Rebel Star krishnam raju
-
జనసంద్రాన్ని తలపించిన మొగల్తూరు.. సుమారు 20 మాంసాహార రకాలతో..
మొగల్తూరు: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాకతో గురువారం మొగల్తూరు జాతరను తలపించింది. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి అభిమానులు తరలిరావడంతో జాతీయ రహదారిలో తరచూ ట్రాఫిక్ స్తంభించింది. వేకువజామున హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో గ్రామానికి చేరుకున్న ప్రభాస్ ఉదయం 10 గంటల ప్రాంతంలో అభిమానులకు అభివాదం చేసేందుకు బయటకు వచ్చారు. అప్పటికే వేలాది మంది అభిమానులు కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మెస్‌లు ఏర్పాటుచేశారు. మెస్ ఆవల నుంచే ప్రభాస్, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తిలు అభిమానులకు అభివాదం చేశారు. సుమారు 50 వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారని అంచనా వేస్తున్నారు. డీఎస్పీ వీరాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20 మంది అధికారులు, 600 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పరామర్శ ప్రభాస్ కుటుంబసభ్యులను రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ట, కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పరామర్శించారు. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. కార్యక్రమంపై నిర్వాహకులను సంప్రదించగా ఎడిట్ చేసిన ఇన్పుట్లు, ఫొటోలు పంపుతామని చెప్పినా ఫలితం లేదు. పసందైన భోజనం కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి మొగల్తూరు మండలంలోని 17 గ్రామాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా నాయకులు, స్థానికులకు ఆహ్వానం అందింది. శాఖాహార, మాంసాహార భోజనాలు అందించారు. సుమారు 20 మాంసాహార రకాలు వడ్డించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దశదిన కర్మరోజు వద్దామనుకున్నా.. అందువల్లే ఈ రోజు వచ్చా: రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: గోహత్య నిషేదంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తర్వాత కాలంలో యోగి ఆదిత్యనాథ్ కూడా గోహత్య నిషేద బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారని కృష్ణంరాజు సంతాపసభలో రాజ్‌నాథ్‌సింగ్ గుర్తుచేసుకున్నారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు హాజరై ప్రసంగించారు. Joining condolence meeting in remembrance of Late Krishnam Raju Garu. https://t.co/piAGuhVpgQ — Rajnath Singh (@rajnathsingh) September 16, 2022 'కృష్ణంరాజుని నేను అన్నగారు అని సంభోధించేవాడిని. ఆయన దశదిన కర్మరోజు వద్దామనుకున్నా. కానీ షెడ్యూల బీజీ కారణంగా ఈ రోజే వచ్చాను. బాహుబలి సినిమా చూడాలని కృష్ణంరాజు కోరారు. మా ఫ్యామిలీ, కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి బాహుబలి సినిమా చూశాం. చాలా బాగుంది. ఆయన మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్, రెబల్ స్టార్. కానీ ఆయన స్వగ్రామంలో మాత్రం తాను అందరికీ సొంత వ్యక్తి. గ్రామంలో ప్రతీ ఒక్కరిని కృష్ణంరాజు గుర్తు పడతారు.. అందరినీ పేరుతో పిలుస్తారు' అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా ఏదో వెలితి ఉందన్నారు: కిషన్‌రెడ్డి) -
ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా ఏదో వెలితి ఉందన్నారు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ సొసైటీలో దివంగత సినీనటుడు కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్‌లో శుక్రవారం కృష్ణంరాజు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత విలక్షణ నటుడు కృష్ణంరాజు అని అన్నారు. అందరూ చనిపోతారు. కొంతమందే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరని పేర్కొన్నారు. 'నేను చిన్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూసాను. మర్యాదకు మారుపేరు రాజు. ప్రభాస్ కూడా కృష్ణంరాజు స్థాయికి ఎదిగాడు' అని మంత్రి తలసాని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 'కృష్ణంరాజు మరణం మా పార్టీ దురదృష్టం. కృష్ణంరాజు చనిపోగానే రాజ్‌నాథ్ సింగ్ కాల్ చేసి ప్రభాస్ నంబర్ అడిగారు. ప్రభాస్‌తో ఫోన్లో మాట్లాడినా తన మనసులో వెలితి ఉందని, వాళ్ల కుటుంబాన్ని కలుద్దామని రాజ్‌నాథ్ అన్నారు. కృష్ణంరాజు ఇటీవలే కాల్ చేసి ప్రధానిని కలవాలి అన్నారు. అల్లూరి విగ్రహం ఆవిష్కరణకు భీమవరం వస్తానని కృష్ణంరాజు అన్నారు. కృష్ణంరాజు తన ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్లడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కరోనా వల్ల వెళ్లలేకపోయారు. కల్మషం లేని వ్యక్తి కృష్ణంరాజు' అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (కృష్ణంరాజు కుటుంబానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శ) -
కృష్ణంరాజు కుటుంబానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: దివంగత సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు. అక్కడ కృష్ణంరాజు సతీమణి శ్యామల, ఆయన కుమార్తెలు, ప్రభాస్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మృతిపట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన వెంట ఉన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్) -
కృష్ణంరాజు మృతి.. ప్రభాస్ కీలక నిర్ణయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెదనాన్న, రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన తుదిశ్వస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు షూటింగ్స్‌కి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలకు కూడా చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ నెలలోనే సలార్ షూటింగ్ షెడ్యూల్ కూడా ఉంది. కానీ అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఈనెల మొత్తం షూటింగ్స్ క్యాన్సిల్ చేయమని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం. -
నన్ను నోరారా అరేయ్ అని పిలిచే నటుడు ఆయన మాత్రమే.. మోహన్‌బాబు ఎమోషనల్
సాక్షి, హైదరాబాద్: ఆత్మీయులు ఎంతో మంది దూరమైనా ఏనాడు సంతాప సభకు వెళ్లింది లేదని.. తొలిసారిగా సంతాప సభకు వచ్చానంటూ మోహన్‌బాబు ఎమోషనల్ అయ్యారు. మంగళవారం ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, మంచు విష్ణు, తమ్మారెడ్డి భరద్వాజ, సి. కల్యాణ్, జీవిత, కె.ఎస్ రామారావు, కె.ఎల్ నారాయణ, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘నన్ను నోరారా అరేయ్ అని పిలిచే నటుడు కృష్ణంరాజు. నన్ను మొట్టమొదట బెంజికారు ఎక్కించింది ఆయనే’ అంటూగుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సకల దేవతలను కోరుకుంటున్నానంటూ మోహన్‌బాబు భావోద్యేగానికి గురయ్యారు. ఇలాంటి సభలో ఏనాడు మాట్లాడుతానని అనుకోలేదని మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమని కృష్ణంరాజు తనతో చెపచెప్పారని మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. ‘ఆ రోజు నాన్నగారు వద్దన్నా.. వారించి మరీ నన్ను పోటీ చేయించారు. దాసరి గారి తర్వాత నేను అంతలా గౌరవించేది కృష్ణంరాజు గారినే. నెల రోజుల కిందట ఆయనను కలిశాను. మా అసోసియేషన్‌లో జరిగే ప్రతి పనిని పదో తేదీ కల్లా చెప్పేవాళ్లం. ఇప్పుడు ఆయన మనకు భౌతికంగా దూరమైనా సినిమాలతో చిరకాలం మనతోనే ఉంటారని' మంచు విష్ణు వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (వందల ఎకరాలు, రాజభవనం.. కృష్ణంరాజు ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా!) -
‘కృష్ణంరాజు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే వింతగా చూసేవారు!’
కరప(కాకినాడ జిల్లా): యండమూరులోని చిన్నమ్మ, చిన్నాన్నల ఇంటి వద్ద ఉండి సినీనటుడు కృష్ణంరాజు పాఠశాల విద్యనభ్యసించారు. 9, 10వ తరగతి వరకూ పెద్దాపురప్పాడు హైస్కూల్లో చదువుకున్నట్టు ప్రజలు చెబుతున్నారు. కృష్ణంరాజు మరణవార్త వినగానే యండమూరులో విషాదచాయలు అలముకొన్నాయి. కృష్ణంరాజుతో కొద్దిగా పరిచయమున్న, పెద్దలు అంబడి వీర్రాజు, షేక్ మౌలానా, వాసంశెట్టి అప్పారావు, మీసాల చక్రం, షేక్ దరియా తెలిపిన వివరాల ప్రకారం.. చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి కృష్ణంరాజు మొగల్తూరులో చదువుకునేటప్పుడు అల్లరిగా తిరుగుతున్నాడని తల్లిదండ్రులు యండమూరులో ఉంటున్న చిన్నాన్న, చిన్నమ్మలైన శ్రీకాకర్లపూడి వెంకటేశ్వరరాజు, సుభద్రాదేవి(అమ్మాజీ)ల ఇంటికి పంపించారు. యండమూరులో హైస్కూల్ లేకపోవడంతో పెద్దాపురప్పాడు హైస్కూలో చేర్పించారు. 10వ తరగతిలో ఉండగా సైకిల్‌పై వెళ్లేవారని, అప్పట్లో ఎవరూ సైకిల్‌పై వెళ్లక కృష్ణంరాజు తొక్కుకుంటూ వెళుతుంటే వింతగా చూసేవారని కొందరు తెలిపారు. ఒకసారి కబడ్డీ ఆడుతుండగా భాషా అనే కుర్రాడు కృష్ణంరాజును వీపుపై కొడితే గాయమైందని, చిన్నాన్న వెంకటేశ్వరరాజు కోప్పడడంతో అప్పటి నుంచి ఆటలాడటం మానేసినట్టు వాసంశెట్టి అప్పారావు తెలిపారు. కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన తర్వాత గ్రామానికి తీసుకొచ్చి, సత్కరించినట్టు యండమూరు వాసులు తెలిపారు. తర్వాత యండమూరులోని చిన్నాన్న, చిన్నమ్మల ఇల్లు విక్రయించగా, కృష్ణంరాజు వారి కుటుంబానికి సహాయం చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. -
కృష్ణంరాజు పార్థివదేహాన్ని మోసిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కడసారి చూపుకోసం అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌజ్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటికే ఆయన అంతియాత్ర ప్రారంభమైంది. అయితే ఆయన నివాసం నుంచి ఫామ్‌హౌజ్‌కు భౌతికకాయాన్ని తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? పార్థివదేహాన్ని మోసుకెళ్లేటప్పుడు సాధారణంగా మహిళలు ముందుకు రారు. కానీ శ్యామలాదేవి మాత్రం తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇండస్ట్రీలో ఆది దంపతులుగా పేరు సంపాదించుకున్న ఈ జంట ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసేవెళ్లేవారు. అంతేకాకుండా కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్ అని పలు సందర్భాల్లో శ్యామలా దేవి చెబుతుండేవారు. కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలా దేవి విలపించిన దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయి. చదవండి: కృష్ణంరాజు అంతిమయాత్ర.. అంత్యక్రియలకు వాళ్లకు మాత్రమే అనుమతి -
కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?
నటుడిగా, రాజకీయవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన సినీ ప్రస్థానంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన కృష్ణంరాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. ఆయన చివరగా ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రంలో నటించారు. ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు శ్యామల దేవి కంటే ముందే సీత దేవితో వివాహం జరిగింది. 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తెనె సీతాదేవి. అయితే 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. దీంతో ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండో పెళ్లి కోసం ఆయన్ని ఒప్పించారట. తర్వాత 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీరితో పాటు మొదటి భార్య కుమార్తె కూడా కృష్ణంరాజు దగ్గరే ఉంటోది. ఇక మరో అమ్మాయిని కూడా కృష్ణంరాజు దత్తత తీసుకున్నారు. అలా ఐదుగురు ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. -
పేరు మార్చేసరికి ‘కృష్ణంరాజు’కు ఏ పని చేసినా కలిసొచ్చేది కాదట..
కృష్ణంరాజుకి శివుడు అంటే ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.. కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ). ►మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. ►దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. -
కృష్ణంరాజు చనిపోతే ఇలా చేయడానికి సిగ్గు లేదా?ఆర్జీవీ ట్వీట్ వైరల్
టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని అభిమానులు షాక్‌కి గురయ్యారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా కృష్ణంరాజు మృతికి నివాళిగా టాలీవుడ్లో షూటింగ్‌లు ఆపకపోవడంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకు నా జోహార్లు సిగ్గు సిగ్గు’ అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.ఆయనకు వీడ్కోలు ఇవ్వకపోవడం మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది అని రాంగోపాల్ వర్మ ద్వజమెత్తారు. 'మనసు లేకపోయినా ఓకే..కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు! — Ram Gopal Varma (@RGVzoomin) September 11, 2022 -
ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్న కృష్ణంరాజు.. కానీ!
కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో కృష్ణంరాజుది సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్. అయితే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముఖ్యకారణం ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్. వెండితెరపై కృష్ణంరాజు తొలి సినిమా ‘చిలకా గోరింకా’. ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు వచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త దిగాలు పడ్డారు కృష్ణంరాజు. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో కాస్త ప్రతినాయకుడి ఛాయలు ఉండే రోల్లో నటించే అవకాశం వచ్చింది కృష్ణంరాజుకు. దీంతో మరింత కలత చెందిన ఆయన సినీ పరిశ్రమకు వీడ్కోలు చెబుదాం అనుకున్నారట. కానీ పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని, ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వీ ప్రసాద్ హితబోధ చేశారు. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణంరాజు నూతనోత్సాహంతో మళ్లీ యాక్టర్‌గా మేకప్ వేసుకున్నారు. ‘నేనంటే నేనే’లో కృష్ణంరాజు పోషించిన ఆనంద్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నటుడిగా తిరుగులేని సక్సెస్ఫుల్ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు. -
ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు
కృష్ణంరాజు టైటిల్ రోల్లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి అమితమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు.. కానీ కుదర్లేదు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ (2005) సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌లో ‘ఒక్క అడుగు’ అనే పదం ఉంటుంది. దీన్నే టైటిల్‌గా పెట్టి, ఓ మల్టీస్టారర్ సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు కృష్ణంరాజు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగే ‘విశాల నేత్రాలు, జీవన తరంగాలు’ నవలలంటే ఆయనకు ఇష్టం. వీటి ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అదీ నెరవేరలేదు. ఇక ప్రభాస్ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస సినిమాల కమిట్మెంట్స్ కారణంగా వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అలాగే తన ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిల వివాహాల విషయంలోనూ కృష్ణంరాజుకి ఆశ ఉండటం సహజం. మరోవైపు ఎంపీ అయిన కృష్ణంరాజుకు గవర్నర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాలని ఉండేదట. ఓ దశలో కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్ పదవి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. యంగ్ రెబల్ స్టార్‌తో మూడు చిత్రాలు కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి సినిమా ‘బిల్లా’ (2009). ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ‘రెబల్’ (2012) సినిమాలో కలిసి నటించారు కృష్ణంరాజు, ప్రభాస్. ‘రెబల్’ తర్వాత మరోసారి కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ (2022)లో పరమహంస అనే కీ రోల్ చేశారు కృష్ణంరాజు. ఇది ఆయనకు చివరి సినిమా. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు!
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే.. పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్నాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు. చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరు కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: కృష్ణంరాజు ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నా.. -
కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు
ఆరడుగుల ఆజానుబాహుడు.. వెండితెరపై ‘రెబల్ స్టార్’. బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప... సాంఘికం, పౌరాణికం... ఇలా దాదాపు అన్ని జానర్లు టచ్ చేసిన పరిపూర్ణ నటుడు. ‘ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. ‘ఒక కారు కొంటాం.. ఇంకోటి కొంటాం.. కానీ ఆ కారు దిగి కాలు భూమి మీదే పెట్టాలి కదా.. కాళ్లతోనే నడవాలి కదా’.. రెబల్ స్టార్ చెప్పిన జీవిత సత్యం ఇది. అందుకే ఆయన నిరాడంబరమైన మనిషి. ‘ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదు’ అనేది ఆయన సిద్ధాంతం. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. భర్తగా, తండ్రిగా, పెదనాన్నగా.. ఇంటిల్లిపాదినీ బాగా చూసుకున్నారు. పేరుకి తగ్గట్టే రాజులా బతికారు. అందుకే ఆయన పరిపూర్ణమైన మనిషి కూడా... ఆదివారం తెల్లవారుజాము ‘రెబల్ స్టార్ కృష్ణంరాజు’ ఇక లేరని ఓ చేదు వార్తని మోసుకొచ్చింది. 82 ఏళ్ల క్రితం ఓ మంచి మనిషి ఈ భూమ్మీదకు వచ్చాడు. రాజసంగా బతికాడు.. రాజసంగా వెళ్లిపోయాడు. ఒక శకం ముగిసింది.. ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చినవెంకట కృష్టంరాజు. అయితే ఆ పేరు పెద్దగా ఉందని శ్రీ, చినవెంకట పేర్లను తీసేసి, ఉప్పలపాటి కృష్టంరాజు అని పెట్టుకున్నారు. మొగల్తూరులోని బోర్డింగ్, హైస్కూల్లో ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్నారు కృష్ణంరాజు. ఆ తర్వాత నర్సాపూర్ టైలర్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి ప్రవేశం కోసం వెళితే.. ఆ స్టాండర్డ్ సరిపోదని మళ్లీ ఎనిమిదో తరగతిలో చేరాలంటే, అదే స్కూల్లో ఎనిమిది, తొమ్మిది, ఎస్ఎస్ఎల్సి (పది) తరగతులు పూర్తి చేశారు. కాగా టైఫాయిడ్ జ్వరం కారణంగా ఎస్ఎస్ఎల్సి తప్పిన ఆయన రెండోసారి పాసయ్యారు. బీకాం మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేశారు. జర్నలిస్ట్‌గా... ధనిక కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు పాఠశాలకు గుర్రపు బండిలో, కళాశాలకు బీఎస్ఏ మోడల్ మోటార్ బైక్, వోక్సాలిన్ అనే కారులో వెళ్లి వచ్చేవారు. కారులో కళాశాలకు వెళుతుంటే ఆయన్ను యంగ్ లెక్చరర్ అనుకునేవారు. కళాశాలలో జరిగిన ఎన్నికలప్పుడు లెక్చరర్ కాదు స్టూడెంట్ అని అందరికీ తెలిసిందట. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాక కొంతకాలంపాటు ‘ఆంధ్రరత్న’ అనే దినపత్రికలో జర్నలిస్టుగా చేశారు. హైదరాబాద్‌లో రాయల్ స్టూడియో చిన్నప్పటి నుంచి కృష్ణంరాజుకి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. 14 ఏళ్ల వయసు నుంచే మార్కెట్లోకి వచ్చిన ప్రతి కెమెరా కొని ఫొటోగ్రఫీలో ప్రయోగాలు చేశారు. ఆ అనుభవంతో హైదరాబాద్ అబిడ్స్‌లో ‘రాయల్ స్టూడియో’ను ప్రారంభించారు. చూడటానికి హీరోలా ఉన్నావని సీహెచ్‌వీపీ మూర్తిరాజు (బంధువు), స్నేహితులు కృష్ణంరాజుకి చెబితే నవ్వి ఊరుకునేవారట.. అంతేకానీ, సినిమాలు చేయాలనే ఆలోచన ఉండేది కాదట. ‘చిలకా గోరింకా’తో సినిమా ఎంట్రీ ‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్ నుంచి మద్రాస్ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్‌కి తిరిగొచ్చేశారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోని ‘తేనె మనసులు’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లారు. ఆ ఆడిషన్స్‌కి కృష్ణ, జయలలిత, సంధ్యారాణి, హేమమాలిని కూడా హాజరయ్యారు. అయితే కృష్ణంరాజు, జయలలిత, హేమమాలినిలను రిజెక్ట్ చేశారట. ప్రత్యగాత్మ దర్శకత్వంలో చేసిన ‘చిలకా గోరింకా’ (1966) చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు కృష్ణంరాజు. రెబల్ స్టార్‌గా... ఐదున్నర దశాబ్దాల కెరీర్లో ‘బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్ బిన్ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీ సావిత్రి, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, టూ టౌన్ రౌడీ, జీవన తరంగాలు’ ఇలా... దాదాపు 185 సినిమాల్లో నటించారు. ‘తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమరదీపం’ వంటి సినిమాలు కృష్ణంరాజుకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. సాంఘిక, పౌరాణిక సినిమాల్లో చేసిన పాత్రలే ప్రేక్షకుల మనసుల్లో రెబల్‌స్టార్‌గా పేరు తీసుకొచ్చాయి. స్టయిలిష్ విలన్‌గా.. హీరోగా చేస్తున్నప్పుడు ‘నేనంటే నేనే’ (తమిళ ‘నాన్’కి రీమేక్) చిత్రంలో విలన్‌గా చేయమని నిర్మాత డూండీ (అప్పటికి పేరున్న నిర్మాత) అడిగారు. అయితే విలన్‌గా చేయడం ఇష్టంలేక ‘సారీ’ అనేశారు కృష్ణంరాజు. ఆ విషయం తెలిసి,‘ అంత పెద్ద నిర్మాత అడిగితే కాదంటావా? ఈరోజు పెద్ద హీరోలుగా రాణిస్తున్న శివాజీ గణేశన్వంటి వారు ఒకప్పుడు విలన్‌గా చేసినవారే’ అని దర్శకుడు ప్రత్యగాత్మ అన్నారు. ‘అయితే ఒక కండీషన్.. అందులో మనోహర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు.. నేను నా పద్ధతిలో చేస్తా’ అని కృష్ణంరాజు అన్నారు. పెద్ద నిర్మాత అయిన నాకే కండీషనా? అన్నప్పటికీ డూండీ ఒప్పుకున్నారు. చిత్రదర్శకుడు రామచంద్రరావు మాత్రం షూటింగ్ లొకేషన్లో మనోహర్ స్టయిల్లో చేయమన్నారు. అయితే డూండీ మాత్రం కృష్ణంరాజుని తనదైన శైలిలో నటించమన్నారు.. కొత్తగా చేశారు. ఆ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ‘మరో ఆర్. నాగేశ్వరరావు (ప్రముఖ విలన్ నాగేశ్వరరావు అప్పటికి మరణించారు) ఇండస్ట్రీకి వచ్చాడు’ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత విలన్ పాత్రలు వచ్చినప్పటికీ అప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం గళ్ల లుంగీ, చారల బనియన్, క్రూరమైన చూపులు.. కృష్ణంరాజు ఇలా రొటీన్‌గా కనిపించదలచుకోలేదు. స్టైలిష్ విలన్‌గా చేయాలనుకున్నారు. ఆ విధంగా ట్రెండ్ సెట్టింగ్ విలన్ అనిపించుకున్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఓ స్థాయి ఉన్న పాత్రలే చేశారాయన. ‘బావా బావమరిది, జైలర్‌గారి అబ్బాయి, గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌరుషం, నాయుడుగారి కుటుంబం, మా నాన్నకి పెళ్లి’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు చేశారాయన. అవార్డులు.. రివార్డులు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం (1977)’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984) చిత్రాలకు గానూ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు కృష్ణం రాజు. ‘అమరదీపం’, ‘మన ఊరి పాండవులు’ (1978) సినిమాల్లోని నటనకుగానూ రాష్ట్రపతి పురస్కారాలు వరించాయి. 1994లో శరత్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్‌గారి అబ్బాయి’ చిత్రంలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నారాయన. అదే విధంగా 2014లో ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు అందుకున్నారు కృష్ణంరాజు. వీటితోపాటు పలు ప్రైవేట్ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారాయన. కేంద్రమంత్రిగా... 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు కృష్ణంరాజు. ఆ తర్వాత బీజేపీలో చేరి, 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి, కేంద్రమంత్రిగా చేశారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో చేరారు కృష్ణంరాజు. అనంతరం బీజేపీలోనే కొనసాగారు. సినీ పరిశ్రమలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా)కి సేవలందించారు. అలాగే ‘క్రమశిక్షణా సంఘం (మా)’కి అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ కృష్ణంరాజుకి ఆఖరి సినిమా. చిత్రసీమ ఓ మంచి నటుడిని కోల్పోయింది. ఆతిథ్యం ఇచ్చే విషయంలో రారాజు అనిపించుకున్న ఓ మంచి మనిషి దూరం అయ్యారు. కృష్ణంరాజు అంత్యక్రియలు చేవెళ్లలోని మొయినాబాద్‌లో గల కనకమామిడి ఫామ్ హౌస్‌లో ఈరోజు మధ్యాహ్నం అధికారిక లాంఛనాలతో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సీతాదేవితో వివాహం 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తె సీతాదేవిని వివాహమాడారు కృష్ణంరాజు. 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. తీరని ఆశలు కృష్ణంరాజు టైటిల్ రోల్లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి అమితమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు.. కానీ కుదర్లేదు. అలాగే ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ (2005) సినిమాలోని ఓ పవర్ఫుల్ డైలాగ్‌లో ‘ఒక్క అడుగు’ అనే పదం ఉంటుంది. దీన్నే టైటిల్‌గా పెట్టి, ఓ మల్టీస్టారర్ సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు కృష్ణంరాజు. అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగే ‘విశాల నేత్రాలు, జీవన తరంగాలు’ నవలలంటే ఆయనకు ఇష్టం. వీటి ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అదీ నెరవేరలేదు. ఇక ప్రభాస్ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస సినిమాల కమిట్మెంట్స్ కారణంగా వివాహం వాయిదా పడుతూ వస్తోంది. అలాగే తన ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిల వివాççహాల విషయంలోనూ కృష్ణంరాజుకి ఆశ ఉండటం సహజం. మరోవైపు ఎంపీ అయిన కృష్ణంరాజుకు గవర్నర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాలని ఉండేదట. ఓ దశలో కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్ పదవి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. యంగ్ రెబల్ స్టార్‌తో మూడు చిత్రాలు కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి సినిమా ‘బిల్లా’ (2009). ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ‘రెబల్’ (2012) సినిమాలో కలిసి నటించారు కృష్ణంరాజు, ప్రభాస్. ‘రెబల్’ తర్వాత మరోసారి కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ (2022)లో పరమహంస అనే కీ రోల్ చేశారు కృష్ణంరాజు. ఇది ఆయనకు చివరి సినిమా. పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలనుకున్నారు కానీ...! కథానాయకుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో కృష్ణంరాజుది సుదీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్. అయితే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముఖ్యకారణం ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్. వెండితెరపై కృష్ణంరాజు తొలి సినిమా ‘చిలకా గోరింకా’. ఈ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నంది అవార్డు వచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త దిగాలు పడ్డారు కృష్ణంరాజు. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో కాస్త ప్రతినాయకుడి ఛాయలు ఉండే రోల్లో నటించే అవకాశం వచ్చింది కృష్ణంరాజుకు. దీంతో మరింత కలత చెందిన ఆయన సినీ పరిశ్రమకు వీడ్కోలు చెబుదాం అనుకున్నారట. కానీ పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని, ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వీ ప్రసాద్ హితబోధ చేశారు. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణంరాజు నూతనోత్సాహంతో మళ్లీ యాక్టర్‌గా మేకప్ వేసుకున్నారు. ‘నేనంటే నేనే’లో కృష్ణంరాజు పోషించిన ఆనంద్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నటుడిగా తిరుగులేని సక్సెస్ఫుల్ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు. రాజుకి ఆకలి బాధ పుట్టినప్పటినుంచి ఆకలి బాధ తెలియకుండా పెరిగిన కృష్ణంరాజు ఓ సందర్భంలో రెండు రోజులు పస్తులు ఉన్నారు. నటనలో సంతృప్తి పొందేవరకూ ట్రైనింగ్ తీసుకునే సమయంలోవచ్చిన ప్రతి సినిమానీ వదులుకున్నారాయన. అప్పటికి ఇంటి నుంచి కృష్ణంరాజు తండ్రి డబ్బులు పంపించేవారు. అయితే తన దగ్గర డబ్బులయిపోయాయని తండ్రికి ఉత్తరం రాయడానికి బద్ధకించి కృష్ణంరాజు రాయలేదు. దాంతో రెండు రోజులు పస్తులు ఉన్నారు. పోనీ ఎవరినైనా అడుగుదామంటే ఆత్మాభిమానం.. మొహమాటం. ఆ సమయంలో వచ్చిన శివకుమార్ రెడ్డి (పొలిటీషియన్ బెజవాడ గోపాల్‌రెడ్డి బావ) అనే ఫ్రెండ్ నీరసంగా ఉన్న కృష్ణంరాజుని చూసి, విషయం అడిగి తెలుసుకున్నారు. ‘మాకయితే డబ్బులిస్తావు కానీ నీక్కావాలంటే అడగవా’ అంటూ చివాట్లు పెట్టి, బలవంతంగా హోటల్‌కి తీసుకెళ్లి బిర్యానీ తినిపించారు. అయితే కృష్ణంరాజు తండ్రికి ఈ విషయం తెలిసి, బాధపడి అప్పట్నుంచి నెలకు 1200 రూపాయలు పంపించడం మొదలుపెట్టారు. అప్పట్లో 1200 అంటే పెద్ద మొత్తం కింద లెక్క. నటన కోసం పుస్తక పఠనం తొలి చిత్రం ‘చిలకా గోరింకా’ సినిమా కృష్ణంరాజుకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో పాటు ఈ సినిమాలో ఇంకా బాగా యాక్ట్ చేసుంటే బాగుండనే ఫీలింగ్ ఆయనకు కలిగింది. దీంతో నటన గురించి, నటనావిధానాల గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాలనుకున్నారు. ఈ క్రమంలోనే రష్యన్ యాక్టర్ స్టాన్స్ లాస్కీ రచించిన ‘మై లైఫ్ ఇన్ ఆర్ట్’, మరో అంతర్జాతీయస్థాయి దర్శక – నటుడు పుడోకిన్స్ రాసిన వ్యాసాలు, వరల్డ్ లిటరేచర్‌లో వచ్చిన ‘ది ఆర్ట్ ఆఫ్ సినిమా అండ్ యాక్టింగ్’పై వచ్చిన పుస్తకాలను చదివారాయన. కానీ పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదని, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలని తెలుసుకున్నారు కృష్ణంరాజు. ఇందుకోసం అప్పటి సినీ ప్రముఖుడు సీహెచ్ నారాయణరావు దగ్గర కృష్ణంరాజు శిక్షణ తీసుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి లంచ్ అవర్ వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కృష్ణంరాజు నటనలో శిక్షణ తీసుకునేవారు. ఇలా నటనలో తనకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మేకప్ వేసుకోకూడదని నిర్ణయించుకున్నారు కృష్ణంరాజు. ఈ క్రమంలో రంగూన్ రామారావు డైరెక్షన్‌లోని ఓ సినిమా, జోసఫ్ తలియత్ అనే దర్శక– నిర్మాతలు ఇచ్చిన హీరో ఆఫర్స్‌ను రిజెక్ట్ చేశారు కృష్ణంరాజు. దీంతో ఆయన మిత్రులు కృష్ణంరాజుపై కోప్పడ్డారు. కానీ ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ససేమిరా అన్నారు. నటనపై పూర్తి పట్టు సాధించిన తర్వాతే కృష్ణంరాజు తన తర్వాతి సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరణం గురించి కృష్ణంరాజు చెప్పిన విషయం జీవించి ఉన్నప్పుడే చావు గురించిన ఆలోచన అంటే చాలామంది భయపడతారు. కానీ కృష్ణంరాజు భయపడలేదు. పైగా తాను ఎలా చనిపోవాలనుకుంటున్నారో ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదనే భావనతో గుండెల మీద చేతులు వేసుకుని నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నా తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈ రోజూ .. అదే నా కోరిక’’ అని మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. ధ్యానంలో దైవ దర్శనం కృష్ణంరాజుకి శివుడు అంటే ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను. అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొస్తు్తంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ). మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా? సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’ పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు. నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్ వచ్చేవా? మేకప్ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది. నిర్మాతగానూ... కన్నడ చిత్రం ‘శరపంజర’ (1971) ఆధారంగా తెలుగులో వచ్చిన ‘కృష్ణవేణి’ (1974) సినిమాతో నిర్మాతగా మారారు కృష్ణంరాజు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. దాంతో తన తమ్ముడు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు (ప్రభాస్ తండ్రి) నిర్మాతగా గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌ను స్థాపించి, ‘భక్త కన్నప్ప’ సినిమా నిర్మించి, నటించారు కృష్ణంరాజు. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత అమరదీపం, ‘మన ఊరి పాండవులు, ‘సీతారాములు , మధురస్వప్నం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, బిల్లా’ వంటి సినిమాలను నిర్మించారు కృష్ణంరాజు. ‘రాధేశ్యామ్’కు సమర్పకులుగా ఉన్నారు. అలాగే హిందీ చిత్రం ‘ధర్మ్ అధికారి’కి సమర్పకుడిగా ఉన్నారు కృష్ణంరాజు. ఇక ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘ధర్మ్ అధికారి’ని నిర్మించారు. హిందీలోనూ ఈ చిత్రం బాగా ఆడినప్పటికీ కొందరు ఉత్తరాది పంపిణీదారులు మోసం చేయడంతో కొంత నష్టం జరిగిందని ఓ సందర్భంలో కృష్ణంరాజు పేర్కొన్నారు. -
Krishnam Raju: రాజకీయాల్లో పడిలేచిన కెరటం!
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. సినిమాలతో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఆయన రాజకీయాల వైపు ఆకర్షితులు అయ్యారు. 1991లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్‌రాజు చేతిలో ఓటమి చవిచూశారు. కొంతకాలం సినిమాలపైనే దృష్టిపెట్టిన ఆయన 1998లో బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ లోక్‌సభ రద్దయి 1999లో మధ్యంతర ఎన్నికలు జరగడంతో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరు బాపిరాజుపై గెలుపొందారు. రెండోసారి లోక్‌సభలోకి అడుగుపెట్టిన ఆయన కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1999–2000 మధ్య లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కమిటీ సభ్యుడిగా, 2000లో కేంద్ర వాణిజ్య శాఖ సలహాకమిటీ సభ్యుడిగా పనిచేశారు. తొలిసారిగా 2000 సెప్టెంబర్ 30న వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2001 జూలై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, అప్పటి నుంచి 2002 జూన్ 20 వరకు రక్షణశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇదే ఏడాది జూలై 1న వినియోగదారుల వ్యవహరాలు, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. కలిసి రాని సెకండ్ ఇన్నింగ్స్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం నుంచి పోటీచేసిన కృష్ణంరాజు.. కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి హరిరామజోగయ్య చేతిలో ఓటమి చవిచూశారు. తర్వాత ఐదేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2009లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్‌పై రాజమండ్రి నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక.. కొంతకాలం రాజకీయాలకు దూరం పాటించారు. మళ్లీ 2014లో బీజేపీలో చేరి కొంత యాక్టివ్‌గా పనిచేశారు. ఈ సమయంలో కృష్ణంరాజుకు గవర్నర్ పదవి రాబోతున్నదనే ప్రచారం జరిగింది. కానీ ఆరోగ్యం సహకరించలేదు. బీజేపీలోనే కొనసాగినా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమయ్యారు. ఇదీ చదవండి: Krishnam Raju: రారాజు ఇకలేరు -
Krishnam Raju: రారాజు ఇకలేరు
పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో నిరూపించుకున్న పరిపూర్ణ నటుడు. తెరపై చేసిన శక్తిమంతమైన పాత్రలతో ‘రెబల్ స్టార్’ అనిపించుకున్నారు. ఈ వెండితెర ‘భక్త కన్నప్ప’ శివైక్యం పొందారు. అయితే చేసిన సినిమాల ద్వారా, మంచి పనుల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు కృష్ణంరాజు. బీకాం మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేశారు. ఆ తర్వాత ఫొటోగ్రఫీ అంటే ఇష్టంతో హైదరాబాద్‌లో స్టూడియో ఆరంభించారు. అంతకుముందు జర్నలిస్ట్‌గానూ చేశారు. సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేనప్పటికీ వచ్చిన అవకాశం కాదనలేక ‘చిలకా గోరింక’తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా, హీరోగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. ఈ ‘వెండితెర రారాజు’ అనారోగ్యం కారణంగా ఆదివారం తుదిశ్వాస విడిచారు. సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్ రూరల్: కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తెల్లవారుజామున 3.16 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. ఈ వార్త విని కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 27లోని స్వగృహానికి తరలించి సందర్శనార్థం ఉంచారు. నెల రోజులుగా వెంటిలేటర్‌పై.. కృష్ణంరాజు (83) కొంతకాలం నుంచి మధుమేహం, గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గతేడాది రక్తనాళాల్లో అడ్డంకులతో వచ్చే పెరిఫెరల్ వాస్క్యులర్ వ్యాధి కారణంగా కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఏడాదిన్నర కింద కోవిడ్ సోకిన అనంతరం న్యుమోనియా, ఇన్ఫెక్టివ్ బ్రాంకైటిస్, కిడ్నీ సమస్యలు తలెత్తాయి. ఆరోగ్యం మరింతగా దెబ్బతినడంతో ఈ ఏడాది ఆగస్టు 5న ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కృష్ణంరాజు దాదాపు నెల రోజులుగా వెంటిలేటర్ సపోర్టుతోనే ఉన్నారని.. ఆరోగ్యం విషమించి కన్నుమూశారని వైద్యులు తెలిపారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే సినీ నటుడు ప్రభాస్. కృష్ణంరాజు మరణవార్త తెలిసిన వెంటనే ప్రభాస్ కన్నీరుమున్నీరయ్యారు. ఇంటి వద్ద ఏర్పాట్లను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రముఖులు కృష్ణంరాజు భౌతికకాయాన్ని పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సందర్శించి నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, మోహన్‌బాబు, మురళీమోహన్, కోదండ రామిరెడ్డి, సి.కల్యాణ్, మంచు మనోజ్, దిల్‌రాజు, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, వంశీ పైడిపల్లి, కీరవాణి, రాజు సుందరం, విజయ్ దేవరకొండ, నాని, గోపీచంద్, నరేశ్‌తోపాటు మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేత వీహెచ్ తదితరులు నివాళులు అర్పించారు. నేడు కనకమామిడి ఫామ్‌హౌస్‌లో అంత్యక్రియలు రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్నాయి. కృష్ణంరాజు సుమారు నాలుగేళ్ల క్రితం కనకమామిడి 3.25 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అందులో భవన నిర్మాణాన్ని కూడా చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫామ్‌హౌజ్‌లో ఏర్పాట్లతోపాటు అక్కడి వెళ్లే రహదారులను సిద్ధం చేస్తున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరుకానున్నారు. కృష్ణంరాజు మరణం కలచివేసింది బీజేపీ సీనియర్ నేత, సినీ నటుడు కృష్ణంరాజు మరణం కలచివేసింది. రాబోయే తరాలు కృష్ణంరాజు నటనా కౌశలాన్ని, సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలోనూ ముందున్న ఆయన రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నా. ఓం శాంతి.. – ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణంరాజు సేవలు చిరస్మరణీయం కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. – ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవీ చదవండి: కృష్ణంరాజుగారు నాకు పెద్ద బహుమతి రెబల్ స్టార్ కృష్ణం రాజు సినీ జ్ఞాపకాలు ( ఫొటోలు) కృష్ణంరాజు భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి ( ఫొటోలు) -
కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు(83) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్టంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కృష్టంరాజు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన విలక్షణ నటనతో ప్రజల గుండెల్లో నిలిచారు. కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తాము అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కృష్టంరాజు కుటుంబ సభ్యులకు కేటీఆర్.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
'పెద్దదిక్కును కోల్పోయాను'.. కన్నీటిపర్యంతమైన ప్రభాస్
పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళి అర్పంచి ప్రభాస్‌ను పరామర్శించగా తాను పెద్దదిక్కును కోల్పోయానంటూ పెదనాన్నను గుర్తుచేసుకుంటూ ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో మంత్రి తలసాని ప్రభాస్‌ను ఓదార్చారు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పాపులారిటీని దక్కించుకున్నాడు. నటుడిగా ప్రభాస్ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారాయన. ఆర్టిస్టుగా ప్రభాస్‌ని చూసి కొన్ని తాను నేర్చుకునే పరిస్థితి వచ్చిందని గతంలో కృష్ణంరాజు మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రభాస్‌ను ఇలా చూస్తుంటే గుండె తురక్కుపోతుందని, స్టే స్ట్రాంగ్ ప్రభాస్ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొన్నాళ్లుగా అనారోగ్యంగా బాధపడుతున్న కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో తొలుత ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి: పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంత ప్రేమో.. వీడియో వైరల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Never in my wildest dreams, I thought I would see him like this 😭 This feels so personal 💔 Stay strong #Prabhas anna 🥺😭 pic.twitter.com/k1Jgy82947 — SALAAR 🏹 (@bhanurockz45) September 11, 2022 We all are with you Aanaya #Prabhas ❤️ your man should continue our Raju gari leagancy God support whole Family recovery speed Miss u Raju Garu 😍🥹 https://t.co/lunKRQPR4e — Koppolu.jaswanth (@JaswanthKoppolu) September 11, 2022 Pedhha dude ika leru #KrishnamRaju garu 😭 💔 May your soul Rest in Peace sir 😭🙏#OmShanti Stay strong #Prabhas More power to you darling 🙏🙏#RIPKrishnamRaju gaaru 😔 pic.twitter.com/cXUhn2VbxO — NareshVarma REBEL⭐FAN (@NareshVTweet) September 11, 2022 -
పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంత ప్రేమో.. వీడియో వైరల్
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌కు ఎంతో అనుబంధం ఉంది. పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న ప్రభాస్ సినీ కెరీర్లో కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది. నటుడిగా ప్రభాస్ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారాయన. ఈ క్రమంలో కృష్ణంరాజు మృతి ప్రభాస్‌కు తీరని లోటు. పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రేమ, గౌరవం. గతేడాది కృష్ణంరాజు పుట్టినరోజు పార్టీలో ఆయన జుట్టును ప్రభాస్ సరిచేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ వారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభాస్‌కు ఆయన పెదనాన్న అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా.. ఇలా అవుతుందని ఊహించలేదు: చిరంజీవి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణంరాజు మృతి.. పలువురు ఏపీ ప్రముఖల సంతాపం
ప్రముఖ నటుడు రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు గారి మరణం వెండతెరకు తీరని లోటు: మల్లాది విష్ణు కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. తన అద్భుత నటనతో, భిన్నమైన పాత్రలతో తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన నటుడాయన. ఐదున్నర దశాబ్దాల కాలంలో 180కి పైగా చిత్రాలలో నటించి.. ఎన్నో కీర్తి కిరీటాలు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. అధికంగా కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. సినీ రంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా నిలిచారు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మంచితనానికి మారుపేరు: మంత్రి జోగి.రమేష్ మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పార్లమెంటు సభ్యుడుగా కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు గారు నైతిక విలువలకు కట్టుబడిన వ్యక్తి.ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు మృతి బాధాకరం: మాజీ మంత్రి వెలంపల్లి ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. కృష్ణంరాజు నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం అన్నారు. తన అద్భుత నటనతో, భిన్నమైన పాత్రలతో తెలుగు చలన చిత్ర స్థాయిని పెంచిన వ్యక్తి కృష్ణంరాజు అన్నారు. ఐదున్నర దశాబ్దాల కాలంలో 180కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో కీర్తి కిరీటాలు, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారన్నారు. సినీరంగంలో క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఆయనొక ఉదాహరణగా చెప్పుకోవచ్చురు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు.ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అ ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోను రెబల్ స్టార్‌గా వెలిగిన కృష్ణంరాజు మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పశ్చిమగోదావరి జిల్లా: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు ఆయన చిత్ర పటానికి ఘన నివాళులర్పించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి నర్సాపురం, మొగల్తూరు ప్రజలకు తీరని లోటు. మొగల్తూరు ఖ్యాతి ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి కృష్ణంరాజు అని ప్రసాదరాజు కొనియాడారు. ► కృష్ణంరాజు మృతిపట్ల రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ పాతపాటి సర్రాజు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విజయవాడ: హీరో, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతికి మాజీ మంత్రి శ్రీరంగనాథ రాజు సంతాపం తెలిపారు. కృష్ణం రాజు తెలుగు నటుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. -
జూబ్లిహిల్స్‌లోని ఇంటికి చేరుకున్న కృష్ణంరాజు భౌతికకాయం
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వస విడిచారు. ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు. అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణంరాజు భౌతికకాయాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలాదేవీ కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రలు కిషన్‌రెడ్డి, సినీ నటులు మోహన్ బాబు, ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు నివాళులర్పించారు. రేపు మధ్యాహ్నం అభిమానుల కడసారి చూపుకోసం కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియానికి తరలించనున్నారు. అటునుంచి మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలఓనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు తనకు అత్యంత అప్తమిత్రుడని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు. చదవండి: మా ఊరి హీరో కృష్ణంరాజు.. నన్ను పెద్దన్నలా ప్రోత్సహించారు: చిరంజీవి -
మా ఊరి హీరో కృష్ణంరాజు.. నన్ను పెద్దన్నలా ప్రోత్సహించారు: చిరంజీవి
రెబల్‌స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. కృష్ణంరాజు గారు ఇక లేరు అనే వార్త విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి మనవూరి పాండవులు దగ్గరనుంచి నేటి వరకూ నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్ కు నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయనలేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మశాంతించాలని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడిలాంటి ప్రభాస్ కు నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అని ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR — Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022 -
కృష్ణంరాజుతో రెండు చిత్రాలు.. ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం: బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. కృష్ణంరాజు మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజుది చెరగని ముద్ర అన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. చదవండి: కృష్ణంరాజు మృతిపై ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే.. కృష్ణంరాజుతో కలిసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని’’ బాలకృష్ణ అన్నారు. -
కృష్ణంరాజు మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టిహుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ కృష్ణంరాజు భౌతికదేహాన్ని సందర్శించింది. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనుష్క కృష్ణంరాజు మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు మరణం టాలీవుడ్‌కు తీరని లోటని పలు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు మరణవార్త విన్న తర్వాత మాటలు రావడం లేదని సీనియర్ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబం లెజెండ్, పెదనాన్నను కోల్పోయిందని మంచు విష్ణు సైతం ట్వీట్ చేశాడు. Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/hjUs7kyk4d — Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022 Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend. — Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022 -
Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే..
సాక్షి, హైదరాబాద్: రెబల్‌స్టార్ కృష్ణంరాజు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే, ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 'కృష్ణంరాజుకు పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో సెప్టెంబర్ 5న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గతేడాది కాలుకి సర్జరీ జరిగింది. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతింది. కృష్ణంరాజుకి వెంటిలేర్‌పై చికిత్స అందించాం. అయితే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారి తెల్లవారుజామున 3.16కి ఆయన మృతి చెందారు' అని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. చదవండి: (Krishnam Raju: కృష్ణంరాజు మృతి.. ప్రముఖుల సంతాపం) -
తీవ్ర విషాదంలో ప్రభాస్.. పెదనాన్నను చివరిసారిగా అలా
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రెబల్‌స్టార్‌గా ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం అటు టాలీవుడ్‌తో పాటు హీరో ప్రభాస్‌కి కూడా తీరని లోటని చెప్పాలి. నిన్న(శనివారం)తన పెదనాన్నను చూసేందుకు ప్రభాస్ ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. గతంలోనూ అనారోగ్య సమస్యలతో కృష్ణంరాజు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా రెండు మూడు రోజుల అనంతరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నారంతా. కానీ అంతలోనే కృష్ణంరాజు ఇకలేరనే వార్త టాలీవుడ్‌కి షాక్ గురిచేసిందనే చెప్పాలి. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌కు ఎంతో అనుబంధం ఉంది. పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న ప్రభాస్ సినీ కెరీర్లో కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది. నటుడిగా ప్రభాస్ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారు. -
కృష్ణంరాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని సీఎం ట్వీట్ చేశారు. చదవండి: ఆ కోరిక తీరకుండానే మరణించిన కృష్ణంరాజు! కృష్ణం రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు 187 చిత్రాల్లో నటించారు. 1966లో వచ్చిన చిలకా గోరింకా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చివరిసారి రాధేశ్యామ్‌లో నటించారు. ఈ సినిమాలో పరమహంస పాత్రలో నటించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2022 -
కృష్ణంరాజుని రెబల్ స్టార్ అని ఎందుకంటారంటే...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ఆహార్యంతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్‌స్టార్ కృష్ణం రాజు. చిలకా గోరింకా’ చిత్రంతో వెండితెర అరంగ్రేటం చేసిన ఆయన ‘అవేకళ్లు’ చిత్రంలో ప్రతినాయకుడిగానూ నటించి తానేంటో నిరూపించుకున్నారు. ‘తాండ్ర పాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. ఎప్పటికప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాంటి మాస్ చిత్రంలో నటించిన ఆయన భక్తిరస చిత్రం ‘భక్త కన్నప్ప’తో ప్రేక్షకులను తన నటనతో అలరించాడు. ప్రత్యేకంగా కృష్ణంరాజు తన నటనాశైలితో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలో పాత్రలే ఈ పేరుని సంపాదించిపెట్టాయి. తన ఐదున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 183 పైగా చిత్రాలలో నటించారు. ఉత్తమ నటుడిగా ప్రారంభ నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు. జీవన తరంగాలు (1973), కృష్ణవేణి (1974), భక్త కన్నప్ప (1976), అమర దీపం (1977), సతీ సావిత్రి (1978), కటకటాల రుద్రయ్య (1978), మన వూరి పాండవులు (1978) వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు. రంగూన్ రౌడీ (1979), శ్రీ వినాయక విజయము (1979), సీతా రాములు (1980), టాక్సీ డ్రైవర్ (1981), త్రిశూలం (1982), ధర్మాత్ముడు (1983), బొబ్బిలి బ్రహ్మన్న (1984), తాండ్ర పాపరాయుడు (1986), మరణ శాసనం (1987), విశ్వనాథ నాయకుడు (1987), అంతిమ తీర్పు (1988), బావ బావమరిది (1993), పల్నాటి పౌరుషం (1994) సినిమాలు ఆయనకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక, జానపద కథల్లోనూ నటించి తన విశిష్టతను చాటుకున్నారు. కుటుంబ నేపథ్యం కృష్ణంరాజు అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయన భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడు. ప్రభాస్ నట ప్రయాణం తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చే విషయమని కృష్ణంరాజు ఎప్పుడూ చెప్తుండేవారు. చదవండి: Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్ -
Krishnam Raju: కృష్ణంరాజు మృతి.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సంతాపం Saddened by the passing away of Shri UV Krishnam Raju Garu. The coming generations will remember his cinematic brilliance and creativity. He was also at the forefront of community service and made a mark as a political leader. Condolences to his family and admirers. Om Shanti pic.twitter.com/hJyeGVpYA5 — Narendra Modi (@narendramodi) September 11, 2022 కృష్ణంరాజు మృతిపట్ల సీఎం జగన్ సంతాపం ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2022 ఏపీ గవర్నర్ సంతాపం మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు కృష్ణంరాజు ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటు: సీఎం కేసీఆర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి.. కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనా శైలితో, 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంతాపం విజయవాడ: మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు మృతికి ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంతాపం ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు మృతికి చంద్రబాబు సంతాపం ప్రముఖ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలిపారు. టీపీసీసీ రేవంత్‌రెడ్డి సంతాపం ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు మృతికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని.. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్‌బాబు సంతాపం Shocked to learn that Krishnam Raju garu is no more... A very sad day for me and the entire industry. His life, his work and his immense contribution to cinema will always be remembered. My deepest condolences to Prabhas and the entire family during this difficult time 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2022 అనుష్క సంతాపం కృష్ణం రాజు మృతిపట్ల నటి అనుష్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కృష్ణంరాజు మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ►తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. Saddened to learn about the demise of one of the most popular stars of Telugu Cinema, Rebel star Sri Krishnam Raju Garu My wholehearted condolences to Prabhas Garu, his family members & friends Rest in peace #KrishnamRaju Garu 🙏 — KTR (@KTRTRS) September 11, 2022 ► మంచు విష్ణు సంతాపం Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend. — Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022 సుబ్బి రామి రెడ్డి సంతాపం కృష్ణంరాజు మృతి పట్ల మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కృష్ణం రాజు లేడంటే నమ్మలేక పోతున్నాను. దాదాపుగా 50 ఏళ్లుగా సన్నిహితుడు. నా సినిమాల్లో వంశోదరకుడు, గాంగ్ మాస్టర్ చిత్రాల్లో నటించాడు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ప్రభాస్ అంటే ఆయనకు చాలా ప్రేమ. ఏన్నాఆర్, ఎన్టీఆర్ తర్వాత కృష్ణం రాజు మలీ తరం నాయకుడు. ఆయనకు ఆత్మకు శాంతి కలిగి, కుటుంబానికి దైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను’అని రామిరెడ్డి అన్నారు. -
రెబల్ స్టార్ కృష్ణం రాజు సినీ జ్ఞాపకాలు ( ఫొటోలు)
-
Krishnam Raju: రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన రెబల్‌స్టార్
సినీ ఇండస్ట్రీలో రెబల్‌స్టార్‌గా పేరుగాంచిన కృష్ణంరాజు.. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1991లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1998 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచి వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మరోసారి బీజేపీలో చేరారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) ఆదివారం తెల్లవారుజామున ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. చదవండి: (Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత) -
ఆ కోరిక తీరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు!
సాక్షి, హైదరాబాద్: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పారు. ప్రభాస్‌కు జోడీ కోసం వెతుకుతున్నామని, పెళ్లికి సంబంధించిన శుభవార్త త్వరలో చెబుతామని అంటుండేవారు. ప్రభాస్ పెళ్లికంటే సంతోషాన్నిచ్చే అంశం తనకు మరొకటి లేదని చెప్పేవారు. వీలైతే ప్రభాస్ పిల్లలతోనూ కలిసి నటించాలనుందని ఆయన కోరికను కూడా వెల్లడించారు. కానీ చివరకు ఇవేవీ నెరవేరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. దీంతో రెబల్ స్టార్ కుటుంబసభ్యులతో పాటు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ వంటి పలు చిత్రాల్లో నటించారు. ప్రభాస్, కృష్ణంరాజు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తనకు అందరికంటే పెదనాన్న అంటేనే ఎక్కువ భయం, గౌరవం అని ప్రభాస్ పలు సందర్భాల్లో చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కృష్ణంరాజు కూడా ప్రభాస్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును చూసి గర్వపడేవారు. ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని ఊహించాను కానీ, పాన్ ఇండియా స్టార్లా ఎదుగుతాడని అనుకోలేదని ఓ సందర్భంలో కృష్ణంరాజు అన్నారు. చదవండి: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత -
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. 187 చిత్రాల్లో నటించారు. 1966లో వచ్చిన చిలకా గోరింకా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చివరిసారి రాధేశ్యామ్‌లో నటించారు. ఈ సినిమాలో పరమహంస పాత్రలో నటించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం భౌతిక కాయాన్ని కృష్ణంరాజు నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు అభిమానుల సందర్శనార్థం తీసుకొస్తారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మధ్యాహ్నం తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. -
అది మా ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఉంది: సాయి ప్రసీద
సాయిప్రసీద.. డాటర్ ఆఫ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు. సిస్టర్ ఆఫ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తండ్రి, అన్నయ్యల విజిటింగ్ కార్డ్‌తో నిర్మాతగా పరిచయమవుతున్నారు ప్రసీద ఉప్పలపాటి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’కి ప్రసీద ఓ నిర్మాత. కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రసీద చెప్పిన విశేషాలు. ►మీరు నిర్మాతగా లాంచ్ కావడానికి ‘రాధేశ్యామ్’ సరైన ప్రాజెక్ట్ అని ఎందుకు అనిపించింది? అమెరికాలో ప్రొడక్షన్ కోర్స్ చేశాను. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘రాధేశ్యామ్’ రైట్ ప్రాజెక్ట్ అని నాన్న (కృష్ణంరాజు), అన్నయ్య (ప్రభాస్) సపోర్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే పెరిగాను కాబట్టి సినిమాలంటే ఆసక్తి ఉంది. అయితే ఏదైనా వేరే బిజినెస్ చేద్దామని లండన్‌లో మాస్టర్స్ చేశాను. కానీ సినిమాలపై ఇష్టంతో ‘సాహో’కి వర్క్ చేసి, ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి యూఎస్ వెళ్లాను. అక్కడ నా థియరీస్ అన్నీ సినిమాపైనే చేశాను. నిజానికి మా అమ్మగారు (శ్యామల) బిజినెస్వైపే వెళ్లమన్నారు. కానీ బిజినెస్ మొదలుపెట్టి, సినిమాల మీద ఇష్టంతో మళ్లీ వెనక్కి వచ్చి టైమ్ వేస్ట్ ఎందుకని ఇండస్ట్రీవైపే వచ్చేశాను. ►ప్రొడక్షన్ కోర్స్‌లో నేర్చుకున్నదానికి, ‘రాధేశ్యామ్’ని నిర్మించడానికి ఉన్న తేడాలేంటి? పుస్తకంలో చదివినదానికి ప్రాక్టికల్‌గా చేయడానికి తేడా ఉంటుంది. యూఎస్‌లో ప్రొడక్షన్ కోర్స్ చేశాక నెట్‌ఫ్లిక్స్‌కి చెందిన ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి వర్క్ చేశాను. మన వర్కింగ్ స్టైల్‌కి, అక్కడి వర్కింగ్ స్టైల్‌కి చాలా తేడాలు కనిపించాయి. మన దగ్గర సెట్స్‌లో కనిపించే ఫన్ అక్కడ కాస్త తక్కువ. అలానే మేకింగ్వైజ్గా కూడా చాలా తేడా ఉంది. అన్నయ్య ప్రభాస్‌తో... ►కృష్ణంరాజుగారు ఖర్చు బాగా పెట్టి గ్రాండ్‌గా సినిమాలు తీసేవారు. మరి నిర్మాతగా మీరు? ఈ విషయంలో నాన్నలా ఉండకూడదని నేర్చుకున్నాను (నవ్వుతూ). వృథా ఖర్చులు తగ్గించుకోవాలనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాను. అలా అని నిర్మాణ పరంగా ఖర్చు చేయకూడదని కాదు. ఖర్చంతా స్క్రీన్‌పై కనిపించాలి. ఆడియన్స్‌కు విజువల్ ట్రీట్‌లా అనిపించాలి. ‘రాధేశ్యామ్’ దాదాపు 300 కోట్లతో నిర్మించిన సినిమా కాబట్టి కాస్త టెన్షన్‌గా ఉంది. కానీ ఈ సినిమాతో మంచి అనుభవజ్ఞులు అసోసియేట్ కావడంవల్ల మంచి రిజల్ట్ వస్తుందనే నమ్మకం ఉంది. ►గోపీకృష్ణా మూవీస్ బాధ్యతలను మీకు అప్పజెప్పేటప్పుడు కృష్ణంరాజుగారు, ప్రభాస్‌గారు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు? సినిమా ప్రొడక్షన్ మీద నాకు ఆసక్తి ఉందని నాన్నతో అన్నప్పుడు అన్నయ్యతో చెప్పమన్నారు. అన్నయ్యతో చెబితే, ‘నాకెందుకో సినిమాలపై నీకు ఆసక్తి ఉందనిపించింది. అయితే నా అంతట నేను అడిగి, ఓ ఐడియా క్రియేట్ చేయకూడదని అడగలేదు’ అని అన్నయ్య అన్నారు. ‘నాకు తెలిసింది నేర్పిస్తాను. నాన్నగారు కూడా నేర్పిస్తారు. ఆ తర్వాత నువ్వే కష్టపడాలి’ అని కూడా అన్నారు. ఓ దశలో డైరెక్షన్ పట్ల ఆసక్తి కలిగినప్పటికీ ఫైనల్‌గా ప్రొడక్షన్ వైపే రావాలని నిర్ణయించుకున్నాను. ►మేకింగ్ పరంగా ‘రాధేశ్యామ్’ చిత్రంలోని కొత్త విషయాల గురించి ఏం చెబుతారు? ఈ సినిమాకు వర్చువల్ ప్రొడక్షన్ చేశాం. హాలీవుడ్‌లోని అన్రియల్ ఇంజిన్ అనే ఓ కొత్త టెక్నాలజీని తీసుకువచ్చాం. ‘రాధేశ్యామ్’ ఇటలీ బ్యాక్‌డ్రాప్ మూవీ. కోవిడ్ వల్ల కొన్నిసార్లు అక్కడ షూటింగ్ కుదర్లేదు. దీంతో ఈ కొత్త టెక్నాలజీతో ఇటలీనే ఇండియాకు తీసుకువచ్చాం. ►మీ అన్నయ్య పాన్ ఇండియన్ స్టార్ అయ్యాక మీతో స్పెండ్ చేసే టైమ్ తనకు దొరుకుతోందా? ఏమాత్రం వీలున్నా అన్నయ్య ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తారు. ఓ గంట సమయం ఉంది.. రండి అని నన్ను, నా చెల్లెళ్లను పిలుస్తారు. మేం వెళ్లిన తర్వాత చాలా టైమ్ స్పెండ్ చేస్తారు. మిగతావన్నీ పోస్ట్‌పోన్ (నవ్వుతూ..). అలాగే ప్రతి ఏడాది రాఖీ పండక్కి మాకు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. ►మీ అన్నయ్యను యాక్షన్ హీరోగా చూడటం ఇష్టమా? లేక రొమాంటిక్ హీరోగానా? అన్నయ్య చేసిన రొమాంటిక్ ఫిల్మ్ ‘డార్లింగ్’ ఇష్టం. ఓ ఫ్యాన్‌గా అన్నయ్య యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం. ‘సలార్’ కోసం ఎదురు చూస్తున్నాను. ►ప్రభాస్, కృష్ణంరాజుగార్లు కాకుండా ఇండస్ట్రీలోని వేరేవాళ్ల నుంచి ప్రొడక్షన్ పరంగా సలహాలేమైనా తీసుకున్నారా? వైజయంతీ మూవీస్‌లో అన్నయ్య చేస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ డెవలప్‌మెంట్స్‌లో పాల్గొన్నాను. స్వప్న, ప్రియాంక బాగా గైడ్ చేశారు. ►మీ ముగ్గురు సిస్టర్స్‌లో ప్రభాస్‌గారు ఎక్కువగా ఎవర్ని ప్యాంపర్ చేస్తుంటారు? అన్నయ్య, మా రెండో సిస్టర్ ప్రకీర్తి బెస్ట్ ఫ్రెండ్స్. ‘ప్రాజెక్ట్ కె’కి ప్రకీర్తి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా చేస్తోంది. మా చిన్న చెల్లి (ప్రదీప్తి) సైకాలజీ చదువుతోంది. ఈ ఇయర్ లాస్ట్ గ్రాడ్యుయేషన్. చిన్న చెల్లికి సినిమాలపై ఆసక్తి లేదు. నాకు, ప్రకీర్తికి చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. ►నీలిమ గుణ (దర్శకుడు గుణశేఖర్ కుమార్తె), కోడి దివ్య (దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె) వంటి వారు నిర్మాణరంగంలోకి వచ్చారు. ఈ రంగంలో మహిళల సంఖ్య పెరగడంపై మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మహిళలకు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. హన్షిత అక్క (నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె), నీలిమలతో మాట్లాడుతుంటాను. నీలిమవాళ్లు మొన్ననే చాలా ఆర్గనైజ్డ్గా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేశారు. మహిళా నిర్మాతలుగా మేం మాట్లాడుకుంటూనే ఉంటాం. ►నిర్మాతగా మీ తర్వాతి చిత్రం? ఓ న్యూ ఏజ్ మూవీ కోసం కథలు వింటున్నాను. పెద్ద సినిమాలనే కాదు.. చిన్నవి కూడా నిర్మించాలని ఉంది. ►విందు ఇవ్వడంలో కృష్ణంరాజు, ప్రభాస్ ది బెస్ట్ అని ఇండస్ట్రీ టాక్.. మరి మీరు? నేనూ వంద శాతం నాన్న, అన్నయ్యలానే. అది మా ఫ్యామిలీ బ్లడ్‌లోనే ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి మేం అలానే పెరిగాం. డాడీతో మేం షూట్‌కు వెళ్లినా ఫుడ్ ఉంటుంది. ‘బిలా’్ల సినిమా షూటింగ్ మలేసియాలో జరిగినప్పుడు మా అమ్మ యూనిట్ మొత్తానికి పులావ్ వండిపెట్టారు. అలానే నాకూ అలవాటైపోయింది. నేను కూడా యూఎస్ వెళ్లినప్పుడు అక్కడ అందరికీ వండిపెట్టేదాన్ని. మా అన్నయ్యకు వంట రాదు. ►మీ నాన్న, అన్నయ్యలో ఉన్న కామన్ క్వాలిటీస్ ఏంటి? అందరికీ మర్యాద చేయడం, చక్కగా ఫుడ్ పెట్టడం.. ఇలా చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకే రకమైన ప్యాషన్‌తో అన్నయ్య, నాన్న సినిమాలు చేస్తారు. ఇప్పటికీ నాన్నగారు సినిమా పట్ల చాలా ప్యాషన్‌గా ఉంటారు. ‘రాధేశ్యామ్’లో నాన్న, అన్నయ్య మధ్య వచ్చే సీన్లు చాలా బాగుంటాయి. -
పరిమళాల పూబోణి... కృష్ణవేణి
ప్రతి సభలో ‘నా పాటల తండ్రి సినారె’ అంటూ నువ్వు సభికులతో చప్పట్లు కొట్టించుకుంటావు. నిజానికి సినారె నా తండ్రి - అంది సినారె పాట.‘మూడు వేల పాటల్లో నీవెవరు సోదరీ’ అన్నాను. ‘‘ఈ వరుసలేంటి’’అంది. ‘‘మనం ఇద్దరం సినారెని తండ్రి అంటాం. కనుక నాకు నీవు సోదరివే, చెప్పక్కా.’’ నేను శిఖరమస్తకుడు అని సినారెతో పిలిపించుకునే రెబల్‌స్టార్ కృష్ణంరాజు, అభినేత్రి వాణిశ్రీ నటించి రామకృష్ణ - సుశీల ఆలపించిన కృష్ణవేణిని అంది.సంగీతం విజయభాస్కర్. దర్శకుడు అద్భుత దార్శనిక దర్శకుడు వి.మధుసూదన్‌రావు. కథ చెబుతూ పెళ్లయ్యాక కృష్ణానదీ పరివాహక ప్రాంతాలలో ముఖ్యంగా శ్రీ పర్వతం - నాగార్జున సాగర్ నుండి సముద్రంలో సంగమించే హంసలదీవి దాకా పాటను నడిపించాలని చెప్పి తయారించిన బాణిని సినారె ముందుంచారు.సినీరంగంలోకి రాకమునుపే ‘కృష్ణవేణి తరంగిణి పయఃకింకిణులు’ నాగార్జున సాగర కావ్యంలో పలికించిన నా పాటల తండ్రిలోని కవితా పారిజాత హృదయం చిరునవ్వు నవ్వుకుంది తెలుగు మల్లెపూవులా. రావాల్సిన పాటే వచ్చిందే అని... ‘‘నాయిక చూపు నది వైపుగా నాయకుని చూపు తనదిగా (పెళ్లయింది కనుక) మారిన నాయిక వైపుగా ఇలా నాయకానాయిక హృదయాల్లోకి దూకు తండ్రీ’’ అన్నాను. నా తండ్రి సినారెతో - ఇచ్చిన బాణీ దారి చూపుతుంటే పలికాడు సినారె... ఆమె పల్లవిగా ‘‘కృష్ణవేణీ... తెలుగింటి విరబోణీ’ అతడేమనాలో క్షణంలో వెయ్యోవంతు ఆలస్యం లేకుండా ‘‘కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ’’ అంటుండగా - చిన్నారి చిరు పల్లవి వచ్చేసింది. పాట ప్రారంభమయ్యేది శ్రీ పర్వతం నుండి కదా ‘‘శ్రీగిరి లోయల సాగే జాడల విద్యుల్లతలు కోటి వికసింపచేసేవు’’ నిజానికి నాగార్జున సాగరంలో విద్యుత్తు కూడా పుడుతుంది. నాయికతో విద్యుల్లతలు అనిపించాను కనుక నాయకునితో ఏమనిపించాలనుకున్నారు. సినారె కళ్లలో దయ - ఒళ్లంత లయ తొణికిసలాడుతుంది. ఏళ్లుఏళ్లుగా... మనసు వెన్నపూస - మాటలో ప్రాస - తనది. అందుకే పైన విద్యుల్లతకు అనుబంధంగా ‘లావణ్యలతవై నను చేరువేళ శతకోటి చంద్రికలు వెలిగిస్తావనిపించాడు.’’ నాగార్జున గిరి కౌగిట ఆగి - నీళ్లను బంగారు చేలుగా మార్చేవు అనిపించాడు. నాయికది ‘వస్తువుపైన ఆలోచన కనుక బంగారు చేలు అన్నది కాబట్టి నా జీవనదివై ఎదలోన ఒదిగి పచ్చని (జీవితాంతం ఆరిపోని) వలపులు పండించమనిపించాడు. కృష్ణానదితో పాటు - వెళుతుంది సినారె కలం... అమరావతిలో రాళ్లను అందాల రమణులుగా తీర్చిదిద్దేవంటే ఏ శిల్పరమణులకు - ఏ దివ్యలలనులకు నోచని అందాలు దాచిన కృష్ణవేణి - అని/ ఆ తర్వాత చరణంలో... అభిసారిక అంటే ప్రియుని కోసం వెతుక్కుంటూ వెళ్లే నాయిక. ఇక్కడ నది కూడా సముద్రం కోసం వెళుతూ ఉంటుంది కనుక వాణిశ్రీ నోట ‘అభిసారికవై హంసల దీవిలో సాగర హృదయంతో సంగమించావంటే, కృష్ణంరాజుతో కొసమెరుపుగా నా మేని సగమై - నా ప్రాణ సుధవై సుధ అని ఎందుకనాలి సుధ అంటే సలిల సంబంధి అమృతం బతికించేది గనుక నిఖలము నీవై నిలిచిన కృష్ణవేణి అంటూ నదిని, పాటని అంటూ సాగరానికి - ఇటు ప్రేక్షకుల హృదయ సాగరాలకు చేర్చుతాడు సినారే. ఒక్కోపాట రాయడానికి పరిసరాలు - హృదయ పరిమళాలు కూడా తెలిసుండాలని ఆ రెంటిని కలిపే చతురతా ప్రాభవాలు కవి కలిగుండాలని పాట ద్వారా చూపిన నా తండ్రికి ఇటీవలే ‘కేంద్ర సాహిత్య ఫెలో’ అవార్డు వచ్చింది తెలుసా తేజా అంటూ సాయం సంధ్యవేళ నా తండ్రి రవీంద్రభారతికి వచ్చుంటాడు. వస్తా... అంటూ పరిమళాల నెవడాపునంటూ మా ఉప్పల్ నుండి హుస్సేన్ సాగర్ మీదుగా సాగిపోయింది కృష్ణవేణిలోని కృష్ణవేణి పాట. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది!
అది మంచయినా చెడయినా!! ఆయన మనకు నటుడిగా సుపరిచితులు. కామెర్ల వ్యాధికి మందిచ్చే వైద్యుడని కొందరికే తెలుసు. మంత్రిగా ఎందరికో తెలుసు. దేశరక్షణ, దౌత్యవ్యవహారాలను నిర్వహించిన తీరు కొందరికే తెలుసు. ఆ రెబెల్‌స్టార్ కృష్ణంరాజు దైనందిన ప్రణాళిక అప్పట్లో ఎలా ఉండేది? ఇప్పట్లో ఎలా ఉంటోంది? ఆయన మాటల్లోనే... అవిశ్రాంతం అరవై తర్వాత - వాకా మంజులారెడ్డి నా జీవితం ఎప్పుడూ నా చేతిలోనే ఉంది. అయితే నా ఇరవై నాలుగ్గంటల సమయానికి ప్రణాళిక వేసుకోవడం మాత్రం నా చేతిలో ఉండదు. అవసరానికి తగ్గట్టుగా మారిపోతుంటుంది. అలా మార్చుకుంటూ వచ్చాను. సినీ పరిశ్రమలో పనివేళలు ఓ రకంగా ఉంటాయి. రాజకీయరంగంలో పని వేళలు మరో రకంగా ఉంటాయి. మంత్రిగా ఉన్నప్పుడు ఐదింటికి నిద్ర లేచి ఆరు గంటలకంతా తయారయ్యే వాడిని. అప్పటి నుంచి నా కోసం వచ్చిన వారిని కలిసే వాడిని. వారడిగిన సమస్యలను పరిష్కరించడం మనచేతిలో ఉందా లేదా అని సెక్రటరీ ద్వారా సంబంధిత అధికారులను కనుక్కుంటూ వచ్చిన వారిని సమాధాన పరిచేవాడిని. అలా ఒకటిన్నర వరకు సాగేది. భోజనం తర్వాత కొంత విశ్రాంతి, మళ్లీ మధ్యాహ్నం మూడింటి నుంచి నన్ను కలవడానికి వచ్చే వారికి అందుబాటులో ఉండేవాడిని. నటుడిగా సినీరంగంలో ఇందుకు భిన్నంగా గడిపేవాడిని. ఒక సినిమాకు పనిచేస్తున్నప్పుడు షూటింగ్ మొదలు కాకముందే అందులో నా పాత్ర స్వభావాన్ని క్షుణ్ణంగా ఒంటబట్టించు కునేవాడిని. నవల ఆధారంగా తీస్తున్న సినిమా అయితే ముందు ఆ నవలను చదివేవాడిని. రాత్రంతా ‘ఎలా నటిస్తే ఆ పాత్రను పండించగలను’ అని ఆలోచిస్తూ ఉండగానే కోడి కూసేది. అప్పుడు లేచి స్నానం చేసి పడుకుని హాయిగా నిద్ర పోయేవాడిని. పాత్ర గురించి ఒక స్పష్టత వచ్చేవరకు నిద్రావస్థలో ఉండే వాడిని తప్ప అది నిద్ర కాదు. డిస్టర్బ్ కాలేదు! ఇక పాత్ర కోసం మేకప్ వేసుకున్న తర్వాత ‘నేను కృష్ణంరాజుని కాదు’ ఆ పాత్రనే. నా కళ్ల ముందు భార్య, పిల్లలు తిరుగుతున్నా కూడా నేను నా ప్రపంచంలోనే ఉంటాను. అంతటి ఏకాగ్రత ఉండడంతో నేను ఎంత మంది మధ్య ఉన్నా, నా చుట్టూ ఎంత మంది గోల చేస్తున్నా డిస్టర్బ్ అవ్వను. నా జీవితంలో ఎప్పుడూ ‘నన్ను డిస్టర్బ్ చేయకండి’ అనే మాట అనలేదు. ఇన్నేళ్లలో నేను ఎన్ని గంటలు పని చేసినా ఆయాసం, అలుపు, చేయలేనేమోననే ఆందోళన కలగలేదు. అందుకు మెడిటేషనే కారణం. ధ్యానంతో స్వీయ విశ్లేషణ! రోజూ రెండు గంటల సేపు ధ్యానం చేస్తాను. ధ్యానం వల్ల మనిషిలో స్వీయ విశ్లేషణ శక్తి వస్తుంది. దేహానికి స్వీయ స్వస్థత శక్తి కలుగుతుంది. ఎక్కడైనా గాయం అయితే, దాని మీదనే మనసు లగ్నం చేసి ధ్యానంలో మునిగిపోతే ఆ గాయం, నొప్పి మాయమవుతాయి. గ్రంథాల్లో ఉన్న ఈ విషయాన్ని నా మీద నేను ప్రయోగం చేసుకుని మరీ నిర్ధారించున్నాను. ధ్యానం వల్ల నాకు ఎప్పుడూ నెగెటివ్ థాట్స్ రావు. ఆలోచనలెప్పుడూ సానుకూలంగానే సాగుతాయి. మన ఆలోచనలు చెడుగా సాగుతుంటే అలాగే జరుగుతుంది. మంచివైపు సాగితే అదే జరుగుతుందన్నది నేను బలంగా నమ్ముతాను. రష్యన్ నటుడు కాన్స్టాంటిన్ స్టానిస్లావ్స్కీ ‘మై లైఫ్ ఇన్ ఆర్ట్’ లో స్టానిస్లావ్స్కీ ఒక గొప్ప వాక్యం రాశారు. సక్సెస్ బాటలో మంచి ఊపులో ఉన్నప్పుడు మనిషికి ఆత్మవిశ్వాసం పెరిగి అది అహంకారానికి దారి తీస్తుంది. అప్పుడు ‘నేనేం చేసినా, ఏ పాత్రను ఎలా నటించినా ఆడుతుంది’ అనే ధోరణి తలకెక్కించుకుంటే ఘోరంగా విఫలమవుతారని రాశారాయన. అది నాపై ఎంతో ప్రభావం చూపింది. భయం అంటే ఏమిటో..? నాకు భయం అంటే ఎలా ఉంటుందో తెలియదు. భయపడడం అనే స్థితి నా జీవితంలో రాలేదు. నా మొదటి సినిమా ‘చిలకాగోరింక’లో నా నటన బాగుందనుకున్నా. చిత్రం ఆశించినట్లు ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన రెండు అవకాశాలను తిరస్కరిస్తూ ‘నేను నటన నేర్చుకున్న తర్వాత మీకు సినిమాలు చేస్తాను’ అని చెప్పాను. నిజానికి ఆ దశలో ఆ మాట అనగలగడానికి చాలా ధైర్యం ఉండాలి. భవిష్యత్తు గురించి ఏ మాత్రం భయపడినా నా నోటి నుంచి ఆ మాట వచ్చేది కాదు. పుస్తకాలను విపరీతంగా చదవడం, నేను చేయాల్సిన పని గురించి లోతుగా అధ్యయనం చేయడం వల్లనే నేను ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవడం, కష్టసాధ్యమైన పనులు చేయడం సాధ్యమైందన్నది నా నమ్మకమే కాదు, అనుభవం కూడా! ఎందుకంటే నేను విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేసినప్పుడు ఏది చేస్తే పదిమందికీ మంచి జరుగుతుందని నమ్మానో, వాటిని ధైర్యంగా, ఎటువంటి సంకోచం లేకుండా చేయగలిగాను. ఇప్పుడు పార్టీ వ్యవహారాలు చూసుకోవడం, కామెర్లకు మందివ్వడం, నటించడం... ఈ మూడింటిలో సమయం గడిచిపోతోంది. ఏ మాత్రం విరామం వచ్చినా అలా ఖాళీగా ఒక సోఫాలో కూర్చుని ఇంట్లో పిల్లలు, శ్యామల వాళ్ల పనుల్లో హడావుడిగా తిరుగుతూ ఉంటే అలా తృప్తిగా చూస్తూ ఉంటాను. అదే నాకు పెద్ద రిలాక్సేషన్. (నవ్వు) -
భక్త కన్నప్పగా సునీల్
కన్నప్ప కథ తెలుగులో రెండుసార్లు తెరకెక్కింది. రెండింటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. ముచ్చటగా మూడోసారి కన్నప్ప ప్రేక్షకులను పలకరించబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. అయితే... ఈ దఫా కన్నప్పగా కనిపించబోయేది సునీల్. గతంలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, రెబల్‌స్టార్ కృష్ణంరాజు లాంటి లెజెండ్స్ పోషించిన ఈ పాత్రను కామెడీ హీరో సునీల్ పోషించనుండటం విశేషమే. ‘మిథునం’ లాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకందించిన తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకుడని వినికిడి. భరణి స్వతహాగా శివభక్తుడన్న విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి స్థలపురాణమైన ఈ కథను ఆయన ఎలా తెరకెక్కించనున్నారనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఈ కథతో తొలుత వచ్చిన సినిమా ‘శ్రీకాళహస్తీశ్వరమహాత్మ్యం’. హెచ్ఎల్ఎన్ సింహా దర్శకుడు. తర్వాత వచ్చిన సినిమా ‘భక్తకన్నప్ప’. బాపు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకత్వ ప్రతిభ విషయంలో రెండిటికీ రెండే అని చెప్పాలి. మరి వాటి స్థాయిని భరణి అందుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అటు సునీల్‌కి ఇటు భరణికి ఇది ఒక రకంగా సవాలే.