Old Video Of Prabhas Adjusting Hair To Krishnam Raju Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas: పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంత ప్రేమో.. వీడియో వైరల్‌

Published Sun, Sep 11 2022 1:56 PM | Last Updated on Sun, Sep 11 2022 3:46 PM

Old Video Of Prabhas Adjusting Hair To Krishnam Raju Goes Viral - Sakshi

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌కు ఎంతో అనుబంధం ఉంది.

పాన్‌ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న ప్రభాస్‌ సినీ కెరీర్‌లో  కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది. నటుడిగా ప్రభాస్‌ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారాయన. ఈ క్రమంలో కృష్ణంరాజు మృతి ప్రభాస్‌కు తీరని లోటు. పెదనాన్న కృష్ణంరాజు అంటే ప్రభాస్‌కు ఎంతో ప్రేమ, గౌరవం.

గతేడాది కృష్ణంరాజు పుట్టినరోజు పార్టీలో ఆయన జుట్టును ప్రభాస్‌ సరిచేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఫ్యాన్స్‌ వారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభాస్‌కు ఆయన పెదనాన్న అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  


చదవండి: ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా.. ఇలా అవుతుందని ఊహించలేదు: చిరంజీవి

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement