
‘70ల నాటి కాలాన్ని మరోసారి చూసొద్దాం’ అంటున్నారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు కృష్ణంరాజు. ‘రాధేశ్యామ్’ షూటింగ్ లొకేషన్ లో ప్రభాస్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారాయన. ‘జూలై 30న ఈ సినిమా చూస్తూ కాలంలో వెనక్కి వెళ్దాం’ అని క్యాప్షన్ చేశారు. 1970లో జరిగే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీ ఇది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక.
ఇక సినిమా ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూలై 30న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమా విడుదలైన పది రోజులకే అంటే ఆగస్టు 11న ప్రభాస్ మరో చిత్రం ఆదిపురుష్ విడుదల కానుండటం గమనార్హం.
చదవండి: రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు!
ప్రేమ కోసం చచ్చే టైప్ కాదంటున్న ప్రభాస్
Reminiscing the 70s with #Prabhas 🤩
— U.V.Krishnam Raju (@UVKrishnamRaju) February 16, 2021
Let’s go back in time with #RadheShyam on 30th July! pic.twitter.com/xhJD96U36i