ప్రపంచ క్రికెట్‌ క్రీడాభిమానులకు కనువిందైన కానుక | The Greatest Rivalry India Vs Pakistan OTT Review In Telugu, Must Watch Documentary | Sakshi
Sakshi News home page

ప్రపంచ క్రికెట్‌ క్రీడాభిమానులకు కనువిందైన కానుక

Published Sat, Feb 15 2025 3:49 AM | Last Updated on Sat, Feb 15 2025 9:13 AM

The Greatest Rivalry: India vs Pakistan OTT Review in Telugu

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో ది గ్రేటెస్ట్‌ రైవల్రీ: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌(The Greatest Rivalry: India vs Pakistan) సిరీస్‌ ఒకటి. ఈ సిరీస్‌ గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో సినిమా తరువాత ఏది ఇష్టం అంటే సగటు భారతీయుడు ఠక్కున చెప్పేది క్రికెట్‌ అనే. నాటి రేడియో రోజుల నుండి నేటి డిజిటల్‌ ప్రొజెక్షన్‌ రోజుల వరకు ఎదుగుతున్న సాంకేతికత కన్నా మెరుపు వేగంలో ఎదుగుతోంది ఈ క్రికెట్‌ అభిమానం. మరీ ముఖ్యంగా ఇండియా– పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే దేశం మొత్తానికి ఆ రోజు అప్రకటిత సెలవు లాంటిది. దాయాదుల పోరు అని చాలామంది ముద్దుగా పిలుచుకునే ఈ మ్యాచ్‌ ఎప్పుడు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుండి ఆకాశమంత ఆదరణ ఉంటుంది. 

ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌ ఇరు దేశాల క్రికెట్‌ ఆటపై ‘ది గ్రేటెస్ట్‌ రైవల్రీ: ఇండియా వర్సెస్‌  పాకిస్తాన్‌’ అనే సిరీస్‌ రూపొందించింది. నాలుగు భాగాలతో ఉన్న ఈ సిరీస్‌లో భారతదేశం సాధించిన నాటి ప్రపంచ కప్‌ నుండి నేటి ప్రపంచ కప్‌ వరకు ప్రతిదీ విశ్లేషించిన ప్రయత్నం అత్యంత ప్రశంసనీయం. సిరీస్‌లో పత్రికా విలేకరుల నుండి పరోక్ష, ప్రత్యక్ష ఆటగాళ్లతో వివరించిన విధానం ఓ అద్భుతమనే చెప్పాలి. 

ఈ సిరీస్‌ ద్వారా ప్రపంచ క్రికెట్‌ క్రీడాభిమానులకు ఎన్నో వివరణలు, విశ్లేషణలు, రహస్యాలు దృశ్య రూపంలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఇండియా– పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరిగితే ఎంత ఉత్కంఠగా ఉంటుందో అంతకు వేయి రెట్లు ఉత్కంఠ, ఉత్సాహం ఈ సిరీస్‌ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు కలుగుతుందనడంలో సందేహమే లేదు.

క్రికెట్‌ మ్యాచ్‌ టీవీలలో ప్రసారమనేది మామూలే కానీ, అదే క్రికెట్‌ వెనుక జరిగిన తతంగం చూపడమనేది వంద క్రికెట్‌ మ్యాచులు ఒకేసారి చూడడం లాంటిది. ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌ ఈ విషయంలో మాత్రం ప్రేక్షకుల నాడి సరిగ్గా పట్టుకుంది. ఈ సిరీస్‌ మొత్తం తెలుగులోనూ లభ్యం. కాబట్టి కాసేపు ఈ క్రికెట్‌ రైవల్రీ ఏంటో చూసేయండి. – ఇంటూరు హరికృష్ణ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement