గెలిచే అవకాశాలు పెరుగుతాయి. అయితే రబడ, నోర్జే తమ స్థాయిలో గొప్ప బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఆల్‌రౌండర్‌గా పార్నెల్ కూడా తమ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. కేశవ్ మహరాజ్ ఆకట్టుకోవడంతో మరోసారి రెండో స్పిన్నర్ లేకుండానే జట్టు బరిలోకి దిగనుంది. ఇలాంటి స్థితిలో పర్యటనను దక్షిణాఫ్రికా గెలుపుతో ముగించగలదా చూడాలి. -
తారల క్రికెట్.. సందడి చేసిన సెలబ్రిటీలు (ఫొటోలు)
-
వరల్డ్ ఎలెవెన్‌తో టీమిండియా మ్యాచ్..ఎప్పుడంటే..?
Azadi Ka Amrit Mahotsav: భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంబురాల్లో భాగంగా ఓ క్రికెట్ మ్యాచ్‌ను కూడా నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా, వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య ఆగస్టు 22న ఈ మ్యాచ్ నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖ బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ ప్రతిపాదనను బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి సైతం ధృవీకరించారు. మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని, వరల్డ్ ఎలెవెన్ జట్టును బరిలోకి దించాలంటే కనీసం 13 నుంచి 14 మంది అంతర్జాతీయ ఆటగాళ్ల అవసరం ఉంటుందని, వాళ్లు అందుబాటులో ఉంటారో లేదో పరిశీలించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సీజన్ మొత్తానికి సంబంధించి ఇదివరకే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయా దేశాలకు (విదేశీ క్రికెటర్లు) చెందిన క్రికెట్ బోర్డులతో మాట్లాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం మ్యాచ్ జరపాలనుకుంటున్న సమయానికి ఇంగ్లండ్ దేశవాళీ సీజన్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతాయని, ఇందులో పాల్గొనే ఆటగాళ్లను ఆడించాలనుకుంటే వారికి తగిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, ఆ విషయమై త్వరలో జరిగే ఐసీసీ సమావేశాల్లో డిస్కస్ చేస్తామని వివరించారు. చదవండి: T20 WC 2022: అసలు తమ అత్యుత్తమ జట్టు ఏదో భారత్‌కు తెలుసా? ఏమిటో! -
వైజాగ్ లో హాట్‌కేకుల్లా అమ్ముడైన మ్యాచ్ టికెట్లు
-
Sakshi Premier League 2022: విజేతలు ఎంఎల్ఆర్ఐటి, గౌతమ్ కాలేజి
-
తగ్గేదే లే.. సౌతాఫ్రికాలోనూ టీమిండియా జోరు..!!
-
సిటీలో క్రికెట్ జోష్.. మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో..
సాక్షి, హైదరాబాద్: సిటీలో క్రికెట్ జోష్ పెరిగింది. ఎక్కడ చూసినా టీ20 ఫీవర్ కన్పిస్తోంది. సుదీర్ఘకాలం తరువాత ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం భారత జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో నగర క్రికెట్ అభిమానుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించడం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. భారీ స్క్రీన్స్‌పై... అభిమానులు ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్‌ను చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకే వీరిని ఆకర్షించడానికి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఈసారి అత్యధిక సంఖ్యలో లైవ్ టెలికాస్ట్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మల్లీప్లెక్స్ థియేటర్స్‌లోనూ క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారీ తెరలపై ప్రదర్శించడానికి కొందరు యజమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండాపూర్, కోకాపేట్లాంటి ప్రాంతాల్లోని కొన్ని లగ్జరీ విల్లాల్లో కమ్యూనిటీ స్క్రీనింగ్‌లో మ్యాచ్‌ను తిలకించడానికి ఏర్పాట్లు చేశారు. జోరుగా బెట్టింగ్... ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున బెట్టింగ్ కార్యకలాపాలు సాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ కేంద్రంగా జరుగుతున్న ఈ బెట్టింగ్ రాకెట్లో ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పెద్ద సంఖ్యలో నిందితులను అరెస్ట్ చేశారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కావటంతో రూ.1,000 బెట్టింగ్‌పై రూ.20, 30 వేలకు పైగానే పందెం సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌లకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 94906 17444 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. పెళ్లితో ఒక్కటి -
క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..?
కాబూల్: అగస్ట్ 15న అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తొలిసారిగా జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పీస్ డిఫెండర్స్, పీస్ హీరోస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చాలామంది క్రికెటర్లు పాల్గొన్నారు. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి జనం పోటెత్తారు. మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు తాలిబన్, అఫ్గాన్ జెండాలను పక్క పక్కనే ఉంచి ఊపడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటేందుకే ప్రజలు ఇలా జెండాల ప్రదర్శన చేశారని తాలిబన్ అధికారులు పేర్కొనడం గమనార్హం. తాలిబన్ల ఆధిపత్య ప్రాంతమైన చమన్ ఉజురి సమీపంలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు దాదాపు 4 వేల మంది ప్రేక్షకులు హాజరు కాగా, వారిలో మహిళలు లేకపోవడం గమనార్హం. సాధారణ ప్రేక్షకుల కంటే తాలిబన్లే ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించడం విశేషం. ఈ మ్యాచ్‌లో పీస్ డిఫెండర్స్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు సీఈవో హమీద్ షిన్వరి తెలిపారు. కాగా, తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్న తర్వాత క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతారన్న వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడీ మ్యాచ్ జరగడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లు క్రికెట్‌కు ఆమోదం తెలపడం శుభసూచకమని, తాలిబన్లలో మార్పుకు ఇది నాంది అని తాలిబన్ సానుభూతిపరులు చెప్పుకుంటున్నారు. చదవండి: కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్లో అనుకుంటే పొరపాటే..! -
పాక్‌లో మ్యాచ్.. సిటీలో బెట్టింగ్
సాక్షి, సిటీబ్యూరో: అబుదాబిలోని షేక్ జయీద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్‌లకు నగరంలోని నిజాంపేట్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నడుస్తోంది. ఈ దందాకు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి సూత్రధారి కాగా.. పశ్చిమ గోదావరి వాసులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. సహాయకుల్లో కృష్ణా జిల్లా వ్యక్తి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు దాడి చేసి అయిదుగురు నిందితులను పట్టుకున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం వెల్లడించారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు, ఇతర ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్ఓటీ డీసీపీ సందీప్‌తో కలిసి గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆద్యంతం వ్యవస్థీకృతం.. ► తూర్పు గోదావరి వాసి సోమన్నకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అయిన లైవ్‌లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్–365, బెట్ ఫెయిర్లకు చెందిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ కలిగి ఉన్నాడు. అంతర్జాతీయంగా వీటిని నిర్వహించే వారి నుంచి దీన్ని పొందాడు. వీటిని ఇతగాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన జి.సత్యపవన్ కుమార్, యూఆర్ సతీష్ రాజులకు అప్పగించాడు. ► వీరిద్దరూ నగరానికి చేరుకుని నిజాంపేట్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. అక్కడ బెట్టింగ్ బోర్డ్, ల్యాప్‌టాప్, టీవీ తదితరాలు ఏర్పాటు చేసుకున్నారు. బెట్టింగ్ బోర్డ్‌లో ఒకేసారి 26 ఫోన్లను కనెక్ట్ చేసే సౌకర్యం ఉంది. అలా అంతమంది పంటర్ల (పందెం కాసేవాళ్లు) ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ బెట్టింగ్ నిర్వహించవచ్చు. హవాలా రూపంలో కీలక లావాదేవీలు.. ► ఈ బోర్డ్ నిర్వహణ కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సీహెచ్ త్రినాథ్, నూజివీడు వాసి ఎన్.భాస్కర్, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన జె.ప్రసాద్‌లను ఆపరేటర్లుగా నియమించుకున్నారు. బెట్టింగ్ బాక్స్ ద్వారా వచ్చే కాల్స్ ఆధారంగా ఈ ముగ్గురూ పంటర్లు కోరిన విధంగా యాప్‌లో బెట్టింగ్ కాస్తారు. దీని నిష్పత్తి నిమిష నిమిషానికీ మారిపోతూ ఉంటుంది. ఓడిన వారు నిష్క్రమిస్తుండగా... కొత్త వారు చేరుతూ ఉంటారు. లాభనష్టాలు పంటర్లకు యాప్‌లో కనిపిస్తూ ఉంటాయి. ► ఈ దందాలో లావాదేవీలు మొత్తం ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సోమన్నకు చేరాల్సిన మొత్తం మాత్రం హవాలా ద్వారా పంపిస్తున్నారు. పీఎస్ఎల్ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్ సాగుతోందని సమాచారం అందుకున్న ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ నేతృత్వంలోని బృందం నిజాంపేటలోని ఫ్లాట్‌పై దాడి చేసింది. సోమన్న మినహా మిగిలిన వారిని అరెస్టు చేసి నగదు, ఉపకరణాలు స్వాధీనం చేసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించింది. చదవండి: స్మగ్లింగ్ ముఠా: కాసుల ఎర.. అమాయకుల చెర -
ఆరంభ మ్యాచ్‌లో చెన్నై ఆడడంపై డౌట్స్
-
అలా ఆడటం.. వధువు లేని పెళ్లి రెండు ఒకటే
లాహోర్: ప్రేక్షకులు లేని క్రికెట్ స్టేడియంలో ఆట.. పెళ్లి కూమార్తె లేని వివాహంలా నిరాసక్తంగా ఉంటుందన్నాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఆటలన్నీ ఆగిపోయాయి. అయితే వైరస్ అదుపులోకి వచ్చాక ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఆటలు ఆడించే దిశగా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హలో యాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ దీని గురించి మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు లేని స్టేడియంలో క్రికెట్ ఆడించేందుకు బోర్డులు ఆమోదం తెలపవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మార్కెట్ చేసుకోలేం. ప్రేక్షకులు లేని స్టేడియంలో క్రికెట్.. పెళ్లి కుమార్తె లేని వివాహం రెండు ఒకేలా నిరాసక్తంగా ఉంటాయి. ఆడే సమయంలో జన సందోహం ఉంటే వచ్చే మజానే వేరు’ అన్నాడు అక్తర్.('సచిన్ అంటే ఏంటో నాకు అప్పుడు తెలిసింది') ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించే అంశంపై గతంలో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించవచ్చని కోహ్లి చెప్పాడు. అయితే ఈల, గోలలేని మ్యాచ్‌లో మజా, మ్యాజిక్ ఉండవని అన్నాడు. గప్‌చుప్‌గా నిర్వహించే ప్రత్యామ్నాయంపై క్రికెటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టోక్స్, జేసన్ రాయ్, బట్లర్, కమిన్స్ ఖాళీ స్టేడియాల్లో ఆటలు జరగాలని కోరుతుండగా... ఆస్ట్రేలియా విఖ్యాత ఆటగాడు అలెన్ బోర్డర్ ప్రేక్షకుల్లేని టి20 ప్రపంచకప్‌ను వ్యతిరేకించారు. మ్యాక్స్‌వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (సడలిస్తే... ప్రాక్టీస్‌ను మార్చుతాం: బీసీసీఐ ) -
క్రికెట్లో ఘర్షణ.. కర్రలతో దాడి
సాక్షి, వరంగల్ : క్రికెట్ మ్యాచ్ కోసం ఒకచోటకు చేరిన యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. కాజీపేట పట్ణణంలో క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కర్రలు, వికెట్లతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ముగ్గరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. ఇంతమంది ఒకచోట చేరి క్రికెట్ ఆడుతున్నా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. (చదవండి : రుణమాఫీకి రూ.1,200 కోట్లు విడుదల) -
క్రికెట్ మ్యాచ్ నిర్వహణ.. కేసు నమోదు
లక్నో : మందులేని మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి లాక్డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్క్షప్తి చేస్తున్నా పలువురు మాత్రం యధేచ్చగా లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన ఓ బీజేపీ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని బారాబంకి జిల్లా ఎస్పీ అవరింద్ చతుర్వేదీ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లాలో లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ స్థానిక బీజేపీ నేత సుధీర్‌సింగ్ బుధవారం క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందటడంతో ఎస్పీ అదేశాల మేరకు అక్కడి చేరుకున్నారు. (‘వుహాన్’ డైరీలో నమ్మలేని నిజాలు) ఆంక్షలను ఉల్లంఘించి మ్యాచ్ నిర్వహించినందుకు సుధీర్ సింగ్‌తో పాటు మరో 19మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా యూపీలోని మొత్తం జిల్లాల్లో బారాబంకితో పాటు మరో 11 జిల్లాల్లో కరోనా ఫ్రీ జిల్లాలుగా గుర్తించారు. అయినప్పటికీ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అధికారలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. -
బ్యాట్ పట్టిన సీజే బాబ్డే.. టాప్ స్కోరర్
సాక్షి, ముంబై : ఆదివారం వచ్చిందంటే చాలు దగ్గరలోని మైదానంలో వాలిపోయి ఇష్టమైన ఆటలతో సరదాగా గడిపేయడానికి చాలామంది ఇష్టపడతారు. స్టాప్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి సివిల్ ఇంజనీర్ వరకు వారాంతంలో కాలక్షేపం కోసం అంతోకొంత సమయం వెచ్చిస్తారా. దీనికి తానేమీ అతీతున్ని కాదంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే సైతం మైదానంలో కాలుమోపారు. ఎప్పుడూ కేసులతో బిజీబిజీగా ఉండే సీజే.. ఆదివారం సరదాగా గడిపారు. రెండురోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వచ్చిన బాబ్డే సహచరులతో కలిసి క్రికెట్ ఆడారు. నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ మైదానం ఈ అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఆల్ జడ్జ్స్ ఎలెవన్,-హైకోర్టు బార్ అసోసియేషన్ ఎలెవన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. 15 ఓవర్ల ఈ మ్యాచ్‌లో ఆల్ జడ్జ్స్ జట్టు తరుఫున బరిలోకి దిగిన బాబ్డే 18 పరుగులతో రాణించి.. మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం సీజే మాట్లాడుతూ.. మ్యాచ్ ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
విండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి
-
తొలి టి20లో భారత్ జయభేరి
-
రాజ్‌కోట్ : రెండో టి20లో భారత్ జయభేరి
-
జిల్లాలో వెల్లివిరిసిన క్రికెటోత్సాహం
సాక్షి, విజయనగరం: టాస్ పడింది. ఆట ఆరంభమైంది. విజయనగరం జిల్లా క్రికెట్ అభిమానుల కల నేరవేరింది. మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తిలకించే అవకాశం జిల్లా అభిమానులకు లభించింది. ఎప్పుడూ ఎంతో కష్టపడి టిక్కెట్లు సంపాదించి... విశాఖ వెళ్లి ఆట చూసి సంతృప్తి చెందే క్రీడాభిమానులకు స్థానికంగానే వారి ఆట చూసే అవకాశం... అదీ ఉచితంగా లభించడంతో ఇక వారి ఆనందానికి అవధులు లేకుం డా పోయాయి. ఓ వైపు రోహిత్‌శర్మ... మరో వైపు జడేజా... ఉమేష్ యాదవ్ వంటి భారతీయ క్రికెట్ దిగ్గజాలనే కాకుండా... దక్షిణాఫ్రికా యోధుల్ని ప్రత్యక్షంగా చూసే అదృష్టం దక్కింది. మూడు రోజుల పాటు ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన సన్నాహక టెస్ట్ మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ప్రారంభమైంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను, వారి ఆటను ప్రత్యక్షంగా వీక్షించి కేరింతలు కొట్టారు. ఇరు జట్ల క్రీడాకారులు మైదానం వద్దకు చేరుకున్నప్పటి నుంచి తిరిగి విశాఖ వెళ్లేంత వరకు పెద్ద ఎత్తున సందడి చేశారు. క్రీడాకారులను తమ సెల్ఫోన్లలో బంధించేందుకు పోటీపడ్డారు. కొందరు అభిమానులు భారత త్రివర్ణ పతకాన్ని ఎగురవేస్తూ ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు మద్దతు పలికారు. మరికొందరు రోహిత్.. రోహిత్ అంటూ భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ పేరును పెద్ద పెట్టున మార్మోగించారు. ప్రత్యర్ధి ఎవరనే పట్టింపులేకుండా దక్షిణాఫ్రికా జట్టు బ్యాట్స్మన్లు బౌండరీలు బాదినపుడు ఉరకలేసే ఉత్సాహంతో ఉప్పొంగిపోయారు. దీంతో మ్యాచ్‌కు అతిధ్యమిచ్చిన డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో క్రీడోత్సాహం వెల్లివిరిసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం విశాఖ వెళుతున్న రోహిత్‌శర్మకు ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు మున్నీషా, కమల, రేష్మలు పెయింటింగ్ బహూకరించారు. రోహిత్ 45వ నంబర్ జెర్సీతో సెంచరీ అభివాదం చేస్తున్నట్లు ఈ పెయింటింగ్ వేశారు. 3గం. 50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ ఇండియా బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్– దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన సన్నాహక టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు వర్షం కారణంగా పూర్తిగా రద్దయిన విషయం విదితమే. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం అనుకూలించటంతో డాక్టర్ పి.వి.జి.రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడామైదానం నిర్వాహకులు మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. మరల కారుమబ్బులు కమ్ముకోవటంతో మ్యాచ్ నిలిచిపోయింది. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఉదయం 10 గంటల సమయానికి విశాఖ నుంచి మైదానానికి చేరుకున్న ఇరుజట్ల క్రీడాకారులు గంటన్నర పాటు సాధన చేశారు. వాతావరణం అనుకూలిస్తే మూడో రోజైన శనివారం మ్యాచ్ కొనసాగనుంది. మార్క్రమ్ సెంచరీ... దక్షిణాఫ్రికా 199/4 మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన సన్నాహక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ సెంచరీ చేశారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ ప్రారంభించగా.. ఓపెనర్లు మార్క్రమ్, డిఎన్ ఎల్గర్‌లు బ్యాటింగ్ ప్రారంభించారు. బోర్డ్ ప్రెసెడెంట్స్ ఎలెవన్ జట్టు పేసర్ ఉమేష్‌యాదవ్ తొలి ఓవర్ బౌల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి ధాటిగా ఆడిన మక్రమ్ 118 బంతుల్లో 100 పరుగులు సాధించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆట నిలిచిపోయే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 199 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో మక్రమ్ 118 బంతుల్లో 100(రిటైర్డ్ హర్ట్) పరుగులతో వెనుదిరగగా.. డీఎల్గర్ 18 బంతుల్లో 6 పరుగులు, తునీస్ డి బ్రుయన్ 17 బంతుల్లో 6 పరుగులు, హమజా 26 బంతుల్లో 22 పరుగులు వద్ద పెవిలియన్‌దారి పట్టారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టింబా బవుమ 92 బంతుల్లో 55 పరుగులు(నాటౌట్), కెపెన్ డూప్లెసిస్ 29 బంతుల్లో 9 పరుగులు(నాటౌట్) చేశారు. బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్ బౌలింగ్: ఉమేష్ యాదవ్ 7 ఓవర్లలో 31/1, సర్దూల్ 10 ఓవర్లలో 34/0, ఇసాన్ పోరెల్ 6 ఓవర్లలో 11/1, అవాస్ ఖాన్ 10 ఓవర్లలో 44/0, జలజ్ సక్సేనా 7 ఓవర్లలో 26/0, డి ఎ జడేజా 10 ఓవర్లలో 52/2. వికెట్లు పతనం: 1–23, 2–33, 3–78, 4–199 -
మూడో టి20లో టీమిండియా ఓటమి
-
క్రికెట్లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య
చెన్నై: క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గొడవ జరగడంతో ఓ పదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థిని కత్తెరతో పొడిచి హత్య చేశాడు. తమిళనాడు కోడైకెనాల్‌లోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఆడుతుండగా ఎస్ కపిల్ రాఘవేంద్ర అనే విద్యార్థికి, నిందితుడికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన అతను సోమవారం కపిల్ రాఘవేంద్రను కత్తెరతో పొడిచాడు. దీంతో గాయపడిన కపిల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో స్కూల్ నుంచి పారిపోయిన జువెనైల్‌ను సమీపంలోని పరిసరాల్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా తోటి విద్యార్థిని తానే చంపానని అంగీకరించాడు. జువెనైల్‌ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. జువెనైల్ స్కూల్‌కు అతన్ని రిమాండ్ చేశారు. -
రంజీ క్రికెటర్ నకిలీ ఆటలు
నెల్లూరు (క్రైమ్): రంజీ క్రికెటర్ జల్సాలకు, వ్యసనాలకు బానిసై మోసాలబాట పట్టాడు. ప్రముఖులు, మంత్రుల పీఏల పేరుతో రాష్ట్రంలోని పలు కార్పొరేట్ సంస్థల నిర్వాహకులకు ఫోన్లు చేసి డబ్బులు వసూళ్లుకు పాల్పడి పలుసార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) పేరు చెప్పి ఓ కార్పొరేట్ హాస్పిటల్‌ను మోసగించబోయి పోలీసులకు చిక్కాడు. నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్లో మంగళవారం రూరల్ డీఎస్పీ కె.వి.రాఘవరెడ్డి నిందితుని వివరాలను విలేకరులకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు కుటుంబం విశాఖపట్నంలోని మధురవాడలో స్థిరపడ్డారు. ఎంబీఏ వరకు చదివిన నాగరాజు 2014–16 కాలంలో రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉండేవాడు. స్పాన్సర్ల నుంచి అధిక మొత్తంలో నగదు రావడంతో మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. అనంతరం నాగరాజుకు క్రికెట్ మ్యాచ్‌ల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయాడు. ఈజీగా మనీ సంపాదించేందుకు మార్గాలు వెతికాడు. మంత్రుల పీఏలు, ప్రముఖుల పీఏలు, రాష్ట్ర అధికారుల పర్సనల్ సెక్రటరీగా పలు కార్పొరేట్ సంస్థలకు తానే ఫోను చేసేవాడు. రంజీ ప్లేయర్ నాగరాజుకు రూ.3 లక్షలు స్పాన్సర్ చేయాలనీ, భవిష్యత్‌లో అతని వల్ల మీకు ఉపయోగం ఉంటుందనీ, మీ సంస్థ లోగోను అతని బ్యాట్‌పై వేసుకుని ప్రచారం కల్పిస్తాడని నమ్మించేవాడు. ఇలా ఇప్పటికే పలువుర్ని మోసగించాడు. ఈనెల 23న నెల్లూరులోని సింహపురి ఆస్పత్రి నిర్వాహకులకు సీఎం పీఏ కేఎన్ఆర్ పేరిట ఫోను చేశాడు. క్రికెట్ ప్లేయర్ నాగరాజుకు రూ.3 లక్షలు స్పాన్సర్ చేయాలనీ, ఏడాదిపాటు అతను ఆడే బ్యాట్‌పై హాస్పిటల్ లోగోను ముద్రించి ప్రచారం చేస్తాడని సూచించాడు. దీనిపై అనుమానం రావడంతో ఆస్పత్రి ఎండీ రవీంద్రరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు సోమవారం రాత్రి నగదు తీసుకునేందుకు సింహపురి హాస్పిటల్ వద్దకు వస్తుండగా ఎస్ఐ సాంబశివరావు అతన్ని అరెస్ట్ చేశారు. -
ఒకే రోజులో ట్రిపుల్ సెంచరీ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లీగ్‌లో పాలమూరు జట్టు రికార్డ్ స్కోర్‌ను నమోదు చేసింది. తెలంగాణ జిల్లాల జట్లలో పాలమూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. హైదరాబాద్‌లోని ఫిర్జాదిగూడ బాబురావుసాగర్ గ్రౌండ్–2లో సోమవారం జరిగిన హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో భాగంగా రాజీవ్ క్రికెట్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 5 వికెట్లు కోల్పోయి 622 పరుగుల భారీ స్కోర్ చేసింది. తెలంగాణ జిల్లాల జట్లలో జిల్లా జట్టు రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు నిర్ణీత ఓవర్లలో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసింది. జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మెన్ గణేష్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అత్యధిక వ్యక్తిగత రికార్డు స్కోర్ చేశాడు. హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో తెలంగాణ జిల్లాల్లోని ఏ క్రీడాకారుడు సాధించని ఘనతను సాధించాడు. నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గణేష్ ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. రాజీవ్ సీసీ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 200 బంతుల్లో 42 ఫోర్లు, 7 సిక్స్‌లతో 318 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహేష్‌బాబు సెంచరీ చేసి రాణించాడు. 78 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. సునీల్‌రెడ్డి (30 నాటౌట్) చేశాడు. రాజీవ్ క్రికెట్ క్లబ్ బౌలర్లు మన్‌కేషా 2, ధీరజ్, పవన్‌కల్యాణ్, ట్రైలోక్ చెరో వికెట్లు తీశారు. గణేష్‌ను అభినందించిన ఎండీసీఏ ప్రతినిధులు... హెచ్‌సీఏ టూడేస్ లీగ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన గణేష్‌ను మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా అభినందించారు. జిల్లా క్రీడాకారుడు గణేష్ ట్రిపుల్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు నమోదు చేసుకోవాలని వారు ఆకాంక్షించారు. -
మాల్యాకు ఊహించని పరిణామం..ఎవరితో వచ్చాడు?
లండన్ : ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ఫ్యుజిటివ్ నేరగాడు విజయ్ మాల్యాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా ఆదివారం ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్‌ను చూడ్డానికి వచ్చిన మాల్యాకు ఒక్కసారిగా షాక్తగిలింది. అక్కడున్నజనం చోర్..చోర్ (దొంగ..దొంగ) అని అరవడం మొదలుపెట్టారు. దేశానికి క్షమాపణ చెప్పు అంటూ నినాదాలు కూడా వినిపించాయి. వారికి ఏదో సమాధానం ఇచ్చినప్పటి కంగుతినడం మాత్రం మాల్యా వంతైంది. క్రికెట్ మ్యాచ్‌లను తరచుగా వీక్షించే మాల్యాకు అంతకుముందెప్పుడూ ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాలేదు. ఈ పరిణామంపై విలేకరులు ప్రశ్నించినపుడు తాను మ్యాచ్ చూడ్డానికి వచ్చానని, జూలైలో జరగనున్న తదుపరి విచారణకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పారు. అలాగే తన తల్లి (దేశం) బాధపడకుండా చూడాలనేది తన ప్రయత్నం అని చెప్పి వెళ్లిపోయాడు. మరోవైపు ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మాల్యా భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు కుమారుడు సిద్ధార్థ్ మాల్యాతో కలిసి వచ్చాడు. ఆస్ట్రేలియాపై ఇండియా విజయం సాధించిన మ్యాచ్‌ను తన కొడుకుతో కలిసి చూడటం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత టీమ్‌కు అభినందనలు తెలిపాడు. Great to watch cricket with my son and even sweeter to see India’s emphatic victory over Australia. Congratulations to @imVkohli and his team pic.twitter.com/R01aB1WbSA — Vijay Mallya (@TheVijayMallya) June 9, 2019 కాగా రూ. 9వేల కోట్లకు పైగా బకాయిపడి లండన్‌కు పారిపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాని తిరిగి భారత్‌కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అటు మాల్యాను అప్పగించేందుకు యూకే హోమ్ ఆఫీస్, వెస్ట్‌మినిస్టర్ కోర్ట్ ఒప్పుకున్నాయి. అయితే తాను అప్పులు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వమే ఒప్పుకోవట్లేదని విజయ్ మాల్యా వాదిస్తున్నాడు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు వెలువడనుంది. #WATCH London, England: Vijay Mallya says, "I am making sure my mother doesn't get hurt", as crowd shouts "Chor hai" while he leaves from the Oval after the match between India and Australia. pic.twitter.com/ft1nTm5m0i — ANI (@ANI) June 9, 2019 -
వన్డే వరల్డ్‌కప్ : ఆసీస్ శుభారంభం
-
వన్డే వరల్డ్‌కప్ : న్యూజిలాండ్ భారీ విజయం
-
ప్రపంచకప్ : ఆరంభం.. అదిరింది
-
ఆట ఆడిస్తున్నారు!
అన్నింట్లో సగం అంటారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధం. సగ భాగం కాదు కదా కనీసం కాలు మోపడానికి కూడా చోటు ఇవ్వడం లేదు. అవకాశాల్లోనే కాదు ఆటల్లోనూ ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. ప్రతి క్రీడలోనూ మహిళల ప్రవేశానికే ఏళ్లకు ఏళ్లు పట్టింది. కొన్నిట్లో అయితే ఇప్పటికీ మహిళలకు ఎంట్రీ లేదు. అలాంటి సరిహద్దులను దాటి ఇద్దరు మహిళామణులు పురుషుల ఆటల్లో నిర్ణయాధికారం చెలాయించే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇక ’మేము చెప్పినట్టు కూడా వినండి’ అంటూ నినదిస్తూ ఆడటమే కాదు ఆడించడమూ తెలుసంటున్నారు. ‘‘నా జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు’’.. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన తర్వాత క్లయిర్ పొలొసాక్ స్పందన ఇది. ఆస్ట్రేలియాకు చెందిన ఆమె పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 27న నమీబియా, ఒమన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్–2 ఫైనల్ మ్యాచ్ తర్వాత హాయిగా నిద్రపోయినట్టు క్లయిర్ చెప్పారు. తన అంపైరింగ్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మాట అన్నారామె. ఈ మ్యాచ్‌కే ఆమె అంపైర్ గా వ్యవహరించి సరికొత్త చరిత్రకు మైలురాయిలా నిలిచారు. ‘‘మైదానంలో ఒక్కోసారి ఆటగాళ్ల భావోద్వేగాలు అదుపు తప్పుతుంటాయి. సంయమనంతో వ్యవహరించి సర్దిచెప్పాల్సిన బాధ్యత అంపైర్లపై ఉంటుంది. కానీ నేను అంపైరింగ్ చేసిన పురుషుల మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో అందరూ బాగా సహకరించారు. ఆటగాళ్ల ప్రవర్తనతో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎల్బీడబ్ల్యూ ఔట్ల కోసం బౌలర్లు బాగా ఒత్తిడి చేస్తుంటారు. కచ్చితంగా ఔట్ అని నమ్మితేనే ఔట్ ఇస్తా. ఈ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను’’అని క్లయిర్ సంతోషం వ్యక్తం చేశారు. పురుషుల మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. 31 ఏళ్ల క్లయిర్ పేరిట మరో రికార్డు కూడా ఉంది. దేశవాళీల్లోనూ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా రెండేళ్ల క్రితమే ఆమె గుర్తింపు పొందారు. 2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ ’ఎ’ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించి ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నారు. మహిళా క్రికెట్లోనూ తనదైన ముద్ర వేసిన క్లెయిర్ గత రెండున్నరేళ్లలో 15 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. 2017 ప్రపంచకప్ మ్యాచ్‌లు, 2018 టి20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లు ఆమె అంపైరింగ్ చేసిన వాటిలో ఉన్నాయి. ‘డబుల్’ రికార్డులోనూ భాగస్వామ్యం! ఆస్ట్రేలియా గడ్డపై ఇద్దరు మహిళలు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించిన చరిత్రాత్మక సందర్భంలోనూ క్లయిర్ పొలొసాక్ భాగస్వామిగా ఉన్నారు. తన దేశానికే చెందిన మరో అంపైర్ ఎలోసి షెరిడాన్‌తో కలిసి 2018 డిసెంబర్ 23న ఈ ఘనత సాధించారు. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్, మెల్బోర్న్ స్టార్ జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ అంపైరింగ్ చేసి ఔరా! అనిపించారు. ‘‘ఇది మరో చారిత్రక ఘట్టం. ఆస్ట్రేలియా క్రికెట్లో మహిళలు, బాలికలను ప్రోత్సహించే దిశగా ఇలాంటి ప్రయత్నాలు కొనసాగుతుండాలి. క్లయిర్, షెరిడాన్ ఎంతో కష్టపడి స్వశక్తితో అగ్రశ్రేణి మహిళా అంపైర్లుగా ఎదిగారు. వారు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ ఆకాంక్షించారు. సాహోరే.. స్టెఫాని! క్లయిర్ పొలొసాక్ సరికొత్త చరిత్ర సృష్టించిన మరుసటి రోజే ఐరోపాలో స్టెఫాని ఫ్రాపర్ట్ పతాక శీర్షికలకు ఎక్కారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ప్రధాన రెఫరీగా వ్యవహరించిన రెండో యూరోపియన్ మహిళగా ఘనత సాధించారు. ఏప్రిల్ 29న అమియన్స్ స్పోర్టింగ్ క్లబ్, రేసింగ్ క్లబ్ స్ట్రాస్బర్స్ జట్ల మధ్య జరిగిన ఫ్రెంచ్ లీగ్ ఫస్ట్ డివిజన్ మ్యాచ్‌లో ఆమె రిఫెరీగా మైదానంలో ఆటగాళ్లతో పాటు పరిగెడుతూ నిర్ణయాధికారం చెలాయించారు. ఫలితం తేలకుండా(0–0) ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు టీమ్‌లకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను స్టెఫాని హెచ్చరించారు. ఇద్దరు స్ట్రాస్బర్స్ ఆటగాళ్లకు ఎల్లో కార్డులు చూపించారు. 35 ఏళ్ల స్టెఫాని ఇప్పటికే సెకండ్ డివిజన్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. జూన్–జూలైలో జరగనున్న మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మ్యాచ్ రిఫెరీగా ఉండనున్నారు. ‘‘నా కష్టానికి తగిన గుర్తింపు లభించింది. పురుషుల లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీగా ఉండే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళ అన్న ఒక్క కారణంతోనే నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకోవడం లేద’ని స్టెఫాని అన్నారు. లీగ్ –1 మ్యాచ్‌కు స్టెఫానిని రిఫెరీగా నియమించడం పట్ల ఫుట్‌బాల్ అభిమానులు, ఫెమినిస్టులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మరింతమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి స్టెఫాని స్ఫూర్తిగా నిలిచారని కితాబిస్తున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను స్టెఫాని సమర్థవంతంగా నిర్వహించారని, ఆమె ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొనలేదని రేసింగ్ క్లబ్ స్ట్రాస్బర్స్ టీమ్ మేనేజర్ థీరి లారే కొనియాడారు. లీగ్ –1 మ్యాచ్‌కు రిఫెరీ వ్యవహరించడానికి స్టెఫానికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె పనితీరు చాలా బాగుందని అభినందించారు. పురుషుల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రిఫెరీగా వ్యవహరించిన తొలి మహిళ రికార్డు జర్మనీకి చెందిన బిబియనా స్టీన్హాస్ పేరిట ఉంది. 2017లో హెర్తా బెర్లిన్, వెర్డర్ బ్రెమెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ద్వారా ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు. బిబియనా బాటలో స్టెఫాని కూడా నడిచి పురుషుల మ్యాచ్‌లో మెయిన్ రెఫరీగా వ్యవహరించిన తొలి ఫ్రెంచ్ మహిళగా ఖ్యాతికెక్కారు. మనదేశ పురుషుల క్రీడల్లోనూ మహిళలకు నిర్ణయాధికారం దక్కడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. - పోడూరి నాగ శ్రీనివాసరావు సాక్షి వెబ్ డెస్క్ -
‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు’
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడే. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి టీడీపీని, అధికారాన్ని చంద్రబాబు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కథాంశంతోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్ సాక్షిగా చంద్రబాబు ఎలా అవమానానికి గురిచేశారు.. టీడీపీని, అధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో ఈ చిత్రంలో చూపించనున్నారు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ప్రస్తుతం ‘వెన్నుపోటు’అంశం ట్రెండ్‌లో ఉండగానే మరో వెన్నుపోటు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (లక్ష్మీస్ ఎన్టీఆర్ : సోషల్ మీడియాలో వైస్రాయ్ సీన్) ఓ క్రికెట్ మ్యాచ్ సందర్బంగా సహచర ఆటగాడినే మరో బ్యాట్స్‌మెన్ రనౌట్ చేయిస్తాడు. బౌలర్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ డిఫెన్స్ ఆడి పరుగుకు పిలుస్తాడు. వెంటనే నాన్ స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ పరుగు కోసం యత్నించాడు. వెంటనే డిఫెన్స్ ఆడిన బ్యాట్స్‌మన్ బంతిని బౌలర్‌కు అందించి సహచర ఆటగాడు రనౌట్‌లో భాగస్వామ్యమవుతాడు. దీంతో సొంత జట్టు ఆటగాడి చర్యతో షాక్‌కు గురైన బ్యాట్స్‌మన్ అసహనంతో క్రీజు వదిలి వెళ్లాడు. ప్రసుతం దీనికి సంబంధించిన వీడియా నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను మించిన వెన్నుపోటు ఇది’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘రాజకీయాల్లోనే కాదు క్రీడల్లోనూ వెన్నుపోటు ఉంటుందని నిరూపించావ్ బ్రదర్’అంటూ వ్యంగ్యంగా పేర్కొంటున్నారు. (ఎన్టీఆర్ సందేశం.. ‘వాడు గాడ్సే కన్నా అధముడు) @RGVzoomin #LakshmiNTR ni minchina venupootu idhi!! pic.twitter.com/nxt3eVfk3F — Saketh Ram Peri (@saketh_4490) March 12, 2019 -
పంటర్లూ నిందితులే!
సాక్షి, సిటీబ్యూరో: ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరిగినా నగరంలో బుకీలు సిద్ధమైపోతారు... ఏ జట్లు ఆడుతున్నా సరే పంటర్లు ఎగబడి మరీ పందాలు కాస్తుంటారు. పార్లమెంట్ నుంచి పంచాయితీ ఎన్నికల వరకు ఏవి జరిగినా పందెంరాయుళ్లు పడగ విప్పుతారు... గెలుపోటములపై బెట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ మధ్య పూర్తయిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్ జోరందుకుంది. కేవలం రాష్ట్రానికి చెంది న వారే కాకుండా పొరుగు రాష్ట్రాల బుకీలు, పంటర్లు రంగంలోకి దిగారు. పోలింగ్‌కు–కౌంటింగ్‌కు మధ్య మూడు రోజుల వ్యవధి ఉండటంతో జోరుగా పందాలు సాగుతున్నాయి. వీటిపై నిఘా ముమ్మరం చేసిన పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు బుకీలపై (పందాలు అంగీకరించే వారు) మాత్రమే నమోదు చేస్తున్న కేసుల్లో ఇకపై పంటర్లనూ (పందాలు కాసే వ్యకు ్తలు) నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. ఇక్కడ పట్టు బిగిస్తే అక్కడకు... ఎన్నికలు కావచ్చు క్రికెట్ సహా ఇతర క్రీడలు కావచ్చు బుకీలకు–పంటర్లకు మధ్య ‘అవినాభావ సంబంధం’ ఉంటుంది. ఈ జూదం నమ్మకం మీద సాగిపోయేది కావడంతో పరిచయస్తులే ఉంటారు. కొత్తగా బుకీలుగా మారే వారు సైతం గతంలో ప్రధాన బుకీల వద్ద పని చేసిన వారై ఉంటారు. వీళ్లు తమ యజమానికి చెందిన కస్టమర్లలో కొందరిని తమ వైపునకు లాక్కుంటారు. వీరి ద్వారా పరిచయమైన వారినే కొత్త కస్టమర్లుగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సిటీలో పోలీసులు ఉక్కుపాదం మోపితే బయటి నగరాలు/రాష్ట్రాలకు వెళ్లిపోతున్న బుకీలు తమ రెగ్యులర్ పంటర్ల సాయంతో యథేచ్ఛగా ‘ఆన్లైన్ దందా’ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంటర్లకు చెక్ చెబితే తప్ప బెట్టింగ్ దందాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసుల నిర్ణయించారు. పందెం కాసేవాళ్లే లేకపోతే అంగీకరించే వారూ ఉండరని భావిస్తున్నారు. దీనికోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. పక్కాగా దొరుకుతున్న ఆధారాలు... బెట్టింగ్స్ గ్యాంగ్స్‌ను టాస్క్‌ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) బృందాలతో పాటు స్థానిక పోలీసులూ పట్టుకుంటున్నారు. ఇలాంటి గ్యాంగ్స్/వ్యక్తుల నుంచి పోలీసులు నగదుతో పాటు టీవీ, సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, బెట్టింగ్ స్లిప్స్, పుస్తకాలు తదితరాలు స్వాధీనం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో అధికారులు కొన్ని రికార్డులూ గుర్తిస్తుంటారు. వీటిలో నిందితులు తమ వద్ద పందాలు కానిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లతో పాటు వారు దేనిపై, ఎంత మొత్తం పందెం కాశారనేది నమోదు చేసి ఉంచుతారు. పంటర్ల వద్ద దొరికిన ల్యాప్టాప్స్ విశ్లేషిస్తే మరికొందు పంటర్ల పేర్లూ బయటి వస్తాయి. ఓ బుకీలను అరెస్టు చేస్తే పంటర్లు మరో బుకీ వద్ద పందాలు కాసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పంటర్ల పైనా కఠిన చర్యలకు నిర్ణయించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల్నే ఆధారంగా చేసుకుని పంటర్లనూ నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. నోటీసుల జారీకి అవకాశం... క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో పందాలు కాసే వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. వీరి బెట్టింగ్స్‌కు బానిసలుగా మారారనే విషయం అనేక మంది తల్లిదండ్రులకు తెలీదు. వీరిని కట్టడి చేస్తేనే బుకీలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు పంటర్లనూ నిందితుల జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే ఆస్కారం లేకపోయినా నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఫోన్ నెంబర్ల ఆధారంగా చిరునామాలు గుర్తించి, సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేయడానికి అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఫలితంగా కుటుంబీకులకూ వీరు పంటర్లనే విషయం తెలియడంతో పాటు వీరి ఆగడాలకు అడ్డుపడే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘పందాలు కాసే వారు ఉన్నంత కాలం బుకీలు పుట్టుకు వస్తూనే ఉంటారు. నగరంలో దాడులు ముమ్మరం చేస్తే గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్ళి వ్యవస్థీకృతంగా వ్యవహారం నడుపుతున్నారు. పంటర్లను కట్టడి చేస్తే ఆటోమేటిక్‌గా బుకీల వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. -
టి20 సిరీస్ భారత్ సొంతం
-
ఫైనల్లోకి బంగ్లాదేశ్
-
భారత్ Vs ఇంగ్లండ్ టెస్టు ఆరంభం అదిరింది
-
టాలీవుడ్ హీరోలు వర్సెస్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పోలీసు క్రికెట్ లీగ్ విజయవంతమైందని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ పోలీసు క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తలపడుతుందని తెలిపారు. క్రికెట్‌తో ప్రజలతో మమేకమైన తీరు, సెలబ్రిటీల కామెంట్లతో కూడిన టీజర్ (వీడియో)ను బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో శనివారం సీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో ముఖ్యంగా యువతతో భాగస్వామ్యం అవుతూ ఏప్రిల్ 10 నుంచి కాలనీ, సెక్టార్ లెవల్, ఠాణా స్థాయి, డివిజనల్ స్థాయి, జోనల్ స్థాయిల్లో క్రికెట్ పోటీలు నిర్వహించామన్నారు. ఇప్పటివరకు 270 జట్ల నుంచి 4050 మంది ఆటగాళ్లు పోటీల్లో పాల్గొన్నారన్నారు. అన్ని విభాగాల్లో 44000 ప్రజలు భాగస్వామ్యులయ్యారు. పోలీసు క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఎల్బీస్టేడియంలో ఆదివారం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టుతో తలపడుతుందని తెలిపారు. ఈ మ్యాచ్ సందర్భంగా సాంస్కృతిక శాఖ నుంచి కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఆదివారం జరిగే మ్యాచ్‌కు నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమానికి హోం మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ, ఈస్ట్‌జోన్ డీసీపీ రమేశ్‌లు పాల్గొన్నారు. స్టార్ ప్లేయర్లు వీరు... సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జట్టు తరఫున నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి, అఖిల్, నాని, శ్రీకాంత్, విజయ దేవరకొండ, నితిన్ తదితరులు పాల్గొంటారు. వీరితో పోలీసు క్రికెట్ జట్టు తలపడనుంది. టీజర్‌ను విడుదల చేస్తున్న నగర సీపీ అంజనీకుమార్ -
రోడ్డు సేఫ్టీపై క్రికెట్ మ్యాచ్
ముంబై : రోడ్డు ప్రమాదలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు భారత క్రికెటర్లు నడుం బిగించారు. కిక్రెట్ ను అమితంగా ప్రేమించే దేశంలో ప్రజలకు క్రికెట్ ద్వారానే మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పలువురు క్రికెటర్లు ముందుకొచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేలా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 24న క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్, అంజిక్యా రహానేలతో పాటు పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా నకిలీ హెల్మెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సచిన్ లేఖ కూడా రాశారు. ఇక దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ఎక్కవ మంది చనిపోతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడంవల్లే ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్రికెటర్లు ముందుకొచ్చారు. -
బ్యాట్‌తో కొట్టిన స్నేహితులు: యువకుడు మృతి
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు మండలం ఈరాడపల్లి గ్రామంలో క్రికెట్ మ్యాచ్‌లో ఘర్షణ ఒకరి నిండు ప్రాణాలు బలిగొంది. ఓ యువకుడిని అతడి స్నేహితులే క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టు కొనసాగిస్తే చాలు...
-
లంకను ఆడుకున్నారు!
కోల్‌కతా: శ్రీలంక క్రికెట్ జట్టుకు భారత గడ్డపై రాబోయే ‘సీన్’ అర్థమైంది. భారత ‘తృతీయ శ్రేణి’ జట్టు బ్యాట్స్‌మెన్ కూడా లంక బౌలర్లను అలవోకగా ఆడుకున్నారు. ఏమాత్రం పదును లేని లంకను ఎదుర్కొని బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శామ్సన్ (143 బంతుల్లో 128; 19 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా... రోహన్ ప్రేమ్ (39; 5 ఫోర్లు), జీవన్‌జ్యోత్ సింగ్ (35; 3 ఫోర్లు), బావనక సందీప్ (33 నాటౌట్; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ గ్రౌండ్లో జరిగిన ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆదివారం ‘డ్రా’గా ముగిసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే తిరిమన్నె వరుస ఓవర్లలో తన్మయ్ అగర్వాల్ (16; 3 ఫోర్లు), ఆకాశ్ భండారి (3)లను అవుట్ చేసి లంకకు శుభారంభం అందించాడు. అయితే శామ్సన్, జీవన్‌జ్యోత్ లంక రెగ్యులర్ బౌలర్లు హెరాత్, దిల్రువాన్ పెరీరా, లక్మల్లను సమర్థంగా ఎదుర్కొని మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఆ తర్వాత కూడా శామ్సన్... రోహన్ ప్రేమ్‌తో 71 పరుగులు, సందీప్‌తో 85 పరుగులు జత చేశాడు. చివరకు 75 ఓవర్ల తర్వాత మ్యాచ్‌ను నిలిపివేసేందుకు ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించారు. జట్టు సభ్యులందరికీ ప్రాక్టీస్ ఆశించిన శ్రీలంక ఏకంగా 14 మందితో బౌలింగ్ చేయించడం విశేషం. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ నెల 16 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 411/9 డిక్లేర్డ్; బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) తిరిమన్నె 16; జీవన్‌జ్యోత్ సింగ్ (సి) డిక్వెలా (బి) పెరీరా 35; ఆకాశ్ భండారి (సి) షనక (బి) తిరిమన్నె 3; శామ్సన్ (సి) డిక్వెలా (బి) సమరవిక్రమ 128; ప్రేమ్ (ఎల్బీ) (బి) డి సిల్వ 39; సందీప్ (నాటౌట్) 33; జలజ్ సక్సేనా (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (75 ఓవర్లలో 5 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–27; 2–31; 3–99; 4–170; 5–255. బౌలింగ్: కరుణరత్నే 4–2–7–0; తిరిమన్నె 6–0–22–2; మాథ్యూస్ 5–2–21–0; షనక 8–0–36–0; హెరాత్ 6–0–15–0; కుషాల్ పెరీరా 9–1–22–1; లక్మల్ 4–1–11–0; గమగే 5–1–19–0; సందకన్ 12–1–54–0; ధనంజయ డి సిల్వా 7–1–35–1; విశ్వ ఫెర్నాండో 1–0–16–0; సమరవిక్రమ 4–0–13–1; రోషన్ సిల్వ 3–1–3–0; చండిమాల్ 1–0–3–0. -
సినీతారలు, కార్పొరేటర్ల క్రికెట్ మ్యాచ్
-
సినీతారలు vs GHMC సిబ్బంది క్రికెట్ మ్యాచ్
-
ప్రయోగాలు చెయ్యం :కోహ్లీ
-
ప్రయోగాలు చెయ్యం :కోహ్లీ
ముంబై : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణేలో జరిగే తొలి మ్యాచ్‌లో రేపు (ఆదివారం) భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. విరాట్ కోహ్లి పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్ వన్డేల్లోనూ అదే జోరును ప్రదర్శించాలని భావిస్తోంది. జట్టు సభ్యులంతా మంచి ఫామ్‌లో ఉన్నారు, ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా ప్రయోగాలు చేయబోమని కోహ్లీ స్పష్టం చేశాడు. మరోవైపు పరిమితి ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఫలితం పునరావృతం కారాదని పట్టుదలగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత మరో కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న ధోనితో పాటు పునరాగమనం చేసిన యువరాజ్‌పై ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది. జేసన్ రాయ్, హేల్స్, బట్లర్‌లాంటి హిట్టర్లతో ఇంగ్లండ్ కూడా మెరుగ్గా కనిపిస్తోంది. -
లిఖితపూర్వక హామీ తీసుకోండి
బీసీసీఐ సీఈఓను కోరిన లోధా కమిటీ న్యూఢిల్లీ: ఆయా రాష్ట్రాల్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని రాష్ట్ర సంఘాల నుంచి లిఖితపూర్వక హామీ తేవాలని లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రాహుల్ జోహ్రిని ఆదేశించింది. అనర్హత వేటుతో పదవిని కోల్పోనున్న ఆయా సంఘాల ప్రతినిధులు మ్యాచ్‌ల నిర్వహణకు, నూతన కార్యవర్గానికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోమని హామీ పత్రాన్ని తేవాలని లోధా కమిటీ స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన ఈ కమిటీ సభ్యులు ఆర్.ఎం.లోధా, జస్టిస్ అశోక్ భాన్, ఆర్.వి.రవీంద్రన్ బుధవారమిక్కడ సమావేశమై బీసీసీఐ సీఈఓకు ఈ మేరకు హామీ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించారు. న్యాయస్థానాల పరిధిలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం, రాజస్తాన్ క్రికెట్ సంఘం వ్యవహారాల్లో కల్పించుకోబోమని లోధా కమిటీ చెప్పింది. క్రికెట్ బాగు కోసం ఈ కమిటీ తెచ్చిన సంస్కరణలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రికి చెప్పింది. -
ఇది నా రాజ్యం
క్రికెట్ మ్యాచ్‌లకు జంతువులు, పక్షులు అంతరాయం కలిగించడం కొత్తేం కాదు. గతంలో అనేకసార్లు మైదానంలోకి కుక్కలు వచ్చి మ్యాచ్‌కు ఆటంకం కలిగించాయి. తొలి రోజు వైజాగ్‌లో కూడా ఓ కుక్క సందడి చేసింది. టీ విరామానికి ముందు బ్రాడ్ ఓవర్లో రెండు బంతులు వేశాక కుక్క మైదానంలోకి వచ్చింది. మైదానం సిబ్బంది వచ్చి దానిని బయటకు పంపారు. కానీ ఒక్క నిమిషంలోపే మళ్లీ అది తిరిగి మైదానంలోకి వచ్చింది. ఇది నా రాజ్యం... మీరెవరూ అనే తరహాలో అక్కడే కాలకృత్యాలు తీర్చుకునే ప్రయత్నం చేసింది. దీంతో దానిని తరుముతున్న సిబ్బందిలో ఒకరు షూ తీసి విసిరేసి దాని వెంటపడ్డాడు. మైదానం అంతా పరుగులు పెట్టించిన తర్వాత గానీ అది బయటకు వెళ్లలేదు. ఈ ఆలస్యంతో అంపైర్లు కాస్త ముందుగానే టీ విరామం ప్రకటించాల్సి వచ్చింది. బహుశా ఇలా మాత్రం గతంలో ఎప్పుడూ జరిగినట్లు లేదు! -
వేదం..విజయవిహారం
భారత్–వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూలపాడులో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. మొదటి రెండు వన్డేల్లో బారత జట్టు మంచి విజయం సాధించింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో చక్కటి బౌలింగ్, ఫీల్డింగ్‌తో విండీస్ జట్టును కట్టడిచేసి 15 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిలకడైన బ్యాట్స్ ఉమెన్ వేద కృష్ణమూర్తి బ్యాటింగ్‌కు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చివరి వన్డే అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి ఎంఏ రహీం, సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేష్ భారత స్కిపర్‌కు ట్రోఫీ అందజేశారు. వరుసగా మూడు వన్డేల్లో ఓటమి చెందినా విండీస్ స్కిప్పర్ సిఫాన్ టేలర్ మూలపాడు గ్రౌండ్‌కు మొదటి ర్యాంకే ఇచ్చింది. ఇక్కడి ప్రేక్షకులు కూడా భారత జట్టుకు సమానంగా ఆ«దరించారని సంతోషం వ్యక్తం చేసింది. ఈనెల 18న టీ20 తొలిమ్యాచ్ ఈ స్టేడియంలోనే జరగనుంది. మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. - విజయవాడ స్పోర్ట్స్ -
గుంటూరుపై కృష్ణా జట్టు విజయం
వెంకటగిరి: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అండర్–19 అంతర జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యా^Œ ల్లో రెండో రోజైన బుధవారం గుంటూరుపై కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు–కృష్ణా జిల్లా జట్ల మధ్యన జరిగిన తొలిరోజు మ్యాచ్‌లో గుంటూరు జట్టు 29.1 ఓవర్లకు 78 పరుగులు చేసి ఆలౌట్ కాగా, కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 54.5 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 305 పరుగులు చేసింది. బుధవారం మ్యాచ్‌ను కొనసాగించి మొత్తం 375 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు 45.3 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. కొనసాగుతున్న వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల పోరు వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల మధ్యన పోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన తొలిరోజు మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు 63 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైఎస్సార్ కడప జట్టు ఆటముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. బుధవారం ఆటను కొనసాగించి మొత్తం 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్ ప్రారంభించిన పశ్చిమగోదావరి జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. గురువారం ఆట కొనసాగనుంది. -
నేటి నుంచి ‘పింక్’ షో
గులాబీ బంతితో భారత్‌లో తొలి డే అండ్ నైట్ మ్యాచ్ కోల్‌కతా: దేశంలో తొలిసారిగా గులాబీ బంతితో క్రికెట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆధ్వర్యంలో నేటి (శనివారం) నుంచి నాలుగు రోజుల పాటు ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగే సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు గులాబీ బంతి వాడబోతున్నారు. మోహన్ బగాన్, భవానీపూర్ క్లబ్‌ల మధ్య మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ఓ టెస్టును డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరపాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అయితే దీనికి ఉపఖండ పరిస్థితులు ఎంత మేరకు అనుకూలిస్తాయనే సందేహాలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ముందుకు వచ్చి ఈ మ్యాచ్‌ను డే అండ్ నైట్‌లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే కివీస్‌తో మ్యాచ్ కూడా ఈడెన్‌లో జరిపే అవకాశాలున్నాయి. మరోవైపు రెండు రోజుల్లో రుతుపవనాలు బెంగాల్లో ప్రవేశించనుండడంతో వర్షం ఆటంకంగా మారే అవకాశాలున్నాయి. భారత క్రికెటర్లు షమీ, సాహా ఈ మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఏడేళ్ల క్రితం ఆసీస్‌లో జరిగిన ఎమర్జింగ్ సిరీస్‌లో సాహా పింక్ బంతితో క్రికెట్ ఆడాడు. -
అంపైర్ నోబాల్ ఇచ్చాడని.. చెల్లెలికి విషమిచ్చాడు!
క్రికెట్ అంటే మన దేశంలో అందరికీ ఇష్టమే. అయితే అందులో వివాదాలకు కూడా ఏమాత్రం కొదవలేదు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలో గల జరారా పట్టణంలో ఇలాగే జరిగిన ఓ వివాదం.. చివరకు విషాదాంతమైంది. అక్కడివాళ్లు ఐపీఎల్ తరహాలోనే జేపీఎల్ అని ఓ టోర్నమెంటు నిర్వహించుకున్నారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 5,100 ఇస్తామన్నారు. జరారా, బరికి జట్ల మధ్య జరుగుతున్న ఓ మ్యాచ్‌లో సందీప్ పాల్ అనే బౌలర్ వేసిన బాల్‌ను అంపైర్ రాజ్‌కుమార్ నోబాల్‌గా ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాల్ కోరాడు. కానీ అంపైర్ తిరస్కరించడంతో, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని చంపేస్తానని బెదిరించాడు. అయితే, రాజ్‌కుమార్ దాన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు. సరిగ్గా మర్నాడే రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులంతా పొలానికి వెళ్లినపుడు సందీప్ పాల్ వాళ్లింటికి వెళ్లి, అక్కడున్న 15 ఏళ్ల పూజకు, ఆమె స్నేహితులు ముగ్గురికి కూల్డ్రింకులు ఇచ్చాడు. వాళ్లందరికీ అతడు తెలుసు కాబట్టి అనుమానం ఏమీ రాలేదు. విషం కలిపిన ఆ డ్రింకులను వాళ్లు తాగేశారు. కాసేపటికే పూజ కుప్పకూలింది. దాంతో ఆమెను, మిగిలిన ముగ్గురిని కూడా ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం అలీగఢ్‌లోని పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. సంఘటన స్థలంలోనే మరో పురుగుల మందు సీసా కూడా ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మ్యాచ్‌కు టిమ్ కుక్
కాన్పూర్: ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తన జీవితంలో తొలి సారి క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌లో ఉన్న కుక్ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఆహ్వానం మేరకు స్టేడియానికి వచ్చి గుజరాత్, కోల్‌కతా మ్యాచ్‌ను తిలకించారు. ‘చాలా అద్భుతంగా ఉంది. నాకు తెగ నచ్చేసింది. ఇంత వేడిలో మ్యాచ్ చూడటం అంత సులువు కాకపోయినా నాకు ఇదో కొత్త అనుభూతి. క్రికెట్ ఏమిటో, క్రీడల ప్రాధాన్యత ఏమిటో ఇక్కడ కనిపించింది’ అని కుక్ ఆనందపడ్డారు. -
బెట్టింగ్స్ వయా బ్యాంక్ అకౌంట్స్!
* ఐదేళ్లుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా * దాడి చేసి ముగ్గురిని పట్టుకున్న ఎస్ఓటీ కాప్స్ * రూ.9 లక్షల నగదు, రెండు ల్యాప్టాప్స్ స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్స్ నిర్వహించే బుకీలు తెలివిమీరుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఎక్కడా పంటర్లు ‘ప్రత్యక్ష సంబంధాలు’ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఓ ముఠాను మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి రూ.9 లక్షల నగదు, ల్యాప్టాప్స్, టీవీ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఈ.రామ్చంద్రారెడ్డి తెలిపారు. బెట్టింగ్స్ సాంకేతిక పరిభాషలో పందాలు నిర్వహించే వాళ్లను బుకీలని, పందాలు కాసే వ్యక్తుల్ని పంటర్లనీ అంటారు. సికింద్రాబాద్‌లోని సింధి కాలనీకి చెందిన పి.మహేష్‌బాబు నేతృత్వంలో హస్మత్‌పేట్‌కు చెందిన మహేష్‌కుమార్, రసూల్పురవాసి బి.కిరణ్‌కుమార్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ త్రయం దాదాపు ఐదేళ్లుగా బెట్టింగ్ దందా నిర్వహిస్తోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన జిత్తు ద్వారా ఎప్పటికప్పుడు బెట్టింగ్ రేట్లు తెలుసుకోవడంతో పాటు ఫోన్స్ కనెక్టింగ్ బాక్స్ల్నీ సమీకరించుకున్నారు. ఈ ముగ్గురూ బెట్టింగ్స్ నిర్వహణలో ఏ కోణంలోనూ పోలీసుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్‌బాబు మల్కాజ్‌గిరిలోని వాణి నగర్లో నివసించే తన రెండో భార్య ఫ్లాట్‌నే డెన్‌గా మార్చుకున్నాడు. అక్కడే టీవీ, ల్యాప్టాప్స్, ఫోన్లు తదితరాలు ఏర్పాటు చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరు బుకీలు ఇతడికి సహకరిస్తున్నారు. పరిచయస్తులైన పంటర్ల నుంచి ఫోన్ల ద్వారా బెట్టింగ్స్ అంగీకరిస్తున్న ఈ ముఠా... అందుకు సంబంధించిన డబ్బును నేరుగా తీసుకునేదికాదు. ప్రతి మ్యాచ్‌కు సంబంధించి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకోవడం, వాటి ద్వారానే బదిలీ చేయడం చేసేది. ఈ గ్యాంగ్ ఉప్పల్‌లో జరుగుతున్న మంగళవారం నాటి ఐపీఎల్ మ్యాచ్ కోసం బెట్టింగ్స్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎస్ఓటీకి సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామి నేతృత్వంలోని బృందం వాణినగర్‌లోని ఫ్లాట్‌పై దాడి చేసి మహేష్‌బాబు, మహేష్ కుమార్, కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న జిత్తు కోసం గాలిస్తోంది. -
17న స్టార్స్ క్రికెట్
పోటీలో 8 జట్లుగా 48 ప్రముఖ నటులు పాల్గొననున్న రజనీ, కమల్, అమితాబ్, చిరంజీవి నాగార్జున, మమ్ముట్టి, మోహన్‌లాల్ ఏప్రిల్ నెల భానుడి ప్రతాపంతో ఎండలు మండే రోజులు. అలాంటి సమయంలో సినీ ప్రియులను కూల్ పరచే సమాచారం స్టార్స్ క్రికెట్. అవును ప్రముఖ భారతీయ నటీనటులను ఒకే చోట చూసి అభిమానులు పులకించే తరుణం అది. స్టార్ నటీనటులు బ్యాట్ చేత పట్టి గౌండ్ న లుమూలల బంతులను పరుగులెత్తిస్తుంటే, మరి కొందరు చాకచక్యంతో బంతుల్ని విసిరి వికెట్లు పడగొడుతుంటే వీక్షకులు పొందే ఆనందం, కుర్రకారుల కేరింతలు మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. అలాంటి అరుదైన తరుణం ఏప్రిల్ 17న చెన్నై ప్రజల కోసం రానుంది. దక్షిణ భారత నటీన టుల సంఘం నూతన భవన నిర్మాణ నిధి కోసం ఈ స్టార్ క్రికెట్‌ను నిర్వహించినుందన్న విషయం తెలిసింది. ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి సంబంధించిన తాజా సమాచారం ఇది చెన్నైలోని చేపాక్ స్టేడియంలో కనులవిందుగా జరగనుంది. ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున, మలయాళ సూపర్‌స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రముఖ కళాకారులు పాల్గొననున్నారు. ఈ స్టార్ క్రికెట్ క్రీడలో 8 జట్లు పోటీ పడనున్నాయి. ఒక్కో జట్టులో ఆరుగురు నటులు చొప్పున 48 మంది ఆడనున్నారు. వీటికి నటుడు సూర్య, విశాల్, ఆర్య, దనుష్, జీవా, విష్ణు ఒక్కో జట్టుకు ఒక్కొక్కరు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.ఈ జట్టులకు చెన్నై, మదురై, తిరుచ్చి అంటూ ఊర్ల పేర్లను పెట్టనున్నారు.ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ వయసు రీత్యా ఏ జట్టులో పాల్గొనక పోయినా తొలి బంతిని వేసి క్రీడను ప్రారంభించనున్నారు. కమలహాసన్ ఒక జట్టులో ఆడనున్నారు. ఇక ఒక్కో జట్టుకు ఒక్కో అగ్ర కథానాయకి అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. అలా అందాల భామలు నయనతార, త్రిష, అనుష్క, కాజల్‌అగర్వాల్, సమంత వీక్షకుల్ని అలరించనున్నారు. ఈ స్టార్ క్రికెట్ క్రీడలో తొలి ఆట గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అందులో గెలిచిన జట్టు సెమీఫైనల్, అందులో గెలుపొందిన వారు ఫైనల్లో పోటీ పడనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ క్రీడ జరగనుంది. ఇప్పటికే సినీ కళాకారులందరూ విధిగా ఇందులో పాల్గొనాలని సంఘ నిర్వాహకం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ స్టార్స్ క్రికెట్ క్రీడా పోటీలో ప్రఖ్యాత నటీనటులందరూ పాల్గొననునందున గట్టి భద్రతకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నగర పోలీస్‌కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ను సంఘ నిర్వాహకులు కలిసి అనుమతి కోరుతూ విన్నపం పత్రాన్ని అందించారు. -
అమితాబ్.. చిరంజీవి.. ఓ క్రికెట్ మ్యాచ్!
చెన్నై:ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాగా, మరొకరు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఆ ఇద్దరూ ఒక వేదికపైకి వస్తే అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. అయితే, వాళ్ళిద్దరూ కలసి వస్తున్నది ఓ క్రికెట్ మ్యాచ్ కోసం. ఏప్రిల్ 17 వ తేదీన నడిగర సంఘం ఆధ్వర్యంలో ఓ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కు అమితాబ్‌తో పాటు, చిరంజీవి కూడా హాజరవుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్‌లు కూడా రానున్నారు. చెన్నైలో ‘నడిగర సంఘా’నికి కొత్త భవన నిర్మాణంలో భాగంగా క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ లో 48 మంది నటులతో కూడిన 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన టెలివిజన్ హక్కులను రూ.9 కోట్లకు అమ్మినట్లు వినికిడి. -
ఆట బాబోయ్!
జీవన కాలమ్ మొన్నంటే మొన్న కలకత్తా ఈడెన్గార్డెన్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఆట చాలా విషయాలను నేర్పింది. శనివారం ఉదయం నుంచీ అన్ని చానెళ్లు రకరకాల ఊహాగానాలనూ, ఇంటర్వ్యూలనూ ప్రసారం చేస్తున్నాయి. అందరి దృష్టీ ఆట మీదే ఉంది. అయితే చాలా కారణాలతో ఈ ఆటలో పాకిస్తాన్ విజయం సాధించడానికి ఎన్నో రకాల సూచనలు మొదటినుంచీ కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచ కప్పులోనే మొన్న బంగ్లాదేశ్‌తో ఆడుతూ పాకిస్తాన్ అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం ఒక కారణం. కాగా- ఈడెన్‌గార్డెన్ చరిత్రలో ఎప్పుడూ ఇండియా - పాకిస్తాన్‌ని ఎదిరించి గెలవలేదు. ఎప్పుడూ పాకిస్తాన్ ఓడిపోలేదు. కనుక, ఏ విధంగా చూసినా అన్ని శకునాలూ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. టీవీ సెట్ల ముందు కూర్చున్న కోట్లాదిమంది మనస్సుల్లో ఈ నిజాలు కదలకపోవు. మొన్నటి కలకత్తాలో రెండు జట్లనూ క్రికెట్ యంత్రాంగం, ప్రభుత్వం పలకరించిన తీరు అమోఘం. ప్రపంచ కప్పు ఫైనల్స్ ఆటకు జరిపిన ఉత్సవాన్ని తలపించింది. అయితే ఎప్పుడు ఈ రెండు జట్లు తలపడినా ఇంత ముమ్మరాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ నేను గమనించిన, చాలామంది గుర్తించని ముఖ్యమైన ‘తేడా’ ఈ రెండు దేశాల ఆటల్లో పాకిస్తాన్‌ది ఆవేశం. ఇండియాది కేవలం ఆనందం. గెలవాలనే ఆశ రెండు దేశాలకీ, రెండు పక్షాలకీ ఉన్నా- ఆ ప్రయత్నంలో అతి ప్రముఖమైన తేడా ఉంది. ఉదాహ రణలు బోలెడు (రెండోసారి ఆట హైలైట్స్ చూశాక చెప్తున్నాను). ఉమర్ అఖ్మల్ బ్యాట్‌కి బంతి తగిలి ధోనీ కేచ్ పట్టుకున్నాక, ఔట్ అయ్యాక జడేజా, ధోనీ పిచ్ మధ్యకు వచ్చి పలకరించు కున్నారు, మాట్లాడుకున్నారు. ఇద్దరి ముఖాలలో స్పష్టమైన ఆనందం తొణికిసలాడింది. ఏ విధమైన ఆవేశమూ ఆ ఆనందానికి లేదు. పాకిస్తాన్ ఆటలో మహమ్మద్ సమీ బంతికి శిఖర్ ధావన్ ఔట్ అయి నప్పుడు సమీ ముఖాన్ని చూడాలి. ‘పిచ్చికూనల్లారా! మీకిదే తగిన శాస్తి - ఇంకా ముందుంది ముసళ్ల పండుగ’ అన్న ఆవేశం స్పష్టంగా కనిపించింది. ‘మీ రోగం కుదిరిందా!’ అన్న ఎకసెక్కం మిగతా ఆటగాళ్ల విసుర్లలో కనిపించింది. 45 పరుగుల తర్వాత మాలిక్ బంతికి కోహ్లి ఫోర్ కొట్టాక - పిచ్ మధ్యకి వచ్చి ధోనీ, కోహ్లి ఆనందించిన దృశ్యం ఆటగాళ్ల ఆరోగ్యకరమైన స్పందనకు నిదర్శనం. పడిపోయే ప్రతీ వికెట్ దగ్గరా అఫ్రీది వీరావేశం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఇదే రెండు జట్ల దృక్పథాలలో పెద్ద తేడా. ఇదే ఎప్పుడూ ఇండియా విజయం సాధించడానికీ, పాకిస్తాన్ ఎప్పుడూ ఓడిపోవడానికీ ముఖ్యమైన కారణం. ఇండియా ‘ఆట’ని ఆడి ఆనందిస్తోంది. పాకిస్తాన్ విజయం కోసం ‘కసి’ని పెంచుకుంటోంది. ఇండియాలో ప్రేక్షకులు ఇండియా విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. షార్జాలో క్రికెట్ ఆట గుర్తుంటే-పాకిస్తాన్ ఓడుతున్నప్పుడల్లా ఆట విజ యానికి దేవుడినీ, మతాన్నీ ప్రేక్షకులు అప్పటికప్పుడే గేలరీలో ఆశ్రయించడం ఇందుకు పెద్ద నిదర్శనం. ఆటలోనే కాదు, ఏ ప్రయత్నంలో అయినా నిజమైన, నికార్సయిన ‘ప్రయత్నం’ ఆ కృషికి బలాన్నిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ‘వినియోగించుకోవాల’నే లక్ష్యం దాన్ని బలహీనం చేస్తుంది. ప్రతీసారీ ఇండియాకు క్రికెట్ మరొక ఆట. పాకిస్తాన్‌ని గెలవాలన్న పట్టుదల. అంతవరకే. కానీ పాకిస్తాన్‌కి అది యుద్ధం. తమ సత్తా చాటాలన్న ఆవేశం. An unfettered happiness at an achievement makes it rewarding. A motive cripples it, kill it, even makes it lopsided. నాకు పాకిస్తాన్ ఆటగాళ్ల మీద అపారమైన గౌరవం. అలనాటి ఇమ్రాన్‌ఖాన్, అబ్దుల్‌ఖాదిర్, జహీర్ అబ్బాస్ లాంటి ఆటగాళ్లంటే నాకు పిచ్చి. వారి మనస్సులోకి దూరి ఏమనుకుంటున్నారో చెప్పలేం కాని- వారు క్రికెట్ పరపతినీ, ప్రతిష్టనీ పెంచారు. మొన్న ‘‘ఇండియాలో మాకు మాతృదేశం కంటే ఆదరణ లభిస్తోంది’’ అన్న అఫ్రీది మీద ఒకాయన కేసు పెట్టడం, జావీద్ మియన్దాద్ వంటి ఆటగాడు విరుచుకుపడడం ఇందుకు దురదృష్టకరమైన నిదర్శనాలు. అఫ్రీదిని కెప్టెన్‌గా తొలగిస్తారన్న వార్తలు అప్పుడే వస్తున్నాయి. ఆ మధ్య మోదీగారు అకస్మాత్తుగా పాకిస్తాన్ వెళ్లి శాంతియుతమైన సుహృద్భావం కోసం అక్కడి నాయకత్వంతో చేతులు కలపడం ద్వారా మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నంలో కేవలం రాజకీయ కోణాన్ని మాత్రమే చూసిన మన నాయకులు - ప్రస్తుతం మహమ్మద్ సమీ ధోరణిలో స్పందిస్తున్నారని నాకు అనిపిస్తుంది. - గొల్లపూడి మారుతీరావు -
కమల్... రజనీ...ఓ క్రికెట్ మ్యాచ్
కమల్‌హాసన్, రజనీకాంత్‌లు చాలారోజులకి మళ్ళీ కలసి జనం ముందుకు రానున్నారు. ఫ్యాన్స్ ఆనం దించే వార్త ఇది. అయితే, వాళ్ళిద్దరూ కలసి వస్తున్నది సినిమా కోసం కాదండీ! ఓ క్రికెట్మ్యాచ్ కోసం! చిత్తూరు నాగయ్య, అంజలీదేవి, భానుమతి లాంటి పెద్దల భాగస్వామ్యంతో 1950ల నాటికే ఏర్పడ్డ దక్షిణ భారత సినీ కళాకారుల సంఘం - ‘నడి గర సంఘం’. చెన్నైలో ‘నడిగర సంఘా’నికి కొత్త భవనం కట్టడానికి రానున్న ఏప్రిల్ 10న సినీ తారలతో సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. తద్వారా సేకరించే సొమ్మును సంఘం భవన నిర్మాణానికి వినియోగిస్తారు. ‘కబాలి’, ‘2.0’ చిత్రాలతో బిజీగా ఉన్న రజనీ, అమెరికాలో షూటింగ్ చేసే ద్విభాషా చిత్రం బిజీలో ఉన్న కమల్ - ఇద్దరూ మ్యాచ్‌కు రానున్నా రట! ఈ భవన నిర్మాణంపై ‘నడిగర సంఘం’ ఎన్నికలు ఆ మధ్య వేడి వేడిగా జరగడం తెలిసిందే. -
వ్యవస్థీకృతంగా బెట్టింగ్ దందా
గుట్టురట్టు చేసిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్స్ నిర్వహించే బుకీలు నానాటికీ తెలివి మీరుతున్నారు. మూస ధోరణి నుంచి హైటెక్ పంథాలోకి మారిన వైనం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన ఎం.సంతోష్ మరో అడుగు ముందుకు వేశాడు. బెట్టింగ్స్ కోసం ఓ బ్రాంచ్ ‘ఆఫీస్’ సైతం ఓపెన్ చేశాడు. వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న ఈ ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి కథనం ప్రకారం... కాచిగూడకు చెందిన వ్యాపారి సంతోష్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు బెట్టింగ్ దందా ప్రారంభించాడు. తమ ప్రాంతానికే చెందిన వినోద్, శ్యామ్‌సుందర్ కసత్లతో కలిసి ఇసామియాబజార్‌లో డెన్ ఏర్పాటు చేసుకుని పరిచయస్థులైన పంటర్లు (పందాలు కాసే వ్యక్తులు) నుంచి ఫోన్లపై బెట్టింగ్స్ స్వీకరిస్తున్నాడు. సుల్తాన్‌బజార్ ప్రాంతంలోనూ మరో ‘బ్రాంచ్ ఆఫీస్’ ఓపె న్ చేసిన ఇతగాడు దాని నిర్వహణ బాధ్యతల్ని నాంపల్లికి చెందిన ప్రైవే ట్ ఉద్యోగి అరుణ్ శర్మకు అప్పగించాడు. ఆశిష్ అగర్వాల్, రాజు లు రెండు ప్రాంతాల్లోని బెట్టింగ్ నిర్వాహకులకు సహకరిస్తున్నారు. వీరికి సంతోష్ నెలకు రూ.ఆరు వేల నుంచి రూ.8 వేల జీతం ఇస్తున్నాడు. బెట్టింగ్ నిర్వహణలో రేష్యోగా పిలిచే అప్డేట్స్ అత్యంత కీలకం. ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు ఇందులో ఉంటాయి. దేశ వ్యాప్తంగా వీటి వివరాలు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలిపేందుకు ఢిల్లీకి చెందిన అగర్వాల్‌తో ఒప్పందం చేసుకుని నెలకు రూ.3 వేలు చొప్పున చెల్లిస్తున్నాడు. సిడ్నీలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ నేపథ్యంలో సంతోష్ తన ‘రెండు కార్యాలయాల్లోనూ’ జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, ఎ.రవికుమార్, ఎస్.శేఖర్‌రెడ్డి తమ బృందాలతో శనివారం రెండుచోట్లా దాడులు చేశారు. సంతోష్‌తో పాటు వినోద్, శ్యామ్, అరుణ్, ఆశిష్‌లను అరెస్టు చేసి టీవీ, సెల్టాప్ బాక్స్, సెల్ఫోన్లతో పాటు రూ.1.25 లక్షల నగదు, బెట్టింగ్ చీటీలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు లు కేసును స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగించారు. -
ఏపీ, తెలంగాణ సినీ స్టార్స్ క్రికెట్
-
జూన్ 21న తెలుగు,తమిళ తారల క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు చేయూతను అందించేందుకు తెలుగు, తమిళ సినీనటులు ముందుకొచ్చారు. గురువారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి తమ కార్యాచరణను వివరించారు. అవసరమైన నిధులు సమకూర్చేందుకు జూన్ 21న ఎల్బీ స్టేడియంలో తెలుగు, తమిళ సినీ నటులతో క్రికెట్ మ్యాచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల రూపాయల వరకు సమకూరుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తామని ప్రతినిధి బృందం ప్రకటించింది. ఈ క్రికెట్ మ్యాచ్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొంటారు.