సాక్షి, హైదరాబాద్: రెబల్‌స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.
ఇదిలా ఉంటే, ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 'కృష్ణంరాజుకు పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో సెప్టెంబర్ 5న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గతేడాది కాలుకి సర్జరీ జరిగింది. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతింది. కృష్ణంరాజుకి వెంటిలేర్‌పై చికిత్స అందించాం. అయితే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారి తెల్లవారుజామున 3.16కి ఆయన మృతి చెందారు' అని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment