రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే..
పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్నాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు. చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు
ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరు కానున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇదీ చదవండి: కృష్ణంరాజు ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నా..
Comments
Please login to add a commentAdd a comment