
సోషల్ మీడియాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృష్ణంరాజుపై చేసిన ఓ వీడియో వైరలవుతోంది. ఇద్దరిని మిక్స్ చేస్తూ ఎడిటింగ్ చేసిన వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఒకవైపు కృష్ణంరాజు నటించిన పాత్రలు, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను మిక్స్ చేసి వీడియో రూపొందించారు.
అందులోని ప్రతి యాక్షన్ సన్నివేశం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 'ఏం ఎడిటింగ్ రా మామా సూపర్బ్' అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ప్రభాస్ సేమ్ మేనరిజం' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ చిత్రం షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇటీవలే అనారోగ్యంతో ప్రభాస్ పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెలిసిందే.
#Prabhas𓃵 anna posted this video in both Fb & insta🥰
— saaho (@saahoupendra548) September 24, 2022
Congrats bro @AyyAyy0 ❤️pic.twitter.com/k8v0fWySdb