ప్రభాస్తో కృష్ణంరాజు 'ఒక్క అడుగు' | Krishnam Raju plans to direct nephew Prabhas | Sakshi
Sakshi News home page

ప్రభాస్తో కృష్ణంరాజు 'ఒక్క అడుగు'

Published Sun, Jan 19 2014 1:25 PM | Last Updated on Sun, Jul 14 2019 4:18 PM

ప్రభాస్తో కృష్ణంరాజు 'ఒక్క అడుగు' - Sakshi

ప్రభాస్తో కృష్ణంరాజు 'ఒక్క అడుగు'

ప్రభాస్ హీరోగా తన దర్శకత్వంలో సొంత బ్యానర్ గోపికృష్ణ కంబైన్స్లో ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఆ చిత్రానికి సంబంధించిన కథ సిద్ధమైందన్నారు. ఆ చిత్రానికి 'ఒక్క అడుగు' అని పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.  అవినీతిపై బ్రహ్మాస్త్రం సంధించే ఓ యువకుడు చేసిన పోరాటమే ఒక్క అడుగు అంటూ కృష్ణంరాజు వివరించారు. ఆ చిత్రానికి నిర్మాత కూడా సిద్దంగా ఉన్నారన్నారు.

 

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గతంలో ప్రభాస్ హీరోగా ఛత్రపతి చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో 'ఒక్క అడుగు' అంటూ ప్రభాస్ పలికే డైలాగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పలికారని కృష్ణంరాజు గుర్తు చేశారు. ఆ డైలాగునే తన చిత్రానికి పేరు పెట్టినట్లు చెప్పారు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలి చిత్రానికి సంబంధించిన పనులలో ప్రభాస్ మహా బిజీగా ఉన్నారని తెలిపారు. ఆ చిత్రం పూర్తి అయిన వెంటనే తన దర్శకత్వంలో రానున్న చిత్రాన్ని సెట్పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కృష్ణంరాజు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement