
కమల్... రజనీ...ఓ క్రికెట్ మ్యాచ్
కమల్‌హాసన్, రజనీకాంత్‌లు చాలారోజులకి మళ్ళీ కలసి జనం ముందుకు రానున్నారు. ఫ్యాన్స్ ఆనం దించే వార్త ఇది. అయితే, వాళ్ళిద్దరూ కలసి వస్తున్నది సినిమా కోసం కాదండీ! ఓ క్రికెట్‌మ్యాచ్ కోసం! చిత్తూరు నాగయ్య, అంజలీదేవి, భానుమతి లాంటి పెద్దల భాగస్వామ్యంతో 1950ల నాటికే ఏర్పడ్డ దక్షిణ భారత సినీ కళాకారుల సంఘం - ‘నడి గర సంఘం’.
చెన్నైలో ‘నడిగర సంఘా’నికి కొత్త భవనం కట్టడానికి రానున్న ఏప్రిల్ 10న సినీ తారలతో సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. తద్వారా సేకరించే సొమ్మును సంఘం భవన నిర్మాణానికి వినియోగిస్తారు. ‘కబాలి’, ‘2.0’ చిత్రాలతో బిజీగా ఉన్న రజనీ, అమెరికాలో షూటింగ్ చేసే ద్విభాషా చిత్రం బిజీలో ఉన్న కమల్ - ఇద్దరూ మ్యాచ్‌కు రానున్నా రట! ఈ భవన నిర్మాణంపై ‘నడిగర సంఘం’ ఎన్నికలు ఆ మధ్య వేడి వేడిగా జరగడం తెలిసిందే.