చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ కు జైళ్లశాఖ డీజీ మోమో! | Memo issued to Charlapally Jail superintendent | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ కు జైళ్లశాఖ డీజీ మోమో!

Published Sun, May 4 2014 2:09 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ కు జైళ్లశాఖ డీజీ మోమో! - Sakshi

చర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ కు జైళ్లశాఖ డీజీ మోమో!

హైదరాబాద్: చర్లపల్లి జైల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ రావులకు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) కృష్ణంరాజు ఆదివారం చార్జీమెమో జారీచేశారు. శుక్రవారం రాత్రి నగరంలోని చర్లపల్లి జైల్లులో జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) కృష్ణంరాజు గత అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
 
డీజీ జరిపిన తనిఖీలలో మద్దిలచెరువు సూరీ హత్య కేసులో ప్రధాన నిందితుడు బానుకిరణ్, మహ్మద్ పహిల్వాన్, యాదగిరిల వద్ద ఉన్న మద్యం బాటిళ్లు, బిర్యానీ పాకెట్లు, సెల్ పోన్లు, భారీగా నగదును డీజీ స్వాధీనం చేసుకుని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్తోపాటు జైలు సిబ్బందిపై డీజీ నిప్పులు చెరిగారు.
 
గట్టి నిఘా ఉన్న జైలులోకి 'అవి' ఎలా వస్తున్నాయాంటూ శనివారం రోజున డీజీ మండిపడ్డారు. ఖైదీలకు మద్యం, సెల్ ఫోన్లు, బిర్యానీ పాకెట్లు జైలు సిబ్బంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగమేఘాలపై అందజేస్తున్నారని సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement