Prabhas Likely To Take Break From Shooting After Krishnam Raju Death - Sakshi
Sakshi News home page

Prabhas: కృ‍ష్ణంరాజు మృతి.. ప్రభాస్‌ కీలక నిర్ణయం

Published Thu, Sep 15 2022 12:34 PM | Last Updated on Thu, Sep 15 2022 2:55 PM

Prabhas Likely To Take Break From Shooting After Krishnam Raju Death - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెదనాన్న, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన తుదిశ్వస విడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల పాటు షూటింగ్స్‌కి బ్రేక్‌ ఇవ్వాలని చూస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలకు కూడా చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్‌ సలార్‌, ప్రాజెక్ట్‌ కె వంటి పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ నెలలోనే సలార్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ కూడా ఉంది. కానీ అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఈనెల మొత్తం షూటింగ్స్‌ క్యాన్సిల్‌ చేయమని ప్రభాస్‌ చెప్పినట్లు సమాచారం. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement