charlapally jail
-
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నిందితుడు మక్బూల్ మృతి
హైదరాబాద్, సాక్షి: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో సయ్యద్ మక్బూల్ (52) మృతి చెందాడు. అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు చర్లపల్లి జైలు అధికారులు ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు పని చేసిన సయ్యద్ మక్బూల్.. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో పాల్గొన్నాడని ఎన్ఐఏ నిర్ధారించింది. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టు అతనికి జీవిత ఖైదు కూడా విధించింది. అయితే.. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు విచారణ నిమిత్తం ట్రాన్సిట్ వారెంట్ మీద అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మక్బూల్ చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.45 గంటలకు ఆనంద్ టిఫిన్స్‌తో పాటు బస్టాండ్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ జంట బాంబుల కేసును మూడేళ్లపాటు విచారణ చేసిన ఎన్ఐఏ.. 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్, మక్బూల్ దోషులుగా తేల్చారు. ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకోగా.. మిగిలిన నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. వీరిలో మక్బూల్ ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే.. ఇక.. మహారాష్ట్రకు చెందిన ముక్బూల్ బాంబులు తయారు చేసేవాడు. ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చేసిన టైంలో.. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆవరణలో తెలుగు మీడియాను చూస్తూ.. తాను మూడు నెలల్లో జైలు నుంచి బయటకు వస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. -
చర్లపల్లి జైలు నుంచి తీన్మార్ మల్లన్న విడుదల.. కొత్త పార్టీ ప్రకటన..
సాక్షి, హైదరాబాద్: జైలు తనకేమీ కొత్త కాదని, సీఎం కేసీఆర్ కుటుంబానికే కొత్తని, జైలుకెళ్లేందుకు కేసీఆర్ కుటుంబం సిద్ధంగా ఉండాలని తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పేర్కొన్నారు. చర్లపల్లి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన మంగళవారం విడుదలయ్యారు. మల్లన్న అభిమానులు జైల్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తనపై ప్రభుత్వం మోపిన కేసులన్నీ దొమ్మీ కేసులేనని, అందుకే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. 'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి తన పార్టీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రజల మనోభావాలు గౌరవించేందుకు కాదని, మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశం కోసమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని..రైట్ రీ కాల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. చదవండి: ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లేనా? -
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చర్లపల్లి జైలు సమీపంలో స్కూల్ ఆటోను ఢీ కొన్న లారీ
-
రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
కుషాయిగూడ: ఖైదీల వరుస ఆత్మహత్యలు చర్లపల్లి జైలులో భద్రతా లోపాలను ఎత్తిచూపుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఆదివారం సిద్దిపేట జిల్లా తూర్పుతండాకు చెందిన బానోతు శ్రీను నాయక్ బెడ్ షీట్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ షేక్ ఖాజామియా టవల్‌తో కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా తేరుకున్న జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ దొంగతనం కేసులో పట్టుబడ్డ ఖాజామియాను మల్కాజిగిరి కోర్టు తీర్పు మేరకు కుషాయిగూడ పోలీసులు ఈ నెల 7న చర్లపల్లి జైలులో రిమాండ్ చేశారు. అనారోగ్యమా..మానసిక స్థితో తెలియదు కాని అతడు జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జైల్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు. వారం రోజుల్లో ఇద్దరు ఖైదీలు.. శ్రీను నాయక్ ఆత్మహత్య మరువక ముందే మరో ఖైదీ ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలులో ఖైదీలు ఆత్మహత్యలకు ఎలా పాల్పడుతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం, జైలు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జైళ్లశాఖ డీఐజీ ఎన్. మురళీబాబును వివరణ కోరగా జైదీల మానసిక స్థితి బాగోలేకనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతి బ్లాక్ వద్ద పటిష్ట భద్రత ఉంటుందన్నారు. వార్డర్, హెడ్‌వార్డర్, చీఫ్ హెడ్ వార్డర్‌తో పాటుగా వారిని పర్యవేక్షించేందుకు డిప్యూటీ జైలర్లు ఉంటారని తెలిపారు. వారంలో ఇద్దరు ఖైదీలు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
దిశ కేసు: పోలీసు కస్టడీకి నిందితులు
సాక్షి, హైదరాబాద్: దిశ అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను పోలీసులు తొలిరోజు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. వారం రోజులపాటు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ షాద్‌నగర్ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా నిందితుల సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. జైల్లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేసినట్టు తెలుస్తోంది. నిందితులను తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గురువారం తెల్లవారుజామున 3.45 గంటలకు నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణను తర్వితగతిన పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేసిన నేపథ్యంలో వీలైనంత తర్వగా నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి లారీలో దొరికిన ఆధారాలను ఇప్పటికే ఫొరెన్సిక్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకం కానుంది. చదవండి: రంగంలోకి ఏడు బృందాలు.. నెలలోపే చార్జ్‌షీట్ కస్టడీలోకి తీసుకున్న నిందితులను విచారించేందుకు శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. నిందితులను విచారించడం, శాస్త్రీయ ఆధారాల సేకర, ఫొరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలు తెప్పించడం తదితర అంశాలపై కమిటీ దృష్టి సారించింది. దిశ కిడ్నాప్, రేప్, హత్య తదితర కేసులన్నింటినీ ఈ కమిటీ నేతృత్వంలో పలు బృందాలు విచారించనున్నాయి. దిశను ఎలా ట్రాప్ చేశారు? వారం రోజుల కస్టడీలో భాగంగా నిందితులను విచారించి.. వారి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకోనున్నారు. ఈ విచారణ సందర్భంగా నిందితుల దగ్గరికి నుంచి కీలక ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. హత్యాచారం, హత్య జరిగిన సంఘటన స్థలానికి నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. సీన్ టూ సీన్ మొత్తం వివరాలను నిందితుల నుంచి పోలీసులు రాబట్టనున్నారు. దిశ మొబైల్‌ను ఏం చేశారనే నిందితులను ప్రశ్నించనున్నారు. దిశను ఎలా ట్రాప్ చేశారు, అత్యాచారం, హత్య చేసి అనంతరం ఎందుకు దిశ శరీరాన్ని తగలబెట్టారనే వివరాలు క్షుణ్ణంగా నిందితుల నుంచి తెలుసుకోనున్నారు. ఈ దారుణమైన సంఘటనకు ముందు నిందితులు మద్యం సేవించారా అనేది కూడా పోలీసులు తెలుసుకోనున్నారు. నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించడంతోపాటు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను ఏ ప్రదేశంలో విచారిస్తారనే దానిపై పోలీసులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. పోలీసుల కస్టడీ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలు వద్ద ఎలాంటి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా సెక్షన్ 144ను విధించారు. ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు దిశ కేసులో దోషులను త్వరితగతిన తేల్చేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. జస్టిస్ ఫర్ దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు హైకోర్టు ఆమోదముద్ర వేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు వీలుగా బుధవారం రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా జడ్జి కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా పరిగణిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీగా ‘దిశ’కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి సత్వరం తీర్పు వెలువరించనుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కావడం ఇది రెండోసారి. ఇటీవల వరంగల్ జిల్లాలో 9 నెలల పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ఈ కేసులో సత్వర విచారణ జరిపిన కోర్టు 56 రోజుల్లో తీర్పు చెప్పింది. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది. -
చర్లపల్లి జైలు ఖైదీ పరార్
-
ఫర్నిచర్ పేరిట దోపిడీ!
నల్లగొండ : ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. హాస్టళ్లలో వార్డెన్లకు అవసరమయ్యే వీల్ చైర్, ఆఫీసు టేబుల్, కంప్యూటర్ టే బుల్, స్టీల్ బీరువాలు, ఐరన్ టేబుల్స్, విద్యార్థులకు మంచాలు, బెడ్స్, ర్యాక్స్, డైనింగ్ టేబుల్స్ తదితర వస్తువులను కొనుగోలు చేసేందుకు జిల్లాకు రూ.1.13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఫర్నిచర్ కొనుగోలుకు సంబం ధించి అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఫర్నిచర్ కొనాలనే నిబంధన ఉన్నప్పటికీ వస్తువుల ధరలు ఖరారు చేయడం.. నాణ్యత పరిశీలించడంలో అధికారులు తప్పులో కాలేశారు. సాధారణంగా ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగించే క్రమంలో అనేక రకాల నిబంధనలు వర్తింపజేసే అధికారులు ఈ వ్యవహారంలో అవేమీ పాటించలేదు. జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలనే ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలుకు రూ.1.13 కోట్ల ఆర్డర్ ఏకపక్షంగా కట్టబెట్టారు. జైలు అధికారులు ఖరారు చేసిన ధరలనే జిల్లా అధికారులు ఏకగీవ్రంగా ఆమోదించారు. కనీసం వస్తువులకు సంబంధించిన శాంపిళ్లను కూడా ముందుగా పరిశీలించలేదు. ప్రైవేట్ ఏజెన్సీలు సప్లయ్ చేసే వస్తువుల్లో సాంకేతికరమైన లోపాలను గుర్తించడంలో జిల్లా కొనుగోలు కమిటీలో పరిశ్రమల శాఖ ప్రమేయం తప్పనిసరి. కానీ చర్లపల్లి జైలు నుంచి సప్లయ్ చేసిన ఫర్నిచర్ విషయంలో పరిశ్రమల శాఖ ప్రమేయం లేదనే చెప్పాలి. అధికారులు తాము అనుకున్నదే తడవుగా జైలు అధికారులు చెప్పిన ప్రతీదానికీ తలూపారు. దీంతో సప్లయ్ చేసిన వస్తువుల ధరలు, నాణ్యత పరిశీలిస్తే...ఓపెన్ మార్కెట్లో వాటి ధరలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఓపెన్ మార్కెట్లో చూస్తే.. హాస్టళ్లలో ఫర్నిచర్ పరిశీలిస్తే అంత ధర ఉండదని చిన్నతరహా పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. ఫర్నిచర్ వ్యాపారంలో అపార అనుభవం కలిగిన వారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వస్తువుల నాణ్యతలో రాజీపడలేదు కానీ ధరల్లోనే భారీ వ్యత్యాసం ఉందని అంటున్నారు. బయటి మార్కెట్లో ఆఫీసు టేబుల్ ధర రూ.5 వేలకు మించి ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ జైలు అధికారులు ఆ టేబుల్‌ను రూ.14,500లకు సప్లయ్ చేశారు. జిల్లాలోని జనరల్, కాలేజీ హాస్టళ్లకు 61 టేబుల్స్ సరఫరా చేశారు. ఈ లెక్కన 61 టేబుళ్లకు అధికారులు చెల్లించింది రూ.8,84,500. అదే ఓపెన్ మార్కెట్ ధర ప్రకారం చూస్తే 61 టేబుళ్ల ధర కేవలం రూ.3,05,000 మాత్రమే. అంటే ఒక్క ఆఫీసు టేబుల్ ధరలోనే సుమారు రూ. 5,79,500 వ్యత్యాసం కనిపిస్తోంది. సప్లయ్ చేసిన వీల్‌చైర్ కూడా సాధారణ రకానికి చెందినదనే అన్నారు. జైల్ నుంచి సప్లయ్ చేసిన వీల్ చైర్ ధర రూ.6,095. అంతే క్వాలిటీ కలిగిన చైర్ ధర ఓపెన్ మార్కెట్లో రూ.3 వేలకు మించదని పరిశ్రమల అధికారులు తెలిపారు. జిల్లాకు 61 చైర్లు సప్లయ్ చేశారు. ఈ లెక్కన 61 వీల్ చైర్లకు ఎస్సీ సంక్షేమ శాఖ రూ.3,71,795 చెల్లించింది. ఓపెన్ మార్కెట్ ధరలతో పోల్చినప్పుడు 61 చైర్ల ధర కేవలం రూ.1,83,000 మాత్రమే. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం రూ.1,88,795 . ఇదేరకమైన తేడా మిగిలిన వస్తువుల ధరల్లోనూ కనిపిస్తోంది. సాధారణంగా జైలులో తయారు చేసే వస్తువుల పై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. నిరుపయోగంగా ఫర్నిచర్.. సొంత భవనాలు కలిగిన హాస్టళ్లను మినహాయిస్తే అద్దె భవనాల్లోని హాస్టళ్లలో ఫర్నిచర్ నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అద్దెభవనాల్లో స్థల సమస్య వల్ల కొంత మంది వార్డెన్లు ఫర్నిచర్‌ను తిప్పిపంపించారు. నల్లగొండలోని బాయ్స్ హాస్టల్ ‘ఏ’కు స్థలాభావం వల్ల నాలుగు లాంగ్ బేంచీలను తిప్పి పంపారు. హాస్టళ్లకు ఫర్నిచర్ చేరిందా..? లేదా..? అనేది కూడా అధికారులు పట్టించుకోలేదు. మొత్తం ఫర్నిచర్‌కు బిల్లులు మాత్రం చెల్లించారు. ఇక ప్రస్తుతం ఏ హాస్టల్‌కు కూడా కంప్యూటర్లు లేవు. బయోమెట్రిక్ మిషన్లు పనిచేయడం లేదు. సొంత భవనాల్లో కంప్యూటర్ టేబుళ్లు గతంలోనే ఉన్నాయి. కానీ మళ్లీ కొత్తగా టేబుళ్లు కొనుగోలు చేశారు. అద్దె భవనాలకు సప్లయ్ చేసిన టేబుళ్లు వృథాగా పడేశారు. హాస్టళ్లలో ఉన్నటువంటి పరిస్థితులను ముందుగా అంచనా వేయకుండా అడ్డగోలుగా ఫర్నిచర్ కొనుగోలు చేయడంలో లక్షల రూపాయల నిధులు వృథా అయ్యాయి. రెండు రకాల ధరలు.. జైలు అధికారులు ముందుగా నిర్ణయించిన ధరలు కాకుండా రెండో సారి మార్పు చేశారు. ముందుగా ఖరారు చేసిన ధరల ప్రకారం ఆఫీసు టేబుల్ ధర రూ.18 వేలు ఉండగా.. ఆ త ర్వాత సవరించిన ధరల ప్రకారం టేబుల్ ధర రూ.14,500. ఇదేరకంగా స్టీలు అల్మారాల ధర రూ.15 వేలు ఉంటే దానిని రూ.11,900లకు తగ్గించారు. ఇలా అన్ని రకాల వస్తువుల్లోనే జరిగింది. ధరలు పెంచడం, ఆ తర్వాత వాటిని సవరించే అంతిమ నిర్ణయం కూడా జైలు అధికారులదే. అయితే ధరలు సవరించడాని కంటే ముందుగానే పాత ధరల ప్రకారమే చర్లపల్లి జైలుకు రూ.1,37,24,000 బిల్లు చెల్లించారు. ఆ తర్వాత ధరలు సవరించడంతో రూ. 1,13,21, 020ల బడ్జెట్ తగ్గింది. ఈ రెండింటి ధరల మధ్య వ్యత్యాసం రూ.24 లక్షలు. మిగిలిన బ్యాలెన్స్ రూ.24 లక్షలు వెనక్కి తెప్పించుకోవాల్సిన అధికారులు అలా చేయకుండా అదనంగా మరికొంత ఫర్నిచర్ తెప్పించారు. నిజంగానే చర్లపల్లి జైల్లోనే ఫర్నిచర్ తయారు చేస్తున్నారా..? లేదంటే కొనుగోళ్ల పేరిట మధ్య వర్తులను అడ్డంపెట్టుకుని బయటి నుంచి కొనుగోలు చేసి సప్లయ్ చేస్తున్నారా..? అనేది అధికారులకు అంతు చిక్కడం లేదు. ట్రంక్ పెట్టెలు జైల్లో తయారు కావనే విషయం కూడా తెలుసుకోకుండా అధికారులు వర్క్ఆర్డర్ ఇవ్వడం అందుకు నిదర్శనం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డర్ ఇచ్చాం ప్రభుత్వ ఏజెన్సీ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చాం. జైలు నుంచి సప్లయ్ చేసిన వస్తువులు నాణ్యంగానే ఉన్నాయని వార్డెన్లు చెప్పారు. స్వయంగా పరిశీలన కూడా చేశాం. జైలు అధికారుల వద్ద కూడా ప్రైస్ లిస్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తుంటారు. వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ధర ఒకరకంగా ఉంటే ఫర్నిచర్ సప్లయ్ చేసే నాటికి వాటి ధర తగ్గింది. దీంతో తగ్గిన ధర ప్రకారమే సప్లయ్ చేశారు. మిగిలిన బ్యాలెన్స్ నిధులతో అదనంగా ఫర్నిచర్ తెప్పించాం. నేను ఇన్చార్జిగా చేరకముందు నుంచే ఎస్సీ సంక్షేమ శాఖలో ఫర్నిచర్ ఫైల్ పెండింగ్‌లో ఉంది. ట్రెజరీ నుంచి నిధులు వెనక్కి Ððవెళ్లిపోతాయన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఫైల్ తెప్పించి ఫర్నిచర్ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. – నరోత్తమ్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి -
చర్లపల్లి జైల్లో సెల్ ఫోన్ కలకలం
హైదరాబాద్: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ వద్ద సెల్‌ఫోన్ లభ్యం అయిన ఘటన కలకలం రేపింది. మానస బ్లాక్‌లో రెండు నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్న విదేశీయుడి వద్ద సోమవారం అధికారులు తనిఖీ చేసి సెల్‌ఫోన్ ఉన్నట్లు తేల్చారు. దీని వెనుక జైలు సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ను స్వాధీనం చేసుకుని, ఖైదీని విచారిస్తున్నారు. -
‘దిల్సుఖ్నగర్’ నిందితులకు భద్రత పెంపు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు నిందితులు జైలు నుంచి పరారయ్యే అవకాశాలు ఉన్నాయని ఐబీ హెచ్చరికలతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులు పారిపోయే అవకాశం ఉందని ఐబీ సూచించడంతో.. జైల్లో భద్రత పెంచారు. నిందితులు ఉంటున్న మంజీర బ్యారెక్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. 2 బెటాలియన్ల భద్రతా బలగాలను అదనంగా నియమించారు. -
చర్లపల్లి జైల్ నుంచి జీవితఖైదీ పరారీ
కుషాయిగూడ: చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో జీవితఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ జైల్ నుంచి పరారయ్యాడు. సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం, యన్‌సాన్‌పల్లి ›గ్రామానికి చెందిన రాములు (19) 2013లో జరిగిన ఓ హత్య కేసులో కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో అతడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. శిక్ష అనుభవిస్తున్న రాములును సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా భావించిన జైల్ అధికారులు గత జూలై–18న చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్‌కు తరలించారు. ఆదివారం ఖైదీలందరితో కలిసి పని చేసేందుకు వెళ్లిన రాములు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అతడు తిరిగి జైల్లోకి రాకపోవడం విషయం గమనించిన జైలు అధికారులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తుందని రాములు భావించాడని, అయితే జాబితాలో తన పేరులేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నట్టు సమాచారం. -
చర్లపల్లి జైలులో విద్యార్థులకు నేతల పరామర్శ
హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ ప్రొఫెసర్లు, విద్యార్థులను వివిధ పార్టీల నేతలు పలకరించి, మద్దతు పలికారు. శుక్రవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నేత శ్రవణ్‌కుమార్ అరెస్టైన విద్యార్థులను, అధ్యాపకులను పలకరించారు. వీరితో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల కూడా విద్యార్థులకు మద్దతు పలికారు. వీసీ అప్పారావు తిరిగి విధుల్లోకి చేరిన సందర్భంగా నాలుగు రోజుల క్రితం హెచ్‌సీయూలో జరిగిన గొడవలపై కొందరు అధ్యాపకులను, విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం విదితమే. -
చావుకు దగ్గర్లో.. విడిచారు
కుషాయిగూడ: అనారోగ్యం బారిన పడి చావుకు దగ్గరైన ఓ ఖైదీని జైలు అధికారులు విడుదల చేసిన సంఘటన గురువారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో చోటుచేసుకుంది. జైలు అధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కస్తూరి శంకర్ అనే వ్యక్తి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మర్డర్ కేసులో నిందితుడు. కేసులో భాగంగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 2, 2015న చర్లపల్లి జైలుకు తరలించారు. మద్యం అతిగా తాగడం వల్ల అతని లివర్ చెడిపోయి అనారోగ్యంతో భాదపడుతున్నాడు. కొంతకాలం పాటు జైలులోనే చికిత్స జరిపించిన అధికారులు పరస్థితి విషమించడంతో శంకర్‌ను ఈ నెల 7న గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని రక్తం ఎక్కించాలని సూచించారు. దీంతో చర్లపల్లి జైలు వార్డర్ నాగయ్య ఈ నెల 17న రక్తదానం కూడా చేశారు. అయినా ఎలాంటి ఫలితం లభించలేదు. మానవత్వంతో స్పందించిన జైలు అధికారులు చావుకు దగ్గరైన శంకర్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జీవించేందుకు అవకాశం కల్పించాలని భావించారు. అందుకు అవసరమైన పత్రాలను జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన మల్కాజిగిరి పదవ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ రూ. 20 వేల పూచికత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శంకర్‌ను గురువారం చర్లపల్లి జైలు నుంచి విడుదల చేసినట్లు పర్యవేక్షణాధికారి వెంకటశ్వర్‌రెడ్డి తెలిపారు. -
జైలులో భత్కల్ బృందంపై విచారణ ప్రారంభం
హైదరాబాద్: దిల్సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల నిందితులు, ఐఎస్ఐ తీవ్రవాదులు భత్కల్, అతడి అనుచరుల నేర విచారణ సోమవారం ప్రారంభమైంది. చర్లపల్లి జైలు ఆవరణలోని నూతన కోర్టు హాల్లో ఈ విచారణ నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ హెచ్చరికల నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జైలు అధికారులు ఈ చర్యలకు పూనుకున్నారు. మూడు రోజులపాటుగా విచారణ ట్రయల్ నడుస్తుందని జైలు పర్యవేక్షాధికారి కొలన్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. -
ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అయిదో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనకు ఈనెల 21 వరకూ రిమాండ్ విధించటంతో అధికారులు చర్లపల్లి జైలుకు తరలిస్తున్నారు. మరోవైపు సండ్ర కస్టడీతో పాటు, బెయిల్ పిటిషన్లు బుధవారం విచారణకు రానున్నాయి. ఎమ్మెల్యే అయినందున సండ్రను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. -
భత్కల్ను తప్పించేందుకు ప్లాన్
-
భత్కల్ను తప్పించేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర
హైదరాబాద్ :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ పథకం వేసింది. అయితే ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భత్కల్ తన భార్య జహిదాతో ఫోన్లో మాట్లాడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. తనను త్వరలో ఐఎస్ఐఎస్ జైలు నుంచి తప్పిస్తుందని అతడు..ఢిల్లీలో ఉంటున్న భార్యకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. డమాస్కస్‌లోని స్నేహితులు.. తనను త్వరలో జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డమాస్కస్ వెళ్లిపోదామని భత్కల్ తన భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది. భత్కల్ చెప్తున్న డమాస్కస్‌లోని స్నేహితులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతేకాక చర్లపల్లి జైలు నుంచి భత్కల్ తన భార్యకు 10 ఫోన్‌కాల్స్ చేశాడని... భార్యతోపాటు ఇంకొంతమందితోనూ అతడు ఫోన్లో మాట్లాడాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. యాసిన్ భత్కల్ ఫోన్‌కాల్స్‌ను రికార్డ్ చేసిన కేంద్ర నిఘా వర్గాలు... అతని వెనకున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు భత్కల్‌కు సెల్ ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. -
మన మ్యాచ్.. ఖైదీలూ చూస్తున్నారు!
హైదరాబాద్ క్రైం: భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య పోటాపోటీగా జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ని ఇళ్లలో కూర్చున్న జనమే కాదు.. జైళ్లలో ఉన్న ఖైదీలు కూడా చూస్తున్నారు. నగరంలోని చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు వెస్టిండీస్, భారత్‌ల మ్యాచ్ చూసేందుకు అనుమతినిచ్చారు. ఈ మ్యాచ్‌ను రెండు జైళ్లలోని ఖైదీలను చూపిస్తున్నట్లు జైళ్ల డీజీ వీకే.సింగ్ తెలిపారు. ఇందు కోసం చర్లపల్లిలో 100 టీవీలను, చంచల్‌గూడలో 50 టీవీలను ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. ఖైదీలు చట్టప్రకారం దూరదర్శన్‌లో ప్రసారమయ్యే మ్యాచ్‌ను చూస్తారని సింగ్ ప్రకటించారు. -
చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి!
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానస్పద స్థితిలో మరణించాడు. బాధితుడిని అసోంకు చెందిన ముకుల్ పుల్ వాల్ గా గుర్తించారు. గత వారం రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి చెందడంతో జైలు అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఐదుగురు ఖైదీలు మృతిచెందడంపై అధికారులు వివరణ ఇవ్వడానికి అందుబాటులోకి రాలేదు. -
చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ కు జైళ్లశాఖ డీజీ మోమో!
హైదరాబాద్: చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ రావులకు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) కృష్ణంరాజు ఆదివారం చార్జీమెమో జారీచేశారు. శుక్రవారం రాత్రి నగరంలోని చర్లపల్లి జైల్లులో జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) కృష్ణంరాజు గత అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీజీ జరిపిన తనిఖీలలో మద్దిలచెరువు సూరీ హత్య కేసులో ప్రధాన నిందితుడు బానుకిరణ్, మహ్మద్ పహిల్వాన్, యాదగిరిల వద్ద ఉన్న మద్యం బాటిళ్లు, బిర్యానీ పాకెట్లు, సెల్ పోన్లు, భారీగా నగదును డీజీ స్వాధీనం చేసుకుని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌తోపాటు జైలు సిబ్బందిపై డీజీ నిప్పులు చెరిగారు. గట్టి నిఘా ఉన్న జైలులోకి 'అవి' ఎలా వస్తున్నాయాంటూ శనివారం రోజున డీజీ మండిపడ్డారు. ఖైదీలకు మద్యం, సెల్ ఫోన్లు, బిర్యానీ పాకెట్లు జైలు సిబ్బంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగమేఘాలపై అందజేస్తున్నారని సమాచారం. -
చర్లపల్లి జైల్లో వార్డెన్ పై ఖైదీ దాడి
హైదరాబాద్: చర్లపల్లిలో జైల్లో ఓ ఖైదీ సోమవారం వీరంగం సృష్టించాడు. జైల్లో వార్డెన్ దుర్గాపై ఖైదీ దాడి చేసి కంట్లో స్పూన్ పోడిచాడు. వార్డెన్ దుర్గా పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. గతంలో ములాఖత్ కు వచ్చిన ఓ మహిళపై కూడా దాడి చేశాడు.