ప్రభాస్ సలార్‌ మూవీ.. ఏకంగా 250 రోజులుగా! | Prabhas Salaar Movie Creates Big Record In Ott Goes Viral | Sakshi
Sakshi News home page

Salaar Movie: ప్రభాస్ సలార్‌.. ఓటీటీలో క్రేజీ రికార్డ్!

Published Thu, Oct 24 2024 1:09 PM | Last Updated on Thu, Oct 24 2024 1:22 PM

Prabhas Salaar Movie Creates Big Record In Ott Goes Viral

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'సలార్ సీజ్‌ ఫైర్‌'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.

అయితే ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో దక్షిణాది భాషల్లో అందుబాటులో ఉంది. బాలీవుడ్ హక్కులు మాత్రం మరో ఓటీటీ దక్కించుకుంది. సలార్ హిందీ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా ఈ ‍మూవీ ఓటీటీలో క్రేజీ రికార్డ్ సృష్టించింది. ఏకంగా 250 రోజులుగా హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన సినిమాగా అవతరించింది. ఈ విషయాన్ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఓటీటీ సంస్థ రివీల్ చేసింది. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేసింది. బాలీవుడ్‌ చిత్రాలను కాదని.. ప్రభాస్ చిత్రం రికార్డ్ క్రియేట్ చేయడం చూస్తుంటే నార్త్‌లో కూడా రెబల్ స్టార్‌ ‍క్రేజ్ ఏంటో అర్థమవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement