సాధారణంగా స్టార్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తే పెద్ద విషయమేం కాదు. కానీ ముగ్గురు ప్రముఖ హీరోలు ఒకే మూవీలో కలిసి నటిస్తే మాత్రం విశేషమని చెప్పొచ్చు. ఇలాంటిదే త్వరలో తమిళ చిత్రసీమలో జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)
ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో సినిమాలు చూసిన వాళ్లకు ఇళయరాజా పాటల్లోనే మ్యాజిక్ ఏంటనేది తెలుస్తుంది. దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలకు సంగీతమందించిన ఈయన.. దశాబ్దాల పాటు గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఇప్పుడు ఈయన జీవితాన్నే సినిమాగా తీయబోతున్నారు. ఇందులోనే కమల్ హాసన్-రజినీకాంత్ అతిథి పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ కూతురు ఐశ్వర్యని గతంలో పెళ్లి చేసుకున్న ధనుష్.. కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చేశాడు. దీంతో రజినీకాంత్‌కి ఇతడు మాజీ అల్లుడు అయిపోయాడు. అయినా సరే ఇప్పుడు రజినీకాంత్.. ధనుష్ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. బహుశా ఇళయరాజా బయోపిక్ కావడం వల్లే ఒప్పుకొని ఉంటాడని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే)
Comments
Please login to add a commentAdd a comment