అమితాబ్.. చిరంజీవి.. ఓ క్రికెట్ మ్యాచ్! | Big B, Chiranjeevi to attend Nadigar Sangam cricket match | Sakshi
Sakshi News home page

అమితాబ్.. చిరంజీవి.. ఓ క్రికెట్ మ్యాచ్!

Published Thu, Mar 24 2016 4:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

అమితాబ్, చిరంజీవి(ఫైల్ ఫోటో)

అమితాబ్, చిరంజీవి(ఫైల్ ఫోటో)

చెన్నై:ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కాగా, మరొకరు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఆ ఇద్దరూ ఒక వేదికపైకి వస్తే అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. అయితే, వాళ్ళిద్దరూ కలసి వస్తున్నది ఓ క్రికెట్ మ్యాచ్ కోసం. ఏప్రిల్ 17 వ తేదీన నడిగర సంఘం ఆధ్వర్యంలో ఓ క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కు అమితాబ్తో పాటు, చిరంజీవి కూడా హాజరవుతున్నట్లు సమాచారం.  ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్లు కూడా రానున్నారు.

 

చెన్నైలో ‘నడిగర సంఘా’నికి కొత్త భవన నిర్మాణంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ లో 48 మంది నటులతో కూడిన 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ మ్యాచ్లకు సంబంధించిన టెలివిజన్ హక్కులను రూ.9 కోట్లకు అమ్మినట్లు వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement