Rebel Star Krishnam Raju Death: Prabhas In Tears Video Viral - Sakshi
Sakshi News home page

Prabhas: 'బరువెక్కిన హృదయంతో..ప్రభాస్‌ను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది'..

Published Sun, Sep 11 2022 3:18 PM | Last Updated on Sun, Sep 11 2022 7:34 PM

Rebel Star Krishnam Raju Death: Prabhas In Tears Video Viral - Sakshi

పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళి అర్పంచి ప్రభాస్‌ను పరామర్శించగా తాను పెద్దదిక్కును కోల్పోయానంటూ పెదనాన్నను గుర్తుచేసుకుంటూ ప్రభాస్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో మంత్రి తలసాని ప్రభాస్‌ను ఓదార్చారు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా హీరోగా పాపులారిటీని దక్కించుకున్నాడు.

నటుడిగా ప్రభాస్‌ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారాయన. ఆర్టిస్టుగా ప్రభాస్‌ని చూసి కొన్ని తాను నేర్చుకునే పరిస్థితి వచ్చిందని గతంలో కృష్ణంరాజు మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రభాస్‌ను ఇలా చూస్తుంటే గుండె తురక్కుపోతుందని, స్టే స్ట్రాంగ్‌ ప్రభాస్‌ అంటూ ఆయన ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

కాగా కొన్నాళ్లుగా అనారోగ్యంగా బాధపడుతున్న కృష్ణంరాజు పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో తొలుత ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో శనివారం అర్థరాత్రి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి: పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంత ప్రేమో.. వీడియో వైరల్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement