హైదరాబాద్ క్రైం: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య పోటాపోటీగా జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ని ఇళ్లలో కూర్చున్న జనమే కాదు.. జైళ్లలో ఉన్న ఖైదీలు కూడా చూస్తున్నారు. నగరంలోని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు వెస్టిండీస్, భారత్‌ల మ్యాచ్ చూసేందుకు అనుమతినిచ్చారు.
ఈ మ్యాచ్‌ను రెండు జైళ్లలోని ఖైదీలను చూపిస్తున్నట్లు జైళ్ల డీజీ వీకే.సింగ్ తెలిపారు. ఇందు కోసం చర్లపల్లిలో 100 టీవీలను, చంచల్‌గూడలో 50 టీవీలను ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. ఖైదీలు చట్టప్రకారం దూరదర్శన్‌లో ప్రసారమయ్యే మ్యాచ్‌ను చూస్తారని సింగ్ ప్రకటించారు.