
అప్పట్లో తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ పృథ్వీరాజ్.. చాన్నాళ్ల పాటు టాలీవుడ్ కి దూరమైపోయారు. మళ్లీ ఏ క్షణాన 'యానిమల్'లో నటించారో గానీ వరసగా తెలుగు మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో తండేల్, సంక్రాంతికి వస్తున్నాం, అర‍్జున్ సన్నాఫ్ వైజయంతి తదితర చిత్రాల్లో నటించారు.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!)
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో పృథ్వీకి మంచి రోల్ పడింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది గానీ పృథ్వీ క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతేడాది తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు.
'గతేడాది రిలీజైన ఉత్సవం సినిమాలో నేను కూడా నటించా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నాకు కాల్ వచ్చింది. వేరే షూటింగ్స్ లో ఉంటే అనుమతి తీసుకుని ఇక్కడికి వచ్చా. తీరా ఈవెంట్ కి వచ్చి దర్శకనిర్మాతలని పలకరిస్తే నన్ను సరిగా పట్టించుకోలేదు. సరేలే బిజీలో ఉన్నారేమో అని స్టేజీ ముందు సీట్ లో కూర్చున్నాను. వేరే వాళ్లొచ్చిన ప్రతిసారి నన్ను పక్కకు జరిపేశారు. అలా ఆ వరసలో చివరకెళ్లిపోయా'
(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ)
'యాక్టర్స్ తో పాటు నా పక్కనే కూర్చున్న సాంగ్ రైటర్, మేకప్ ఆర్టిస్టుని కూడా స్టేజీపై పిలిచారు, నన్ను మాత్రం పట్టించుకోలేదు. ఈవెంట్ చివరలో గ్రూప్ ఫొటో రమ్మని పిలిస్తే స్టేజీపైకి వెళ్లా. అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే ఆయన్ని లాక్కెళ్లిపోయారు. ఫొటో దిగుతుంటే వెనక్కి వెళ్లి నిలబడమన్నారు. యానిమల్ మూవీతో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా. కానీ ఇక్కడేంటి ఎవరూ పట్టించుకోవట్లేదేంటి అనుకున్నా. ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డాను' అని పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
దిలీప్ ప్రకాశ్ అనే కొత్త కుర్రాడిని పరిచయం చేస్తూ తీసిన సినిమా ఉత్సవం. రెజీనా హీరోయిన్. బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, ప్రియదర్శి, నాజర్, ఆమని, పృథ్వీరాజ్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. కానీ మూవీ ఫ్లాప్ అయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి)