krishnam raju
-
బాబు, పవన్ శాసనసభకి ఎందుకు వెళ్ళలేదు YSRCP అంటే భయమా ?
-
ఆంధ్రప్రదేశ్ అప్పు లపై కూటమి సర్కారు తప్పుడు ప్రచారం
-
పొలిటికల్ గవర్నెస్స్ అంటే ఏమిటి ?
-
అమెరికా ఆరోపణలకు ఆధారాలు లేవు తేల్చి చెప్పేసిన...
-
అసెంబ్లీ సాక్షిగా.. సూపర్ 6 లేదు 7 లేదు
-
జనసేన, టిడిపి ట్రోలర్సిన్ని ఇరికించిన ఈనాడు..
-
వ్యక్తిత్వ హననాలకు ఆద్యం పోసింది చంద్రబాబే
-
KSR Live Show: షర్మిల జగమొండి.. ఎవరికి తెలియని పచ్చి నిజాలు బయటపెట్టిన అనలిస్ట్ కృష్ణం రాజు
-
వరుస అత్యాచారాలతో రాష్ట్రం అతలాకుతలం
-
టీడీపీకి షాక్.. వైఎస్సార్సీపీలో చేరిన ముదునూరి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పచ్చ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
జగన్ ఆ సంతకం చేయనక్కరలేదు
-
లోకేష్, పవన్ కలిసి . బాబును ఇరికించారు..!
-
బాబు బోట్ల ఎపిసోడైపై కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు..
-
చంద్రబాబును బుడమేరులో ముంచిన ఈనాడు
-
జనం అల్లాడుతుంటే.. చంద్రబాబు డ్రామాలు
-
కృష్ణ కరకట్ట ఆక్రమణల తొలగింపు ఎప్పుడు?
-
పిచ్చోడి చేతిలో రాయిలా పాలన..
-
KSR Live Show: చంద్రబాబు భయం.. ఇక ఏపీని దేవుడే కాపాడాలి
-
ఏపీకి కేంద్ర నిధులపై అసలు నిజాలు బయట పెట్టిన కృష్ణంరాజు
-
రోజుకు 405 కోట్లు అప్పు KSR చంద్రబాబు సరికొత్త రికార్డు
-
జగన్ పై ఆ మాజీల దుష్ప్రచారం వెనుక ఉంది ఎవరు ?
-
రాష్ట్రంలో పేట్రేగిపోతున్న వ్యక్తిత్వ హంతకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యక్తిత్వాన్ని హననం చేసే హంతకులు రోజురోజుకు పేట్రేగిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కేరక్టర్ అసాసినేషన్ చేసే వారు వేల సంఖ్యలో పెరిగిపోయారని, నిత్యం కొన్ని వేల మందిని వెంటాడి వేధిస్తున్నారని చెప్పారు. గతంలో ఏపీలో పని చేసి మాజీలైన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం శోచనీయమని అన్నారు. వారి చేష్టలు ఒక వర్గానికి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి అనుకూలంగా ఉంటున్నాయని, వారికి ఇష్టం లేని మరో నాయకుడి వ్యక్తిత్వాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అండ్ కో, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేష్ ఎన్నికల ముందు వైఎస్ జగన్ పరిపాలనను, జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు. దీని కోసం సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంస్థను ఏపీ వరకే పరిమితం చేశారని, తెలంగాణ వైపు కన్నెతి చూడలేదన్నారు. వీరి కార్యకాలపాలన్నీ వైఎస్ జగన్ అండ్ కోని అధఃపాతానికి తొక్కేయాలన్న విధంగానే సాగాయని తెలిపారు. వారి లక్ష్యం పూర్తయిందని, ఇప్పుడు వారి జాడ లేదని, సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమాలు లేవని చెప్పారు.ఇప్పుడు తాజాగా మరికొందరు వైఎస్ జగన్‌ని టార్గెట్ చేశారని తెలిపారు. ఆయనకు పరిపాలన చేతకాదని, ఎవరినీ గౌరవించడని, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి మీద పాలనంతా వదిలేశారంటూ వింత విషయాలు చెబుతున్నారని చెప్పారు. తాజాగా ఎల్వీ సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌లు ఖాళీగా ఇంట్లో ఉండి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని చెప్పారు. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేసి అక్కడ రాజధాని పెడదామని జగన్ చెప్పారని సుబ్రమణ్యం అనడం వింతగా ఉందన్నారు. జగన్ రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారంలో అనుభవం ఉందని, స్టీల్ ఫ్యాక్టరీ అమ్మటం సాధ్యం కాదని ఆయనకు తెలీదా అని అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయొద్దని జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని తెలిపారు.జగన్‌కి పాలన తెలీదని అని అంటున్న ఐఏఎస్ సుబ్రమణ్యంకి కూడా తెలియని విధంగా వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు, పాలనా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. వైఎస్ జగన్ 30లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇలా ఇమ్మని ఎల్వీ గానీ, ఇక్బాల్ కానీ చెప్పారా.. అని నిలదీశారు. ఎల్వీ సుబ్రమణం ఫైల్స్ ఏమీ తేల్చడనే ప్రచారం ఉందని, టీటీడీ నిధులను విలాసాలకు వాడుకొన్నారన్న ఆరోపణలు ఉన్నాయని, వీటికి ఆయన ఏమి సమాధానం చెబుతారని అన్నారు.2019 ఎన్నికల కౌంటింగ్ కాగానే జగన్‌ను కలిసి ఆయన ప్రాపకం కోసం ఎందుకు ప్రయతి్నంచారని, గవర్నర్ ఆదేశిస్తేనే కలవాలి కదా.. అని నిలదీశారు. ఇక్బాల్ వక్ఫ్ బోర్డు అధికారిగా ఉన్నప్పుడు ఆయన సామాజికవర్గం వారే ఇక్బాల్ పనికిరాడని ఆరోపించారన్నారు. ఇక్బాల్ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ జగన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని చెప్పారు. జగన్‌కు పాలన తెలియదని వీరు ఎలా అంటారని ప్రశి్నంచారు. వీరి వెనుక ఉన్న మూల విరాట్ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. -
ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు
-
విభజనకు పదేళు ఏపీకి ఎవరేం చేశారు ?
-
జగన్ విజయం ఖాయమంటున్న సర్వేలు..
-
ఏపీ పరువు తీశారు టీడీపీ వాళ్ళు..కృష్ణంరాజు సంచలన కామెంట్స్
-
ఏడు చోట్ల EVM ధ్వంసలు జరిగాయి..కృష్ణం రాజు రియాక్షన్
-
అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు
-
కుప్పంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న ఓటర్లు
-
చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు
-
ఓటమి దిశగా కూటమి.. అందుకు కారణాలు ఇవే
-
సమాంతర కోర్టులు నడుపుతున్న షర్మిల, సునీత
-
మార్గదర్శి చిట్ ఫండ్ కుంభకోణంపై రామోజీరావుపై కృష్ణంరాజు వ్యాఖ్యలు
-
చంద్రబాబు మానసిక పరిస్థితిపై కృష్ణంరాజు కామెంట్స్
-
మొగల్తూరు నుంచి ఢిల్లీ వరకు 'రెబెల్'గా సాగిన కృష్ణంరాజు జీవితం
కృష్ణంరాజు పేరులోనే కాదు గుణంలోనూ రాజే.. రౌద్రానికి రారాజుగా అభిమానులకు మనసున్న మారాజుగా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఆయన పేరు చిరస్మరణీయం. ఆరడుగుల దాటిన ఎత్తు… మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే గాంభీర్యం.. రౌద్రంతో నిండిన చురకత్తుల్లాంటి ఆ చూపులు... ఆయన ఎదురుగా ఉంటే ఇంత పెద్దాయనతో మాట్లాడగలమా.. అసలు నిలబడగలమా అనే ఆలోచన రావడం సహజం... కానీ కొంత సమయం తర్వాత ఆయన్ను తరచి చూస్తే సుతిమెత్తని మనసుతో పాటు ఆప్యాయంగా ప్రేమతో పలకరించే మాటలు వింటారు.. ఆపై వచ్చిన వారిని గౌరవించే పెద్దరికాన్ని ఆయనలో చూస్తారు. మొగల్తూరు ముద్దుబిడ్డగా వెండితెరపై రారాజుగా వెలిగిన రెబల్‌స్టార్ మనల్ని వదిలి వెళ్లి ఏడాది దాటింది.. ఆయన పేరు ఒక చరిత్ర ఎప్పటికీ వెలుగులోనే ఉంటుంది. నేడు ఆయన జయంతి.. కృష్ణంరాజు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కుటుంబ నేపథ్యం 183 సినిమాల్లో హీరోగా, విలన్‌గా మెప్పించిన కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఉప్పలపాటి నారాయణ మూర్తిరాజు లక్ష్మీదేవమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. వారిలో కృష్ణంరాజు మూడో సంతానం. 1940 జనవరి 20న మొగల్తూరులో ఆయన జన్మించారు. ఆయన బాల్యంతో పాటు విద్యాభ్యాసం అంతా కూడా మొగల్తూరు, నరసాపురం, హైదరాబాద్‌లో జరిగింది. రోడ్డు ప్రమాదంలో మొదటి భార్య మృతితో 1996లో శ్యామలాదేవిని ఆయన రెండో వివాహం చేసకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తిగా ఉన్నాయి. ప్రసీద ‘రాధేశ్యామ్’తో నిర్మాతగా పరిచయం అయ్యారు. రెండో కుమార్తె ప్రకీర్తి సినీ ప్రొడక్షన్ డిజైన్ రంగంలో పనిచేస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఎలా జరిగిందంటే సంపన్న కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు హైదరాబాద్ బద్రుకా కళాశాలలో కామర్స్ నుంచి పట్టా పొందారు. అప్పటికే శాసనసభ్యునిగా ఉన్న చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు హైదరాబాద్‌లో ఉన్నారు. కృష్ణంరాజుకు ఆయన పినతండ్రి కావడంతో ఆయన వద్దే కొంత కాలం ఉన్నారు. ఆయన ఆరంభించిన ‘ఆంధ్రరత్న’ పత్రిక నిర్వహణతో పాటు ఆయన సినీ సౌండ్ స్టూడియో నిర్వహణ కూడా కృష్ణంరాజు చూస్తుండేవారు. ఆ స్టూడియోలు 'బావమరదళ్లు' సినిమా నిర్మాణం జరిగింది. ఆ చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో 1963లో కృష్ణంరాజు మద్రాసు చేరుకున్నారు. తాను తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తానని కృష్ణంరాజుకు మాట ఇచ్చి స్క్రీన్ టెస్టు నిర్వహించాడు. ఆపై నటనలొ కొన్ని మెలుకవలు నేర్చుకుని 1965 ఆగస్టు 6న సొంత చిత్రం 'చిలకా గోరింకా'లో నటించారు. అందులో సీనియర్ నటి కృష్ణకుమారి సరసన కృష్ణంరాజు హీరోగా పరిచయం అయ్యారు. నర్సాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపు కృష్ణంరాజు 1991లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చినప్పటికీ 1996లో బీజేపీలో చేరారు. 1998 కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి లక్షా 50 వేలపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి టీమ్‌లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన సొంత రాష్ట్రం అయిన ఏపీకి ఎనలేని సేవ చేశారు. కృష్ణంరాజుకు నర్సాపురం, మొగల్తూరు అంటే ఎంతో మమకారం ఉండేది. ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకునేవారు. నర్సాపురం నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు కేంద్ర గ్రామీణ సడక్ యోజన పేరుతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. అప్పటి వరకు ఏ గ్రామంలోను సిమెంట్ రోడ్లు ఉండేవి కావు. అలా ఆయన ఎనలేని సేవలు అక్కడి ప్రజలకు అందించారు. కానీ 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగినప్పటికీ ఆయన ఓటమి చెందారు. తిరిగి ఆయన చిరంజీవి కోరికమేరకు 2009లో ప్రజారాజ్యంలో చేరి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన తిరిగి బీజేపీలో చేరారు. సతీమణితో అనుబంధం తన అర్ధాంగి అయని శ్యామలాదేవి గురించి ఒక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు ఇలా అన్నారు. 'నా మొదటి భార్యను కోల్పోవడం నా జీవితంలో అత్యంత విషాద సంఘటన. కానీ ఆ తర్వాత శ్యామల నా జీవితంలోకి అడుగుపెట్టింది. నా జీవితంలో ఎన్నో వెలుగులు నింపింది. ఆమె రాకతో నా జీవితమే మారిపోయింది. నాకు అన్నీ తానైంది. మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లతో పాటు నన్నూ ఓ పిల్లాడిలా భావించి నాకేం కావాలో చూసుకుంటుంది. నాకు అనారోగ్యం వస్తే తనూ నిద్ర కూడా పోదు. ఎప్పుడూ ప్రతి క్షణం నా వెంటే ఉండేది. శ్యామల నాకు దేవుడు ఇచ్చిన వరం.' అంటూ తన అర్ధాంగి గురించి గొప్పగా చెప్పారు కృష్ణంరాజు. తన సినీ వారసుడిగా ప్రభాస్ కృష్ణంరాజు, ప్రభాస్‌ల అనుబంధం తండ్రీకొడుకుల లాంటిది. కృష్ణంరాజు తమ్ముడు, నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణరాజు కుమారుడే ప్రభాస్. చిన్నతనం నుంచే ప్రభాస్ ఎక్కువగా కృష్ణంరాజు వద్దే ఉండే వాడు. తన పెదనాన్న అడుగుజాడల్లో నటుడిగా మారాడు. 2010లో ప్రభాస్ తండ్రి మరణించిన తర్వాత ప్రభాస్‌కు ఒక తండ్రిలా వెన్నంటి కృష్ణంరాజు నిలబడ్డారు. ప్రభాస్ జీవితంలో ఎత్తుపల్లాల మధ్య ఒక గురువులా ఆయన ఉన్నారు. దీంతో ప్రభాస్‌కు ఆయనంటే విపరీతమైన గౌరవం. కానీ ప్రభాస్ విషయంలో చివరి కోరిక కృష్ణంరాజుకు తీరలేదు. రాధేశ్యామ్ సినిమా సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. "అతను వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవడం నాకు చాలా ఇష్టం. నేను అతని కొడుకు లేదా కుమార్తెతో ఆడాలనుకుంటున్నాను.' అని ఆయన అన్నారు. ఆయన కోరుకున్నట్లే జీవితాన్ని ముగించారు అనారోగ్యంతో 2022 సెప్టెంబర్ 11న కృష్ణంరాజు కన్నుమూశారు. మరణం గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీరు జీవితంలో ఇంకా ఏమైనా సాధించాల్సినవి ఉన్నాయా...? దానికి ఆయన నుంచి వచ్చిన జవాబు ఇదే 'జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు.. ఓ పచ్చని చెట్టు కింద కూర్చుని, గుండె మీద చేయి వేసుకుని… దేవుడా, నాకిచ్చిన ఈ మానవ జన్మలో నేనెవరికీ ద్రోహం చేయలేదు, నావల్ల ఎవరికీ బాధ కలగలేదనే భావనతో హాయిగా కన్నుమూయాలి.' అని చెప్పారు. అదే రీతిలో ఆయన జీవితం ముగిసింది. నేడు మెగా వైద్య శిబిరం కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మొగల్తూరు అబ్యాస్ కళాశాలలో నేడు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వారి పిల్లలు గత రెండు రోజులుగా మొగల్తూరులోనే ఉంటున్నారు. దేశ, విదేశాలకు చెందిన 30 మంది ప్రముఖ వైద్యులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు జీవితంలో ఇవన్నీ ఆసక్తి కలిగిస్తాయి ► కృష్ణంరాజు కెరీర్లో 'భక్తకన్నప్ప' మైలురాయిలాంటి సినిమా. ఈ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా మళ్లీ రీమేక్ చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ కూడా తయారు చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌పై తానే దర్శకత్వం వహించాలని కూడా ఆయన ఆశపడ్డారు. కానీ, ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో 'భక్తకన్నప్ప' పట్టాలెక్కలేదు ► కృష్ణంరాజుకు 'మన ఊరి పాండవులు' చిత్రం కూడా చాలా ఇష్టం. దాన్ని రీమేక్ చేసే అవకాశం వస్తే, ప్రభాస్‌ను పెట్టి తీయాలనుకున్నారు ► 1984 సమయంలో కృష్ణంరాజు హీరోగా నటించిన 'భారతంలో శంఖారావం' వందరోజుల వేడుక ప్లాన్ చేశారు. అదే సమయంలో తుపాను వల్ల చాలామంది రోడ్డున పడ్డారు. దీంతో ఆ వేడుక కోసం అయ్యే ఖర్చు నిర్మాత నుంచి రూ.70 వేలు ఆపై తన నుంచి రూ. 1,30,000 కలిపి వరద బాధితుల సహాయార్థం విరాళం ఇచ్చారు ► కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ తదితర చిత్రాలు కృష్ణంరాజుని రెబల్‌స్టార్‌గా మార్చేశాయి ► ‘గోపీకృష్ణా మూవీస్’ అనే సంస్థను నెలకొల్పి ఆయన నిర్మాతగా మారారు. ఆ బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘కృష్ణవేణి’. ఆ తర్వాత ఆ బ్యానర్‌పై తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, బిల్లా తదితర ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి ► తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కృష్ణంరాజు హిందీలోనూ ఓ సినిమా నిర్మించారు. అదే ‘ధర్మాధికారి’. దిలీప్ కుమార్, జితేంద్ర, శ్రీదేవి, రోహిణీ హట్టంగడి ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు ► కృష్ణ.. కృష్ణంరాజులు ఇద్దరూ కలిసి అత్యధికంగా 17కి పైగా చిత్రాల్లో నటించారు ► కృష్ణంరాజు అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజుల్లో నటుడిగా ఆయన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అగ్రతారల్లో ఏయన్నార్ ఒకరు ► కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి బిల్లా చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత రెబల్, రాధేశ్యామ్ చిత్రాల్లో కనిపించారు - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
Krishnam Raju Unseen Photos: రౌద్రానికి రారాజు.. మనసున్న మొగల్తూరి మారాజు.. కృష్ణంరాజు జయంతి నేడు (ఫొటోలు)
-
కృష్ణంరాజుతో పెళ్లికి అమ్మ ఒప్పుకోలేదు: శ్యామలా దేవి
మంచితనానికి, హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణం రాజు. సాయం కోసం చేయి చాచిన ఎంతోమందికి ఆపన్నహస్తం అందించారు. చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారు. వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు. మరో మూడు రోజుల్లో (జనవరి 20న) ఆయన పుట్టినరోజు రాబోతోంది. ఈ సందర్భంగా అభిమానులు కృష్ణం రాజును తలుచుకుంటున్నారు. తాజాగా ఆయన సతీమణి శ్యామలా దేవి.. కృష్ణం రాజుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనైంది. ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు శ్యామలా దేవి మాట్లాడుతూ.. 'నాకు తల్లీతండ్రీ, గురువు, దైవం, సర్వస్వం అంతా కృష్టం రాజుగారే! నాకు ఆయనే సర్వాంతర్యామి. ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు. ఆయన జ్ఞాపకార్థంగా నేను మిగిలున్నానంతే! నేను ఆయన జీవితంలోకి ఎలా వచ్చానంటే... కృష్టం రాజుగారు ఎన్నో దానధర్మాలు చేస్తారని ఇంట్లో మాట్లాడుకుంటే విన్నాను. అలా ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అనుకోకుండా మా చుట్టాల ద్వారా తనతో పెళ్లి సంబంధం కుదిరి ఆయన అర్ధాంగిగా మారాను. కానీ అప్పటికే కృష్ణం రాజుకు ఓసారి పెళ్లయింది. మొదటి భార్య పేరు సీతాదేవి. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఓసారి చెన్నైలో షాపింగ్‌కు వెళ్తుండగా కారు ప్రమాదంలో ఆమె మరణించింది. నిరాహార దీక్ష.. ఇది ఆయన జీవితంలో మర్చిపోలేని విషాదం. ఆ బాధ తట్టుకోలేకపోయాడు, ఒంటరివాడయ్యాడు. ఇది చూసిన కృష్ణం రాజు తండ్రి ఆయనకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు కానీ తన ఆకలి తనకు తెలియదు. అడిగి భోజనం పెట్టేది భార్య మాత్రమే అని రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సీతాదేవిని ప్రాణంగా ప్రేమించిన ఆయన రెండో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో మామయ్య.. ఈయన పెళ్లికి ఒప్పుకునేవరకు భోజనం చేయనని నిరాహార దీక్ష చేశారు. తండ్రి బాధ చూడలేక కృష్ణం రాజు రెండో పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి అమ్మాయి కోసం ఆరా తీయగా నా బంధువులెవరో నా పేరు సూచించారు. కానీ ఇక్కడ మా అమ్మ ఒప్పుకోలేదు. బలవంతంగా ఒప్పించారనుకున్నారు రెండో పెళ్లి.. పిల్లలు కావాలనుకుంటారో, లేదో.. అని ఎన్నో అనుమానాలతో ఈ సంబంధాన్ని పెద్దగా ఇష్టపడలేదు. అయితే నేను ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఎందుకంటే అప్పటికే తనపై మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి పెళ్లికి సిద్ధమయ్యాను. నన్ను బలవంతంగా ఒప్పించారేమోనని కృష్ణంరాజు అనుకున్నారు. అసలు విషయం కనుక్కోమని తన కజిన్‌ను నా దగ్గరకు పంపించగా.. నేను ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నానని చెప్పాను. నిజానికి కృష్ణంరాజుకు వారసుడు పుట్టాడు. ఆయన మొదటి భార్యకు ఓ కొడుకు పుట్టి జన్మించాడు. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాబు మరణించాడు' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఆలయంలో ప్రముఖ నటుడి కూతురి పెళ్లి.. ముఖ్య అతిథిగా మోదీ -
దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర: కృష్ణంరాజు
-
ప్రభాస్ తో గొడవ...!
-
ప్రభాస్‌తో గొడవల గురించి కృష్ణంరాజు భార్య
-
చెల్లెళ్ళు అంటే మహా ఇష్టం ప్రభాస్ కు
-
విచిత్రమైన ప్రేమ వాళ్లది...!
-
ప్రేమలో అయ్యా కొడుకులు ఎక్కడ తగ్గారు..
-
పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్ అరుదైన ఫోటోలు
-
బాబు హయాంలో పునాదుల స్థాయిలో టిడ్కో ఇళ్లు
-
కె విశ్వనాథ్ సతీమణి మృతి బాధాకరం: శ్యామలా దేవి సంతాపం
కె. విశ్వనాథ్ కన్నుమూసిన మూడు వారాల వ్యవధిలోనే ఆయన సతీమణి జయలక్ష్మీ కూడా మరణించారని తెలిసి చాలా బాధేసిందని కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలా దేవి అన్నారు. 'తండ్రిని కోల్పోయి బాధలో మునిగిపోయిన ఆ పిల్లలకు తల్లి కూడా దూరం అవడం అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. కృష్ణంరాజు గారు ఆమెను మాతృ సమానురాలిగా గౌరవించేవారు. అలాంటి జయలక్ష్మీ గారు మనల్ని విడిచి వెళ్లి పోవడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా' అంటూ ఆమె సంతాపం వ్యక్తం చేశారు. కాగా అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విశ్వనాథ్ సతీమణి ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ దగ్గరలోనే ఉందనిపిస్తోంది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ హవా కొనసాగిందని తెలిసి చాలా సంతోషించానని కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి అన్నారు. అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే పలు అవార్డులతో సత్తా చాటిన రాజమౌళి మార్క్ చిత్రం ఆర్ఆర్ఆర్ తాజాగా హాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా నాలుగు అవార్డులు కొల్లగొట్టి భారత సినిమా ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఉత్తమ అంతర్జాతీయ చిత్రం’, ‘ఉత్తమ యాక్షన్ చిత్రం’, ‘ఉత్తమ స్టంట్స్’, ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో అవార్డులు గెలిచి తెలుగు సినిమా సత్తా చాటింది. అయితే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేదికపై ఆర్ఆర్ఆర్ సాధించిన ఈ విజయంతో ఆస్కార్ కూడా మనకు దగ్గరలోనే ఉందని నాకనిపోస్తోంది. ఈ ఘనత సాధించిన రాజమౌళికి, చిరంజీవులు రామ్ చరణ్, ఎన్టీఆర్లకు నా శుభాభినందనలు. సంగీతం అందించిన కీరవాణి సహా సినిమా కోసం పనిచేసిన అందరికీ శుభాకాంక్షలుఅంటూ ఆమె పేర్కొన్నారు. -
అన్‌స్టాపబుల్‌లో ఏడ్చేసిన ప్రభాస్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 ఓటీటీలో దూసుకెళ్తోంది. ఈ సారి టాలీవుడ్ ప్రముఖులతో షో ఓ రేంజ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షోకు హాజరైన సంగతి తెలిసిందే. గోపీచంద్‌తో కలిసి ప్రభాస్ సందడి చేశారు. బాలయ్యతో వేసే సరదా ప్రశ్నలతో అందరినీ నవ్వించారు. ఈ ఎపిసోడ్‌ను రెండు పార్టులుగా ఆహా విడుదల చేసింది. ప్రభాస్ ఎమోషనల్: ఈ ఎపిసోడ్లో పెదనాన్న కృష్ణంరాజు జ్ఞాపకాలను తెరపై చూస్తూ ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యారు రెబల్ స్టార్. ఆయన మృతి పట్ల నటుడు గోపీచంద్, ప్రభాస్‌తో పాటు నందమూరి బాలకృష్ణ మౌనం పాటించి సంతాపం తెలిపారు. ప్రభాస్ మాట్లాడుతూ.. 'ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయనే కారణం. ఆయనకు మనందరం రుణపడి ఉంటాం. ఆ రోజుల్లో మద్రాస్ నుంచి వచ్చి 10-12 ఏళ్లు విలన్‌గా చేసి సొంత బ్యానర్ ప్రారంభించి మహిళలతో చరిత్ర సృష్టించాడు. లేడీస్ ఓరియంటెడ్ కథలు తీశారు. ఈరోజు మా కుటుంబం ఆయన్ను చాలా మిస్సవుతున్నాం. ఐ లవ్ హిమ్' అంటూ ఎమోషనలయ్యారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. 'ఆ సమయంలో షూటింగ్ కోసం టర్కీలో ఉన్నా. ఆ క్షణం ఈ వార్త తెలియగానే ఏడుపు ఆపుకోలేక పోయాను.' అని అన్నారు. Love cant have long descriptions..... I Love Him is enough gave a sense of still alive ❤️😭 Balayya hugged .#Prabhas on Peddhanana's behalf...... the true Heir #UnstoppableWithPrabhas pic.twitter.com/XvlmQjVFuX — Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) January 6, 2023 -
కృష్ణం రాజు కోసమే కైకాల ఆ పని చేశారు: శ్యామల
దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మృతితో ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కడసారి ఆయనను కళ్లారా చూసి కంటనీరు పెట్టుకుంటున్నారు సెలబ్రిటీలు. సోషల్ మీడియా వేదికగా తారలు, రాజకీయ నేతలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి కైకాల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "కైకాల సత్యనారాయణ గారు కాలం చేశారని తెలిసి చాలా బాధపడ్డాం. ఆయన భార్య, కుమార్తెలతో మేమంతా చాలా క్లోజ్‌గా, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఆ మధ్య కృష్ణంరాజు గారు.. ఏం సత్యనారాయణ మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి.. అని అడిగితే ఖచ్చితంగా వస్తానని, మీరే ఒక టైం చూసి చెప్పమన్నారు. కానీ ఆయన మా ఇంటికి రాలేకపోయారు. కైకాల సత్యనారాయణ కృష్ణంరాజుతో అనేక అద్భుత చిత్రాల్లో నటించారు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో కృష్ణంరాజు గారితో కలిసి కైకాల సత్యనారాయణ ఒక పాత్ర చేశారు, అది పూర్తిస్థాయి కామెడీతో సాగే పాత్ర. అలాంటి పాత్ర ఆయన ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. లెజెండరీ నటుడైన కైకాల ఇలాంటి పాత్ర ఒప్పుకున్నాడంటే కేవలం అది నా మీద ఉన్న గౌరవమే అని కృష్ణంరాజు అంటూ ఉండేవారు. నవరసాలను పండించగల నవరస నటనా సర్వ భౌమ కైకాల సత్యనారాయణ గారు ఇప్పుడు మన మధ్య లేరంటే బాధగా ఉంది. ఈ ఏడాది ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ దూరమవడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. కైకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని తెలిపారు శ్యామల. చదవండి: అదే ఆయన చివరి కోరిక.. కానీ అది తీరకుండానే కన్నుమూసిన కైకాల దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే! -
ములాయం, కృష్ణ, కృష్ణంరాజులకు పార్లమెంట్ నివాళి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్, టాలీవడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సహా తదితరులకు తొలుత లోక్‌సభ నివాళులర్పించింది. సంతాప సందేశం చదివిన తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు.. రాజ్యసభలోనూ వారికి నివాళులర్పించారు. మరోవైపు.. రాజ్యసభ ఛైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారానున్నారన్నారు. దేశంలో ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. అనేక బాధ్యతలను ధన్‌ఖడ్ సమర్థంగా నిర్వర్తించారని గుర్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: జీ20 నాయకత్వం.. భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం: ప్రధాని మోదీ -
ఒక శకం ముగిసింది
-
కలిసే చనిపోవాలనుకున్నారేమో!: కృష్ణం రాజు భార్య కంటతడి
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకప్పటి తరం హీరోలందరూ కన్నుమూశారంటూ తెలుగు ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు.. ఇలా సీనియర్ హీరోలందరూ మన మధ్య లేకపోవడంతో ఒక తరం శకం ముగిసిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా నేడు ఉదయం తెల్లవారుజామున కృష్ణ మరణించారు. ఇండస్ట్రీకి చెందిన పలువురూ ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణం రాజు భార్య శ్యామ దేవి కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం కన్నీటి పర్యంతమయ్యారు. 'కృష్టం రాజుకి కృష్ణ అంటే ఎంతో అనుబంధం. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. వెళ్లిపోయేటప్పుడు కూడా కలిసే వెళ్లిపోదాం అనుకున్నారేమో! అందుకే మనందరికీ ఇంత బాధను మిగిల్చి ఇద్దరూ ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మహేశ్‌బాబు వరుసగా అన్న, తల్లి, తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం. సుల్తాన్ సినిమా దగ్గరి నుంచి కృష్ణగారి కుటుంబంతో నాకూ మంచి అనుబంధమేర్పడింది. షూటింగ్లో భాగంగా అండమాన్‌లో నెల రోజులపాటు ఉన్నప్పుడు విజయ నిర్మల గారు వంట చేసి పెట్టేవారు. మొన్న కృష్ణ బర్త్‌డేకి కూడా కృష్ణం రాజు గారు ఫోన్ చేసి ఇంటికి రా, చేపల పులుసు చేసి పెడతానన్నారు. అలాంటిది.. ఈరోజు వాళ్లిద్దరూ లేరంటే తట్టుకోలేకపోతున్నాం. భూమి, ఆకాశం ఉన్నంతవరకు వారు చిరస్మరణీయులుగా మిగిలిపోతారు' అని చెప్తూ ఏడ్చేసింది శ్యామలా దేవి. కాగా రెబల్ స్టార్ కృష్ణం రాజు సెప్టెంబర్ 11న తనువు చాలించారు. చదవండి: కృష్ణ పార్థివదేహం వద్ద బోరున ఏడ్చేసిన మోహన్‌బాబు అదే సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి చిత్రం.. -
థియేటర్లలో బిల్లా రీ రిలీజ్.. కృష్ణంరాజు కుమార్తె ఎమోషనల్
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైంది. పాన్ ఇండియా స్టార్ బర్త్‌డేను పురస్కరించుకుని బిల్లా సినిమాను రెండు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు హల్చల్ చేశారు. ఏపీలోని ఓ థియేటర్లో ఏకంగా బాణాసంచా పేల్చారు. దీంతో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్లో బిల్లా సినిమాను ప్రదర్శించారు. ఈ షో చూసేందుకు కృష్ణంరాజు పెద్దకుమార్తె ప్రసీద హాజరయ్యారు. అభిమానుల మధ్య కూర్చొని బిల్లా సినిమాను వీక్షించారు. ఫ్రభాస్ ఫ్యాన్స్ మధ్య థియేటర్లో సినిమా చూడడం సంతోషంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాన్నను, అన్నయ్యను స్క్రీన్‌పై చూడడం చాలా ఆనందాన్నిచ్చిందని ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. అనంతరం థియేటర్ వద్ద కేక్ కట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?) కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద మాట్లాడుతూ...' ప్రభాస్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమా మళ్లీ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత అన్నయ్యను, నాన్నను స్క్రీన్‌పై చూడడం సంతోషం కలిగించింది. మేమందరం చాలా బాగా సినిమాను ఎంజాయ్ చేశాం. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాం. ' అంటూ తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇటీవలే ప్రభాస్ పెదన్నాన్న కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. -
అమెరికాలో భారీ స్థాయిలో విడుదల కానున్న 'బిల్లా' 4k వెర్షన్
ఈమధ్య కాలంలో సినిమాలను రీ మాస్టర్ చేసి మరోసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘బిల్లా’ సినిమా 4K లేటెస్ట్ వెర్షన్ ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా అమెరికాలోనూ రికార్డు స్థాయిలో విడుదల కాబోతుంది. యూఎస్‌లో 70కి పైగా లొకేషన్స్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రీ రిలీజ్ మూవీస్‌లో ఇది అత్యధిక థియేటర్స్ లిస్ట్ అని చెప్పొచ్చు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజవుతున్న ఈ సినిమాక కోసం అభిమానులు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలో దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు కీలక పాత్రలో నటించారు.అనుష్క, నమిత, హన్సిక కథానాయికలుగా నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. -
తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు కృష్ణం రాజు కుమార్తె
రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతిని డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభాస్ కూడా ఈ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడు. అటు సినీప్రియులు వీరిమధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఇద్దరూ కలిసి నటించిన సినిమాల గూర్చి మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో వీరి కలయికలో వచ్చిన బిల్లా మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం హీరోల బర్త్‌డేలకు వారి హిట్ సినిమాలను 4కెలో థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే కదా! అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని బిల్లాను మళ్లీ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రసీద, కమెడియన్ అలీ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు మెహర్ రమేశ్, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. తండ్రి మరణం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన సాయి ప్రసీద మాట్లాడుతూ... 'బిల్లా చిత్రంతో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లో నాన్న, అన్నయ్య కలిసి నటించిన తొలి చిత్రమిది. ఇది నాన్నకు చాలా ఇష్టమైన మూవీ. ఈ చిత్రాన్ని 4కెలో రీరిలీజ్ చేస్తున్నందుకు మెహర్ రమేశ్ అంకుల్‌కు థాంక్యూ. ఈ స్పెషల్ షోల ద్వారా వచ్చే లాభాలను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్‌కు అందిస్తాం. ఇందులో నాన్న భాగస్వామిగా ఉన్నారు. ఫ్యాన్స్ ఈ మూవీని మళ్లీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది. చదవండి: గీతూ వల్ల నరకయాతన, బాలాదిత్య భార్య ఏమందంటే? ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం -
మొగల్తూరు: కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రి రోజా
-
కృష్ణంరాజు స్మృతి వనం.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సాక్షి, పశ్చిమ గోదావరి: రెబల్‌స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి హాజరయ్యారు టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలసి మంత్రులంతా కలిసి సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు మరణంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారని, సినీ-రాజకీయ రంగాల్లో రాణించిన ఆయన మృతి ఆయా రంగాలకు తీరని లోటని మంత్రి రోజా అన్నారు. ఆయన పేరిట మొగల్తూరు తీర ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల స్థలం రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ తరపున కేటాయిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని, రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని, ఇదే విషయాన్ని కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సైతం తెలిపామని వెల్లడించారు. -
ప్రభాస్ అభిమానులతో జనసంద్రమైన మొగల్తూరు (ఫొటోలు)
-
12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. లక్ష మందికి భోజనాలు!
రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రభాస్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు రావడంతో...అతన్ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. పట్టణంలో కొంతమంది అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Love you.. ela vunnaru!! #Prabhas ❤️🥺 pic.twitter.com/rYu7J8oXfP — .. (@charanvicky_) September 29, 2022 నేటి మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు వేణు గోపాల కృష్ణ, రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు పాల్గొననున్నారు. సుమారు లక్ష మంది అభిమానులకు భోజన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేశారు. మిగిలిన వారందరికీ కృష్ణంరాజు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు. 2010లో తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు. ఆ సమయంలో వారం రోజుల పాటు అక్కడే ఉండి సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చాడు. 2 Minutes Silence 🤫 For Those People Who Underestimated About #Prabhas Craze In AP 😎pic.twitter.com/J7zDqamTkF — Prabhas DOMAIN 🏹 (@Prabhas_Domain) September 29, 2022 -
ఒకే ఫ్రేమ్‌లో రెబల్ స్టార్స్.. ఏం ఎడిటింగ్ రా బాబు.. వీడియో అదిరిపోయింది
సోషల్ మీడియాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృష్ణంరాజుపై చేసిన ఓ వీడియో వైరలవుతోంది. ఇద్దరిని మిక్స్ చేస్తూ ఎడిటింగ్ చేసిన వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఒకవైపు కృష్ణంరాజు నటించిన పాత్రలు, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను మిక్స్ చేసి వీడియో రూపొందించారు. అందులోని ప్రతి యాక్షన్ సన్నివేశం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 'ఏం ఎడిటింగ్ రా మామా సూపర్బ్' అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ప్రభాస్ సేమ్ మేనరిజం' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ చిత్రం షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇటీవలే అనారోగ్యంతో ప్రభాస్ పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెలిసిందే. #Prabhas𓃵 anna posted this video in both Fb & insta🥰 Congrats bro @AyyAyy0 ❤️pic.twitter.com/k8v0fWySdb — saaho (@saahoupendra548) September 24, 2022 -
‘సలార్’ షురూ.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌కి ప్రభాస్ హాజరు
ప్రముఖ దివంగత నటుడు కృష్ణంరాజు ఈ నెల 11న కన్నుమూసిన సంగతి తెలిసిందే. పెదనాన్న మరణించడంతో ప్రభాస్ తన తాజా చిత్రాల షూటింగ్ డేట్స్‌ని మళ్లీ ప్లాన్ చేయాల్సి వచ్చింది. పది రోజుల బ్రేక్ తర్వాత ‘సలార్’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు హీరో ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు కీ రోల్ చేస్తున్నారు. బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే నెల మొదటివారం వరకూ ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌తోనే బిజీగా ఉంటారని తెలిసింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్లో పాల్గొంటారు ప్రభాస్. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్గా, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. ‘ప్రాజెక్ట్ కె’ 2024లో రిలీజ్ కానుందని తెలిసింది. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. కాగా, పెదనాన్న మరణంతో ప్రభాస్ పుట్టేడు శోకంలో ఉన్నప్పటికీ.. నిర్మాతల కోసం తిరిగి షూటింగ్లో పాల్గొనడంపై సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రాల షూటింగ్ పునఃప్రారంభానికి సహకరించడం.. సినిమాపై ఆయనకు ఉన్న శ్రద్ద, గౌరవాన్ని చూపిస్తోందని అభిమానులు తెలుపుతున్నారు. -
దివంగత కృష్ణంరాజు ఇంట్లో 11వ రోజు కార్యక్రమం (ఫొటోలు)
-
కృష్ణంరాజు భార్యకు వైఎస్ విజయమ్మ పరామర్శ
బంజారాహిల్స్ (హైదరాబాద్): మాజీ కేంద్రమంత్రి, విలక్షణ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల వైఎస్ విజయమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. సోమవారం జూబ్లీ హిల్స్‌లో కృష్ణంరాజు సతీమణి శ్యామలతో పా టు కుటుంబ సభ్యులను విజయమ్మ పరామర్శించారు. కృష్ణంరాజుతో తన భర్త వైఎస్సార్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ తరచూ కృష్ణంరాజు గొప్పతనం గురించి చెబుతుండేవారని గుర్తుచేసుకున్నారు. -
కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన రాజ్‌నాథ్ సింగ్ (ఫొటోలు)
-
కృష్ణంరాజు మృతి.. ప్రభాస్ కీలక నిర్ణయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెదనాన్న, రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన తుదిశ్వస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు షూటింగ్స్‌కి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలకు కూడా చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ నెలలోనే సలార్ షూటింగ్ షెడ్యూల్ కూడా ఉంది. కానీ అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఈనెల మొత్తం షూటింగ్స్ క్యాన్సిల్ చేయమని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం. -
ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు
ప్రముఖ నటుడు కృష్ణంరాజు గత ఆదివారం (11న) కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆయన సంతాప సభలో కృష్ణంరాజు కుమార్తె ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి పాల్గొన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజుగారు, నేను, చంద్ర మోహన్ ఆర్నెల్ల పాటు చెన్నైలో ఒకే రూమ్‌లో ఉన్నాం. మా అన్నయ్య కృష్ణగారితో ఎంత స్వంతంత్రంగా ఉండేవాణ్ణో కృష్ణంరాజుగారితో కూడా అలాగే ఉండేవాణ్ణి. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు’’ అన్నారు. నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజుగారు లేని బాధ ఆయన కుటుంబానికే కాదు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లకి కూడా ఉంటుంది. నన్ను తొలిసారి బెంజి కారులో ఎక్కించింది కృష్ణంరాజుగారు, ఆయన సోదరుడు సూర్యనారాయణ రాజు’’ అన్నారు. నిర్మాత రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చెన్నైలో ఉన్నప్పటి నుంచి నేను, కృష్ణంరాజు ఫ్రెండ్స్. మా తండ్రిగారికి (ఎల్వీ ప్రసాద్) కూడా కృష్ణంరాజు అంటే చాలా ఇష్టం’’ అన్నారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నిజం చెప్పాలంటే ఇక్కడ మాట్లాడటానికి సిగ్గు పడే పరిస్థితుల్లో ఉన్నాను. మూడేళ్ల క్రితం ఆయన మూవీ టవర్స్‌కి వచ్చి మార్కెట్ ధరకు ఫ్లాట్ కొనుక్కుంటానని అడిగారు.. కారణాలేవైనా ఫ్లాట్ ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. ఇండస్ట్రీలో పెట్టే ఏ అసోసియేషన్స్ అయినా కూడా మన సభ్యుల మంచి కోసం పెడతాం.. కానీ వ్యాపారం చేయాలనుకుంటే అంతకంటే మనం సిగ్గుపడాల్సిన విషయం ఉండదు’’ అన్నారు. నటుడు బాబూమోహన్ మాట్లాడుతూ– ‘‘కృష్ణంరాజు అన్నగారి ‘పాపే నా ప్రాణం’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. 24క్రాఫ్ట్స్‌లో ఆయన గురించి ఎవరూ చెడ్డగా మాట్లాడలేదు’’ అన్నారు. ‘తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ అధ్యక్షుడు బసిరెడ్డి, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ‘డైరెక్టర్స్ అసోసియేషన్’ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, సి.కల్యాణ్, నటి జీవితతో పాటు పలువురు దర్శక–నిర్మాతలు, నటీనటులు, టీఎఫ్జేఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
16న నగరానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నగరానికి వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత యూవీ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. ఈ సందర్భంగా 16న నిర్వహించే కృష్ణంరాజు సంస్మరణ సభలో రాజ్‌నాథ్‌సింగ్, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. -
కృష్ణం రాజు సంతాప సభ (ఫొటోలు)
-
నన్ను నోరారా అరేయ్ అని పిలిచే నటుడు ఆయన మాత్రమే.. మోహన్‌బాబు ఎమోషనల్
సాక్షి, హైదరాబాద్: ఆత్మీయులు ఎంతో మంది దూరమైనా ఏనాడు సంతాప సభకు వెళ్లింది లేదని.. తొలిసారిగా సంతాప సభకు వచ్చానంటూ మోహన్‌బాబు ఎమోషనల్ అయ్యారు. మంగళవారం ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, మంచు విష్ణు, తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, జీవిత, కె.ఎస్ రామారావు, కె.ఎల్ నారాయణ, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘నన్ను నోరారా అరేయ్ అని పిలిచే నటుడు కృష్ణంరాజు. నన్ను మొట్టమొదట బెంజికారు ఎక్కించింది ఆయనే’ అంటూగుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సకల దేవతలను కోరుకుంటున్నానంటూ మోహన్‌బాబు భావోద్యేగానికి గురయ్యారు. ఇలాంటి సభలో ఏనాడు మాట్లాడుతానని అనుకోలేదని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని కృష్ణంరాజు తనతో చెపచెప్పారని మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. ‘ఆ రోజు నాన్నగారు వద్దన్నా.. వారించి మరీ నన్ను పోటీ చేయించారు. దాసరి గారి తర్వాత నేను అంతలా గౌరవించేది కృష్ణంరాజు గారినే. నెల రోజుల కిందట ఆయనను కలిశాను. మా అసోసియేషన్‌లో జరిగే ప్రతి పనిని పదో తేదీ కల్లా చెప్పేవాళ్లం. ఇప్పుడు ఆయన మనకు భౌతికంగా దూరమైనా సినిమాలతో చిరకాలం మనతోనే ఉంటారని' మంచు విష్ణు వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!) -
వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!
‘భక్త కన్నప్ప’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన నటించి ప్రేక్షకులను మెప్పించారు కృష్ణంరాజు. 1940లో సినీ ఇండస్ట్రీలో అ్రగ హీరోగా రాణఙంచిన ఆయన విలన్‌గా, హీరో, సహా నటుడిగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నారు. దాదాపు 60 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన కృష్ణంరాజు ఆదివారం(సెప్టెంబర్ 11న) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల ఆశ్రునయనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. చదవండి: పెళ్లి చేసుకోకపోయినా.. పిల్లల్ని కంటాను: ‘సీతారామం’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన నటనపై ఆసక్తికితో ఇండస్ట్రీ వచ్చి అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఆయన పస్తులు ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా అంచెలంచెలుగా ఎదిగిన కృష్ణంరాజుకు వారసత్వంగా బాగానే ఆస్తులు కలిసోచ్చాయట. అంతేకాదు సినిమా రంగంలో కూడా ఆయన బాగానే ఆస్తులు సంపాదించారట. కృష్ణంరాజు మరణాంతరం ఆయన ఆస్తులు చిట్టా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు ఆయన జన్మించారు. నిజానికి కృష్ణంరాజు తండ్రి స్వస్థలం రాజమండ్రి. కానీ ఆయన మేనత్త మెట్టినిల్లు మొగల్తూరుకే తన తండ్రి, ఆయన సోదరులు వచ్చేశారని గతంలో ఆయన వెల్లడించారు. కృష్ణంరాజుకు తన తండ్రి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి వచ్చింది. ఇప్పటికి ఆ భూముల వ్యవసాయ నిర్వహణ మొత్తం మొగల్తూరులోని కృష్ణంరాజు సమీప బంధువులు చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట ఒక రాజభవనం కూడా ఉందట. ఇక జూబ్లిహిట్స్లో నివాసముంటున్న బిల్డింగ్ ఖరీదు రూ.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా? సినిమాల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలో ఆయన చెన్నైలో ఉండేందుకు ఓ ఇల్లుతో పాటు పలు ఆస్తులు కూడా కొనుగోలు చేశారని సమాచారం. ఇక కృష్ణంరాజు దగ్గర రూ. 90 లక్షల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్‌తో పాటు రూ.40 లక్షల విలువైన టొయోటా ఫార్చునర్, రూ. 90 లక్షల ఖరీదైన వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణంరాజు అఫిడవిట్ ప్రకారం.. తన కుటుంబానికి రూ. 8.62 కోట్ల ఆస్తులు, రూ. 2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. అంతేకాదు అప్పట్లోనే ఆయన కుటుంబంలో 4 కిలోల బంగారం ఉండేదట. ఇవన్ని కలిపి కృష్ణంరాజు ఆస్తుల విలువ రూ. 200 నుంచి 300 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. -
కడసారి చూపునకు నోచుకోలేకపోయా: రాఘవ లారెన్స్ ఎమోషనల్
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపట్ల ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఆయన కృష్ణంరాజు, ప్రభాస్‌లతో కలిసి ‘రెబల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నానని ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగే చాలా కేర్ తీసుకుంటారని అన్నారు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే) ఒక తల్లి పిల్లలకు ఎలా అయితే ఆలనా పాలనా చూస్తుందో ఆయన కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారని, తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం తన దురదృష్టం అని అందుకే ఆయనను కడసారి చూసుకోలేకపోయాను అని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు. I miss my Rebel star Krishnam Raju Garu. He takes care of everyone like his own child and serves them food like a mother. I miss that love and care. My bad luck, I wouldn't pay my last respect for him as I’m not in town. His legacy will always live through prabhas. 🙏🏼🙏🏼 pic.twitter.com/Sg16fqIvNI — Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2022 -
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమ యాత్ర (ఫొటోలు)
-
కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?
కుటుంబ సభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. మోయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌజ్‌లో ప్రభుత్వ లాంచనాల మధ్య అయన అంతిమ విడ్కోలు పిలికారు. ఆయన అంతిమ సంస్కరణలో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు వేలాది సంఖ్యలో అభిమానులు కనకమామిడి ఫామ్‌హౌజ్‌కు తరలి వచ్చారు. ఆయన హఠాన్మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే కృష్ణం రాజుకు ముగ్గురు ఆడపిల్లలు అనే విషయం తెలిసిందే. వారిలో ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు. చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి కూతుళ్ల పెళ్లి చూడకుండానే ఆయన కన్నుమూయడం తీవ్రంగా బాధిస్తోంది. సాధారణంగా సినీ నేపథ్య కుటుంబంలో జన్మించిన వారు తెరకు చాలా దూరం. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో తప్పా ఎలాంటి సినిమా ఈవెంట్స్‌లోనూ వారు కనిపించరు. ఇక వారి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఆయన ముగ్గురు కుమార్తెలు మీడియా ముందుకు వచ్చింది కూడా చాలా తక్కువే. తాజాగా ఆయన మరణంతో కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారనేది ప్రస్తుతం అందిరిలో తలస్తోన్న విషయం. దీంతో వారి గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు అయితే ఆయన ముగ్గురు కూతుళ్లలో పెద్ద కూమార్తె ప్రసీద రీసెంట్గా లండన్‌లో ఏంబీఏ పూర్తి చేశారు. అంతేకాదు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రంతో ఆమె నిర్మాతగా సినీరంగ ప్రవేశం కూడా చేశారు. ఇక రెండో కూమార్తె ప్రకీర్తి హైదరాబాద్‌లోని జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌గా చదువుతున్నారు. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలిజీలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే ముగ్గురు కూమార్తెల్లో కృష్ణంరాజు ఎవరి పెళ్లి చూడకుండానే మృతి చెందారు. ఆయన ఎంతో ప్రేమించే తమ్ముడి కుమారుడైన ప్రభాస్ వివాహం కూడా చూడకుండానే అకాలంగా ఆయన మరణించడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. -
కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి
‘రెబల్’ స్టార్ కృష్ణం రాజు మృతిపై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతరమయ్యారు. ఆయన మనతో లేరు అనేది తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. ‘ఎప్పుడు కనిపించిన జయప్రద ఎలా ఉన్నావంటూ చాలా అప్యాయంగా పలకరించేవారు. ఆయన పిలుపు ఇప్పటికీ నా చేవుల్లో మారుమ్రోగుతుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు చేసి ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారు. ఆయన అనారోగ్యంతో తరచూ ఆస్పత్రికి వెళుతు వస్తున్నారని తెలుసు, ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్పత్రికి నుంచి ఆయన తిరిగి వస్తారనుకున్నాం’ అంటూ ఆమె వెక్కెక్కి ఏడ్చారు. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు అలాగే ఆమె మాట్లాడుతూ.. ‘ఆయనతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు కల్పించాడు. తాండ్ర పాపరాయుడు, భక్త కన్నప్ప వంటి ఎన్నో చిత్రాలు చేసి ఈ రోజు రెబల్ స్టార్‌గా నిలిచారు. ఆయన కూతుళ్లు ఇంకా చిన్నపల్లలు. వారికి, ఆయన సతిమణికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆయన నటుడిగా, రాజకీయ వేత్తగా, కేంద్రమంత్రి ఆయన ఎదిగిన ఎత్తులు సాధారణమైనవి కాదు. ఎలాంటి మచ్చ లేకుండా ఆయన రారాజుగా వెళ్లిపోయారు’ అంటూ జయప్రద భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కృష్ణంరాజు ఆదివారం(సెప్టెంబర్ 11న) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చదవండి: చిరుతో ‘విక్టరి’ వెంకటేశ్ సరదా సన్నివేశం? ఏ సినిమాలో అంటే..! -
కృష్ణంరాజు పార్థివదేహాన్ని మోసిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కడసారి చూపుకోసం అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌజ్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటికే ఆయన అంతియాత్ర ప్రారంభమైంది. అయితే ఆయన నివాసం నుంచి ఫామ్‌హౌజ్‌కు భౌతికకాయాన్ని తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? పార్థివదేహాన్ని మోసుకెళ్లేటప్పుడు సాధారణంగా మహిళలు ముందుకు రారు. కానీ శ్యామలాదేవి మాత్రం తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇండస్ట్రీలో ఆది దంపతులుగా పేరు సంపాదించుకున్న ఈ జంట ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసేవెళ్లేవారు. అంతేకాకుండా కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్ అని పలు సందర్భాల్లో శ్యామలా దేవి చెబుతుండేవారు. కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలా దేవి విలపించిన దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయి. చదవండి: కృష్ణంరాజు అంతిమయాత్ర.. అంత్యక్రియలకు వాళ్లకు మాత్రమే అనుమతి -
అశ్రునయనాల మధ్య ముగిసిన రారాజు అంత్యక్రియలు
Krishnam Raju Last Rites At Moinabad Latest Updates: ►రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. ఆశ్రునయనాల మధ్య ఆయనకు కుటుంబసభ్యులు తుది వీడ్కోలు పలికారు. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు. ►ప్రారంభమైన అంత్యక్రియలు ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి. తమ అభిమాన నటుడ్ని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రలను మాత్రమే ఫామ్‌హౌజ్‌లోకి అనుమతించారు. ఇక కృష్ణంరాజుకు ప్రభాస్‌తో పాటు మిగతాకుటుంబసభ్యులు కడసారి వీడ్కోలు పలికారు. . ►రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి మెయినాబాద్ ఫామ్‌హౌజ్‌కు అంతిమ యాత్ర మొదలైంది. కడసారి చూపు కోసం ఆయన అభిమానులు దారిపొడవునా ఎదురుచూస్తున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో కృష్ణంరాజు ఫామ్‌హౌజ్‌లోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు జరగనున్నాయి. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు కడసారి చూపుకోసం భారీగా అభిమానులు తరలివస్తున్నారు. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తగా అంత్యక్రియలకు కేవలం కుటుంసభ్యులు,బంధువులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు తొలుత భావించినా, పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ► మొయినాబాద్ కనకమామిడిలో ఉన్న ఫాంహౌజ్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ► ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న కృష్ణంరాజు అంత్యక్రియలు. ► బీఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా అంతిమయాత్ర సాగనుంది. ► అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్ర చేరుకుంటుంది. ► దారిపొడవునా ఉన్న రెబల్‌స్టార్ ఫ్యాన్స్.. పూలు జల్లుతూ నివాళులర్పిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?
నటుడిగా, రాజకీయవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన సినీ ప్రస్థానంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన కృష్ణంరాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. ఆయన చివరగా ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రంలో నటించారు. ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు శ్యామల దేవి కంటే ముందే సీత దేవితో వివాహం జరిగింది. 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తెనె సీతాదేవి. అయితే 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. దీంతో ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండో పెళ్లి కోసం ఆయన్ని ఒప్పించారట. తర్వాత 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీరితో పాటు మొదటి భార్య కుమార్తె కూడా కృష్ణంరాజు దగ్గరే ఉంటోది. ఇక మరో అమ్మాయిని కూడా కృష్ణంరాజు దత్తత తీసుకున్నారు. అలా ఐదుగురు ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. -
Krishnam Raju: సంస్థాన వారసుడు.. మొగల్తూరు మొనగాడు
బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బ వంటి డైలాగులతో రెబల్‌స్టార్‌గా సినీ జగత్తులో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు మృతితో గోదావరి జిల్లాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మొగల్తూరు రాజ సంస్థాన వారసుడిగా రాచరికపు ఆచారాలు, సంప్రదాయాలను ముందుండి పాటించడంతో పాటు సొంత ప్రాంత అభివృద్ధికి ఆయన విశేష కృషిచేశారు. నరసాపురం ఎంపీగా, కేంద్ర మంత్రిగా గ్రామాల్లో రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశారు. సహాయం చేయడంలో మనసున్న మా‘రాజు’గా నిలిచారు. సాక్షి, నరసాపురం/మొగల్తూరు: మొగల్తూరుకోట సంస్థానంలో 1940 జనవరి 20న ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు పెద్ద కుమారుడిగా కృష్ణంరాజు జన్మించారు. తండ్రి సత్యనారాయణరాజు కోటలోని వ్యవహారాలు, పొలాల బాధ్యతలు చూసే వారు. వాస్తవానికి కృష్ణంరాజు వంశీయులది తూర్పుగోదావరి జిల్లా జి.ఎర్రంపాలెం కాగా తండ్రి చిన్నతనంలోనే మొగల్తూరు వచ్చారు. కృష్ణంరాజు బాల్యం మొగల్తూరులోనే గడిచింది. ఐదో తరగతి వరకు స్థానికంగా, ఎస్ఎస్ఎల్సీ నరసాపురంలోని టేలర్ స్కూల్లో చదివారు. డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1969లో కోట సంస్థానాదీశులు కలిదిండి లక్ష్మీ కాంతరాజ బహుద్దూర్ (గాంధీబాబు) కు మార్తె సీతాదేవిని వివాహమాడగా అల్లుడు హోదా లో సంస్థాన వారసుడు అయ్యారు. 1995లో కారు ప్రమాదంలో సీతాదేవి మృతి చెందగా 1996లో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. శ్యామలాదేవికి కూడా మొగల్తూరు సంస్థానాదీశులతో బంధుత్వం ఉంది. ఓడి.. గెలిచిన నాయకుడిగా.. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం గల కృష్ణంరాజు అదే పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానంలో ఎంపీగా గెలుపొందారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నరసాపురం నుంచి పోటీచేసి లక్షన్నర మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పారీ్టలో చేరినా కొంతకాలానికి మళ్లీ బీజేపీ గూటికి వచ్చారు. సొంతూరిపై మమకారం కృష్ణంరాజు మొదటి నుంచీ సొంతూరుపై మమకారం చూపారు. మొగల్తూరు నుంచి భీమవరం మండలం వెంప గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం ఆనాటి ముఖ్యమంత్రి జనార్దనరెడ్డితో మాట్లాడి రూ.80 లక్షలు మంజూరు చేయించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో స్వజలధార పథకంలో జిల్లాలో పలు గ్రామాలకు లక్షలాది నిధులు మంజూరు చేయించారు. 214 జాతీయ రహదారిని 216 ఏగా మారి్పంచి నరసాపురం, మొగల్తూరు మండలాలను కలుపుతూ ఒంగోలు వరకూ రోడ్డును విస్తరింపజేశారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి చిన్ననాటి స్నేహితులను కలిసేవారు. మొగల్తూరు వస్తే సొంతింటిలోనే బస చేసేవారు. గోదావరి ముద్దు బిడ్డగా.. రాచరికపు ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో ముందుండే కృష్ణంరాజు కుటుంబంలో ఏ కార్యక్రమమైనా సొంతింటిలోనే జరిపించేవారు. గోదావరిపై మక్కువతో ఆయన నటించిన చిత్రాల్లో గోదావరి పాటలను ఉండేలా చూసేవారు. గోదావరి పుష్కరాలకు సతీసమేతంగా హాజరయ్యేవారు. నరసాపురం వశిష్ట గోదావరి, మొగల్తూరులోని సముద్ర తీర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు చేశారు. సొంతింట్లో 4 నెలల విశ్రాంతి బంగారుతల్లి సినిమా షూటింగ్ నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో ఆయన గాయంతో కాలు విరిగి నాలుగు నెలలపాటు మొగ ల్తూరులోని నివాసంలోనే విశ్రాంతి తీసుకున్నారు. మొగల్తూరు మొనగాళ్లుగా.. మొగల్తూరు ప్రాంతానికి చెందిన కృష్ణంరాజు, చిరంజీవి సినీ పరిశ్రమలో అగ్రహీరోలుగా వెలుగొందడాన్ని ఈ ప్రాంతవాసులు గొప్పగా చెప్పుకునేవారు. కృష్ణంరాజు రైతుగా వ్యవసాయం కూడా చేశారు. రెబల్ పాత్రలతో రెబల్‌స్టార్‌గా పేరుపొందారు. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత మొగల్తూరులో వ్యాపారులు ఆదివారం స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. మొగల్తూరు అందే బాపన్న జూనియర్ కళాశాల, కోట్ల రంగారావు డిగ్రీ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టు యాజమాన్యాలు తెలిపాయి. ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం బుట్టాయగూడెం: కృష్ణంరాజుకు పశి్చమ ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం ఉంది. దర్శకుడు బాపూ దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప సినిమాలోని పలు సన్నివేశాలను బుట్టాయగూడెం సమీపంలోని ఇప్పలపాడు, దొరమామి డి, అలివేరు, పట్టిసీమ ప్రాంతాల్లో చిత్రీకరించారు. దాదాపు నెల పాటు షూ టింగ్ జరగ్గా.. కరాటం కృష్ణమూర్తి, చంద్రయ్య ఇంటి వద్ద కృష్ణంరాజు బసచేశారు. ఇప్పలపాడు గ్రామం పక్కన ప్రత్యేక సెట్టింగ్స్‌తో గిరిజన గూడేన్ని ఏర్పాటుచేశారు. ప్రధాన సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ విరా మ సమయంలో ఇప్పలపాడులోని వీధుల్లో కృష్ణంరాజు సాధారణ వ్యక్తిగా తిరుగుతూ అందరినీ పలకరించేవారని అప్పటి షూటింగ్‌ను తిలకించిన గిరిజనులు అంటున్నారు. మొక్కజొన్న పొత్తులను ఇష్టంగా తినేవారని చెబుతున్నా రు. అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. -
పేరు మార్చేసరికి ‘కృష్ణంరాజు’కు ఏ పని చేసినా కలిసొచ్చేది కాదట..
కృష్ణంరాజుకి శివుడు అంటే ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.. కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ). ►మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. ►దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. -
‘హుందాతనంతో కృష్ణంరాజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు’
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన కృష్ణం రాజుకు ప్రమువురు ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం ఉదయం కృష్ణం రాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను. చలన చిత్ర పరిశ్రమలోనే కాదు పాలిటిక్స్‌లో కూడా కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. హుందాతనం కూడిన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. విలక్షణ నటుడుగా మన్ననలను పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణం బీజేపీకి, సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు. రెబల్ స్టార్ రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. దివంగత ప్రధాన మంత్రి వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
కృష్ణంరాజు చనిపోతే ఇలా చేయడానికి సిగ్గు లేదా?ఆర్జీవీ ట్వీట్ వైరల్
టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని అభిమానులు షాక్‌కి గురయ్యారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా కృష్ణంరాజు మృతికి నివాళిగా టాలీవుడ్లో షూటింగ్‌లు ఆపకపోవడంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు’ అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.ఆయనకు వీడ్కోలు ఇవ్వకపోవడం మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అని రాంగోపాల్ వర్మ ద్వజమెత్తారు. 'మనసు లేకపోయినా ఓకే..కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు! — Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022 -
సినీ, రాజకీయాల్లో రారాజు.. కృష్ణంరాజు: మంత్రి రోజా
సాక్షి, హైదరాబాద్: కృష్ణంరాజు భౌతికకాయానికి సోమవారం నివాళులర్పించారు ఏపీ మంత్రులు. నివాళులు అర్పించిన వాళ్లలో మంత్రులు కారుమూరి, వేణుగోపాలకృష్ణ, రోజా తదితరులు ఉన్నారు. ఈ సందర్భగా.. పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రారాజు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారి అకాల మరణం బాధాకరం. ఈ వార్త తెలిసి.. ముఖ్యమంత్రి జగన్ చాలా దిగ్భ్రాంతి చెందారు. కృష్ణంరాజుగారు.. రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహ పూర్వకంగా వుండేవారు. ఏపీ తరపున మా మంత్రుల బృందం ఆయనకు నివాళులర్పించింది. మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు మరువలేనివి. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై వుండేవారు. ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం చాలా బాధాకరం. ఆపదలో వున్న ఎవరికైనా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి కృష్ణంరాజు. సూర్య చంద్రులు వున్నంత వరకు అయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గా మిగిలిపోతారు. విశ్వరూప్ మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారు సినీ పరిశ్రమలో ఓ ధృవ తారా. నర్సాపురం లో ఏ గ్రామానికి వెళ్లిన ఆయన జాడలు కనిపిస్తాయి. రాజకీయాలలో హుందా కలిగిన వ్యక్తి. ఇదిలా ఉంటే.. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: రెబల్‌స్టార్ మృతి పట్ల ఏపీ ప్రముఖుల సంతాపం -
ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్న కృష్ణంరాజు.. కానీ!
కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో కృష్ణంరాజుది సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్. అయితే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముఖ్యకారణం ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్. వెండితెరపై కృష్ణంరాజు తొలి సినిమా ‘చిలకా గోరింకా’. ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు వచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త దిగాలు పడ్డారు కృష్ణంరాజు. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో కాస్త ప్రతినాయకుడి ఛాయలు ఉండే రోల్లో నటించే అవకాశం వచ్చింది కృష్ణంరాజుకు. దీంతో మరింత కలత చెందిన ఆయన సినీ పరిశ్రమకు వీడ్కోలు చెబుదాం అనుకున్నారట. కానీ పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని, ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వీ ప్రసాద్ హితబోధ చేశారు. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణంరాజు నూతనోత్సాహంతో మళ్లీ యాక్టర్‌గా మేకప్ వేసుకున్నారు. ‘నేనంటే నేనే’లో కృష్ణంరాజు పోషించిన ఆనంద్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నటుడిగా తిరుగులేని సక్సెస్ఫుల్ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు. -
ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు
కృష్ణంరాజు టైటిల్ రోల్లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి అమితమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు.. కానీ కుదర్లేదు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ (2005) సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌లో ‘ఒక్క అడుగు’ అనే పదం ఉంటుంది. దీన్నే టైటిల్‌గా పెట్టి, ఓ మల్టీస్టారర్ సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు కృష్ణంరాజు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగే ‘విశాల నేత్రాలు, జీవన తరంగాలు’ నవలలంటే ఆయనకు ఇష్టం. వీటి ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అదీ నెరవేరలేదు. ఇక ప్రభాస్ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస సినిమాల కమిట్మెంట్స్ కారణంగా వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అలాగే తన ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిల వివాహాల విషయంలోనూ కృష్ణంరాజుకి ఆశ ఉండటం సహజం. మరోవైపు ఎంపీ అయిన కృష్ణంరాజుకు గవర్నర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాలని ఉండేదట. ఓ దశలో కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్ పదవి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. యంగ్ రెబల్ స్టార్‌తో మూడు చిత్రాలు కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి సినిమా ‘బిల్లా’ (2009). ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ‘రెబల్’ (2012) సినిమాలో కలిసి నటించారు కృష్ణంరాజు, ప్రభాస్. ‘రెబల్’ తర్వాత మరోసారి కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ (2022)లో పరమహంస అనే కీ రోల్ చేశారు కృష్ణంరాజు. ఇది ఆయనకు చివరి సినిమా. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు!
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే.. పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్నాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు. చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరు కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: కృష్ణంరాజు ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నా.. -
కృష్ణంరాజు భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి ( ఫోటో గ్యాలరీ 2 )
-
కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు
ఆరడుగుల ఆజానుబాహుడు.. వెండితెరపై ‘రెబల్ స్టార్’. బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప... సాంఘికం, పౌరాణికం... ఇలా దాదాపు అన్ని జానర్లు టచ్ చేసిన పరిపూర్ణ నటుడు. ‘ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. ‘ఒక కారు కొంటాం.. ఇంకోటి కొంటాం.. కానీ ఆ కారు దిగి కాలు భూమి మీదే పెట్టాలి కదా.. కాళ్లతోనే నడవాలి కదా’.. రెబల్ స్టార్ చెప్పిన జీవిత సత్యం ఇది. అందుకే ఆయన నిరాడంబరమైన మనిషి. ‘ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదు’ అనేది ఆయన సిద్ధాంతం. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. భర్తగా, తండ్రిగా, పెదనాన్నగా.. ఇంటిల్లిపాదినీ బాగా చూసుకున్నారు. పేరుకి తగ్గట్టే రాజులా బతికారు. అందుకే ఆయన పరిపూర్ణమైన మనిషి కూడా... ఆదివారం తెల్లవారుజాము ‘రెబల్ స్టార్ కృష్ణంరాజు’ ఇక లేరని ఓ చేదు వార్తని మోసుకొచ్చింది. 82 ఏళ్ల క్రితం ఓ మంచి మనిషి ఈ భూమ్మీదకు వచ్చాడు. రాజసంగా బతికాడు.. రాజసంగా వెళ్లిపోయాడు. ఒక శకం ముగిసింది.. ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చినవెంకట కృష్టంరాజు. అయితే ఆ పేరు పెద్దగా ఉందని శ్రీ, చినవెంకట పేర్లను తీసేసి, ఉప్పలపాటి కృష్టంరాజు అని పెట్టుకున్నారు. మొగల్తూరులోని బోర్డింగ్, హైస్కూల్లో ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్నారు కృష్ణంరాజు. ఆ తర్వాత నర్సాపూర్ టైలర్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి ప్రవేశం కోసం వెళితే.. ఆ స్టాండర్డ్ సరిపోదని మళ్లీ ఎనిమిదో తరగతిలో చేరాలంటే, అదే స్కూల్లో ఎనిమిది, తొమ్మిది, ఎస్ఎస్ఎల్సి (పది) తరగతులు పూర్తి చేశారు. కాగా టైఫాయిడ్ జ్వరం కారణంగా ఎస్ఎస్ఎల్సి తప్పిన ఆయన రెండోసారి పాసయ్యారు. బీకాం మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేశారు. జర్నలిస్ట్‌గా... ధనిక కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు పాఠశాలకు గుర్రపు బండిలో, కళాశాలకు బీఎస్ఏ మోడల్ మోటార్ బైక్, వోక్సాలిన్ అనే కారులో వెళ్లి వచ్చేవారు. కారులో కళాశాలకు వెళుతుంటే ఆయన్ను యంగ్ లెక్చరర్ అనుకునేవారు. కళాశాలలో జరిగిన ఎన్నికలప్పుడు లెక్చరర్ కాదు స్టూడెంట్ అని అందరికీ తెలిసిందట. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాక కొంతకాలంపాటు ‘ఆంధ్రరత్న’ అనే దినపత్రికలో జర్నలిస్టుగా చేశారు. హైదరాబాద్‌లో రాయల్ స్టూడియో చిన్నప్పటి నుంచి కృష్ణంరాజుకి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. 14 ఏళ్ల వయసు నుంచే మార్కెట్లోకి వచ్చిన ప్రతి కెమెరా కొని ఫొటోగ్రఫీలో ప్రయోగాలు చేశారు. ఆ అనుభవంతో హైదరాబాద్ అబిడ్స్‌లో ‘రాయల్ స్టూడియో’ను ప్రారంభించారు. చూడటానికి హీరోలా ఉన్నావని సీహెచ్‌వీపీ మూర్తిరాజు (బంధువు), స్నేహితులు కృష్ణంరాజుకి చెబితే నవ్వి ఊరుకునేవారట.. అంతేకానీ, సినిమాలు చేయాలనే ఆలోచన ఉండేది కాదట. ‘చిలకా గోరింకా’తో సినిమా ఎంట్రీ ‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్ నుంచి మద్రాస్ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్‌కి తిరిగొచ్చేశారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోని ‘తేనె మనసులు’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లారు. ఆ ఆడిషన్స్‌కి కృష్ణ, జయలలిత, సంధ్యారాణి, హేమమాలిని కూడా హాజరయ్యారు. అయితే కృష్ణంరాజు, జయలలిత, హేమమాలినిలను రిజెక్ట్ చేశారట. ప్రత్యగాత్మ దర్శకత్వంలో చేసిన ‘చిలకా గోరింకా’ (1966) చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు కృష్ణంరాజు. రెబల్ స్టార్‌గా... ఐదున్నర దశాబ్దాల కెరీర్లో ‘బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీ సావిత్రి, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, టూ టౌన్ రౌడీ, జీవన తరంగాలు’ ఇలా... దాదాపు 185 సినిమాల్లో నటించారు. ‘తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమరదీపం’ వంటి సినిమాలు కృష్ణంరాజుకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. సాంఘిక, పౌరాణిక సినిమాల్లో చేసిన పాత్రలే ప్రేక్షకుల మనసుల్లో రెబల్‌స్టార్‌గా పేరు తీసుకొచ్చాయి. స్టయిలిష్ విలన్‌గా.. హీరోగా చేస్తున్నప్పుడు ‘నేనంటే నేనే’ (తమిళ ‘నాన్’కి రీమేక్) చిత్రంలో విలన్‌గా చేయమని నిర్మాత డూండీ (అప్పటికి పేరున్న నిర్మాత) అడిగారు. అయితే విలన్‌గా చేయడం ఇష్టంలేక ‘సారీ’ అనేశారు కృష్ణంరాజు. ఆ విషయం తెలిసి,‘ అంత పెద్ద నిర్మాత అడిగితే కాదంటావా? ఈరోజు పెద్ద హీరోలుగా రాణిస్తున్న శివాజీ గణేశన్వంటి వారు ఒకప్పుడు విలన్‌గా చేసినవారే’ అని దర్శకుడు ప్రత్యగాత్మ అన్నారు. ‘అయితే ఒక కండీషన్.. అందులో మనోహర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు.. నేను నా పద్ధతిలో చేస్తా’ అని కృష్ణంరాజు అన్నారు. పెద్ద నిర్మాత అయిన నాకే కండీషనా? అన్నప్పటికీ డూండీ ఒప్పుకున్నారు. చిత్రదర్శకుడు రామచంద్రరావు మాత్రం షూటింగ్ లొకేషన్లో మనోహర్ స్టయిల్లో చేయమన్నారు. అయితే డూండీ మాత్రం కృష్ణంరాజుని తనదైన శైలిలో నటించమన్నారు.. కొత్తగా చేశారు. ఆ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ‘మరో ఆర్. నాగేశ్వరరావు (ప్రముఖ విలన్ నాగేశ్వరరావు అప్పటికి మరణించారు) ఇండస్ట్రీకి వచ్చాడు’ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత విలన్ పాత్రలు వచ్చినప్పటికీ అప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం గళ్ల లుంగీ, చారల బనియన్, క్రూరమైన చూపులు.. కృష్ణంరాజు ఇలా రొటీన్‌గా కనిపించదలచుకోలేదు. స్టైలిష్ విలన్‌గా చేయాలనుకున్నారు. ఆ విధంగా ట్రెండ్ సెట్టింగ్ విలన్ అనిపించుకున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఓ స్థాయి ఉన్న పాత్రలే చేశారాయన. ‘బావా బావమరిది, జైలర్‌గారి అబ్బాయి, గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌరుషం, నాయుడుగారి కుటుంబం, మా నాన్నకి పెళ్లి’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు చేశారాయన. అవార్డులు.. రివార్డులు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం (1977)’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984) చిత్రాలకు గానూ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు కృష్ణం రాజు. ‘అమరదీపం’, ‘మన ఊరి పాండవులు’ (1978) సినిమాల్లోని నటనకుగానూ రాష్ట్రపతి పురస్కారాలు వరించాయి. 1994లో శరత్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్‌గారి అబ్బాయి’ చిత్రంలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నారాయన. అదే విధంగా 2014లో ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు అందుకున్నారు కృష్ణంరాజు. వీటితోపాటు పలు ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారాయన. కేంద్రమంత్రిగా... 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు కృష్ణంరాజు. ఆ తర్వాత బీజేపీలో చేరి, 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి, కేంద్రమంత్రిగా చేశారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరారు కృష్ణంరాజు. అనంతరం బీజేపీలోనే కొనసాగారు. సినీ పరిశ్రమలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా)కి సేవలందించారు. అలాగే ‘క్రమశిక్షణా సంఘం (మా)’కి అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ కృష్ణంరాజుకి ఆఖరి సినిమా. చిత్రసీమ ఓ మంచి నటుడిని కోల్పోయింది. ఆతిథ్యం ఇచ్చే విషయంలో రారాజు అనిపించుకున్న ఓ మంచి మనిషి దూరం అయ్యారు. కృష్ణంరాజు అంత్యక్రియలు చేవెళ్లలోని మొయినాబాద్‌లో గల కనకమామిడి ఫామ్ హౌస్‌లో ఈరోజు మధ్యాహ్నం అధికారిక లాంఛనాలతో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సీతాదేవితో వివాహం 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తె సీతాదేవిని వివాహమాడారు కృష్ణంరాజు. 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. తీరని ఆశలు కృష్ణంరాజు టైటిల్ రోల్లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి అమితమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు.. కానీ కుదర్లేదు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ (2005) సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌లో ‘ఒక్క అడుగు’ అనే పదం ఉంటుంది. దీన్నే టైటిల్‌గా పెట్టి, ఓ మల్టీస్టారర్ సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు కృష్ణంరాజు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగే ‘విశాల నేత్రాలు, జీవన తరంగాలు’ నవలలంటే ఆయనకు ఇష్టం. వీటి ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అదీ నెరవేరలేదు. ఇక ప్రభాస్ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస సినిమాల కమిట్మెంట్స్ కారణంగా వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అలాగే తన ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిల వివాççహాల విషయంలోనూ కృష్ణంరాజుకి ఆశ ఉండటం సహజం. మరోవైపు ఎంపీ అయిన కృష్ణంరాజుకు గవర్నర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాలని ఉండేదట. ఓ దశలో కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్ పదవి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. యంగ్ రెబల్ స్టార్‌తో మూడు చిత్రాలు కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి సినిమా ‘బిల్లా’ (2009). ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ‘రెబల్’ (2012) సినిమాలో కలిసి నటించారు కృష్ణంరాజు, ప్రభాస్. ‘రెబల్’ తర్వాత మరోసారి కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ (2022)లో పరమహంస అనే కీ రోల్ చేశారు కృష్ణంరాజు. ఇది ఆయనకు చివరి సినిమా. పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలనుకున్నారు కానీ...! కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో కృష్ణంరాజుది సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్. అయితే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముఖ్యకారణం ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్. వెండితెరపై కృష్ణంరాజు తొలి సినిమా ‘చిలకా గోరింకా’. ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు వచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త దిగాలు పడ్డారు కృష్ణంరాజు. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో కాస్త ప్రతినాయకుడి ఛాయలు ఉండే రోల్లో నటించే అవకాశం వచ్చింది కృష్ణంరాజుకు. దీంతో మరింత కలత చెందిన ఆయన సినీ పరిశ్రమకు వీడ్కోలు చెబుదాం అనుకున్నారట. కానీ పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని, ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వీ ప్రసాద్ హితబోధ చేశారు. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణంరాజు నూతనోత్సాహంతో మళ్లీ యాక్టర్‌గా మేకప్ వేసుకున్నారు. ‘నేనంటే నేనే’లో కృష్ణంరాజు పోషించిన ఆనంద్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నటుడిగా తిరుగులేని సక్సెస్ఫుల్ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు. రాజుకి ఆకలి బాధ పుట్టినప్పటినుంచి ఆకలి బాధ తెలియకుండా పెరిగిన కృష్ణంరాజు ఓ సందర్భంలో రెండు రోజులు పస్తులు ఉన్నారు. నటనలో సంతృప్తి పొందేవరకూ ట్రైనింగ్ తీసుకునే సమయంలోవచ్చిన ప్రతి సినిమానీ వదులుకున్నారాయన. అప్పటికి ఇంటి నుంచి కృష్ణంరాజు తండ్రి డబ్బులు పంపించేవారు. అయితే తన దగ్గర డబ్బులయిపోయాయని తండ్రికి ఉత్తరం రాయడానికి బద్ధకించి కృష్ణంరాజు రాయలేదు. దాంతో రెండు రోజులు పస్తులు ఉన్నారు. పోనీ ఎవరినైనా అడుగుదామంటే ఆత్మాభిమానం.. మొహమాటం. ఆ సమయంలో వచ్చిన శివకుమార్ రెడ్డి (పొలిటీషియన్ బెజవాడ గోపాల్‌రెడ్డి బావ) అనే ఫ్రెండ్ నీరసంగా ఉన్న కృష్ణంరాజుని చూసి, విషయం అడిగి తెలుసుకున్నారు. ‘మాకయితే డబ్బులిస్తావు కానీ నీక్కావాలంటే అడగవా’ అంటూ చివాట్లు పెట్టి, బలవంతంగా హోటల్‌కి తీసుకెళ్లి బిర్యానీ తినిపించారు. అయితే కృష్ణంరాజు తండ్రికి ఈ విషయం తెలిసి, బాధపడి అప్పట్నుంచి నెలకు 1200 రూపాయలు పంపించడం మొదలుపెట్టారు. అప్పట్లో 1200 అంటే పెద్ద మొత్తం కింద లెక్క. నటన కోసం పుస్తక పఠనం తొలి చిత్రం ‘చిలకా గోరింకా’ సినిమా కృష్ణంరాజుకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో పాటు ఈ సినిమాలో ఇంకా బాగా యాక్ట్ చేసుంటే బాగుండనే ఫీలింగ్ ఆయనకు కలిగింది. దీంతో నటన గురించి, నటనావిధానాల గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాలనుకున్నారు. ఈ క్రమంలోనే రష్యన్ యాక్టర్ స్టాన్స్ లాస్కీ రచించిన ‘మై లైఫ్ ఇన్ ఆర్ట్’, మరో అంతర్జాతీయస్థాయి దర్శక – నటుడు పుడోకిన్స్ రాసిన వ్యాసాలు, వరల్డ్ లిటరేచర్‌లో వచ్చిన ‘ది ఆర్ట్ ఆఫ్ సినిమా అండ్ యాక్టింగ్’పై వచ్చిన పుస్తకాలను చదివారాయన. కానీ పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదని, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని తెలుసుకున్నారు కృష్ణంరాజు. ఇందుకోసం అప్పటి సినీ ప్రముఖుడు సీహెచ్ నారాయణరావు దగ్గర కృష్ణంరాజు శిక్షణ తీసుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి లంచ్ అవర్ వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కృష్ణంరాజు నటనలో శిక్షణ తీసుకునేవారు. ఇలా నటనలో తనకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మేకప్ వేసుకోకూడదని నిర్ణయించుకున్నారు కృష్ణంరాజు. ఈ క్రమంలో రంగూన్ రామారావు డైరెక్షన్‌లోని ఓ సినిమా, జోసఫ్ తలియత్ అనే దర్శక– నిర్మాతలు ఇచ్చిన హీరో ఆఫర్స్‌ను రిజెక్ట్ చేశారు కృష్ణంరాజు. దీంతో ఆయన మిత్రులు కృష్ణంరాజుపై కోప్పడ్డారు. కానీ ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ససేమిరా అన్నారు. నటనపై పూర్తి పట్టు సాధించిన తర్వాతే కృష్ణంరాజు తన తర్వాతి సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరణం గురించి కృష్ణంరాజు చెప్పిన విషయం జీవించి ఉన్నప్పుడే చావు గురించిన ఆలోచన అంటే చాలామంది భయపడతారు. కానీ కృష్ణంరాజు భయపడలేదు. పైగా తాను ఎలా చనిపోవాలనుకుంటున్నారో ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదనే భావనతో గుండెల మీద చేతులు వేసుకుని నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నా తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈ రోజూ .. అదే నా కోరిక’’ అని మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. ధ్యానంలో దైవ దర్శనం కృష్ణంరాజుకి శివుడు అంటే ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొస్తు్తంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ). మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. నిర్మాతగానూ... కన్నడ చిత్రం ‘శరపంజర’ (1971) ఆధారంగా తెలుగులో వచ్చిన ‘కృష్ణవేణి’ (1974) సినిమాతో నిర్మాతగా మారారు కృష్ణంరాజు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. దాంతో తన తమ్ముడు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు (ప్రభాస్ తండ్రి) నిర్మాతగా గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌ను స్థాపించి, ‘భక్త కన్నప్ప’ సినిమా నిర్మించి, నటించారు కృష్ణంరాజు. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత అమరదీపం, ‘మన ఊరి పాండవులు, ‘సీతారాములు , మధురస్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, బిల్లా’ వంటి సినిమాలను నిర్మించారు కృష్ణంరాజు. ‘రాధేశ్యామ్’కు సమర్పకులుగా ఉన్నారు. అలాగే హిందీ చిత్రం ‘ధర్మ్ అధికారి’కి సమర్పకుడిగా ఉన్నారు కృష్ణంరాజు. ఇక ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘ధర్మ్ అధికారి’ని నిర్మించారు. హిందీలోనూ ఈ చిత్రం బాగా ఆడినప్పటికీ కొందరు ఉత్తరాది పంపిణీదారులు మోసం చేయడంతో కొంత నష్టం జరిగిందని ఓ సందర్భంలో కృష్ణంరాజు పేర్కొన్నారు. -
Krishnam Raju: రాజకీయాల్లో పడిలేచిన కెరటం!
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. సినిమాలతో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఆయన రాజకీయాల వైపు ఆకర్షితులు అయ్యారు. 1991లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్‌రాజు చేతిలో ఓటమి చవిచూశారు. కొంతకాలం సినిమాలపైనే దృష్టిపెట్టిన ఆయన 1998లో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ లోక్‌సభ రద్దయి 1999లో మధ్యంతర ఎన్నికలు జరగడంతో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరు బాపిరాజుపై గెలుపొందారు. రెండోసారి లోక్‌సభలోకి అడుగుపెట్టిన ఆయన కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1999–2000 మధ్య లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కమిటీ సభ్యుడిగా, 2000లో కేంద్ర వాణిజ్య శాఖ సలహాకమిటీ సభ్యుడిగా పనిచేశారు. తొలిసారిగా 2000 సెప్టెంబర్ 30న వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2001 జూలై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, అప్పటి నుంచి 2002 జూన్ 20 వరకు రక్షణశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇదే ఏడాది జూలై 1న వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. కలిసి రాని సెకండ్ ఇన్నింగ్స్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీచేసిన కృష్ణంరాజు.. కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి హరిరామజోగయ్య చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత ఐదేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2009లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై రాజమండ్రి నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. కొంతకాలం రాజకీయాలకు దూరం పాటించారు. మళ్లీ 2014లో బీజేపీలో చేరి కొంత యాక్టివ్‌గా పనిచేశారు. ఈ సమయంలో కృష్ణంరాజుకు గవర్నర్ పదవి రాబోతున్నదనే ప్రచారం జరిగింది. కానీ ఆరోగ్యం సహకరించలేదు. బీజేపీలోనే కొనసాగినా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు. ఇదీ చదవండి: Krishnam Raju: రారాజు ఇకలేరు -
Krishnam Raju: రారాజు ఇకలేరు
పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో నిరూపించుకున్న పరిపూర్ణ నటుడు. తెరపై చేసిన శక్తిమంతమైన పాత్రలతో ‘రెబల్ స్టార్’ అనిపించుకున్నారు. ఈ వెండితెర ‘భక్త కన్నప్ప’ శివైక్యం పొందారు. అయితే చేసిన సినిమాల ద్వారా, మంచి పనుల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు కృష్ణంరాజు. బీకాం మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేశారు. ఆ తర్వాత ఫొటోగ్రఫీ అంటే ఇష్టంతో హైదరాబాద్‌లో స్టూడియో ఆరంభించారు. అంతకుముందు జర్నలిస్ట్‌గానూ చేశారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేనప్పటికీ వచ్చిన అవకాశం కాదనలేక ‘చిలకా గోరింక’తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా, హీరోగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. ఈ ‘వెండితెర రారాజు’ అనారోగ్యం కారణంగా ఆదివారం తుదిశ్వాస విడిచారు. సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్ రూరల్: కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈ వార్త విని కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 27లోని స్వగృహానికి తరలించి సందర్శనార్థం ఉంచారు. నెల రోజులుగా వెంటిలేటర్‌పై.. కృష్ణంరాజు (83) కొంతకాలం నుంచి మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గతేడాది రక్తనాళాల్లో అడ్డంకులతో వచ్చే పెరిఫెరల్ వాస్క్యులర్ వ్యాధి కారణంగా కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఏడాదిన్నర కింద కోవిడ్ సోకిన అనంతరం న్యుమోనియా, ఇన్ఫెక్టివ్ బ్రాంకైటిస్, కిడ్నీ సమస్యలు తలెత్తాయి. ఆరోగ్యం మరింతగా దెబ్బతినడంతో ఈ ఏడాది ఆగస్టు 5న ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కృష్ణంరాజు దాదాపు నెల రోజులుగా వెంటిలేటర్ సపోర్టుతోనే ఉన్నారని.. ఆరోగ్యం విషమించి కన్నుమూశారని వైద్యులు తెలిపారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే సినీ నటుడు ప్రభాస్. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే ప్రభాస్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి వద్ద ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రముఖులు కృష్ణంరాజు భౌతికకాయాన్ని పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సందర్శించి నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, మోహన్‌బాబు, మురళీమోహన్, కోదండ రామిరెడ్డి, సి.కల్యాణ్, మంచు మనోజ్, దిల్‌రాజు, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, వంశీ పైడిపల్లి, కీరవాణి, రాజు సుందరం, విజయ్ దేవరకొండ, నాని, గోపీచంద్, నరేశ్‌తోపాటు మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేత వీహెచ్ తదితరులు నివాళులు అర్పించారు. నేడు కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. కృష్ణంరాజు సుమారు నాలుగేళ్ల క్రితం కనకమామిడి 3.25 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అందులో భవన నిర్మాణాన్ని కూడా చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫామ్‌హౌజ్‌లో ఏర్పాట్లతోపాటు అక్కడి వెళ్లే రహదారులను సిద్ధం చేస్తున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరుకానున్నారు. కృష్ణంరాజు మరణం కలచివేసింది బీజేపీ సీనియర్ నేత, సినీ నటుడు కృష్ణంరాజు మరణం కలచివేసింది. రాబోయే తరాలు కృష్ణంరాజు నటనా కౌశలాన్ని, సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలోనూ ముందున్న ఆయన రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా. ఓం శాంతి.. – ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణంరాజు సేవలు చిరస్మరణీయం కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. – ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవీ చదవండి: కృష్ణంరాజుగారు నాకు పెద్ద బహుమతి రెబల్ స్టార్ కృష్ణం రాజు సినీ జ్ఞాపకాలు ( ఫొటోలు) కృష్ణంరాజు భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి ( ఫొటోలు) -
కృష్ణంరాజుగారు నాకు పెద్ద బహుమతి
మీ పెళ్లయ్యి 23 (2019కి) ఏళ్లు. ఇన్నేళ్ల వైవాహిక జీవితం గురించి... కృష్ణంరాజు: ఇన్నేళ్లయిందా అనిపిస్తోంది. మా జీవితం మంచి కలలా సాగిపోతోందంటే.. మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కారణం. కోపాలు ఉంటాయి. అలా కోపం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుకోం. అయితే కోపం తగ్గి, కొంత గ్యాప్ ఇచ్చాక మాట్లాడుకుంటాం చూడండి.. అది మాత్రం భలే ఉంటుంది. పెళ్లి రోజుకి కానుకలు ఇచ్చుకుంటారా? శ్యామల: కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్. నేను పెట్టుకునే నగలు, కట్టుకునే చీరలు అన్నీ ఆయన కొనేవే. అన్నింటికీ మించి ఆయనే పెద్ద బహుమతి. శ్యామలగారు ఇచ్చిన బహుమతుల గురించి? కృష్ణంరాజు: తనే నాకు గిఫ్ట్. శ్యామల: నేను మాత్రమే కాదు.. బుద్ధిమంతులైన ముగ్గురు పిల్లలను బహుమతిగా ఇచ్చాను (నవ్వుతూ). కృష్ణంరాజుగారికి మీరు అభిమాని. అభిమాన హీరోతో పెళ్లి విశేషాలు చెబుతారా? శ్యామల: పెళ్లి రోజున కృష్ణంరాజుగారి వైపు తలెత్తి చూడాలంటే వణుకు. ఎలాగో ధైర్యం కూడదీసుకుని ముందు కాళ్ల నుంచి చూసుకుంటూ ముఖం చూశాను. కలా? నిజమా అర్థం కాలేదు. పెళ్లికి ముందు రోజు విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చాం. నాకు జామకాయలంటే ఇష్టం. విడిది ఇంట్లో జామ చెట్టు ఉంది. నేను జామకాయలు కోస్తుంటే ‘పెళ్లి కూతురివి. కొయ్యకూడదు’ అని అమ్మ మందలించింది. పెద్ద కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతుంటే భయం అనిపించిందా? శ్యామల: వీళ్లది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అంత మందిలో నేను ఇమడగలుగుతానా అని అమ్మ భయపడింది. కానీ కృష్ణంరాజుగారు నాతో ‘ఎవరో ఏదో అంటారని భయపడొద్దు. ఏ పని చేసినా చక్కగా చెయ్’ అని ధైర్యం ఇచ్చారు. మరి.. పెళ్లి చూపుల గురించి? శ్యామల: ఆయన వాళ్ల కజిన్‌ని పంపించి, అమ్మాయిని బలవంతంగా ఒప్పించి, పెళ్లి చేస్తున్నారా? ఇష్టపడే చేసుకుంటుందా? అని అడిగి తెలుసుకోమన్నారు. ‘నాకిష్టం’ అని చెప్పాను. ఆయన కజిన్ వచ్చేసరికి మా ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నాను. ‘నేను వెళ్లేసరికి వదినగారు పిల్లలతో ఆడుకుంటున్నారు’ అని ఆయన చెబితే, ‘అయితే ఓకే.. మనస్తత్వం కూడా పిల్లల్లానే ఉంటుంది. మంచిదే’ అని నా ఫొటో చూసి, ఓకే చేశారు. కృష్ణంరాజుగారి ఫస్ట్ భార్య చనిపోయాక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు... బాగా చూసుకుంటారో లేదోననే సందేహం ఏమైనా? శ్యామల: అస్సలు లేదు. ఆయన మంచితనం గురించి ముందే మాకు తెలుసు. ఎన్నో దాన ధర్మాలు చేసేవారు. ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరుంది. ఆ ఫ్యామిలీలోకి వచ్చిన కొన్నాళ్లకే అందరికీ దగ్గరయ్యాను. ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది? కృష్ణంరాజు: బేసిక్‌గా నా అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. ఒకరి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే అండర్స్టాండింగ్ ఉండదు. తన విషయంలోనే కాదు.. నా పిల్లల విషయంలోనూ అంతే చేస్తాను. శ్యామల: మనం నమ్మితే పిల్లలు ఆ నమ్మకాన్ని నిలబెడతారన్నది మా అభిప్రాయం. కృష్ణంరాజు: ‘జీన్స్’ అంటారు కదా.. అది నిజమే. ఆ ఫ్యామిలీ తాలూకు జీన్స్ పిల్లలకు కచ్చితంగా వస్తాయి. నా చిన్నప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే నన్ను పిలిచి ‘మన కుటుంబం ఇలాంటిది. మన పూర్వీకులు ఇలాంటివారు’ అని చెబితే, నా మన సులో నాటుకుపోయింది. మా నాన్నగారు ఎన్నో వందల కుటుంబాలను ఆదుకున్నారు. అవన్నీ తెలిసిన వ్యక్తిగా నాకూ సహాయం చేయడం అలవాటైంది. అలాగే కుటుంబ పరువుకి నష్టం కలగకూడదనేది డెవలప్ అయింది. అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పినట్లుగా ఇప్పుడు నేను నా పిల్లలకు చెబుతుంటాను. అలాగే మా నాన్నగారికి ఉన్న సహాయ గుణం నాకు వచ్చినట్లుగా నా పిల్లలకూ వచ్చింది. ‘కుటుంబ గౌరవం’ అనే విషయాన్ని నా పిల్లలు కూడా తెలుసుకున్నారు. మీకు ముగ్గురి పిల్లల చదువుల విషయంలో, ఇతర వ్యక్తిగత విషయాల్లో వాళ్లకు మీరు ఇస్తున్న గైడెన్స్ గురించి? కృష్ణంరాజు: మా అమ్మాయిలు ఎప్పుడైనా డౌన్ అయితే ‘యు ఆర్ కృష్ణంరాజు డాటర్.. యు ఆర్ గ్రేట్. డోంట్ వర్రీ. భయపడొద్దు. మీ గురించి ఎవరో ఏదో చెబుతారని అనుకోవద్దు. నేను నమ్మను’ అని చెబుతుంటాను. అలా నమ్మి పెంచడంవల్ల పిల్లలు డొనేషన్ కట్టించుకోవడానికి, రికమండేషన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదు. ముగ్గురూ చదువులో బెస్ట్. మా పెద్ద అమ్మాయి సాయిప్రసీద లండన్‌లో మెరిట్ మీద ఎంబీఏ సీట్ సంపాదించుకుంది. చిన్న పాప సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుతోంది. మంచి పర్సంటేజ్ రావడంతో జేఎన్టీయూలో సీట్ వచ్చింది. మూడో పాప సైకాలజీ చదువుతానంది. సరే.. మూడు నాలుగు లక్షలు డొనేషన్ కడతా అన్నాను. అయితే బాగా చదువుకుని తనే సీట్ తెచ్చుకుంది. పిల్లలు చక్కగా పెరగడంలో ఎవరి పాత్ర ఎక్కువ? కృష్ణంరాజు: తన పాత్ర ఎక్కువ. నిద్ర లేచిన దగ్గర్నుంచి వాళ్లకేం కావాలి? ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే చదువుకోగలుగుతారు? అన్నీ తనకు తెలుసు. ఆవిడకి ముగ్గురు పిల్లలు కాదు... నాతో కలిపి నలుగురం. ముగ్గురు అమ్మాయిలను పెంచడం కష్టంగా ఉందా? బాబు (కృష్ణంరాజు)ని పెంచడమా? శ్యామల: (నవ్వుతూ).. నాకు ఈయన్ని పెంచడమే చాలా ఇష్టం. పిల్లలు పుట్టాక చాలామంది భర్త మీద ప్రేమ తగ్గిందని, శ్రద్ధ తగ్గిందని అంటారు. కానీ నాకు మాత్రం ముందు ఆయనే. ఆయన్ను చూసుకుంటూ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను. పిల్లల సెలవులప్పుడే నేను గుడికి వెళుతుంటాను. ఆ సమయంలో పిల్లల్ని వాళ్ల నాన్న దగ్గర పెట్టి నేను పూజలకు వెళతాను. మా పుట్టింటికి వెళ్లాలన్నా ఒకటీ రెండు రోజులు మాత్రమే. కృష్ణంరాజుగారికి అందరి ఆకలి తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. మనం తెలుసుకుని పెట్టాలి. ఆ విషయంలో అత్తింట్లో వాళ్లకి భార్య ఎలా చూస్తుందో అని కాస్త టెన్షన్ ఉండేది. కానీ నేను వచ్చి, చూసుకోవడం మొదలుపెట్టాక ఆ టెన్షన్ పోయింది. (మధ్యలో కృష్ణంరాజు అందుకుంటూ).. మా అమ్మ అయితే చాలా టెన్షన్ పడేది. ఆకలైనా చెప్పేవాడిని కాదు. నీరసం వచ్చి అలా నిద్రపోయేవాడిని. అందుకని వాడు అడగడు.. మనమే పెట్టాలనేది. ఇప్పుడు ఈవిడ అలానే పెడుతుంది. కృష్ణంరాజుగారు భోజనప్రియుడు.. మీ వంటల్లో ఆయనకు బాగా నచ్చినవి? శ్యామల: అన్నీ ఇష్టమే. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. మావాళ్లు ఫుడ్ బాగా తింటారు.. అలానే అందరికీ పెడతారు. ఆయనకు పెసరట్టు అంటే ఇష్టం. ఆయన పెద్దక్క నాకు నేర్పించారు. ఆయన చేపల కూర బాగా వండుతారు. మీరు వంట ఎలా నేర్చుకున్నారు? కృష్ణంరాజు: నేను వేటకు వెళ్లేవాడిని. పొద్దున్నే పచ్చ పావురాలను వేటాడి తీసుకు వస్తే.. అక్కడే అడవిలో వండి పెట్టేవాళ్లు. లంచ్‌కి కొండ గొర్రె వండించేవాళ్లం. ఒక్కోసారి పులి గాండ్రింపులు వినపడినప్పుడు వంట చేసేవాళ్లు పారిపోతే, నేనే వంట చేసేవాడిని. ఆ విధంగా వంట నేర్చుకున్నాను. ఎప్పుడైనా పులిని వేటాడారా? కృష్ణంరాజు: లేదు. అయితే నా వెనకాల నుంచి ఒక్క పరుగుతో ముందుకు వెళ్లింది. పులి మహా పిరికి. తననెవరైనా ఎటాక్ చేస్తారనే అనుమానం కలిగితేనే అది ఎటాక్ చేస్తుంది. లేకపోతే చేయదు. శ్యామల: మీకు ఓ పులి ఫ్యాన్ కదా.. కృష్ణంరాజు: అవును. ఒక పులి ఉండేది. ‘కటకటాల రుద్రయ్య’ కోసం ఆ పులిని తీసుకొచ్చారు. అది గాండ్రించడం మొదలుపెట్టింది. నేను దాని మెడ దగ్గర నిమురుతూ మచ్చిక చేసుకున్నాను. ఆ పులితో నాకు ఫైట్ సీన్ ప్లాన్ చేశారు. అంతకుముందు నేను దాని మెడ పట్టుకుంటే విసిరి కొట్టింది. అంత దూరం పడ్డాను. అయితే మచ్చిక చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీ అయిపోయింది. అదే పులిని ఏడాది తర్వాత వేరే సినిమా కోసం తెస్తే.. నన్ను గుర్తు పట్టింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌కి కొన్ని టిప్స్? ఇద్దరూ: ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకుంటున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయితే పెళ్లయ్యాక కొందరు మగపిల్లలు ఆంక్షలు పెడుతున్నారు. ఫ్రెండ్లీనెస్ పోతోంది. అది తప్పు. అలాగే ‘ఈగో’ సమస్యలతో విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉంటే కాపురం హాయిగా ఉంటుంది. అలాగే ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి కొన్ని జంటలు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అన్నట్లు ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య పోటీ తప్పు. ఇద్దరూ సమానం అనుకోవాలి. – డి.జి. భవాని ప్రభాస్ గురించి? శ్యామల: మా ఆయన్ను ప్రభాస్ ‘పెద్ద బాజీ’ అని పిలుస్తాడు. నన్ను ‘కన్నమ్మా’ అని పిలుస్తాడు. ప్రభాస్ మాకు కొడుకే. ఇప్పుడు మా ప్రభాస్ ఏమంటాడంటే.. ‘ఇన్నేళ్లు కష్టపడ్డారు. ఇప్పుడు మీరు సుఖపడాలి. మిమ్మల్ని మేం హ్యాపీగా చూడాలి’ అని వాళ్ల పెదనాన్నతో అంటాడు. పెదనాన్న అంటే.. తనకు సుప్రీమ్ అన్నమాట. అంత ప్రేమ. చెల్లెళ్లతో కూడా చాలా ప్రేమగా ఉంటాడు. -
కృష్ణం రాజు పార్థివ దేహనికి అల్లు అర్జున్ నివాళులు
సీనియర్ నటుడు కృష్ణంరాజు(83) పార్ధివ దేహనికి అల్లు అర్జున్ నివాళులర్పించారు. ఆయన మరణ వార్త తెలియగానే బెంగళూరి నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న బన్ని.. నేరుగా కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహనికి నివాళులర్పించారు. అనంతరం ప్రభాస్ దగ్గరకెళ్లి ఓదార్చాడు. తదనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ’ అన్నారు -
Krishnam Raju: కృష్ణం రాజు అలా తుదిశ్వాస విడవాలనుకున్నాడట!
టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు(83) మృతితో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మరణం గురించి గతంలో కృష్ణంరాజు చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్ట వైరల్‌గా మారాయి. (చదవండి: 'పెద్దదిక్కును కోల్పోయాను'.. కన్నీటిపర్యంతమైన ప్రభాస్) దాదాపు 16 ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో తానెలా చనిపోవాలనుకుంటున్నారో చెప్పారు కృష్ణంరాజు. ‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని, నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ తుదిశ్వాస విడవాలి. అదే నా కోరిక’ అని కృష్ణంరాజు చెప్పారు .ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా,కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం(సెప్టెంబర్12) మధ్యాహ్నం జరగనున్నాయి. చేవెళ్లలోని మొయినాబాద్ దగ్గర కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
కృష్ణంరాజుకు నివాళి.. ప్రధాని మోదీ స్పెషల్ ఫొటో ఇదే..
రాజకీయవేత్త, సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలో సీని ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా కృష్ణంరాజు మృతిపై తన సంతాపాన్ని తెలిపారు. మోదీ ట్విట్టర్ వేదికగా తెలుగులో.. ‘శ్రీ యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని , సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే కృష్ణంరాజు, ప్రభాస్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. Saddened by the passing away of Shri UV Krishnam Raju Garu. The coming generations will remember his cinematic brilliance and creativity. He was also at the forefront of community service and made a mark as a political leader. Condolences to his family and admirers. Om Shanti pic.twitter.com/hJyeGVpYA5 — Narendra Modi (@narendramodi) September 11, 2022 ఇక, కృష్ణంరాజు భౌతికకాయానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా నివాళులు అర్పించారు. ఈ క్రమంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ సీనియర్ నేత అందరి నాయకుడు కృష్ణంరాజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ధర్మం కోసం పోరాడుతున్న నాకు అయన అనేక సూచనలు ఇచ్చేవారు. నేను చేసే ధర్మ పోరాటాన్ని మెచ్చుకుని ప్రోత్సహించేవారు. పార్టీకి అనేక సేవలు అందించిన నిజాయతీపరుడు కృష్ణంరాజు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి.. కృష్ణంరాజును గుర్తించి కేంద్ర మంత్రిని చేశారు. ఆయన అనేక సినిమాల్లో గొప్పగా నటించారు. అంతిమ తీర్పు సినిమా చాలా గొప్పది. ఆ సినిమా చూశాక ఆయనతో నేను ఫొటో దిగాలని అనుకున్నాను. ఇదే విషయాన్ని ఆయనతో చెప్పాను. ఆయన రూపంలో మనకు ప్రభాస్ ఉన్నారు. మేమంతా ఆయన లక్ష్యం కోసం పని చేస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ తెలిపారు. -
కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు(83) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్టంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కృష్టంరాజు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన విలక్షణ నటనతో ప్రజల గుండెల్లో నిలిచారు. కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తాము అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కృష్టంరాజు కుటుంబ సభ్యులకు కేటీఆర్.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఓ లెజెండ్‌ని కోల్పోయాం.. కృష్ణంరాజు మృతిపై అల్లు అర్జున్ దిగ్భ్రాంతి
సీనియర్ నటుడు కృష్ణంరాజు(83) మరణం పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యకం చేశారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యానని, టాలీవుడ్ ఓ లెజెండ్‌ని కోల్పోయిందన్నారు. ‘ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. మరో వైపు హీరో నాని కూడా కృష్ణంరాజు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Extremely saddened to learn about the sudden passing of Krishnam Raju garu. His contribution to the film industry was immense. My deepest condolences to his family, friends & fans . May his soul rest in peace. — Allu Arjun (@alluarjun) September 11, 2022 ‘అద్భుతమైన జ్ఞాపకాలు పంచినందుకు ధన్యవాదాలు సార్. మీతో కలసి నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రభాస్ అన్న , ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని నాని ట్వీట్ చేశారు. కాగా, నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. Thank you for all the memories sir. Honoured to have shared screen space with you. Rest in peace krishnam raju gaaru 🙏🏼 Strength and condolences to Prabhas anna and family. — Nani (@NameisNani) September 11, 2022 -
కృష్ణంరాజు భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి ( ఫొటోలు)
-
'పెద్దదిక్కును కోల్పోయాను'.. కన్నీటిపర్యంతమైన ప్రభాస్
పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళి అర్పంచి ప్రభాస్‌ను పరామర్శించగా తాను పెద్దదిక్కును కోల్పోయానంటూ పెదనాన్నను గుర్తుచేసుకుంటూ ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో మంత్రి తలసాని ప్రభాస్‌ను ఓదార్చారు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పాపులారిటీని దక్కించుకున్నాడు. నటుడిగా ప్రభాస్ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారాయన. ఆర్టిస్టుగా ప్రభాస్‌ని చూసి కొన్ని తాను నేర్చుకునే పరిస్థితి వచ్చిందని గతంలో కృష్ణంరాజు మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రభాస్‌ను ఇలా చూస్తుంటే గుండె తురక్కుపోతుందని, స్టే స్ట్రాంగ్ ప్రభాస్ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొన్నాళ్లుగా అనారోగ్యంగా బాధపడుతున్న కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో తొలుత ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి: పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంత ప్రేమో.. వీడియో వైరల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Never in my wildest dreams, I thought I would see him like this 😭 This feels so personal 💔 Stay strong #Prabhas anna 🥺😭 pic.twitter.com/k1Jgy82947 — SALAAR 🏹 (@bhanurockz45) September 11, 2022 We all are with you Aanaya #Prabhas ❤️ your man should continue our Raju gari leagancy God support whole Family recovery speed Miss u Raju Garu 😍🥹 https://t.co/lunKRQPR4e — Koppolu.jaswanth (@JaswanthKoppolu) September 11, 2022 Pedhha dude ika leru #KrishnamRaju garu 😭 💔 May your soul Rest in Peace sir 😭🙏#OmShanti Stay strong #Prabhas More power to you darling 🙏🙏#RIPKrishnamRaju gaaru 😔 pic.twitter.com/cXUhn2VbxO — NareshVarma REBEL⭐FAN (@NareshVTweet) September 11, 2022 -
పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంత ప్రేమో.. వీడియో వైరల్
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌కు ఎంతో అనుబంధం ఉంది. పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న ప్రభాస్ సినీ కెరీర్లో కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది. నటుడిగా ప్రభాస్ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారాయన. ఈ క్రమంలో కృష్ణంరాజు మృతి ప్రభాస్‌కు తీరని లోటు. పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రేమ, గౌరవం. గతేడాది కృష్ణంరాజు పుట్టినరోజు పార్టీలో ఆయన జుట్టును ప్రభాస్ సరిచేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ వారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభాస్‌కు ఆయన పెదనాన్న అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా.. ఇలా అవుతుందని ఊహించలేదు: చిరంజీవి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణంరాజు మృతి.. పలువురు ఏపీ ప్రముఖల సంతాపం
ప్రముఖ నటుడు రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు గారి మరణం వెండతెరకు తీరని లోటు: మల్లాది విష్ణు కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. తన అద్భుత నటనతో, భిన్నమైన పాత్రలతో తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన నటుడాయన. ఐదున్నర దశాబ్దాల కాలంలో 180కి పైగా చిత్రాలలో నటించి.. ఎన్నో కీర్తి కిరీటాలు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. అధికంగా కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. సినీ రంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా నిలిచారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మంచితనానికి మారుపేరు: మంత్రి జోగి.రమేష్ మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పార్లమెంటు సభ్యుడుగా కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు గారు నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి.ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు మృతి బాధాకరం: మాజీ మంత్రి వెలంపల్లి ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. కృష్ణంరాజు నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. తన అద్భుత నటనతో, భిన్నమైన పాత్రలతో తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన వ్యక్తి కృష్ణంరాజు అన్నారు. ఐదున్నర దశాబ్దాల కాలంలో 180కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో కీర్తి కిరీటాలు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారన్నారు. సినీరంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా చెప్పుకోవచ్చురు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు.ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అ ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోను రెబల్ స్టార్‌గా వెలిగిన కృష్ణంరాజు మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పశ్చిమగోదావరి జిల్లా: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు ఆయన చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి నర్సాపురం, మొగల్తూరు ప్రజలకు తీరని లోటు. మొగల్తూరు ఖ్యాతి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి కృష్ణంరాజు అని ప్రసాదరాజు కొనియాడారు. ► కృష్ణంరాజు మృతిపట్ల రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ పాతపాటి సర్రాజు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విజయవాడ: హీరో, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతికి మాజీ మంత్రి శ్రీరంగనాథ రాజు సంతాపం తెలిపారు. కృష్ణం రాజు తెలుగు నటుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. -
ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా.. ఇలా అవుతుందని ఊహించలేదు: చిరంజీవి
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు.అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.ఈ సందర్భంగా కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈరోజు చాలా దుర్ధినమని, ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది : చిరంజీవి ఆయన గతంలో చాలాసార్లు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ప్రతిసారి ఆరోగ్యంగా తిరిగి వచ్చేవారు. ఈసారి కూడా అలాగే ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా. ఇలా అవుతుందని ఊహించలేదు. మొగల్తూరులో చిన్నపుడు అయన చూడటం కోసం ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నను. ఇంకా ఆ దృశ్యం నా కళ్ళలో కదలాడుతూ ఉంది.ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది.రావుగోపాల్ రావు లాంటి వాళ్లు రాజావారు రాజావారు అని పిలిచేవారు.కృష్ణంరాజు మహావృక్షం లాంటివారు ఈరోజు ఆ మహావృక్షం నేలకొరిగింది.పరిపూర్ణమై జీవితాన్ని అనుభవించారు..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోుకుంటున్నాను అని పేర్కొన్నారు. చాలా మంచి మనిషి.. దురదృష్టకరం : దిల్‌రాజు 'మంచి మనిషి, మహ మనిషి అయన్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన లానే అన్ని గుణాలు ప్రభాస్‌లో ఉన్నాయి. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' నాకు చాలా బాధాకరమైన రోజిది : మహేష్ బాబు 'కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నాకు, చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజిది. కృష్ణంరాజు గారి జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'. మా ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి కృష్ణంరాజు: పవన్ కళ్యాణ్ ఎంతో సుప్రసిద్ధ నటుడు, మా కుటుంబానికి ఎంతో సానిహిత్యం ఉన్న వ్యక్తి. అందరి మంచి కోరుకునే వ్యక్తి. మా ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి కృష్ణం రాజు.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మా ఊరి హీరో కృష్ణంరాజు.. నన్ను పెద్దన్నలా ప్రోత్సహించారు: చిరంజీవి
రెబల్‌స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. కృష్ణంరాజు గారు ఇక లేరు అనే వార్త విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి మనవూరి పాండవులు దగ్గరనుంచి నేటి వరకూ నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్ కు నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయనలేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మశాంతించాలని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడిలాంటి ప్రభాస్ కు నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR — Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022 -
రెబల్ స్టార్ కృష్ణంరాజు అరుదైన (ఫొటోలు)
-
కృష్ణంరాజు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టిహుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ కృష్ణంరాజు భౌతికదేహాన్ని సందర్శించింది. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క కృష్ణంరాజు మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు మరణం టాలీవుడ్‌కు తీరని లోటని పలు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు మరణవార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని సీనియర్ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబం లెజెండ్, పెదనాన్నను కోల్పోయిందని మంచు విష్ణు సైతం ట్వీట్ చేశాడు. Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d — Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022 Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend. — Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022 -
Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే..
సాక్షి, హైదరాబాద్: రెబల్‌స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే, ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 'కృష్ణంరాజుకు పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో సెప్టెంబర్ 5న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గతేడాది కాలుకి సర్జరీ జరిగింది. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతింది. కృష్ణంరాజుకి వెంటిలేర్‌పై చికిత్స అందించాం. అయితే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారి తెల్లవారుజామున 3.16కి ఆయన మృతి చెందారు' అని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. చదవండి: (Krishnam Raju: కృష్ణంరాజు మృతి.. ప్రముఖుల సంతాపం) -
తీవ్ర విషాదంలో ప్రభాస్.. పెదనాన్నను చివరిసారిగా అలా
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రెబల్‌స్టార్‌గా ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం అటు టాలీవుడ్‌తో పాటు హీరో ప్రభాస్‌కి కూడా తీరని లోటని చెప్పాలి. నిన్న(శనివారం)తన పెదనాన్నను చూసేందుకు ప్రభాస్ ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. గతంలోనూ అనారోగ్య సమస్యలతో కృష్ణంరాజు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా రెండు మూడు రోజుల అనంతరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నారంతా. కానీ అంతలోనే కృష్ణంరాజు ఇకలేరనే వార్త టాలీవుడ్‌కి షాక్ గురిచేసిందనే చెప్పాలి. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌కు ఎంతో అనుబంధం ఉంది. పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న ప్రభాస్ సినీ కెరీర్లో కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది. నటుడిగా ప్రభాస్ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారు. -
కృష్ణంరాజుని రెబల్ స్టార్ అని ఎందుకంటారంటే...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ఆహార్యంతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్‌స్టార్ కృష్ణం రాజు. చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేసిన ఆయన ‘అవేకళ్లు’ చిత్రంలో ప్రతినాయకుడిగానూ నటించి తానేంటో నిరూపించుకున్నారు. ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. ఎప్పటికప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాంటి మాస్ చిత్రంలో నటించిన ఆయన భక్తిరస చిత్రం ‘భక్త కన్నప్ప’తో ప్రేక్షకులను తన నటనతో అలరించాడు. ప్రత్యేకంగా కృష్ణంరాజు తన నటనాశైలితో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలో పాత్రలే ఈ పేరుని సంపాదించిపెట్టాయి. తన ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 183 పైగా చిత్రాలలో నటించారు. ఉత్తమ నటుడిగా ప్రారంభ నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు. జీవన తరంగాలు (1973), కృష్ణవేణి (1974), భక్త కన్నప్ప (1976), అమర దీపం (1977), సతీ సావిత్రి (1978), కటకటాల రుద్రయ్య (1978), మన వూరి పాండవులు (1978) వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు. రంగూన్ రౌడీ (1979), శ్రీ వినాయక విజయము (1979), సీతా రాములు (1980), టాక్సీ డ్రైవర్ (1981), త్రిశూలం (1982), ధర్మాత్ముడు (1983), బొబ్బిలి బ్రహ్మన్న (1984), తాండ్ర పాపరాయుడు (1986), మరణ శాసనం (1987), విశ్వనాథ నాయకుడు (1987), అంతిమ తీర్పు (1988), బావ బావమరిది (1993), పల్నాటి పౌరుషం (1994) సినిమాలు ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, జానపద కథల్లోనూ నటించి తన విశిష్టతను చాటుకున్నారు. కుటుంబ నేపథ్యం కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయన భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు. ప్రభాస్ నట ప్రయాణం తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే విషయమని కృష్ణంరాజు ఎప్పుడూ చెప్తుండేవారు. చదవండి: Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్ -
Krishnam Raju: కృష్ణంరాజు మృతి.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సంతాపం Saddened by the passing away of Shri UV Krishnam Raju Garu. The coming generations will remember his cinematic brilliance and creativity. He was also at the forefront of community service and made a mark as a political leader. Condolences to his family and admirers. Om Shanti pic.twitter.com/hJyeGVpYA5 — Narendra Modi (@narendramodi) September 11, 2022 కృష్ణంరాజు మృతిపట్ల సీఎం జగన్ సంతాపం ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2022 ఏపీ గవర్నర్ సంతాపం మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు కృష్ణంరాజు ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటు: సీఎం కేసీఆర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి.. కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనా శైలితో, 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంతాపం విజయవాడ: మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు మృతికి ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంతాపం ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు మృతికి చంద్రబాబు సంతాపం ప్రముఖ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలిపారు. టీపీసీసీ రేవంత్‌రెడ్డి సంతాపం ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు మృతికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని.. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్‌బాబు సంతాపం Shocked to learn that Krishnam Raju garu is no more... A very sad day for me and the entire industry. His life, his work and his immense contribution to cinema will always be remembered. My deepest condolences to Prabhas and the entire family during this difficult time 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2022 అనుష్క సంతాపం కృష్ణం రాజు మృతిపట్ల నటి అనుష్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కృష్ణంరాజు మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ►తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. Saddened to learn about the demise of one of the most popular stars of Telugu Cinema, Rebel star Sri Krishnam Raju Garu My wholehearted condolences to Prabhas Garu, his family members & friends Rest in peace #KrishnamRaju Garu 🙏 — KTR (@KTRTRS) September 11, 2022 ► మంచు విష్ణు సంతాపం Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend. — Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022 సుబ్బి రామి రెడ్డి సంతాపం కృష్ణంరాజు మృతి పట్ల మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కృష్ణం రాజు లేడంటే నమ్మలేక పోతున్నాను. దాదాపుగా 50 ఏళ్లుగా సన్నిహితుడు. నా సినిమాల్లో వంశోదరకుడు, గాంగ్ మాస్టర్ చిత్రాల్లో నటించాడు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ప్రభాస్ అంటే ఆయనకు చాలా ప్రేమ. ఏన్నాఆర్, ఎన్టీఆర్ తర్వాత కృష్ణం రాజు మలీ తరం నాయకుడు. ఆయనకు ఆత్మకు శాంతి కలిగి, కుటుంబానికి దైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను’అని రామిరెడ్డి అన్నారు. -
రెబల్ స్టార్ కృష్ణం రాజు సినీ జ్ఞాపకాలు ( ఫొటోలు)
-
Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్
సినీ ఇండస్ట్రీలో రెబల్‌స్టార్‌గా పేరుగాంచిన కృష్ణంరాజు.. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1991లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1998 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచి వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మరోసారి బీజేపీలో చేరారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) ఆదివారం తెల్లవారుజామున ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చదవండి: (Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత) -
ఆ కోరిక తీరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు!
సాక్షి, హైదరాబాద్: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పారు. ప్రభాస్‌కు జోడీ కోసం వెతుకుతున్నామని, పెళ్లికి సంబంధించిన శుభవార్త త్వరలో చెబుతామని అంటుండేవారు. ప్రభాస్ పెళ్లికంటే సంతోషాన్నిచ్చే అంశం తనకు మరొకటి లేదని చెప్పేవారు. వీలైతే ప్రభాస్ పిల్లలతోనూ కలిసి నటించాలనుందని ఆయన కోరికను కూడా వెల్లడించారు. కానీ చివరకు ఇవేవీ నెరవేరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. దీంతో రెబల్ స్టార్ కుటుంబసభ్యులతో పాటు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రభాస్, కృష్ణంరాజు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తనకు అందరికంటే పెదనాన్న అంటేనే ఎక్కువ భయం, గౌరవం అని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కృష్ణంరాజు కూడా ప్రభాస్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును చూసి గర్వపడేవారు. ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని ఊహించాను కానీ, పాన్ ఇండియా స్టార్లా ఎదుగుతాడని అనుకోలేదని ఓ సందర్భంలో కృష్ణంరాజు అన్నారు. చదవండి: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత -
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. 187 చిత్రాల్లో నటించారు. 1966లో వచ్చిన చిలకా గోరింకా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చివరిసారి రాధేశ్యామ్‌లో నటించారు. ఈ సినిమాలో పరమహంస పాత్రలో నటించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మధ్యాహ్నం తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. -
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు: కృష్ణం రాజు
ప్రభాస్ తొలి సినిమా(ఈశ్వర్) చూశాక తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ.. పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు. అతని పట్టుదల, శ్రమతో పాటు అభిమాలను అండదండలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రభాస్‌ని చూస్తుంటే గర్వంగా, ఆనందంగా ఉంది’అని రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. ప్రభాస్ హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో( జూన్ 28) 20ఏళ్లు పూర్తయింది. 2002 జూన్ 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ అనే సినిమాని మొదలుపెట్టారు. (చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే) ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైద్రాబాద్ లో కృష్ణం రాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్బంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ .. ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది . నిజంగా ఆ రోజు ప్రభాస్ ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమె అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్ లో ప్రభాస్ ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్ కు ఓకే చెప్పాం. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ మొదటి సినిమా చూసాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను ’అన్నారు. -
ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలని ఉంది : కృష్ణం రాజు
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. కె. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకెళ్తుంది. మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది రాధేశ్యామ్. ఈ సినిమా విజయం పట్ల సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు స్పందించారు. సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందన్నారు. చదవండి: కృష్ణంరాజు హోంటూర్ చూశారా? ఇల్లంతా బంగారమే అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ రాధేశ్యామ్‌పై ప్రశంసలు కురిపించినట్లు తెలిపారు. మరోవైపు డార్లింగ్ పెళ్లి గురించి కూడా కృష్ణంరాజు స్పందించారు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని, ప్రభాస్‌కు పుట్టబోయే పిల్లలతో ఆడుకోవాలని ఉందంటూ మనసులో మాటను బయటపెట్టారు. కాగా రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి, చెల్లెలు ప్రసీద సైతం స్పందించిన సంగతి తెలిసిందే. చదవండి: బాహుబలి-3 ఉంటుంది, వర్క్ చేస్తున్నాం : రాజమౌళి -
ప్రభాస్ ఆ సినిమా రీమేక్ చేస్తే చూడాలని ఉంది : కృష్ణంరాజు
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకెళ్తోంది. తొలిరోజే దాదాపు రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టి మరోసారి ప్రభాస్ సత్తా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్‌కు చూపించింది. ఇక ఈ సినిమా విజయం పట్ల సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ప్రభాస్ కలిసి ఇంతకుముందు నటించాం. ఈ సారి మా అమ్మాయి ప్రసీద కూడా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను 'పరమహంస' పాత్రలో కనిపిస్తాను.ఈ పాత్రను చూస్తే వివేకానందుడు .. రామకృష్ణ పరమహంస మాదిరిగా అనిపిస్తుంది. అంతటి నిండుదనం ఉన్న పాత్రను చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆ పాత్రను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. 'పరమహంస' పాత్రలో నన్ను చూస్తే దేవుడిని చూసినట్టుగా ఉందని ప్రభాస్ ఒక ఇంటార్వ్యూలో చెప్పాడు. నిజంగా అది నాకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ గా నేను భావిస్తున్నాను. ప్రభాస్ కెరియర్ అంచనాలను దాటుకుని వెళుతోంది. అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమానే చేస్తున్నాడని అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. ‘రాధేశ్యామ్' కూడా ఇంత ఆలస్యమై ఉండేది కాదు. కరోనా ప్రభావం వలన కలిగిన ఆటంకాల వలన ప్రేక్షకుల ముందుకు రావడానికికి చాలా సమయం పట్టేసింది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ చెప్పాడు’అని కృష్ణంరాజు చెపుకొచ్చాడు.అలాగే రాధేశ్యామ్ చిత్రాన్ని బాహుబలితో చూసి పోల్చొద్దని చెప్పారు. ఇక ప్రభాస్ ఏ సినిమా రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు అని అడిగితే.. ‘మనవూరి పాండవులు’అయితే బాగుంటుందని చెప్పారు. -
యూఎస్ షోలలో కనిపించని కృష్ణంరాజు.. ఎందుకంటే?
Krishnam Raju Character Missing In Radhe Shyam USA Theaters: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూసిన చిత్రం 'రాధేశ్యామ్' ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుమారు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత రిలీజై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ప్రముఖ హస్త సాముద్రికుడు విక్రమాదిత్య పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. అలాగే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 'రాధేశ్యామ్' మూవీలో కృష్ణంరాజు 'పరమహంస' రోల్లో నటించారు. ఇదివరకూ బిల్లా, రెబల్ చిత్రాల్లో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోగా 'రాధేశ్యామ్' మూడో చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఆశ్చర్యపరుస్తున్న వార్త ఏంటంటే పరమహంస పాత్ర పోషించిన కృష్ణంరాజు కేవలం ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు మాత్రమే పరిమితయ్యారట. విదేశీ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో కృష్ణంరాజు కనిపించట్లేదని సమాచారం. దీంతో కృష్ణంరాజదు ఎందుకు కనిపించడంలేదంటూ ఫ్యాన్స్ మేకర్స్‌ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారట. అయితే ఈ పాత్రను తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్ పోషించారు. ట్రైలర్ విడుదలైనప్పటినుంచి ఈ విషయం స్పష్టమైంది. కానీ ఈ సినిమా తెలుగు వెర్షన్లో సైతం కృష్ణంరాజుకు బదులు సత్యరాజ్ కనిపించినట్లు యూఎస్ఏ ఆడియెన్స్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు కృష్ణంరాజు నటించడమే కాకుండా స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అలా అయితే యూఎస్ తెలుగు ప్రింట్లో కృష్ణంరాజుకు బదులు సత్యరాజ్‌ను ఎందుకు చూపించారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదట. ఇంతేకాకుండా యూకేకి పంపిన కొన్ని ప్రింట్లలో కృష్ణంరాజు పాత్రను మొత్తానికే తీసేసినట్లు టాక్ వినిపిస్తోంది. -
కృష్ణంరాజు హోంటూర్ చూశారా? ఇల్లంతా బంగారమే
Krishnam Raju Home Tour: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో రెబల్‌స్టార్, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణారాజు భార్య శ్యామలదేవీ హోంటూర్ చూపించారు. తమ ఇంటికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. ఇంట్లో అందరికి దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు దేవుడికి పూజలు చేస్తాం. ఇక కృష్ణంరాజు గారికి పురాతన వస్తువులంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే మా ఇంట్లో అలాంటివి చాలా కనిపిస్తుంటాయి. ఇక అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇటలీ నుంచి తెప్పించిన ఈ అందమైన బొమ్మ. 24క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఈ విగ్రహం 30ఏళ్ల క్రితం నాటిది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పూర్తి బంగారంతో తయారు చేసిన పులి బొమ్మ చాలా అరుదని, దీని ప్రత్యేకత ఏంటంటే.. 50ఏళ్ల తర్వాతే మళ్లీ కొత్తది తయారు చేస్తారు అని చెప్పుకొచ్చారు. ఇక ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో సమయం గడుపుతారని, వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుందని పేర్కొన్నారు. -
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ఆపరేషన్
టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చిన్న ప్రమాదానికి గురయ్యారు. ఇటీవల ఆయన ఇంట్లో కాలు జారి కిందపడిపోయారట. దీంతో ఆయనకు ఆపరేషన్ జరిగిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. సర్జరీలో భాగంగా ఆయన కాలి వేలుని తొలగించాల్సి వచ్చిందట. ఈ విషయం తెలిస్తే.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంగారు పడే అవకాశం ఉందని, రహస్యంగా ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి మాట్లాడుతూ.. ఆయన ఇంట్లో జారిపడ్డారని చెప్పారు. కానీ ఆపరేషన్ జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అభిమానులకు ఇబ్బంది కలిగించొద్దనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని చెప్పలేదట. ఆపరేషన్ కారణంగానే ‘రాధేశ్యామ్’ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనలేకపోయాడట. మూవీ విడుదల తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రంలో విక్రమాదిత్య(ప్రభాస్) గురువు పరమహంస పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. -
ప్రభాస్-అనుష్క పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు సతీమణి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఆయన పెళ్లిపై ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ వాటీలో క్లారిటీ అనేది ఉండదు. కాగా ప్రభాస్ పెళ్లిపై అభిమానులతో పాటు టాలీవుడ్ జనాలు సైతం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అంటేనే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడనే చెప్పాలి. అయితే తాజాగా 'రాధే శ్యామ్' చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు ఇదే ప్రశ్న ఎదురవ్వగా..లవ్ ఫెయిల్యూర్ అంటూ మాట దాటేశాడు. ఇక ఎప్పటి నుంచో మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ప్రభాస్, అనుష్క పెళ్లి. అయితే తాజాగా ఈ వార్తలను ప్రభాస్ పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి స్పందించారు. ఇంతకీ వీరి పెళ్లిపై ఆమె ఏమన్నారంటే.. ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్లు మంచి ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు.. అంటూ ఈ వార్తలను ఖండించారు. ప్రభాస్‌కి మన సంస్కృతి సంప్రదాయాలన్నా, మహిళలన్నా అమితమైన గౌరవం ఉంది. అలాగే తన కుటుంబానికి, ఇంటి పెద్దలకు గౌరవం ఇస్తాడు. అయితే ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడంటూ శ్యామల దేవి తెలిపారు. ఇక అలాగే ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన వారా అనే ప్రశ్నకు సమాదానంగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. త్వరలోనే మీకు తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయ్యాల్సిందే అంటున్నారు శ్యామల దేవి. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే. -
ప్రభాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శ్యామల దేవి
Krishnam Raju Wife Shyamala Devi About Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం, హీరోయిన్ పూజ హెగ్డేతో కలిసి ప్రభాస్ వరస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలో ఆయన పెద్దమ్మ, కృష్ణం రాజు సతిమణి శ్యామల దేవి ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ ప్రభాస్‌కు ఇష్టమైన వంటకం ఏంటో బయట పెట్టింది. ఈ మేరకు శ్యామల దేవి ప్రభాస్ పులస చాప కూర అంటే ఇష్టమని, దీనితో ఇష్టంగా భోజనం చేస్తాడని తెలిపింది. చదవండి: శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ లెటేస్ట్ పోస్ట్ వైరల్, ఏం అంటున్నాడంటే ‘ప్రభాస్‌కు ఆయన పెద్దనాన్న(కృష్ణం రాజు) అంటే చాలా ఇష్టం. ఎంత బిజీగా ఉన్న పెద్దనాన్నను తరచూ కలుస్తూనే ఉంటారు. కొడుకుని చూడగానే ఆయన కూడా ఫుల్ ఖుషి అవుతారు.ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది ఆయనకు. ఎలాంటి పరిస్థితులో అయిన తండ్రికొడుకులు తప్పకుండా కలుసుకుంటారు. సుమారు రెండు, మూడు గంటలు మాట్లాడుకుంటారు. ప్రభాస్ ఆయనను పెద్ద బాజీ అని, నన్ను కన్నమ్మ అని పిలుస్తాడు’ అంటూ చెప్పకొచ్చింది. ప్రభాస్‌కు ఏమైనా లెటర్స్, ఫోన్స్ వస్తాయా అని అడగ్గా.. ‘బాబోయ్ చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, అమ్మాయిల నుంచి మరి ఎక్కువ. అంతేకాదు వాళ్ల పేరేంట్స్ కూడా చేస్తుంటారు. కావాలంటే జాబ్ మానేస్తాం, అక్కడి వచ్చేస్తాం అంటారు. కానీ వాళ్లందరి మీ కెరీర్ చూసుకొండని, జీవితం నాశనం చేసుకోవద్దు’ అని నచ్చ చెబుతుంటానని ఆమె అన్నారు. అంతేగాక ప్రభాస్‌కు చాలా మోహమాటమని, అమ్మాయిలతో అసలు మాట్లాడడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అందుకే ఆ ఫోన్ కాల్స్ అన్ని తానే ఎత్తి మాట్లాడతానంటూ ఆమె స్పష్టం చేశారు. చదవండి: ఇంటర్య్వూలో పూజ నోట అభ్యంతరకర పదం, పట్టేసిన నెటిజన్లు ఇక భర్త కృష్ణం రాజు గురించి మాట్లాడుతూ.. రాధేశ్యామ్ షూటింగ్లో కృష్ణం రాజుకు గాయమైందని, అయినా రెస్ట్ తీసుకొకుండా ఆయన షూటింగ్ పూర్తి చేశారని చెప్పింది. అప్పటి నుంచి తాను కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం సప్త శనివార వ్రతం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక కృష్ణం రాజు శివుడు, భక్త కన్నప్పను ఆరాధిస్తారని... తాను విష్ణువు, పార్వతీదేవిని ఆరాధిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. కాగా రాధేశ్యామ్‌లో కృష్ణం రాజు మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చి11న విడుదలవుతోంది. -
కృష్ణం రాజుకు మెగాస్టార్ బర్త్‌డే విషెస్
కథానాయకుడుగా, ప్రతినాయకుడుగా, సహాయనటుడిగా ఎన్నో సినిమాల్లో మెప్పించాడు రెబల్ స్టార్ కృష్ణం రాజు. గురువారం(జనవరి 20న) ఆయన 81వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'సోదర సమానుడు, తెలుగు చిత్రపరిశ్రమకు తొలి రెబెల్ స్టార్, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్రమంత్రిగా అడుగు పెట్టిన ప్రతి రంగంలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన కృష్ణం రాజుగారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. కాగా కృష్ణం రాజు ఇటీవల 'రాధేశ్యామ్' సినిమాలో నటించాడు. Happy Birthday #KrishnamRaju garu !💐 pic.twitter.com/VgyQvjIyN4 — Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2022 -
ఎవరికి రాసి పెట్టుందో.. 'రాధేశ్యామ్' గురించి పలు ఆసక్తికర విషయాలు
Radhe Shyam Movie Pre Release Event: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే జనవరి 14న విడుదలవుతోంది. గురువారం (డిసెంబర్ 23) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రభాస్ అభిమానుల చేతుల మీదుగా ‘రాధేశ్యామ్’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘నేను రెబల్‌స్టార్.. రెబల్‌స్టార్ ఎప్పుడూ రెబల్గానే ఉంటాడు. లేదంటే రెబల్‌ని కల్పిస్తాడు. ఈ రెబల్ (ప్రభాస్‌ని ఉద్దేశించి) మరో 50 ఏళ్లు మిమ్మల్ని ఆనందపరుస్తాడు. 55ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) పరిగెత్తుకుంటూ వచ్చి కలవాలని, కౌగిలించుకోవాలని ఉంది. ఈ వేదికపైకి వచ్చి సరదాగా డ్యాన్స్ వేసి, ఎంజాయ్ చేద్దామనుకున్నాను. కానీ మరో వారం పదిరోజుల పాటు నిలబడలేను. ఆ తర్వాత డ్యాన్స్ చేద్దాం.’’ అని అన్నారు. చిన్న సైజు దేవుడిలా ఉన్నారు కదా.. ‘‘రాధేశ్యామ్’ ట్రైలర్‌ని మీరు (అభిమానులు) లాంచ్ చేశారు.. మీకు నచ్చిందనుకుంటున్నాను. పెదనాన్నగారి (కృష్ణంరాజు) లుక్ చూశారుగా.. ఎలా ఉన్నారు. చిన్న సైజు దేవుడిలా ఉన్నారు కదా. గోపీకృష్ణా మూవీస్‌లో ‘మన ఊరి పాండవులు, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు’ వంటి పెద్ద సినిమాలు తీశారు. ఆ బ్యానర్ అంటే కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. మేమిద్దరం కలిసి ‘బిల్లా’ చేశాం. బాగానే ఆడింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్’. ఈ చిత్రం లవ్‌స్టోరీనే కానీ ఇంకా చాలా ఉన్నాయి. రాధాకృష్ణ ఐదేళ్లు ఈ సినిమాకు పని చేయడం అంటే జోక్ కాదు. ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌లు, టర్నింగ్స్ ఉన్నాయి. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ హైలైట్ అవుతుంది. ‘సాహో’ సమయంలో ఇండియా మొత్తం తిరిగినప్పుడు సిగ్గు పోయి బాగా మాట్లాడేస్తాననుకున్నాను కానీ పోలేదు. ఇది అంతేనేమో (నవ్వుతూ). ఈసారి ఎలాగైనా మాటలు ఇరగదీసేద్దామనుకున్నా.. బట్ కుదర్లేదు’’ అని ప్రభాస్ తెలిపారు. స్టార్ హీరోకు కావాల్సింది అదే: దిల్ రాజు ‘‘ఇది అందమైన ప్రేమకథ. ఈ సినిమాలో కొత్త ప్రభాస్, కొత్త పూజాహెగ్డేలను చూస్తారు.’’ అని పూజా హెగ్డే పేర్కొంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ ‘‘ప్రభాస్‌తో నాకున్న ప్రయాణం గురించి మీకు తెలుసు. ‘రాధేశ్యామ్’ ట్రైలర్ చూస్తే ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది. ‘డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా రిలీజ్ అయినప్పుడు మా ఇద్దరి మధ్య ఓ చిన్న చర్చ జరిగింది. మాస్ హీరోని ఇంత క్లాస్‌గా ఎవరు చూస్తారు? అని. ఆ రెండు సినిమాలు సూపర్‌హిట్ అయిన తర్వాత ప్రభాస్ ‘మిర్చి, రెబల్, బాహుబలి, సాహో’లతో ఆకాశానికి వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్ అయిపోయాక మళ్లీ ‘రాధేశ్యామ్’ లాంటి ఎంత క్లాస్ లవ్‌స్టోరీ చేశారో చూడండి. స్టార్ హీరోకు కావాల్సింది అదే.. ఎప్పుడూ కమర్షియల్‌తో పాటు కొత్తగా ప్రయత్నం చేస్తూ మనల్ని అలరించాలి. ‘రాధేశ్యామ్’ ట్రైలర్ చూశాక చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. 18 ఏళ్లు పట్టింది.. ‘‘రాధేశ్యామ్’ తీయడానికి నాలుగేళ్లు పట్టింది.. కానీ కథ రాయడానికి 18ఏళ్లు పట్టింది. ఫస్ట్ టైమ్ ఈ పాయింట్‌ని నేను మా గురువు చంద్రశేఖర్ యేలేటి వద్ద విన్నాను. 18 ఏళ్లు ఇండియాలోని పెద్ద పెద్ద రచయితలను పిలిపించి రాయించాం. కానీ, కథకు కన్‌క్లూజన్ దొరకలేదు.. ముగింపు కుదరడం లేదు. ఆ సమయంలో యేలేటిగారు ‘ఇది జాతకాల మీద రాస్తున్నావ్.. ఎవరికి రాసి పెట్టుందో అని’ అన్నారు. ఇది ప్రభాస్‌గారికి రాసిపెట్టి ఉంది. ఆయనతో సినిమా అనుకున్నప్పుడు కథతో కాదు ఓ ఛాలెంజ్‌తో చేయాలనుకుని మా గురువుని అడిగి ఈ పాయింట్‌ని తీసుకుని ఒక ఫిలాసఫీని ఒక లవ్‌స్టోరీలాగా చేసి, కథ రాసి ప్రభాస్‌గారికి చెప్పాను. ఆయనకు నచ్చింది. ఈ సినిమాలో ఫైట్స్ ఉండవు. అమ్మాయికీ, అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలుంటాయి. ఇదొక ప్రేమకథ. వంశీ, ప్రమోద్, విక్కీగార్లు లేకుంటే ఈ సినిమా లేదు. ప్రభాస్‌ని ఇంతకంటే నేనేం అడగను. మీలాంటి ఫ్రెండ్, గురువు అందరికీ ఉండాలి’’ అని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. ఈ వేడుకలో చిత్రనిర్మాతలు వంశీ, ప్రమోద్, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్, కెమెరామేన్ మనోజ్ పరమహంస, డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, ఓం రౌత్, టి. సిరీస్ ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్‌కు హోస్ట్‌గా జాతి రత్నం.. -
రాధేశ్యామ్‌లో కృష్ణంరాజు పాత్ర ఇదే! పోస్టర్ రిలీజ్
పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్న సినిమా టీమ్ తాజాగా సీనియర్ నటుడు కృష్ణంరాజు లుక్‌ను రిలీజ్ చేసింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్ర కోసం ఆయన ఏడాదిగా గడ్డం పెంచారు. ఇక ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ వర్క్ చేస్తుండటం విశేషం. అయితే సినిమాలో మాత్రం యాక్షన్ పార్ట్ కన్నా ప్రేమకథే ఎక్కువ ఉంటుందట. ఇదిలా వుంటే కృష్ణం రాజు, ప్రభాస్‌తో కలిసి 'బిల్లా', 'రెబల్' సినిమాల్లో కలిసి నటించారు. ఆయన చివరిసారిగా 2015లో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రంలో గణపతి దేవుడుగా కనిపించారు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత రాధేశ్యామ్‌లో నటిస్తున్నారు. Introducing The Legendary Actor, Rebel Star Dr. @uvkrishnamraju garu as #Paramahamsa from #RadheShyam.#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamTrailerOnDec23 pic.twitter.com/1eimJqgZUt — BA Raju's Team (@baraju_SuperHit) December 20, 2021 -
ప్రభాస్ ఫ్యామిలీ నుంచి సింగర్ శ్రీరామ్‌కు ఊహించని సర్ప్రైజ్
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-5 అతి త్వరలోనే ముగియనుంది. దీంతో కంటెస్టెంట్లకు మద్దతు ప్రకటిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామచంద్రకు సెలబ్రిటీల నుంచి గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ఇప్పటికే సోనూసూద్, శంకర్ మహదేవన్,ఎండీ సజ్జనార్, పాయల్ రాజ్‌పుత్ సహా పలువురు సెలబ్రిటీలు శ్రీరామ్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి తన మద్ధతు ప్రకటించారు. వీడియో సందేశం ద్వారా శ్రీరామ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాయ్ శ్రీరామ్. బిగ్‌బాస్ షో చూస్తున్నాం. నాకు, కృష్ణంరాజు గారికి నీ పాటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా భక్తి పాటలు చాలా ఇష్టం. అప్పుడు ఇండియన్ ఐడెల్‌లో గెలిచి తెలుగువారందరకీ ఎంతో గర్వకారణం అయ్యావ్. ఇప్పుడు బిగ్‌బాస్‌లో కూడా గెలవాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపు నుంచి కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా గెలుస్తావ్. ఆల్ ది బెస్ట్' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. శ్రీరామచంద్రకు స్వయంగా కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభించడంతో శ్రీరామ్ ఫాలోవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreerama Chandra (@sreeramachandra5) -
కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్
కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటీవల కృష్ణంరాజు తుంటికి శస్త్ర చికిత్స జరిగిన తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బ్రహానందం కృషంరాజు ఇంటికి వెళ్లారు. ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం తాను స్ఫెషల్‌గా గీసిన సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ సర్ప్రైజ్ వల్ల కృష్ణంరాజు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ‘మన కామెడీ జీనియస్.. ఆర్ట్‌లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్ ది స్పెషల్ సర్ప్రైజ్’అంటూ బ్రహ్మానందంతో కలిసి దిగిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశాడు కృష్ణం రాజు. కాగా, గతంలో అల్లు అర్జున్, రానాలకు కూడా తాను స్వయంగా గీసిన చిత్రపటాలను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న బ్రహ్మీ.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ మూవీలో నటిస్తున్నాడు. The comedy genius is an art genius as well. Such a beautiful person with wonderful talent. Thank you for this sweet surprise. God Bless you #Brahmanandam. pic.twitter.com/MPnWkwpeAY — U.V.Krishnam Raju (@UVKrishnamRaju) October 30, 2021 -
కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి
Krishnam Raju Family Celebrates Their Maid 25Years Of Service : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇంట్లో గత 25ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు కుటుంబం ఘనంగా సన్మానించింది. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలును కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్‌మీడియాలో షేర్చేసుకుంది. 25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారు. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ సందర్భంగా కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి ఆమెకు ఓ బంగారు గొలుసును కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషిగా చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కృష్ణంరాజు దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాను వంశీ, ప్రమోద్‌లతో కలిసి ప్రసీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. 25 years of literally doing everything and anything and keeping us sane. Thank you for everything Padma Aunty💙#25years #pillarofstrength #gkmwomen pic.twitter.com/lqwlp5xsUa — Praseedha Uppalapati (@PraseedhaU) October 21, 2021 -
బ్యాలెట్ పద్దతిలోనే ‘మా’ ఎన్నికలు: ఎన్నికల అధికారి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్‌ను బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తామని తాజాగా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. ‘మా’ ఎన్నికల పోలింగ్‌పై ఆయన వివరణ ఇచ్చారు. ‘పేపర్ బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు జరపాలని మంచు విష్ణు లేఖ రాశారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరపాలని ప్రకాశ్ రాజ్ కోరారు. వీరిద్దరి ప్రతి పాదనలను క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణం రాజు దృష్టికి తీసుకెళ్లాం. చదవండి: ‘మా’ ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ కూడా బ్యాలెట్ పోలింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ‘మా’ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే పోలింగ్ నిర్వహిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానిక ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే జరిగాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ విధానంలోనే నిర్వహించారు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చదవండి: మంచు విష్ణు ప్యానెల్‌పై ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు -
'మా' ఎన్నికలు: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజుతో మంచు విష్ణు భేటీ అయ్యారు. మా ఎన్నికల్లో తనకు మద్ధతు ఇవ్వాలని ఈ సందర్భంగా విష్ణు కోరారు. స్వయంగా కృష్ణం రాజు ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు నుంచి ఆశీస్సులు అందాయంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మద్దతుపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు మా ఎన్నికల్లో తన బలం పుంజుకుంటుందంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు Took blessings of the original Rebel Star! 🙏 💪🏽❤️ pic.twitter.com/dY33azmqxm — Vishnu Manchu (@iVishnuManchu) October 4, 2021 -
MAA Elections 2021: ‘మా’ఎన్నికల్లో మరో ట్విస్ట్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతిసారీ ఇద్దరు మాత్రమే పోటీ పడే ఎన్నికలలో ఈసారి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రోజుకో ట్విస్ట్ బయటకు వస్తూ.. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ కార్యవర్గం పదవీ కాలం చెల్లింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించాలంటూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు అయిన కృష్ణం రాజుకు లేఖలు రాశారు. 2019 లో ఎన్నిక అయిన 15 మంది సభ్యులు తమ పదవి కాలం ముగిసి పోయింది కనుక వెంటనే ఎన్నికల నిర్వహణ బాధ్యత తీసుకుని నిర్వహించాలని కృష్ణంరాజును కోరారు. గతంలో రాసిన లేఖకు ఇప్పటి వరకు జవాబు లేకపోవడంతో మరోసారి లేఖ రాశామని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం మా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వర్చువల్‌గా సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమతో పాటు సీవీఎల్ నర్సింహరావు కూడా ఉన్నారు. అయితే వీరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి. జీవిత, హేమ, నర్సింహరావు పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏకగ్రీవం అంశం కూడా తెరపైకి వచ్చింది. రేపు జరగబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. -
ఆయన్ను చూస్తే చాలనుకున్నాను... సినిమా చేశాను
దిలీప్‌కుమార్ అందరూ మెచ్చిన నటుడు. భారతీయ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన నటుడు. అంతటి లెజండరీ నటుడు మన తెలుగు హీరో కృష్ణంరాజు నిర్మించిన ‘ధర్మ్ అధికారి’లో నటించారు. ఇది కృష్ణంరాజు రెండు పాత్రల్లో నటించి, నిర్మించిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’కి హిందీ రీమేక్. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్రరావు హిందీ రీమేక్‌ని తెరకెక్కించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున తండ్రీ కొడుకులుగా బి. గోపాల్ దర్శకత్వం వహించిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ హిందీ రీమేక్ ‘కానూన్ అప్నా అప్నా’లో దిలీప్ కుమార్ నటించారు. ఈ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలోనే తెలుగు నిర్మాత ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించారు. అలాగే ఎన్టీఆర్ నటించిన ‘రాముడు–భీముడు’ హిందీ రీమేక్ ‘రామ్ ఔర్ శ్యామ్’లోనూ దిలీప్‌కుమార్ నటించారు. తెలుగు నిర్మాతలు చక్రపాణి, బి. నాగిరెడ్డి నిర్మించగా, తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. ఇలా తెలుగు చలనచిత్ర దర్శక–నిర్మాతలతో దిలీప్‌కుమార్‌కి అనుబంధం ఉంది. ఇప్పుడు దిలీప్‌కుమార్ భారతీయ సినీరంగాన్ని విషాదంలో ముంచి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనతో సినిమాలు చేసిన రాఘవేంద్ర రావు, కృష్ణంరాజు, బి. గోపాల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడిన విశేషాల్లోకి వెళదాం... ► నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. నేల టికెట్ కొనుక్కుని మరీ ఆయన సినిమాలు చూసేవాణ్ణి. అలాగే నాకు దిలీప్ కుమార్గారంటే కూడా చాలా ఇష్టం. కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్ అందరం దిలీప్ కుమార్‌గారు రోజుకి 18 లక్షలు తీసుకుంటారట, చాలా పెద్ద హీరో అని చెప్పుకునేవాళ్లం. అసలు దిలీప్గారిని లైఫ్‌లో దూరంగా అయినా నిలబడి చూడగలమా? అనుకునేవాణ్ణి. కానీ ఆయన సినిమాకి డైరెక్షన్ చేయగలిగాను. ► నాగేశ్వరరావుగారు, నాగార్జునగారు తండ్రీ కొడుకులుగా నా దర్శకత్వంలో వచ్చిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ని ప్రొడ్యూసర్ ఏస్ఆర్ ఆంజనేయులుగారు హిందీలో రీమేక్ చేద్దామన్నారు. ఆ తర్వాత దిలీప్‌కుమార్‌తో ఈ సినిమా చేస్తున్నాం అని ఆయన అన్నారు. అసలు నాకేమీ అర్థం కాలేదు. ఇంత అదృష్టం మనకు దక్కుతుందా అనిపించింది. దూరంగా అయినా చూడగలుగుతామా? అనుకున్న నాకు ఆయన్ను డైరెక్షన్ చేసే చాన్స్ అంటే చాలా ఆనందంగా అనిపించింది. షాకింగ్‌గా కూడా అనిపించింది. ► ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఆంజనేయులుగారు నన్ను ముంబయ్ తీసుకెళ్లారు. దిలీప్‌కుమార్‌గారి ఇంటికి వెళ్లాం. వెళ్లగానే ఆయన కాళ్లకు దండం పెట్టాను. కాసేపయిన తర్వాత ‘ఏంటీ మీరు మాత్రమే మాట్లాడుతున్నారు. డైరెక్టర్ ఏమీ మాట్లాడటంలేదు’ అని ఆంజనేయులుగారిని దిలీప్‌గారు అడిగారు. ‘అలా ఏం లేదు. మీకు పెద్ద ఫ్యాన్ ఆయన. మిమ్మల్ని చూసిన ఆనందంలో మాట్లాడకుండా ఉండిపోయారు’ అంటే ఆయన నవ్వుకున్నారు. అలా ఆయనతో ‘కానూన్ అప్నా అప్నా’ సినిమా చేశాను. ► రీ టేక్ అని చెప్పడానికి టెన్షన్ పడిన సందర్భాలు లేవు. ఎందుకంటే దిలీప్‌గారు చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవారు. ఈ సినిమా కమిట్ అయినప్పుడు ‘గోపాల్.. తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్టయిందని నాకు తెలుసు. నాకున్న ఇమేజ్‌కి తగ్గట్టుగా కాకుండా వేరే ఏదైనా ట్రై చేద్దాం.. డిస్కస్ చేద్దాం’ అని చెప్పి, అప్పట్లో రాజేశ్ ఖన్నాగారి ‘ఆరాధన’కు రచయితగా చేసిన సచిన్ బౌమిక్ని పిలిపించారు. దిలీప్‌గారు కొన్ని సలహాలూ సూచనలూ ఇచ్చి, ‘నువ్వు ‘నో’ అంటే ‘నో’. నీకూ కరెక్ట్‌గా అనిపిస్తేనే పెట్టు. లేకపోతే వద్దు. ఎందుకంటే తెలుగు వెర్షన్ కోసం చాలా రోజులు వర్క్ చేశారు. ఆ కథ డిస్ట్రబ్ కాని మార్పులే చేద్దాం. లేకపోతే వద్దు’ అన్నారు. అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ► ‘నేను మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.15 లోపు షూటింగ్‌కి వస్తాను. నా అలవాటు అది. మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి’ అని ముందే మాతో అన్నారు. ఆయనకు తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేశాం. దిలీప్‌గారు బాగా షటిల్ ఆడేవారు. బాగా ఎక్సర్సైజులు కూడా చేసేవారు. అవన్నీ చేసుకుని చెప్పినట్లుగానే 12 గంటలకల్లా లొకేషన్లో ఉండేవారు. కంటిన్యూస్‌గా సాయంత్రం 3 గంటల వరకూ షూటింగ్ చేసినా బ్రేక్ కావాలనేవారు కాదు. 3 గంటల తర్వాత లైట్‌గా లంచ్ తిని, ఓ అరగంట రెస్ట్ తీసుకుని, మళ్లీ ఫుల్ ఎనర్జీతో షూటింగ్లో పాల్గొనేవారు. హైదరాబాద్‌లో, మదరాసులలో షూటింగ్ చేసినప్పుడు బస చేసిన హోటల్లో షటిల్ ఆడుకుని షూటింగ్‌కి వచ్చేవారు. ► అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ చేశాం. అప్పుడు నాగేశ్వరరావుగారు వచ్చారు. దిలీప్‌గారు, ఆయన ఇద్దరూ కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే చూడటానికి రెండు కళ్లూ చాలలేదు. ఒకరినొకరు గౌరవించుకున్న తీరు చూసి, నాకు చాలా ముచ్చటేసింది. ► దిలీప్‌గారు ఎక్కువ టేక్స్ తీసుకునేవారు కాదు. ‘కానూన్ అప్నా అప్నా’కి ఖాదర్ ఖాన్ డైలాగ్ రైటర్. ఆయన ఒక పెద్ద క్యారెక్టర్ కూడా చేశారు. ఖాదర్ రాసిన వెర్షన్ తీసుకెళ్లి, దిలీప్‌గారు ఫైనల్‌గా ఒక వెర్షన్ రాసుకొచ్చేవారు. ఖాదర్ ఖాన్ రాసిన ఫ్లేవర్ పోకుండా చిన్న చిన్న మార్పులతో డైలాగులు రాసుకొచ్చేవారు. క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి ఆయన అలా చేసేవారు. అంటే.. ఎంత హోమ్‌వర్క్ చేసేవారో ఊహించవచ్చు. ► కానూన్ అప్నా అప్నా’ చేసిన కొంతకాలం తర్వాత ఓ సందర్భంలో చెన్నైలో దిలీప్కుమార్గారిని కలిశాను. గుర్తుపట్టి, ‘గోపాల్.. ఎలా ఉన్నావ్’ అని ఆప్యాయంగా పలకరించారు. ఒక లెజండరీ నటుణ్ణి కోల్పోయాం. చాలా బాధగా ఉంది. ఇండియన్ సినిమాకు గుర్తింపు తెచ్చిన నటుడు – కృష్ణంరాజు ► ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఇండస్ట్రీకి గుర్తింపు తెచ్చిన గొప్ప కళాకారుడు దిలీప్‌కుమార్. ప్రతి సినిమాలో ఆయన నటన ఎంతో గొప్పగా ఉంటుంది. వ్యక్తిగా కూడా చాలా గొప్పవారు. దిలీప్‌కుమార్‌కి నేను పెద్ద అభిమానిని. ‘బొబ్బలి బ్రహ్మన్న’ సినిమాలో యంగ్, ఓల్డ్ క్యారెక్టర్స్ నేనే చేసినప్పటికీ హిందీలో రీమేక్ చేయాలన్నప్పుడు పెద్ద వయసు పాత్రకు ధర్మేంద్రను, యంగ్ క్యారెక్టర్‌కు జితేంద్రను అనుకున్నాం. అలా అనుకున్నప్పటికీ దిలీప్‌కుమార్ అభిమానిగా ఆయన నటిస్తే బాగుంటుందనుకున్నాను. కానీ నటిస్తారో లేదో అని సందేహం. కానీ దిలీప్‌కుమార్‌గారు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమా చూసి, నాకు ఫోన్ చేసి అభినందించారు. నటిస్తానని అన్నారు. అలా ‘ధర్మ్ అధికారి’ ఆరంభమైంది. ఇందులో యంగ్ క్యారెక్టర్‌ను జితేంద్ర చేశారు. ► సాధారణంగా దిలీప్‌కుమార్‌గారు సినిమా షూటింగ్‌కు మధ్యాహ్నం 12 గంటల మధ్యలో వచ్చేవారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఉదయం ఏడు గంటలకే సెట్స్‌కి వచ్చేవారు. ఇందులోని ధర్మ్ రాజ్ క్యారెక్టర్ ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నేనంటే ఆయనకు ఉన్న ఇష్టం కూడా ఆయన్ను సెట్స్‌కు రప్పించిందేమో! ‘భాయీజాన్’ అంటూ ఆప్యాయంగా హత్తుకునేవారు. ► ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఓ సందర్భంలో జితేంద్ర ఓ సన్నివేశానికి ఇంకా కాస్ట్యూమ్‌తో రెడీ కాలేదు. దిలీప్‌కుమార్‌గారు ఆలస్యంగా వస్తారని ఆయన అనుకున్నారు. కానీ ఆల్రెడీ వచ్చారని, షాట్‌కు రెడీ అయిపోయారని చెప్పాను. ‘దిలీప్‌గారు అప్పుడే వచ్చారా.. అబద్ధం చెప్పకు’ అని జితేంద్ర అన్నారు. ‘లేదు.. వచ్చారు’ అని చెప్పగానే అప్పటికప్పుడు జితేంద్ర షాట్‌కు రెడీ అయ్యారు. ► ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రం 100 డేస్ ఫంక్షన్‌కు దిలీప్‌గారు వచ్చారు. ఆయనతో పాటు ఆయన భార్య సైరా బానుని కూడా తీసుకువచ్చారు. నేను, దిలీప్, ఆమె ఒకే చోట పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు వేదిక మీద ఉన్న ‘బొబ్బిలి బ్రహ్మన్న’ పోస్టర్ చూసి, ఆయన ఎవరు? అని దిలీప్గారిని సైరా బాను అడిగారు. ‘నీ పక్కన ఉన్న అతన్ని అడుగు’ అని నన్ను చూపిస్తూ, ఆయన చమత్కరించారు. అప్పట్లో నేను యంగ్‌గా ఉన్నాను. పోస్టర్లో పెద్ద వయసున్న బ్రహ్మన్న గెటప్‌లో నన్ను గుర్తుపట్టలేకపోయారామె. యంగ్ రవి పాత్రను మాత్రమే నేను చేశానని ఆమె అనుకుని ఉంటారు. లెజెండ్ దూరమయ్యారు – కె. రాఘవేంద్రరావు భారతీయ సినిమా చరిత్రలో టాప్ లెజెండ్ దిలీప్‌కుమార్‌గారు. అన్ని రకాల పాత్రలు చేసిన గొప్ప నటుడు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ స్క్రిప్ట్ చదివి, సినిమా చూడగానే హిందీ రీమేక్‌లో నటించడానికి ఒప్పుకున్నారాయన. ఈ సినిమా షూటింగ్ అప్పుడు రాజమండ్రిలో చిన్న విలేజ్ దగ్గర ఓ ఇల్లు తీసుకున్నాం. అప్పుడు దిలీప్‌గారి భార్య సైరా బాను కూడా వచ్చారు. ఇద్దరూ చాలా సింపుల్ పర్సన్స్. ఒక గొప్ప వ్యక్తితో, గొప్ప నటుడితో సినిమా చేయడం నాకు హ్యాపీ అనిపించింది. ఇండియన్ ఇండస్ట్రీ ఒక లెజెండ్‌ని కోల్పోయింది. ప్రముఖుల నివాళి ‘‘ఒక శకం ముగిసింది. ఇక భారతీయ సినిమా అంటే దిలీప్‌కుమార్‌కి ముందు ఆ తర్వాత అనాలి’’ అంటూ దక్షిణ, ఉత్తరాది భాషలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు దిలీప్‌కుమార్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లెజెండరీ యాక్టర్ దిలీప్‌కుమార్‌గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో దిలీప్‌కుమార్‌గారు ఒకరు. ఆయన ఒక యాక్టింగ్ ఇనిస్టిట్యూషన్. తన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన సినీ సంపద. – చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమకు దిలీప్‌కుమార్‌గారి మరణం తీరని లోటు. ఒక నటుడిగా మొదలై స్టార్‌గా ఎదిగిన దిలీప్‌గారి మరణంతో భారతీయ సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసింది. అయితే వివిధ సందర్భాల్లో ఆయన్ను కలుసుకోగలిగినందుకు ఐ యామ్ బ్లెస్డ్. – మోహన్‌బాబు దిలీప్‌కుమార్ సార్ మనకు శాశ్వతంగా దూరమయ్యారనే వార్త నన్ను బాధించింది. ఆయన ఎప్పటికీ ఓ లెజెండ్. మన హృదయాల్లో దిలీప్‌గారి లెగసీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – వెంకటేశ్ ప్రపంచ సినిమాపై దిలీప్‌కుమార్ చెరగని ముద్ర వేశారు. గ్రేటెస్ట్ యాక్టర్. లెజెండ్స్ ఎప్పటికీ బతికే ఉంటారు – రవితేజ దిలీప్‌గారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్టర్స్ అందరికీ ఓ ప్రేరణ. సినీ చరిత్రలో నిలిచిపోతారు. – మహేశ్‌బాబు భారతీయ సినీ పరిశ్రమ ఎదుగుదలలో దిలీప్‌కుమార్‌గారి పాత్ర విలువైనది. – జూనియర్ ఎన్టీఆర్ దిలీప్‌కుమార్‌గారి మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం. – రామ్‌చరణ్ దిలీప్‌కుమార్‌గారు భారతీయ సినిమాకు చేసిన కృషి అసమానమైనది. ఈ తరం యాక్టర్స్‌కే కాదు. భవిష్యత్ తరాల యాక్టర్స్‌కూ ఆయన ఓ స్ఫూర్తి. – అల్లు అర్జున్ ఒక ఇనిస్టిట్యూషన్ వెళ్లిపోయింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ చరిత్రను రాస్తే అది కచ్చితంగా దిలీప్‌కుమార్‌కు ముందు, దిలీప్‌కుమార్ తర్వాత అన్నట్లు ఉంటుంది. – అమితాబ్ బచ్చన్ దిలీప్ కుమార్‌తో నేను ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాను. దిలీప్, సైరా బానులతో నాకు మంచి అనుబంధం ఉంది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలనే కాదు.. ఇతర సంగతుల గురించి కూడా మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయన సినిమాలు విడుదలైన ప్రతిసారీ సైరా నన్ను వాళ్ల ఇంటికి ఆహ్వానించేవారు. నేను వెళితే ‘‘మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు.. మన ‘మధుమతి’ (దిలీప్‌కుమార్ సరసన వైజయంతీ మాల నటించిన సినిమా) వచ్చారు’’ అని దిలీప్‌తో సైరా అనేవారు. అప్పుడు ‘ధనో వచ్చింది’ అని దిలీప్ అనేవారు. ‘గంగాజమున’ చిత్రంలో నేను పోషించిన పాత్ర పేరు ధనో. దిలీప్‌కుమార్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. తనతో కలిసి ఉండేందుకు ఆ అల్లాయే దిలీప్‌ను పిలిచాడని అనుకుంటున్నాను. – వైజయంతీ మాల నా ఆప్యాయమైన సోదరుడు దిలీప్‌కుమార్‌ని కోల్పోయాను. మా దిలీప్ ఉండటం ఆ స్వర్గానికే అదృష్టం. – ధర్మేంద్ర నా జీవితంలో ఓ తండ్రిలా ఉన్న దిలీప్ సార్‌తో నాకు ఎన్నో ప్రత్యేకమైన అనుభూతులు ఉన్నాయి. – సంజయ్ దత్ ఇండియన్ సినిమా అద్భుతమైన నటుడిని కోల్పోయింది. ఇలాంటి ప్రతిభాశాలి లేరు, రారు. – సల్మాన్ ఖాన్ అద్భుత నటన ద్వారా విలువైన, వెలకట్టలేని, ప్రత్యేకమైన బహుమతులను మాకు ఇచ్చిన యూసుఫ్ సాహెబ్‌కు ధన్యవాదాలు. నా దృష్టిలో మీరెప్పటికీ గ్రేటెస్ట్. సలామ్! – ఆమిర్ ఖాన్ ఈ ప్రపంచంలో చాలామంది హీరోలు ఉండొచ్చు. కానీ మా యాక్టర్స్ హీరో దిలీప్‌కుమార్ సారే. ఇండియన్ సినిమాలో ఆయన మరణంతో ఓ శకం సమాప్తమైపోయింది. – అక్షయ్‌కుమార్ -
మాల్దీవుల్లో టాలీవుడ్ జంటల రచ్చ.. వైరలైన ఫోటోలు
కరోనా లాక్డౌన్ అనంతరం సినీ సెలబ్రిటీలు మాల్దీవుల ట్రిప్‌కి విరివిగా వెళ్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తమ హాలిడే స్పాట్‌గా మాల్దీవులను ఎంచుకుంటున్నారు. ఫ్రెండ్స్‌తో కలసి వెకేషన్‌కి అయినా..భార్యా భర్తల హనీమూన్‌కైనా, ఫ్యామిలీ వెకేషన్ అయినా ఇప్పుడు ఎవరి నోట విన్నా మాల్దీవ్స్ పేరే వినిపిస్తుంది. అక్కడి ప్రకృతి సౌందర్యం ఆకర్షనీయంగా ఉండడంలో మాల్దీవుల టూర్‌నే ఇష్టపడుతున్నారు.లాక్డౌన్ ఎత్తెయ్యగానే సినీ ప్రపంచం మాల్దీవుల్లో సేదతీరింది. ఇటీవల కాలంలో మాల్దీవుల టూర్‌కి వెళ్లిన టాలీవుడ్ ప్రముఖులెవరో చూద్దాం. మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ సందడి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా ఫ్యామిలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. విరామం దొరకగానే..కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ…మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు. మజా చేసిన మంచు ఫ్యామిలీ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది. మోహన్‌బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసస్‌తో కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సేదతీరేందుకు, ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లింది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఈ సందర్భంగా తాను పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్ జరుపుకుంది. నాగార్జున అక్కినేని, అమల దంపతులు మాల్దీవుల్లో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను అమల తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసారు. అక్కడ వీరు చేసిన హంగామానుఅక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు. ఇక లాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ యోగాసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. నాగచైతన్య, సమంత సైతం మాల్దీవుల్లో చక్కర్లు కొట్టి వచ్చారు. చైతూ బర్త్‌డేని అక్కడే జరుపుకున్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత..వాలెంటైన్స్‌డే సందర్బంగా తన భర్త రామ్‌తో కలిసి మాల్దీవుల ప్రకృతి సోయగాలను ఎంజాయ్ చేసింది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ కూడా మాల్దీవులు వెళ్లి ఎంజాయ్ చేసింది. కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామల దేవి గారితో పాటు అతని కూతుర్లు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి మాల్దీవుల అందాలను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణంరాజుతో ప్రభాస్.. అలా వెనక్కి వెళ్దాం!
‘70ల నాటి కాలాన్ని మరోసారి చూసొద్దాం’ అంటున్నారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు కృష్ణంరాజు. ‘రాధేశ్యామ్’ షూటింగ్ లొకేషన్ లో ప్రభాస్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారాయన. ‘జూలై 30న ఈ సినిమా చూస్తూ కాలంలో వెనక్కి వెళ్దాం’ అని క్యాప్షన్ చేశారు. 1970లో జరిగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఇక సినిమా ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 30న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా విడుదలైన పది రోజులకే అంటే ఆగస్టు 11న ప్రభాస్ మరో చిత్రం ఆదిపురుష్ విడుదల కానుండటం గమనార్హం. చదవండి: రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు! ప్రేమ కోసం చచ్చే టైప్ కాదంటున్న ప్రభాస్ Reminiscing the 70s with #Prabhas 🤩 Let’s go back in time with #RadheShyam on 30th July! pic.twitter.com/xhJD96U36i — U.V.Krishnam Raju (@UVKrishnamRaju) February 16, 2021 -
మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న కృష్ణంరాజు ఫ్యామిలీ
-
రాధేశ్యామ్: కీలక పాత్రలో కృష్ణం రాజు
బాహుబలి తర్వాత పూర్తిగా పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టాడు ప్రభాస్. అలా 'సాహో' సినిమాతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులను పలకరించాడు. ఈ యాక్షన్ డ్రామాకు టాలీవుడ్లో మిశ్రమ స్పందన లభించినా హిందీలో మాత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇదే జోష్‌లో రాధేశ్యామ్ ద్వారా మరోసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కీలక పాత్రలో నటిస్తున్నారట. బుధవారం 81వ పుట్టిన రోజు జరుపుకున్న కృష్ణం రాజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మహాజ్ఞానిగా పరమ హంస పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. అందుకోసమే గడ్డం పెంచుతున్నానని చెప్పారు. తన పాత్రతో పాటు ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తైందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. (చదవండి: రాహుల్ సిప్లిగంజ్ ‘లడిలడి’ సాంగ్.. వైరల్) ఇక ప్యారిస్ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ఈ ప్రేమకథలో పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనుంది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక్క క్లైమాక్స్ కోసమే రూ.30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్ వేయడం గమనార్హం. ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ మూవీ ‘గ్లాడియేటర్’కి యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన నిక్ పోవెల్ ‘రాధేశ్యామ్’కి వర్క్ చేస్తుండటం విశేషం. ఆయన పర్యవేక్షణలో ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. నిజానికి యాక్షన్ పార్ట్ కన్నా ప్రేమకథ ఎక్కువ ఉంటుందని ఆమధ్య ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అయితే ఉన్న తక్కువ యాక్షన్ కూడా భారీ స్థాయిలో ఉంటుందట. అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ఉన్నాయట. భారీ బడ్జేట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 'బాహుబలి 2' రిలీజ్ అయిన ఏప్రిల్ 28వ తేదీనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఆలోచిస్తుందట చిత్రయూనిట్. ఇదిలా వుంటే కృష్ణం రాజు, ప్రభాస్‌తో కలిసి 'బిల్లా', 'రెబల్' సినిమాల్లో కలిసి నటించారు. ఆయన చివరిసారిగా 2015లో వచ్చిన 'రుద్రమదేవి' చిత్రంలో గణపతి దేవుడుగా కనిపించారు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత రాధేశ్యామ్‌లో నటిస్తున్నారు. (చదవండి: పెదనాన్న జుట్టును చిన్నపిల్లాడిలా సరి చేస్తున్న ప్రభాస్) -
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని సమాధానం
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ముందుంటారు. ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లికి సంబంధించి ఎప్పుడూ పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. నిన్న (బుధవారం) రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లిపై స్పందించారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా..ఎప్పుడు జరిగితే అప్పుడే అంటూ ఊహించని సమాధానం ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి గురించి మీ అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు జరుగుతుందో చూద్దాం అంటూ జావాబిచ్చారు. (వైరల్: పెదనాన్న జుట్టు సరి చేస్తున్న ప్రభాస్) గతంలో ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా చాలా త్వరలోనే చేసేద్దాం అంటూ చెప్పే పెదనాన్న కృష్ణంరాజు ఇలాంటి ఆన్సర్ ఇవ్వడంతో అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేక సింగిల్‌గానే మిగిలిపోతాడా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు లాక్డౌన్ సమయంలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన రానా, నితిన్, నిఖిల్ సహా పలువురు సెలబ్రెటీలు పెళ్లి చేసుకోగా, ప్రభాస్‌కి ఆ పెళ్లిభాగ్యం ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
ప్రభాస్‌కు పెదనాన్నంటే ఎంత ప్రేమో!
కొడుకు ఎంత ఎదిగితే తండ్రికి అంత గర్వకారణం. కానీ పిల్లలు ఆకాశమంత ఎత్తు ఎదిగినా తండ్రికి మాత్రం ఎప్పటికీ కంటి పాపలా కాచుకునే చంటిపిల్లలే. నేడు(బుధవారం) సీనియర్ నటుడు కృష్ణం రాజు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు, పలువురు సెలబ్రిటీలు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆయన బర్త్‌డే పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కృష్ణం రాజు తమ్ముడి కొడుకు, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఆయనకు జుట్టు సరి చేస్తున్నాడు. అతడు చూపిస్తున్న ప్రేమకు తడిసి ముద్దయిన ఆయన ప్రభాస్‌ను కొద్ది క్షణాల పాటు అలాగే చూస్తుండిపోయాడు. ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ వీడియోకు కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రభాస్‌కు పెదనాన్నంటే ఎంత ప్రేమో అంటున్నారు. (చదవండి: నా సినిమా ఎవరు చూస్తారనుకున్నా: విజయ్) గతేడాది కృష్ణం రాజు బర్త్‌డే పార్టీలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ఆ వేడుకల్లో కృష్ణం రాజు తన సొంత కొడుకులా చూసుకునే ప్రభాస్‌కు కేక్ తినిపిస్తున్న ఫొటోతో పాటు, కుటుంబంతో కలిసి దిగిన పలు ఫొటోలు సైతం నెట్టింట తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ వీళ్లిద్దరూ 'బిల్లా', 'రెబెల్' సినిమాలలో కలిసి నటించారు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్నారు. ఈ మధ్యే ఓ పార్ట్ ముంబైలో చిత్రీకరణ జరుపుకున్నారు. అలాగే 'ఆదిపురుష్'లోనూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్‌రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీటితోపాటు సలార్, నాగ్ అశ్విన్‌తో మరో సినిమా చేయనున్నారు. (చదవండి: తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?) -
తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?
బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని ఆయనకు అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. కొందరు అయితే ఏకంగా కృష్ణం రాజుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరో వైపు తమ అభిమాన హీరో పెద్ద నాన్నకు గవర్నర్ పదవి దక్కనుందన్న వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, కృష్ణంరాజు ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ.. బీజేపీలోనే కొనసాగుతున్నారు. 1998లో కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికైన కృష్ణం రాజు.. 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వివిధ కమిటీల్లో సభ్యుడిగా పని చేశారు. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణం రాజు.. అనంతరం కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ బీజేపీలో చేరారు. 2016లో రోశయ్య వెళ్లిపోయిన తర్వాత, అప్పటి మహారాష్ట్ర గవర్నర్ ఉన్న విద్యాసాగర్ రావే కొద్ది రోజుల పాటు తమిళనాడుకు కూడా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా తిరు బన్వారిలాల్ పురోహిత్ ఉన్నారు. తమిళనాడులో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందులో భాగంగానే కృష్ణంరాజును గవర్నర్‌గా పంపాలని నిర్ణయించిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్
సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాప్రయత్నిస్తోందంటూ సీనియర్ నటుడు కృష్ణంరాజు దంపతులు సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, విమానాశ్రయం విస్తరణ కోసం తానిచ్చిన 39 ఎకరాల భూమికి గాను భూ సేకరణ చట్టం కింద రూ.210 కోట్లను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏఏఐని ఆదేశించాలని కోరుతూ నిర్మాత చలసాని అశ్వనీదత్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరంలో తానిచ్చిన 39 ఎకరాల భూమి ప్రస్తుతం ఎకరా రూ.1.84 కోట్లు చేస్తుందని, భూ సేకరణ చట్టం కింద ఈ మొత్తానికి నాలుగు రెట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు. (చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న!) -
చిరంజీవిగారి నుంచి అవార్డు అందుకోవాలి
‘‘చిరంజీవిగారంటే చిన్నప్పటి నుంచి భక్తి. ఆయన స్ఫూర్తితోనే నేను నటనలోకి వచ్చా. ఇంజనీరింగ్ తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేశా. ఆ తర్వాత నాన్నగారికి తెలియకుండానే సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. ఆడిష¯Œ ్సలో ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చిత్రంలో హీరోగా ఎంపికయ్యా’’ అని హాస్యటుడు గౌతంరాజు కుమారుడు, హీరో కృష్ణంరాజు అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘తొలి ప్రయత్నం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ చాలా మంచి అనుభూతిని ఇచ్చింది. నాకు మాస్ అంటే చాలా ఇష్టం. చిరంజీవిగారి నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందేది ఫైట్స్, డ్యా¯Œ ్స. నా తొలి సినిమా ఇంకా ఆయన వద్దకి చేరలేదని బాధపడుతున్నా. ఏదో ఒక రోజు ఆయన చేతుల మీదగా ఒక చిన్న అవార్డు అయినా తీసుకోవాలన్నది నా పెద్ద కల. అందుకోసం ఎంతైనా కష్టపడతా. దర్శకుల్లో సుకుమార్‌గారు అంటే చాలా ఇష్టం. కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, రాజమౌళి, హరీష్ శంకర్గార్ల కూడాæ ఇష్టం. నటుడిగా నిరూపించుకునే పాత్రలు చేయాలనుకుంటున్నాను ’’ అన్నారు. -
వీకెండ్ స్పెషల్
‘‘చేపల కూరలో ఉప్పు సరిపోయిందో లేదో తెలియాలంటే రుచి చూడక్కర్లేదు. వాసన బట్టి కూడా చెప్పేయొచ్చు’’ అంటున్నారు సీనియర్ నటులు కృష్ణంరాజు. ఆయన మంచి భోజన ప్రియులు. ఇష్టంగా తినడమే కాదు, వండుతారు కూడా. చేపల పులుసు వండటంలో స్పెషలిస్ట్ ఆయన. వీకెండ్ స్పెషల్‌గా శుక్రవారం సరదాగా కుటుంబ సభ్యుల కోసం చేపల కూర వండారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కృష్ణంరాజు. ‘‘మా నాన్న ప్రపంచంలోనే బెస్ట్ చేపల పులుసు వండుతారు. ఎంత ఎక్స్పర్ట్ అంటే కేవలం వాసన చూసి కూరలో అన్నీ సరిపోయాయో లేదో చెప్పేసేంత’’ అని కృష్ణంరాజు కుమార్తె ప్రసీద పేర్కొన్నారు. -
కృష్ణం రాజు చేపల పులుసు..
-
కరోనా విరాళం
కృష్ణంరాజు, శ్యామలా దేవి – 10 లక్షలు (‘ పీయం కేర్స్’కు) (శ్యామలా దేవి పుట్టినరోజు ఏప్రిల్ 13న. ఈ సందర్భంగా 4 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే కృష్ణం రాజు, శ్యామల కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తీ, సాయి ప్రదీప్తీ తమ పాకెట్ మనీ నుంచి తలా రెండు లక్షలు తీసి 6 లక్షలను విరాళంగా ప్రకటించారు.) కె.కె. రాధా మోహన్ – 3 లక్షలు (సీసీసీ మనకోసం) వీకే నరేష్ – 11 లక్షలు ( ‘సీసీసీ మనకోసం’కి 1 లక్ష, ‘మా’లో 100 మంది సభ్యులను దత్తత తీసుకుని ఒక్కో సభ్యుని కుటుంబానికి 10 వేలు సాయం. ఇప్పటికే 58 కుటుంబాలకు వారి వారి బ్యాంకు ఖాతాలో 10 వేలు చొప్పున డిపాజిట్ చేశారు). ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త, దినేశ్ గుప్త, ఆదిత్య గుప్తలు కరోనాపై యుద్ధానికి – 31 లక్షలు విరాళం -
కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచమంతా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నటులు రెబల్‌స్టార్ కృష్ణంరాజు అన్నారు. కరోనా నివారణ చర్యలకు తమ వంతు సాయంగా కృష్ణంరాజు కుటుంబం పీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 10 లక్షల విరాళాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కృష్ణం రాజు మాట్లాడుతూ.. ‘కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించడానికి డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా, ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి. అందుకే ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ శక్తి మేరకు విరాళాలు అందజేస్తున్నారు. మా కుటుంబం నుంచి మా పెద్దమ్మాయి సాయి ప్రసీద, రెండో అమ్మాయి సాయి ప్రకీర్తి, మూడవ అమ్మాయి సాయి ప్రదీప్తి తాము దాచుకున్న పాకెట్ మనీ నుండి తలా రెండు లక్షలు చొప్పున ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఇస్తామని ముందుకు వచ్చారు. అలాగే నా శ్రీమతి శ్యామలా దేవి ఏప్రిల్ 13న తన జన్మదిన సందర్భంగా నాలుగు లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని చెప్పింది. కాబట్టి మొత్తం 10 లక్షల విరాళాన్ని ఈరోజు ప్రధానమంత్రి సహాయనిధికి పంపించడం జరిగింది. కేవలం ఆర్థిక సహకారమే కాకుండా ఈ కరోనా విపత్తును అధిగమించడానికి ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ విజయానికి సంకేతంగా చప్పట్లు కొట్టడం, నిన్న ఏప్రిల్ 5న కొవ్వొత్తులు వెలిగించి మద్దతు ప్రకటించడం వంటి విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ మందున్నారు. మా కుటుంబం మొత్తం ఈ పోరాటంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని అన్నారు. -
పొట్టకూటి కోసం వెళ్లి పరలోకాలకు...
వైఎస్ఆర్ జిల్లా, లక్కిరెడ్డిపల్లె : మండల పరిధిలోని బి.యర్రగుడి పంచాయతీ కాపుపల్లెకు చెందిన దేరంగుల కృష్ణంరాజు(30) బుధవారం రాత్రి కువైట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... 2018వ సంవత్సరంలో కృష్ణంరాజు బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లాడు. వచ్చే నెలలో తిరిగి ఇండియాకు వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. అయితే కువైట్‌కు వెళ్లినప్పటి నుండి సేఠ్ వద్దనే పని చేస్తూండే వాడు. ఈ మధ్య కాలంలో ఎలాంటి సమస్యలు లేవని.. సంతోషంగా ఉన్నానని చెబుతూ కుటుంబం ఖర్చుల కోసం డబ్బులను కూడా పంపించేవాడు. ప్రతి రోజూ వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులు, భార్య, బిడ్డలతో సంతోషంగా మాట్లాడేవాడు. చివరి సారిగా బుధవారం గ్రామంలో వివాహ వేడుక జరుగుతుండగా ఆ సమయంలో కూడా ఫోన్ చేసి పెళ్లి వేడుకపై అడిగి తెలుసుకున్నాడు. గురువారం ఫోన్ రాకపోవడంతో కృష్ణంరాజు భార్య ఫోన్ చేయగా మరో వ్యక్తి ఫోన్ తీసి మీ భర్త మృతి చెందినట్లు తెలియజేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబానికిపెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే... కాపుపల్లెకు చెందిన దేరంగుల చిన్న వెంకటరమణ, సావిత్రి దంపతుల చిన్న కుమారుడు కృష్ణంరాజు మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మూడేళ్ల క్రితం మానసా అనే యువతిని కృష్ణంరాజు ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఏడాదికే పాప దివ్యశ్రీ జన్మించడంతో కుటుంబానికి అదనపు సంపాదన కోసం కువైట్‌కు వెళ్లాడు. అక్కడ రూ.3 లక్షలు నగదు, కొంత బంగారం , కొన్ని వస్తువులు తీసుకున్నట్లు కృష్ణంరాజు తెలిపినట్లు భార్య తెలిపింది. ఉన్నట్లుండి మరణవార్త వినగానే భార్య మానస, తల్లి సావిత్రి, కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని కటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. విలపిస్తున్న మృతుడి తల్లి -
శారదా పీఠాన్ని సందర్శించిన కృష్ణంరాజు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ శారద పిఠంలో ఘనంగా నిర్వహిస్తున్న శారదపీఠం వార్షిక ఉత్సవాలు చివరి రోజుకు చేరాయి. నేటితో(శనివారం) ముగియనున్న ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ సమేతంగా శారదపిఠాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆయన దంపతులు పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులను కృష్ణంరాజు అందుకున్నారు. కాగా శాస్త్ర మహాసభలతో ముగించనున్న ఈ ఉత్సవాల్లో రాజశ్యామల యాగం, నివాస చతుర్వేద హావనం యాగాలను నిర్వహించనున్నారు. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ప్రముఖ భాగవతులు విఠల్దాస్, మహరాజ్ బృందంతో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. -
కృష్ణంరాజు @ 80
సోమవారంతో 80వ వసంతంలోకి అడుగుపెట్టారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు. ఈ బర్త్‌డేను కుటుంబ సభ్యులు, సినిమా పరిశ్రమలో ఉన్న ఆప్తుల మధ్య జరుపుకున్నారాయన. ఈ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగింది. ఈ వేడుకకు మోహన్‌బాబు, చిరంజీవి, విçష్ణు, లక్ష్మీ హాజరయ్యారు. పెదనాన్న పుట్టినరోజు వేడుకలో ప్రభాస్ సందడి చేశారు. ప్రభాస్, చిరంజీవి కృష్ణంరాజు, ప్రభాస్ కృష్ణంరాజు, మోహన్‌బాబు, ప్రభాస్ ప్రభాస్, విష్ణు మంచు -
కృష్ణంరాజు బర్త్‌డే వేడుకల్లో తారలు..
రెబల్‌స్టార్ కృష్ణంరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తోపాటు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుటుంబసభ్యులతోపాటు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా సరదాగా గడిపారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన లక్ష్మి.. ‘ మనం ఎంత క్యూట్‌గా ఉన్నాం ప్రభాస్?’ అని అడిగారు. అయితే ఈ పార్టీకి హాజరైన మోహన్‌బాబు, ప్రభాస్, విష్ణులు బ్లాక్ డ్రెస్ కోడ్‌తో కనిపించారు. పెద్దనాన్న సినీ వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. తాజా ఫొటోలను గమనిస్తే ప్రభాస్ కొద్దిగా బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు. దీంతో ప్రభాస్ కొత్త సినిమా లుక్ ఇదేనని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
మణికొండ: మన పండుగలు, సంస్కృతి, తెలుగుభాష, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని ఓం కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న తెలుగు సంగమం సంక్రాంతి మూడవ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ, తమిళిసై ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో సినీ నటుడు కృష్ణంరాజు దంపతులు, సినీగేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. -
ఓటమి అనేది నా జీవితంలోనే లేదు
‘‘గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు అంటుంటారు. ప్రభాస్ కూడా అలాంటివాడే. నేను హీరోగా తెలుగు, తమిళ, కన్నడ మలయాళ పరిశ్రమల్లో గుర్తింపు సంపాదిస్తే, ప్రభాస్ ఏకంగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు’’ అన్నారు కృష్ణంరాజు. రేపు (జనవరి 20) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు కృష్ణంరాజు. సతీసమేతంగా కేక్ కట్ చేసిన అనంతరం కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘అందరికీ ఏదో ఓ వ్యసనం ఉంటుంది. నాకు స్నేహితుల్ని చేసుకోవడం వ్యసనం. ఫ్రెండ్స్‌ని చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. మా నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ‘బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమరదీపం, మనవూరి పాండవులు’ వంటి సినిమాలు చేశా. ‘తాండ్రపాపారాయుడు’ సమయంలో 5వేల మందితో యుద్ధ సన్నివేశాలు తీశాం. అంతమందితో చిత్రీకరించడంతో నా బలం, నాలోని శక్తి తెలిసింది. ఇప్పుడు మా బ్యానర్లో ప్రభాస్ కొత్త చిత్రం వస్తుంది. 3 నెలలపాటు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తాం. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. నేను ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ప్రతి తండ్రి తన కొడుకు ఎదగాలనుకుంటాడు తప్ప తనయుడి చేతిలో ఓడిపోవాలని కోరుకోడు. నేను కూడా అంతే. ఈ కృష్ణంరాజు ఓటమిని ఎప్పుడూ అంగీకరించడు (నవ్వుతూ). ఎందుకంటే ఓటమి అనేది నా జీవితంలోనే లేదు’’ అన్నారు. అనంతరం తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కష్ణంరాజుని సత్కరించింది. -
ఎల్వీ ప్రసాద్ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను – కృష్ణంరాజు
‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపాదించిన ప్రతి పైసా సినిమా పరిశ్రమ ఎదుగుదలకి, సినిమా ఇండస్ట్రీపై గౌరవం రావడానికి ఖర్చు చేశారు. ఆయనతో నాకు ఉన్న అనుబంధమే నన్ను ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది’’ అన్నారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు ఎల్వీ ప్రసాద్ 112వ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘అప్పట్లో నేను నటించిన ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఆ సమయంలో సినీ పరిశ్రమ వదిలేసి వెళ్లిపోదామనుకున్నాను. అప్పుడే ‘నేనంటే నేనే’ అనే సినిమా కోసం డూండీగారు నన్ను సంప్రదించారు. ఈ సినిమాలో ఉన్న మూడు పాత్రల్లో ఒకటి కృష్ణగారు, మరొకటి నాగభూషణంగారు చేస్తున్నారని చెప్పారు. ఇంకో పాత్ర కోసం నన్ను అడిగారు. అయితే ఆ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్న కారణంగా ఆ సినిమా చేయకూడదనుకున్నాను.ఓ సందర్భంగా ఎల్వీ ప్రసాద్‌గారిని కలిసినప్పుడు ఆయనకు ఈ విషయం చెప్పాను. ‘సినిమాలో నువ్వు హీరోవా? విలన్‌వా? అని కాదు. ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఎంత చేరువ అవుతావు అన్నదే ముఖ్యం’ అని ఆయన నాకు హితబోధ చేశారు. దాంతో నేను ‘నేనంటే నేనే’ చిత్రంలో నటించాను. ఆ చిత్రం విజయవంతమైంది. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు దోహదపడిన ఎల్వీ ప్రసాద్ గారికి రుణపడి ఉంటాను. వారి కుటుంబంతో కూడా నాకు మంచి సాన్నిహిత్యం ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ‘‘నా జీవితంలో మా నాన్నగారితో నేను గడిపిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలే. ఆయన అంతగా చదువుకోలేదు. ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన అంకితభావం చాలా గొప్పది. ఆ అంకితభావంతోనే అన్ని భాషలు మాట్లాడటం నేర్చుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నేను టెక్నికల్వైపు మారాను. ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటేడ్ బ్యానర్‌పై మా నాన్నగారు ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. తన సినిమాలు చూసి తనను గొప్పవాడిని చేసిన ప్రజలకు మంచి చేయాలని ఓ ట్రస్ట్‌ను స్థాపించారు. సినిమాల ద్వారా వచి్చన కోటి రూపాయలను డొనేషన్‌గా ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఎలీ్వప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాలు రావడానికి మా సపోర్ట్‌ను కంటిన్యూ చేస్తాం’’ అన్నారు ఎలీ్వ ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్. ‘‘ఎల్వీ ప్రసాద్‌గారి జయంతి సందర్భంగా ప్రసాద్ సురేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్లో శిక్షణ పొందినవారికి గోల్డ్ మెడల్స్‌తో ప్రీ కాన్వకేషన్ ప్రదానం చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రసాద్ సురేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి. ‘‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో మహామహా నటులు ఎల్వీ ప్రసాద్‌గారి సినిమాల ద్వారా పరిచయమయ్యారు. అటువంటి ఆయనకు చెందిన ఈ ఫంక్షన్‌కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. ఈ వేడుకలో కృష్ణంరాజు సతీమణి శ్యామల, రమేష్ ప్రసాద్ కుమార్తె రాధ పాల్గొన్నారు. -
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి జగన్ భరోసా ఇచ్చారు
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిగారిని నేను కలిసినప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది. తెలుగు పరిశ్రమ అభివృద్ధికి ఏం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. నంది అవార్డులు గత రెండేళ్లుగా ఇవ్వకుండా ఆపేశారు.. వాటిని మళ్లీ అందివ్వాలని కోరాను. అందుకు ఆయన ‘చెప్పండి అన్నా.. మీరందరూ అనుకుని చెబితే తిరిగి ప్రారంభిద్దామని సుముఖంగా స్పందించారు’’ అన్నారు చిరంజీవి. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’(మా) 2020 డైరీ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, టీఎస్సాయర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ– జగన్ గారితో ‘సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు?’ అని అడిగితే.. ‘ఆ శాఖని ఇంకా కేటాయించలేదు. త్వరలో పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్‌కి లేక మరొకరికి కేటాయిస్తాను. సంబంధిత శాఖ కార్యదర్శిని మీ వద్దకు పంపిస్తా.. ఎలా చేద్దాం ఏంటన్నది మీరందరూ మాట్లాడండి’ అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. జగన్‌గారికి చిత్ర పరిశ్రమకు ఎంతో చేయాలని ఉంది. అయితే వారు వెళుతున్న విధానంలోకి మనలాంటి వాళ్లు వెళితే కానీ ఒక రూపం రాదనుకుంటున్నా. మోహన్‌బాబు, మురళీమోహన్గార్లు, నేను... మరికొందరు కలిసి వెళ్లి మార్చికో, ఉగాదికో ‘నంది’ అవార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అదే విధంగా ‘చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా చేస్తాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు చెప్పారు. ‘మా’ సంఘానికి 3 ఎకరాలు స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సాయంతో చిత్ర పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఏకాభిప్రాయంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి తెలుగు ఇండస్ట్రీకి, ‘మా’కి మంచి పేరు తీసుకురావాలి. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోదాం. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం. ‘మా’లో గతంలో పెద్దగా విభేదాలు లేవు. కానీ మాకంటే ఎక్కువ సేవ చేయాలనే కసితో ప్రస్తుత బాడీ ఉంది. దానివల్ల కొన్ని విభేదాలు తలెత్తాయి. వాటిని సమన్వయం చేసుకుందాం. స్వలాభం కోసం కాకుండా కళామతల్లి గర్వపడే బిడ్డలుగా ముందుకు వెళ్లాలి’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘అసోసియేషన్ అంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి.. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ‘మా’ గురించి ఎవరూ బయట మాట్లాడకూడదు. ‘మా’ గౌరవాన్ని నిలబెట్టాలి’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కళాకారులను గౌరవించి, సాయం చేసే టి.సుబ్బరామిరెడ్డిగారిలాంటి గొప్ప వ్యక్తి ముందు నేడు ఇలాంటి గొడవలు జరగడం బాధాకరం. భగవంతుడి సాక్షిగా నాకు, చిరంజీవికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నా కుటుంబమే ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే నా కుటుంబం. ‘మా’లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవం. ‘మా’ ఎవడి సొత్తు కాదు. సవాళ్లు చేసుకోవడం మానేసి కలిసి పనిచేద్దాం’’ అన్నారు. ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ – ‘‘మార్చిలో జరిగిన ‘మా’ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ అసోసియేషన్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో సినిమా కూడా చేయలేకపోయాను. ‘మా’ కోసం చాలా మెంటల్ టెన్షన్‌తో వర్క్ చేస్తున్నందుకు మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. వాటివల్లే ఇటీవల నా కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. ‘మా’లో ఉన్నవి చిన్న చిన్న సమస్యలే కాబట్టి సర్దుకుపోయి పని చేయాలని చిరంజీవిగారు చెప్పడం సంతోషమే. కానీ ‘మా’లో పెద్ద గొడవలున్నాయి. నిప్పును కప్పిపుచ్చితే పొగ రాకుండా ఉండదు. రీల్ లైఫ్‌లోలా రియల్ లైఫ్‌లోనూ హీరోలా పని చేద్దామంటే కొందరు నొక్కేస్తున్నారు.. తొక్కేస్తున్నారు’’ అన్నారు. ‘‘రాజశేఖర్గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఆయన మాటలకు క్షమాపణ కోరుతున్నా’’ అన్నారు జీవిత. అందుకే రాజీనామా చేశా – రాజశేఖర్ గురువారం ఉదయం ‘మా డైరీ’ ఆవిష్కరణ అనంతరం సాయంత్రం రాజశేఖర్ ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా ఓ ప్రకటన ద్వారా వివరించారు. ‘‘మా’ అసోసియేషన్‌కు ఎంతో మంచి చేయాలనుకున్నాను. కానీ ‘మా’ ప్రెసిడెంట్ నరేశ్‌గారు కమిటీ సభ్యులను కించపరుస్తూ, తక్కువ చేస్తూ వస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించుకొని ముందుకువెళ్లాలని నా వంతు కృషి చేశాను. కానీ నరేశ్‌గారు పారదర్శకతను మరిచి తనకు నచ్చిన విధంగా నడుచుకుంటున్నారు. ‘మా’ డైరీ వేడుకలో నరేశ్‌గారు మాట్లాడింది ఏదీ కమిటీ సభ్యులతో చర్చించలేదు. జీవితకు వాట్సాప్ మెసేజ్ మాత్రం పంపారు. ఇండస్ట్రీ పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో మాకున్న విభేదాలను చర్చించాం. కానీ ఆయనలో మార్పేం లేదు. అందుకే ఈ రోజు వేడుకలో నా ఎమోషన్స్ బయటపెట్టాను. నేను చాలా సున్నితమైన మనిషిని. ముక్కుసూటిగా వ్యవహరిస్తాను. నరేశ్‌గారు వ్యవహరిస్తున్న తీరు నచ్చడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నా ఎమోషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటారనుకుంటున్నా’’ అని రాజశేఖర్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ‘మా’ వేడుకలో ఆత్మీయంగా మోహన్‌బాబు, చిరంజీవి చదవండి: హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి ‘మా’ విభేదాలు.. స్పందించిన జీవితా రాజశేఖర్ ‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం నాకు పదవీ వ్యామోహం లేదు -
ఆ క్రెడిట్ రెబల్స్టార్దా? శ్యామలదా?!
పెళ్లయి ఇరవై మూడేళ్లయింది. అప్పుడే తీసి కడిగిన పెళ్లి ఫొటోలా ఫ్రెష్‌గా ఉన్నారు! ఇన్నేళ్ల బాధ్యతలు, ఒత్తిళ్లు, పిల్లల పెంపకం.. ఇవేవీ.. వీళ్ల అనురాగ బంధాన్నిచెక్కు చెదరనివ్వలేదా! ‘‘ఎందుకు చెదరనిస్తాయి?’’ అని అడుగుతున్నారు ఈ దంపతులు. క్రెడిట్ ఎవరిది? రెబల్స్టార్దా, శ్యామలగారిదా?! ‘‘చిన్నచిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుంటే.. ఆ క్రెడిట్ ఇద్దరిదీ అవుతుంది’’ అని అంటున్న మిస్టర్ అండ్ మిసెస్ కృష్ణంరాజుతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఈ సండే మీకోసం. ఇటీవల కృష్ణంరాజుగారికి ఆరోగ్యం బాగాలేదని విన్నాం.. ఏం జరిగింది? శ్యామల: ఏం లేదు.. జస్ట్ వైరల్ ఫీవర్. దానికే ఎవరికి వాళ్లు ‘క్రిటికల్’ అని ఊహించుకున్నారు. మనిషి బాగున్నప్పుడు అలా అనుకుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. కృష్ణంరాజు: ఆ బాధ, కోపంతోనే నేను గన్ షూట్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోను తను సోషల్ మీడియాలో పెట్టింది. అనవసరమైన గాసిప్పులు ప్రచారం చేస్తే షూట్ చేస్తానని అర్థం (నవ్వులు). మరి... పెళ్లి రోజుని (నవంబర్ 20) ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? శ్యామల: వైరల్ ఫీవర్ అని చెప్పాను కదా. అందుకని ఇంట్లోనే చేసుకున్నాం. మామూలుగా అయితే లంచ్‌కో, డిన్నర్‌కో బయటకు వెళతాం. పిల్లలు మంచి హోటల్స్‌లో మాకోసం పార్టీ ఎరేంజ్ చేస్తారు. మీ పెళ్లయి 23 ఏళ్లు అట కదా... ఇన్నేళ్ల వైవాహిక జీవితం గురించి... కృష్ణంరాజు: ఇన్నేళ్లయిందా అనిపిస్తోంది. రోజులు అంత వేగంగా వెళ్లిపోయాయనిపించింది అంటే జీవితం హ్యాపీగా ఉన్నట్లే. ఒక మంచి కలలా సాగిపోతోందంటే.. మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కారణం. కోపాలు ఎవరికైనా ఉంటాయి. అలా కోపం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుకోం. కోపం తగ్గి, కొంత గ్యాప్ ఇచ్చాక మాట్లాడుకుంటాం చూడండి.. అది మాత్రం భలే ఉంటుంది. పెళ్లి రోజుకి కానుకలు ఇచ్చుకుంటారా? శ్యామల: కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్. నేనేం కొనుక్కున్నా కాదనరు. నేను పెట్టుకునే నగలు, కట్టుకునే చీరలు అన్నీ ఆయన కొనేవే. అన్నింటికీ మించి ఆయనే నాకు పెద్ద బహుమతి. మరి.. శ్యామలగారు ఇచ్చిన బహుమతుల గురించి? కృష్ణంరాజు: నేను ‘మెటీరియల్ గిఫ్ట్’లని నమ్మను. తనే నాకు గిఫ్ట్. శ్యామల: నేను మాత్రమే కాదు.. బుద్ధిమంతులైన ముగ్గురు పిల్లలను గిఫ్ట్‌గా ఇచ్చా(నవ్వుతూ). కృష్ణంరాజుగారికి మీరు అభిమాని. అభిమాన హీరోతో పెళ్లి విశేషాలు చెబుతారా? శ్యామల: పెళ్లిరోజున కృష్ణంరాజుగారి వైపు తలెత్తి చూడాలంటే వణుకు. అలా తలొంచుకుని కూర్చున్నాను. ఎలాగో ధైర్యం కూడదీసుకుని ముందు కాళ్ల నుంచి మెల్లిగా చూసుకుంటూ ముఖం చూశాను. నాకసలు కలా? నిజమా? అర్థం కాలేదు. పెళ్లికి ముందు రోజు విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చాం. మాకు మంచి విడిది ఏర్పాటు చేశారు. నాకు చిన్నప్పటినుంచీ జామకాయలంటే ఇష్టం. విడిదింట్లో జామచెట్టు ఉంది. నేను వెళ్లి కోసుకుంటుంటే ‘పెళ్లి కూతురివి.. అలా కొయ్యకూడదు’ అని అమ్మ మందలించింది. మీ మీద ‘రెబల్ స్టార్’ ట్యాగ్ ఉంది. మీ ఆహార్యం చూస్తేనే వణుకు సహజం. మరి.. శ్యామలగారికి మీరు ధైర్యం చెప్పారా? కృష్ణంరాజు: ఏం భయపడొద్దు అన్నాను. శ్యామల: వీళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ. అందుకని అమ్మ భయపడింది. అంతమందిలో నేను ఇమడగలుగుతానా లేదా అని భయం. కానీ కృష్ణంరాజుగారు నాతో ‘ఎవరో ఏదో అంటారని నువ్వు భయపడొద్దు. ఏ పని చేసినా చక్కగా చెయ్’ అని బాగా ధైర్యం ఇచ్చారు. మరి.. పెళ్లి చూపుల గురించి? శ్యామల: వాళ్ల కజిన్‌ని పంపించారు. అమ్మాయిని బలవంతంగా ఒప్పించి, పెళ్లి చేస్తున్నారా? ఇష్టపడే చేసుకుంటుందా? అడిగి తెలుసుకోమన్నారు. ‘నాకిష్టం’ అని చెప్పాను. ఆయన కజిన్ వచ్చేసరికి మా ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నాను. ‘నేను వెళ్లేసరికి వదినగారు పిల్లలతో ఆడుకుంటున్నారు’ అని ఆయన చెబితే, ‘అయితే ఓకే.. మనస్తత్వం కూడా పిల్లల్లానే ఉంటుంది. మంచిదే’ అని నా ఫొటో చూసి, ఓకే చేశారు. కృష్ణంరాజుగారి మొదటి భార్య చనిపోయాక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు... బాగా చూసుకుంటారో లేదోననే డౌట్ ఏమైనా ఉండేదా? శ్యామల: అస్సలు లేదు. ఆయన మంచితనం గురించి ముందే మాకు తెలుసు. ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరుంది. అయితే పెద్ద ఫ్యామిలీలో ఇమడగలనా? అనే భయం అమ్మకి ఉండేది. కానీ నేను వచ్చిన కొన్నాళ్లకే అందరికీ దగ్గరయ్యాను. ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది? కృష్ణంరాజు: బేసిక్‌గా నా అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. వారి అభిప్రాయాలను తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా నడుచుకుంటాను. ఒకరి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే అండర్స్టాండింగ్ ఉండదు. తన విషయంలోనే కాదు.. నా పిల్లల విషయంలోనూ నేను అంతే చేస్తాను. ముందు వాళ్లేమనుకుంటున్నారో వింటాను. ఒక్కరి మాటే నెగ్గాలనుకోం. పిల్లలను నమ్మాలి. వాళ్లు ఎక్కడికెళ్లినా ప్రశ్నలు అడగడం, ఇంటికొచ్చాక ఎక్కడికెళ్లావని అడుగుతుండడం వల్ల ఎలాగూ అమ్మానాన్న మనల్ని నమ్మడం లేదు.. చేస్తే ఏం పోతుందిలే అన్నట్లుగా పిల్లల మనస్తత్వం మారుతుంది. ఆ స్కోప్ ఇవ్వకూడదు. శ్యామల: మనం నమ్మితే పిల్లలు ఆ నమ్మకాన్ని నిలబెడతారన్నది మా ఇద్దరి అభిప్రాయం. కృష్ణంరాజు: ‘జీన్స్’ అంటారు కదా.. అది నిజమే. ఆ ఫ్యామిలీ తాలూకు జీన్స్ పిల్లలకు కచ్చితంగా వస్తాయి. నా చిన్నప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే నన్ను పిలిచి ‘మన కుటుంబం ఇలాంటిది. మన పూర్వీకులు ఇలాంటివారు’ అని చెబితే, నా మనసులో నాటుకుపోయింది. మా నాన్నగారు ఎన్నో వందల కుటుంబాలను ఆదుకున్నారు. ఓసారి వరద వస్తే.. ఆ ఊరి చుట్టూ గట్టు కట్టించారు. వరద నీళ్లు ఇళ్లల్లోకి వస్తే.. ఆ ఊళ్లో ఉన్నవాళ్లను మా ఇంట్లోనే ఉండమని, వాళ్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్, మేలో కొంతమందికి పనులు ఉండేవి కాదు. వాళ్లకు బస్తాలు బస్తాలు బియ్యం ఇచ్చేవారు. పని చెప్పాలి కదా అని ఏదో పని చెప్పేవారు. అయితే ఎంతమందికి చెబుతారు. అందుకని పని చెప్పలేనివాళ్లకు కూడా సహాయం చేసేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. అవన్నీ తెలిసిన వ్యక్తిగా నాకూ సహాయం చేయడం అలవాటైంది. అలాగే కుటుంబ పరువుకి నష్టం కలగకూడదనేది డెవలప్ అయింది. అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పినట్లుగా ఇప్పుడు నేను నా పిల్లలకు చెబుతుంటాను. అలాగే మా నాన్నగారికి ఉన్న సహాయ గుణం నాకు వచ్చినట్లుగా నా పిల్లలకూ వచ్చింది. ‘కుటుంబ గౌరవం’ అనే విషయాన్ని నా పిల్లలు కూడా తెలుసుకున్నారు. పిల్లలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తిలతో కృష్ణంరాజు దంపతులు మీకు ముగ్గురు ఆడపిల్లలు... చదువుల విషయంలో, ఇతర వ్యక్తిగత విషయాల్లో వాళ్లకు మీరు ఇస్తున్న గైడెన్స్ గురించి? కృష్ణంరాజు: మా అమ్మాయిలు ఎప్పుడైనా డౌన్ అయితే ‘యు ఆర్ కృష్ణంరాజుస్ డాటర్.. యు ఆర్ గ్రేట్. డోంట్ వర్రీ. భయపడొద్దు. మీ గురించి ఎవరో ఏదో చెబుతారని అనుకోవద్దు. నేను నమ్మను’ అని చెబుతుంటాను. అలా నమ్మి పెంచడంవల్ల ముగ్గురూ చదువులో బెస్ట్. మా పెద్దమ్మాయి సాయిప్రసీద లండన్‌లో మెరిట్ మీద ఎంబీఏ సీట్ సంపాదించుకుంది. ఇప్పుడు ప్రొడక్షన్ వైపు రావాలనుకుంటోంది. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ప్రొడక్షన్ కోర్స్ చేస్తోంది. చిన్న పాప సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుతోంది. మంచి పర్సంటేజ్ రావడంతో జేఎన్టీయులో సీట్ వచ్చింది. ఇంకో దాంట్లో కూడా వచ్చింది. తను బొమ్మలు బాగా గీస్తుంది. వాళ్ల ప్రభాస్ అన్నయ్య బర్త్‌డేకి బొమ్మ గీసి ఇస్తుంది. మూడోపాప సైకాలజీ చదువుతానంది. సరే.. మూడు నాలుగు లక్షలు డొనేషన్ కడతా అన్నాను. ఒకరోజు వచ్చి ‘నా మూడు లక్షలు నాకు ఇవ్వండి’ అంది. ఏంటని అడిగితే ‘నాకు మేనేజ్మెంట్ కోటా అక్కర్లేదు.. ఇదిగో నేను మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాను. సీట్ నేనే తెచ్చుకుంటా. డొనేషన్ కట్టాలనుకున్న డబ్బు నాకివ్వండి’ అంది. తండ్రి పేరుని వాడుకోవడం తప్పు కాదు. అయితే వాళ్లంతట వాళ్లు సీట్ సంపాదించుకోవాలనుకున్నారు. నటుడిగా నేను చాలా గొప్పవాడిని అయ్యుండొచ్చు. కానీ వ్యక్తిగా కూడా నాకు చెడ్డ పేరు లేదనే అనుకుంటాను. గౌరవంగా బతకాలన్నది నా అభిప్రాయం. పిల్లలు కూడా అదే అనుకుంటారు. పిల్లలు ఇంత చక్కగా పెరగడంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది? కృష్ణంరాజు: తన పాత్రే ఎక్కువ ఉంటుంది. నిద్ర లేచిన దగ్గర్నుంచి వాళ్లకి ఏం కావాలి? ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే చదువుకోగలుగుతారు? ఇలా అన్నీ తనకు తెలుసు. తనకి నాతో కలిపి మొత్తం నలుగురు పిల్లలు. మరి.. ముగ్గురు అమ్మాయిలను పెంచడం కష్టంగా ఉందా? బాబునా? శ్యామల: (నవ్వుతూ).. నాకు ఈయన్ని పెంచడమే చాలా ఇష్టం. కంటికి రెప్పలా చూసుకుంటాను. పిల్లలు పుట్టాక చాలామంది భర్త మీద ప్రేమ తగ్గిందని, శ్రద్ధ తగ్గిందని అంటారు. కానీ నాకు మాత్రం ముందు ఆయనే. ఆయన్ను చూసుకుంటూ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను. పిల్లల సెలవులప్పుడే నేను గుడికి వెళుతుంటాను. ఆ సమయంలో వాళ్ల నాన్న దగ్గర పిల్లల్ని పెట్టి నేను పూజలకు వెళతాను. ఒంటరిగా ఆయన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను. మీ పుట్టింటికి కూడా వెళ్లలేదా? మీ అత్తింటివాళ్లు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? శ్యామల: వెళ్లాలన్నా ఆ టైమ్‌కి ఎవరైనా ఆయన దగ్గర ఉంటేనే వెళతాను. అది కూడా ఒకటీ రెండు రోజులు మాత్రమే. మా పెళ్లికిముందు మా మామయ్యగారికి నేను కలలో కనిపించానట. ఆ అమ్మాయే మన ఇంటికి కోడలిగా వస్తుందని అన్నారట. నేను అత్తింటికి రాగానే ‘నాకు కలలో కనిపించిన అమ్మాయి తనే. నా కొడుకుని బాగా చూస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అన్నారు. అత్తింట్లో ప్రేమకు లోటు లేదు. కృష్ణంరాజుగారికి అందరి ఆకలి తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. ఆ విషయంలో అత్తింట్లో వాళ్లకి భార్య ఎలా చూస్తుందో అని కాస్త టెన్షన్ ఉండేది. కానీ నేను వచ్చి, చూసుకోవడం మొదలుపెట్టాక ఆ టెన్షన్ పోయింది. (మధ్యలో కృష్ణంరాజు అందుకుంటూ).. మా అమ్మ అయితే చాలా టెన్షన్ పడేది. ఆకలైనా చెప్పేవాడిని కాదు. నీరసం వచ్చి అలా నిద్రపోయేవాడిని. అందుకని వాడు అడగడు.. మనమే పెట్టాలని పెట్టేది. ఇప్పుడు ఈవిడ అలానే పెడుతుంది. మరి.. షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఎలా? శ్యామల: ఆయన కోసం పని చేసేవాళ్లను కూడా ట్రైన్చేసి పెట్టాను. ‘సార్ అడగరు.. మధ్యలో మీరే అడుగుతూ ఉండండి’ అని చెప్పాను. వాళ్లు కూడా అలానే చేస్తారు. కృష్ణంరాజుగారు భోజనప్రియుడు.. మీరు చేసే వంటల్లో ఆయనకు బాగా నచ్చినవి? శ్యామల: అన్నీ ఇష్టమే. ముఖ్యంగా నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. అయితే ఇంతకుముందుకన్నా ఇప్పుడు తక్కువ తింటున్నారు. ఈ మధ్య ఎవరో ‘ఏంటి సార్.. మరీ తక్కువ తింటున్నారు?’ అని అడిగితే ‘మేం ఏడుజన్మలకు సరిపడా తినేశాం’ అన్నారు (నవ్వులు). ఆయనకు పెసరట్టు అంటే ఇష్టం. వాళ్ల పెద్దక్కగారు బాగా చేసేవారు. ఆవిడ దగ్గర్నుంచి ఆయన నేర్చుకుని, నాకు నేర్పించారు. ఆయన చేపల కూర కూడా మీరు వంట ఎలా నేర్చుకున్నారు? కృష్ణంరాజు: నేను వేటకు వెళ్లేవాడిని. పచ్చ పావురాలు అని ఉండేవి. చాలా రుచిగా ఉంటాయి. పొద్దున్నే అవి వేటాడి తీసుకు వస్తే.. అక్కడే అడవిలో వండి పెట్టేవాళ్లు. కొండ గొర్రె అంటారు. అది కూడా బాగుంటుంది. లంచ్‌కి కొండ గొర్రె. ఒక్కోసారి పులి గాండ్రింపులు వినపడినప్పుడు వంట చేసేవాళ్లు భయపడి పారిపోయేవాళ్లు. అప్పుడు నేనే వంట చేసేవాడిని. అయితే నాకు అన్నం వార్చడం వచ్చేది కాదు. రెండు మూడు సార్లు చేతులు కాల్చుకున్నాను కూడా. రామారావుగారు నిషేధం విధించాక వేట మానేశాను. ఎప్పుడైనా పులిని వేటాడారా? కృష్ణంరాజు: లేదు. అయితే నా వెనకాల నుంచి ఒక్క పరుగుతో ముందుకు వెళ్లింది. పులి మహా పిరికి. తననెవరైనా ఎటాక్ చేస్తారనే అనుమానం కలిగితేనే అది ఎటాక్ చేస్తుంది. లేకపోతే చేయదు. శ్యామల: మీకు ఓ పులి ఫ్యాన్ కదా.. కృష్ణంరాజు: అవును. ఒక పులి ఉండేది. ‘కటకటాల రుద్రయ్య’ కోసం ఆ పులిని తీసుకొచ్చారు. అది గాండ్రించడం మొదలుపెట్టింది. నేను దాని మెడ దగ్గర మెల్లిగా అలా నిమురుతూ మచ్చిక చేసుకున్నాను. ఆ పులితో నాకు ఫైట్‌సీన్ ప్లాన్ చేశారు. అంతకుముందు నేను దాని మెడ పట్టుకుంటే విసిరి కొట్టింది. అంతదూరం పడ్డాను. అయితే మచ్చిక చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీ అయిపోయింది. నేను దాని మెడ పట్టుకుంటే అది అలా చూస్తూ ఉండిపోయింది. చివరికి మేమే అది ఫైట్ చేసినట్లు మ్యానిపులేట్ చేశాం (నవ్వుతూ). అదే పులిని ఏడాది తర్వాత వేరే సినిమా కోసం తీసుకొస్తే.. నన్ను గుర్తుపట్టేసి, ఫ్రెండ్లీ అయిపోయింది. లాభం లేదని దాన్ని పంపించేసి, వేరే పులిని తీసుకొచ్చి, ఫైట్ సీన్ తీశాం. మీ విషయాలు వింటుంటే భలే ఉంది... ఫైనల్లీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్‌కి కొన్ని టిప్స్? ఇద్దరూ: ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకుంటున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయితే పెళ్లయ్యాక కొంతమంది మగపిల్లలు మారిపోతున్నారు. ఆంక్షలు పెడుతున్నారు. ఫ్రెండ్లీనెస్ పోతోంది. అది తప్పు. అది తెలుసుకోలేక గొడవలు పడి విడిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి కొన్ని జంటలు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటున్నట్లు ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య ఆ పోటీ తప్పు. ఇద్దరూ సమానం అనుకోవాలి. అలాగే ‘ఈగో’ సమస్యలు ఒకటి. కొంచెం మనసు పెట్టి ఆలోచించి, చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉంటే కాపురం హాయిగా ఉంటుంది. – డి.జి. భవాని మీ ఇంటి నుంచి వేరే సెలబ్రిటీల ఇంటికి క్యారేజ్‌లు వెళుతుంటాయట కదా? శ్యామల: వెళుతుంటాయి. వస్తుంటాయి కూడా. కృష్ణంరాజుగారి కోసం షూటింగ్ లొకేషన్‌కి భోజనం తీసుకెళ్లేదాన్ని, మొత్తం యూనిట్‌కి సరిపడా పట్టుకెళ్లేదాన్ని. చిరంజీవిగారి ఇంట్లో దోసెలు బాగుంటాయి. ఆ మధ్య చిరంజీవిగారిని కలిసినప్పుడు ఆ మాట అంటే.. ‘అన్నయ్యా.. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ ఎన్నింటికి చేస్తావో చెప్పు.. ’ అని అడిగి, ఒక ఆదివారం దోసెలు, రెండు రకాల చట్నీలు పంపించారు. ఎంజాయ్ చేస్తూ తిన్నాం. సురేఖ (చిరంజీవి సతీమణి) గారు అంత బాగా చేస్తారు. మా ఇంట్లో బిర్యానీ చేసి, ఆవిడ పంపిన క్యారియర్‌లో పెట్టి పంపించాం. చిరంజీవిగారు మధ్యాహ్నం తిని, సాయంత్రం కూడా తింటానని ఉంచమన్నారట. ఆ మధ్య మోహన్బాబుగారింట్లో జరిగిన పార్టీకి వెళ్లినప్పుడు చిరంజీవిగారు ఆ విషయం చెప్పారు. ప్రభాస్ గురించి? శ్యామల: మా ఆయన్ను ‘పెద్ద బాజీ’ అని బాబు పిలుస్తాడు. నన్ను ‘కన్నమ్మా’ అని పిలుస్తాడు. ప్రభాస్ మాకు కొడుకే. ఇప్పుడు మా ప్రభాస్ ఏమంటాడంటే.. ‘ఇన్నేళ్లు కష్టపడ్డారు. ఇప్పుడు మీరు సుఖపడాలి. మిమ్మల్ని మేం హ్యాపీగా చూడాలి’ అని వాళ్ల పెదనాన్నతో అంటాడు. పెదనాన్న అంటే.. ఆయనకు సుప్రీమ్ అన్నమాట. అంత ప్రేమ. చెల్లెళ్లతో కూడా చాలా ప్రేమగా ఉంటాడు.